గ్రూప్స్, సివిల్స్ వంటి పోటీ పరీక్షల కోసం జనరల్ సైన్స్‌కు ఎలా ప్రిపేర్ కావాలో తెలపండి?
- హెచ్. లహరి, కొత్తపేట
జనరల్ సైన్స్ విభాగంలోని బయాలజీలో వృక్ష, జంతు వైవిధ్యం-వాటి లక్షణాలు; ప్రత్యేకతలపై దృష్టి సారించాలి. అలాగే మానవ శరీర ధర్మశాస్త్రం; వ్యాధులకు అధిక ప్రాధాన్యతనివ్వాలి. గ్రూప్-1లో శరీర అవయవాలు- పని తీరు- వ్యాధులకు సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా అడుగుతున్నారు. ఈ విభాగంలో కరెంట్ అఫైర్స్‌తో మిళితమైన ప్రశ్నలూ కనిపిస్తున్నాయి.
(ఉదా: ఇటీవల కాలంలో ప్రబలుతున్న వ్యాధులు, అమల్లోకి వచ్చిన టీకాలు, మందులు, చికిత్స విధానాలు, నోబెల్ పురస్కారాలు-సంబంధిత పరిశోధనలు వంటివి). ఫిజిక్స్ ప్రశ్నలు అప్లైడ్ ఏరియాస్ నుంచి వస్తున్నాయి. కాబట్టి మెకానిక్స్, ప్రమాణాలు, విద్యుత్, ఆధునిక భౌతిక శాస్త్రం ముఖ్యాంశాలుగా చదవాలి. రసాయన శాస్త్రానికి సంబంధించి సివిల్స్, గ్రూప్స్‌లో క్రమేణా ప్రాధాన్యం పెరుగుతోంది. నిత్య జీవితంలో మానవులు వినియోగించే పలు రసాయనాలు (ఉదా: కాస్మొటిక్స్, ఫార్మాస్యూటికల్స్), ప్లాస్టిక్స్, పాలిమర్స్, కాంపొజిట్స్‌పై సమాచారం తప్పనిసరిగా సేకరించాలి. వీటికి అదనంగా లోహ సంగ్రహణ శాస్త్రం, ఆవర్తన పట్టిక ప్రత్యేకత, మూలకాలపై దృష్టి సారించాలి.
కాంపిటీటివ్ కౌన్సెలింగ్
Published Tue, May 3 2016 1:47 AM | Last Updated on Sun, Sep 3 2017 11:16 PM
Advertisement
Advertisement