Competitive counseling
-
కాంపిటీటివ్ కౌన్సెలింగ్
పోటీ పరీక్షలకు సంబంధించి జాగ్రఫీ అంశాలను ఎలా చదవాలి? – ఎం.విజయ్ కుమార్, హైదరాబాద్. జాగ్రఫీలో పట్టు సాధించాలంటే.. అట్లాస్‌పై పరిపూర్ణ అవగాహన పొందాలి. ఇది అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ భౌగోళిక అంశాల పరంగా బేసిక్ నైపు ణ్యాన్ని అందిస్తుంది. ఆ తర్వాత సిల బస్‌ను పరిశీలిస్తూ అందులోని ప్రాధా న్యత జాబితాను రూపొందించుకోవాలి. దాని ఆధారంగా ప్రిపరేషన్‌ను సాగిం చాలి. డిజాస్టర్ మేనేజ్మెంట్పై ప్రధా నంగా దృష్టి సారించాలి. విపత్తు నిర్వహణ విధానం, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కార్యకలాపాలు, ఇటీవల కాలంలో జాతీయ, అంతర్జాతీయంగా అత్యంత ప్రభావం చూపిన ప్రకృతి విపత్తుల గురించి తెలుసుకోవాలి. జాగ్రఫీలోనే అభ్యర్థులు ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన మరో అంశం.. సహజ వనరులు, అవి నిక్షిప్తమై ఉన్న ప్రాంతాలు, అందుకు కారణాలను అధ్యయనం చేయాలి. అదేవిధంగా కొన్ని పంటలు కొన్ని ప్రాంతాల్లోనే అత్యధికంగా పండుతాయి (ఉదా: ఆంధ్రప్రదేశ్‌లో మొక్కజొన్న ఎక్కువగా పండుతుంది). రాష్ట్రంలోని సహజ వనరులు, వాటి వెలికితీతకు చేపట్టిన చర్యలు గురించి తెలుసుకోవడంతోపాటు ప్రస్తుత పరిస్థితిపై అవగాహన పెంచుకోవాలి. ముఖ్యంగా గ్రూప్–3, గ్రూప్–4 పోస్టులకు పోటీ పడే ఔత్సాహికులు రాష్ట్రంలోని ప్రధాన పంటలు, ప్రాంతాలు, జనాభా, నిష్పత్తి వంటి అంశాలను తప్పనిసరిగా ఔపోసన పట్టాలి. పర్యావరణం, పర్యావరణ కాలుష్యం, కర్బన ఉద్గారాలు, నివారణ చర్యలపైనా పట్టు సాధించాలి. అంతర్జాతీయంగా పర్యావరణ పరిరక్షణ దిశగా పలు దేశాల మధ్య ఒప్పందాలు, ఐక్యరాజ్య సమితి వేదికగా జరిగిన ఒప్పందాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. జాగ్రఫీ, ఎకాలజీలో ప్రశ్న – సమాధానం కోణంలో కాకుండా కొంత వరకు డిస్క్రిప్టివ్ పద్ధతిలో ముందుకు సాగాలి. -
కాంపిటీటివ్ కౌన్సెలింగ్
ఉద్యోగ నియామక పరీక్షల కోసం భారతదేశ చరిత్ర విభాగానికి ఎలా సిద్ధమవ్వాలి? – చంద్రశేఖర్, హైదరాబాద్. భారతదేశ చరిత్రను మూడు భాగాలుగా చదవాలి. అవి.. ప్రాచీన చరిత్ర, మధ్యయుగ చరిత్ర, ఆధునిక చరిత్ర. ఈ మూడు యుగాల్లోని భారతదేశ సంస్కృతిని ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి. ప్రాచీన చరిత్రలో భాగంగా ప్రాచీన శిలాయుగం, మధ్య శిలా యుగం, కొత్త రాతియుగ అంశాలను చదవాలి. ఈ క్రమంలో సింధు నాగరికత, ఆర్య నాగరికతలకు సంబంధించిన విషయాలను క్షుణ్నంగా ప్రిపేర్ కావాలి. క్రీ.పూ.6వ శతా బ్దంలో ప్రచారంలోకి వచ్చిన నూతన మతాలు.. జైనం, బౌద్ధంతోపాటు మహావీరుడు, గౌతమ బౌద్ధుడు–వారి బోధనలు, సామాజిక మార్పులకు అవి ఏ విధంగా కారణమయ్యాయో విశ్లేషించుకోవాలి. మగధ, మౌర్య సామ్రాజ్యాలు, పారశీక, గ్రీకు దండయాత్రలు, సంగం యుగం నాటి సాహిత్యం, ఆంధ్ర శాతవాహన రాజ్యాల గురించి తెలుసుకోవాలి. ముఖ్యంగా ఆనాటి రాజులు, సాహిత్యం, రచయితలు, బిరుదులను వివరంగా అధ్యయనం చేయాలి. కుషాణులు, గుప్తులు, హర్షవర్ధనుడు, పల్లవులు, చోళులు, చాళుక్య రాజులు.. ఆర్థిక, సాంస్కృతిక రంగాలను ఏవిధంగా ప్రభావితం చేశారో తెలుసుకోవాలి. మధ్యయుగ చరిత్రలో సింధు రాజ్యంపై అరబ్బుల దండయాత్ర, ఢిల్లీ సుల్తానులు, మొగల్ పాలన సంబంధిత అంశాలను బాగా చదవాలి. ముఖ్యంగా ఆనాటి సాహిత్యం, శిల్ప కళ, వాస్తు అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాలి. ఆధునిక భారత చరిత్రకు సంబంధించి క్రీ.శ.1498లో వాస్కోడిగామా కాలికట్ (కేరళ)లో అడుగుపెట్టిన తర్వాత భారతదేశంలోకి యూరోపియన్ల రాక మొదలైంది. నాటి నుంచి 1947 వరకు నెలకొన్న పరిస్థితులను చదవాలి. ఈ క్రమంలో బ్రిటిష్ పాలన, సిపాయిల తిరుగుబాటు, కర్ణాటక యుద్ధాలు, ఆంగ్ల–మహారాష్ట్ర యుద్ధాలు, సాంఘిక సంస్కరణోద్యమం సంబంధిత అంశాలపై దృష్టిసారించాలి. -
కాంపిటీటివ్ కౌన్సెలింగ్
పోటీ పరీక్షల కోసం ఎకానమీకి సంబంధించిన అంశాలకు ఎలా సిద్ధమవాలి? - ఆర్.రాజేంద్రప్రసాద్, హైదరాబాద్. ఆయా పోటీ పరీక్షలకు సంబంధించి ఎకానమీ సిలబస్‌లోని అంశాలను అధ్యయనం చేసేటప్పుడు ప్రాథమిక భావనల (కాన్సెప్ట్స్) నుంచి ప్రారంభించాలి. దాంతోపాటు ఎకానమీలో విస్తృతంగా ఉపయోగించే వివిధ పదాలపై అవగాహన పెంపొందించుకోవాలి. ఆర్థికాభివృద్ధి, జాతీయాదాయానికి సంబంధించి స్థూల జాతీయోత్పత్తి, స్థూల దేశీయోత్పత్తి, నికర జాతీయోత్పత్తి, ఉత్పత్తి కారకాల పంపిణీ దృష్ట్యా జాతీయాదాయం, వ్యష్టి-వ్యయార్హ ఆదాయం, తలసరి ఆదాయం వంటి ప్రాథమిక అంశాలు-వాటి నిర్వచనాలు తెలుసుకోవాలి. మానవాభివృద్ధి, జనాభా స్థితిగతులు, వివిధ ప్రభుత్వ విధానాలు, ద్రవ్యోల్బణం, ఆర్థిక సంఘం, కేంద్ర బ్యాంకు విధులు, సుస్థిర వృద్ధి, సమ్మిళిత వృద్ధి, ప్రత్యక్ష-పరోక్ష పన్నులు, కరెంట్ అకౌంట్ లోటు, వాణిజ్య లోటు, ఉపాధి పథకాలు, ప్రణాళికల లక్ష్యాలు, బడ్జెటరీ ప్రక్రియలో వినియోగించే పదాలపై కనీస పరిజ్ఞానం అవసరం. ప్రిపరేషన్లో గమనించాల్సిన మరో అంశం.. ప్రస్తుత భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను సిలబస్‌లోని వివిధ అంశాలతో అన్వయిస్తూ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ద్రవ్యోల్బణం, కరెంట్ అకౌంట్ లోటు, రుపాయి విలువ క్షీణత వంటి అంశాలకు సిలబస్‌ను దృష్టిలో ఉంచుకుని నోట్స్ రూపొందించుకోవాలి. -
కాంపిటీటివ్ కౌన్సెలింగ్
పోటీపరీక్షల్లో జనరల్ ఎస్సే రాసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? - ఆర్.ప్రకాశ్, హైదరాబాద్. సరైన సమాచారాన్ని పొందుపరిచేందుకు, సమకాలీన ఉదాహరణలతో విశ్లేషణాత్మకంగా రాసేందుకు అవకాశమున్న ప్రశ్నలను ఎంపిక చేసుకోవాలి. అప్పుడే మంచి స్కోర్ సాధించేందుకు అవకాశముంటుంది. చాలా ముఖ్య అంశమైతే తప్ప అండర్లైన్ చేయొద్దు. అవసరమైతే పేజీకి ఒక అండర్లైన్ ఉండేలా చూసుకోవాలి. సందర్భానుసారం అవసరమైనంతలో కొటేషన్స్ ఉపయోగించొచ్చు. అంతేగానీ పొంతనలేని కొటేషన్స్ వల్ల లాభం మాట అటుంచి నష్టం ఎక్కువ జరుగుతుంది. ఎస్సేను పేరాగ్రాఫ్‌లుగా విభజించుకొని రాయాలి. ఒక పేరాగ్రాఫ్ ఒకే అంశానికి సంబంధించినదై ఉండాలి. ఒక పేరాకు, తర్వాతి పేరాకు సంబంధం ఉండేలా చూసుకోవాలి.ఎస్సేలో పాయింట్లు ఉండకూడదు.. టేబుల్ వేయకూడదు.. అనేవి అపోహలు మాత్రమే. సందర్భాన్నిబట్టి అవసరమైన చోట సమాచారాన్ని పాయింట్ల రూపంలో రాయొచ్చు. వెన్ డయాగ్రమ్‌ల వంటివీ వేయొచ్చు. రాజ్యాంగ సూత్రాలకు, లౌకిక వాదానికి, దేశ సమగ్రతకు వ్యతిరేకంగా అభిప్రాయాలు ఉండకూడదు. మతం, కుల దూషణలకు పాల్పడకూడదు. వ్యక్తిగత విమర్శలకు తావివ్వకూడదు.ఎస్సే ముగింపు ఆశావహ దృక్పథంతో ఉండేలా చూసుకోవాలి. నిరాశ, నిస్పృహలను ప్రతిబింబించకూడదు. ఇచ్చే పరిష్కారాలు ఆచరణ సాధ్యంగా ఉండాలి. ప్రారంభ ఎత్తుగడకు, ముగింపునకు సంబంధం ఉండేలా చూసుకోవాలి. -
కాంపిటీటివ్ కౌన్సెలింగ్
ఉద్యోగ నియామక పరీక్షలను ఆన్లైన్లో విజయవంతంగా రాయాలంటే సన్నద్ధత ఎలా ఉండాలి? - వి.అనూష, రాజమండ్రి. ఆన్లైన్ పరీక్షలకు హాజరుకాబోయే అభ్యర్థులు తప్పనిసరిగా ఆన్లైన్ మాక్‌టెస్ట్‌లు ప్రాక్టీస్ చేయాలి. తొలుత ఆయా పరీక్షలకు సంబంధించి సబ్జెక్టుల వారీగా పరీక్షలు రాయాలి. మొత్తం సిలబస్ చదవడం పూర్తయ్యాక గ్రాండ్ టెస్ట్‌లు ప్రాక్టీస్ చేయాలి. ఆన్లైన్ మాక్ పరీక్షలకు హాజరు కావడం ద్వారా పరీక్ష విధానానికి అలవాటుపడటంతోపాటు టైం మేనేజ్మెంట్ అలవడుతుంది. ఎంత సమయంలో ఎన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలుగుతున్నారో తెలుస్తుంది. ప్రిపరేషన్ పరంగా బలాలు-బలహీనతలు తెలుస్తాయి. ఆన్లైన్ మాక్ పరీక్ష రాసిన తర్వాత పేపర్, ‘కీ’ని డౌన్లోడ్ చేసుకొని సమీక్షిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఏవైనా సందేహాలుంటే సంబంధిత సబ్జెక్టు నిపుణులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలి. కొన్ని శిక్షణ సంస్థలకు దేశంలో వేర్వేరు ప్రాంతాల్లో బ్రాంచ్లుంటాయి. వీటిలోని అభ్యర్థులందరికీ ఆన్లైన్ మాక్ టెస్ట్‌లను నిర్వహించి ర్యాంకులు ఇస్తున్నాయి. దీనివల్ల అభ్యర్థులు తమ స్థాయిని అంచనా వేసుకొని, తదనుగుణంగా ప్రిపరేషన్ ప్రణాళికను మార్చుకోవచ్చు. వాస్తవ ఆన్లైన్ పరీక్ష రాసేముందు సిస్టమ్‌కు సంబంధించి ఎలాంటి టెక్నికల్ సమస్యలున్నా వెంటనే పరీక్ష కేంద్రం సమన్వయకర్త దృష్టికి తీసుకెళ్లాలి. చాలా ఆన్లైన్ మాక్ టెస్ట్‌లు రాశాం కాబట్టి, మళ్లీ వాస్తవ పరీక్ష సమయంలో నిబంధనలు (ఐట్టటఠఛ్టిజీౌట) చదవనవసరం లేదన్న భావనతో కొందరు నేరుగా పరీక్ష రాయడం ప్రారంభిస్తారు. ఇది సరికాదు. తప్పనిసరిగా ముందు నిబంధనలన్నీ చదవాలి. తొలుత బాగా తెలిసిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు గుర్తించాలి. దీనివల్ల ఆత్మవిశ్వాసం పెరిగి, ఒత్తిడికి తావులేకుండా మిగిలిన ప్రశ్నలకు సమాధానాలు గుర్తించవచ్చు. -
కాంపిటీటివ్ కౌన్సెలింగ్
గ్రూప్స్, పోలీస్ కానిస్టేబుల్స్ తది తర పరీక్షల్లో నదులు, వాటి అనుబంధ అంశాలకు ఎలా par సిద్ధమవ్వాలి?ఙ- ఎస్.ప్రవీణ్ కుమార్, ఖమ్మం. ఉద్యోగ నియామక పరీక్షల కోణంలో చూస్తే ‘భారతదేశం-నదీ వ్యవస్థ’ విభాగం కీలకమైంది. గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే వీటి నుంచి రెండు, మూడు పశ్నలు వస్తున్నట్లు గమనించవచ్చు. తూర్పు, పశ్చిమం, దక్షిణం వైపునకు ప్రవహించే నదులు, వాటి జన్మస్థానాలు, వేర్వేరు ప్రాంతాల్లో వాటి పేర్లు, ఉప నదులు, పరీవాహక ప్రాంతాలు తదితర అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి. వివిధ నదులపై నిర్మించిన ప్రాజెక్టుల గురించి కూడా తెలుసుకోవాలి. అంతర్ భూభాగ నదీ వ్యవస్థపైనా అవగాహన అవసరం. గతంలో జరిగిన ఒక పరీక్షలో జనరల్ స్టడీస్ పేపర్లో ఏ నదిని దక్షిణ గంగ అని పిలుస్తారు? అనే ప్రశ్న వచ్చింది. దీనికి సరైన సమాధానం ‘గోదావరి’. భారతదేశంలో పొడవైన నది గంగా. దక్షిణ భారతదేశంలో పొడవైన నది గోదావరి. ఒక నది గురించి చదువుతున్నప్పుడు ఇలాంటి అంశాలన్నింటినీ సమన్వయం చేసుకుంటూ అధ్యయనం చేయాలి. అప్పుడు ఏ అంశం నుంచి ఎలాంటి ప్రశ్న వచ్చినా కచ్చితమైన సమాధానం గుర్తించవచ్చు. కొన్నిసార్లు ఇలాంటి సులభతరమైన ప్రశ్నలే అడిగినా.. పెరుగుతున్న పోటీ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వీటిపై ఇంకాస్త కఠినమైన ప్రశ్నలూ ఇవ్వొచ్చు. అందువల్ల నదులు, వాటి పొడవు, అవి ప్రవహించే రాష్ట్రాలు, వాటిపై ఉన్న ప్రాజెక్టులు తదితర అంశాలను పట్టిక రూపంలో రూపొందించుకుని రివిజన్ చేయాలి. ఇలా చేయడం వల్ల చదివిన విషయాలు మరచిపోవడానికి అవకాశం ఉండదు. దీంతోపాటు వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలను సాధన చేయాలి. అప్పుడే సబ్జెక్టుపై పట్టు లభిస్తుంది. -
కాంపిటీటివ్ కౌన్సెలింగ్
సివిల్స్ మెయిన్స్ జనరల్ స్టడీస్ పేపర్లలోని ప్రశ్నలకు సమాధానాలు రాసేటప్పుడు ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏమిటి? - ఎన్.మధులత, హైదరాబాద్. పదాల పరిమితిపై ఆందోళన చెందకుండా, నాణ్యతకు ప్రాధాన్యమిస్తూ బాగా రాస్తే మంచి స్కోర్ సాధించవచ్చు. ప్రశ్నను బట్టి సమాధానాన్ని పాయింట్ల రూపంలో రాయాలా? లేదంటే విశ్లేషణాత్మకత విధానంలోనూ రాయాలా? అనేది నిర్ణయించుకోవాలి. కొన్ని ప్రశ్నలకు పాయింట్ల రూపంలో సమాధానం రాయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. మరికొన్నింటికి రెండు విధానాలనూ జోడిస్తూ రాసినప్పుడే మంచి మార్కులు సాధించొచ్చు. l Comment, Elaborate, Illustrate, Analyse, Be Critica.. తదితర పదాలు ప్రశ్నల్లో కనిపిస్తాయి. ఓ ప్రశ్నను రూపొందించే వ్యక్తి మీ నుంచి దేన్ని ఆశిస్తున్నాడనేది ఈ పదాల ద్వారా అర్థం చేసుకోవచ్చు. దానికి తగినట్లు సమాధానం రాయాలి. వ్యాఖ్యానించమన్నారా.. విశ్లేషించమన్నారా? లేదంటే విమర్శనాత్మకంగా విశ్లేషించమన్నారా? ఇలా సమాధానాన్ని ఏ కోణంలో రాయాలన్నది గుర్తించాలి. మరో ముఖ్య విషయం కచ్చితమైన సమాధానమంటే కేవలం ఫ్యాక్ట్స్‌ను మాత్రమే రాయడం కాదు. విశ్లేషణాత్మకంగా సమాధానం రాయడం ప్రధానం. ఫ్యాక్ట్స్ అనేవి ఓ అంశంపై అభ్యర్థి శ్రద్ధను మాత్రమే తెలియజేస్తాయి. కారణం ఏదైనా సరే ఒక పేపర్‌ను సరిగా రాయలేదని అనిపిస్తే అతిగా ఆలోచించకుండా అంతటితో దాన్ని మరిచిపోయాలి. లేదంటే దీని ప్రభావం మరో పేపర్‌పై పడుతుంది. -
కాంపిటీటివ్ కౌన్సెలింగ్
పోటీపరీక్షల కోణంలో కెమిస్ట్రీకి సంబంధించి జీవాణువులు, పాలిమర్లు, ఔషధాలు తదితర అంశాలను ఎలా అధ్యయనం చేయాలి? - జి.ప్రసాద్, హైదరాబాద్. జీవ వ్యవస్థ నిర్మాణం, పని చేయడంలో వివిధ పదార్థాలు పాల్గొంటాయి. వాటిలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, లిపిడ్లు, హార్మోన్లు, విటమిన్లు ముఖ్యమైనవి. వీటిపై ప్రత్యేక దృష్టిసారించాలి. అవసరమైతే జీవశాస్త్రంతో అన్వయం చేసుకుంటూ ప్రిపేర్ కావడం ప్రయోజనకరం. రబ్బర్, సెల్యూలోజ్ ఉత్పన్నాలు, పీవీసీ, టెఫ్లాన్, బేకలైట్ వంటి పాలిమర్ల అనువర్తనాలను వివరంగా చదవాలి. యాంటీపెరైటిక్స్, అనాల్జెసిక్లు, యాంటీబయాటిక్స్, సెడెటివ్స్, యాంటాసిడ్స్ వంటి సాధారణ ఔషధాలపై అవగాహన పెంపొందించుకోవాలి. టీ, సిగరెట్, గంజాయి, శీతలపానీయాల్లో ఉండే పదార్థాలను కూడా తెలుసుకోవాలి. మన ఉదరంలో బలమైన హైడ్రోక్లోరికామ్లం ఉంటుంది. తినే సోడా, తమలపాకుపై పూసే సున్నపు తేట క్షార ధర్మం కలిగి ఉంటుంది. వెనిగర్, నిమ్మ ఉప్పు అన్నీ ఆమ్లాలే. ఆమ్లాలు-క్షారాలు కలిసి తటస్థీకరణం జరిగితే ఏర్పడేది లవణం. వివిధ ఆమ్లాలు, క్షారాలు, లవణాలపై సమాచారాన్ని సేకరించాలి. ముఖ్యంగా నిత్య జీవితంలో ఆయా అంశాలు ఎలాంటి ప్రభావాన్ని చూపుతున్నాయి అనే అంశాలను తెలుసుకోవాలి. -
కాంపిటీటివ్ కౌన్సెలింగ్
ఆవరణ శాస్త్రంలో అభ్యర్థులు ప్రాథమిక భావనలపై దృష్టిసారించాలి. ముఖ్యంగా జాతి (species),జాతి ఉత్పత్తి (speciation),ఆవరణ వ్యవస్థ (ecosystems), వాటి రకాలు, ఆహార శృంఖలాలు, బయో జియో కెమికల్ సైకిల్స్, ఆహార వల (food chain)ఎకోటోన్, జీవుల అనుకూలతలపై అవగాహన పెంచుకోవాలి. జీవశాస్త్రంలోని జంతువృక్ష విజ్ఞానాన్ని ఆవరణ శాస్త్రానికి అన్వయించుకొని చదవడం ద్వారా జీవుల అనుకూలతలపై పట్టు లభిస్తుంది. జీవ వైవిధ్యం జీవ వైవిధ్యం(Biodiversity).. మరో ముఖ్యమైన అంశం. జీవ వైవిధ్య రకాలు, జీవ వైవిధ్యానికి ఏర్పడుతున్న ప్రమాదాలు, జీవవైవిధ్య పరిరక్షణ పద్ధతులపై సమాచారం అవసరం. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విభిన్న జీవ జాతులు ఎదుర్కొంటున్న ప్రమాదాలపై అవగాహన పెంపొందించుకోవాలి. ఐయూసీఎన్ (ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్) ప్రకటించిన అంతరించే ప్రమాదమున్న జీవజాతుల జాబితాను (Red list)క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. ఉదా: బట్టమేక పక్షి(Great Indian Bustard).అతి త్వరలో అంతరించే జాతిగా దీన్ని గుర్తించారు. దీని శాస్త్రీయ నామం, ఆవాసాలు, భారత్‌లో జనాభా, వచ్చే ప్రమాదాలు, కార్యక్రమాలు, దీనికి సంబంధించిన ఇతర జాతులపై సమాచారం సేకరించాలి. దీని ద్వారా ఈ పక్షిపై వచ్చే ప్రశ్నలకు సమాధానాన్ని సులభంగా గుర్తించవచ్చు. బట్టమేక పక్షి - Great Indian Bustard శాస్త్రీయ నామం - ఆర్డయోటిస్ నైగ్రిసెప్స్ (Ardeotis nigriceps) దేశంలో రాజస్థాన్‌లో అధికంగా కనిపిస్తాయి. ప్రధాన ప్రమాదాలు - రోడ్ల నిర్మాణం, సౌర, జల విద్యుత్ ప్రాజెక్టులు, అడవుల నరికివేత దీనికి సంబంధించిన జాతులు: Lesser florican; Bengal florican; Houbara bustard (ఇది వలస జాతి) ఈ విధంగా ఆసియా సింహం, బెంగాల్ పులి, ఒంటి కొమ్ము ఖడ్గమృగం, ఎర్ర చందనం, నక్షత్ర తాబేలు, మానిస్/పంగోలియన్ అనే పిపీలికాహారి తదితర ముఖ్య జంతువులపై అవగాహన అవసరం. -
కాంపిటీటివ్ కౌన్సెలింగ్
ఏపీపీఎస్సీ ఇటీవల విడుదల చేసిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) నోటిఫికేషన్‌కు సంబంధించి రాతపరీక్షలో సివిల్, మెకానికల్ కామన్ పేపర్‌కు ఎలా సిద్ధమవ్వాలి? రిఫరెన్స్ పుస్తకాలు తెలియజేయండి? - ఎన్.హైమావతి, ఖమ్మం. పేపర్-2లోStrength of Material, Fluid Mechanics and Machinery సబ్జెక్టులు ఉన్నాయి. సివిల్, మెకానికల్ కామన్ పేపర్‌ను బట్టి పటిష్ట ప్రణాళిక ప్రకారం సిద్ధమైతే వీలైనన్ని ఎక్కువ మార్కులు సాధించొచ్చు. వీటిలో స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ నుంచి 75 మార్కులకు, ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ మెషినరీ నుంచి 75 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్‌లో కొత్తగా ఇంజనీరింగ్ మెకానిక్స్, స్ట్రక్చరల్ అనాలిసిస్, థియరీ ఆఫ్ ఫెయిల్యూర్, థిక్ సిలిండర్ తదితర అంశాలను చేర్చారు. ఇంజనీరింగ్ మెకానిక్స్‌లో ఫోర్స్, మూమెంట్స్ ఫ్రిక్షన్, ఈక్విలిబ్రియంలకు సంబంధించిన అంశాలను ముందుగా చదవాలి. దీనివల్ల స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్లోని ఇతర అంశాలను తేలిగ్గా చదివి, అర్థం చేసుకోవచ్చు. ఫ్లూయిడ్ మెకానిక్స్‌పై పట్టు సాధిస్తే పేపర్-3లోనూ మంచి స్కోర్ సాధించవచ్చు. అందువల్ల దీనికి ఎక్కువ సమయం కేటాయించాలి. రిఫరెన్స్ పుస్తకాలు: 1. Strength of materials by S.Ramamrutham 2. Fluid mechanics and hydraulic machine by R.K.Bansal పేపర్-3లో సివిల్ వారికి దాదాపు పది సబ్జెక్టులు, మెకానికల్ వారికి 13 సబ్జెక్టులు ఉంటాయి. ప్రతి సబ్జెక్టు నుంచి 12-15 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. రిఫరెన్స్ పుస్తకాలు: సివిల్ ఇంజనీరింగ్: R.S.Kurmi; Gupta and Gupta; R.Agor; Dr. P.Jayaram Reddy మెకానికల్ ఇంజనీరింగ్: R.K.Jain, R.K.Rajput, R.S.Kurmi, Handa and Handa పి.శ్రీనివాసులురెడ్డి సీఎండీ, వాణి ఇన్స్టిట్యూట్ గ్రూప్స్ పరీక్షల్లో బయాలజీకి సంబంధించి ఏ పుస్తకాలు చదవాలి? - ఎస్. రాధిక, నెల్లూరు గ్రూప్-1, 2 తదితర సర్వీసులకు సంబంధించిన సిలబస్‌ను ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ వెబ్‌సైట్స్‌లో అందుబాటులో ఉంచారు. దీనిలో భాగంగా జనరల్ స్టడీస్‌లో జనరల్ సైన్స, ఎన్విరాన్మెంటల్ సైన్స రెండు అంశాలుగా ఉంటుందని గమనించాలి. బయాలజీ విభాగం కోసం ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ (బోటనీ, జువాలజీ) వరకు పాఠ్యపుస్తకాలను క్షుణ్నంగా చదవాలి. మొక్కలు, జంతువులు, వాటి వర్గీకరణ, విస్తరణ, సాధారణ, ప్రత్యేక లక్షణాలు తదితర అంశాలపై ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు విటమిన్స, హార్మోన్స, మూలకాలు, పోషణ లాంటి అంశాలపై విస్తృత అవగాహన ఉండాలి. టెక్నాలజీకి సంబంధించి జీవశాస్త్ర విభాగంలో ముఖ్యంగా మొక్కల్లో, జంతువుల్లో సాంకేతిక పరిజ్ఞానం ఏవిధంగా ఉంది? అది మానవ సంక్షేమానికి ఏవిధంగా ఉపయోగపడుతుంది అనే అంశాలు ముఖ్యమైనవి. జెనిటిక్ ఇంజనీరింగ్, డీఎన్ఏ టెక్నాలజీ, టిష్యూకల్చర్, సూపర్ ఒవ్యులేషన్, సంకరణం, టెస్టుట్యూబ్ బేబీ, క్లోనింగ్, సరోగసి తదితర ఆధునిక పద్ధతుల గురించి క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. -
కాంపిటీటివ్ కౌన్సెలింగ్
గ్రూప్-1 మెయిన్స్‌కు సంబంధించి పాలిటీలోని గవర్నెన్స్ అంశాలను ఎలా చదవాలి? రిఫరెన్స పుస్తకాలను సూచించండి? - జి. నాగ శిరీష, నూజివీడు పరిపాలన, సుపరిపాలన, ఇ-గవర్నెన్స్, రాష్ట్ర, జిల్లా స్థాయి పాలన, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ డెవలప్మెంట్ కార్పొరేషన్స్, పేదరిక నిర్మూలన కార్యక్రమాలు, స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయక సంఘాలు (ఎస్‌హెచ్‌జీలు), చారిటీలు, కార్పొరేట్ సామాజిక బాధ్యత, పాలనలో నైతిక విలువలు, కేంద్ర నిఘా సంఘం, కేంద్ర దర్యాప్తు సంస్థ, లోక్‌పాల్, లోకాయుక్త, ఏసీబీ, వినియోగదారుల రక్షణ వ్యవస్థలు; సమాచార హక్కు చట్టం- 2005 వినియోగం, ప్రభావం, పాలనా సంస్కరణలు తదితర అంశాలను అభ్యర్థులు అధ్యయనం చేయాలి. ఆయా అంశాలపై అడిగిన ప్రశ్నలకు విశ్లేషణాత్మక అనువర్తనతో తన అభిప్రాయాన్ని రాయాలి. ప్రభుత్వం, పరిపాలన అనేవి అంతర్గత సంబంధాన్ని కలిగి ఉంటాయి. ప్రభుత్వం అంటే ఒక నిర్మాణం. దానిలో వివిధ అంచెలుంటాయి. పాలన అంటే ప్రభుత్వ పనితీరు, నిర్వహణ. ప్రభుత్వం రాశి పరమైంది, పాలన వాసి (క్వాలిటేటివ్)తో కూడుకున్నది. ఆధునిక ప్రభుత్వాలు ప్రజలకు గరిష్ట సేవలు అందించడానికి అనేక సంస్కరణలు ప్రవేశపెట్టాయి. అందులో భాగంగా వచ్చినవే సుపరిపాలన, ఇ-పరిపాలన. గతంలో ప్రభుత్వం అంటే కేవలం ఒక సంప్రదాయమైన శాసనాలు, వాటి అమలుకు పరిమితమై ఉండేది. కానీ, ప్రజలు నేడు ప్రభుత్వం కంటే పాలన కోరుకుంటున్నారు. అయితే ప్రజలకు, ముఖ్యంగా అట్టడుగు వర్గాల వారికి గరిష్ట, సత్వర ప్రామాణిక సేవలను కేవలం ప్రభుత్వ సంస్థలు మాత్రమే అందించలేవు. వాటికి తోడు పౌర సమాజ భాగస్వామ్యం, కార్పొరేట్ సంస్థల సహకారం, సామాజిక బాధ్యత కూడా అవసరం. కాబట్టి సుపరిపాలనకు అవసరమయ్యే అంశాల స్వభావాన్ని, ఆవశ్యకతను అభ్యర్థులు సమగ్రంగా అధ్యయనం చేయాలి. పాలనలో నైతిక విలువల ఆవశ్యకత ఎంతైనా ఉంది. పాలనలో రాజకీయ జోక్యం.. ప్రభుత్వ అధికారులపై, ప్రజలకు అందించే సేవలపై ప్రభావం చూపుతుంది. అవినీతిని, ఆశ్రీత పక్షపాతాన్ని అరికట్టాలంటే ప్రజలకు వారిని ప్రశ్నించే అవకాశం ఇవ్వాలి. అందులో భాగంగా వచ్చినవే ఈ-పౌర, సిటిజెన్ చార్టర్స్, పారదర్శకత, జవాబుదారీతనం. ఈ నేపథ్యంలో పౌర సమాజం, ప్రజావేగుల పాత్ర, ఆవశ్యకత, నిఘా సంస్థలైన లోక్‌పాల్, లోకాయుక్త, సమాచార హక్కు చట్టం, రెండో పరిపాలన సంస్కరణల కమిషన్ నివేదికలను జాగ్రత్తగా చదివి వాటి ప్రాముఖ్యతను విశ్లేషించుకోవాలి. సులభంగా, శీఘ్రగతిన సేవలు అందించేందుకు సమాచార, సాంకేతిక రంగంలో వచ్చిన మార్పులను ముఖ్యంగా ఇంటర్నెట్, వెబ్సైట్ ఆధారిత సేవలు, ఇ-సేవ, మీ-సేవలు, ప్రభుత్వ శాఖల సమాచారాన్ని డిజిటలైజ్ చేయడం ద్వారా ఒనగూరే ప్రయోజనాలను, పరిమితులను చదవాలి. రిఫరెన్స్ బుక్స్: తెలుగు అకాడమీ ప్రచురించిన డిగ్రీ ద్వితీయ సంవత్సరంలోని ‘భారతదేశ పాలన’ పాఠ్యపుస్తకం. యోజన తదితర పత్రికల్లో ప్రచురితమైన వ్యాసాలు. -
కాంపిటీటివ్ కౌన్సెలింగ్
బ్యాంకు పరీక్షలు రాసే చాలా మంది అభ్యర్థు లకు బ్యాంకింగ్ అవేర్నెస్ టాపిక్ కొత్తదే. రోజూ బ్యాంకుల్లో జరిగే లావాదేవీలకు సంబంధించిన ప్రాథమిక పరిజ్ఞానంపై పట్టు సాధిస్తే ప్రశ్నలకు జవాబులు గుర్తించవచ్చు. బ్యాంకులో అకౌంట్‌ను ఎలా ఓపెన్ చేయాలి? క్యాష్ డిపాజిట్‌కు ఏ స్లిప్‌ను ఉపయోగి స్తారు? అకౌంట్లో మినిమమ్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి? అకౌంట్ ఓపెన్ చేయడానికి కనీస వయసు ఎంత? బ్యాంకులో సాధారణంగా ఎన్ని రకాల అకౌంట్లు ఉంటాయి? తదితర ప్రశ్నలకు సమాధానాలు తెలిసి ఉండాలి. వీటితోపాటు బ్యాంకులతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉండే వివిధ సంస్థల (రెగ్యులేటరీ బాడీస్) గురించి తెలుసుకోవాలి. ఆయా సంస్థల వెబ్సైట్లను పరిశీలించడం, బ్యాంకింగ్ సర్వీస్ క్రానికల్ లాంటి మేగజైన్లను క్రమంతప్పకుండా చదవడం ద్వారా ఈ వివరాలను సేకరించవచ్చు. ఆర్బీఐ, సెబీ, ఐఆర్డీఏ సంస్థలు, వాటి నిబంధనల గురించి చదవాలి. నేను ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్‌ని. బ్యాంక్ పరీక్షలకు సన్నద్ధమవుతు న్నాను. బ్యాంకింగ్ ఎవేర్నెస్ నుంచి ఎలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది? - ఎం.సందీప్, రాంనగర్ మీ సలహాలు, సందేహాలు పంపాల్సిన ఈ-మెయిల్: sakshieducation@gmail.com -
కాంపిటీటివ్ కౌన్సెలింగ్
సివిల్స్ ప్రిలిమ్స్‌లో జాగ్రఫీలో ఎక్కువ మార్కులు సాధించడం ఎలా? - ఎన్. ప్రియబాంధవి, అనంతపురం సివిల్స్ ప్రిలిమ్స్‌లో జాగ్రఫీ, ఎన్విరాన్మెంటల్ ఎకాలజీ నుంచి 24 నుంచి 30 ప్రశ్నల వరకు వస్తున్నాయి. జాగ్రఫీ, ఎకాలజీలకు ప్రాధాన్యం ఇస్తున్నారు కాబట్టి అభ్యర్థులు ప్రిపరేషన్ ప్రణాళికలో వీటికి అధిక సమయం కేటాయించాలి. సిలబస్‌లో ‘భారతదేశం, ప్రపంచ భౌతిక, సామాజిక, ఆర్థిక, భూగోళ శాస్త్రం’ అని పేర్కొన్నారు. అభ్యర్థులు భారత భౌగోళిక అంశాలపై ఎక్కువ దృష్టి సారించాలి. మనదేశానికి సంబంధించి వ్యవసాయం, వ్యవసాయ సంక్షోభం, రుతువులు, నదులు, అడవులు - అటవీ భూముల ఆక్రమణ, అంతరిస్తున్న జీవ జాతులు, శక్తి వనరులు తదితరాలపై అవగాహన పెంపొందించుకోవాలి. రవాణా, పట్టణీకరణ ప్రక్రియ, సరిహద్దుల వివాదాలు వంటివీ ముఖ్యమే. కోర్ ఎకాలజీ నుంచి ప్రధానంగా రెండు అంశాల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. అవి.. ఎకాలజీ బేసిక్ కాన్సెప్టులు. -
కాంపిటీటివ్ కౌన్సెలింగ్
గ్రూప్స్, సివిల్స్ వంటి పోటీ పరీక్షల కోసం జనరల్ సైన్స్‌కు ఎలా ప్రిపేర్ కావాలో తెలపండి? - హెచ్. లహరి, కొత్తపేట జనరల్ సైన్స్ విభాగంలోని బయాలజీలో వృక్ష, జంతు వైవిధ్యం-వాటి లక్షణాలు; ప్రత్యేకతలపై దృష్టి సారించాలి. అలాగే మానవ శరీర ధర్మశాస్త్రం; వ్యాధులకు అధిక ప్రాధాన్యతనివ్వాలి. గ్రూప్-1లో శరీర అవయవాలు- పని తీరు- వ్యాధులకు సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా అడుగుతున్నారు. ఈ విభాగంలో కరెంట్ అఫైర్స్‌తో మిళితమైన ప్రశ్నలూ కనిపిస్తున్నాయి. (ఉదా: ఇటీవల కాలంలో ప్రబలుతున్న వ్యాధులు, అమల్లోకి వచ్చిన టీకాలు, మందులు, చికిత్స విధానాలు, నోబెల్ పురస్కారాలు-సంబంధిత పరిశోధనలు వంటివి). ఫిజిక్స్ ప్రశ్నలు అప్లైడ్ ఏరియాస్ నుంచి వస్తున్నాయి. కాబట్టి మెకానిక్స్, ప్రమాణాలు, విద్యుత్, ఆధునిక భౌతిక శాస్త్రం ముఖ్యాంశాలుగా చదవాలి. రసాయన శాస్త్రానికి సంబంధించి సివిల్స్, గ్రూప్స్‌లో క్రమేణా ప్రాధాన్యం పెరుగుతోంది. నిత్య జీవితంలో మానవులు వినియోగించే పలు రసాయనాలు (ఉదా: కాస్మొటిక్స్, ఫార్మాస్యూటికల్స్), ప్లాస్టిక్స్, పాలిమర్స్, కాంపొజిట్స్‌పై సమాచారం తప్పనిసరిగా సేకరించాలి. వీటికి అదనంగా లోహ సంగ్రహణ శాస్త్రం, ఆవర్తన పట్టిక ప్రత్యేకత, మూలకాలపై దృష్టి సారించాలి. -
కాంపిటీటివ్ కౌన్సెలింగ్
సివిల్స్ మెయిన్స్ జనరల్ స్టడీస్ పేపర్-3లో సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎలా సిద్ధమవ్వాలి? - టి.కృష్ణప్రియ, కరీంనగర్. సివిల్స్ మెయిన్స్ జనరల్ స్టడీస్ పేపర్-3లో ఆర్థికాభివృద్ధి, టెక్నాలజీ, జీవవైవిధ్యం, పర్యావరణం, భద్రత, విపత్తు నిర్వహణ అనే అంశాలున్నాయి. వీటి నుంచి దాదాపు 25 ప్రశ్నల వరకు అడుగుతున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, బయోడైవర్సిటీ, సెక్యూరిటీ, మేధో సంపత్తి హక్కులు, డిజాస్టర్ మేనేజ్మెంట్లో ప్రశ్నలన్నీ దాదాపు సమకాలీన అంశాలపైనే ఉంటున్నాయి. ముఖ్యంగా సోషల్ నెట్వర్కింగ్ సైట్లు.. వీటి ద్వారా భద్రత ఏవిధంగా ప్రభావితమవుతుంది? తీసుకోవాల్సిన చర్యలు వంటివాటిపై గత పరీక్షల్లో ప్రశ్నలు ఇచ్చారు. సైబర్ సెక్యూరిటీలో భాగంగా.. సైబర్ వార్ఫేర్ అనేది ఉగ్రవాదం కంటే ఏవిధంగా తీవ్రమైంది? భారత్ ఏవిధంగా దాని ప్రభావానికి గురవుతోంది? భారత్‌లో ఈ అంశానికి చెందిన సంసిద్ధత ఎలా ఉంది? వంటివాటిపై కూడా ప్రశ్నలు వస్తున్నాయి. ఇలా అన్ని ప్రశ్నలు దాదాపుగా సమకాలీన అంశాలతో ముడిపడి ఉన్నాయి. ప్రశ్నలన్నీ సమకాలీన సమస్యలపై అప్లికేషన్ ఓరియంటెడ్ విధానంలో ఉంటున్నాయి. అభ్యర్థి సమగ్ర ఆలోచనా విధానాన్ని, వ్యక్తిత్వాన్ని అంచనా వేసేలా ప్రశ్నల కూర్పు ఉంటోంది. కాబట్టి ఒక అంశానికి సంబంధించిన ప్రాథమిక భావనలతోపాటు దానితో ముడిపడి ఉన్న వర్తమాన అంశాలన్నింటిపై అవగాహన పెంచుకోవాలి. దీనికోసం విస్తృతంగా అధ్యయనం చేయాలి. దినపత్రికల్లో వచ్చే విశ్లేషకుల ఆర్టికల్స్‌ను తప్పనిసరిగా చదవాలి. -
కాంపిటీటివ్ కౌన్సెలింగ్
సివిల్స్ ప్రిలిమ్స్‌లో పాలిటీకి ఎలా సిద్ధమవ్వాలి? - సంధ్య, సామర్లకోట ప్రిలిమ్స్‌లో పాలిటీలోని ప్రతి అంశం సమకాలీన సంఘటనలతో ముడిపడి ఉంటుంది. భారత రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ, పరిపాలన, పంచాయతీరాజ్ వ్యవస్థ వంటివి సిలబస్‌లో ఉన్నాయి. వీటిని సమకాలీన అంశాలకు అన్వయించుకుని చదవాలి. ప్రశ్నలు కూడా వీటిపైనే ఉంటాయి. అందువల్ల సమకాలీన అంశాలను అధ్యయనం చేయాలి. వీటితోపాటు రాజ్యాంగ చరిత్ర, బ్రిటిషర్ల సంస్కరణలు, చార్టర్, కౌన్సిల్ చట్టాలను అధ్యయనం చేయాలి. రిఫరెన్స్ బుక్స్ ఎన్సీఈఆర్టీ 10, 11, 12 తరగతుల సివిక్స్ టెక్ట్స్‌బుక్స్ ఇంట్రడక్షన్ టు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా - డి.డి. బసు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా - పి.ఎం.భక్షి, గత ప్రశ్నపత్రాలు. -
కాంపిటీటివ్ కౌన్సెలింగ్
పోటీ పరీక్షల దృష్ట్యా ‘పంచవర్ష ప్రణాళికలు’ పాఠ్యాంశాన్ని ఎలా చదవాలి? - జి.రవీందర్, హైదరాబాద్. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ‘భారతదేశ ప్రణాళికలు’ అధ్యయనం చాలా కీలకమైంది. ప్రతి పరీక్షలోనూ ఈ విభాగం నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. ముందుగా ప్రణాళికలు - వాటి కాల వ్యవధి తెలుసుకోవాలి. ప్రతి ప్రణాళికకు ఒక ప్రాధాన్యత ప్రకటిస్తారు. ప్రాధాన్యత, ఆ ప్రణాళికలో పొందుపర్చిన వివిధ అంశాలను అధ్యయనం చేయాలి. ఉదా: మొదటి ప్రణాళికలో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత, రెండో ప్రణాళికలో పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు. అదేవిధంగా 2వ ప్రణాళికలో మూడు భారీ ఇనుము-ఉక్కు కర్మాగారాలు నిర్మించారు. వాటిని ఏ రాష్ట్రాల్లో ఏర్పాటు చేశారు? ఏ దేశ ఆర్థిక సహాయం పొందారు? అనే అంశాలపై దృష్టి సారించాలి. దేశ ఆర్ధిక పరిస్థితులు మారుతున్న తరుణంలో వాటికి అనుగుణంగా ప్రణాళిక లక్ష్యాలు, వృద్ధిరేట్లను మారుస్తున్నారు. వాటిని తెలుసుకుంటుండాలి. ప్రారంభంలో ప్రణాళికలు కేంద్రీకృత ధోరణులుగా ఉండేవి. ప్రస్తుతం వాటి స్వరూపం వికేంద్రీకరణ, సూచనాత్మక ప్రణాళికల వైపు మారింది. ఇలాంటి పదాలు - వాటి అర్థాలు, వాటి వెనుక ఉన్న వ్యూహాలు అధ్యయనం చేయాలి. వివిధ ప్రణాళికల రూపకల్పనలో తీసుకున్న వృద్ధి వ్యూహాలను అవగాహన చేసుకోవాలి. ఉదా: మొదటి ప్రణాళిక ‘హారాడ్-డోమార్ మోడల్, రెండో ప్రణాళిక.. పీసీ మహలనోబిస్ మోడల్. దేశంలో పేదరిక రేఖకు దిగువన ఉన్న ప్రజల శ్రేయస్సు కోసం ప్రభుత్వం అనేక పథకాలను రూపొందిస్తుంది. వివిధ ప్రణాళికల వారీగా పథకాలు, వాటి ముఖ్య లక్ష్యాలను జాగ్రత్తగా పరిశీలించాలి. -
కెరీర్ మేనేజ్మెంట్ అంటే తెలుసా?!
భవిష్యత్తును మనసుకు నచ్చినట్లుగా తీర్చిదిద్దుకోవడం ఒక కళ. ఇది నిరంతర ప్రక్రియ. ఒక రంగాన్ని కెరీర్‌గా ఎంచుకొని, అందులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే అలుపెరుగక శ్రమించాలి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పట్టిన పట్టు విడవకుండా ధైర్యంగా ముందుకు దూసుకుపోయే సామర్థ్యం ఉండాలి. కెరీర్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకోవడం నేటి యువతకు చాలా అవసరం. కెరీర్‌ను ఎప్పుడు ఎలా తీర్చిదిద్దుకోవాలో కచ్చితంగా తెలిస్తే లాంగ్‌టర్మ్ సక్సెస్ సాధ్యమవుతుంది. కెరీర్ మేనేజ్మెంట్ ఒక రకంగా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లాంటిదే. క్రమశిక్షణతో ఒక్కో రూపాయిని పొదుపు చేస్తూ పోతే కొన్నేళ్లకు పెద్దమొత్తంలో ధనం చేతికందుతుంది. ఒక్కో ఇటుకను జాగ్రత్తగా పేరుస్తూ కెరీర్ అనే సుందర భవనాన్ని నిర్మించుకోవాలి. భవిష్యత్తు నిర్మాణ ప్రణాళికను రూపొందించుకొని అమల్లో పెట్టాలి. జీవితకాల ప్రక్రియ: కెరీర్ మేనేజ్మెంట్ అనేది అనుకోగానే ఒక్కరోజులో పూర్తయ్యేది కాదు. ఇది జీవితకాల ప్రక్రియ అనే వాస్తవాన్ని గుర్తించాలి. జీవిత ప్రయాణంలో ఇదొక భాగం. కాబట్టి ఏదైనా సమస్య తలెత్తితే ఈ మేనేజ్మెంట్కు మధ్యలోనే మంగళం పాడొద్దు. కారును రెగ్యులర్‌గా మెయింటనెన్స్ చేస్తేనే సాఫీగా ప్రయాణం సాగిస్తుంది. లేకపోతే తుప్పుపట్టి పోతుంది. కెరీర్ కూడా ఇంతే. క్రియాశీల ప్రక్రియ: కెరీర్ మేనేజ్మెంట్ క్రియాశీల ప్రక్రియ. మీరు బద్ధకంగా ఇంట్లో కూర్చొని, మీ పనిని ఇంకెవరో పూర్తి చేయాలని చూడకండి. దీనివల్ల వారు కెరీర్లో పైకి ఎదుగుతారు, మీరు నష్టపోతారు. కనుక క్రియాశీలకంగా వ్యవహరించండి. మీ పనులను సకాలంలో పూర్తిచేయండి. బాధ్యతలను నెరవేర్చే విషయంలో ఎప్పుడూ వెనుకడుగు వేయొద్దు. నిర్మాణాత్మక ప్రక్రియ: కెరీర్‌ను జాగ్రత్తగా నిర్మించుకుంటే దాన్నుంచి ప్రయోజనం పొందొచ్చు. లేకపోతే మిగిలేది శూన్యమే. కొందరు అత్యవసరమైన పరిస్థితి వచ్చేదాకా కెరీర్‌ను నిర్మించుకోవడంపై దృష్టి పెట్టరు. మీ విషయంలో ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకోండి. కెరీర్ మేనేజ్మెంట్ నిర్మాణాత్మకంగా ఉండాలి. దీనివల్ల ఈ ప్రక్రియ అన్ని అవాంతరాలను ఛేదిస్తూ ఒడిదుడుకులు లేకుండా స్థిరంగా ముందుకు సాగుతుంది. లక్ష్యాలను నిర్దేశించుకోవాలి: జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నారో స్పష్టంగా నిర్దేశించుకోవాలి. భవిష్యత్తు నిర్మాణంలో ఇది చాలా కీలకం. అంతిమ లక్ష్యాన్ని చిన్నచిన్న లక్ష్యాలుగా విభజించుకోవాలి. వరుస క్రమంలో ఒక్కొక్కటి సాధిస్తూ గమ్యస్థానం చేరుకోవాలి. ఒక్కో లక్ష్యాన్ని సాధించడానికి గడువును నిర్ణయించుకోవాలి. ఆ లోగా పని పూర్తిచేయాలి. ఎదుగుదలపై సమీక్ష: జీవితంలో ఎదుగుదల ఏ స్థాయిలో ఉందో, మీరు ఏ దశలో ఉన్నారో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఉండాలి. ప్రగతి ఆశించినట్లుగా లేకపోతే మరింత శ్రమించాలి. కెరీర్ మేనేజ్మెంట్లో రెగ్యులర్ చెకింగ్ చాలా ముఖ్యం. తాజా అవసరాల రీత్యా కెరీర్ గోల్స్‌ను మార్చుకోవడం లేదా వాటి స్థాయిని పెంచడం వంటివి చేస్తుండాలి. కెరీర్ మేనేజ్మెంట్ ప్రారంభంలో కష్టంగానే ఉన్నా ముందుకు సాగుతున్న కొద్దీ సులభతరంగా మారుతుంది. కెరీర్లో లక్ష్యాలతోపాటు ఇంటిని కొనుగోలు చేయడం, విదేశీ ప్రయాణం వంటి వ్యక్తిగత లక్ష్యాల సాధనకు కూడా ఇలాంటి మేనేజ్మెంట్ అవసరమే. కాంపిటీటివ్ కౌన్సెలింగ్ డీఎస్సీ-పరీక్ష దృష్ట్యా ‘విజ్ఞానశాస్త్ర స్వభావం’ అధ్యాయం ప్రాధాన్యతను తెలపండి? - ఎం.రాజేశ్వరి, రాంనగర్ విజ్ఞాన శాస్త్ర బోధనా పద్ధతులు (ఫిజికల్ సైన్స మెథడాలజీ)లో ‘విజ్ఞానశాస్త్ర స్వభావం’ అనే అధ్యాయం ముఖ్యమైంది. గత ప్రశ్న పత్రాలను పరిశీలిస్తే ఈ అధ్యాయం నుంచి సుమారు 3 ప్రశ్నలు ఇస్తున్నట్లు గమనించ వచ్చు. కాబట్టి అభ్యర్థులు విజ్ఞాన శాస్త్ర నిర్వచనాలు, ద్రవ్యాత్మక నిర్మాణంలోని అంశాలు (యథార్థం, సాధారణీకరణం, భావన, సూత్రం, ప్రాకల్పన మొదలైనవి) ప్రాకల్పనలు- రకాలు- ఉదాహరణలు, విజ్ఞాన శాస్త్ర బోధనా విలువ అనే అంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. ద్రవ్యాత్మక నిర్మాణంలోని అంశాలను, విజ్ఞాన శాస్త్ర బోధనా విలువలను ఉదాహరణలతో అన్వ యించుకుంటూ చదవాలి. బోధనా విలువల ఉపయోగాలపై అవగాహన పెంచుకోవాలి. ఇన్పుట్స్: ఎ.వి.సుధాకర్, సీనియర్ ఫ్యాకల్టీ కానిస్టేబుల్ పరీక్షలో ‘భారతదేశ నైసర్గిక స్వరూపం’ పాఠ్యాంశం నుంచి ఎలాంటి ప్రశ్నలు వస్తాయి? - ఉమేశ్ యాదవ్, బర్కత్‌పుర భారతదేశ భూగోళ శాస్త్రంలో ‘నైసర్గిక స్వరూపాలు’ విభాగానికి అత్యంత ప్రాముఖ్యం ఉంది. దీనిలోని హిమాలయాలు, గంగా - సింధు మైదానాలకు సంబంధించి ప్రతి పరీక్షలో కనీసం 1, 2 ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి దీనిలోని ప్రధాన అంశాలైన హిమాలయాల పొడవు, వాటిలోని సమాంతర శ్రేణు లు, ఆ శ్రేణుల్లో ఎత్తయిన శిఖరాలు, కనుమలు, లోయలు, మైదానాలు, దానిలోని భూ స్వరూపాలు మొదలైన అంశాలను అధ్యయ నం చేయాలి. గతంలో వచ్చిన ప్రశ్నల సరళిని పరిశీలిస్తూ మాదిరి ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి. దీంతో మంచి మార్కులు సాధించవచ్చు. ఇన్పుట్స్: ముల్కల రమేష్, సీనియర్ ఫ్యాకల్టీ ఎడ్యూ న్యూస్: క్యాట్-2014తో ఎఫ్ఎంఎస్లో ప్రవేశాలు ప్రతిష్టాత్మక బీస్కూల్స్‌లో ఒకటైన.. ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ (ఎఫ్ఎంఎస్), ఢిల్లీ యూనివర్సిటీ.. వచ్చే ఏడాది ప్రారంభం కానున్న ఫుల్‌టైం ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్) -2014 స్కోర్‌ను పరిగణనలోకి తీసుకోనుంది. దీంతోపాటు గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, పని అనుభవం, అకడమిక్ రికార్డ్ ఆధారంగా ప్రవేశాలు కల్పించనుంది. ఎఫ్ఎంఎస్లో రెండేళ్ల ఎంబీఏ కోర్సులో మొత్తం 216 సీట్లు అందుబాటులో ఉన్నాయి. త్వరలో ప్రవేశాల ప్రకటనను విడుదల చేస్తారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. క్యాట్ కాకుండా మరే ఇతర ప్రవేశపరీక్షను యూనివర్సిటీ నిర్వహించదు. ఈ ఏడాది కోర్సు పూర్తిచేసుకున్న విద్యార్థులకు 100 శాతం ప్లేస్‌మెంట్స్ కల్పించింది. ఐఐఎం- ఇండోర్ నిర్వహించే క్యాట్-2014 నవంబర్ 16, 22వ తేదీల్లో జరుగుతుంది. ఈ నెల 30 వరకు క్యాట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. క్యాట్ ఫలితాలను డిసెంబర్ మూడోవారంలో విడుదల చేస్తారు. వెబ్సైట్: http://fms.edu/ గేట్-2015 దరఖాస్తు గడువు పొడిగింపు దేశవ్యాప్తంగా వివిధ ఐఐటీలు, ఎన్ఐటీలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఐఐఐటీలు, ఇతర యూనివర్సిటీల్లో ఎంటెక్, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష.. గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్)-2015. ముందుగా ప్రకటించిన షెడ్యూల్లో ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ అక్టోబర్ 1 కాగా అక్టోబర్ 14 వరకు గడువును పొడిగించారు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియలో భాగంగా నిర్దేశిత సర్టిఫికెట్లను, ఫొటోను అప్లోడ్ చేయాలి. ఫీజును కూడా నెట్ బ్యాంకింగ్/డెబిట్‌కార్డ్/క్రెడిట్ కార్డ్ విధానాల్లో చెల్లించాలి. ప్రింటవుట్ దరఖాస్తును పంపాల్సిన అవసరం లేదు. గేట్-2015ను ఐఐటీ-కాన్పూర్ నిర్వహించనుంది. జనవరి 31, ఫిబ్రవరి 1, 7, 8, 14 తేదీల్లో పరీక్షలు ఉంటాయి. వచ్చే ఏడాది మార్చి 12న గేట్ ఫలితాలు వెలువడే అవకాశముంది. వివిధ ప్రభుత్వ రంగ కంపెనీలు ఎంట్రీ లెవల్ ఉద్యోగాల భర్తీకి గేట్ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నాయి. వెబ్సైట్: http://gate.iitk.ac.in/ జాబ్స్, అడ్మిషన్స అలర్ట్స సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ రాంచీలోని సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. జూనియర్ ఓవర్‌మెన్: 94 అర్హతలు: డీజీఎంఎస్ జారీచేసిన ఓవర్‌మెన్ సర్టిఫికెట్, గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికెట్, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ ఉండాలి. మైనింగ్ సిర్దార్: 238 అర్హతలు: డీజీఎంఎస్ జారీ చేసిన మైనింగ్ సిర్దార్ సర్టిఫికెట్, గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికెట్, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ ఉండాలి. డిప్యూటీ సర్వేయర్: 15 అర్హతలు: పదో తరగతితో పాటు డీజీఎంఎస్ జారీ చేసిన మైన్స్ సర్వే సర్టిఫికెట్ ఉండాలి. నోటిఫికేషన్లో నిర్దేశించిన వయోపరిమితి ఉండాలి. ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 16 వెబ్సైట్: http://ccl.gov.in సీడాక్ హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీడాక్) వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. ప్రాజెక్ట్ మేనేజర్: 1 ప్రాజెక్ట్ సర్వీస్ సపోర్ట్: 2 ప్రాజెక్ట్ అసోసియేట్/ప్రాజెక్ట్ అసిస్టెంట్: 4 ప్రాజెక్ట్ ఇంజనీర్ (మల్టీమీడియా): 1 అర్హతలు: సంబంధిత విభాగంలో డిగ్రీ/ డిప్లొమా ఉండాలి. నిర్దేశిత వయోపరిమితి ఉండాలి. దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 1 వెబ్సైట్: http://cdac.in/ ఐఐఎం - బెంగళూరు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) పీజీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులను కోరుతోంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ పబ్లిక్ పాలసీ అండ్ మేనేజ్మెంట్ కాలపరిమితి: ఏడాది అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు ఐదేళ్ల అనుభవం ఉండాలి. క్యాట్/ జీఆర్ఈ/ జీమ్యాట్‌లో అర్హత అవసరం. రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: ఫిబ్రవరి 2, 2015 వెబ్సైట్: http://www.iimb.ernet.in -
పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్షలో ఏ అంశాలు ?
కాంపిటీటివ్ కౌన్సెలింగ్: పోలీస్ కానిస్టేబుల్ నియామకాలకు నిర్వ హించే రాత పరీక్షలో ఏయే అంశాలుంటాయి? వాటికి ఎలా సిద్ధంకావాలి? - జి.నారాయణ, కూకట్పల్లి. పోలీస్ కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబరులో నోటిఫికేషన్ విడుదల చేసే అవ కాశాలున్నాయి. దీనికోసం కసరత్తు జరుగు తోంది. నియామక ప్రక్రియలో రెండో దశలో రాత పరీక్ష ఉంటుంది. శారీరక సామర్థ్య పరీక్షలో నిర్దేశించిన అర్హత సాధించినవారిని మాత్రమే దీనికి ఎంపిక చేస్తారు. పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో 200 మార్కులకు ఉంటుంది. రాత పరీక్షలో ప్రధానంగా ఏడు విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. అవి.. 1) భారతదేశ చరిత్ర - సంస్కృతి - జాతీయోద్యమం 2) కరెంట్ అఫైర్స్ 3) ఇండియన్ జాగ్రఫీ - పాలిటీ - ఎకానమీ 4) జనరల్ సైన్స్ 5) అర్థమెటిక్ 6) రీజనింగ్/ మెంటల్ ఎబిలిటీ 7) జనరల్ ఇంగ్లిష్. భారతదేశ చరిత్ర - సంస్కృతి - జాతీయోద్యమం: భారతదేశ చరిత్రకు సంబంధించి ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక చరిత్ర ఉంటాయి. ఈ క్రమంలో హరప్పా నాగరికత నుంచి వేద యుగం, మౌర్యులు, శాతవాహనులు, కాకతీయులు, గుప్తుల కాలం నాటి సాం ఘిక, రాజకీయ, ఆర్థిక, మత పరిస్థితులపై అవగాహన పెంపొందించుకోవాలి. అరబ్బులు, మొ గల్ సామ్రాజ్యం, సిపాయిల తిరుగుబాటు, ఆం గ్లేయుల పాలన, భారత జాతీయోద్యమం లాం టి అంశాలపై ప్రధానంగా దృష్టి సారించాలి. కరెంట్ అఫైర్స్: జాతీయ, అంతర్జాతీయంగా ప్రాధాన్యం ఉన్న సంఘటనలపై దృష్టి సారించాలి. వీటితో పాటు వార్తల్లో వ్యక్తులు, సదస్సులు, ఒప్పందాలు, కమిటీలు - అధ్యక్షులు, ఎన్నికలు, ఐక్యరాజ్యసమితి, క్రీడలు, ముఖ్య తేదీలు, శాస్త్ర పరిశోధనలు, జనాభా లెక్కలు లాంటి అంశాలను కూడా చదవాలి. జనరల్ నాలెడ్జ్ (ప్రపంచంలో ఎత్తైవి, పొడవైనవి, ప్రథమ వ్యక్తులు తదితరాలు) ప్రిపేర్ కావాలి. ఇండియన్ జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ: జాగ్రఫీలో నైసర్గిక స్వరూపం, శీతోష్ణస్థితి, నదులు, ఖనిజాలు, అడ వులు, వ్యవసాయం, పర్వతాలు, సముద్రాలు, రవాణా సౌకర్యాలు, నీటి పారుదల వ్యవస్థ, జాతీయ ఉద్యానవనాలు తదితర అంశాలను ఎక్కువగా చదవాలి. పాలిటీలో భారత రాజ్యాంగం, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, రాష్ట్రపతి - ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, పార్లమెంట్ (లోక్‌సభ, రాజ్యసభ), సుప్రీంకోర్టు, హై కోర్టులు, కాగ్ లాంటి అంశాలపై పూర్తి అవగాహన ఉండాలి. ఎకానమీలో భారత, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలు, బడ్జెట్, జనాభా, సామాజిక అభివృద్ధి కార్యక్రమాలు, బ్యాంకులు, పన్నులు, ఎగుమతులు - దిగుమతులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. జనరల్ సైన్స్: ఇందులో జీవ శాస్త్రం, వృక్ష శాస్త్రం, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలా నాలుగు భాగాల నుంచి ప్రశ్నలు అడగొచ్చు. ఈ క్రమంలో జీవరాశులు, వాతావరణం, విటమిన్లు, శాస్త్రవేత్తలు - ఆవిష్కరణలు, రసాయనాలు, వ్యాధులు, భారత అంతరిక్ష కార్యక్రమాలు, మానవ శరీర నిర్మాణం, హృదయం, శ్వాసక్రియ, మొక్కలు, విద్యుత్, అయస్కాంతం, కిరణాలు తదితర అంశాలపై ఎక్కువగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. అర్థమెటిక్:ఈ విభాగంలో అభ్యర్థి తార్కిక సామర్థ్యాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. సంఖ్యలు, గసాభా - కసాగు, సూక్ష్మీకరణం, వర్గ, ఘనమూలాలు, సరాసరి, నిష్పత్తి - అనుపాతం, లాభ-నష్టాలు, వడ్డీ, కాలం - పని, వైశాల్యం, కాలం - దూరం, ఘనపరిమాణం, క్యాలెండర్, సంభావ్యత లాంటి అంశాలు ప్రధానమైనవి. మిగతా విభాగాలతో పోలిస్తే ఇందులో సమాధానాలను గుర్తించడానికి ఎక్కువ సమయం అవసరం. కాబట్టి 1 - 20 వరకు ఎక్కాలు, 1-40 వరకు వర్గాలు, 1- 20 వరకు ఘనాలపై అవగాహన పెంచుకోవాలి. తద్వారా సమస్యా సాధనలో వేగం, కచ్చితత్వం పెరుగుతుంది. రీజనింగ్/ మెంటల్ ఎబిలిటీ: అభ్యర్థి విశ్లేషణ సామర్థ్యాన్ని పరీక్షించేలా ప్రశ్నలుంటాయి. ఇందులో కోడింగ్-డీకోడింగ్, అనాలజీ, దిశలు, సిరీస్, రక్త సంబంధాలు, ర్యాంకింగ్, డేటా - ఇంటర్‌ప్రిటేషన్, సీటింగ్ అరేంజ్మెంట్, నాన్ వెర్బల్ విభాగం నుంచి సిరీస్, అనాలజీ, క్లాసిఫికేషన్స్, మిర్రర్/ వాటర్ ఇమేజెస్ తదతర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. జనరల్ ఇంగ్లిష్: ఈ విభాగంలో అడిగే ప్రశ్నలు హైస్కూల్ స్థాయిలో ఉంటాయి. సినానిమ్స్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, స్పెలింగ్ టెస్ట్, టెన్సెస్, వాయిస్, కాంప్రెహెన్షన్ లాంటి అంశాలను క్షుణ్నంగా చదవాలి. - బి.ఉపేంద్ర, డెరైక్టర్, క్యాంపస్ స్టడీ సర్కిల్, హైదరాబాద్. అడ్మిషన్స్ అలర్ట్స్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ డిజైన్-2015 ఐఐటీ, బాంబే ‘కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ డిజైన్ (సీఈఈడీ)-2015’ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా బాంబే, ఢిల్లీ, గౌహతి, హైదరాబాద్, కాన్పూర్ ఐఐటీలతోపాటు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో ‘మాస్టర్ ఆఫ్ డిజైన్/ పీహెచ్డీ ఇన్ డిజైన్’ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలు కల్పిస్తారు. అర్హతలు: ఇంజనీరింగ్/ ఆర్కిటెక్చర్/ డిజైన్/ ఇంటీరియర్ డిజైన్‌లో డిగ్రీ లేదా ఫైన్ ఆర్ట్స్/ జీడీ ఆర్ట్‌లో డిగ్రీ లేదా ఆర్ట్స్/ సైన్స్/ కంప్యూటర్ అప్లికేషన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా. రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: సెప్టెంబర్ 1 సీఈఈడీ పరీక్ష తేది: డిసెంబర్ 7 వెబ్సైట్: www.gate.iitb.ac.in/ceed2015 ఇఫ్లూ - దూరవిద్యా ప్రోగ్రాములు హైదరాబాద్‌లోని ది ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ) దూర విద్యా విధానంలో పీజీ, పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. కోర్సుల వివరాలు ఎంఏ (ఇంగ్లిష్), వ్యవధి: రెండేళ్లు. అర్హత: ఇంగ్లిష్ ప్రధాన సబ్జెక్టుగా ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. పీజీ డిప్లొమా ఇన్ ది టీచింగ్ ఆఫ్ ఇంగ్లిష్ వ్యవధి: ఏడాది. అర్హత: ఇంగ్లిష్ టీచింగ్‌లో పీజీ సర్టిఫికెట్ ఉండాలి. పీజీ సర్టిఫికెట్ ఇన్ ది టీచింగ్ ఆఫ్ ఇంగ్లిష్ అర్హత: ఇంగ్లిష్ లేదా అలైడ్ సబ్జెక్టుల్లో (లింగ్విస్టిక్స్, ఎడ్యుకేషన్, సైకాలజీ, మాస్ కమ్యూనికేషన్) మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. దరఖాస్తులు వెబ్సైట్లో లభిస్తాయి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: అక్టోబర్ 31 వెబ్సైట్: www.efluniversity.ac.in జనరల్ నాలెడ్జ్: పాలిటీ: భారత రాజ్యాంగం 1949: నవంబర్ 26న పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించింది. (మొదట రాజ్యాంగంలో 395 ప్రకరణలు, 8 షెడ్యూళ్లు ఉన్నాయి. రాజ్యాంగ రచనకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం పట్టింది) 1950: జనవరి 24న రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశం. ఈ సమావేశంలో జాతీయ గీతాన్ని, జాతీయ గేయాన్ని ఆమోదించారు. 1950: జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. రాజ్యాంగ పరిషత్‌కు రాజ్యాంగ సలహాదారు: బెనగల్ నర్సింగరావు రాజ్యాంగాన్ని రూపొందించడానికి రాజ్యాంగ పరిషత్ 13 కమిటీలను ఏర్పాటు చేసింది. భారతదేశ చరిత్రలో ప్రముఖ యుద్ధాలు యుద్ధం జరిగిన సం॥ వివరాలు మూడో పానిపట్టు యుద్ధం 1761 అహ్మద్ షా అబ్దాలీ చేతిలో మరాఠాల ఓటమి, పతనం మొదటి ఆంగ్లో-మైసూర్ యుద్ధం 1767-69 వారన్ హేస్టింగ్స హయాంలో బ్రిటీషు సైన్యానికి, మైసూర్ పాలకుడైన హైదరాలీకి మధ్య .. రెండో ఆంగ్లో - మైసూర్ యుద్ధం 1780-84 బ్రిటీషు సైన్యానికి, హైదరాలీకి మధ్య. తరువాత యుద్ధంలోకి టిప్పు సుల్తాన్ ప్రవేశించాడు మూడో ఆంగ్లో - మైసూర్ 1790-92 {బిటీష్ సైన్యం చేతిలో టిప్పుసుల్తాన్ ఓటమి నాలుగో ఆంగ్లో - మైసూర్ 1799 వెల్లస్లీ హయాంలో బ్రిటీష్ సైన్యం చేతిలో టిప్పు సుల్తాన్ ఓటమి, -
సివిల్స్ 2013 ప్రిలిమ్స్ పేపర్-1లో చరిత్రలో ఏ ప్రశ్నలు..
సివిల్స్ 2013 ప్రిలిమ్స్ పేపర్-1లో చరిత్ర నుంచి ఎలాంటి ప్రశ్నలు వచ్చాయో విశ్లేషణ ఇవ్వండి? - ఎం.రాధిక, మల్కాజ్గిరి కాంపిటీటివ్ కౌన్సెలింగ్: కొత్త సిలబస్ ప్రారంభమైన దగ్గర నుంచి (2011) చూస్తే ఇప్పటి వరకు చారిత్రక అంశాలకు సమాన ప్రాధాన్యం ఇస్తూ ప్రశ్నలు అడుగుతున్నారు. 2013లో ప్రశ్నపత్రం సమతూకంగానే ఉంది. ప్రాచీన భారత దేశ చరిత్ర నుంచి దాదాపు 50 శాతం ప్రశ్నలు రాగా, మధ్య, ఆధునిక చరిత్ర నుంచి 50 శాతం వచ్చాయి. గతంలో రాజకీయ చరిత్రకు సంబంధించి ఒకట్రెండు ప్రశ్నలు అడిగేవారు. ఈసారి ఆ విభాగాన్ని పక్కనపెట్టేశారు. ప్రాచీన భారత దేశ చరిత్ర నుంచి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, ఆర్కిటెక్చర్‌కు సంబంధించిన ప్రశ్నలకు ప్రాధాన్యం ఇచ్చారు. Ex: Consider the following historical places: 1. Ajanta Caves, 2. Lepakshi Temple, 3. Sanchi Stupa Which of the above places is/are also known for mural paintings? a) 1 only b) 1 and 2 only c) 1, 2, and 3 d) None జవాబు: c - గతంతో పోలిస్తే 2013లో అడిగిన ప్రశ్నలు తేలిగ్గా ఉన్నాయి. కొన్ని డెరైక్ట్‌గా వస్తే మరికొన్ని కాన్సెప్ట్ ఆధారిత ప్రశ్నలు వచ్చాయి. Ex: The Chinese traveller Yuan Chwang (Hiuen Tsang) who visited India recorded the general conditions and culture of India at that time. In this context, which of the following statements is/are correct? 1. The roads and river routes were completely immune from robbery. 2. As regards punishment for offences, or deals by fire, water and poison were the instruments for determining the innocence or guilt of person. 3. The tradesmen had to pay duties at ferries and barrier stations. Select the correct answer using the codes given below. a) 1 only b) 2 and 3 only c) 1 and 3 only d) 1, 2 and 3 జవాబు: b ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలంటే ఓ అంశాన్ని విశ్లేషణాత్మక ధోరణితో చదవాల్సిందే. గతంలో హిస్టరీకి సంబంధించిన కొన్ని ప్రశ్నలు అభ్యర్థిని తికమక పెట్టేవి. ప్రశ్నను అర్థం చేసుకోవడానికే చాలా సమయం పట్టేది. 2013లో అలాంటి పరిస్థితి ఎదురుకాలేదు. ఇన్పుట్స్: యాకూబ్ బాషా, సీనియర్ ఫ్యాకల్టీ బ్యాంక్స్ పీవోస్ పరీక్ష రాయాలనుకుంటున్నాను. ప్రకటన ఎప్పుడు వెలువడుతుంది? పరీక్ష ఎవరు నిర్వహిస్తారు? అర్హతలు.. పరీక్ష విధానం తెలియజేయండి? - అపరాల స్వాతి, సైదాబాద్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ).. దాని గ్రూప్ బ్యాంకులు మినహా మిగిలిన అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్స్/ మేనేజ్మెంట్ ట్రైనీస్ పోస్టుల భర్తీకి ఏటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (ఐబీపీఎస్) పరీక్ష నిర్వహిస్తోంది. ఆన్లైన్ విధానంలో నిర్వహించే పరీక్షకు ప్రస్తుతం ప్రకటన వెలువడింది. పరీక్షలో వచ్చిన స్కోర్ ఆధారంగా ఖాళీలను బట్టి ఆయా బ్యాంకులు ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయి. ఈ ఏడాది అక్టోబర్‌లో నిర్వహించనున్న ఈ పరీక్ష స్కోర్.. మార్చి 31, 2016 వరకు చెల్లుతుంది. అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులు అర్హులు. వయసు: జూలై 1, 2014 నాటికి 20 - 30 ఏళ్లు (జూలై 2, 1984- జూలై 1, 1994 మధ్య జన్మించినవారు అర్హులు). ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ (నాన్ క్రిమిలేయర్)లకు మూడేళ్లు, శారీరక వికలాంగులకు పదేళ్లు సడలింపు ఉంటుంది. పరీక్ష విధానం: రెండు గంటల వ్యవధిలో నిర్వహించే ఆన్లైన్ పరీక్షలో భాగంగా.. రీజనింగ్ (50 మార్కులు), ఇంగ్లిష్ లాంగ్వేజ్ (40 మార్కులు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (50 మార్కులు), జనరల్ అవేర్నెస్ (స్పెషల్ రిఫరెన్స్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ) (40 మార్కులు), కంప్యూటర్ నాలెడ్జ్ (20 మార్కులు)లపై ప్రశ్నలుంటాయి. మొత్తం మార్కులు 200. తప్పుగా గుర్తించిన ప్రశ్నలకు నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి సరైన సమాధానాలకు ఇచ్చే మార్కుల నుంచి 0.25 మార్కుల కోత విధిస్తారు. ఇంగ్లిష్ లాంగ్వేజ్ మినహాయించి మిగిలిన అన్ని విభాగాలను ఇంగ్లిష్ లేదా హిందీలో రాసుకోవచ్చు. ఇంటర్వ్యూ: పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఆయా బ్యాంకులు ఇంటర్వ్యూ నిర్వహిస్తాయి. ప్రతి రాష్ట్రంలో ఒక బ్యాంక్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. వీటికి కావాల్సిన సహాయాన్ని ఐబీపీఎస్ అందిస్తుంది. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు రుసుం: ఎస్సీ/ఎస్టీ/శారీరక వికలాంగులకు రూ.100, ఇతరులకు రూ.600. ఐబీపీఎస్ ఆధారంగా ఉద్యోగాలిస్తున్న బ్యాంకులివే.. అలహాబాద్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, భారతీయ మహిళా బ్యాంక్, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొ రేషన్ బ్యాంక్, దేనా బ్యాంక్, ఈసీజీసీ, ఐడీబీఐ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవ ర్సీస్ బ్యాంక్, ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, విజయా బ్యాంక్. ఆన్లైన్ దరఖాస్తులు: జూలై 22 - ఆగస్టు 11 ఆన్లైన్ పరీక్ష తేదీలు: అక్టోబర్ 11, 12, 18, 19; నవంబర్ 1, 2 తేదీల్లో.. ఇంటర్వ్యూలు: జనవరి, 2015 వెబ్సైట్: www.ibps.in ఇన్పుట్స్: ఎన్.విజయేందర్‌రెడ్డి, సీనియర్ ఫ్యాకల్టీ, బ్యాంకింగ్ జాబ్స్, అడ్మిషన్స్ అలర్ట్స షిిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి అవివాహిత అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. పోస్టుల సంఖ్య: 40 అర్హతలు: మెకానికల్ ఇంజనీరింగ్‌లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు: 24 ఏళ్లకు మించకూడదు. ఎంపిక: ఆన్లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: ఆగస్టు 11 వెబ్సైట్: www.shipindia.com ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఆయిల్ ఇండియా లిమిటెడ్ (ఓఐఎల్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్ట్: అటెండెంట్ - 7, అర్హతలు: పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జూలై 25, వెబ్సైట్: www.oil-india.com\ ఎన్టీయార్ వర్సిటీ - బీయూఎంఎస్ ఎంట్రన్స్ టెస్ట్ డాక్టర్ ఎన్టీయార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైస్ బీయూఎంఎస్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు కోరుతోంది. బ్యాచిలర్ ఆఫ్ యునానీ మెడిసిన్ అండ్ సర్జరీ ఎంట్రన్స్ టెస్ట్ - 2014 కాలపరిమితి: నాలుగేళ్లు, అర్హతలు: బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. పదో తరగతిలో ఉర్దూ/అరబిక్/పర్షియన్ లాంగ్వేజ్‌ను ఒక సబ్జెక్టుగా కలిగి ఉండాలి. వయసు: డిసెంబరు 31, 2014నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి. దరఖాస్తులకు చివరి తేది: ఆగస్టు 8 వెబ్సైట్: http://ntruhs.ap.nic.in/ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ హైదరాబాద్, పీజీ డిప్లొమా ప్రోగ్రాముల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. కోర్సులు: పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్, ఎగ్జిక్యూటివ్ పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ అర్హతలు: 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎగ్జిక్యూటివ్ పీజీ డిప్లొమాలో ప్రవేశానికి సంబంధిత రంగంలో మూడు నుంచి నాలుగేళ్ల అనుభవం ఉండాలి. ఎంపిక: క్యాట్/ గ్జాట్/ మ్యాట్/ ఏటీఎంఏ/ సీమ్యాట్ స్కోరు ఆధారంగా. వెబ్సైట్: www.ipeindia.org -
సివిల్ పరీక్ష రెండో పేపర్లో ఏ ప్రశ్నలు ఎక్కువ.?
సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష రెండో పేపర్లో బేసిక్ న్యూమరసీ నుంచి ప్రశ్నలు ఏ స్థాయిలో వస్తున్నాయి? వాటికి ఏ విధంగా ప్రిపేర్ కావాలి? - ఎస్.కీర్తన, కూకట్పల్లి కాంపిటీటివ్ కౌన్సెలింగ్: సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ రెండో పేపర్లో బేసిక్ న్యూమరసీ నుంచి ఎక్కువ సంఖ్యలో ప్రశ్నలు వస్తున్నాయి. 2013లో నిర్వహించిన పరీక్షలో ఈ అంశం నుంచి 19 ప్రశ్నలు వచ్చాయి. ఈసారి కనీసం 15 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. బేసిక్ న్యూమరసీలోని అంశాలన్నీ 6వ తరగతి నుంచి 10వ తరగతి గణితం పుస్తకాల్లో ఉన్నవే. కాబట్టి ముందుగా ఈ పుస్తకాల్లో ఉన్న ప్రాథమిక సంఖ్యామానం, కసాగు, గసాభా, లాభం - నష్టం, బారువడ్డీ, చక్రవడ్డీ, సరాసరి, నిష్పత్తి - అనుపాతం, శాతాలు, క్షేత్రమితి అంశాలపై పట్టు సాధించాలి. వీటిలోంచి వచ్చే ప్రశ్నలు సూత్రాలపై ఆధారపడి ఉంటాయి. ముందుగా సూత్రాలను నేర్చుకుని, హైస్కూల్ గణితంలో ఉన్న ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి. తర్వాత బ్యాంక్ పీవోస్, సివిల్స్‌లో వచ్చిన గత ప్రశ్నలనూ సాధన చేయాలి. దానివల్ల మీ ప్రిపరేషన్ ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు. 2013 సివిల్స్ పేపర్-2లో బేసిక్ న్యూమరసీ నుంచి వచ్చిన కింది ప్రశ్నలను పరిశీలించండి. Basic Numeracy questions 1. In a rare coin collection, there is one gold coin for every three non-gold coins. 10 more gold coins are added to the collection and the ratio of gold coins to non-gold coins would be 1: 2. Based on the information; the total number of coins in the collection now becomes 1) 90 2) 80 3) 60 4) 50 2. A gardener has 1000 plants: He wants to plant them in such a way that the number of rows and the number of columns remains the same. What is the minimum number of plants that he needs more for this purpose? 1) 14 2) 24 3) 32 4) 34 3. A sum of RS. 700 has to b used to give seven cash prizes to the students of a school for their overall academic performance. If each prize is Rs. 20 less than its preceding prize, what is the least value of the prize? 1) Rs. 30 2) Rs. 40 3) Rs. 60 4) Rs. 80 4. Out of 120 applications for a post, 70 are male and 80 have a driver's license. What is the ratio between the minimum to maximum number of males having driver's license? 1) 1 to 2 2) 2 to 3 3) 3 to 7 4) 5 to 7 5. In a garrison, there was food for 1000 soldiers for one month. After 10 days, 1000 more soldiers joined the garrison. How long would the soldiers be able to carry on with the remaining food? 1) 25 days 2) 20 days 3) 15 days 4) 10 days 6. The tank-full petrol in Arun's motor-cycle lasts for 10 days. If he starts using 25% more every day, how many days will the tank-full petrol last? 1) 5 2) 6 3) 7 4) 8 7. A person can walk a certain distance and drive back in six hours. He can al so walk both ways in 10 hours. How much time will he take to drive both ways? 1) Two hours 2) Two and a half hours 3) Five and a half hours 4) Four hours 8. A thief running at 8 km/hr is chased by a policeman whose speed is 10 km/hr. If the thief is 100 m ahead of the policeman, then the time required for the policeman to catch the thief will be 1) 2 min 2) 3 min 3) 4 min 4) 6 min 9. A train travels at a certain average speed for a distance of 63 km and then travels a distance of 72 km at an average speed of 6 km/hr more than its original speed. If it takes 3 hours to complete the total journey, what is the original speed of the train in km/hr? 1) 24 2) 33 3) 42 4) 66 Key 1. Let the number of gold coins be x Then the number of non gold coins is 3x According to the condition x + 10 : 3x = 1: 2 2x + 20 = 3x x = 20 Therefore, in the coin collection Number of coins = x + 3x + 10 = 20 + 60 + 10 = 90 2. The minimum number of plants that he needs should be a perfect square number, i.e 312 < 1000 < 322 961 < 1000 < 1024 So, 24 is the minimum number of tree are needed 3. Let the least value of the prize be Rs x. Then x + x + 20 + x + 40 + x + 60 + x + 80 + x + 100 + x + 120 = 700 7x + 420 = 700 7x = 700 - 420 7x = 280 x = 40 4. Here male applicants = 70 So female applicants = 120 - 70 = 50 Maximum number of female applicants having driving license = 50 Minimum number of male applicants having driving license = 80 50 = 30 Maximum number of male applicants having driving license = 70 Hence, The required ratio = 30 : 70 = 3 : 7 5. Total food for 30 days = 1000 × 30 = 30,000 Food exhausted in 10 days = 10 × 1000 = 10,000 Food left for 2000 soldiers = 30,000 - 10,000 = 20,000 Food remaining for rest of the period 6. Petrol used in 1 day = x Hence, Petrol used in 10 days = 10x According to the condition Petrol used in 1 day = 1025x Number of days, tank full petrol will last 7. Time taken by the person to walk one way Time taken to drive one way = 6 - 5 = 1 hr Time taken to drive both ways = 1 + 1 = 2 hrs 8. Relative Speed = 19 - 8 = 2 km/hr So, time required for the policeman to catch the thief is 9. Let the original speed of the train be x km/hr Then x2 - 32x - 126 = 0 (x - 42)(x + 3) = 0 x = 42 or - 3 Hence, the original speed of the train is 42 km/hr INPUTS: BANDA RAVIPAL REDDY, DIRECTOR, SIGMA, HYDERABAD. -
సివిల్స్ ప్రిలిమ్స్‌లో ఎలాంటి ప్రశ్నలు అడిగారు?
భారత రాజ్యాంగ రచన, రాజ్యాంగ పరిషత్ నుంచి సివిల్స్ ప్రిలిమ్స్‌లో ఎలాంటి ప్రశ్నలు అడిగారు? ఈ చాప్టర్ నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తున్నాయి.? - వినోద్‌కుమార్‌రెడ్డి, అంబర్‌పేట కాంపిటీటివ్ కౌన్సెలింగ్: ఈ చాప్టర్ నుంచి కచ్చితంగా మూడు; నాలుగు ప్రశ్నలు వస్తున్నాయి. ఎక్కువగా ఫ్యాక్ట్ ఓరియెంటెడ్ ప్రశ్నలు అడుగుతున్నారు. గత ప్రశ్న పత్రాలను పరిశీలిస్తే ప్రశ్నలన్నీ బహుళ సమాధానాలతో కూడినవి అంటే మ్యాచింగ్ టైప్ క్వశ్చన్స్ రూపంలో ఉన్నాయి. ఉదాహరణకు రాజ్యాంగ పరిషత్ నిర్మాణానికి సంబంధించి కిందివాటిలో సరైంది ఏది?లాంటి ప్రశ్నలు. ప్రాథమిక అంశాల నుంచి కూడా ప్రశ్నలు అడిగే అవకాశముంది. కాబట్టి రాజ్యాంగ రచనను ప్రభావితం చేసిన చారిత్రక సంఘటనలు(చార్టర్ చట్టాలు, కౌన్సిల్ చట్టాలు), రాజ్యాంగ పరిషత్‌లోని సభ్యుల సంఖ్య, సమావేశాలు, కమిటీలు, రాజ్యాంగ ఆధారాలు, తీర్మానాలు లాంటి విషయ సంబంధమైన సమాచారంపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాలి. ప్రామాణిక పుస్తకాల నుంచి ప్రాథమిక అంశాలను నోట్స్‌గా రాసుకున్న తర్వాత విస్తృత సమాచారం కోసం రిఫరెన్స్ పుస్తకాలను చదవొచ్చు. ఈ చాప్టర్లో విషయ సంబంధిత సమాచారమే ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీలైనన్ని ఎక్కువ సార్లు రివిజన్ చేసుకుంటే అంకెలతో కూడిన సమాచారాన్ని(భాగాలు, ప్రకరణలు, అంశాలు) సులువుగా గుర్తుంచుకోవచ్చు. స్వాతంత్య్రం లభించినప్పటి నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చేవరకు పరిపాలన ఏ ప్రాతిపదికన జరిగింది? అంటే 1935 చట్టం ప్రకారం జరిగిందా? లేదా రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక నిబంధనల ప్రకారం జరిగిందా? అనే కోణంలో రాబోయే పరీక్షల్లో ప్రశ్నలు వచ్చే అవకాశాలున్నాయి. గత పరీక్షల్లో అడిగిన కింది ప్రశ్నలను పరిశీలించండి. - భారత రాజ్యాంగం గణతంత్రం ఎందుకనగా?(సివిల్స్ 2007) సమాధానం: రాష్ర్టపతి, ఇతర ప్రజాప్రతినిధులు నిర్ణీత కాలానికి ఎన్నికవుతారు. - అమెరికా రాజ్యాంగం నుంచి స్వీకరించిన అంశాలు ఏవి?(సివిల్స్ 2010) సమాధానం: ప్రాథమిక హక్కులు, న్యాయసమీక్ష, పిల్-ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం, న్యాయ వ్యవస్థకు స్వయం ప్రతిపత్తి మొదలైన అంశాలను అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించారు. అలా గ్రహించడానికి కారణాలనూ విశ్లేషించుకోవాలి. అమెరికా ‘హక్కులకు ప్రతీక, హక్కుల రక్షణకు న్యాయవ్యవస్థ అవసరం. ఇలా పోల్చుకుంటూ చదివితే చక్కగా గుర్తుంటుంది. మంచి కోచింగ్ సెంటర్లో శిక్షణను తీసుకోవడం ద్వారా విజయావకాశాలు మెరుగవుతాయి. ఏది చదవాలో, ఏది చదవకూడదో అనుభవజ్ఞుల ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది. తద్వారా సమయం చక్కగా సద్వినియోగం అవుతుంది. - ఇన్పుట్స్: బి.కృష్ణారెడ్డి, సీనియర్ ఫ్యాకల్టీ ఇన్ పాలిటీ, హైదరాబాద్ బ్యాంక్స్ పరీక్షలు రాసేటప్పుడు రీజనింగ్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ విభాగంలో ముఖ్యమైన టాపిక్స్ ఏవి? - అనుపమ, అపురూప కాలనీ బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ పరీక్షలే కాకుండా ఆర్ఆర్బీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వంటి పోటీ పరీక్షల్లోనూ రీజనింగ్ నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. ఈ విభాగంలో అభ్యర్థి ఆలోచన, నిర్ణయం తీసుకునే సామర్థ్యం, వేగంగా ఆలోచించడం వంటివాటిపై ప్రశ్నలు అడుగుతారు. సాధారణంగా బ్యాంక్స్ పరీక్షల్లో క్లర్క్స్ విభాగంలో 40 మార్కులకు, పీఓస్ విభాగంలో 50 మార్కులకు రీజనింగ్ నుంచి ప్రశ్నలు ఇస్తారు. తప్పుగా గుర్తించిన ప్రశ్నలకు 0.25 నెగెటివ్ మార్కులు కూడా ఉంటాయి. అభ్యర్థులు పరీక్ష రాసేటప్పుడు ప్రశ్నను చూసి కంగారుపడకూడదు. ముందుగా ప్రశ్నను అవగాహన చేసుకోవాలి. ప్రతి ప్రశ్నలోనూ హిడెన్ స్టేట్మెంట్ను గుర్తించగలగాలి. ముందు కష్టమైన ప్రశ్నల కంటే సులువైన వాటికి సమాధానాలు రాయాలి. ఆప్షన్స్ అన్నీ ఒకే విధంగా ఉంటాయి. కాబట్టి గందరగోళానికి గురికాకుండా సరైన ఆప్షన్‌ను గుర్తించాలి. సమయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఆన్లైన్ పరీక్ష కాబట్టి వీలైనన్ని ఆన్లైన్ మాక్‌టెస్టులు సాధన చేయాలి. రీజనింగ్‌లో ముఖ్యమైన టాపిక్స్: కోడింగ్ - డికోడింగ్, క్లాసిఫికేషన్స్, డెరైక్షన్స్, బ్లడ్ రిలేషన్స్, కోడెడ్ రిలేషన్స్, కంపారిజన్ టెస్ట్, సీటింగ్ అరెంజ్మెంట్, సిలాజిస్మ్, ఎనలిటికల్ రీజనింగ్, డేటా సఫీషియెన్సీ, స్టేట్మెంట్స్ - కన్‌క్లూజన్స్, ఇన్పుట్-ఔట్పుట్ మొదలైనవి. రిఫరెన్స్ బుక్స్ గీ మోడ్రన్ అప్రోచ్ టు వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ - ఆర్.ఎస్.అగర్వాల్ గీ ఎనలిటికల్ రీజనింగ్ - ఎం.కె.పాండే గీ రీజనింగ్- అరిహంత్ పబ్లికేషన్స్ ఇన్పుట్స్: ఇ.సంతోష్‌రెడ్డి, సీనియర్ ఫ్యాకల్టీ, బ్యాంక్స్ -
సివిల్స్ మెయిన్స్ జాగ్రఫీకి ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియజేయండి?
- పి.సంయుక్త, తిలక్‌నగర్ కాంపిటీటివ్ కౌన్సెలింగ్ : సివిల్స్ మెయిన్స్ జనరల్ స్టడీస్ పేపర్-1లో జాగ్రఫీకి సంబంధించి సిలబస్‌లో పేర్కొన్న అంశాలు: వరల్డ్ జాగ్రఫీ-కీలక అంశాలు, ప్రపంచవ్యాప్తంగా (దక్షిణాసియా, భారత ఉపఖండంతో సహా) ప్రధాన సహజ వనరుల విస్తరణ, ప్రపంచ వ్యాప్తంగా (భారత్ సహా) వివిధ ప్రాంతాల్లో పరిశ్రమల ఉనికి. గతంతో పోలిస్తే జనరల్ స్టడీస్ పేపర్లో జాగ్రఫీ సబ్జెక్టు పరిధి విస్తృతమైంది. గతేడాది కేవలం ఇండియా జాగ్రఫీని మాత్రమే సిలబస్‌లో పేర్కొంటే.. ఈసారి వరల్డ్ జాగ్రఫీని అదనంగా చేర్చారు. జాగ్రఫీకి సంబంధించి ఏ మూల నుంచైనా ప్రశ్నలు రావొచ్చు. ఈ నేపథ్యంలో జాగ్రఫీ ఆప్షనల్తో పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఈ పేపర్లో మంచి స్కోర్ సాధించడానికి వీలుంది. వరల్డ్ ఫిజికల్ జాగ్రఫీ: వరల్డ్ ఫిజికల్ జాగ్రఫీలోని అంశాలకు ఆకాశమే హద్దు. అందువల్ల ప్రిపరేషన్లో భాగంగా తొలుత బేసిక్ అంశాలపై పట్టు సాధించాలి. ఆ తర్వాత ముఖ్యమైన అంశాలను, సమకాలీన అంశాలతో అనుసంధానం చేసుకుంటూ ప్రిపరేషన్ కొనసాగించాలి. ఇందులోని ముఖ్యాంశాలు.. భూ స్వరూపాలు (ల్యాండ్ ఫార్మ్స్), వాతావరణం, మృత్తికలు, సహజ ఉద్భిజాలు(నేచురల్ వెజెటేషన్) వంటి భౌతిక, భౌగోళిక అంశాలు. వీటిని రెండు విధాలుగా విభజించి చదవాలి. అప్పుడే పేపర్లో గరిష్టంగా మార్కులు సాధించడానికి వీలుంటుంది. భౌతిక, భౌగోళిక అంశాలు: 1. సమకాలీన ప్రాధాన్యం ఉన్న అంశాలు. 2. ప్రత్యేక లక్షణాలున్న అంశాలు. ఓ విషయం గురించి చదువుతున్నప్పుడు ఆ అంశం నుంచి ఎలాంటి ప్రశ్నలు రావడానికి అవకాశముందో ఆలోచించి చదవాలి. అప్పుడే ప్రిపరేషన్ సఫలీకృతమవుతుంది. ఉదా: శీతోష్ణస్థితి అనే అంశంపై చదువుతున్నప్పుడు ఒక ప్రాంతంలోని శీతోష్ణస్థితి అక్కడి ఆర్థిక వ్యవస్థపై ఎలా ప్రభావం చూపుతోందన్న దానిపై దృష్టి సారించాలి. ముఖ్యమైన భూభౌతిక దృగ్విషయాలు: భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాలు, తుపానులు తదితరాలు. తొలుత ఈ అంశాలపై శాస్త్రీయ అవగాహన పెంపొందించుకోవాలి. తర్వాత అవి ఎక్కడెక్కడ.. ఎందుకు? సంభవిస్తున్నాయో తెలుసుకోవాలి. - మానవ జోక్యం వల్ల ఏ భౌగోళిక అంశాల్లో మార్పులు వస్తున్నాయి? ఆయా మార్పుల ప్రభావం ఏమిటి? వంటి అంశాలపై దృష్టి సారించాలి. క్లుప్తంగా చెప్పాలంటే.. ‘అభివృద్ధి-పర్యావరణం’ కోణంలో చదవాలి. - జాగ్రఫీ సిలబస్‌లోని మరొక కీలకాంశం- ముఖ్యమైన సహజ వనరుల విస్తరణ. దీనిపై ప్రిపరేషన్లో భాగంగా సహజ వనరుల్లో ప్రధానమైనవి, సమకాలీన (వివాదాల్లో ఉండటం వంటివి) ప్రాధాన్యం ఉన్నవి ఏమిటో గుర్తించాలి. ఏ రకమైన వనరులు ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి.. అలా ఉండటానికి అనుకూలించిన పరిస్థితులు ఏమిటి? తదితర విషయాలపై అభ్యర్థులు అవగాహన పెంపొందించుకోవాలి. ఓ ప్రాంత అభివృద్ధిలో అక్కడి సహజ వనరులు ఎలాంటి పాత్ర పోషిస్తున్నాయో చూడాలి. అభివృద్ధికి, వనరుల విస్తరణకు మధ్య సంబంధాన్ని అవగతం చేసుకోవాలి. సహజ వనరుల విస్తరణకు సంబంధించి దక్షిణాసియా, భారత ఉపఖండానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రపంచంలో ఏ ప్రాంతాల్లో ఏ రకమైన పరిశ్రమలు ఎక్కువగా కేంద్రీకృతమై ఉన్నాయి? దానికి గల కారణాలేంటి? వనరుల విస్తరణకు, పరిశ్రమల అభివృద్ధికి మధ్య సంబంధాలను అధ్యయనం చేయాలి. పరిశ్రమలకు సంబంధించి భారత్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఇన్పుట్స్: గురజాల శ్రీనివాసరావు, సివిల్స్ సీనియర్ ఫ్యాకల్టీ, హైదరాబాద్ విపత్తుల గుర్తింపులో ప్రాథమిక భావనల ప్రాధాన్యం ఏమిటి? వివిధ పోటీ పరీక్షల్లో ఈ అంశం నుంచి ఏమైనా ప్రశ్నలు అడుగుతున్నారా? - సందీప్‌రెడ్డి, కుషాయిగూడ గత యూపీఎస్సీ, ఎపీపీఎస్సీ పరీక్షల ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే విపత్తు నిర్వహణ పాఠ్యాంశం నుంచి కొన్ని ప్రశ్నలను తరచూ అడుగుతున్నారు. విపత్తుల చారిత్రక పరిశీలన, ప్రాథమిక భావనలను క్షుణ్నంగా అర్థం చేసుకున్నప్పుడే.. ఈ పాఠ్యాంశం నుంచి ఎలాంటి ప్రశ్నలు వచ్చినా సులభంగా సమాధానాలు రాయగలరు. ఒక భౌగోళిక ప్రాంతంలో సంభవించిన దుర్ఘటన విపత్తు అవునా? కాదా? అని తెలుసుకోవడానికి విపత్తు ప్రాథమిక భావనలు ఉపయోగపడతాయి. ఎందుకంటే.. అన్ని వైపరీత్యాలు విపత్తు రూపాన్ని సంతరించుకోలేవు. ఉదాహరణకు.. వివిధ పోటీ పరీక్షల్లో అడిగిన కొన్ని ప్రశ్నలను పరిశీలించండి. విపత్తులను నమోదు చేసే కార్యక్రమం ఎప్పటినుంచి మొదలైంది? సమాధానం: క్రీ.పూ.435 2005లో భారత ప్రభుత్వం నెలకొల్పిన విపత్తు నిర్వహణ సంస్థ దేశంలో, వివిధ ప్రాంతాల్లో సంభవించే విపత్తులను ఎన్ని రకాలుగా విభజించింది? సమాధానం: 31 వాస్తవాధారిత ప్రశ్నలు, మరికొన్ని ఎనలిటికల్ బేస్డ్ ప్రశ్నలను కూడా విపత్తుల నిర్వహణ పాఠ్యాంశం నుంచి అడుగుతున్నారు. ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలను ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు సీబీఎస్ఈ సిలబస్‌లో ఉన్న పాఠ్యపుస్తకాల నుంచి గ్రహించవచ్చు. కాబట్టి అభ్యర్థులు దీన్ని దృష్టిలో ఉంచుకుని అధ్యయనం కొనసాగించాలి. ఇన్పుట్స్: ఎ.డి.వి.రమణ రాజు సీనియర్ ఫ్యాకల్టీ ఇన్ జాగ్రఫీ, హైదరాబాద్. -
కాంపిటీటివ్ కౌన్సెలింగ్
* నేను సివిల్స్ ప్రిలిమ్స్‌కు ప్రిపేర్ అవుతున్నాను. ప్రిలిమ్స్‌లో ఎకానమీని ఎలా ప్రిపేర్ కావాలో తెలియజేయండి? - మహితా, సికింద్రాబాద్ సివిల్స్ ప్రిలిమినరీలో క్లిష్టమైనవిగా భావించే సబ్జెక్టుల్లో ఎకానమీ ఒకటి. ప్రిలిమినరీ గండం గట్టెక్కడంలో ఎకానమీ అత్యంత కీలకమైంది కూడా! గత ప్రశ్న పత్రాలను పరిశీలిస్తే.. ప్రిలిమ్స్‌లో ఎకానమీ సంబంధిత అంశాలపై సగటున 15-20 ప్రశ్నలు అడిగారు. ఉపాధి, ప్రణాళికలు, అభివృద్ధి, ద్రవ్యం, బ్యాంకింగ్, విదేశీ వాణిజ్యం, వ్యవసాయం, అవస్థాపనా సౌకర్యాలు, ప్రభుత్వ విత్తం, జనాభా, పేదరికం నుంచి ప్రశ్నలు ఎక్కువగా అడుగుతున్నారు. ముఖ్యంగా 2013 సివిల్స్ ప్రిలిమినరీ ప్రశ్న పత్రాన్ని గమనిస్తే ఎకానమీ నుంచి అన్నీ కాన్సెప్ట్ బేస్డ్ ప్రశ్నలే వచ్చాయి. కాన్సెప్ట్లపై అవగాహన కోసం ఎన్సీఈఆర్టీ 6వ తరగతి నుంచి 12వ తరగతి పుస్తకాలను అధ్యయనం చేయాలి. గత ప్రిలిమినరీలో బ్యాంకింగ్ నుంచి నాలుగు ప్రశ్నలు, అంతర్జాతీయ వాణిజ్యం నుంచి మూడు ప్రశ్నలు ఇవ్వడం విశేషం. ఉదాహరణకు Priority Sector Lending by banks in India constitutes the lending to.. a)Agriculture b)Micro and small enterprises c)weaker sections d)all of the above; Ans: d కాబట్టి ప్రిలిమ్స్‌కు హాజరయ్యే విద్యార్థులు నివేదికలు, వ్యవసాయం, పారిశ్రామికరంగం, సేవారంగం, బ్యాంకింగ్, పన్నుల వ్యవస్థ, జాతీయాదాయం, యూఎన్డీపీ మానవాభివృద్ధి నివేదిక, 12వ ప్రణాళిక, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ప్రపంచ వాణిజ్య సంస్థ, అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచ బ్యాంక్, ద్రవ్యం-బ్యాంకింగ్, పేదరికం, సాంఘిక భద్రత, సుస్థిర అభివృద్ధి, ద్రవ్యోల్బణం వంటి అంశాలను అధ్యయనం చేయాలి. ప్రిపరేషన్లో కేవలం సిలబస్‌కే పరిమితం కాకుండా సంబంధిత అంశాలను కరెంట్ అఫైర్స్‌తో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలి. కార్పొరేట్ గవర్నెర్స్‌పై సెబీ జారీ చేసిన మార్గదర్శకాలు, ఇటీవల టోకు ధరల సూచి(WPI),), వినియోగదారుని ధరల సూచి(CPI) 2013-14 ఆర్థిక సంవత్సరంలో వివిధ రాష్ట్రాల వృద్ధి రేట్లు, ద్రవ్యలోటు; సామాజిక అభివృద్ధి సూచిక(సోషల్ ప్రోగ్రెస్ ఇండెక్స్); ఏషియన్ డెవలప్మెంట్ అవుట్‌లుక్-2014, కేంద్ర బ్యాంకు కొత్త బ్యాంకులకు సంబంధించిన లెసైన్స్‌ల మంజూరు; కేంద్ర బ్యాంకు ద్రవ్య విధానంలో భాగంగా విధాన రేట్లలో మార్పు; బేసల్-3 నియమాలు; పీఎఫ్‌నకు సంబంధించి యూనివర్సల్ అకౌంట్ నంబర్; ఎన్నికల వ్యయం; కరెంట్ అకౌంట్ లోటు; రూపాయి మూల్యహీనీకరణ వంటి కరెంట్ టాపిక్స్‌తో సమన్వయం చేసుకుంటూ అధ్యయనం కొనసాగించాలి. ముఖ్యంగా పరీక్ష కోణంలో ఎప్పటికప్పుడు నోట్స్ రూపొందించుకోవాలి. ఆ నోట్స్‌ను ప్రతి రోజూ రివిజన్ చేసుకోవాలి. ప్రిపరేషన్ స్థాయిని తెలుసుకునేందుకు అభ్యర్థి ఎప్పటికప్పుడు తన పర్ఫార్మెన్స్ను సమీక్షించుకోవాలి. రిఫరెన్స్ బుక్స్: * ఇండియా ఇయర్ బుక్; ఇండియా ఎకనమిక్ సర్వే * ఇండియన్ ఎకానమీ- ఎస్.కె.మిశ్రా అండ్ పూరి * ఇండియన్ ఎకానమీ- ఉమా కపిల * ఇండియన్ ఎకానమీ ఇన్ ద 21 సెంచరీ- * రాజ్ కపిల అండ్ ఉమా కపిల ఇన్పుట్స్ - తమ్మా కోటిరెడ్డి * బ్యాంక్ పరీక్షల్లో జనరల్ అవేర్నెస్ విభాగం నుంచి ఎలాంటి ప్రశ్నలు అడిగేందుకు అవకాశం ఉంది? - సంపంగి రేణుక, కర్మన్‌ఘాట్ అన్ని బ్యాంక్ పరీక్షల్లో జనరల్ అవేర్నెస్ సబ్జెక్ట్ కీలకమైంది. ఐబీపీఎస్(ఇండియన్ బ్యాంకింగ్ పర్సనల్ సర్వీసెస్) నిర్వహించే పీవోస్, క్లర్క్స్ పరీక్షల్లో జనరల్ అవేర్నెస్ విభాగం నుంచి 40 ప్రశ్నలు అడుగుతున్నారు. ఎస్బీఐ నిర్వహించే పీవోస్ పరీక్షలో 40, క్లర్క్స్ పరీక్షలో 25 ప్రశ్నలు ఈ విభాగం నుంచే వస్తున్నాయి. మొత్తం 40 ప్రశ్నల్లో బ్యాంకింగ్‌కు సంబంధించి 15 నుంచి 20 ప్రశ్నలు ఉంటున్నాయి. మిగతావి కరెంట్ అఫైర్స్, స్టాక్ జీకేకు సంబంధించినవి ఉంటున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్‌కు సంబంధించిన సమకాలీన సమస్యలను జోడిస్తూ అడుగుతున్నారు. గతవారం జరిగిన ఎస్బీఐ పీవో పరీక్షలో ఇటీవల నూతనంగా నియమితులైన ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎవరు అని అడిగారు? దీనికి సమాధానం ఆర్.గాంధీ. గ్రూప్-1, గ్రూప్-2, ఇతర పోటీ పరీక్షలతో పోలిస్తే జనరల్ అవేర్నెస్ ప్రిపరేషన్ చాలా సులభం. పరీక్ష సమయాని కంటే ఆరు నుంచి ఎనిమిది నెలల కరెంట్ అఫైర్స్ ఫాలో అయితే సరిపోతుంది. పరీక్షలో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ విభాగాలకంటే చాలా సులువుగా అతి తక్కువ సమయంలో జనరల్ అవేర్నెస్ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించవచ్చు. మిగిలిన సమయాన్ని కఠినంగా అనిపించే ప్రశ్నలకు కేటాయించుకోవడం ద్వారా విజయ అవకాశాలను మెరుగుపర్చుకోవచ్చు. బ్యాంక్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు జనరల్ అవేర్నెస్ విభాగంలో అత్యధిక మార్కులు తెచ్చుకోవాలంటే.. స్టాక్ జీకే కోసం మనోరమ ఇయర్ బుక్-2014 చదివితే సరిపోతుంది. ఇన్పుట్స్ - ఎన్.విజయేందర్‌రెడ్డి