ఆవరణ శాస్త్రంలో అభ్యర్థులు ప్రాథమిక భావనలపై దృష్టిసారించాలి. ముఖ్యంగా జాతి (species),జాతి ఉత్పత్తి (speciation),ఆవరణ వ్యవస్థ (ecosystems), వాటి రకాలు, ఆహార శృంఖలాలు, బయో జియో కెమికల్ సైకిల్స్, ఆహార వల (food chain)ఎకోటోన్, జీవుల అనుకూలతలపై అవగాహన పెంచుకోవాలి. జీవశాస్త్రంలోని జంతువృక్ష విజ్ఞానాన్ని ఆవరణ శాస్త్రానికి అన్వయించుకొని చదవడం ద్వారా జీవుల అనుకూలతలపై పట్టు లభిస్తుంది.
జీవ వైవిధ్యం
జీవ వైవిధ్యం(Biodiversity).. మరో ముఖ్యమైన అంశం. జీవ వైవిధ్య రకాలు, జీవ వైవిధ్యానికి ఏర్పడుతున్న ప్రమాదాలు, జీవవైవిధ్య పరిరక్షణ పద్ధతులపై సమాచారం అవసరం. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విభిన్న జీవ జాతులు ఎదుర్కొంటున్న ప్రమాదాలపై అవగాహన పెంపొందించుకోవాలి. ఐయూసీఎన్ (ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్) ప్రకటించిన అంతరించే ప్రమాదమున్న జీవజాతుల జాబితాను (Red list)క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. ఉదా: బట్టమేక పక్షి(Great Indian Bustard).అతి త్వరలో అంతరించే జాతిగా దీన్ని గుర్తించారు. దీని శాస్త్రీయ నామం, ఆవాసాలు, భారత్‌లో జనాభా, వచ్చే ప్రమాదాలు, కార్యక్రమాలు, దీనికి సంబంధించిన ఇతర జాతులపై సమాచారం సేకరించాలి. దీని ద్వారా ఈ పక్షిపై వచ్చే ప్రశ్నలకు సమాధానాన్ని సులభంగా గుర్తించవచ్చు.
బట్టమేక పక్షి - Great Indian Bustard
శాస్త్రీయ నామం - ఆర్డయోటిస్ నైగ్రిసెప్స్
(Ardeotis nigriceps)
దేశంలో రాజస్థాన్‌లో అధికంగా కనిపిస్తాయి.
ప్రధాన ప్రమాదాలు - రోడ్ల నిర్మాణం, సౌర, జల విద్యుత్ ప్రాజెక్టులు, అడవుల నరికివేత
దీనికి సంబంధించిన జాతులు: Lesser florican; Bengal florican; Houbara bustard (ఇది వలస జాతి)
ఈ విధంగా ఆసియా సింహం, బెంగాల్ పులి, ఒంటి కొమ్ము ఖడ్గమృగం, ఎర్ర చందనం, నక్షత్ర తాబేలు, మానిస్/పంగోలియన్ అనే పిపీలికాహారి తదితర ముఖ్య జంతువులపై అవగాహన అవసరం.
కాంపిటీటివ్ కౌన్సెలింగ్
Published Sun, Sep 18 2016 12:17 AM | Last Updated on Mon, Sep 4 2017 1:53 PM
Advertisement
Advertisement