పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్షలో ఏ అంశాలు ? | which elements are in Police Constable written examination ? | Sakshi
Sakshi News home page

పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్షలో ఏ అంశాలు ?

Published Tue, Aug 5 2014 11:32 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్షలో ఏ అంశాలు ? - Sakshi

పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్షలో ఏ అంశాలు ?

కాంపిటీటివ్ కౌన్సెలింగ్: పోలీస్ కానిస్టేబుల్ నియామకాలకు నిర్వ హించే రాత పరీక్షలో ఏయే అంశాలుంటాయి? వాటికి ఎలా సిద్ధంకావాలి?
 - జి.నారాయణ, కూకట్‌పల్లి.
 పోలీస్ కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబరులో నోటిఫికేషన్ విడుదల చేసే అవ కాశాలున్నాయి.  దీనికోసం కసరత్తు జరుగు తోంది. నియామక ప్రక్రియలో రెండో దశలో రాత పరీక్ష ఉంటుంది. శారీరక సామర్థ్య పరీక్షలో నిర్దేశించిన అర్హత సాధించినవారిని మాత్రమే దీనికి ఎంపిక చేస్తారు. పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో 200 మార్కులకు ఉంటుంది.
 
     రాత పరీక్షలో ప్రధానంగా ఏడు విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. అవి..
 1) భారతదేశ చరిత్ర - సంస్కృతి - జాతీయోద్యమం 2) కరెంట్ అఫైర్స్ 3) ఇండియన్ జాగ్రఫీ - పాలిటీ - ఎకానమీ 4) జనరల్ సైన్స్ 5) అర్థమెటిక్ 6) రీజనింగ్/ మెంటల్ ఎబిలిటీ 7) జనరల్ ఇంగ్లిష్.
 
 భారతదేశ చరిత్ర - సంస్కృతి - జాతీయోద్యమం: భారతదేశ చరిత్రకు సంబంధించి ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక చరిత్ర ఉంటాయి. ఈ క్రమంలో హరప్పా నాగరికత నుంచి వేద యుగం, మౌర్యులు, శాతవాహనులు, కాకతీయులు, గుప్తుల కాలం నాటి సాం ఘిక, రాజకీయ, ఆర్థిక, మత పరిస్థితులపై అవగాహన పెంపొందించుకోవాలి. అరబ్బులు, మొ గల్ సామ్రాజ్యం, సిపాయిల తిరుగుబాటు, ఆం గ్లేయుల పాలన, భారత జాతీయోద్యమం లాం టి అంశాలపై ప్రధానంగా దృష్టి  సారించాలి.
 
 కరెంట్ అఫైర్స్: జాతీయ, అంతర్జాతీయంగా ప్రాధాన్యం ఉన్న సంఘటనలపై  దృష్టి సారించాలి. వీటితో పాటు వార్తల్లో వ్యక్తులు, సదస్సులు, ఒప్పందాలు, కమిటీలు - అధ్యక్షులు, ఎన్నికలు, ఐక్యరాజ్యసమితి, క్రీడలు, ముఖ్య తేదీలు, శాస్త్ర పరిశోధనలు, జనాభా లెక్కలు లాంటి అంశాలను కూడా చదవాలి. జనరల్ నాలెడ్జ్ (ప్రపంచంలో ఎత్తైవి, పొడవైనవి, ప్రథమ వ్యక్తులు తదితరాలు) ప్రిపేర్ కావాలి.
 
 ఇండియన్ జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ:
 జాగ్రఫీలో నైసర్గిక స్వరూపం, శీతోష్ణస్థితి, నదులు, ఖనిజాలు, అడ వులు, వ్యవసాయం, పర్వతాలు, సముద్రాలు, రవాణా సౌకర్యాలు, నీటి పారుదల వ్యవస్థ, జాతీయ ఉద్యానవనాలు తదితర అంశాలను ఎక్కువగా చదవాలి. పాలిటీలో భారత రాజ్యాంగం, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, రాష్ట్రపతి - ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, పార్లమెంట్ (లోక్‌సభ, రాజ్యసభ), సుప్రీంకోర్టు, హై కోర్టులు, కాగ్ లాంటి అంశాలపై పూర్తి అవగాహన ఉండాలి. ఎకానమీలో భారత, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలు,  బడ్జెట్, జనాభా, సామాజిక అభివృద్ధి కార్యక్రమాలు, బ్యాంకులు, పన్నులు, ఎగుమతులు - దిగుమతులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.
 
 జనరల్ సైన్స్: ఇందులో జీవ శాస్త్రం, వృక్ష శాస్త్రం, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలా నాలుగు భాగాల నుంచి ప్రశ్నలు అడగొచ్చు. ఈ క్రమంలో జీవరాశులు, వాతావరణం, విటమిన్లు, శాస్త్రవేత్తలు - ఆవిష్కరణలు, రసాయనాలు, వ్యాధులు, భారత అంతరిక్ష కార్యక్రమాలు, మానవ శరీర నిర్మాణం, హృదయం, శ్వాసక్రియ, మొక్కలు, విద్యుత్, అయస్కాంతం, కిరణాలు తదితర అంశాలపై ఎక్కువగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది.
 
 అర్థమెటిక్:ఈ విభాగంలో  అభ్యర్థి తార్కిక సామర్థ్యాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. సంఖ్యలు, గసాభా - కసాగు, సూక్ష్మీకరణం, వర్గ, ఘనమూలాలు, సరాసరి, నిష్పత్తి - అనుపాతం, లాభ-నష్టాలు, వడ్డీ, కాలం - పని, వైశాల్యం, కాలం - దూరం, ఘనపరిమాణం, క్యాలెండర్, సంభావ్యత లాంటి అంశాలు ప్రధానమైనవి. మిగతా విభాగాలతో పోలిస్తే ఇందులో సమాధానాలను గుర్తించడానికి ఎక్కువ సమయం అవసరం.
 
 కాబట్టి 1 - 20 వరకు ఎక్కాలు, 1-40 వరకు వర్గాలు, 1- 20 వరకు ఘనాలపై అవగాహన పెంచుకోవాలి. తద్వారా సమస్యా సాధనలో వేగం, కచ్చితత్వం పెరుగుతుంది.
 రీజనింగ్/ మెంటల్ ఎబిలిటీ: అభ్యర్థి విశ్లేషణ సామర్థ్యాన్ని పరీక్షించేలా ప్రశ్నలుంటాయి. ఇందులో కోడింగ్-డీకోడింగ్, అనాలజీ, దిశలు, సిరీస్, రక్త సంబంధాలు, ర్యాంకింగ్, డేటా - ఇంటర్‌ప్రిటేషన్, సీటింగ్ అరేంజ్‌మెంట్, నాన్ వెర్బల్ విభాగం నుంచి సిరీస్, అనాలజీ, క్లాసిఫికేషన్స్, మిర్రర్/ వాటర్ ఇమేజెస్ తదతర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
 జనరల్ ఇంగ్లిష్: ఈ విభాగంలో అడిగే  ప్రశ్నలు హైస్కూల్ స్థాయిలో ఉంటాయి. సినానిమ్స్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, స్పెలింగ్ టెస్ట్, టెన్సెస్, వాయిస్, కాంప్రెహెన్షన్ లాంటి అంశాలను క్షుణ్నంగా చదవాలి.     
     - బి.ఉపేంద్ర, డెరైక్టర్,
  క్యాంపస్ స్టడీ సర్కిల్, హైదరాబాద్.


అడ్మిషన్స్ అలర్ట్స్
 కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ డిజైన్-2015
 ఐఐటీ, బాంబే ‘కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ డిజైన్ (సీఈఈడీ)-2015’ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా బాంబే, ఢిల్లీ, గౌహతి, హైదరాబాద్, కాన్పూర్ ఐఐటీలతోపాటు బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో ‘మాస్టర్ ఆఫ్ డిజైన్/ పీహెచ్‌డీ ఇన్ డిజైన్’ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలు కల్పిస్తారు.
 అర్హతలు: ఇంజనీరింగ్/ ఆర్కిటెక్చర్/ డిజైన్/ ఇంటీరియర్ డిజైన్‌లో డిగ్రీ లేదా ఫైన్ ఆర్ట్స్/ జీడీ ఆర్ట్‌లో డిగ్రీ లేదా ఆర్ట్స్/ సైన్స్/ కంప్యూటర్ అప్లికేషన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
 దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
 రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: సెప్టెంబర్ 1
 సీఈఈడీ పరీక్ష తేది: డిసెంబర్ 7
 వెబ్‌సైట్: www.gate.iitb.ac.in/ceed2015
 
 ఇఫ్లూ - దూరవిద్యా ప్రోగ్రాములు
 హైదరాబాద్‌లోని ది ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ) దూర విద్యా విధానంలో పీజీ, పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
 కోర్సుల వివరాలు
  ఎంఏ (ఇంగ్లిష్), వ్యవధి: రెండేళ్లు.
 అర్హత: ఇంగ్లిష్ ప్రధాన సబ్జెక్టుగా ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి.
  పీజీ డిప్లొమా ఇన్ ది టీచింగ్ ఆఫ్ ఇంగ్లిష్
 వ్యవధి: ఏడాది.
 అర్హత: ఇంగ్లిష్ టీచింగ్‌లో పీజీ సర్టిఫికెట్ ఉండాలి.
  పీజీ సర్టిఫికెట్ ఇన్ ది టీచింగ్ ఆఫ్ ఇంగ్లిష్
 అర్హత: ఇంగ్లిష్ లేదా అలైడ్ సబ్జెక్టుల్లో (లింగ్విస్టిక్స్, ఎడ్యుకేషన్, సైకాలజీ, మాస్ కమ్యూనికేషన్) మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. దరఖాస్తులు వెబ్‌సైట్‌లో లభిస్తాయి.
 దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: అక్టోబర్ 31
 వెబ్‌సైట్: www.efluniversity.ac.in
 
 జనరల్ నాలెడ్జ్:  పాలిటీ: భారత రాజ్యాంగం
 1949: నవంబర్ 26న పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించింది. (మొదట రాజ్యాంగంలో
 395 ప్రకరణలు, 8 షెడ్యూళ్లు ఉన్నాయి. రాజ్యాంగ రచనకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం పట్టింది)
 1950: జనవరి 24న రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశం. ఈ సమావేశంలో జాతీయ గీతాన్ని, జాతీయ గేయాన్ని ఆమోదించారు.
 1950: జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.
 రాజ్యాంగ పరిషత్‌కు రాజ్యాంగ సలహాదారు: బెనగల్ నర్సింగరావు
  రాజ్యాంగాన్ని రూపొందించడానికి రాజ్యాంగ పరిషత్ 13 కమిటీలను ఏర్పాటు చేసింది.
 
 భారతదేశ చరిత్రలో ప్రముఖ యుద్ధాలు
 యుద్ధం జరిగిన సం॥                            వివరాలు
 మూడో పానిపట్టు యుద్ధం    1761    అహ్మద్ షా అబ్దాలీ చేతిలో మరాఠాల ఓటమి, పతనం
 మొదటి ఆంగ్లో-మైసూర్ యుద్ధం 1767-69    వారన్ హేస్టింగ్‌‌స హయాంలో బ్రిటీషు సైన్యానికి, మైసూర్     
పాలకుడైన హైదరాలీకి  మధ్య ..
రెండో ఆంగ్లో - మైసూర్ యుద్ధం 1780-84 బ్రిటీషు సైన్యానికి, హైదరాలీకి మధ్య. తరువాత  యుద్ధంలోకి టిప్పు సుల్తాన్ ప్రవేశించాడు
 మూడో ఆంగ్లో - మైసూర్ 1790-92    {బిటీష్ సైన్యం చేతిలో టిప్పుసుల్తాన్ ఓటమి
 నాలుగో ఆంగ్లో - మైసూర్ 1799 వెల్లస్లీ హయాంలో బ్రిటీష్ సైన్యం చేతిలో టిప్పు సుల్తాన్ ఓటమి,

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement