పోలీస్‌ స్టోరీ :సాయికుమార్ | sai kumar meets to police department as a sakshi reporter | Sakshi
Sakshi News home page

పోలీస్‌ స్టోరీ :సాయికుమార్

Published Sat, Nov 22 2014 11:21 PM | Last Updated on Mon, Sep 17 2018 6:20 PM

పోలీస్‌ స్టోరీ :సాయికుమార్ - Sakshi

పోలీస్‌ స్టోరీ :సాయికుమార్

ఒంటి మీదకు ఖాకీ చొక్కా రాగానే వాళ్లు లోడ్ చేసిన గన్‌లలా మారిపోతారు. సిట్యుయేషన్  కంట్రోల్ తప్పితే.. తోలుబెల్టుతో నడుం బిగించి రంగంలోకి దూకుతారు. లూటీగాళ్లకు లాఠీలతో బుద్ధి చెప్తారు. మొండిఘటాలపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారు. మాటల్లో కేర్‌లెస్‌గా ఉన్నా.. కేసులు ఛేదించడంలో మాత్రం వీళ్లు మార్వలెస్.

లాకప్‌డెత్‌లు, ఎన్‌కౌంటర్లు.. ఖాకీలోని కాఠిన్యాన్ని కళ్లముందుంచినా..! కామన్‌మెన్ కంటి నిండా నిద్రపోవడానికి కారణం మాత్రం లా అండ్ ఆర్డర్‌ను ఆర్డర్‌లో ఉంచుతున్న పోలీసులే. ఆల్వేస్ ఆన్ డ్యూటీలో ఉండే ఈ పోలీసులను సాక్షి సిటీప్లస్ తరఫున ‘స్టార్ రిపోర్టర్’గా నటుడు సాయికుమార్ పలకరించారు. నీతికి, న్యాయానికి, ధర్మానికి రక్షణగా నిలుస్తున్న ఈ నాలుగో సింహం కనిపించని మనసును మన ముందుంచారు.

సాయికుమార్: ‘పీ ఫర్ పొలైట్‌నెస్, ఓ ఫర్ ఒబీడియెన్స్, ఎల్ ఫర్ లాయల్టీ, ఐ ఫర్ ఇంటిగ్రిటీ, సీ ఫర్ కరేజ్, ఈ ఫర్ ఎమోషన్స్ అండ్ ఎఫీషియెన్సీ దటీజ్ పోలీస్..’,  ‘కనిపించే మూడు సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని ఆ నాలుగో సింహమేరా పోలీస్’. ఈ డైలాగ్ పోలీస్‌స్టోరీ సినిమాలోనిది.

ఆ సినిమా వచ్చి 18 ఏళ్లు దాటినా ఇప్పటికీ తెరపై పోలీస్ పాత్ర కనిపిస్తే ప్రేక్షకులకు ఈ డైలాగ్ గుర్తొస్తుంది. ఇలా ఎన్ని డైలాగులు చెప్పినా నేను సినిమా పోలీస్‌ను మాత్రమే. అంటే రీల్ పోలీస్ అన్నమాట. మీరంతా రియల్ పోలీసులు. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది. చెప్పండి సార్.. ఈ ప్రొఫెషనల్‌లో చేరి ఎన్నాళ్లయింది..?

నారాయణ గౌడ్: కానిస్టేబుల్‌గా నాకు 29 ఏళ్ల అనుభవం ఉంది సార్.

సాయికుమార్: వాహ్.. ఇక్కడున్న వారిలో మీరే సీనియర్ అనుకుంటా..?

నారాయణ గౌడ్: అవును సార్.

సాయికుమార్: పోలీస్ కావడానికి మీకు ఆదర్శం ఎవరు..?

నారాయణ గౌడ్: చిన్నప్పుడు మా ఊరికి ఓ పోలీసాయన బుల్లెట్ మీద వచ్చేవాడు. అతన్ని చూసినప్పుడల్లా పోలీస్ కావాలని అనుకునేవాడ్ని. బుల్లెట్ వేసుకుని తిరగొచ్చు కదా ! అని (నవ్వుతూ..)

సాయికుమార్: మరి బుల్లెట్ ఎక్కారా?

నారాయణ గౌడ్: లేదు సార్.

సాయికుమార్: సో మిమ్మల్ని ఒకసారి బుల్లెట్‌పై తిప్పాలన్నమాట. మరి ప్రమోషన్ మాటేమిటి?

నారాయణ గౌడ్: ఇంకా రాలేదు. తెలంగాణ రాష్ట్రంలో అయినా మాలాంటి వాళ్లకు న్యాయం జరుగుతుందేమో చూడాలి.

సాయికుమార్: కొత్త ప్రభుత్వం మీకు ఇన్నోవాలు ఇచ్చినట్టు ప్రమోషన్లు కూడా త్వరగా ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇక డెరైక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా మీకన్నా వయసులో, అనుభవంలో చిన్నవాళ్లు ప్రొఫెషన్‌లో పెద్ద పొజిషన్‌లోకి వస్తుంటారు. వారికి సెల్యూట్ చేసినప్పుడు ఎలా అనిపిస్తుంది ?

సత్యనారాయణ (ఎస్‌ఐ): అలా ఏం ఉండదు సార్. ఏ రంగంలో అయినా అనుభవమే గొప్పది. స్థాయిలను పక్కనపెట్టి వారికి మర్యాదిస్తాం.

సాయికుమార్: గుడ్.. మీరు పోలీస్ అవ్వడానికి కారణం?

సత్యనారాయణ: పోలీస్ డ్రెస్‌ని చూసే ఇన్‌స్పైర్ అయ్యాను.

సాయికుమార్: అవును.. నేను సినిమా కోసం ఖాకీ డ్రెస్ వేసుకోగానే ఏదో తెలియని ఫీలింగ్, పోలీస్ బిహేవియర్ అలా వచ్చేస్తుంది.

బి.కె.నాయక్: ఆ డ్రెస్‌కున్న పవర్ అలాంటిది. పోలీసులు చెబితే ప్రజలు త్వరగా వింటారనే నేను పోలీస్ అయ్యాను. ప్రజలకు సాయం చేయడానికి ఇంతకన్నా గొప్ప ప్రొఫెషన్ ఉండదు.

సాయికుమార్: అలా సాయం చేసిన సందర్భమేదైనా ఉందా?

బి.కె.నాయక్: రోడ్డు ప్రమాదాలకు గురైన వారిని సమయానికి ఆస్పత్రికి చేర్చడం. తప్పిపోయిన వారిని వారిళ్లకు చేర్చడం అలాంటివే కదా సార్. మా డ్యూటీ అయిపోయాక కూడా ఆత్రుతగా పనిచేసిన సందర్భాలెన్నో ఉన్నాయి.

లాల్ మదార్ (ఎస్‌ఐ): ఎన్ని మంచి పనులు చేసినా పోలీస్ అనే పదానికి పబ్లిక్‌లో పాజిటివ్ రెస్పాన్స్ తక్కువే..!

సతీష్‌కుమార్: నిజమే. ముఖ్యంగా సినిమాల్లో పోలీసులను మరీ నెగటివ్‌గా చూపిస్తున్నారు. దాని ప్రభావం మాపై ఉంది.

సాయికుమార్: ఓకే.. సినిమా ప్రస్తావన వచ్చింది కాబట్టి.. పోలీస్ క్యారెక్టర్లు చూసినప్పుడు ‘అబ్బా.. మేం కూడా ఇలా ఉంటే బాగుండు’ అని కానీ.. ‘బాబోయ్ మేం ఇలా ఉండలేం’ అని కానీ అనిపిస్తుంటుందా?

మోహన్: కొన్ని స్టోరీలు మాకు చాలా దగ్గరగా ఉంటాయి. కొన్ని కొంచెం ఓవర్‌గా ఉంటాయి.

సాయికుమార్: ఓకే.. నగరంలో అమ్మాయిలకు రక్షణ కరవవుతుందని టాక్.

సత్యనారాయణ: దానికోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. ‘షీ టీం’ అనే పేరుతో ప్రత్యేక కమిటీ వేశాం.

సాయికుమార్: సరదాగా అడుగుతున్నాను.. మన పోలీసులు పొట్టలు పెంచేస్తున్నారని కామెంట్?బిర్యానీలు ఎక్కువగా తినేసున్నారని (నవ్వుతూ...)

వెంకటయ్య: వేళకు తిండి తింటే పొట్ట రాదన్న విషయం మీక్కూడా తెలుసు కదా సార్. మా ప్రాబ్లమ్ కూడా అదే.

సాయికుమార్: మీ వీక్లీ ఆఫ్ సంగతేంటి?

సతీష్‌కుమార్: స్టాఫ్ ప్రాబ్లమ్. ఏ గంట తీరిక దొరికితే ఆ టైమ్‌నే సెలవుగా భావించాలి.

లాల్‌మదార్: ఎన్ని ఇబ్బందులున్నా.. యూనిఫాం ఒంటి మీదకు రాగానే ఎక్కడ లేని ఓపికా వచ్చేస్తుంది.

సాయికుమార్: ఇది ప్రజల ప్రశ్న.. పోలీసులు లంచం లేకుండా పని చేయడం లేదని అంటుంటారు..! ఈ మధ్యే ఓ డైలాగ్ కూడా వచ్చింది. వందకు ఫోన్ చేస్తే కాదు... వంద కొడితే పోలీసులు వస్తున్నారని..!

నారాయణ గౌడ్: మంచివాళ్లు, చెడ్డవాళ్లు అన్ని రంగాల్లో ఉంటారు. అలాగని అందరినీ ఒకే గాటన కడితే ఎలా సార్.

సాయికుమార్: ఓకే చివరి ప్రశ్న. ప్రజల్లో మీపై ఉన్న ఆ నెగటివ్ ఒపీనియన్ పోవాలంటే ఏం చేయాలి?

లాల్ మదార్: అది పోదు సార్. ఎందుకంటే పోలీస్ తండ్రిలాంటి వాడు. ముద్దు చేసి హద్దుల్లో పెట్టడం తండ్రి లక్షణం కాదు. కన్నెర్ర చేయకపోతే ప్రజలు సక్రమంగా నడవరు. తండ్రిపై బిడ్డలకుండే బెరుకు, భయం ఎలాంటిదో.. పోలీసుల విషయంలో ప్రజలకుండే ఫీలింగ్ కూడా అలాంటిదే.

బాలరాజ్: జబ్బు చేసినప్పుడు ఆస్పత్రికి ఎలాగైతే పరుగు పెడతారో.. ఏదైనా సమస్య వచ్చినప్పుడు అలాగే పోలీస్‌స్టేషన్‌కు రావాలి.

సాయికుమార్: ఆ రోజులు రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. బై..

ప్రజెంటర్: భువనేశ్వరి
ఫొటోలు: ఎన్.రాజేష్‌రెడ్డి


సాయికుమార్: ఓకే మీ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది? ‘సెంటిమెంట్ ఉంటే పోలీస్ కావొద్దు, పోలీస్ అయితే సెంటిమెంట్ ఉండకూడదు’ అని పోలీస్‌స్టోరీలో ఒక డైలాగ్ ఉంది.

లాల్ మదార్:  ఈ ప్రొఫెషన్‌లో ఫ్యామిలీలైఫ్‌ని బాగా మిస్ అవుతాం. నాకు ఏడాది దాటిన పిల్లాడు ఉన్నాడు. వేళాపాళా లేని డ్యూటీలతో ఒక్కోసారి వాడు నన్ను గుర్తుపట్టడం లేదు.

బి.కె.నాయక్: సెక్యూరిటీ లేని లైఫ్. మన ఐపీఎస్ వ్యాస్ గారు ఎల్బీ స్టేడియంలో మార్నింగ్ వాక్ చేస్తున్న టైంలో హత్యకు గురయ్యారు.

సాయికుమార్: యా.. హి ఈజ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ. ఒకప్పటికీ ఇప్పటికీ క్రైమ్‌లో వచ్చిన మార్పులేంటో చెప్పగలరా?

లాల్ మదార్: టెక్నాలజీని బాగా వాడుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement