పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలో అత్యధిక మార్కులు ఎలా ? | how to get high marks Police Constable exam ? | Sakshi
Sakshi News home page

పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలోఅత్యధిక మార్కులు ఎలా ?

Published Fri, Aug 8 2014 1:06 AM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM

పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలో అత్యధిక మార్కులు ఎలా ? - Sakshi

పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలో అత్యధిక మార్కులు ఎలా ?

కాంపిటీటివ్ కౌన్సెలింగ్ : పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలో భారతీయ చరిత్ర, సంస్కృతి, జాతీయోద్యమాల నుంచి ఎలాంటి ప్రశ్నలు వస్తాయి? వీటిలో అత్యధిక మార్కులు సాధించడం ఎలా?
 -కె.సుమలత, సరూర్‌నగర్
 
 పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలో అడిగే ఏడు విభాగాల్లో ఒకటి.. భారతదేశ చరిత్ర-సంస్కృతి-జాతీయోద్యమం. ఈ విభాగాన్ని పరిశీలిస్తే భారతదేశ చరిత్రలో మూడు భాగాలు ఉంటాయి. అవి.. ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక చరిత్ర. ఈ క్రమంలో హరప్పా నాగరికత నుంచి వేద యుగం, మౌర్యులు, గుప్తులు, శాతవాహనులు, కాకతీయుల కాలం నాటి సాంఘిక, రాజకీయ, ఆర్థిక, మత పరిస్థితులను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. అరబ్బులు, మొఘల్ సామ్రాజ్యం, బహమనీ సుల్తానులు, విజయనగర రాజులు, ప్రముఖ కవులు - వారి రచనల వరకు అన్ని అంశాలను చదవాలి.
 
 భారత జాతీయోద్యమంలో భాగంగా 1857 సిపాయిల తిరుగుబాటు, ఈస్టిండియా పాలన, భారత జాతీయ కాంగ్రెస్, అతివాదులు, మితవాదులు, బెంగాల్ విభజన, వందేమాతర ఉద్యమం, జలియన్ వాలాబాగ్ ఉదంతం, గాంధీజీ భారతదేశానికి రాక, దండి మార్చ్, సహాయ నిరాకరణోద్యమం, చౌరీచౌరా సంఘటన, భారత జాతీయ సైన్యం, క్విట్ ఇండియా ఉద్యమం, భారతదేశానికి సైమన్ కమిషన్ రాక, 1909 సంస్కరణలు, 1919 సంస్కరణలు, రౌలత్ చట్టం, ద్విజాతి సిద్ధాంతం, జాతీయోద్యమంలో పత్రికల పాత్ర, ప్రముఖుల నినాదాలు, స్వాతంత్య్రోద్యమంలో గాంధీజీ పాత్ర వంటి అంశాలను అధ్యయనం చేయాలి.
 
 పోలీస్ కానిస్టేబుల్ -2012 పరీక్షలో అడిగిన కొన్ని ప్రశ్నలు:
 1. ఏ యుద్ధంతో విజయనగర సామ్రాజ్యం అంతరించింది?
 ఎ) తళ్లికోట యుద్ధం బి) పానిపట్టు యుద్ధం
 సి) మైసూర్ యుద్ధం డి) వెల్లూర్ యుద్ధం
 సమాధానం: ఎ
 2. శాతవాహన వంశాన్ని ఎవరు స్థాపించారు?
 ఎ)  హాలుడు బి) యజ్ఞశ్రీ సి) శ్రీముఖుడు డి) శాతకర్ణి
 సమాధానం: సి
 3. జలియన్ వాలాబాగ్ మారణకాండ ఎప్పుడు జరిగింది?
 ఎ) 1918     బి) 1919      సి) 1920     డి)1921
 సమాధానం: బి
    ఇన్‌పుట్స్: బి.ఉపేంద్ర, డెరైక్టర్,
 క్యాంపస్ స్టడీసర్కిల్, హైదరాబాద్
 
 ఎడ్యూ న్యూస్: ఐఈఎల్‌టీఎస్ స్కాలర్‌షిప్స్ అందజేత
 ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ లాంగ్వే జ్ టెస్టింగ్ సిస్టమ్(ఐఈఎల్‌టీఎస్) ద్వారా వివిధ కోర్సుల్లో ప్రవేశం కల్పించేందుకు ఈ ఏడాది నుంచి మరికొన్ని దేశాలు ముందుకొచ్చాయని ఐఈఎల్‌టీఎస్ ఎగ్జామినేషన్ ఇండియా, కస్టమర్ సర్వీసెస్ సౌత్ ఆసియా డెరైక్టర్ సారా డెవెరాల్ తెలిపారు. ఎనిమిది మంది భారతీయ విద్యార్థులకు గురువారం నగరంలో బ్రిటీష్ కౌన్సిల్ నుంచి ఐఈఎల్‌టీఎస్ స్కాలర్‌షిప్‌లను అందజేశారు.
 
 ఈ సందర్భంగా డెవెరాల్ మాట్లాడుతూ... అంతర్జాతీయంగా 135 దేశాల్లోని 9000 సంస్థలు ఐఈఎల్‌టీఎస్ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నాయని చెప్పారు. ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు స్కాలర్‌షిప్‌లు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఎంపికైన విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.3 లక్షలు ఉపకార వేతనంగా ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ (హైదరాబాద్) ఆండ్రూ మెక్‌అలిస్టర్ తదితరులు పాల్గొన్నారు.  
 
 జాబ్స్, అడ్మిషన్‌‌స అలర్‌‌ట్స
 గెయిల్ ఇండియా లిమిటెడ్: గెయిల్ ఇండియా లిమిటెడ్ సీనియర్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతోంది.
 ఖాళీల సంఖ్య: 61
 విభాగాలు: కెమికల్, పీసీ ఆపరేషన్స్, మెకానికల్ - పీసీ ఓఅండ్‌ఎం, ఎలక్ట్రికల్ - పీసీ ఓఅండ్‌ఎం, ఇన్‌స్ట్రుమెంటేషన్ - పీసీ ఓఅండ్‌ఎం, మెకానికల్ - పైప్‌లైన్ ఓఅండ్‌ఎం, ఎలక్ట్రికల్ - పైప్‌లైన్ ఓఅండ్‌ఎం, ఇన్‌స్ట్రుమెంటేషన్ - పైప్‌లైన్ ఓఅండ్‌ఎం
 అర్హతలు: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత.
 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్: ఆగస్టు 11 - 25.
 వెబ్‌సైట్: www.gail.nic.in
 
 భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్
 భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
  డిప్యూటీ ఇంజనీర్ (సివిల్)
 అర్హత:  మొదటి శ్రేణిలో బీఈ/బీటెక్ (సివిల్) ఉత్తీర్ణతతోపాటు సంబంధిత రంగంలో ఏడాది అనుభవం ఉండాలి.
  డిప్యూటీ ఇంజనీర్ (ఎలక్ట్రికల్)
 అర్హతలు: మొదటి శ్రేణిలో బీఈ/బీటెక్ (ఎలక్ట్రికల్) ఉత్తీర్ణతతోపాటు సంబంధిత రంగంలో ఏడాది అనుభవం ఉండాలి.
 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: ఆగస్టు 20.
 వెబ్‌సైట్: www.bel-india.com
 
 నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్
 కాలికట్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింది కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
  పీజీ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్ సిస్టమ్ డిజైన్
 అర్హత: బీఈ/ బీటెక్ (ఈఈ/ ఈఈఈ/ ఐఅండ్‌సీ/ ఈసీ/ ఏఈ అండ్ ఐ/ ఇన్‌స్ట్రుమెంటేషన్/ మెకట్రానిక్స్/ సీఎస్‌ఈ).
  అడ్వాన్స్‌డ్ డిప్లొమా - పీఎల్‌సీ/ స్కాడా/ డీసీఎస్
 అర్హత: డిప్లొమా, ఎమ్మెస్సీ (ఇన్‌స్ట్రుమెంటేషన్/ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్) లేదా బీఈ/ బీటెక్ ఉండాలి.
 వెబ్‌సైట్: http://calicut.nielit.in
 
 అన్నా యూనివర్సిటీ
 చెన్నైలోని అన్నా యూనివర్సిటీ ఎంఎస్, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ల్లో ప్రవేశానికి దరఖాస్తులను కోరుతోంది.
 విభాగాలు: ఇంజనీరింగ్/టెక్నాలజీ, సైన్‌‌స, హ్యుమానిటీస్, మేనేజ్‌మెంట్, ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్
 అర్హతలు: సంబంధిత విభాగంలో 55 శాతం మార్కులతో ఎంఎస్ ప్రోగ్రామ్‌కు బీఈ/బీటెక్, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లకు మాస్టర్‌‌స డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
 దరఖాస్తులకు చివరి తేది: ఆగస్టు 30
 వెబ్‌సైట్: http://cfr.annauniv.edu/
 
 జనరల్ నాలెడ్‌‌జ
 పాలిటీ: భారత రాజ్యాంగం  
 ముఖ్యమైన కమిటీలు        నాయకత్వం
 కేంద్ర అధికారాలు        జవహర్‌లాల్ నెహ్రూ
 నిబంధనల కమిటీ        డా॥రాజేంద్రప్రసాద్
 రాష్ట్రాలకు సంబంధించిన కమిటీ    సర్దార్ వల్లభాయ్ పటేల్
 ప్రాథమిక హక్కులు        సర్దార్ వల్లభాయ్ పటేల్
 స్టీరింగ్ కమిటీ            డా॥కె.ఎం. మున్షీ
 మైనారిటీల కమిటీ        హెచ్.సి. ముఖర్జీ
 సలహా సంఘం        సర్దార్ వల్లభాయ్  పటేల్
 
 జాతీయోద్యమ కాలం నాటి పత్రికలు
 పత్రిక పేరు            సంవత్సరం, ప్రదేశం    వ్యవస్థాపకుడు
 నవసాహిత్యమాల    అనంతపురం    విద్వాన్ విశ్వం, తరిమెల నాగిరెడ్డి
 కృష్ణా పత్రిక    1902, మచిలీపట్నం    కొండా వెంకటప్పయ్య
 ఆంధ్ర పత్రిక    1908, బొంబాయి    కాశీనాథుని నాగేశ్వరరావు
 వార్త పత్రిక    1925,       తెనాలి    కొమ్మూరి వెంకటరామయ్య
 గోల్కొండ పత్రిక    1926                           సురవరం ప్రతాపరెడ్డి
 మీజాన్ పత్రిక    1943,       హైదరాబాద్        అడవి బాపిరాజు
 స్వరాజ్య పత్రిక                ----                      గాడిచర్ల హరిసర్వోత్తమరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement