Indian History
-
సీఎం పీఠంపై మహిళా శక్తి
న్యూఢిల్లీ: ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ఆతిశి దేశ చరిత్రలో 17వ మహిళా ముఖ్యమంత్రి కావడం విశేషం. అంతేకాదు ఇప్పటిదాకా ఢిల్లీ సీఎంగా పనిచేసిన మహిళల్లో అత్యంత పిన్నవయసు్కరాలు అతిశి. ఆమె వయసు కేవలం 43 ఏళ్లు. ప్రస్తుతం దేశంలో ఉన్న మహిళా సీఎంలలో రెండో సీఎం ఆతిశి. పశ్చిమ బెంగాల్ సీఎంగా మమతా బెనర్జీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మహిళా ముఖ్యమంత్రులు సుచేతా కృపలానీ స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రిగా సుచేతా కృపలానీ రికార్డు సృష్టించారు. ఆమె 1963 నుంచి 1967 దాకా ఉత్తరప్రదేశ్ సీఎంగా పనిచేశారు. నందిని శతపథి దేశంలో రెండో మహిళా సీఎం నందిని శతపథి. 1972 నుంచి 1976 వరకు ఒడిశా ముఖ్యమంత్రిగా సేవలందించారు. ఇందిరా గాందీకి ఆమె అత్యంత సన్నిహితురాలు. శశికళ కకోద్కర్ మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ నేత శశికళ కకోద్కర్ 1973 నుంచి 1979 దాకా కేంద్ర పాలిత ప్రాంతమైన గోవా, డయ్యూడామన్కు రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. 1987లో గోవాకు రాష్ట్ర హోదా లభించింది. అన్వర తైమూర్ దేశంలో మొదటి ముస్లిం మహిళా ముఖ్యమంత్రిగా అన్వర తైమూర్ రికార్డుకెక్కారు. ఆమె 1980 నుంచి 1981 దాకా అస్సాం సీఎంగా పనిచేశారు. వి.ఎన్.జానకి రామచంద్రన్ ప్రఖ్యాత తమిళ నటుడు, దివంగత ముఖ్యమంత్రి ఎంజీఆర్ భార్య వి.ఎన్.జానకి రామచంద్రన్ తమిళనాడు తొలి మహిళా సీఎంగా చరిత్ర సృష్టించారు. 1988లో భర్త ఎంజీఆర్ మరణం తర్వాత కేవలం 23 రోజులపాటు సీఎంగా పనిచేశారు. జె.జయలలిత ఎంజీఆర్ శిష్యురాలు, డీఎంకే నేత, ప్రముఖ సినీ నటి జె.జయలలిత ఆరు పర్యాయాలు తమిళనాడు సీఎంగా సేవలందించారు. మొత్తం 14 ఏళ్లకుపైగా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగారు. మాయావతి బహుజన సమాజ్ పారీ్ట(బీఎస్పీ) అధినేత మాయావతి నాలుగు పర్యాయాలు ఉత్తరప్రదేశ్ సీఎంగా వ్యవహరించారు. మొత్తం ఏడు సంవత్సరాల పాటు పదవిలో ఉన్నారు. రాజీందర్ కౌర్ భట్టాల్ పంజాబ్‌కు ఇప్పటిదాకా ఏకైక మహిళా సీఎంగా రాజీందర్ కౌర్ భట్టాల్ రికార్డుకెక్కారు. ఆమె 1996 నుంచి 1997 దాకా పంజాబ్ సీఎంగా పనిచేశారు. రబ్రీ దేవి ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ జైలు పాలు కావడంతో ఆయన భార్య రబ్రీ దేవి 1997లో బిహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బిహార్‌లో ఇప్పటివరకు ఏకైక మహిళా సీఎం రబ్రీ దేవి. సుష్మా స్వరాజ్ ఢిల్లీ తొలి మహిళా సీఎం సుష్మా స్వరాజ్. 1998లో ఆమె 52 రోజులపాటు ఈ పదవిలో కొనసాగారు. షీలా దీక్షిత్ ఢిల్లీ రెండో మహిళా సీఎం షీలా దీక్షిత్. ఢిల్లీలో అత్యధిక కాలం పనిచేసిన సీఎంగా రికార్డు నెలకొల్పారు. ఆమె 1998 నుంచి 2013 దాకా 15 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఉమా భారతి రామ జన్మభూమి ఉద్యమ నేత, ఫైర్‌బ్రాండ్ ఉమా భారతి 2003 నుంచి 2004 దాకా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా సేవలందించారు. వసుంధర రాజే గ్వాలియర్ మహారాజు జీవాజిరావు సింధియా, విజయరాజే సింధియా దంపతుల కుమార్తె అయిన వసుంధర రాజే రెండు పర్యాయాల్లో 10 సంవత్సరాలపాటు రాజస్తాన్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ 2011 నుంచి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్నారు. ఆనందిబెన్ పటేల్ గుజరాత్‌కు ఏకైక మహిళా ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్. నరేంద్ర మోదీ తర్వాత ఆమె 2014 నుంచి 2016 దాకా సీఎంగా పనిచేశారు. మహబూబా ముఫ్తీ పీపుల్స్ డెమొక్రటిక్ పారీ్ట(పీడీపీ) నేత మహబూబా ముఫ్తీ జమ్మూకశ్మీర్ తొలి మహిళా సీఎంగా చరిత్ర సృష్టించారు. 2016 నుంచి 2018 వరకు సీఎంగా వ్యవహరించారు. ఆతిశి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయడంతో నూతన ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. మొదటి వరుస: షీలా దీక్షిత్, ఉమా భారతి, ఆనందీబెన్ పటేల్, మెహబూబా ముఫ్తీ, జానకీ రామచంద్రన్, మాయావతి రెండో వరుస: నందినీ శతపథి, అన్వర తైమూర్, రబ్డీదేవి, శశికళా కకోడ్కర్, వసుంధరా రాజె సింధియామూడో వరుస: సుష్మా స్వరాజ్, సుచేతా కృపలానీ, రాజీందర్ కౌర్, మమతా బెనర్జీ, జయలలిత. -
ఇంత దారుణంగా మాట్లాడిన ప్రధాని దేశ చరిత్రలోనే లేరు: ప్రియాంక
న్యూఢిల్లీ/గోరఖ్‌పూర్(యూపీ): ప్రతిపక్ష ఇండియా కూటమినుద్దేశించి ‘ముజ్రా’అంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించడంపై కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా తీవ్రంగా మండిపడ్డారు. ఇంత దారుణంగా మాట్లాడిన ప్రధానమంత్రి దేశ చరిత్రలోనే లేరని పేర్కొన్నారు. ‘ప్రధానమంత్రి పదవిని దేశం యావత్తూ గౌరవిస్తుంది. అటువంటి పదవికున్న ఔన్నత్యాన్ని కాపాడండి’అని మోదీకి హితవు పలికారు. యూపీలోని గోరఖ్‌పూర్‌లో శనివారం ఆమె మాట్లాడారు. ‘బిహార్‌లో ప్రధాని మోదీ ఏమన్నారో విన్నారా? దేశ చరిత్రలోనే అటువంటి భాష ను వాడిన ప్రధాని మరొకరు లేరు. అటువంటి మాటలు ప్రధాని నోట రాకూడదు. సహనం కోల్పోయిన మోదీ దేశానికి, దేశ ప్రజలకు ప్రతినిధిననే విషయం మర్చిపోతున్నారు. ఆయన అసలు రూపం బట్టబయలైంది’అని ప్రియాంక అన్నారు. ‘దేశమే తన కుటుంబమని చెప్పుకుంటున్న వ్యక్తి అనాల్సిన మాటలు కావవి. కుటుంబసభ్యులు పరస్పరం గౌరవించుకోవాలి. ఎప్పటికీ అది అలాగే కొనసాగాలి’ అని ప్రియాంక అన్నారు. -
రాజపుత్రుల చిత్ర విచిత్రాలు
రాజకోట రహస్యాలు ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తాయి. పూర్వపు చక్రవర్తుల విపరీత మనస్తత్వాలు, విచారకర గుణాలు, దోషాలు, చిన్నపాటి పాపాలు, మహాపరాధాలు, చిలిపి చేష్టలు, సిగ్గుపడవలసిన ప్రవర్తనలు, వారి అపకీర్తుల గురించి ఎప్పుడో దివాన్ జర్మనీ దాస్ ఆసక్తికరంగా రాశారు. అందులో ఉన్నవన్నీ, ఒకవేళ అవి నిజమే అయినా, నమ్మశక్యంగా లేనివి! అయితే భారత రాజపుత్రుల లాగానే పాకిస్తాన్ రాజపుత్రులు కూడా ఉండేవారా? వారికీ వీరికీ ఏమాత్రం తేడా లేదని వెల్లడిస్తుంది ‘డీథ్రోన్డ్’ పుస్తకం. భారత చరిత్ర మీద పరిశోధించిన ఆస్ట్రేలియా రచయిత జాన్ జుబ్రిచికీ రాసిన ఈ పుస్తకం ఎన్నో వింత సంగతులను వెల్లడిస్తుంది. రాజకోట రహస్యాలు నన్ను అమితంగా సమ్మోహన పరుస్తాయి. పూర్వపు చక్రవర్తుల విపరీత మనస్తత్వాలు, విచారకర గుణాలు, దోషాలు, చిన్నపాటి పాపాలు, మహాపరాధాలు, చిలిపి చేష్టలు, సిగ్గుపడవలసిన ప్రవర్త నలు, వారి అపకీర్తుల పట్ల నాలో ఆసక్తి జనించడానికి కారణమైన వారు మహారాజా దివాన్ జర్మనీ దాస్. నేను కౌమార ప్రాయంలో ఉండగా తొలిసారి ఆయన పుస్తకం చదువుతూ వదల్లేకపోయాను. అందులో ఉన్నవన్నీ, ఒకవేళ అవి నిజమే అయినా, నమ్మశక్యంగా లేనివి! ఉదాహరణకు పటియాలా మహారాజులలో ఒకరు తమ రాచ ఠీవికి చిహ్నంగా స్తంభించిన తమ పురుషాంగాన్ని పురవీధులలో ప్రదర్శించుకుంటూ ఊరేగింపుగా ముందుకు సాగిపోయేవారట. ఉక్క పోతల వేసవి రాత్రులలో ఆయన మహారాణులు, ఉంపుడుగత్తెలు అంతఃపుర కొలనులో తేలియాడే భారీ మంచు దిబ్బలపై శృంగార నాట్య విన్యాసాలతో విహరించేవారట. పాకిస్తాన్ వైపున ఉన్న రాజ కుటుంబీకులు కూడా ఇలానే ఉండేవారా, లేకుంటే ఇందుకు భిన్నంగానా అని అప్పుడు నాకొక ఆశ్చర్యంతో కూడిన సందేహం కలిగేది. అర్ధ శతాబ్దం తర్వాత ఇప్పుడు, ఆనాటి నా ఆశ్చర్యంతో కూడిన సందేహం జాన్ జుబ్రిచికీ పుస్తకం ‘డీథ్రోన్డ్’తో నివృత్తి జరిగింది. వారికీ వీరికీ ఏమాత్రం తేడా లేదు. కాబట్టి వారి చిత్ర విచిత్రాలతో ఈ ఉదయం నన్ను మీకు వేడుకను చేయనివ్వండి. నాల్గవ సాదిఖ్ ముహమ్మద్ ఖాన్... బహావల్‌పుర్ నవాబు. ఆయన తన మూలాలు ముహమ్మద్ ప్రవక్త సంతతిలో ఉన్నాయని చెప్పు కొంటారు. అయితే ఆయన బూట్లు, ప్యాంట్లు, సుతిమెత్తని నూలు గుడ్డతో నేసిన మందపాటి చొక్కాలు ధరించి రాజప్రాసాద క్రికెట్ మైదానంలో కనిపిస్తూ తనకు గల ఆ ప్రత్యేక ఐరోపా క్రీడా వస్త్రధారణ అభిరుచుల పట్ల గర్వభూయిష్టంగా ఉండేవారని జుబ్రిచికీ రాశారు. ‘‘మహా ధన సంపన్నుడై, తెల్లజాతి మగువల పట్ల అమిత మక్కు వను కలిగిన ఈ నవాబు (ఆయన భార్యలలో ముగ్గురు యూరోపి యన్లు) 1882లో అత్యంత గోప్యంగా పర్షియాలో ప్రసిద్ధి చెందిన ‘లా మేజన్ క్రిస్టోఫ్లా’ గృహ సామగ్రి సంస్థ నుంచి ఖరీదైన కలపమంచాన్ని 290 కిలోల నాణ్యమైన వెండి అలంకరణలతో తన అభీష్టానికి అనుగుణంగా తయారు చేయించుకున్నారు. మంచానికి నలువైపులా మంచంకోళ్ల స్థానంలో సహజమైన జుట్టు; కదలిక కలిగిన కళ్లూ, చేతులూ; ఆ చేతులతో విసనకర్రలు, గుర్రపు తోకలు పట్టుకుని ఉన్న నగ్న స్త్రీల జీవమెత్తు కాంస్య విగ్రహాలు ఉండేవి. ఆ నలుగురు నగ్న స్త్రీలు ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, గ్రీసు దేశాలకు ప్రాతినిధ్యం వహించేవారు. యంత్ర శక్తి కలిగిన ఆ మంచం... నవాబు ఆదేశాలను అనుసరించి ఆ నగ్న దేహాలలో చలనం తెప్పించేది. ఫ్రెంచి సంగీతకారుడు గునోద్ సృష్టించిన ప్రఖ్యాత సంగీత రూపకం ‘ఫౌద్’ తన ముప్పై నిముషాల నిడివిని పూర్తి చేస్తుండగా మాగన్నుగా పడుతున్న నిద్రలో నవాబు సరసంగా కన్ను గీటగానే ఆ నగ్న యువతుల హస్తాలలోని విసన కర్రలు మెల్లగా వీచడం మొదలయ్యేది. అందుకు తగిన సాంకేతికత ఆ చెక్క మంచం లోపల ఉండేది’’ అని జుబ్రిచికీ వర్ణించారు. సింద్‌లోని ఖైర్పూర్లో ఇద్దరు పాలకులు కూడా జుబ్రిచికీ దృష్టిని ఆకర్షించారు. వారిలో ఒకరు విపరీతమైన ఊబకాయం కలిగిన మీర్ అలీ నవాజ్ ఖాన్. ‘‘అమెరికన్ జర్నలిస్ట్ వెబ్ మిల్లర్ 1930లో సిమ్లా లోని సిసిల్ హోటల్లో మీర్ అలీని కలిశారు. మీర్ అలీ భోజనం చేస్తున్న సమయంలో ఆయన నోటికి, చేతికి మధ్య గల ప్రయాణ మార్గంలో పులుసు ఒలికి ఆయన భారీ ఉదరం అంతటా చింది పడింది’’ అని ‘డీథ్రోన్డ్’లో మీర్ అలీని గుర్తు చేసుకున్నారు జుబ్రిచికీ. మీర్ అలీ నవాజ్ ఖాన్ కుమారుడు ఫైజ్ ముహమ్మద్ ఖాన్‌కు స్కిజోఫ్రెనియా గానీ, లేదంటే ఏదైనా చిన్న మనోవైకల్యం గానీ ఉండి ఉండాలి. ‘‘అనుకోకుండా తన తొమ్మిది నెలల కుమారుడిని తుపా కీతో కాల్చినప్పుడు తొలిసారి ఆయన మానసిక స్థితి సందేహాస్పదం అయింది. బులెట్ శిశువు కడుపులోంచి ఊపిరి తిత్తులలోకి దూసుకెళ్లి కుడి భుజం నుంచి బయటికి వచ్చేసింది.’’ నమ్మలేని విధంగా బాలుడు బతికి, తండ్రి మరణానంతరం ఆయనకు వారసుడయ్యాడు. పాకిస్తాన్‌కు వాయవ్య దిశలో ఉంటుంది దిర్. 1947లో ఆ ప్రాంతానికి పాలకుడు నవాబ్ షా జహాన్. రచయిత జుబ్రిచికీ ఆ ప్రాంతాన్ని ‘ఒక నిలువనీటి కయ్య’ అంటాడు. ‘‘అక్కడ ఆసుపత్రి పడకల కంటే నవాబు వేటకుక్కల కోసం కట్టిన గృహాలే ఎక్కువగా ఉంటాయి. పాఠశాలలను నిర్మించడానికి ఆయన నిరాకరించాడు. చదువు ఎక్కువైతే తన పాలనను అంతం చేస్తుందని ఆయన నమ్మాడు’’ అని రాశారు జుబ్రిచికీ. కలాత్ అనేది పాకిస్తాన్‌లోని ఒక సమస్యాత్మక ప్రాంతం. ఆ ప్రాంతం కథ మన హైదరాబాద్, కశ్మీర్లకు పోలిక లేనిదేమీ కాదు. ఆ వివరాలను మీరు గూగుల్‌లో, వికీపీడియాలో వెతికి తెలుసుకోవచ్చు. కలాత్ నవాబు ఖాన్ తన రాష్ట్ర విలీనానికి సంబంధించిన సంప్రతింపుల కోసం పాకిస్తాన్ గవర్నర్ జనరల్ ముహమ్మద్ అలీ జిన్నాను కలిసినప్పుడు ఏం జరిగిందనేది మాత్రం నేను వివరిస్తాను. కశ్మీర్లో మాదిరిగానే 1947 ఆగస్టు తర్వాత కలాత్ లో స్వాతంత్య్ర సంస్థాపన జరిగింది. ఆశ్చర్యకరంగా, ‘‘కరాచీలో ఒక రాయబారిని నియమించుకోడానికీ, ఆకుపచ్చ రంగు గుడ్డపై ఎరుపు రంగు ‘పవిత్ర యుద్ధ’ ఖడ్గం ఉన్న బలూచీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించేందుకూ కలాత్ ప్రాంతానికి అనుమతి లభించింది.’’ కలాత్ విదేశాంగ మంత్రిగా ఐ.సి.ఎస్. అధికారి డగ్లాస్ ఫెల్ నియమితులయ్యారు. ఫెల్ తన జ్ఞాపకాలలో... కలాత్ నవాబు – జిన్నాల మధ్య సమావేశం తిన్నగా సాగకపోవడంపై ఇచ్చిన వివరణను జుబ్రిచికీ పుస్తకంలో చదువుతున్నప్పుడు పొట్ట చెక్కలయ్యేంతగా నేను నవ్వేశాను. ‘‘కలాత్ నవాబు ఖాన్ అనర్గళమైన ఉర్దూలో గంభీరంగా మాట్లాడుతున్నారు. జిన్నా కూడా అంతే అనర్గళంగా, గంభీరంగా ఇంగ్లిషులో మాట్లాడుతున్నారు. జిన్నాను ఒప్పిస్తున్నానని ఖాన్, ఖాన్ని ఒప్పిస్తున్నానని జిన్నా అత్యంత ఆత్మవిశ్వాసంతో చర్చల్ని నడిపి స్తున్నారు. అయితే పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శి గమనించినదే మిటంటే ఒకరు మాట్లాడుతున్నది ఒకరికి ఒక్క ముక్కా అర్థం కావడం లేదని...’’ అని రాశారు జుబ్రిచికీ. ఆ విదేశాంగ కార్యదర్శి మొహమ్మద్ ఇక్రముల్లా మన మాజీ ఉపరాష్ట్రపతి, భారత ప్రధాన న్యాయమూర్తి మొహమ్మద్ హిదయతుల్లాకు సోదరుడు. ఇక్రముల్లా జోర్డాన్ యువ రాణి సర్వత్ తండ్రి. నిజమైన రాజవంశీకుడైన ఏకైక పాకిస్తానీ, నాకు ప్రియమైన స్నేహితుడు కూడా! కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఏ విధిరాత వైపు పయనిస్తున్నాం?
భారత చరిత్రపై తాజాగా వచ్చిన ‘ఎ న్యూ హిస్టరీ ఆఫ్ ఇండియా’ ఆర్యన్ల మూలాల గురించి సరికొత్త వ్యాఖ్యానాన్ని అందజేసింది. ఆర్యన్లు భారత్ మూలాలను కలిగి ఉన్నారనే వాదనను ఖండిస్తూ, వీరు మధ్యాసియా నుంచి వచ్చినవారని చెబుతోంది. భారత ముస్లిం పాలకులందరూ మతమార్పిడి పట్ల ఉత్సుకత కలిగి ఉన్న ఉద్రేకపరులు అని విశ్వసించేందుకు ఎలాంటి ఆధారమూ లేదని తేల్చి చెబుతోంది. ఔరంగజేబును పవిత్ర ముస్లింగా పేర్కొంటూనే, అత్యధిక హిందువులను ఉన్నత పదవుల్లో నియమించడానికి అది అడ్డురాలేదని పేర్కొంటోంది. ప్రస్తుతం మెజారిటీ వర్గ ఆధిపత్యం దిశగా దేశం పయనిస్తోందని కూడా పుస్తకం అభిప్రాయపడింది. ఎట్టకేలకు, 450 కోట్ల సంవత్సరాల క్రితం భౌగోళిక కాలం ప్రారంభమైన నాటి నుంచి నేటి నరేంద్ర మోదీ వరకు భారత చరిత్రను ఒకే సంపుటిలో వివరించిన పుస్తకం ఇప్పుడు వచ్చింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, దీన్ని రాసిన ముగ్గురు రచయితలు– రుద్రాంక్షు ముఖర్జీ, శోభిత పంజా, టోబీ సిన్ క్లెయిర్– పుస్తకాన్ని ‘ఎ న్యూ హిస్టరీ ఆఫ్ ఇండియా’(భారతదేశ కొత్త చరిత్ర) అని చెబుతున్నారు. వారు ఈ విశేషణం ఎందుకు ఉపయోగించారో నాకైతే తెలీదు కానీ ఈ పుస్తకంలోని విషయాలు, చేసిన వ్యాఖ్యలు నన్ను కట్టిపడేశాయి. ఉదాహరణకు, ఇది మీకు తెలుసా? ‘‘హరప్పా నగరాల్లోని ఇళ్లు లేదా సమాధులు సంపద ఆడంబరానికి సంబంధించిన ఎలాంటి చిహ్నాలనూ ప్రదర్శించేవి కావు.... రాజమందిరం అని గుర్తించే ఎలాంటి భవనాలు లేవు... అలాగే ఈజిఫ్టు, చైనా, లేక మెసొపొటేమియాలో కనిపించినట్లు భారీ సమాధులు లేదా భవంతులు లేదా పాలకుల విగ్ర హాలు కనబడవు.’’ కాబట్టి ఇవి పాక్షిక సామ్యవాద గణతంత్రాలా? ఆర్యుల గురించి రచయితలు ఇలా చెబుతారు. ‘‘మధ్య ఆసియా నుంచి ఉత్తర భారతానికి వలస వచ్చారు, స్థానిక ప్రజలతో కలిసి పోయారు, క్రమంగా వారిని తమలో కలుపుకున్నారు... మరోలా చెప్పాలంటే, ఆర్యన్లు ఉత్తర భారతదేశాన్ని ఆక్రమించలేదు, ద్రవిడి యన్లను దక్షిణాభిముఖంగా తరమలేదు.’’ ఇది కచ్చితంగా వివాదా స్పదమైంది. ఆర్యన్లు భారత్‌లోనే జన్మించినవాళ్లనే వాదనను ఇది ఖండిస్తుంది. అర్య సంస్కృతికి సంబంధించి, ఈ పుస్తక రచయితలకు నిర్దిష్టమైన అభిప్రాయం ఉంది. ‘‘ఇది తరచుగా భారతీయ సంప్ర దాయం, సమాజానికి సంబంధించినదిగా చూడబడుతోంది’’ అని నొక్కి చెబుతూనే, దాన్ని ‘‘కులీనమైనది, ఇంకా అనితరమైనది’’ అని వర్ణిస్తారు. ‘‘ఇది ఉత్తర భారత జనాభాలోని విస్తృతమైన వర్గాలను స్పష్టంగా విస్మరించింది. అలాగే భారత ద్వీపకల్పం (వింధ్యకు ఆవలి భూమి)లో నివసిస్తున్న మొత్తం జనాభాను దూరం పెట్టేసింది.’’ పైగా ‘‘కులవ్యవస్థ పునాదులు’’ రుగ్వేద కాలంలోనే ఉన్నాయని వీరు చెబుతున్నారు. ఇది మోహన్ భాగవత్ అభిప్రాయానికి కచ్చితంగా భిన్నమైనట్టిదే. ఇప్పుడు నన్ను ఔరంగజేబు వైపు దృష్టి మళ్లించనివ్వండి. ఆయనపై ఈ పుస్తక రచయితల అభిప్రాయం ప్రస్తుత మన కేంద్ర ప్రభుత్వం కంటే ఆద్రే త్రూష్కే(అమెరికా చరిత్రకారిణి) అభిప్రాయాలకు దగ్గరగా ఉంటోంది. ‘‘ఔరంగజేబు పవిత్రమైన, పరి శుద్ధమైన ముస్లిం’’ అని వీరు పేర్కొంటున్నారు. ‘‘కానీ ఆయన మతో న్మాది కాదు’’ అంటున్నారు. దీనికి సాక్ష్యంగా, ఔరంగజేబు వ్యక్తిగత మత దృక్పథం అధిక సంఖ్యలో హిందూ మునసబుదార్లను నియమించకుండా ఆయనను అడ్డుకోలేదని వీరు పేర్కొంటున్నారు. ‘‘షాజహాన్ పాలనలో 1,000 జాత్(ర్యాంకు) లేదా అంతకు మించిన ర్యాంకు కలిగిన మునసబుదారుల్లో హిందువులు 22 శాతంగా ఉండేవారు. ఔరంగజేబు హయాంలో ఈ సంఖ్య 32 శాతానికి పెరిగింది.’’ విస్తృతమైన ముస్లిం పాలనలో అంటే 13వ శతాబ్ది నాటి సుల్తాన్ల నుంచి మొఘలుల అంతం వరకు చూస్తే ఈ కాలాన్ని 1,200 సంవత్సరాల బానిసత్వ సంవత్సరాలుగా పరిగణిస్తుంటారు. కానీ ఈ పుస్తకం మాత్రం దీనికి విరుద్ధమైన దృక్పథాన్ని కలిగి ఉంది. ‘‘ముస్లింలందరూ లేక ముస్లిం పాలకులందరూ మతమార్పిడి పట్ల ఉత్సుకత కలిగి ఉన్న ఇస్లామిక్ ఉద్రేకపరులు, ఉత్సాహవంతులు అని విశ్వసించేందుకు ఎలాంటి ఆధారమూ లేదు. ముస్లిం పాలకులు పెద్ద సంఖ్య లో ముస్లిమేతరులను ఉద్యోగాల్లో నియమించారు, వారికి అత్యున్నత పదవులను కూడా కట్టబెట్టారన్న వాస్తవాన్ని బట్టే ముస్లిం పాలకులందరూ మతమార్పిడి ఉన్మాదులు కారని తెలుస్తోంది’’ అని ఈ పుస్తకం తేల్చి చెబుతోంది. ఇస్లాం పాలకుల హయాంలో కళలు, నిర్మాణ కళ, సంస్కృతి, మతం వంటి అంశాల్లో జరిగిన అభివృద్ధి గురించి పుస్తకం చర్చించింది. భక్తి సంప్రదాయం, సూఫీతత్వం మధ్య ఈ పుస్తకం గుర్తించిన లంకెలను చూసి నేను నిరుత్తరుడినయ్యాను. ‘‘ఇస్లాంతో సన్నిహిత సంబంధం, ఇస్లాం రాకముందు భారత్‌లో ఉనికిలో ఉన్న భక్తిరూపాల వల్ల భక్తి ఉద్యమం పురుడు పోసుకుందని చెబితే అది మరీ అతిశయోక్తి కాజాలదు... భక్తి మార్మిక సంప్రదాయాలు, సూఫిజం మధ్య గొప్ప అతివ్యాప్తి, కలయిక ఉంది.’’ ఈ పుస్తకంలోని అత్యంత ఆసక్తికరమైన విషయాలు కొన్ని దాని అపురూపమైన వివరాల్లో ఉన్నాయి. ‘‘వ్యభిచారులపై పన్ను విధించాలి’’ అని కౌటిల్యుడు విశ్వసించాడు. అది చాలా ప్రగతిశీలమైందని నేను చెబుతాను. ‘‘అశోకుడు తన సోదరులను చంపేశాడు. ఉన్న వారిలో మొత్తం 97 మందిని చంపేశాడు.’’ అంటే కళింగులకు చాలా కాలం క్రితమే ఆయన ఈ చంపడంలో మునిగివున్నాడు. అలాగే సిపా యిల తిరుగుబాటు ‘‘1857 మే 10న అపరాహ్న వేళ... దాదాపు 5 గంటల సమయంలో’’ మొదలైంది. అయితే అది మీరట్ కంటోన్మెంట్లో సాయంత్రం తేనీటికి కచ్చితంగా అంతరాయం కలిగించివుంటుంది. మన ప్రస్తుత ప్రధానికి సంబంధించి ఈ పుస్తకం రెండు అభిప్రాయాలను కలిగివుంది.›‘‘నరేంద్ర మోదీ తాను చేసిన అన్ని వాగ్దానాలను ఇంకా నెరవేర్చలేదు’’ అని చెబుతూనే, ‘‘ఆయన ఒక కొత్త విశ్వాసాన్ని, ఉల్లాసాన్ని తీసుకొచ్చారు’’ అని పొడుపుగా జోడించింది. అయితే ఆ తర్వాత, ఈ పుస్తకం ‘‘మోదీ నాయకత్వంలో మెజారిటీ వర్గ ఆధిపత్యం, మైనారిటీల పట్ల తీవ్ర అసహనం, అసమ్మతి వైపుగా ఒక సహజ ప్రవృత్తి బలపడిపోయింది. ఈ మెజారిటీ వైపు మలుపు మన సమాజాన్ని వేర్పాటుతత్వంతో విభజించివేసింది’’ అని అభిప్రాయపడింది. చివరగా, ఈ పుస్తకం చివరి వాక్యాన్ని చాలా తెలివిగా, కాకపోతే జిత్తులమారితనంతో రూపొందించారు.‘‘మార్పు, మథనానికి సంబంధించిన లోతైన, ప్రాథమిక ప్రవాహాలు భారత్‌ను ఒక కొత్త విధి రాత (ట్రిస్ట్ విత్ డెస్టినీ) వైపు లాగుతున్నాయి.’’ ఒక విరుద్ధమైన ఫలితాన్ని ముందుచూపుతో సూచిస్తూ, నెహ్రూ సుప్రసిద్ధ వాక్యాన్ని ఇక్కడ చమత్కారంగా ఉపయోగించారు. కరణ్ థాపర్ , వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఆధునిక భారతదేశ చరిత్రపై విస్తృత పరిశోధనలు చేయాలి
న్యూఢిల్లీ: ఆధునిక భారతదేశ చరిత్రపై మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి చెప్పారు. ఆ అంశంపై దృష్టి పెట్టాలని పరిశోధకులకు పిలుపునిచ్చారు. అలాగే ప్రఖ్యాత సామాజిక సంస్కర్త స్వామి దయానంద సరస్వతి, 1875లో ఏర్పాటైన ఆర్యసమాజ్ అందించిన సేవలను వెలుగులోకి తీసుకోవాలని కోరారు. ఈ విషయంలో విద్యా, సాంస్కృతిక సంస్థలు చొరవ తీసుకోవాలని అన్నారు. సోమవారం ఢిల్లీలోని నెహ్రూ స్మారక మ్యూజియం, లైబ్రరీ(ఎన్ఎంఎంఎల్) వార్షిక సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. విస్తృత పరిశోధనల ద్వారా ఆధునిక భారతదేశ చరిత్ర గురించి నేటి తరానికి మరిన్ని విషయాలు తెలియజేయవచ్చని పేర్కొన్నారు. -
అది స్వర్ణయుగమేనా?!
‘‘ఒక చరిత్రకారుడు నిక్కచ్చిగా, నిజాయితీగా, నిష్పక్షపాతంగా ఉండాలి. భావోద్వేగాలకూ, రాగద్వేషాలకూ అతీతంగా వ్యవహరించాలి. చరిత్రలో నిజాలకు మాత్రమే సముచిత స్థానం ఉంటుంది. సత్యం చరిత్రకు తల్లిలాంటిది. గతంలో జరిగిన సంఘటనకు చరిత్ర సాక్ష్యంగా నిలవడం మాత్రమే కాదు, భవిష్యత్తుకు దిక్సూచిగా మారుతుంది’’ అన్న బాబాసాహెబ్ అంబేడ్కర్ వ్యాఖ్యలు చరిత్ర అధ్యయనానికీ, చారిత్రక గమనాన్ని అర్థం చేసుకోవడానికీ మార్గదర్శకంగా నిలుస్తాయి. భారతదేశ చరిత్రను అత్యంత ప్రతిభతో అధ్యయనం చేసిన మహనీయులలో ఆయన ఒకరు. అయితే ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చరిత్రపై చేసిన వ్యాఖ్యానాలు వేల ఏళ్ళ భారత చరిత్రను తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయి. సత్యాన్ని మరుగుపరిచి, అసత్యాలకు పట్టంగట్టేవిగా ఉన్నాయి. బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో గతవారం గుప్తుల సామ్రాజ్యంలో ఒక రాజైన స్కందగుప్తునిపై వెలువరించిన ఒక పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా మాట్లాడుతూ ‘‘భారతదేశ చరిత్రను బ్రిటిష్, మొఘల్‌ల ఆలోచనా దృక్పథంలో రాశారు. అందుకే చరిత్రను తిరగరాయాలి. గుప్తుల కాలం ఒక స్వర్ణయుగం. అందులో స్కందగుప్తుడు హూణులను ఓడించిన వీరుడు’’ అంటూ అమిత్‌షా ప్రశంసల వర్షం కురిపించారు. దేశ చరిత్రను అధ్యయనం చేసిన వాళ్లనూ, అప్పటి లిఖితపూర్వకమైన గ్రంథాలను చూసిన వాళ్లనూ ఈ వ్యాఖ్యలు కొంత ఆలోచనలో పడేస్తాయి. చరిత్రను అధ్యయనం చేయడానికి గతంలో రెండే రెండు ఆధారాలు ఉండేవి. ఒకటి సాహిత్యం – అందులో మౌఖిక సాహిత్యం, లిఖిత సాహిత్యం ఉన్నాయి. రెండోది పురాతత్వ శాస్త్ర పరిశోధనలు. కానీ ఇటీవల శాస్త్ర సాంకేతిక రంగాల్లో వచ్చిన పురోగతి మూడో చారిత్రక అస్త్రంగా అందివచ్చింది. అందువల్ల సత్యాలను దాచేస్తే దాగే పరిస్థితి లేదు. బౌద్ధాన్ని నిలువరించాలనుకున్న వైదిక మత ప్రబోధకులకు గుప్తుల కాలం బలమైన అండదండలను అందిం చింది. క్రీ.శ.మూడవ శతాబ్దం నుంచి ఆరవ శతాబ్దం వరకు కొనసాగిన గుప్తుల సామ్రాజ్యంలో వైదిక మతం తన భావజాలాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి పథకాలు రచించింది. భారత సామాజిక వ్యవస్థను కులాలుగా విడగొట్టి వర్ణవ్యవస్థను పటిష్టం చేసిన మనుధర్మం సంపూర్ణమైన రూపం తీసుకున్నది గుప్తుల కాలంలోనే. అప్పటి వరకు చాలా ప్రయత్నాలు జరిగినప్పటికీ కులాలను విడ గొట్టి ప్రతి కులానికీ ఒక స్పష్టమైన విధివిధానాలను రూపొందించింది ఆకాలంలోనే. దానికి వారు సంస్కృతాన్ని ఒక సాధనంగా వాడుకున్నారు. అప్పటి వరకు బహుళ ప్రాచుర్యంలో ఉన్న పాళి, ప్రాకృతం, పైశాచిలాంటి భాషలను దాదాపు ధ్వంసం చేశారు. తర్వాతనే దేవాల యాలు, వాటిలో ఆరాధనలు పుట్టాయి. అందులో భాగం గానే బౌద్ధాన్ని ఒకవైపు దెబ్బతీస్తూనే, రెండోవైపు గౌతమ బుద్ధుడిని విష్ణువు అవతారంగా ప్రకటించారు. lతపస్సుగానీ, జ్ఞానసముపార్జనగానీ కేవలం బ్రాహ్మణులు చేయాలనే దానికి రామాయణంలో ప్రముఖ స్థానం కల్పించారు. శంబూక వథ అందులో భాగమే. అదే సమయంలో బౌద్ధాన్ని ఇంకా పాటిస్తున్న వాళ్ళను, వైదిక మతాన్ని కుల వ్యవస్థను నిరసిస్తున్న వాళ్ళను అంటరాని వాళ్ళుగా ముద్రవేసి, ఊరవతలికి నెట్టివేశారు. ఆనాడు సమాజంలో వేళ్ళూనుకున్న అదే భావన నేటికీ అంటరానితనపు కుచ్చితత్వాన్ని వెలివాడల రూపంలో కొనసాగిస్తోంది. బౌద్ధులను గ్రామాల్లోనికి రానివ్వద్దని, వారి ముఖం చూడకూడదని నిబంధనలు విధించారు. ఆ సమయంలో రాసిన మృచ్ఛకటికం సంస్కృత నాటకంలో ఇటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. అంటే గుప్తుల కాలం స్వర్ణయుగం కాదు. అది వర్ణయుగం. వర్ణ వ్యవస్థను కుల వ్యవస్థగా విడగొట్టి సమాజాన్ని మరిన్ని ముక్కలుగా విడగొట్టిన కాలమది. పశ్చిమబెంగాల్లోని ‘‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోమెడికల్ జినోమిక్స్’’ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టి ట్యూట్’’కు చెందిన ‘‘హ్యూమన్ జెనెటిక్స్ యూనిట్’’లు సంయుక్తంగా నిర్వహించిన పరిశోధనలో గుప్తుల కాలంలో కుల వ్యవస్థ బలపడిందని తేల్చాయి. అయితే అమిత్‌షా లాంటి వాళ్ళు ఇటువంటి విష యాలు తెలియక మాట్లాడుతున్నారో, లేదా మళ్లీ ఒకసారి అటువంటి యుగంలోకి తీసుకెళ్ళి కులవ్యవస్థ సరైనదే, దానిని కొనసాగించాలనే అభిప్రాయాన్ని ప్రజల మెదళ్ళలో నాటడానికి ప్రయత్నిస్తున్నారో అన్న ప్రశ్నలు తలెత్తక మానవు. దాదాపు రెండువేల సంవత్సరాలుగా కొనసాగుతున్న కుల వ్యవస్థకు మనువులాంటి వాళ్ళు రూపొందించిన కుల చట్టాలను, చట్రాలను పక్కకు తోసి 1950 సంవత్సరంలో భారత ప్రజలందరూ సమానులేననే ఒక చట్టాన్ని రాజ్యాంగం ద్వారా రూపొందించుకున్నాం. అమిత్ షా లాంటి వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు భారత రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయనడంలో సందేహం లేదు. ఇటువంటి మాటలు మాట్లాడేముందు చరిత్రను ఆధునిక దృక్పథంతో సత్యం పునాదిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. సమాజ రథచక్రాలను ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నించాలేగానీ, వెనక్కి తిప్పకూడదు. ఇది వాంఛ నీయం కాదు. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు, 81063 22077 -
దేశంలో తొలి హిజ్రా న్యాయవాది
సాక్షి ప్రతినిధి, చెన్నై: దేశ చరిత్రలోనే తొలిసారిగా ఓ హిజ్రాకు బార్ కౌన్సిల్లో సభ్యత్వం లభించింది. 36 ఏళ్ల సత్యశ్రీ శనివారం మద్రాసు హైకోర్టు న్యాయమూర్తుల సమక్షంలో చెన్నైలోని తమిళనాడు న్యాయవాదుల సంఘం కార్యాలయంలో తన పేరును నమోదు చేసుకున్నారు. న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకున్న 11 ఏళ్ల తర్వాత బార్ కౌన్సిల్లో సభ్యత్వం పొందగలిగానని ఈ సందర్భంగా సత్య శ్రీ ఆవేదన చెందారు. జడ్జిగా ఎదగడమే తన కల అని చెప్పారు. రామనాథపురం జిల్లా పరమకుడికి చెందిన సత్యశ్రీ జన్మతః బాలుడు. చిన్నప్పుడే శరీరంలో స్త్రీగా మార్పులు ప్రారంభమవడంతో కుటుంబాన్ని వదిలి వచ్చి చెన్నై దగ్గర్లోని చెంగల్పట్టులో పెరిగారు. 2007లో సేలం కేంద్రీయ లా కాలేజీ నుంచి లా పట్టా తీసుకున్నారు. 2014లో సుప్రీంకోర్టు జారీచేసిన ఉత్తర్వుల ప్రాతిపదికన జాతీయ న్యాయ వ్యవహారాల కమిషన్ హిజ్రాలు సైతం లాయర్లుగా బార్ కౌన్సిల్లో పేర్లను నమోదు చేసుకోవచ్చని స్పష్టం చేయడంతో సత్యశ్రీకి బార్ కౌన్సిల్ సభ్యత్వం లభించింది. -
మెహరున్నీసా అంటే అర్థం?
1. బాబర్ పూర్తి పేరు? 1) ఉమర్ షేక్ మీర్జా 2) జహీరుద్దీన్ మహ్మద్ బాబర్ 3) దౌలత్– ఖాన్– లోడీ 4) సుల్తాన్ అహ్మద్ మీర్జా 2. టర్కీ భాషలో బాబర్ అంటే అర్థం? 1) సింహం 2) పులి 3) వీరుడు 4) ధైర్యశాలి 3. మొదటి పానిపట్టు యుద్ధం జరిగిన తేదీ? 1) 1526 జనవరి 20 2) 1526 ఫిబ్రవరి 7 3) 1526 మార్చి 20 4) 1526 ఏప్రిల్ 21 4. ‘జిందాఫీర్’ అని ఎవరిని పిలిచేవారు? 1) బాబర్ 2) అక్బర్ 3) షాజహాన్ 4) ఔరంగజేబు 5. కిందివారిలో బాబర్ ఎవరి భక్తుడు? 1) షేక్ సలీం చిష్ఠి 2) బాబా ఫరీద్ ఉద్దీన్ 3) భక్తియార్ కాకి 4) షేక్ ఉబైదుల్లా 6. బాబర్‌కు సమకాలీనుడైన దక్షిణాది విజయనగర పాలకుడు ఎవరు? 1) ఫ్రౌడ దేవరాయలు 2) శ్రీకృష్ణదేవరాయలు 3) మొదటి బుక్కరాయలు 4) రెండో వేంకటపతిరాయలు 7. షాజహాన్ కాలాన్ని నిర్మాణాల పరంగా ఎవరితో పోలుస్తారు? 1) జూలియస్ సీజర్ 2) మొదటి చార్లెస్ 3) మొదటి జేమ్స్ 4) అగస్టస్ 8. హుమాయూన్ అంటే అర్థం? 1) దురదృష్టవంతుడు 2) అదృష్టవంతుడు 3) విజ్ఞానవంతుడు 4) అజ్ఞాని 9. గ్రంథాలయం మెట్లు దిగుతూ ప్రమాదవశాత్తు హుమాయూన్ 1556 జనవరి 24న జారిపడ్డాడు. ఆ గ్రంథాలయం ఉన్న భవనం పేరు? 1) దీన్పణ్ లేదా షేర్ మండల్ 2) దివాన్ – ఇ – ఆమ్ 3) దివాన్ – ఇ – ఖాస్ 4) లాల్ ఖిల్లా 10. షేర్షా అసలు పేరు? 1) నాజీరుద్దీన్ 2) జహీరుద్దీన్ 3) ఫరీద్ 4) సలీం 11. మీనా బజార్లు, ఖుషీ బజార్లు ఏర్పాటు చేసిన మొఘల్ రాజు? 1) బాబర్ 2) హుమాయూన్ 3) అక్బర్ 4) జహంగీర్ 12. షేర్షా కాలంలో కలింజర్ కోట పాలకుడు? 1) రాణా ఉదయ్‌సింగ్ 2) రతన్‌సింగ్ 3) రాజా కిరాత్ సింగ్ 4) మాల్థేవ్ రాథోడ్ 13. కలింజర్ కోటను షేర్షా ఏ సంవత్సరంలో ఆక్రమించాడు? 1) క్రీ.శ. 1543 2) క్రీ.శ. 1544 3) క్రీ.శ. 1545 4) క్రీ.శ. 1546 14. షేర్షా బెంగాల్‌ను ఎన్ని సర్కార్లుగా విభజించాడు? 1) 40 2) 47 3) 52 4) 57 15. షేర్షా నిర్మించిన గ్రాండ్ ట్రంక్‌రోడ్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది? 1) కోల్‌కతా నుంచి తక్షశిల 2) ముర్షీదాబాద్ నుంచి ఆగ్రా 3) సోనార్గావ్ నుంచి అట్టక్ 4) లాహోర్ నుంచి ముల్తాన్ 16. జీలం నది ఒడ్డున షేర్షా నిర్మించిన నిర్మాణం? 1) ససారం సమాధి 2) లాల్ ఖిల్లా 3) రోహటస్ ఘర్ 4) పురానా ఖిల్లా 17. మెహరున్నీసా అంటే అర్థం? 1) మహిళా లోకానికి సూర్యబింబం 2) అంతఃపుర సుందరి 3) భూమిలో స్వర్గం 4) ప్రపంచ సుందరి 18. అక్బర్ గుజరాత్‌పై దండెత్తినప్పుడు గుజరాత్ పాలకుడు ఎవరు? 1) మూడో ముజఫర్ షా 2) బాజ్ బహదూర్ 3) బహదూర్ ఖాన్ 4) బైజూబావారా సమాధానాలు 1) 2 2) 2 3) 4 4) 4 5) 4 6) 2 7) 4 8) 2 9) 1 10) 3 11) 2 12) 3 13) 3 14) 2 15) 3 16) 3 17) 1 18) 1 -
భారతదేశ చరిత్ర (స్వాతంత్య్రోద్యమం)
ఇండియన్ హిస్టరీ సిల్వర్ టంగ్‌డ ఆరేటర్ అని ఏ జాతీయ నాయకుడిని పిలుస్తారు? - సురేంద్రనాథ్ బెనర్జీ హంటర్ విద్యా కమిషన్ సభ్యుడైన భారతీయుడు? - ఆనందమోహన్ బోస్ నేతాజీ స్థాపించిన పార్టీ? - ఫార్వర్డ బ్లాక్ వందేమాతరాన్ని ఆంగ్లంలోకి అనువదించినవారు? - అరవింద ఘోష్ ఆనందమఠ్‌లో ప్రధాన ఇతివృత్తం? - సన్యాసుల తిరుగుబాటు అలీపూర్ కుట్ర కేసు నుంచి అరవిందఘోష్‌ను నిర్దోషిగా విడుదల చేయించినవారు? - సి.ఆర్.దాస్ భారతదేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన తొలి ముస్లిం? - అష్పకుల్లాఖాన్ దేశంలో తొలిసారి అరెస్టయిన బాలుడిగా స్వాతంత్య్రోద్యమ చరిత్రలో నిలిచినవారు? - ఓరుగంటి రామచంద్రయ్య సిన్‌ఫిన్ ఉద్యమం ప్రేరణతో భారత్‌లో జరిగిన ఉద్యమం? - హోం రూల్ ఉద్యమం సహాయ నిరాకరణోద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? - 1920, ఆగస్టు 31 సహాయ నిరాకరణోద్యమ సమయంలో స్థాపించిన విద్యా సంస్థలు? - జామియా మిలియా ఇస్లామియా, బిహార్ విద్యాపీఠం, కాశీ విద్యాపీఠం, గుజరాత్ విద్యాపీఠం వందేమాతర ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? - 1905, అక్టోబర్ 16 న్యూలాంప్స్ ఫర్ ఓల్డ్, వ్యాస సంపుటి రాసినవారు? - అరవింద ఘోష్ వందేమాతర ఉద్యమ కాలంలో గోపాల మిత్ర బెంగాల్లో ఏర్పర్చిన సంస్థ? - వార్షిక హిందూ మేళా దక్షిణ భారత్‌లో తొలి ఐూఇ సమావేశం జరిగిన ప్రాంతం? - మద్రాస్ ఇంగ్లండ్ పార్లమెంట్‌కు ఎన్నికైన తొలి భారతీయుడు? - దాదాభాయ్ నౌరోజీ క్విట్ కశ్మీర్ ఉద్యమ నిర్మాత? - షేక్ అబ్దుల్లా శాసనోల్లంఘనోద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? - 1930, మార్చి 12 బెంగాల్‌ను తిరిగి ఏకీకరించిన సంవత్సరం? - 1911 కలకత్తా నుంచి రాజధానిని ఢిల్లీకి మార్చినవారు? - హార్డింజ్ రాజాజీ ఫార్ములాను ఎప్పుడు రూపొం దించారు? - 1944 స్వదేశీ ఉద్యమంలో బాలభారతి సమితి ఎక్కడ ఏర్పడింది? - రాజమండ్రి ‘‘యాచించడం కాదు శాసించాలి’’ అన్నవారు - లోకమాన్య బాలగంగాధర్ తిలక్ తిలక్ ప్రచురించిన పత్రికలు? - కేసరి, మరాఠీ త్రివర్ణ పతాకాన్ని మేడం కామా ఎక్కడ ఎగురవేశారు? - స్టట్గర్ట (జర్మనీ) గాంధీజీ దక్షిణాఫ్రికాకు ఎప్పుడు వెళ్లారు? - 1893 మైఖేల్-ఒ-డయ్యర్‌ను ఉద్ధమ్‌సింగ్ ఎప్పుడు చంపాడు? - 1940 జామా మసీదు (ఢిల్లీ) ప్రార్థనలో పాల్గొన్న ఆర్యసమాజ నాయకుడు? - స్వామి శ్రద్ధానంద సైమన్ కమిషన్ కాలంలో మద్రాస్‌లో మరణించిన యువకుడు? - పార్థసారథి సైమన్ కమిషన్ ఏర్పడిన సంవత్సరం? - 1928 (ఇందులోని సభ్యుల సంఖ్య 7. ఈ కమిషన్ కాలం నాటి వైస్రాయ్ ఇర్విన్) జెండా సత్యాగ్రహాన్ని నాగ్‌పూర్‌లో ప్రారంభించినవారు? - జమ్నాలాల్ బజాజ్ కేంద్ర శాసనసభకు స్పీకర్‌గా ఎన్నికైన తొలి భారతీయుడు? - విఠల్‌భాయ్ పటేల్ శాసనోల్లంఘనోద్యమ రాణి ఎవరు? - సరోజినీ నాయుడు గైడిన్‌లియూ ఏ ఉద్యమంలో ప్రసిద్ధి పొందారు? - ఉప్పు సత్యాగ్రహం ఖాన్ అబ్దుల్ గఫార్‌ఖాన్ బిరుదు? - సరిహద్దు గాంధీ ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న గాంధీజీ అనుచరుల సంఖ్య? - 78 హరిజనోద్ధరణ ఆంధ్ర శాఖ స్థాపకుడు? - కాశీనాథుని నాగేశ్వరరావు శారదా నికేతన్‌ను ఉన్నవ లక్ష్మీనారాయణ ఎక్కడ స్థాపించారు? - గుంటూరు కొండా వెంకటప్పయ్య బిరుదు? - దేశభక్త సుభాష్ చంద్రబోస్ ఎక్కడ జన్మించారు? - కటక్ (ఒడిశా) అండమాన్, నికోబార్ దీవులకు బోస్ పెట్టిన పేర్లు? - షహీద్, స్వరాజ్ ది డివైన్ లైఫ్, సావిత్రి గ్రంథాల రచయిత? - అరవింద ఘోష్ 1946 నాటి క్యాబినెట్ మిషన్‌లోని సభ్యులు?- పెథిక్ లారెన్స, సర్ స్టాఫర్డ క్రిప్స్, ఎ.వి.అలెగ్జాండర్ వేల్స్ రాకుమారుడు (8వ ఎడ్వర్డ) ఇండియాను ఎప్పుడు సందర్శించారు? - 1921 భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన తొలి భారతీయ వనిత? -సరోజినీ నాయుడు దేశికోత్తమ బిరుదాంకితులు ఎవరు? - సురేంద్రనాథ్ బెనర్జీ ఏ నియోజకవర్గం నుంచి దాదాభాయి నౌరోజీ బ్రిటన్‌లోని హౌస్ ఆఫ్ కామన్సకు ఎన్నికయ్యారు? -ప్రిన్సబరి ఫకీర్ మోహన్ సేనాపతి ఏ రాష్ట్రానికి చెందిన జాతీయ కవి? - ఒడిశా కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ (1934) స్థాపకులు? - జయప్రకాష్ నారాయణ్, ఆచార్య నరేంద్రదేవ్ అతివాదులు, మితవాదులు ఎప్పుడు ఏకమయ్యారు? - 1916 గాంధీజీ రాసిన ప్రముఖ గ్రంథాలు? -మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్, హింద్ స్వరాజ్ 1921 మోప్లా తిరుగుబాటు (కేరళ) నాయకుడు? - అలీ ముస్లియార్ రౌండ్‌టేబుల్ సమావేశాలు మొత్తం ఎన్ని జరిగాయి? - 3 అజాద్ హింద్ ఫౌజ్ సైనికుల తరఫున వాదించిన జాతీయ కాంగ్రెస్ న్యాయవాదుల బృందం? -భూలాభాయ్ దేశాయ్, తేజ్ బహదూర్ సప్రూ, అసఫ్ అలీ అజాద్ హింద్ ఫౌజ్ మహిళా విభాగం పేరు? - ఝాన్సీ లక్ష్మీబాయి దళం ఝాన్సీ లక్ష్మీబాయి దళానికి నాయకురాలు? - లక్ష్మీ సెహగల్ ది గ్రేట్ కలకత్తా కిల్లింగ్ ఎప్పుడు జరిగింది? - 1946 ఆగస్టు 16 ఇండియన్ ఇండిపెండెన్స బిల్‌ను బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్స సభలో ప్రవేశపెట్టినవారు? - లిస్టోవెల్ ఇండియన్ ఇండిపెండెన్స బిల్‌ను బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్సలో ప్రవేశపెట్టినవారు? - లార్డ శామ్యూల్ స్వాతంత్య్రం వచ్చేనాటికి భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు? - జీవత్రామ్ భగవాన్‌దాస్ కృపలాని (జె.బి.కృపలాని) వైస్రాయి వెవేల్ 1945లో అఖిలపక్ష సమా వేశాన్ని ఎక్కడ ఏర్పాటు చేశాడు? - సిమ్లా రవీంద్రనాథ్ ఠాగూర్ ఆత్మకథ పేరు? - మై రెమినిసెన్సెస్ ‘యాన్ ఇండియన్ పిలిగ్రిమ్’ రాసినవారు? - సుభాష్ చంద్ర బోస్ పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని నెహ్రూ ఎప్పుడు చేశారు? - 1929 చీరాల-పేరాల ఉద్యమం ఏ ఉద్యమంలో భాగం? -సహాయ నిరాకరణోద్యమం విజయవాడ ఐూఇకి పరిశీలకుడిగా హైదరాబాద్ నుంచి వచ్చినవారు? - మాడపాటి హనుమంతరావు జాతీయోద్యమంలో జైలుశిక్ష అనుభవించిన తొలి తెలుగు వనిత? -రావూరి అలివేలు మంగమ్మ అల్లూరి సీతారామరాజు దాడి చేసిన తొలి పోలీస్‌స్టేషన్? - చింతపల్లి 1920లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాను ఎక్కడ స్థాపించారు? - తాష్కెంట్ భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను ఎప్పుడు ఉరి తీశారు? - 1931, మార్చి 23 ఆనందమండల్ అనే విప్లవ సంస్థ ఎక్కడి నుంచి స్వాతంత్య్రం కోసం పోరాడింది? - అహ్మదాబాద్ 1937లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది? - 8 1942లో భారత్‌లో పర్యటించిన చైనా అధ్యక్షుడు? - చాంగ్ -కై-షేక్ నేతాజీ సింగపూర్‌లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? -1943 అక్టోబర్ 21 ఇండియన్ ఇండిపెండెన్స బిల్లును ఆమోదించిన బ్రిటన్ చక్రవర్తి? - 6వ జార్జి వైస్రాయ్గా లార్డ ఇర్విన్ పాలనా కాలం? - 1926-1931 లార్డ లిన్లిత్గో పాలనా కాలం? -1936-1943 యుగాంతర్ పత్రికాధినేత? - బరేంద్రకుమార్ ఘోష్ సచిన్ సన్యాల్ రాసిన గ్రంథం? - బందీ జీవన్ మాండలే జైలు నుంచి తిలక్ విడుదలైన సంవత్సరం? - 1914 రఫ్త్గోఫ్తర్ పత్రికాధినేత? -దాదాభాయి నౌరోజి భారతదేశం నుంచి బర్మా ఏ చట్టం ద్వారా విడిపోయింది? - 1935 చట్టం అమృత బజార్ పత్రిక స్థాపకుడు? - శిశిర్ కుమార్ ఘోష్ జైహింద్, చలో ఢిల్లీ నినాదకర్త? -నేతాజీ బోస్ లార్డ రీడింగ్ పాలనా కాలం? -1921-1925 ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్ గ్రంథకర్త ? - లాయక్ అలీ ‘ది ఎండ్ ఆఫ్ యాన్ ఎరా’ రాసినవారు? - కె.యం.మున్షీ రెండో ప్రపంచ యుద్ధ కాలంలో భారతీయుల సహాయం కోరుతూ లిన్లిత్గో చేసిన ప్రకటన? - ఆగస్ట్ ఆఫర్ క్యాబినెట్ మిషన్‌ను భారత్‌కు పంపిన ఇంగ్లండ్ ప్రధాని? - క్లెమెంట్ అట్లీ నేతాజీకి సహకరించిన జపాన్ ప్రధాని? - టోజో హోంరూల్ ఉద్యమాన్ని అనీబిసెంట్ ఎక్కడి నుంచి ప్రారంభించారు? - అడయార్ (తమిళనాడు) 1911లో తొలిసారి ఐూఇలో జాతీయ గీతాలాపన సమయం నాటి ఐూఇ అధ్యక్షుడు? - బి.ఎన్.థర్ కాంగ్రెస్, ముస్లింలీగ్‌ల మధ్య కుదిరిన ఒప్పందం? - లక్నో ఒప్పందం (1916) హరిజనులకు ప్రత్యేక నియోజకవర్గాలపై రామ్సే మెక్‌డొనాల్డ్ చేసిన ప్రకటనను ఏమంటారు? -కమ్యూనల్ అవార్డ్స ద్విజాతి సిద్ధాంత కర్త? - మహ్మద్ అలీ జిన్నా గాంధీజీ హరిజనులకు ప్రవేశం కల్పించిన దేవాలయం కృష్ణా జిల్లాలో ఎక్కడ ఉంది? - సిద్ధాంతం అనే ఊరిలో నీల్ దర్పణ్ గ్రంథకర్త? - దీనబంధుమిత్ర అంబేద్కర్, గాంధీజీల మధ్య జరిగిన ఒప్పందం? - పూనా ఒప్పందం గోఖలే తీర్మానం (1912) ఉద్దేశం?- బడి ఈడు పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య గదర్ పార్టీలో చేరిన ఏకైక తెలుగు వ్యక్తి? - దర్శి చెంచయ్య స్వరాజ్య పార్టీ అధికార పత్రిక? - ఫార్వర్డ మోతీలాల్ నెహ్రూ 1919లో స్థాపించిన పత్రిక? - ఇండిపెండెంట్ వార్థా విద్యా ప్రణాళికను గాంధీజీ ఎప్పుడు రూపొందించారు? - 1937 మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన సిక్కు ప్రతినిధి? - సంపూరణ్ సింగ్ మహ్మద్ అలీ జిన్నా ఎప్పుడు ముస్లింలీగ్‌లో చేరాడు? - 1913 వేల్స్ రాకుమారుడికి గౌరవ పట్టా ఇచ్చిన యూనివర్సిటీ ? బెనారస్ హిందూ యూనివర్సిటీ ప్రిన్స ఆఫ్ బెగ్గర్స అని ఎవరిని అంటారు? - మదన్మోహన్ మాలవ్య (బెనారస్ హిందూ యూనివర్సిటీ కోసం కోటిన్నర నిధులు వసూలు చేసినందుకు ఇలా పిలుస్తారు) ఖను ఎప్పుడు స్థాపించారు? - 1925 ‘ది స్పాట్‌లెస్ పండిట్’ అని ఎవరిని అంటారు? - మదన్మోహన్ మాలవ్య ఇండియన్ బిస్మార్‌క అని ఎవరిని అంటారు? - సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్‌లో పౌర ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడింది? - 1950 హైదరాబాద్ రాజ్యం, భారత యూనియన్‌కు మధ్య యథాతథ ఒప్పందం ఎప్పుడు జరిగింది? - 1947 నవంబర్ 29 ట్రావెన్కోర్ సంస్థాన రాజధాని? - తిరువనంతపురం ట్రావెన్కోర్ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేసినవారు? - బలరామ్ వర్మ (1949లో) -
హర్షుడి కాలంలో వచ్చిన ప్రధాన మార్పు?
కాంపిటీటివ్ గెడైన్స్ : ఇండియన్ హిస్టరీ గుప్తుల అనంతర యుగం (క్రీ.శ. 6వ శతాబ్దం - 8వ శతాబ్దం) గుప్తుల తర్వాత భారతదేశం మరోసారి అనేక చిన్న చిన్న రాజ్యాలుగా చీలిపోయింది. ఈ రాజకీయ అనైక్యత ఉత్తర భారతంలో తీవ్రంగా ఉంది. ఈ కాలంలోనే ఉత్తరాదిలో.. వల్లభి కేంద్రంగా మైత్రకులు, గౌహతి కేంద్రంగా (కామరూప రాజ్యం) - వర్మన్ వంశం, పాటలీపుత్రం కేంద్రంగా - కడపటి గుప్తులు పాలించారు. అలాగే బెంగాల్ కేంద్రంగా - గౌడ వంశం, కనౌజ్ కేంద్రంగా - మౌఖరీలు, ఒడిశా కేంద్రంగా-మాతరులు, మానవంశం, స్థానేశ్వర్ కేంద్రంగా- పుష్యభూతి వంశంవారు పాలన కొనసాగించారు. అయితే పుష్యభూతి వంశంవారు క్రమంగా ఈ రాజ్యాలన్నింటినీ జయించి మొత్తం ఉత్తర భారతదేశాన్ని రాజకీయంగా ఏకం చేసి పాలించారు. ఈ కాలంలో దక్షిణ భారతదేశాన్ని పశ్చిమ గాంగులు, బాదామీ చాళుక్యులు, పల్లవులు, పాండ్యులు మొదలైన రాజవంశాలు పాలిస్తున్నాయి. ఈ వంశాలు దక్షిణ భారతదేశంలో వాస్తు, శిల్ప కళలకు అమూల్యమైన సేవలను అందించాయి. గుప్తుల తర్వాత యుగంలో ఉత్తరాదిని పాలించిన రాజవంశాలన్నింటిలో ‘పుష్యభూతి వంశం’ గొప్పది. పుష్యభూతి వంశం పుష్యభూతి ఇతడు తన పేరుతో పుష్యభూతి వంశాన్ని స్థాపించాడు. స్థానేశ్వర్ రాజధానిగా గుప్తుల సామంతుడిగా పరిపాలించాడు. ప్రభాకర వర్థనుడు పుష్యభూతి వంశంలో తొలి స్వతంత్ర రాజు. తన స్వతంత్ర పాలనకు గుర్తుగా ‘రాజాధిరాజ’ అనే బిరుదును ధరించాడు. ప్రభాకరుడి భార్య యశోమతి. ప్రభాకర వర్థనుడు క్రీ.శ. 605లో మరణించగా భార్య సతీ సహగమనాన్ని ఆచరించిందని బాణుడి గ్రంథాల ద్వారా తెలుస్తోంది. రాజ్యవర్థనుడు ప్రభాకర వర్థనుడు తన జ్యేష్ట పుత్రుడు రాజ్య వర్థనుడికి బదులు రెండో కుమారుడు హర్షుడిని రాజుగా చేయాలని సంకల్పించాడు. దీనికి హర్షుడు సమ్మతించలేదు. దీంతో రాజ్యవర్థనుడు రాజయ్యాడు. ఇతడి కాలంలో కనౌజ్‌ను గ్రహవర్మ అనే మౌకరీరాజు పాలించేవాడు. ఇతడు రాజ్యవర్థనుడి సోదరి రాజ్యశ్రీ భర్త. మగధను, మాళ్వాను పాలించే దేవగుప్తుడు.. గౌడ దేశాన్ని పాలించే శశాంకుడితో కలిసి.. గ్రహవర్మను చంపి కనౌజ్‌ను ఆక్రమించాడు. రాజ్యవర్థనుడు దేవగుప్తుడిని చంపి కనౌజ్‌ను స్వాధీనం చేసుకున్నాడు. శశాంకుడు.. రాజ్యవర్థనుడిని హత్య చేయడంతో హర్షుడు రాజ్యానికి వచ్చాడు. హర్షవర్థనుడు హర్షవర్థనుడు గౌడ శశాంకుడి నుంచి కనౌజ్‌ను విడిపించి, రాజధానిని స్థానేశ్వరం నుంచి కనౌజ్‌కు మార్చాడు. శశాంకుడి తర్వాత గౌడ దేశాన్ని కూడా ఆక్రమించాడు. ఆ తర్వాత తన దిగ్విజయ యాత్రలు ప్రారంభించి.. సింధు, వల్లభి, గుజరాత్, సౌరాష్ర్ట మొదలైన ప్రాంతాలను జయించాడు. లత, మాళ్వా ప్రాంతాలపై ఆధిపత్యం విషయంలో హర్షుడికి.. బాదామీ చాళుక్యరాజు రెండో పులకేశితో ఘర్షణ అనివార్యమైంది. హర్షుడు.. పులకేశితో యుద్ధానికి చేసిన సన్నాహాల గురించి బాణభట్టు తన రచనల్లో వివరించాడు. వీరి మధ్య జరిగిన యుద్ధం గురించిన ప్రస్తావన రెండో పులకేశికి చెందిన ఐహోల్ ప్రశస్తిలో కనిపిస్తోంది. ఈ యుద్ధంలో హర్షుడి విజయం సందిగ్ధకరం అని భావించాలి. పులకేశి వారసులు ఈ యుద్ధంలో పులకేశి విజయం సాధించినట్లు పేర్కొన్నారు. అయితే చరిత్రకారులు వీరి మధ్య స్నేహపూర్వక ఒప్పందం జరిగినట్లు భావిస్తున్నారు. హర్షుడు సాధించిన సైనిక విజయాల సమాచారం అతడు జారీ చేసిన వివిధ శాసనాల ద్వారా లభిస్తోంది. హర్షుడు బన్సిఖేర, మధుబన్, సోనేపట్ మొదలైన శాసనాలను జారీ చేశాడు. హర్షుడు మరణించే నాటికి అతడి రాజ్యంలో కాశ్మీర్ తప్ప మిగిలిన ఉత్తర భారతదేశమంతా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అంతర్భాగంగా ఉండేది. అందుకే హర్షుడిని ఉత్తర భారతదేశాన్ని పాలించిన చివరి గొప్ప హిందూ రాజుగా పరిగణిస్తారు. పాలనా విధానం ప్రాచీన భారతదేశ చరిత్రలో చివరిసారిగా ఒక పటిష్టమైన పాలనాపద్ధతిని ఏర్పాటు చేసిన రాజు హర్షుడు. ఇతడి పాలనా సమర్థత వల్ల గుప్తుల అనంతరం ఉత్తర భారతంలో దాదాపు 40 ఏళ్లపాటు శాంతియుత వాతావరణం ఏర్పడింది. కనౌజ్‌కు దగ్గరగా ఉన్న ప్రాంతాలను ఇతడు ప్రత్యక్షంగా పాలించినప్పటికీ.. పరోక్ష పాలనలో మాత్రం చాలా ప్రాంతాలుండేవి. హర్షుడి కాలంలో వచ్చిన ప్రధాన మార్పు భూస్వామ్య వ్యవస్థ ఏర్పడటం. దీంతోపాటు సామంత వ్యవస్థ కూడా పెరిగిపోయింది. ఒక రాజుకు ఉన్న సామంతుల సంఖ్యను బట్టి అతడి గొప్పదనాన్ని అంచనా వేయడం ప్రారంభమైంది. హర్షుడు తన సామ్రాజ్యాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం అనేక రాష్ట్రాలుగా విభజించాడు. వీటిని ‘భుక్తి’ అని పిలిచేవారు. రాష్ట్రాలను ‘విషయ’ అనే పేరుతో జిల్లాలుగా విభజించారు. జిల్లాలను ‘పాథక’ అని విభజించారు. పాలనలో చిట్టచివరి విభాగం గ్రామం. పరిపాలనలో రాజుకు సహాయంగా మంత్రి పరిషత్ ఉండేది. హర్షుడి అధికారుల్లో ముఖ్యమైనవారు మంత్రి, సేనాపతి, మహాసామంత, కుమారామాత్య, ఉపారిక, విషయపతి, రాజస్థానీయ తదితరులు. ఉన్నతాధికారులందరికీ వేతనాలను భూముల రూపంలోనే చెల్లించేవారు. కేవలం కిందిస్థాయి సైనికులకే జీతాలను నగదు రూపంలో చెల్లించేవారు. అందుకే ఈ కాలంలో అతి తక్కువ సంఖ్యలో నాణేలు కనిపిస్తాయి. నాణేల కొరతకు మరో కారణం.. ఈ కాలంలో వ్యాపార వాణిజ్యాలు మరింతగా క్షీణించడమే. ప్రజలపై పన్నుల భారం తక్కువగానే ఉండేది. రాజ్యానికి ప్రధాన ఆదాయ వనరు భూమిశిస్తు. ఇది పంటలో ఆరో వంతుగా ఉండేది. ‘తుల్యమేయ’ అనే అమ్మకం పన్ను కూడా విధించారు. - కె. యాకూబ్‌బాష, సబ్జెక్టు నిపుణులు -
విమోచనా? విలీనమా?
స్వాతంత్య్రానంతర భారత చరిత్రలో అత్యంత వివాదాస్పదమైన పరిణామాలకు, వ్యాఖ్యానాలకు దారితీసిన ఘటన తెలంగాణలో నిజాం ప్రభుత్వం పై భారత సైనిక చర్య ఘటన. నాటి హోమంత్రి సర్దార్ పటేల్ ఆదేశానుసారం నిజాం ప్రభుత్వంపై భారత సైన్యం జరిపిన దాడితో దేశం మొత్తంలో రాజ సంస్థానాల విలీనం అనేది ఒక కొలిక్కి వచ్చిన మాట నిజమే. కానీ 1948 సెప్టెంబర్ 17న జరిగిన ఆ ఘటన తెలంగాణ విమోచనా, పండుగ దినమా, విలీనమా, విషాదమా, విద్రోహమా అంటూ నేటికీ వివిధ వర్గాలు పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చేస్తూనే వస్తున్నాయి. ఒక చారిత్రక ఘటన ముగిసి 66 ఏళ్లు అయిన తర్వాత కూడా సమాజం ఒక ఉమ్మడి అభి ప్రాయానికి రాకపోవడం ఆ ఘటనకున్న అపూర్వ ప్రాధాన్యతను, సంక్లిష్టతను స్పష్టం చేస్తోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, తెలంగా ణతోసహా పూర్వపు నిజాం రాజ్యంలో అంతర్భాగా లుగా ఉండి ఇప్పుడు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో విలీనమైన జిల్లాల్లోని ప్రజలు భారత సైనిక దాడి ఘటనను విమోచన దినంగానే జరుపుకుంటున్నా రు. పైగా, మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు ఈ విమోచనా దినోత్సవాలను అధికారికంగానే నిర్వహి స్తున్నాయి. కానీ, నిజాం నిరంకుత్వం నుంచి విము క్తి పొందిన ఆ చారిత్రక ఘట్టాన్ని నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కానీ నేటి తెలంగాణ రాష్ట్రంలో కానీ విమోచన దినోత్సవంగా జరుపుకోవడానికి ప్రభు త్వాలే సాహసించకపోవడం ఒక వైచిత్య్రం కాగా, దాన్ని ఏ పేరుతో పిలవాలి అనే అంశంపై కూడా ప్రభుత్వాలు నోరు మెదపడం లేదు. అయితే ఆనాడు జరిగింది భారత్‌లో నిజాం రాజ్య విలీనం మాత్రమే అనే వాదన నాటి ప్రజల అభీష్టాన్ని ప్రతి బింబించకపోవచ్చని ఒక అభిప్రాయం ఉంది. నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఆంధ్రమ హాసభ, ఆర్యసమాజం, హిందూ మహాసభ, తది తర సంస్థలు తిరుగుబాటు ఉద్యమాలు నడిపిందీ.. కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో సాగిన సాయుధ పోరా టంలో వేలాదిమంది ప్రజలు తమ ధన, మాన, ప్రాణాలు ఫణంగా పెట్టిందీ.., జైలు నిర్బంధాలకు వెరవకుండా పోరుబాటకు సాహసించినదీ నిజాం పాలన నుంచి విముక్తికోసమే. ఒక్కమాటలో చెప్పా లంటే ఆనాటి క్రూర పెత్తందారీతనం కోరల నుంచి బయటపడటానికి తెలంగాణ ప్రజానీకాన్ని ఏక తాటి మీద నిలిపిన తక్షణావసరం విమోచనే తప్ప విలీనం కాదని గ్రహించాలి. కానీ సైనిక చర్య అనంతరం రజాకార్ల దురాగ తాలపై ప్రతీకారచర్య పేరిట నిజాం సంస్థానంలో చెలరేగిన హింస, దాడులు, ఒక మతస్తులపై జరిగిన సాయుధ దాడులు, కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు, ప్రజలపై భారత సైన్యం జరిపిన దాడులు... పరిమా ణంలో తక్కువేం కాదని చరిత్ర రుజువులు చెబుతు న్నాయి. భారత ప్రభుత్వం తెలంగాణ ప్రజలపై సైనికచర్య చేపట్టిన రోజు సెప్టెంబర్ 17 అనీ, నాలు గు వేల పైచిలుకు రైతాంగ సాయుధ పోరాట వీరు లు అమరులు కావడానికి, వేలాది ముస్లింలు ప్రతీ కారదాడుల్లో పాణాలు కోల్పోవడానికీ పునాది పడ్డ పీడ రోజు తెలంగాణ చరిత్రలో విద్రోహదినమే తప్ప అది విమోచనా కాదు, విలీనమూ కాదు అనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. కానీ 1948 సైనిక చర్య ద్వారా జరిగింది దురా క్రమణతో కూడిన విలీనమే అని అప్పట్లో ప్రకటిం చిన, వాదించిన కమ్యూనిస్టులు కూడా విస్తృతార్థం లో సెప్టెంబర్ 17ను తెలంగాణలో పండుగలా జర పాలని గతంలోనే నిర్ణయించారు. విమోచన అంటే ముస్లింలను అవమానపర్చినట్లు అవుతుందనే వాద న తెలంగాణ ప్రభుత్వాన్ని విమోచన దినోత్సవం జోలికిపోకుండా చేస్తున్నట్లుంది. కానీ నాటి సాయు ధ పోరాటం ప్రధానంగా నిజాంకి వ్యతిరేకంగానే తప్ప ముస్లింలకు వ్యతిరేకంగా కాదు. భావోద్వేగా లతో కూడిన నిజాంపై భారత సైనిక చర్యను విస్తృ తార్థంలో విమోచన దినంగా గుర్తించడమే నాటి ప్రజల త్యాగాలకు గుర్తింపుగా ఉంటుంది. (సెప్టెంబర్ 17న నిజాం నిరంకుశత్వం నుంచి తెలంగాణ విమోచన జరిగిన సందర్భంగా) కొనగంటి మోహనరావు, హైదరాబాద్ -
ఇండియాని అల్లకల్లోలం చేసిన పది భూకంపాలు
-
లోతైన విశ్లేషణ.. విజయానికి మార్గం
సుమారు అయిదు వేల ఏళ్ల చరిత్ర... అనేక పోరాటాలు... ఎన్నో ముఖ్యమైన సంఘటనలు... సమాజంపై ప్రభావం చూపిన వ్యక్తులు తదితర అంశాలతో కూడిన చరిత్రను అధ్యయనం చేస్తూ ఉంటే ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. అభ్యర్థులకు హిస్టరీ పట్ల మక్కువ పెరగడానికి ప్రధాన కారణమిదే. విశాల పరిధి ఉన్నప్పటికీ చదివేటప్పుడు ఎంతో కుతూహలాన్ని కలిగిస్తూ సులభంగా అర్థమయ్యే స్వభావం హిస్టరీకి ఉంది. దీంతో నాన్ ఆర్ట్స అభ్యర్థులు కూడా చరిత్రపై సులువుగా పట్టు సాధించగలుగుతున్నారు. తద్వారా మంచి మార్కులు సాధిస్తున్నారు. భారత దేశ చరిత్ర ప్రస్తుత పోటీ పరీక్షలకు సంబంధించి జయాపజయాల్లో జనరల్ స్టడీస్ కీలకపాత్ర పోషిస్తోంది. జనరల్ స్టడీస్ (జీఎస్)లోని ప్రధాన అంశాల్లో చరిత్ర ఒకటి. గ్రూప్-1 ప్రిలిమ్స్, గ్రూప్-2 తదితర పరీక్షల్లో హిస్టరీ నుంచి 25 - 30 ప్రశ్నలు తప్పనిసరిగా వస్తున్నాయి. జనరల్ స్టడీస్‌లోని మిగిలిన సబ్జెక్టులతో పోలిస్తే హిస్టరీ పరిధి విశాలమైంది. ప్రిపరేషన్ ప్లాన్ ప్రధాన నియామక పరీక్షల సిలబస్‌లలో చరిత్రకు సంబంధించి స్వాతంత్య్ర ఉద్యమాన్ని ప్రత్యేక దృష్టితో చదవాలని పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక భారతదేశ చరిత్ర మూడింటికీ సమాన ప్రాధాన్యమిస్తూ ప్రిపరేషన్ కొనసాగించాలి. మిగిలిన విభాగాలతో పోలిస్తే ఆధునిక భారతదేశ చరిత్ర నుంచి రెండు లేదా మూడు ప్రశ్నలు అధికంగా వస్తున్నాయి. సన్నద్ధతలో భాగంగా గత ప్రశ్నపత్రాలను తప్పనిసరిగా పరిశీలించాలి. ముఖ్యంగా ఇటీవల నిర్వహించిన వివిధ పరీక్షల్లోని ప్రశ్నల సరళిని తెలుసుకోవాలి. ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయో గుర్తించడం ద్వారా కీలక అంశాలకు అధిక సమయం కేటాయించి తగినట్లుగా పునశ్చరణ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. దీంతో మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. ప్రశ్నల సరళి: చరిత్రలో సాధారణంగా రెండు రకాలుగా ప్రశ్నలు అడుగుతున్నారు. ఎ. నేరుగా అడిగే ప్రశ్నలు: వీటినే ఏక పద సమాధాన ప్రశ్నలు లేదా ఫ్యాక్ట్ బేస్డ్ ప్రశ్న లుగా పేర్కొనవచ్చు. ఉదా (1): మొదటిసారిగా ‘గోత్రా’ అనే పదాన్ని ఏ వేదంలో ప్రస్తావించారు? 1) సామవేదం 2) రుగ్వేదం 3) అధర్వణ వేదం 4) యజుర్వేదం సమాధానం: 2 ఉదా (2): నలంద విశ్వ విద్యాలయ స్థాపకుడుఎవరు? 1) నలందుడు 2) అశోకుడు 3) హర్షవర్ధనుడు 4) కుమార గుప్తుడు సమాధానం: 4 ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గుర్తించాలంటే విషయ పరిజ్ఞానం ఉంటే సరిపోతుంది. బి. ఇన్ డెరైక్ట్‌గా అడిగే ప్రశ్నలు: వీటిని కాన్సెప్ట్ ఆధారిత ప్రశ్నలు అంటారు. ఉదా (1): కిందివాటిలో బుద్ధుడి బోధనలు ప్రదానంగా దేనికి సంబంధించినవి? 1) భగవంతుడిపై విశ్వాసం 2) క్రతువులు నిర్వహించడం 3) ఆలోచన, ప్రవర్తనల్లో శుద్ధత 4) విగ్రహారాధన సమాధానం: 3 ఉదా (2): దాదాబాయి నౌరోజీకి సంబంధించి కిందివాటిలో సరైంది ఏది? ఎ. భారతదేశంలో బ్రిటిషర్ల ఆర్థిక దోపిడీని బట్టబయలు చేయడం బి. భారత ప్రాచీన గ్రంథాల ఆధారంగా భారతీయుల్లో ఆత్మ విశ్వాసాన్ని పునరుద్ధరించడం సి. సాంఘిక దురాచారాలు రూపుమాపడానికి కృషి చేయడం డి. పార్శీ మత అభివృద్ధికి కృషి చేయడం 1) ఎ మాత్రమే 2) ఎ, బి 3) ఎ, బి, సి 4) డి మాత్రమే సమాధానం: 3 ఉదా (3): జూన్ 3, 1947 మౌంట్ బాటన్ ప్రణాళికలో లేని అంశం? 1) సమాఖ్య ప్రభుత్వ నిర్మాణం 2) రాజ్యాంగ నిర్మాణానికి సంబంధించిన మార్గదర్శకాలు 3) {బిటిషర్ల నుంచి భారతీయులకు అధికార మార్పిడి 4) దేశంలో జరుగుతున్న మత ఘర్షణలను నిరోధించడం సమాధానం: 4 ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలంటే సబ్జెక్ట్ పట్ల పూర్తి అవగాహన ఉండాలి. బిట్స్ రూపంలో ఉండే మెటీరియల్‌ను కాకుండా విషయంపై పూర్తి అవగాహనను కలిగించే, లోతైన అధ్యయనానికి ఆస్కారముండే ప్రామాణిక పాఠ్య పుస్తకాలను చదవాలి. ఒక అంశాన్ని చదివేటప్పుడే దాన్నుంచి ఏయే కోణాల్లో ప్రశ్నలు వచ్చే అవకాశముందో అంచనా వేసుకుంటూ చదవడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. భారతదేశ చరిత్రను మూడు భాగాలుగా విభజించారు. అవి: ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక భారతదేశ చరిత్ర. ఈ మూడు విభాగాల్లోనూ తప్పనిసరిగా, తరచుగా ప్రశ్నలు వచ్చే పాఠ్యభాగాల గురించి తెలుసుకుందాం... ప్రాచీన భారతదేశ చరిత్ర ప్రాచీన భారతదేశ చరిత్రలో సింధూ, వేద నాగరికత, జైన, బౌద్ధ మతాలు, మౌర్యులు, గుప్తులపై ప్రశ్నలు తప్పనిసరిగా ఉంటున్నాయి. మిగిలిన పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలు అరుదుగానే వస్తున్నాయి. కాబట్టి ప్రాచీన భారతదేశ చరిత్రపై అవగాహన కోసం శిలాయుగాల నుంచి గుప్తుల అనంతర యుగం వరకు చదివినప్పటికీ పైన పేర్కొన్న అంశాలపై ప్రధానంగా దృష్టి సారించాలి. గతంలో ఈ విభాగం నుంచి వచ్చిన కొన్ని ప్రశ్నలను పరిశీలిద్దాం.. 1. సింధూలోయ నాగరికతను మొదటగా కనుగొన్న పురావస్తు శాస్త్రవేత్త? 1) చార్లెస్ మాసన్ 2) జాన్ మార్షల్ 3) అలెగ్జాండర్ కన్నింగ్‌హామ్ 4) మార్టిమమ్ వీలర్ సమాధానం: 1 2. డబ్బును రుణంగా ఇవ్వడమనే భావనను తొలిసారిగా ప్రస్తావించిన గ్రంథం ఏది? 1) అధర్వణ వేదం 2) యజుర్వేదం 3) గోపథ బ్రాహ్మణం 4) శతపథ బ్రాహ్మణం సమాధానం: 4 3. అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్ర చేసిన సంవత్సరం? 1) క్రీ.పూ. 327 2) క్రీ.పూ. 303 3) క్రీ.పూ. 302 4) క్రీ.పూ. 298 సమాధానం: 1 4. కవిరాజుగా పేరుగాంచిన వారెవరు? 1) మొదటి కుమార గుప్తుడు 2) మొదటి చంద్రగుప్తుడు 3) చంద్రగుప్త విక్రమాదిత్య 4) సముద్ర గుప్తుడు సమాధానం: 4 5. హర్షుని కాలంలో అధికంగా వ్యాప్తిలో ఉన్న దురాచారం? 1) పరదా పద్ధతి 2) బాల్య వివాహాలు 3) కులాంతర వివాహాలపై నిషేధం 4) సతీ సహగమనం సమాధానం: 2 మధ్యయుగ భారత చరిత్ర హర్షుడి అనంతర కాలం నుంచి మొగలులు, శివాజీ వరకు ఉన్న మధ్యయుగ భారత చరిత్రలో ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అంశాలు.. తొలిమధ్య యుగం, ఢిల్లీ సుల్తానత్, భక్తి ఉద్యమాలు, విజయనగర సామ్రాజ్యం మొదలైనవి. మిగిలిన అంశాలపై ప్రశ్నలు అరుదుగా ఉంటాయి. 1. చోళుల పాలనలోని విభాగమైన పెద్ద గ్రామాన్ని ఏమని పిలిచేవారు? 1) కుర్రమ్ 2) కొట్టమ్ 3) నాడు 4) తణియార్ సమాధానం: 2 2. చాళుక్యుల చిత్రకళ లభిస్తున్న ప్రాంతం? 1) అజంతా 2) ఐహోల్ 3) ఎల్లోరా 4) హంపి సమాధానం: 2 3. గజనీ మహమ్మద్‌తోపాటు వచ్చిన ముస్లిం పండితుడు? 1) ఇబన్ బతూతా 2) ఆల్బెరూనీ 3) అమీర్ ఖుస్రో 4) ఫెరిష్టా సమాధానం: 2 4. ఇక్తాదారీ వ్యవస్థను ప్రారంభించిన సుల్తాన్ ఎవరు? 1) బాల్బన్ 2) ఐబక్ 3) ఇల్‌టుట్ మిష్ 4) అల్లావుద్దీన్ ఖిల్జీ సమాధానం: 3 5. హిందూస్థానీ సంగీతాన్ని అధికంగా ప్రభావితం చేసింది? 1) అరబ్ - పర్షియన్ సంగీతం 2) పర్షియన్ సంగీతం 3) యూరోపియన్ సంగీతం 4) మధ్యాసియా సంప్రదాయాలు సమాధానం: 2 6. రామానుజుడు బోధించినది? 1) అహింస 2) భక్తి 3) జ్ఞానం 4) వేదాలు సమాధానం: 2 7. వివాహ పన్నును ఉపసంహరించుకున్న విజయనగర రాజు? 1) శ్రీకృష్ణ దేవరాయలు 2) రెండో దేవరాయలు 3) అచ్యుత రాయలు 4) సదాశివ రాయలు సమాధానం: 1 ఆధునిక భారత చరిత్ర ఈ విభాగంలో స్వాతంత్రోద్యమానికి అధిక ప్రాధాన్యమిస్తూ చదవాలి. అధిక ప్రశ్నలు వచ్చే అవకాశమున్న విభాగం కూడా ఇదే. రాజకీయాధికార సాధన, పరిపాలన, బ్రిటిష్ వ్యతిరేక తిరుగుబాట్లు, సామాజిక, మత సంస్కరణోద్యమాలు, జాతీయోద్యమం మొదలైనవాటిపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఈ విభాగం నుంచి అధికంగా అభ్యర్థుల అవగాహనను పరిశీలించేవిధంగా ప్రశ్నల కూర్పు ఉంటుంది. కింది ప్రశ్నలు గమనించండి.. 1. గాంధీజీ ఎరవాడ జైలులో 1932లో దేనికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేశారు? 1) రామ్సే మెక్‌డోనాల్డ్ కమ్యూనల్ అవార్డు 2) సత్యాగ్రాహిలపై బ్రిటిషర్ల అణచివేత 3) గాంధీ - ఇర్విన్ ఒప్పంద ఉల్లంఘన 4) కలకత్తాలోని మతకలహాలు సమాధానం: 1 2. హంటర్ కమిషన్‌ను దేనిపై విచారణకు నియమించారు? 1) జలియన్ వాలాబాగ్ దుర్ఘటన 2) ఖిలాఫత్ ఆందోళన 3) బార్డోలీ సత్యాగ్రహం 4) చౌరీ-చౌరా సంఘటన సమాధానం: 1 3. బంకించంద్ర ‘ఆనంద్‌మఠ్’ రచించిన సంవత్సరం? 1) 1895 2) 1892 3) 1885 4) 1882 సమాధానం: 4 4. 1873లో ‘సత్యశోధక్ సమాజ్’ను స్థాపించిందెవరు? 1) లోకాహిత వాది 2) ఆర్.జి. భండార్కర్ 3) జ్యోతిబా పూలే 4) రామానంద తీర్థ సమాధానం: 3 5. భారత్‌లో మిలిటెంట్ జాతీయవాదానికి ఎవరిని ఆద్యుడిగా భావిస్తారు? 1) వి.డి. సావర్కర్ 2) భాయ్ రాంసింగ్ 3) భగత్‌సింగ్ 4) వాసుదేవ బల్వంత్ ఫాడ్కే సమాధానం: 4 6. జాతీయోద్యమంలో అతి తక్కువగా పాల్గొన్న వర్గం ఏది? 1) పెట్టుబడి దారులు 2) రాజ్యాధినేతలు 3) ప్రభుత్వాధికారులు 4) రైతులు సమాధానం: 2 7. మూడో మైసూర్ యుద్ధంలో టిప్పు సుల్తాన్‌కు వ్యతిరేకంగా పోరాడింది? 1) ఆంగ్లేయులు, కర్ణాటిక్ నవాబ్, హైదరాబాద్ నిజాం 2) ఆంగ్లేయులు, మరాఠాలు, హైదరాబాద్ నిజాం 3) ఆంగ్లేయులు, మరాఠాలు, కర్ణాటిక్ నవాబ్ 4) ఆంగ్లేయులు, హైదరాబాద్ నిజాం, మైసూర్ రాజా సమాధానం: 2 -
‘సంగం’ సమ్మేళనాలు ఎక్కడ జరిగేవి?
భారతదేశ చరిత్ర, పారశీక, గ్రీకు దండయాత్రలు భారతదేశంపై విదేశీ దండయాత్రలకు అంకురార్పణ చేసినవారు పారశీకులు. ఇరాన్ దేశాన్ని పూర్వం పర్షియా అని పిలిచేవారు. ఆ దేశానికి చెందిన పారశీకులు క్రీ.పూ. 6వ శతాబ్దంలో భారత వాయవ్య ప్రాంతంపై దండయాత్రలు చేసి సుమారు 200 ఏళ్లు పాలించారు. వీరిలో మొదటిరాజు సైరస్. ఆయన మొదట ‘గాంధార’ను జయించాడు. వీరితోనే ఇండో-పర్షియన్ సంస్కృతి అభివృద్ధి చెందింది. కుడి నుంచి ఎడమకు రాసే ‘ఖరోష్టి లిపి’ పారశీకుల వల్ల భారత్‌లో ప్రవేశించింది. అశోకుడి శిలాశాసనాలు ఈ లిపిలోనే ఉన్నాయి. గ్రీకుల దండయాత్రలు- అలెగ్జాండర్ (క్రీ.పూ. 327-324) భారతదేశంపై దండయాత్ర చేసిన మొట్టమొదటి యూరోపియన్లు గ్రీకులు. వీరు ఇండియా గొప్పతనాన్ని పారశీకుల ద్వారా తెలుసుకున్నారు. క్రీ.పూ. 4వ శతాబ్దంలో మాసిడోనియా (గ్రీక్ రాజ్యం) చక్రవర్తి అయిన అలెగ్జాండర్ ‘అరబేలా యుద్ధం’లో పర్షియా రాజైన మూడో డేరియస్ను ఓడించి పర్షియాను ఆక్రమించాడు. ఆ విధంగా పారశీక సామ్రాజ్యంలో భాగంగా ఉన్న భారత వాయవ్య ప్రాంతం గ్రీకుల ఆధీపత్యంలోకి వెళ్లింది. ప్రపంచ విజేత కావాలన్న కోరికతో ఉన్న అలెగ్జాండర్ క్రీ.పూ. 327లో భారత్‌పై దండయాత్ర చేశాడు. ఈ విషయం తెలుసుకున్న తక్షశిల రాజు ‘అంభి’, తన పొరుగురాజైన ‘పోరస్’ (పురుషోత్తముడు)పై శత్రుత్వంతో అలెగ్జాండర్‌ను తమ భూభాగంలోకి ఆహ్వానించాడు. మొదట తక్షశిలను ఆక్రమించిన అలెగ్జాండర్ జీలం, చినాబ్ నదుల మధ్య ప్రాంతాన్ని పాలిస్తున్న పురుషోత్తముడిపై దాడిచేసి అతన్ని బందీగా పట్టుకున్నాడు. ఇక్కడ స్వదేశీ రాజుల మధ్య ఉన్న అనైక్యత అలెగ్జాండర్‌కు కలిసోచ్చింది. వీరోచితంగా పోరాడి ఓడిన పురుషోత్తముడి దేశభక్తిని మెచ్చిన అలెగ్జాండర్ అతని రాజ్యాన్ని అతనికే ఇచ్చి స్వతంత్ర రాజుగా ప్రకటించాడు. తన కోరిక తీరకుండానే అలెగ్జాండర్ క్రీ.పూ. 324లో తీవ్ర అనారోగ్యంతో ‘బాబిలోనియా’ వద్ద మరణించాడు. ఈ వార్తవిన్న గ్రీస్‌లోని అలెగ్జాండర్ ప్రతినిధి ‘సెల్యూకస్ నికేటర్’ స్వాతంత్య్రం ప్రకటించుకున్నాడు. భారతదేశంలో తన రాయబారిగా ‘మెగస్తనీస్’ను నియమించాడు. మెగస్తనీస్.. ఆనాటి భారతదేశ సాంఘిక, ఆర్థిక పరిస్థితులపై ఇండికా అనే గ్రంథాన్ని రచించాడు. గ్రీకుల దండయాత్రల వల్ల ఇండో-గ్రీకు సంస్కృతి, సంప్రదాయాలు మన దేశంలో నెలకొన్నాయి. గ్రీకుల నాణేల ముద్రణా పద్ధతి, ఖగోళ విజ్ఞానం, శిల్ప శైలి భారత్‌లో ప్రవేశించాయి. అలెగ్జాండర్ దండయాత్ర భారతదేశ చరిత్రలో కచ్చితమైన కాల నిర్ణయం చేయడానికి ఉపకరిస్తుంది. మగధ రాజ్య విజృంభణ క్రీ.పూ. 6వ శతాబ్దంలో సామాజిక, మత విషయాల్లోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా విప్లవాత్మక మార్పులు సంభవించాయి. ‘షోడశ మహాజనపదాల’నే 16 స్వతంత్య్ర రాజ్యాలు ఏర్పడ్డాయి. అవి అంగ, కాశీ, కోసల, మగధ, వజ్జి, మల్ల, చేది, వత్స, కురు, పాంచాల, మత్స్య, శూరసేన, అశ్మక (బోధన్), అవంతి, కాంభోజ, గాంధార. వీటిలో మగధ.. ఇతర రాజ్యాలపై ఆధిపత్యాన్ని నెలకొల్పి భారతదేశ చరిత్రలో మొదటి సామ్రాజ్యంగా అవతరించింది. మగధ రాజధాని రాజగృహ (గిరివ్రజపురం). ఆ కాలంలో మగధ మహాజనపదాన్ని బృహధృదవంశం పాలించేది. ఆ వంశపు చివరి రాజైన రిపుంజయుణ్ణి ఓడించిన హర్యాంక వంశీయులు మగధ సామ్రాజ్యానికి పునాదులను వేశారు. హర్యాంక వంశస్థాపకుడు బింబిసారుడు. ఇతడు గౌతమ బుద్ధుడికి సమకాలీకుడు. ఆయన తర్వాత అజాత శత్రువు సామ్రాజ్య విస్తరణకు కృషి చేశాడు. అతడు పాటలీపుత్ర నగర నిర్మాత. క్రీ.పూ. 483లో రాజగృహలో మొదటి బౌద్ధసంగీతిని (సమావేశం) నిర్వహించాడు. హర్యాంక వంశ చివరి రాజు ‘నాగదాసకుడి’ని ఓడించి ‘శిశునాగుడు’ శైశునాగవంశాన్ని స్థాపించాడు. అతని వారసుడైన ‘కాలాశోకుడు’ తన రాజధానిని ‘వైశాలి’ నుంచి పాటలీపుత్రానికి మార్చాడు. కాలాశోకుడు క్రీ.పూ. 383లో రెండో బౌద్ధ సంగీతిని ‘వైశాలి’లో నిర్వ లహించాడు. తర్వాత మగధలో మహాపద్మనందుడు క్రీ.పూ. 360లో నంద వంశాన్ని స్థాపించి పాలనలోకి వచ్చాడు. నంద వంశస్థులు మగధ సామ్రాజ్యాన్ని బలిష్టం చేశారు. వీరి వంశ చివరి రాజు ‘ధననుదుడు. ఆయనకు అలెగ్జాండర్ సమకాలీనుడని చరిత్రకారుల అభిప్రాయం. కౌటిల్యుడు (చాణక్యుడు) సహాయంతో చంద్రగుప్తుడు క్రీ.పూ. 321లో నందవంశాన్ని నిర్మూలించి మౌర్యవంశ పాలనకు పూనుకున్నాడు. మౌర్య సామ్రాజ్యం మంచి పరిపాలనదక్షుడైన చంద్రగుప్తుడు తనపై దాడిచేసిన సెల్యూకస్ నికేటర్ (గ్రీకురాజు)ను ఓడించాడు. గ్రీకుల రాయబారిగా మెగస్తనీస్ను అంగీకరించాడు. గుజరాత్లో సుదర్శన తటాకాన్ని తవ్వించాడు. చంద్రగుప్తుడు తన అవసాన దశలో జైన భిక్షువుగా మారి సల్లేఖన వ్రతం (ఉపవాస దీక్ష)ను ఆచరించి మైసూర్ సమీపంలోని శ్రావణ బెళగొళలో నిర్యాణం (మరణం) చెందాడు. చంద్రగుప్తుడి ప్రధానమంత్రి కౌటిల్యుడు (చాణక్యుడు లేదా విష్ణుశక్తి) సుప్రసిద్ధుడు. అతడు ‘అర్థశాస్త్రం’ గ్రంథాన్ని రాశాడు. అది ప్రాచీన భారత రాజనీతి తత్వానికి మూలాధారం. చంద్రగుప్తుని అనంతరం బిందుసారుడు సింహసనం అధిష్టించాడు. అతని కుమారుడే అశోక చక్రవర్తి. అశోకుడు క్రీ.పూ. 273లో మౌర్య చక్రవర్తి అయి సువిశాల సామ్రాజ్యాన్ని నిర్మించాడు. కళింగ రాజ్యం (ఒడిశా ప్రాంతం)ను ఆక్రమించుకోవడానికి భువనేశ్వర్‌కు సమీపంలోని ‘ధౌలి’ వద్ద క్రీ.పూ. 261లో ‘కళింగ యుద్ధం’ చేశాడు. ఆ యుద్ధంలో గెలిచిన అశోకుడు యుద్ధ మరణాలను, నష్టాలను, క్షతగాత్రులను చూసి పశ్చాత్తాపం చెందాడు. ఉపగుప్తుడనే బౌద్ధ గురువు వద్ద బౌద్ధమతాన్ని స్వీకరించి సత్యం, శాంతి, అహింస, న్యాయం, ధర్మం గురించి వివిధ ప్రాంతాల్లో ప్రచారం చేశాడు. అశోకుడికి ‘దేవానాంప్రియా’, ‘ప్రియదర్శిని’ అనే బిరుదులున్నాయి. శ్రీనగర్ (జమ్మూకాశ్మీర్ రాజధాని) పట్టణాన్ని నిర్మించాడు. సాంద్రీ, బార్హత్, సార్నాథ్, అమరావతి స్థూపాలను ప్రతిష్టించాడు. భారత ప్రభుత్వ రాజ చిహ్నంగా ఉన్న ‘మూడు సింహాల’ (అసలు నాలుగు సింహాలు, నాలుగోది వెనుక వైపు ఉంటుంది) కిరీటాన్ని భోపాల్ దగ్గరలోని సార్నాథ్ స్థూపం నుంచి గ్రహించారు. ఆ స్థూపం నుంచే బౌద్ధ ధర్మ చక్రాన్ని పోలిన అశోక చక్రాన్ని మన జాతీయ జెండా మధ్యలో పొందుపర్చారు. అశోకుడు క్రీ.పూ. 250లో 3వ బౌద్ధ సంగీతిని పాటలీపుత్రంలో ఏర్పాటు చేశాడు. పరమత సహనమే బౌద్ధమత ధర్మంగా భావించేవాడు. బౌద్ధమత వ్యాప్తికి తన కూతురు సంఘమిత్రను, కుమారుడు మహేంద్రుడిని విదేశాలకు పంపాడు. భారతదేశ చరిత్రలో శిలాశాసనాలు వేయించిన మొదటి చక్రవర్తి అశోకుడు. ఈ శాసనాలు ‘బ్రహ్మీలిపి’లో ఉన్నాయి. అశోకుడు 13వ శిలాశాసనం కళింగ యుద్ధ దుష్ఫలితాలను తెలుపుతుంది. అశోకుడు తన ‘దమ్మ’ (ధర్మ) విధాన సూత్రాలను ప్రజలకు సులభంగా అర్థమయ్యే ప్రాకృత భాషలో శిలాశాసనాల్లో చెక్కించాడు. బౌద్ధ ధర్మం, అశోకుడి దమ్మ విధానం వేర్వేరు. అతడు క్రీ.శ. 232లో చనిపోయాడు. మౌర్యవంశ చివరి రాజైన బృహద్రదున్ని, అతని సేనాని పుష్యమిత్రశుంగుడు వధించి శుంగవంశ పాలనకు ఆద్యుడయ్యాడు. మౌర్యుల పాలన విధానాలను తెలుసుకోవడానికి ముఖ్య ఆధారాలు.. కౌటిల్యుడి ‘అర్థశాస్త్రం, మెగస్తనీన్ ‘ఇండికా’, విశాఖదత్తుడి ‘ముద్రరాక్షసం’ గ్రంథాలు. మౌర్యుల ఆదాయ శాఖకు ముఖ్య అధికారిగా ‘సమాహర్త’, భూమిశిస్తును వసూలు చేసే అధికారిగా ‘గోపుడు’ ఉండేవారు. ఆస్తి తగాదాల పరిష్కారానికి ‘ధర్మస్థియ’, నేర విచారణ కోసం ‘కంటకశోభన’ అనే న్యాయస్థానాలుండేవి. సంగం యుగం ‘సంగం’ అంటే పాండ్యరాజులు ‘మధురై’ (రాజధాని)లో నిర్వహించిన కవి పండిత పరిషత్. క్రీ.పూ. 300 నుంచి క్రీ.శ. 300 సంవత్సరాల మధ్యలో భారత దక్షిణాపథాన్ని పాలించిన చేర, చోళ, పాండ్య రాజ్యాల చరిత్ర, సంస్కృతులను తెలిపే గ్రంథాల రచననను ఆ ‘సంగం’లోని పండితులు చేసేవారు. ఆ మూడు రాజ్యాలను కలిపి ‘తమిళకం’ అంటారు. చేర రాజ్యం: కేరళలోని కొచ్చిన్, తిరువాన్ కూర్ ప్రాంతాల్లో చేర రాజ్యం వర్థిల్లింది. సెంగుత్తువాన్ చేరరాజుల్లో ప్రసిద్ధుడు. అతనికి ‘ఎర్రచేర’ అన్న బిరుదు ఉంది. చేరుల రాజధాని ‘వంజి (కరూర్)’. ‘శిలప్పాధికారం’ అనే కావ్యం సెంగుత్తువాన్ విజయాలను వర్ణిస్తుంది. చోళరాజ్యం: ప్రాచీన చోళ వంశ స్థాపకుడు ‘ఎలార’. కరికాల చోళుడు గొప్పవాడు. వీరి రాజ్యం కావేరి డెల్టా ప్రాంతంలో విస్తరించింది. కరికాలుడు కావేరి పట్టణం (ప్రహార్)ను నిర్మించాడు. కావేరి నదికి ఆనకట్టలు కట్టించి వ్యవసాయాభివృద్ధికి కృషి చేశాడు. పాండ్యరాజ్యం: కన్యాకుమారి (తమిళనాడు) ప్రాంతంలో వీరి రాజ్యం వర్థిల్లింది. రాజధాని ‘మధురై’. స్థాపకుడు ముదుకుడిమి పెరువల్లుడి. తమిళ సాహిత్య రంగంలో సంగం యుగాన్ని ‘స్వర్ణయుగం’గా పేర్కొంటారు. ఆ కాలంలోని ప్రఖ్యాత గ్రంథాలు. గ్రంథాలు రచయితలు 1. శిలప్పాధికారం - ఇలాంగో అడిగిల్ - ఇతిహాసం 2. మణిమేఖలై - సుత్తన్నై సత్తనార్ - ఇతిహాసం 3. తొల్కప్పీయం - తోల్కప్పీయర్ - వ్యాకరణ గ్రంథం 4. జీవక చింతామణి - తిరుత్తక్కదేవార్ - వైద్య గ్రంథం 5. తిరుక్కురల్ - తిరువళ్లువార్ - నీతికావ్యంగతంలో వచ్చిన ప్రశ్నలు 1. మధురైను రాజధానిగా పాలించిన వారు? (కానిస్టేబుల్ - 2012) 1) పాండ్యులు 2) చోళులు 3) పల్లవులు 4) రాష్ర్టకూటులు 2. అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్ర ఎప్పుడు చేశాడు? (ఎస్ఐ- 2011) 1) క్రీ.పూ. 298 2) క్రీ.పూ. 303 3) క్రీ.పూ. 302 4) క్రీ.పూ. 327 3. మగధను మౌర్యులు పాలించిన వెంటనే పాలించిన వారెవరు? (ఎస్ఐ- 2011) 1) కుషాణులు 2) పాండ్యులు 3) శాతవాహనులు 4) సుంగులు 4. ఏ రాజవంశం అత్యంత ప్రాచీనమైంది? (ఎస్ఐ- 2011) 1) గుప్తులు 2) కుషాణులు 3) మౌర్యులు 4) శాతవాహనులు 5. ‘ముద్రరాక్షసం’ అనే గ్రంథాన్ని రాసినవారు? (ఎస్ఐ- 2011) 1) కాళీదాసు 2) శూద్రకుడు 3) వరాహమిహురుడు 4) విశాఖదత్తుడు 6. పురాతన భారత భవన నిర్మాణ రంగంలో ‘ఖరోష్టి’ అనే పదాన్ని ఏ దేశంతో పరిచయ ఫలితంగా ఉపయోగించారు? (డిప్యూటీ జైలర్‌స- 2012) 1) చైనా 2) మధ్య ఆసియా 3) ఇరాన్ 4) గ్రీస్ 7. అశోకుడి శాసనాల్లో తనకు తాను ఏమని సంబోంధించుకున్నాడు? (డిప్యూటీ జైలర్‌స- 2012) 1) ధర్మకీర్తి 2) ధర్మవేద 3) చక్రవర్తి 4) ప్రియదర్శి 8. సంగం యుగంలో రచించిన ప్రముఖ తమిళ నీతి కావ్యం? (ఎక్సైజ్ కానిస్టేబుల్ - 2012) 1) మణిమేఖలై 2) తిరుక్కురల్ 3) జీవక చింతామణి 4) ఇండికా సమాధానాలు 1) 1 2) 4 3) 4 4) 3 5) 4 6) 3 7) 4 8) 2 -
పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలో అత్యధిక మార్కులు ఎలా ?
కాంపిటీటివ్ కౌన్సెలింగ్ : పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలో భారతీయ చరిత్ర, సంస్కృతి, జాతీయోద్యమాల నుంచి ఎలాంటి ప్రశ్నలు వస్తాయి? వీటిలో అత్యధిక మార్కులు సాధించడం ఎలా? -కె.సుమలత, సరూర్‌నగర్ పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలో అడిగే ఏడు విభాగాల్లో ఒకటి.. భారతదేశ చరిత్ర-సంస్కృతి-జాతీయోద్యమం. ఈ విభాగాన్ని పరిశీలిస్తే భారతదేశ చరిత్రలో మూడు భాగాలు ఉంటాయి. అవి.. ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక చరిత్ర. ఈ క్రమంలో హరప్పా నాగరికత నుంచి వేద యుగం, మౌర్యులు, గుప్తులు, శాతవాహనులు, కాకతీయుల కాలం నాటి సాంఘిక, రాజకీయ, ఆర్థిక, మత పరిస్థితులను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. అరబ్బులు, మొఘల్ సామ్రాజ్యం, బహమనీ సుల్తానులు, విజయనగర రాజులు, ప్రముఖ కవులు - వారి రచనల వరకు అన్ని అంశాలను చదవాలి. భారత జాతీయోద్యమంలో భాగంగా 1857 సిపాయిల తిరుగుబాటు, ఈస్టిండియా పాలన, భారత జాతీయ కాంగ్రెస్, అతివాదులు, మితవాదులు, బెంగాల్ విభజన, వందేమాతర ఉద్యమం, జలియన్ వాలాబాగ్ ఉదంతం, గాంధీజీ భారతదేశానికి రాక, దండి మార్చ్, సహాయ నిరాకరణోద్యమం, చౌరీచౌరా సంఘటన, భారత జాతీయ సైన్యం, క్విట్ ఇండియా ఉద్యమం, భారతదేశానికి సైమన్ కమిషన్ రాక, 1909 సంస్కరణలు, 1919 సంస్కరణలు, రౌలత్ చట్టం, ద్విజాతి సిద్ధాంతం, జాతీయోద్యమంలో పత్రికల పాత్ర, ప్రముఖుల నినాదాలు, స్వాతంత్య్రోద్యమంలో గాంధీజీ పాత్ర వంటి అంశాలను అధ్యయనం చేయాలి. పోలీస్ కానిస్టేబుల్ -2012 పరీక్షలో అడిగిన కొన్ని ప్రశ్నలు: 1. ఏ యుద్ధంతో విజయనగర సామ్రాజ్యం అంతరించింది? ఎ) తళ్లికోట యుద్ధం బి) పానిపట్టు యుద్ధం సి) మైసూర్ యుద్ధం డి) వెల్లూర్ యుద్ధం సమాధానం: ఎ 2. శాతవాహన వంశాన్ని ఎవరు స్థాపించారు? ఎ) హాలుడు బి) యజ్ఞశ్రీ సి) శ్రీముఖుడు డి) శాతకర్ణి సమాధానం: సి 3. జలియన్ వాలాబాగ్ మారణకాండ ఎప్పుడు జరిగింది? ఎ) 1918 బి) 1919 సి) 1920 డి)1921 సమాధానం: బి ఇన్పుట్స్: బి.ఉపేంద్ర, డెరైక్టర్, క్యాంపస్ స్టడీసర్కిల్, హైదరాబాద్ ఎడ్యూ న్యూస్: ఐఈఎల్టీఎస్ స్కాలర్షిప్స్ అందజేత ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ లాంగ్వే జ్ టెస్టింగ్ సిస్టమ్(ఐఈఎల్టీఎస్) ద్వారా వివిధ కోర్సుల్లో ప్రవేశం కల్పించేందుకు ఈ ఏడాది నుంచి మరికొన్ని దేశాలు ముందుకొచ్చాయని ఐఈఎల్టీఎస్ ఎగ్జామినేషన్ ఇండియా, కస్టమర్ సర్వీసెస్ సౌత్ ఆసియా డెరైక్టర్ సారా డెవెరాల్ తెలిపారు. ఎనిమిది మంది భారతీయ విద్యార్థులకు గురువారం నగరంలో బ్రిటీష్ కౌన్సిల్ నుంచి ఐఈఎల్టీఎస్ స్కాలర్షిప్లను అందజేశారు. ఈ సందర్భంగా డెవెరాల్ మాట్లాడుతూ... అంతర్జాతీయంగా 135 దేశాల్లోని 9000 సంస్థలు ఐఈఎల్టీఎస్ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నాయని చెప్పారు. ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు స్కాలర్షిప్లు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఎంపికైన విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.3 లక్షలు ఉపకార వేతనంగా ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ (హైదరాబాద్) ఆండ్రూ మెక్అలిస్టర్ తదితరులు పాల్గొన్నారు. జాబ్స్, అడ్మిషన్స అలర్ట్స గెయిల్ ఇండియా లిమిటెడ్: గెయిల్ ఇండియా లిమిటెడ్ సీనియర్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతోంది. ఖాళీల సంఖ్య: 61 విభాగాలు: కెమికల్, పీసీ ఆపరేషన్స్, మెకానికల్ - పీసీ ఓఅండ్ఎం, ఎలక్ట్రికల్ - పీసీ ఓఅండ్ఎం, ఇన్స్ట్రుమెంటేషన్ - పీసీ ఓఅండ్ఎం, మెకానికల్ - పైప్‌లైన్ ఓఅండ్ఎం, ఎలక్ట్రికల్ - పైప్‌లైన్ ఓఅండ్ఎం, ఇన్స్ట్రుమెంటేషన్ - పైప్‌లైన్ ఓఅండ్ఎం అర్హతలు: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత. ఆన్లైన్ రిజిస్ట్రేషన్: ఆగస్టు 11 - 25. వెబ్సైట్: www.gail.nic.in భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిప్యూటీ ఇంజనీర్ (సివిల్) అర్హత: మొదటి శ్రేణిలో బీఈ/బీటెక్ (సివిల్) ఉత్తీర్ణతతోపాటు సంబంధిత రంగంలో ఏడాది అనుభవం ఉండాలి. డిప్యూటీ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) అర్హతలు: మొదటి శ్రేణిలో బీఈ/బీటెక్ (ఎలక్ట్రికల్) ఉత్తీర్ణతతోపాటు సంబంధిత రంగంలో ఏడాది అనుభవం ఉండాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: ఆగస్టు 20. వెబ్సైట్: www.bel-india.com నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ కాలికట్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింది కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. పీజీ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్ సిస్టమ్ డిజైన్ అర్హత: బీఈ/ బీటెక్ (ఈఈ/ ఈఈఈ/ ఐఅండ్‌సీ/ ఈసీ/ ఏఈ అండ్ ఐ/ ఇన్స్ట్రుమెంటేషన్/ మెకట్రానిక్స్/ సీఎస్ఈ). అడ్వాన్స్డ్ డిప్లొమా - పీఎల్సీ/ స్కాడా/ డీసీఎస్ అర్హత: డిప్లొమా, ఎమ్మెస్సీ (ఇన్స్ట్రుమెంటేషన్/ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్) లేదా బీఈ/ బీటెక్ ఉండాలి. వెబ్సైట్: http://calicut.nielit.in అన్నా యూనివర్సిటీ చెన్నైలోని అన్నా యూనివర్సిటీ ఎంఎస్, పీహెచ్డీ ప్రోగ్రామ్‌ల్లో ప్రవేశానికి దరఖాస్తులను కోరుతోంది. విభాగాలు: ఇంజనీరింగ్/టెక్నాలజీ, సైన్స, హ్యుమానిటీస్, మేనేజ్మెంట్, ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ అర్హతలు: సంబంధిత విభాగంలో 55 శాతం మార్కులతో ఎంఎస్ ప్రోగ్రామ్‌కు బీఈ/బీటెక్, పీహెచ్డీ ప్రోగ్రామ్‌లకు మాస్టర్స డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తులకు చివరి తేది: ఆగస్టు 30 వెబ్సైట్: http://cfr.annauniv.edu/ జనరల్ నాలెడ్‌జ పాలిటీ: భారత రాజ్యాంగం ముఖ్యమైన కమిటీలు నాయకత్వం కేంద్ర అధికారాలు జవహర్లాల్ నెహ్రూ నిబంధనల కమిటీ డా॥రాజేంద్రప్రసాద్ రాష్ట్రాలకు సంబంధించిన కమిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రాథమిక హక్కులు సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టీరింగ్ కమిటీ డా॥కె.ఎం. మున్షీ మైనారిటీల కమిటీ హెచ్.సి. ముఖర్జీ సలహా సంఘం సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయోద్యమ కాలం నాటి పత్రికలు పత్రిక పేరు సంవత్సరం, ప్రదేశం వ్యవస్థాపకుడు నవసాహిత్యమాల అనంతపురం విద్వాన్ విశ్వం, తరిమెల నాగిరెడ్డి కృష్ణా పత్రిక 1902, మచిలీపట్నం కొండా వెంకటప్పయ్య ఆంధ్ర పత్రిక 1908, బొంబాయి కాశీనాథుని నాగేశ్వరరావు వార్త పత్రిక 1925, తెనాలి కొమ్మూరి వెంకటరామయ్య గోల్కొండ పత్రిక 1926 సురవరం ప్రతాపరెడ్డి మీజాన్ పత్రిక 1943, హైదరాబాద్ అడవి బాపిరాజు స్వరాజ్య పత్రిక ---- గాడిచర్ల హరిసర్వోత్తమరావు -
సివిల్స్ ప్రిలిమ్స్‌లో హిస్టరీకి ఎలా సిద్ధమవ్వాలి?
- అలేఖ్య, అమీర్‌పేట కాంపిటీటివ్ కౌన్సెలింగ్ : సివిల్స్ ప్రిలిమ్స్ జనరల్ స్టడీస్ హిస్టరీ సిలబస్‌లో భారతదేశ చరిత్ర, భారతదేశ స్వాతంత్య్రోద్యమం అని పేర్కొన్నారు. చరిత్రలో ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక భారతదేశ చరిత్ర విభాగాలుంటాయి. హిస్టరీ నుంచి 15-20 ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. అభ్యర్థులు భారత స్వాతంత్య్రోద్యమం గురించి క్షుణ్నంగా తెలుసుకోవాలి. ప్రాచీన భారతదేశ చరిత్ర నుంచి అడుగుతున్న కొన్ని ప్రశ్నలు పూర్తిగా ఫిలాసఫీకి సంబంధించినవి ఉంటున్నాయి. ఉదాహరణకు మతాలు, మత సిద్ధాంతాలపై అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు మత గ్రంథాల్లో మాత్రమే ఉంటున్నాయంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. ఇండియన్ హిస్టరీ నుంచి రాజకీయ కోణం నుంచి కాకుండా సామాజిక, సాంస్కృతిక అంశాలపై ప్రశ్నలు వస్తున్నాయి. ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించి సంఘ సంస్కరణ ఉద్యమాలు, జాతీయ ఉద్యమం - ముఖ్య ఘట్టాలు, చట్టాలు - ఫలితాలు వంటివాటిపై దృష్టి సారించాలి. రీజనల్ హిస్టరీ నుంచి కూడా ప్రశ్నలు వస్తున్నాయి. అవి కూడా చాలా లోతుగా ఉంటున్నాయి. ఇవి ముఖ్యమైనవి అనుకున్న అంశాల నుంచి కాకుండా.. మారు మూల అంశాల నుంచి కూడా ఇస్తున్నారు. అందువల్ల అభ్యర్థులు పూర్తిస్థాయిలో విశ్లేషణాత్మక ప్రిపరేషన్ కొనసాగించాలి. చదవాల్సిన పుస్తకాలు: ఎన్సీఈఆర్టీ ఎనిమిదో తరగతి నుంచి 12వ తరగతి సోషల్ పాఠ్యపుస్తకాలు ఇండియన్ హిస్టరీ -వి.కె.అగ్నిహోత్రి ప్రాచీన చరిత్ర - ఆర్. శర్మ, రొమిల్లా థాపర్ మధ్యయుగ చరిత్ర - సతీశ్ చంద్ర మోడ్రన్ ఇండియా - బిపిన్ చంద్ర ఇన్పుట్స్: కరీం, సీనియర్ ఫ్యాకల్టీ ఎస్బీఐ క్లరికల్ కేడర్ పరీక్షలో జనరల్ ఇంగ్లిష్, జనరల్ అవేర్‌నెస్‌కు ఎలా సిద్ధమవాలి? - హిమబిందు, హిమాయత్‌నగర్ బ్యాంక్ పరీక్షలో చాలామంది అభ్యర్థులు ముఖ్యంగా గ్రామీణ నేపథ్యం ఉన్నవారు క్లిష్టంగా భావించే విభాగం జనరల్ ఇంగ్లిష్. ఈ విభాగంలో ఎక్కువ మార్కులు సాధించేందుకు యాంటానిమ్స్, సినానిమ్స్, వొకాబులరీ, బేసిక్ గ్రామర్‌పై పట్టు సాధించాలి. వొకాబులరీపై అవగాహనతో కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలకు సులువుగా సమాధానాలు గుర్తించవచ్చు. వొకాబులరీపై పట్టు సాధించేందుకు ఇంగ్లిష్ దిన పత్రికలు చదువుతూ వాటిలో వివిధ సందర్భాల్లో ఉపయోగించిన పదాలను అధ్యయనం చేయాలి. స్పాటింగ్ ది ఎర్రర్స్ కోసం బేసిక్ గ్రామర్, సబ్జెక్ట్ - వెర్బ్స్ సంబంధం, టెన్సెస్‌పై అవగాహన ఉండాలి. మొత్తం మీద పదో తరగతి స్థాయిలోని గ్రామర్ అంశాలపై అవగాహన పెంచుకుంటే ఇంగ్లిష్‌లో అధిక మార్కులు సాధించడం సులువే. జనరల్ అవేర్‌నెస్‌లో అధిక మార్కులు సాధించాలంటే సమకాలీన అంశాలు, ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిణామాలపై దృష్టి సారించాలి. రోజూ దినపత్రికలను చదువుతూ ముఖ్యమైన విషయాలను నోట్స్ రూపంలో రాసుకోవాలి. బ్యాంకింగ్ రంగ నేపథ్యానికి సంబంధించిన నాలెడ్జ్ కోసం ఒక ఫైనాన్షియల్ డెయిలీని చదవాలి. బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన తాజా పరిణామాలు, బ్యాంకింగ్ పదజాలం - వాటి అర్థాలపై అవగాహన ఉండాలి. బ్యాంకుల తాజా పాలసీలు, ఆర్బీఐ తాజా పరపతి విధానాలు, దేశంలో బ్యాంకింగ్ రంగ పురోగమన, తిరోగమన గణాంకాలు - కారణాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్‌కు సంబంధించి ముఖ్యమైన సంఘటనలు, ప్రదేశాలు, క్రీడలు - విజేతలు, అవార్డులు - విజేతలు, శాస్త్రవేత్తలు - ఆవిష్కరణలు, పుస్తకాలు - రచయితలు, ముఖ్యమైన రోజులు తదితర అంశాలపై అవగాహన పెంచుకోవాలి. ఇన్పుట్స్: కె.వి. జ్ఞానకుమార్ డెరైక్టర్, డీబీఎస్, దిల్సుఖ్నగర్. సివిల్స్-ప్రిలిమ్స్: బయాలజీ బ్యాంక్ ఎగ్జామ్స్: రీజనింగ్ పేజీలను www.sakshieducation.com నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
ఇండియన్ హిస్టరీ : కాంపిటీటివ్ గైడెన్స్
తొలి మధ్యయుగం పాలవంశం దేవపాల: ఇతడిని పాలరాజులందరిలోకి గొప్పవాడిగా పరిగణిస్తారు. ఇతడు ఒరిస్సా, అస్సాంలను జయించడమే కాకుండా ప్రతీహార మిహిరభోజుడి దాడులను విజయవంతంగా తిప్పికొట్టాడు. దేవపాలుడు నలందలో ఇండోనేషియా రాజు బలపుత్ర దేవుడు నిర్మించిన బౌద్ధ విహారానికి ఐదు గ్రామాలను దానంగా ఇచ్చాడు. ఇతడి ఆస్థాన బౌద్ధ పండితుడు వజ్రదత్తుడు లోకేశ్వర శతకం అనే గ్రంథాన్ని రచించాడు. ఈ కాలంలో భారతదేశాన్ని సందర్శించిన అరబ్ యాత్రికుడు సులేమాన్ పాలరాజ్యాన్ని రూహ్మి అని పేర్కొన్నాడు. నారాయణపాల: దేవపాలుడి తర్వాత రాజ్యానికి వచ్చిన రాజుల్లో ఇతడు ముఖ్యమైనవాడు. ఇతడిని రాష్ర్టకూట రాజు అమోఘ వర్షుడు ఓడించాడు. నారాయణ పాలుడు మాంఘీర్ ప్రాంతంలో ఒక గ్రామాన్ని శైవాలయానికి దానంగా ఇచ్చాడు. మహీపాల 1: నారాయణపాలుడి అనంతరం పాలించిన పాలరాజుల్లో ముఖ్యమైనవాడు మొదటి మహీపాలుడు. చోళరాజు మొదటి రాజేంద్రుడు ఇతడి కాలంలోనే ఉత్తర భారతదేశంపై దండెత్తి మహీపాలుడిని ఓడించి గంగై కొండ అనే బిరుదును పొందాడు. మదనపాల: ఇతడు పాలవంశంలో చివరిరాజు. ఇతడి తర్వాత పాల రాజ్యాన్ని సేన వంశ రాజులు ఆక్రమించి సేన వంశ రాజ్యాన్ని స్థాపించారు. సేన వంశం: తొలి మధ్యయుగంలో తూర్పు భారతదేశాన్ని పాలించిన రెండు రాజవంశాల్లో ముఖ్యమైనది సేన వంశం. పాలవంశం పతనమైన తర్వాత సేన వంశ రాజులు బెంగాల్, బీహార్ ప్రాంతాలను పాలించారు. లక్నౌతిని రాజధానిగా చేసుకొని వీరు దాదాపు 100 సంవత్సరాలపాటు పాలించారు. వీరు తాము కర్ణాటక బ్రాహ్మణులమని పేర్కొన్నారు. సామంత సేన: సేన వంశస్థాపకుడు. ఇతడు బ్రహ్మక్షత్రియుడిగా పేరుగాంచాడు. విజయ సేన: మొత్తం బెంగాల్‌ను జయించడం ద్వారా ఇతడు సేన రాజ్య వాస్తవ స్థాపకునిగా ఖ్యాతిగాంచాడు. ఇతడు అస్సాం, నేపాల్ మొదలైన ప్రాంతాలను జయించాడు. విజయసేనుడు తన విజయాలను గురించి తెలియజేస్తూ దేవపార ప్రశస్తిని జారీ చేశాడు. ఈ శాసనాన్ని రచించిన కవి ధోయి. విజయసేనుడు విజయపురి, విక్రమపుర అనే రెండు రాజధానులను నిర్మించి అక్కడి నుంచి పరిపాలించాడు. గహద్వాల జయచంద్రుడి ఆస్థానకవి శ్రీహర్షుడు విజయసేనుడి గొప్పతనాన్ని, విజయాలను గురించి తెలుపుతూ విజయ ప్రశస్తి అనే గ్రంథాన్ని రచించాడు. బల్లాల సేన: ఇతడు స్వయంగా నాలుగు గ్రంథాలను రచించాడు. ఇతడి గ్రంథాల్లో ముఖ్యమైనవి దాన సాగర, అద్భుత సాగర. లక్ష్మణ సేన: ఇతడు 60 ఏళ్ల వయస్సులో రాజ్యానికి వచ్చాడు. ఇతడి పాలనకు రాజకీయ ప్రాధాన్యత లేకపోయినప్పటికీ సాహిత్యపరంగా ఇతడి పాలనాకాలం ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇతడి ఆస్థానంలో ప్రముఖ వైష్ణవ కవి జయదేవుడు గీతగోవిందం అనే గ్రంథాన్ని రచించాడు. మరో కవి ధోయి పవన దూతం అనే గ్రంథాన్ని రాశాడు. గోవర్థనుడు అనే కవి ఆర్య సప్తశతి అనే గ్రంథాన్ని రచించాడు. లక్ష్మణ సేనుడు తన తండ్రి బల్లాల సేనుడు ప్రారంభించిన అద్భుతసాగర గ్రంథాన్ని తానే స్వయంగా పూర్తి చేశాడు. లక్ష్మణ సేనుడి కాలంలో ఘోరీ మహ్మద్ సేనాని భక్తియార్ ఖిల్జీ బెంగాల్‌పై దాడి చేయగా, ఇతడు యుద్ధం చేయకుండా పారిపోయాడు. దీంతో సేన రాజ్యం ముస్లింల వశమైంది. ఈ సంఘటన గురించి మినహాజుద్దీన్ సిరాజ్ తన తబాకత్-ఇ-నాసిరి అనే గ్రంథంలో వివరించాడు. భక్తియార్ ఖిల్జీ కేవలం 18 మంది అశ్వికుల ద్వారా ఈ విజయం సాధించాడని తెలిపాడు. రాష్ర్టకూటులు: ఉత్తరాన వింధ్య పర్వతాలు, నర్మద నది నుంచి దక్షిణాన కృష్ణా, తుంగభద్ర నదుల మధ్య ఉన్న ప్రాంతాన్ని సాధారణంగా దక్కన్ ప్రాంతంగా వ్యవహరిస్తారు. తొలి మధ్య యుగంలో ఈ ప్రాంతాన్ని రెండు రాజవంశాలు ప్రముఖంగా పాలించాయి. అందులో ఒకరు రాష్ర్టకూటులు. మొదట వీరు బాదామి చాళుక్యులకు సామంతులుగా ఉంటూ (రాష్ర్ట పాలకులుగా) పరిస్థితులు అనుకూలించిన వెంటనే స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నారు. వీరి రాజధానులు ఎల్లోరా, మాన్యఖేట్. రాష్ట్రకూటులు సమకాలీన దక్షిణ భారతదేశ రాజులతో, ఉత్తర భారతదేశ పాలకులతో తరచూ యుద్ధాల్లో పాల్గొంటూ తమ రాజ్యాన్ని ఒక బలమైన రాజ్యంగా రూపొందించారు. ఉత్తర భారతదేశంలో ప్రతీహారులు, పాలరాజులు, దక్షిణ భారతదేశంలో వేంగీ చాళుక్యులు, పల్లవులు, పాండ్యులు వీరి సమకాలీన రాజులు. దంతి దుర్గుడు: చివరి బాదామి చాళుక్యరాజు రెండో కీర్తివర్మను క్రీ.శ.753లో తొలగించి ఇతడు స్వతంత్య్ర రాష్ర్టకూట రాజ్యాన్ని స్థాపించాడు. తన రాజ్యానికి ఇరువైపులా ఉన్న అనేక ప్రాంతాలను ఆక్రమించాడు. ఇందుకు గుర్తుగా హిరణ్య గర్భదాన యజ్ఞాన్ని నిర్వహించాడు. తన రాజధాని ఎల్లోరాలో దశావతార ఆలయాన్ని నిర్మించాడు. మొదటి కృష్ణుడు: బాదామి చాళుక్యులను అంతం చేసి పశ్చిమ గాంగులను తన సామంతులుగా చేసుకున్నాడు. ఇతడి కాలంలో వేంగీ చాళుక్యులపై తొలి దాడి యువరాజు గోవిందుడి ఆధ్వర్యంలో విజయవంతంగా జరిగింది. ఇతడు రాజధాని ఎల్లోరాలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన కైలాసనాథ గుహాలయాన్ని నిర్మించాడు. ధ్రువుడు: తన సోదరుడు రెండో గోవిందుడిని తొలగించి ఇతడు సింహాసనాన్ని ఆక్రమించాడు. కనౌజ్ కోసం జరిగిన త్రిరాజ్య యుద్ధాల్లో తలదూర్చిన మొదటి రాష్ర్టకూట రాజు ఇతడే. ప్రతీహార వత్సరాజును, పాలరాజు ధర్మపాలుడిని ఓడించాడు. వేంగీ, మైసూర్, కంచి రాజ్యాలపై దాడులు చేసి విజయం సాధించాడు. మూడో గోవిందుడు: ఇతడు కూడా పాలరాజు ధర్మపాలుడిని, ప్రతీహార రెండో నాగభటుడిని ఓడించాడు. దక్షిణ రాజ్యాల కూటమిపై కూడా విజయం సాధించాడు. మొదటి అమోఘవర్ష: ఇతడు 64 సంవత్సరాల సుదీర్ఘకాలంపాటు... క్రీ.శ. 814-878 వరకు పరిపాలించాడు. ఇతడి కాలంలో రాష్ర్ట కూటులు వేంగీని ఆక్రమించి 12 సంవత్సరాలపాటు దీన్ని పరిపాలించారు. అమోఘవర్షుడు యుద్ధాల కంటే లలిత కళలకు అధిక ప్రాధాన్యతనిచ్చాడు. ఇతడు స్వయంగా కవి. కవిరాజ అనే బిరుదును పొందాడు. కన్నడ భాషలో తొలి గ్రంథమైన కవిరాజమార్గను రచించాడు. ఇతడి ఆస్థానంలో ఉన్న పలువురు కవులు పలు గ్రంథాలను రచించారు. ఇతడి ఆస్థానంలోని ప్రముఖ కవులు... జనసేనుడు, మహావీరాచార్యుడు, శాక్తాయణుడు. రాష్ర్టకూట రాజుల్లో ఎక్కువ మంది శైవ, వైష్ణవ మతాలను ఆదరిస్తే ఇతడు జైన మతాన్ని ఆదరించాడు. రెండో కృష్ణుడు: ఇతడు కూడా తనతండ్రిలాగే జైన మతాన్ని ఆదరించాడు. మూడో ఇంద్రుడు: ఇతడి కాలంలోనే అరబ్ యాత్రికుడు అల్ మసూదీ భారతదేశాన్ని సందర్శించాడు. మూడో ఇంద్రుడిని భారతదేశంలోనే గొప్పరాజుగా వర్ణించాడు. మూడో ఇంద్రుడు ప్రతీహార మహీపాలుడిని ఓడించి కనౌజ్‌ను ధ్వంసం చేశాడు. నాలుగో గోవిందుడు: ఇతడి దుష్పరిపాలనకు వ్యతిరేకంగా నాయకులు, ప్రజలు తిరుగుబాటు చేయడంతో అధికారాన్ని కోల్పోయాడు. మూడో కృష్ణుడు: ఇతడు ఉత్తర, దక్షిణ భారతదేశంపై విజయవంతంగా దాడులను నిర్వహించాడు. ఇతడు చోళరాజ్యంపై దాడిచేసి కంచి, తంజావూర్లను ఆక్రమించాడు. క్రీ.శ.949లో తక్కోలం యుద్ధంలో మొదటి పరాంతక చోళుడిని ఓడించి తంజావూర్ కొండ అనే బిరుదు పొందాడు. చేర, పాండ్య రాజులను ఓడించాడు. ఈ విజయాలన్నింటికీ గుర్తుగా రామేశ్వరంలో విజయ స్తంభాన్ని వేయించాడు. అక్కడ కృష్ణేశ్వర, గండమార్తాండతీయ అనే దేవాలయాలను నిర్మించాడు. మూడో కృష్ణుడి నిరంతర యుద్ధాల వల్ల సమకాలీన పొరుగు రాజ్యాలన్నింటితో శత్రుత్వం ఏర్పడింది. ఇతడి కాలంలోనే హలాయుధుడు కవి రహస్యం అనే గ్రంథాన్ని రచించాడు. ఖొట్టిగ: ఇతడి కాలంలో పరమార రాజులు మాన్యఖేట్పై దాడిచేసి విధ్వంసం సృష్టించారు. రెండో కర్క: ఇతని పాలనాకాలంలో రాష్ర్టకూట సామంతుడు రెండో తైలపుడు క్రీ.శ.974-75లో ఇతడిని తొలగించి స్వతంత్ర కల్యాణి చాళుక్య రాజ్యాన్ని స్థాపించాడు. కల్యాణి చాళుక్యులు: తొలి మధ్యయుగ భారతదేశ చరిత్రలో రాష్ర్టకూటుల తర్వాత దక్కన్‌ను పాలించిన మరో రాజవంశం కల్యాణి చాళుక్యులు. కర్ణాటకలోని కల్యాణి రాజధానిగా వీరు పాలించారు. కాబట్టి వీరిని కల్యాణి చాళుక్యులని, చాళుక్యుల తర్వాత పాలించారు కాబట్టి కడపటి చాళుక్యులు అని పిలుస్తారు. రెండో తైలపుడు: ఇతడు కల్యాణి చాళుక్య వంశ స్థాపకుడు. రాష్ర్టకూట మూడో కృష్ణుడికి సామంతుడిగా ఉంటూ చివరి రాష్ర్ట కూటరాజు రెండో కర్కను తొలగించి తన రాజ్యాన్ని స్థాపించాడు. ఇతడు మాన్యఖేట్ను రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. చోళరాజు ఉత్తమ చోళుడిపై దాడి చేయడం ద్వారా చోళ-చాళుక్య శత్రుత్వానికి నాంది పలికాడు. ఇతడి వారసుల కాలంలో చాళుక్యులు చోళులతో అనేక యుద్ధాలు చేయాల్సి వచ్చింది. సత్యాశ్రయ: ఇతడి మరొక పేరు సొల్లిగ. ఇతడి కాలంలో మాన్యఖేట్పై రాజేంద్రచోళుడు దాడి చేశాడు. రెండో జయసింహ: వేంగీ వారసత్వ యుద్ధాల్లో తలదూర్చి ఇతడు ఏడో విజయాదిత్యుడికి మద్దతుగా తన సైన్యాన్ని పంపాడు. కానీ రాజేంద్రచోళుడి సహాయంతో వేంగీలో రాజరాజనరేంద్రుడు రాజ్యానికి వచ్చాడు. మొదటి సోమేశ్వరుడు: ఇతడు తన రాజధానిని మాన్యఖేట్ నుంచి కల్యాణికి మార్చాడు. కొప్పం యుద్ధంలో చోళ రాజాధిరాజును వధించాడు. పరమార భోజుడిని ఓడించి తన సామంతుడిగా చేసుకున్నాడు. ఆరో విక్రమాదిత్యుడు: తన సోదరుడు రెండో సోమేశ్వరుడిని వధించి ఇతడు క్రీ.శ.1076లో రాజ్యానికి వచ్చాడు. తాను రాజ్యానికి వచ్చిన సంవత్సరాన్ని పురస్కరించుకుని చాళుక్య విక్రమ శకాన్ని ప్రారంభించాడు. కల్యాణి చాళుక్య రాజులందరిలోకి ఇతడు అత్యంత గొప్పవాడు. ఇతడి రాజ్యం నర్మద నుంచి రాయలసీమ వరకు విస్తరించింది. ఆరో విక్రమాదిత్యుడు తన సామంతులైన హోయసలలు, కాకతీయులు, యాదవులు, కాదంబులతో నిరంతరం యుద్ధాలు చేసి వారిని అణచివేశాడు. ఇతడి ఆస్థానంలోని ఇద్దరు ప్రముఖ కవులు బిల్హణుడు విక్రమాంక దేవచరితం, విజ్ఞానేశ్వరుడు మితాక్షర అనే గ్రంథాలను రచించారు. మూడో సోమేశ్వరుడు: ఇతడి కాలంలో ద్వార సముద్ర సామంతుడు విష్ణువర్థనుడు స్వతంత్ర హోయసల రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. సోమేశ్వరుడు పరిపాలన కంటే సాహిత్యంపై ఎక్కువ మక్కువ చూపాడు. ఇతడికి సర్వజ్ఞ అనే బిరుదు ఉంది. ఈ బిరుదుకు కారణం ఇతడు రచించిన అభిలషితార్థ చింతామణి అనే గ్రంథం. నాలుగో సోమేశ్వరుడు: మూడో సోమేశ్వరుడి తర్వాత జగదేక మల్ల, మూడో తైలప అనే రాజులు పాలించారు. ఈ వంశంలో చివరివాడు నాలుగో సోమేశ్వరుడు. ఇతడి కాలంలో దేవగిరిని పాలిస్తున్న సామంత రాజు యాదవ బిల్లముడు ఇతడిని ఓడించి కల్యాణి చాళుక్య రాజ్యాన్ని అంతం చేశాడు. స్వతంత్ర యాదవ రాజ్యాన్ని స్థాపించాడు. మాదిరి ప్రశ్నలు 1. {పయాగ వద్ద త్రివేణి సంగమంలో మునిగి ఆత్మత్యాగం చేసిన చందేల రాజు? 1) హర్ష 2) విద్యాధర 3) ధంగ 4) యశోవర్మన్ 2. భారతదేశంలో బౌద్ధ మతాన్ని ఆదరించిన చివరి రాజవంశం? 1) పుష్యభూతి వంశం 2) కుషాణులు 3) పాల వంశం 4) సేన వంశం 3. {పజల ద్వారా ఎన్నికైన రాజు? 1) ధర్మపాల 2) గోపాల 3) హర్షవర్థన 4) నన్నుక 4. ఓదంతపురి బౌద్ధ విహారాన్ని నిర్మించింది? 1) అశోకుడు 2) అమోఘవర్షుడు 3) గోపాలుడు 4) కనిష్కుడు 5. బౌద్ధ పండితుడు హరిభద్రుడు ఎవరి ఆస్థానంలో ఉండేవాడు? 1) ధర్మపాలుడు 2) మొదటి నాగభటుడు 3) గోపాలుడు 4) దేవపాలుడు 6. పాలరాజుల కాలంలో టిబెట్‌లో బౌద్ధమత ప్రచారం చేసిన బౌద్ధ భిక్షువులు? 1) అతిష దీపాంకర, సంతరక్షిత 2) ఆచార్య నాగార్జున 3) శ్రీవర, శ్రీజ్ఞాన 4) పద్మసాంభవ, పూజ్యపాద 7. ప్రపంచ ప్రసిద్ధి చెందిన కైలాసనాథ గుహాలయ నిర్మాత? 1) నందివర్మ2) నరసింహవర్మ 3)మొదటి కృష్ణుడు 4) మూడోగోవిందుడు 8. రాజ్య వ్యవహారాల్లో స్త్రీలు ప్రముఖ పాత్ర పోషించిన ఉత్తరభారతదేశ రాజవంశం? 1) గహద్వాలులు 2) కాశ్మీర్ ఉత్పల వంశం 3) చౌహాన్లు 4) చందేలులు 9. నలంద బౌద్ధ విహారాన్ని నిర్మించిన విదేశీ రాజు? 1) సంగ్రామ విజయోత్తుంగ వర్మన్ 2) విజయబాహు 3) బలపుత్రదేవ 4) మహేంద్రవర్మన్ 10. శివుడికి 1000 ఆలయాలను నిర్మించిన రాజు? 1) నారాయణ పాలుడు 2) విగ్రహ పాలుడు 3) గౌడ శశాంకుడు 4) హర్షుడు 11. చోళరాజు మొదటి రాజేంద్రుడి చేతిలో ఓడిపోయిన పాలరాజు? 1) మహేంద్రపాలుడు 2) మదనపాలుడు 3) మొదటి మహీపాలుడు 4) ధర్మపాలుడు 12. గీతగోవిందం గ్రంథకర్త జయదేవుడు ఎవరి ఆస్థాన కవి? 1) బల్లాల సేన 2) లక్ష్మణ సేన 3) విజయ సేన 4) సంగ్రామ సేన 13. సేన రాజ్యాన్ని అంతం చేసినవారు? 1) కుతుబుద్దీన్ ఐబక్ 2) ఇల్టుల్మిష్ 3) భక్తియార్ ఖిల్జీ 4) అల్లావుద్దీన్ ఖిల్జీ 14. రాష్ర్టకూటుల రాజధాని? 1) ఎల్లోరా 2) మాన్యఖేట్ 3) 1,2 4) వాతాపి 15. దంతిదుర్గుడు నిర్మించిన ఆలయం? 1) ఎల్లోరా-దశావతారాలయం 2) ఎల్లోరా- కైలాసనాథాలయం 3) కంచి- కైలాసనాథాలయం 4) మహాబలిపురం-తీర దేవాలయం సమాధానాలు 1) 3 2) 3 3) 2 4) 3 5) 1 6) 1 7) 3 8) 2 9) 3 10) 1 11) 3 12) 2 13) 3 14) 3 15) 1 -
ఇండియన్ హిస్టరీ
మధ్యయుగ భారతదేశ చరిత్ర (8వ శతాబ్దం - 18వ శతాబ్దం) తొలి మధ్యయుగం: హర్షుడి అనంతర యుగం నుంచి ఢిల్లీ సుల్తనత్ ఏర్పడే వరకు ఉన్న కాలాన్ని భారతదేశ చరిత్రలో తొలి మధ్యయుగంగా పిలుస్తారు. ఉత్తర భారతదేశ చరిత్రలో అప్పటి వరకు పాటలీపుత్రం అధికార కేంద్రంగా ఉండగా.. ఈ యుగంలో దాని స్థానాన్ని కనౌజ్ ఆక్రమించింది. అందుకే కనౌజ్‌ను దక్కించుకునేందుకు మధ్యయుగంలోని మూడు ముఖ్యమైన రాజ్యాల మధ్య ఎడతెరపిలేని యుద్ధాలు జరిగాయి. అందుకే ఈ యుగాన్ని ఉత్తర భారత చరిత్రలో త్రిరాజ్య సంఘర్షణ యుగంగా పేర్కొంటారు. ఈ ఘర్షణల్లో పాల్గొన్న మూడు రాజవంశాలు... రాష్ర్టకూటులు, ఘార్జర ప్రతిహారులు, పాలరాజులు. ఈ కాలంలో ఉత్తర భారతదేశం పూర్తిగా రాజపుత్రుల ఆధీనంలో ఉంది. మూడు డజన్లకు పైగా రాజపుత్ర రాజ్యాలు ఈ కాలంలో ఉత్తర భారతదేశాన్ని పాలించాయి. ఈ యుగంలో దక్కన్లో ప్రాబల్యంలో ఉన్న రాజులు రాష్ర్టకూటులు, వారి తర్వాత వచ్చిన కల్యాణి చాళుక్యులు. ఇక దక్షిణ భారతదేశంపై సార్వభౌమాధికారాన్ని స్థాపించిన ప్రముఖ రాజవంశం చోళులు. వీరు 9వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం వరకు దక్షిణదేశాన్ని పాలించారు. చోళుల తర్వాత వీరి రాజ్యాన్ని హోయసాలులు, పాండ్యులు ఆక్రమించుకున్నారు. ఉత్తర భార తదేశ రాజవంశాలు తొలి మధ్యయుగంలో ఉత్తర భారతదేశాన్ని దాదాపు 36 రాజ వంశాలు పరిపాలించాయి. వీటిలో నాలుగు రాజవంశాలు తమను తాము అగ్నికుల క్షత్రియులుగా పేర్కొన్నాయి. అవి ప్రతీహారులు, చాళుక్యులు లేదా సోలంకీలు, పరమారులు లేదా పవార్లు, చౌహాన్ లు. ప్రతీహారులు: వీరు ఘార్జర అనే తెగకు చెందినవారు. ఇది మధ్యాసియాకు చెందిన తెగ. హూణులతోపాటుగా వీరు భారత్‌కు వచ్చారు. మొదటి నాగభటుడు: భారతదేశంలో పలు ప్రతీహార రాజ్యాలున్నాయి. వాటిలో తొలి ప్రతీహార రాజ్యస్థాపకుడు హరిశ్చంద్రుడు. అయితే భారత్‌లోని ప్రతీహార రాజ్యాలన్నింటిలోకి అతి ముఖ్యమైంది... నాగభటుడు స్థాపించిన ప్రతీహార రాజ్యమే. ఇది 8వ శతాబ్దపు మొదటి అర్ధభాగంలో ఏర్పడింది. నాగభటుడు పశ్చిమ భారతదేశంపై జరిగిన అరబ్బుల దాడిని తిప్పి కొట్టాడు. వత్సరాజు: మొదటి నాగభటుడి అనంతరం కాకుత్స, దేవరాజ అనే రాజులు పాలించారు. వారి తర్వాత వత్సరాజు రాజ్యానికి వచ్చాడు. ఇతడు నాగభటుడి మనుమడు. వత్సరాజు... పాలరాజు ధర్మపాలుడిని ఓడించాడు. కానీ రాష్ర్టకూట ధ్రువుడి చేతిలో ఓడిపోయి మాళ్వా మొదలైన ప్రాంతాలను కోల్పోయాడు. రెండో నాగభటుడు: ఇతడు కనౌజ్‌ను పాలించే చక్రాయుధుడిని ఓడించి తన రాజధానిని బిన్మల్ నుంచి కనౌజ్‌కు మార్చాడు. మాంఘీర్ యుద్ధంలో ధర్మపాలుడిని ఓడించాడు. కానీ ఇతడు రాష్ర్టకూట రాజు 3వ గోవిందుని చేతిలో ఓడిపోయాడు. మిహిర భోజ: రెండో నాగభటుడి అనంతరం రామభద్రుడి స్వల్పకాల పాలన తర్వాత మిహిరభోజుడు రాజయ్యాడు. ఇతడు ప్రతీహార వంశంలో అందరి కంటే గొప్పవాడు. అటు పాల రాజులను, ఇటు రాష్ర్టకూటులను ఓడించి విశాలమైన సామ్రాజ్యాన్ని మిహిర భోజుడు నిర్మించాడు. క్రీ.శ. 851లో సులేమాన్ అనే అరబ్ యాత్రికుడు ఇతడి పాలనా కాలంలో రాజ్యాన్ని సందర్శించాడు. మిహిర భోజుడు మహ్మదీయుల బద్ధశత్రువు అని సులేమాన్ పేర్కొన్నాడు. మహేంద్రపాల: ఇతడి కాలంలో ప్రతీహార రాజ్యం హిమాలయాల నుంచి వింధ్య వరకు, అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం వరకు విస్తరించింది. మహేంద్రపాల ఆస్థానంలో ఉన్న గొప్ప సంస్కృత కవి రాజశేఖరుడు. ఇతడు కర్పూర మంజరి, బాల రామాయణం, బాల భారతం, కావ్య మీమాంస, భువనకోశ, హరవిలాస వంటి గ్రంథాలను రచించాడు. మహీపాల: మహేంద్రపాలుడి అనంతరం రెండో భోజుడు కొంతకాలం పాటు రాజ్యాన్ని పాలించాడు. అతడి అనంతరం మహీపాలుడు రాజ్యానికి వచ్చాడు. ఇతడు రాష్ర్టకూట రాజు మూడో ఇంద్రుడి దాడిని ఎదుర్కొవాల్సి వచ్చింది. మహీపాలుడి కాలంలో క్రీ.శ. 915-916 మధ్య అరబ్ యాత్రికుడు అల్‌మసూది ఇతడి రాజ్యాన్ని సందర్శించాడు. మహీపాలుడి అనంతరం ఈ రాజ్యం బలహీనమైంది. పలు సామంత రాజ్యాలు స్వతం త్రం ప్రకటించుకున్నాయి. మహీపాలుడి అనంతరం రెండో మహేంద్రపాల, దేవపాల, విజయపాల, రాజ్యపాల మొదలైనవారు పాలించారు. ఈ వంశంలో చివరి రాజు.. యశపాలుడు. పరమారులు: ధార రాజధానిగా మాళ్వా ప్రాంతాన్ని పాలించిన రాజపుత్ర వంశమే పరమార లేదా పవార్ వంశం. ఉపేంద్ర ఈ వంశ స్థాపకుడు. వీరు మొదట ప్రతీహారులకు, రాష్ర్టకూటులకు సామంతులుగా ఉండేవారు. రెండో సియాకుడు: ఇతడు స్వతంత్ర పరమార రాజ్య స్థాపకుడు. రాష్ర్టకూట రాజు మూడో కృష్ణుడి అనంతరం ఇతడు స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నాడు. వాక్పతి ముంజరాజు: ఇతడు కాలచూరి రాజులను, కల్యాణి చాళుక్యులను ఓడించాడు. చాళుక్య రాజు రెండో తైలపుడు ఆరుసార్లు మాళ్వాపై దాడులు చేశాడు. చివరికి ఈ దాడుల్లోనే ముంజరాజు మరణించాడు. రాజధాని ధారలో ఇతడు తన పేరుతో ముంజసాగర అనే చెరువును నిర్మించాడు. తన రాజ్యంలో అనేక దేవాలయాలు నిర్మించాడు. సాహిత్యాన్ని, కళలను పోషించాడు. ముంజరాజు స్వయంగా కవి. ఇతడి ఆస్థానంలో పలువురు కవులుండేవారు. వారిలో ముఖ్యమైనవారు పద్మగుప్త, ధనిక, ధనుంజయ. భోజ: పరమార రాజులందరిలో అత్యంత గొప్పవాడు. ఇతడు గొప్ప సైనికుడే కాక సా హిత్య ప్రియుడు కూడా. స్వయంగా వివిధ అంశాలపై 24 గ్రంథాలను రచించాడు. అనేక మంది కవులను పోషించాడు. పలు వాస్తు శిల్ప నిర్మాణాలు చేపట్టాడు. భోజుడు రాసిన గ్రంథాలు సమరాంగన సూత్రధార, ఆయుర్వేద సర్వస్వ, యుక్తి కల్పతరు, తత్త్వ ప్రకాశ మొదలైనవి. ఇతడు భోజపుర అనే నూతన నగరాన్ని కూడా నిర్మించాడు. తన రాజధాని ధారలో భోజశాల అనే పేరుతో ఒక కళాశాలను నిర్మించాడు. భోజుడి తర్వాత పరమార రాజ్య వైభోగం క్షీణించింది. అతడి తర్వాత పాలించిన రాజుల్లో ము ఖ్యమైన వారు జయసింహ, ఉదయాదిత్య. లక్ష్మదేవ, నరవర్మ మొదలైనవారు. ఈ వంశ ంలో చివరి రాజు మహాలకదేవ. ఇతడి తర్వాత ఈ రాజ్యాన్ని అల్లావుద్దీన్ ఖిల్జీ జయిం చాడు. -
ఇండియన్ హిస్టరీ
గుప్తానంతర యుగం-2 (6వ శతాబ్దం- 8వ శతాబ్దం) హర్షుడి అనంతరం దక్షిణ భారతదేశాన్ని పాలించిన రాజవంశాల్లో అతి ముఖ్యమైనవి బాదామి రాజధానిగా పాలించిన చాళుక్యులు (వీరినే పశ్చిమ చాళుక్యులు అని కూడా పిలుస్తారు), కంచి రాజధానిగా పాలించిన పల్లవులు (వీరిని మలి పల్లవులు అని కూడా పిలుస్తారు). ఈ రెండు వంశాల్లో ఒకరు కర్ణాటకను, మరొకరు తమిళనాడును పాలిస్తూ పరస్పరం నిరంతర యుద్ధాల్లో మునిగి ఉండేవారు. అయితే, సాహిత్యం, వాస్తు, శిల్పకళా రంగాల్లో దక్షిణ భారతదేశ సంస్కృతికి ఈ వంశాలు అమూల్యమైన సేవలందించాయి. బాదామి చాళుక్యులు: క్రీ.శ. 6వ శతాబ్దంలో వీరు దక్కన్ ప్రాంతంలో తమ రాజ్యాన్ని స్థాపించారు. బ్రహ్మచుళుకం నుంచి జన్మించి నందునతాము చాళుక్యులమని వీరు పేర్కొన్నారు. చాళుక్యుల జన్మభూమిపై పలు వివాదాస్పద సిద్ధాంతాలున్నాయి. అయితే, బిల్హణుడు అనే కవి తన విక్రమాంక దేవచరిత్ర గ్రంథంలో వీరి జన్మస్థలం అయోధ్య అని పేర్కొన్నాడు. చాళుక్యుల రాజధాని వాతాపి(బీజాపూర్ జిల్లాలోని బాదామి నగరం). అందుకే వీరిని వాతాపి చాళుక్యులు అని కూడా పిలుస్తారు. మొదటి పులకేశి: ఇతడు బాదామి చాళుక్యవంశ వాస్తవ స్థాపకుడు. తన రాజ్య స్థాపనను పురస్కరించుకుని అశ్వమేథ యాగాన్ని నిర్వహించాడు. మొదటి పులకేశి తర్వాత అతడి కుమారుడు కీర్తివర్మ రాజ్యానికి వచ్చాడు. మొదటి కీర్తివర్మ: ఇతడు తన సోదరుడు మంగళేశుడితో కలిసి తన తండ్రి స్థాపించిన రాజ్యాన్ని పలు దిశల్లో విస్తరింపచేశాడు. కొంకణ్‌ను పాలించే మౌర్యులను, వైజయంతిని పాలించే కాదంబులను, మహారాష్ర్ట, మాళ్వాలను పాలించే కాలచురి రాజులను మొదటి కీర్తివర్మ ఓడించాడు. మంగళేశ: కీర్తివర్మ కుమారుడైన పులకేశి బాలుడిగా ఉండడంతో అతడి తరఫున కీర్తివర్మ సోదరుడు మంగళేశుడు కొంతకాలం రాజ్యాన్ని పాలించాడు. కానీ అతడు పులకేశికి రాజ్యాన్ని అప్పగించకుండా తన కుమారులకు దాన్ని సంక్రమింపచేసే ప్రయత్నం చేసాడు. దీంతో పులకేశి అతడిని వధించాడు. రెండో పులకేశి: ఇతడు క్రీ.శ. 609 నుంచి 642 వరకు పరిపాలించాడు. తన పినతండ్రితో ఏర్పడిన వారసత్వ యుద్ధం నుంచి రాజ్యాన్ని రక్షించడమే కాకుండా తన దిగ్విజయ యాత్రల ద్వారా దానిని ఒక మహా సామ్రాజ్యంగా మార్చాడు. ఇతడి రాజ్య సరిహద్దులు నర్మద నుంచి కావేరి వరకూ విస్తరించాయి. దక్కన్‌పై జరిగిన హర్షుడి దాడిని ఇతడు విజయవంతంగా ఎదుర్కోవడమే గాక హర్షుడిని ఓడించినట్లుగా పులకేశి వారసుల శాసనాలు తెలియజేస్తున్నాయి. కోస్తాంధ్రపై దాడిచేసి రణదుర్జయుల పిష్టపుర రాజ్యాన్ని, విష్ణుకుండినుల రాజ్యాన్ని ఇతడు అంతం చేశాడు. ఆంధ్ర ప్రాంతాలకు పిష్టపురాన్ని కేంద్రంగా చేసి తన తమ్ముడు కుబ్జ విష్ణువర్థనుడిని తన ప్రతినిధిగా నియమించాడు. అనంతర కాలంలో కుబ్జ విష్ణువర్థనుడు తన రాజధానిని వేంగీకి మార్చి స్వతంత్ర తూర్పు చాళుక్య వంశాన్ని స్థాపించా డు. రెండో పులకేశి పల్లవ రాజ్యంపై దాడిచేసి మొదటి మహేంద్రవర్మను అంతం చేశాడు. పర్షియా రాజు రెండో ఖుస్రూతో రెండో పులకేశి దౌత్య సంబంధాలు కలిగి ఉన్నాడని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. అజంతాలోని చిత్రాల్లో కూడా ఈ అంశాన్ని చిత్రీకరించారు. క్రీ.శ. 642లో పల్లవరాజ్యంపై ఇతడు రెండోసారి దాడిచేశాడు. ఈ యుద్ధంలో పులకేశికి ఓటమితో పాటు ప్రాణహాని కూడా కలిగింది. పల్లవరాజు మొదటి నరసింహావర్మ ఈ దాడిని తిప్పికొట్టడమే గాక రెండో పులకేశిని తరుముతూ రాజధాని వాతాపివరకు వచ్చి పులకేశిని వధించాడు. వాతాపి నగరాన్ని ధ్వంసం చేసి వాతాపికొండ అనే బిరుదును పొందాడు. మొదటి విక్రమాదిత్యుడు: తన తండ్రి పులకేశి కాలంలో పల్లవులు జయించిన ప్రాంతాలన్నింటినీ తిరిగి ఆక్రమించాడు. కంచిపై దాడిచేసి పల్లవరాజు రెండో మహేంద్రవర్మను అంతం చేశాడు. విజయాదిత్యుడు: ఇతడు 40 ఏళ్లపాటు చాళుక్య రాజ్యాన్ని పరిపాలించాడు. తన కాలంలో రాజ్యంలో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాడు. ఇతడి కాలం దేవాలయాల నిర్మాణానికి పేరెన్నికగన్నది. ఇతడు సుమారు 70 దేవాలయాలను నిర్మించినట్లుగా భావిస్తారు. రెండో విక్రమాదిత్యుడు: ఇతడు తన పూర్వీకుల సాంప్రదాయమైన కంచిపై దాడులను పునరుద్ధరించాడు. ఇతని కాలంలో మొత్తం మూడు సార్లు కంచిపై దాడులు చేశాడు. రెండో కీర్తివర్మ: బాదామి చాళుక్య వం శంలో చివరిరాజు. క్రీ.శ. 753లో సామంత రాజై న దంతిదుర్గుడు రెండో కీర్తివర్మను తొలగించి స్వతంత్ర రాష్ర్టకూట రాజ్యాన్ని స్థాపించాడు. బాదామి చాళుక్యుల సాంస్కృతిక సేవ: బాదామి చాళుక్యులు తమ సామ్రాజ్యంలోని పలు ప్రాంతాల్లో అనేక దేవాలయాలు నిర్మించారు. వీటి నిర్మాణంలో ఓ కొత్త వాస్తు, శిల్పకళా శైలిని అభివృద్ధి చేశారు. దీనిని ‘వేసర’ శిల్పకళా శైలి అని పిలుస్తారు. దీన్ని ఉత్తర భారతంలోని నగర, దక్షిణాదిలోని ద్రావిడ శిల్పకళా శైలుల కలయికతో అభివృద్ధి చేశారు. చాళుక్యులు నిర్మించిన వాస్తు కట్టడాల్లో గుహాలయాలు, రాతి కట్టడాలున్నాయి. రాజధాని నగరమైన బాదామిలో చాళుక్యులు నాలుగు గుహాలయాలను నిర్మించారు. ఇందులో ఒకటి తప్ప మిగిలినవన్నీ శైవమతానికి సంబంధించినవే. ఐహోల్ నగరంలో దాదాపు 70 దేవాలయాలు నిర్మించారు. పట్టడకల్ నగరంలోనూ వీరు పలు దేవాలయాలు నిర్మించారు. ఇంకా అలంపూర్, మహానంది మొదలైన ప్రాంతాల్లో వీరు నిర్మించిన దేవాలయాలు నేటికీ నిలిచి ఉన్నాయి. బాదామి చాళుక్యులు ప్రారంభించిన వేసర శైలి... హోయసాలులు, రాష్ర్టకూటుల కాలంలో అత్యున్నత దశకు చేరింది.