
భారతదేశ చరిత్ర (స్వాతంత్య్రోద్యమం)
ఇండియన్ హిస్టరీ
సిల్వర్ టంగ్‌డ ఆరేటర్ అని ఏ జాతీయ నాయకుడిని పిలుస్తారు? - సురేంద్రనాథ్ బెనర్జీ
హంటర్ విద్యా కమిషన్ సభ్యుడైన భారతీయుడు? - ఆనందమోహన్ బోస్
నేతాజీ స్థాపించిన పార్టీ? - ఫార్వర్‌డ బ్లాక్
వందేమాతరాన్ని ఆంగ్లంలోకి అనువదించినవారు? - అరవింద ఘోష్
ఆనందమఠ్‌లో ప్రధాన ఇతివృత్తం?
- సన్యాసుల తిరుగుబాటు
అలీపూర్ కుట్ర కేసు నుంచి అరవిందఘోష్‌ను నిర్దోషిగా విడుదల చేయించినవారు?
- సి.ఆర్.దాస్
భారతదేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన తొలి ముస్లిం? - అష్పకుల్లాఖాన్
దేశంలో తొలిసారి అరెస్టయిన బాలుడిగా స్వాతంత్య్రోద్యమ చరిత్రలో నిలిచినవారు?
- ఓరుగంటి రామచంద్రయ్య
సిన్‌ఫిన్ ఉద్యమం ప్రేరణతో భారత్‌లో జరిగిన ఉద్యమం? - హోం రూల్ ఉద్యమం
సహాయ నిరాకరణోద్యమం ఎప్పుడు ప్రారంభమైంది?
- 1920, ఆగస్టు 31
సహాయ నిరాకరణోద్యమ సమయంలో స్థాపించిన విద్యా సంస్థలు?
- జామియా మిలియా ఇస్లామియా, బిహార్ విద్యాపీఠం, కాశీ విద్యాపీఠం, గుజరాత్ విద్యాపీఠం
వందేమాతర ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? - 1905, అక్టోబర్ 16
న్యూలాంప్స్ ఫర్ ఓల్డ్, వ్యాస సంపుటి రాసినవారు?
- అరవింద ఘోష్
వందేమాతర ఉద్యమ కాలంలో గోపాల మిత్ర బెంగాల్‌లో ఏర్పర్చిన సంస్థ?
- వార్షిక హిందూ మేళా
దక్షిణ భారత్‌లో తొలి ఐూఇ సమావేశం జరిగిన ప్రాంతం? - మద్రాస్
ఇంగ్లండ్ పార్లమెంట్‌కు ఎన్నికైన తొలి భారతీయుడు? - దాదాభాయ్ నౌరోజీ
క్విట్ కశ్మీర్ ఉద్యమ నిర్మాత? - షేక్ అబ్దుల్లా
శాసనోల్లంఘనోద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? - 1930, మార్చి 12
బెంగాల్‌ను తిరిగి ఏకీకరించిన సంవత్సరం? - 1911
కలకత్తా నుంచి రాజధానిని ఢిల్లీకి మార్చినవారు? - హార్డింజ్
రాజాజీ ఫార్ములాను ఎప్పుడు రూపొం
దించారు? - 1944
స్వదేశీ ఉద్యమంలో బాలభారతి సమితి ఎక్కడ ఏర్పడింది? - రాజమండ్రి
‘‘యాచించడం కాదు శాసించాలి’’ అన్నవారు - లోకమాన్య బాలగంగాధర్ తిలక్
తిలక్ ప్రచురించిన పత్రికలు? - కేసరి, మరాఠీ
త్రివర్ణ పతాకాన్ని మేడం కామా ఎక్కడ ఎగురవేశారు? - స్టట్‌గర్‌ట (జర్మనీ)
గాంధీజీ దక్షిణాఫ్రికాకు ఎప్పుడు వెళ్లారు?
- 1893
మైఖేల్-ఒ-డయ్యర్‌ను ఉద్ధమ్‌సింగ్ ఎప్పుడు చంపాడు? - 1940
జామా మసీదు (ఢిల్లీ) ప్రార్థనలో పాల్గొన్న ఆర్యసమాజ నాయకుడు? - స్వామి శ్రద్ధానంద
సైమన్ కమిషన్ కాలంలో మద్రాస్‌లో మరణించిన యువకుడు? - పార్థసారథి
సైమన్ కమిషన్ ఏర్పడిన సంవత్సరం?
- 1928 (ఇందులోని సభ్యుల సంఖ్య 7. ఈ కమిషన్ కాలం నాటి వైస్రాయ్ ఇర్విన్)
జెండా సత్యాగ్రహాన్ని నాగ్‌పూర్‌లో ప్రారంభించినవారు? - జమ్నాలాల్ బజాజ్
కేంద్ర శాసనసభకు స్పీకర్‌గా ఎన్నికైన తొలి భారతీయుడు? - విఠల్‌భాయ్ పటేల్
శాసనోల్లంఘనోద్యమ రాణి ఎవరు?
- సరోజినీ నాయుడు
గైడిన్‌లియూ ఏ ఉద్యమంలో ప్రసిద్ధి
పొందారు? - ఉప్పు సత్యాగ్రహం
ఖాన్ అబ్దుల్ గఫార్‌ఖాన్ బిరుదు?
- సరిహద్దు గాంధీ
ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న గాంధీజీ అనుచరుల సంఖ్య? - 78
హరిజనోద్ధరణ ఆంధ్ర శాఖ స్థాపకుడు?
- కాశీనాథుని నాగేశ్వరరావు
శారదా నికేతన్‌ను ఉన్నవ లక్ష్మీనారాయణ ఎక్కడ స్థాపించారు? - గుంటూరు
కొండా వెంకటప్పయ్య బిరుదు? - దేశభక్త
సుభాష్ చంద్రబోస్ ఎక్కడ జన్మించారు?
- కటక్ (ఒడిశా)
అండమాన్, నికోబార్ దీవులకు బోస్ పెట్టిన పేర్లు? - షహీద్, స్వరాజ్
ది డివైన్ లైఫ్, సావిత్రి గ్రంథాల రచయిత?
- అరవింద ఘోష్
1946 నాటి క్యాబినెట్ మిషన్‌లోని సభ్యులు?- పెథిక్ లారెన్‌స, సర్ స్టాఫర్‌డ క్రిప్స్, ఎ.వి.అలెగ్జాండర్
వేల్స్ రాకుమారుడు (8వ ఎడ్వర్‌డ) ఇండియాను ఎప్పుడు సందర్శించారు? - 1921
భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన తొలి భారతీయ వనిత? -సరోజినీ నాయుడు
దేశికోత్తమ బిరుదాంకితులు ఎవరు?
- సురేంద్రనాథ్ బెనర్జీ
ఏ నియోజకవర్గం నుంచి దాదాభాయి నౌరోజీ బ్రిటన్‌లోని హౌస్ ఆఫ్ కామన్‌సకు ఎన్నికయ్యారు? -ప్రిన్‌సబరి
ఫకీర్ మోహన్ సేనాపతి ఏ రాష్ట్రానికి చెందిన జాతీయ కవి? - ఒడిశా
కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ (1934) స్థాపకులు?
- జయప్రకాష్ నారాయణ్, ఆచార్య నరేంద్రదేవ్
అతివాదులు, మితవాదులు ఎప్పుడు ఏకమయ్యారు? - 1916
గాంధీజీ రాసిన ప్రముఖ గ్రంథాలు?
-మై ఎక్స్‌పెరిమెంట్స్ విత్ ట్రూత్, హింద్ స్వరాజ్
1921 మోప్లా తిరుగుబాటు (కేరళ) నాయకుడు? - అలీ ముస్లియార్
రౌండ్‌టేబుల్ సమావేశాలు మొత్తం ఎన్ని జరిగాయి? - 3
అజాద్ హింద్ ఫౌజ్ సైనికుల తరఫున వాదించిన జాతీయ కాంగ్రెస్ న్యాయవాదుల బృందం? -భూలాభాయ్ దేశాయ్, తేజ్ బహదూర్ సప్రూ, అసఫ్ అలీ
అజాద్ హింద్ ఫౌజ్ మహిళా విభాగం పేరు?
- ఝాన్సీ లక్ష్మీబాయి దళం
ఝాన్సీ లక్ష్మీబాయి దళానికి నాయకురాలు?
- లక్ష్మీ సెహగల్
ది గ్రేట్ కలకత్తా కిల్లింగ్ ఎప్పుడు జరిగింది?
- 1946 ఆగస్టు 16
ఇండియన్ ఇండిపెండెన్‌స బిల్‌ను బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్‌స సభలో ప్రవేశపెట్టినవారు?
- లిస్టోవెల్
ఇండియన్ ఇండిపెండెన్‌స బిల్‌ను బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్‌డ్సలో ప్రవేశపెట్టినవారు?
- లార్‌డ శామ్యూల్
స్వాతంత్య్రం వచ్చేనాటికి భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు? - జీవత్‌రామ్ భగవాన్‌దాస్ కృపలాని (జె.బి.కృపలాని)
వైస్రాయి వెవేల్ 1945లో అఖిలపక్ష సమా వేశాన్ని ఎక్కడ ఏర్పాటు చేశాడు? - సిమ్లా
రవీంద్రనాథ్ ఠాగూర్ ఆత్మకథ పేరు?
- మై రెమినిసెన్సెస్
‘యాన్ ఇండియన్ పిలిగ్రిమ్’ రాసినవారు?
- సుభాష్ చంద్ర బోస్
పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని నెహ్రూ ఎప్పుడు చేశారు? - 1929
చీరాల-పేరాల ఉద్యమం ఏ ఉద్యమంలో భాగం? -సహాయ నిరాకరణోద్యమం
విజయవాడ ఐూఇకి పరిశీలకుడిగా హైదరాబాద్ నుంచి వచ్చినవారు?
- మాడపాటి హనుమంతరావు
జాతీయోద్యమంలో జైలుశిక్ష అనుభవించిన తొలి తెలుగు వనిత? -రావూరి అలివేలు మంగమ్మ
అల్లూరి సీతారామరాజు దాడి చేసిన తొలి పోలీస్‌స్టేషన్? - చింతపల్లి
1920లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాను ఎక్కడ స్థాపించారు? - తాష్కెంట్
భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను ఎప్పుడు ఉరి తీశారు? - 1931, మార్చి 23
ఆనందమండల్ అనే విప్లవ సంస్థ ఎక్కడి నుంచి స్వాతంత్య్రం కోసం పోరాడింది?
- అహ్మదాబాద్
1937లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది? - 8
1942లో భారత్‌లో పర్యటించిన చైనా అధ్యక్షుడు? - చాంగ్ -కై-షేక్
నేతాజీ సింగపూర్‌లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? -1943 అక్టోబర్ 21
ఇండియన్ ఇండిపెండెన్‌స బిల్లును ఆమోదించిన బ్రిటన్ చక్రవర్తి? - 6వ జార్జి
వైస్రాయ్‌గా లార్‌డ ఇర్విన్ పాలనా కాలం?
- 1926-1931
లార్‌డ లిన్‌లిత్‌గో పాలనా కాలం? -1936-1943
యుగాంతర్ పత్రికాధినేత?
- బరేంద్రకుమార్ ఘోష్
సచిన్ సన్యాల్ రాసిన గ్రంథం? - బందీ జీవన్
మాండలే జైలు నుంచి తిలక్ విడుదలైన సంవత్సరం? - 1914
రఫ్త్‌గోఫ్తర్ పత్రికాధినేత? -దాదాభాయి నౌరోజి
భారతదేశం నుంచి బర్మా ఏ చట్టం ద్వారా విడిపోయింది? - 1935 చట్టం
అమృత బజార్ పత్రిక స్థాపకుడు?
- శిశిర్ కుమార్ ఘోష్
జైహింద్, చలో ఢిల్లీ నినాదకర్త? -నేతాజీ బోస్
లార్‌డ రీడింగ్ పాలనా కాలం? -1921-1925
ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్ గ్రంథకర్త ?
- లాయక్ అలీ
‘ది ఎండ్ ఆఫ్ యాన్ ఎరా’ రాసినవారు?
- కె.యం.మున్షీ
రెండో ప్రపంచ యుద్ధ కాలంలో భారతీయుల సహాయం కోరుతూ లిన్‌లిత్‌గో చేసిన ప్రకటన? - ఆగస్ట్ ఆఫర్
క్యాబినెట్ మిషన్‌ను భారత్‌కు పంపిన ఇంగ్లండ్ ప్రధాని? - క్లెమెంట్ అట్లీ
నేతాజీకి సహకరించిన జపాన్ ప్రధాని?
- టోజో
హోంరూల్ ఉద్యమాన్ని అనీబిసెంట్ ఎక్కడి నుంచి ప్రారంభించారు?
- అడయార్ (తమిళనాడు)
1911లో తొలిసారి ఐూఇలో జాతీయ గీతాలాపన సమయం నాటి ఐూఇ అధ్యక్షుడు? - బి.ఎన్.థర్
కాంగ్రెస్, ముస్లింలీగ్‌ల మధ్య కుదిరిన ఒప్పందం? - లక్నో ఒప్పందం (1916)
హరిజనులకు ప్రత్యేక నియోజకవర్గాలపై రామ్సే మెక్‌డొనాల్డ్ చేసిన ప్రకటనను ఏమంటారు? -కమ్యూనల్ అవార్‌డ్స
ద్విజాతి సిద్ధాంత కర్త? - మహ్మద్ అలీ జిన్నా
గాంధీజీ హరిజనులకు ప్రవేశం కల్పించిన దేవాలయం కృష్ణా జిల్లాలో ఎక్కడ ఉంది? - సిద్ధాంతం అనే ఊరిలో
నీల్ దర్పణ్ గ్రంథకర్త?
- దీనబంధుమిత్ర
అంబేద్కర్, గాంధీజీల మధ్య జరిగిన ఒప్పందం? - పూనా ఒప్పందం
గోఖలే తీర్మానం (1912) ఉద్దేశం?- బడి ఈడు పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య
గదర్ పార్టీలో చేరిన ఏకైక తెలుగు వ్యక్తి?
- దర్శి చెంచయ్య
స్వరాజ్య పార్టీ అధికార పత్రిక? - ఫార్వర్‌డ
మోతీలాల్ నెహ్రూ 1919లో స్థాపించిన పత్రిక? - ఇండిపెండెంట్
వార్థా విద్యా ప్రణాళికను గాంధీజీ ఎప్పుడు రూపొందించారు? - 1937
మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన సిక్కు ప్రతినిధి? - సంపూరణ్ సింగ్
మహ్మద్ అలీ జిన్నా ఎప్పుడు ముస్లింలీగ్‌లో చేరాడు? - 1913
వేల్స్ రాకుమారుడికి గౌరవ పట్టా ఇచ్చిన యూనివర్సిటీ ? బెనారస్ హిందూ యూనివర్సిటీ
ప్రిన్‌స ఆఫ్ బెగ్గర్‌స అని ఎవరిని అంటారు? - మదన్‌మోహన్ మాలవ్య (బెనారస్ హిందూ యూనివర్సిటీ కోసం కోటిన్నర నిధులు వసూలు చేసినందుకు ఇలా పిలుస్తారు)
ఖను ఎప్పుడు స్థాపించారు? - 1925
‘ది స్పాట్‌లెస్ పండిట్’ అని ఎవరిని అంటారు? - మదన్‌మోహన్ మాలవ్య
ఇండియన్ బిస్మార్‌క అని ఎవరిని అంటారు?
- సర్దార్ వల్లభాయ్ పటేల్
హైదరాబాద్‌లో పౌర ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడింది? - 1950
హైదరాబాద్ రాజ్యం, భారత యూనియన్‌కు మధ్య యథాతథ ఒప్పందం ఎప్పుడు జరిగింది? - 1947 నవంబర్ 29
ట్రావెన్‌కోర్ సంస్థాన రాజధాని?
- తిరువనంతపురం
ట్రావెన్‌కోర్ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేసినవారు?
- బలరామ్ వర్మ (1949లో)