జనరల్ స్టడీస్ పేపర్-3లో ఎకానమీ ప్రిపరేషన్ ఎలా ?
కాంపిటీటివ్ కౌన్సెలింగ్: నేను సివిల్స్ మెయిన్స్‌కు సన్నద్ధమవుతున్నాను. జనరల్ స్టడీస్ పేపర్-3లో ఎకానమీ ప్రిపరేషన్‌కు సంబంధించి తగిన సూచనలివ్వండి.
- బి. సుస్మిత, బషీర్‌బాగ్.
ఎకానమీకి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు రాయడం కోసం అభ్యర్థులు ముందుగా కాన్సెప్ట్‌పై పూర్తి పట్టు సాధించాలి. గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే జనరల్ స్టడీస్ పేపర్-3లో ఎకానమీకి సంబంధించిన ప్రశ్నలు వర్తమాన అంశాలకు అనుగుణంగా ఇచ్చారు. ఒక టాపిక్‌పై ఇచ్చిన ప్రశ్నకు వర్తమాన అంశాలతో అనుసంధానిస్తూ జవాబు రాసినప్పుడే అధిక మార్కులు సాధించవచ్చు. ిఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్ (ఎఫ్‌ఆర్‌బీఎం), సమ్మిళిత వృద్ధి, నూతన కంపెనీల బిల్లు 2013, పన్ను వ్యయం, ఆహార భద్రతా బిల్లు, వ్యవసాయ సబ్సిడీలు, పింక్ రివల్యూషన్, ప్రపంచీకరణ, భూ సంస్కరణలు, వ్యవసాయ ఉత్పాదకత, పేదరికం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, మల్టీ బ్రాండ్ రిటైల్ రంగం, వస్తు, సేవలు లాంటి అంశాలపై కాన్సెప్ట్‌ల ఆధారంగానే ప్రశ్నలను అడుగుతున్నారు. ప్రతి కాన్సెప్ట్‌ను వర్తమాన అంశాలకు అన్వయించి ప్రశ్నలు రూపొందిస్తున్నారు.
సిలబస్‌లో భాగంగా కాన్సెప్ట్‌లను చదివే క్రమంలో వివిధ అంశాలకు సంబంధించి లోతైన అధ్యయనం చేసినవారికి ఎకానమీ ప్రశ్నలకు సమాధానం రాయడం కష్టమేమీ కాదు. అందువల్ల సివిల్స్ మెయిన్‌స కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులు ఎకానమీని అధ్యయనం చేసేటప్పుడు కాన్సెప్ట్‌లపై అవగాహనతో పాటు వాటిని వివిధ అంశాలకు అన్వయించుకుంటూ చదవాలి. ఎకానమీలో ప్రతి ప్రశ్నకు వాస్తవికతకు దగ్గరగా ఉండేలా సమాధానం రాయాల్సి ఉంటుంది.
అందువల్ల వివిధ గణాంకాలు, డేటాపై తప్పనిసరిగా అవగాహన పెంచుకోవాలి. గతంలో పరీక్ష రాసిన చాలామంది అభ్యర్థులు ఎకానమీ విభాగానికి సమయం సరిపోలేదని తెలిపారు. అందువల్ల ఇప్పటి నుంచే ప్రతి ప్రశ్నకు సూటిగా, నిర్దిష్టంగా 200 పదాల పరిమితిలో జవాబులు రాయడం ప్రాక్టీస్ చేయాలి. సమయ పరిమితిలోగా అన్ని ప్రశ్నలకు జవాబు రాసే విధంగా సంసిద్ధమవ్వాలి.
ఇన్‌పుట్స్: తమ్మా కోటిరెడ్డి, సివిల్స్ సీనియర్ ఫ్యాకల్టీ
జనరల్ నాలెడ్‌జ
పాలిటీ: భారత రాజ్యాంగం
భారత రాజ్యాంగ నిర్మాణ క్రమం
‘రాజ్యాంగ పరిషత్’ భారతదేశానికి రాజ్యాంగాన్ని రూపొందించింది.
1942: క్రిప్స్ మిషన్ మొట్టమొదటిసారిగా రాజ్యాంగ పరిషత్ ఏర్పాటును ప్రతిపాదించింది
1946: ‘క్యాబినెట్ మిషన్’ సూచన మేరకు రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటు చేశారు.
1946: జూలైలో రాజ్యాంగ పరిషత్‌కు ఎన్నికలు నిర్వహించారు. (ఇందులో రాష్ట్రాలకూ,
రాజ సంస్థానాలకూ జనాభా ప్రాతిపదికన ప్రాతినిధ్యం కల్పించారు. రాష్ట్రాల విధాన సభల సభ్యులు ఓటు బదిలీ పద్ధతి ద్వారా తమ ప్రతినిధులను ఎన్నుకున్నారు. రాజ్యాంగ పరిషత్‌లో మొత్తం 389 మంది సభ్యుల్లో బ్రిటిష్ రాష్ట్రాల నుంచి 292 మంది, స్వదేశీ సంస్థానాల నుంచి 93 మంది ప్రాతినిధ్యం వహించారు. (రాజ్యాంగ పరిషత్ చిహ్నం ఐరావతం)
1946: డిసెంబర్ 9న, రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం తాత్కాలిక అధ్యక్షుడు డా॥
సచ్చిదానంద సిన్హా అధ్యక్షతన జరిగింది.
1946: డిసెంబర్ 11న డా॥బాబూ రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ పరిషత్ శాశ్వత
అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
1946: డిసెంబర్ 13న జవహర్‌లాల్ నెహ్రూ లక్ష్యాలు - తీర్మానం (పీఠిక) అనే తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీన్ని 1947 జనవరి 22న ఆమోదించారు.
1947: ఆగస్ట్ 29న రాజ్యాంగ ముసాయిదా కమిటీని పరిషత్ ఏర్పాటు చేసింది. దీని
అధ్యక్షుడు డా॥అధ్యక్షుడితో కలిపి ఈ ముసాయిదా కమిటీలో ఏడుగురు సభ్యులు ఉన్నారు.
1947: జూలై 22న రాజ్యాంగ పరిషత్ జాతీయ పతాకాన్ని ఆమోదించింది.
భారతదేశ చరిత్రలో ప్రముఖ యుద్ధాలు
యుద్ధం జరిగిన సం॥ వివరాలు
సర్‌హింద్ యుద్ధం 1555 హూమాయూన్ చేతిలో అఫ్ఘన్‌ల ఓటమి
రెండో పానిపట్ యుద్ధం 1556 అక్బర్ చేతిలో హేమూ పరాజయం, మొఘల్ సామ్రాజ్య పరిపాలనకు పునాది
రాక్షస తంగడి 1565 విజయనగర సామ్రాజ్య సైన్యం, ముస్లిం
(తళ్లికోట, బన్నిహట్టి) సైన్యాల కూటమి చేతిలో ఓటమి
హాల్దీఘాట్ యుద్ధం 1576 అక్బర్, రాణా ప్రతాప్‌కు మధ్య
భోపాల్ యుద్ధం 1737 పీష్వా మొదటి బాజీరావు చేతిలో నిజాం ఓటమి
కర్నాల్ యుద్ధం 1739 నాదిర్షా పూర్తిగా మొఘలుల సైన్యాన్ని ఓడించాడు
మొదటి కర్ణాటక యుద్ధం 1745-48 {బిటీష్, ఫ్రెంచి సైన్యాలకు మధ్య జరిగింది
రెండో కర్ణాటక యుద్ధం 1749-54 {బిటీషు, ఫ్రెంచి వారి మధ్య జరిగింది
మూడో కర్ణాటక యుద్ధం 1756-63 యూరప్‌లో సప్తవర్ష సంగ్రామ ఫలితంగా భారత్‌లో బ్రిటీష్, {ఫెంచి వారి మధ్య ఆధిపత్య పోరు, బ్రిటీషు వారి ఆధిపత్యం
ప్లాసీ యుద్ధం 1757 బెంగాల్ నవాబు సిరాజ్ - ఉద్దౌలాకు, క్లైవ్ నాయకత్వంలో బ్రిటీషు సైన్యానికి మధ్య, నవాబు ఓటమి. బ్రిటీషు పరిపాలనకు నాంది
బక్సార్ యుద్ధం 1764 బెంగాల్ నవాబు మీర్ ఖాసీం, అవధ్ నవాబు షుజా - ఉద్దౌలా, మొఘల్ చక్రవర్తి రెండో షా అలమ్‌ల మిత్ర సైన్యం కూటమి, మేజర్ మన్రో నాయకత్వంలోని ఆంగ్ల సైన్యం చేతిలో ఓటమి
జాబ్స్ అలర్‌ట్స
సతీష్ ధావన్ స్పేస్ సెంటర్
నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) సైంటిస్ట్‌ల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.
సైంటిస్ట్/ ఇంజనీర్ (ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్)
అర్హతలు: ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో 65 శాతం మార్కులతో బీఈ/ బీటెక్ ఉండాలి.
సైంటిస్ట్/ ఇంజనీర్ (ఇండస్ట్రియల్ సేఫ్టీ)
అర్హతలు: ఇండస్ట్రియల్ సేఫ్టీలో 60 శాతం మార్కులతో ఎంఈ/ ఎంటెక్ (ఎమ్మెస్సీ ఇంజనీరింగ్) ఉండాలి.
వయసు: 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: ఆగస్టు 21
వెబ్‌సైట్: www.shar.gov.in