Civils Mains
-
సివిల్స్ టాపర్ ఆదిత్య
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ –2023 తుది ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మంగళవారం ప్రకటించింది. అఖిలభారత స్థాయిలో తొలి ర్యాంకును ఆదిత్య శ్రీవాస్తవ, రెండో ర్యాంకును అనిమేశ్ ప్రధాన్ సొంతం చేసుకున్నారు. తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన దోనూరు అనన్యరెడ్డి ఆలిండియా మూడో ర్యాంకు దక్కించుకోవడం విశేషం. నాలుగు ర్యాంకు పి.కె.సిద్ధార్థ్ రామ్‌కుమార్‌కు, ఐదో ర్యాంకు రుహానీకి లభించింది. అఖిలభారత సర్వీసులకు మొత్తం 1,016 మంది ఎంపికయ్యారు. వీరిలో 664 మంది పరుషులు, 352 మంది మహిళలు ఉన్నారు. టాప్–5 ర్యాంకర్లలో ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలు.. టాప్–25 ర్యాంకర్లలో 15 మంది పురుషులు, 10 మంది మహిళలు ఉన్నారు. ఎంపికైన అభ్యర్థుల్లో 30 మంది దివ్యాంగులు ఉన్నట్లు యూపీఎస్సీ వెల్లడించింది. సివిల్స్–2023కి 10.16 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, వీరిలో 5.92 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. 14,624 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. వీరిలో 2,855 మంది పర్సనాలిటీ టెస్టు(ఇంటర్వ్యూ)కు అర్హత సాధించారు. చివరకు 1,016 మందిని కేంద్ర సర్వీసులకు యూపీఎస్సీ ఎంపిక చేసింది. ఇందులో జనరల్ కేటగిరీ అభ్యర్థులు 347 మంది, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు 115 మంది, ఓబీసీలు 303 మంది, ఎస్సీలు 165 మంది, ఎస్టీలు 86 మంది ఉన్నారు. సివిల్స్–2023 ఫలితాల పూర్తి వివరాలను http:// www.upsc. gov. in వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. విజేతలకు ప్రధాని మోదీ అభినందనలు సివిల్ సర్వీసెస్ పరీక్షలో నెగ్గి, కేంద్ర సర్వీసులకు ఎంపికైన విజేతలకు ప్రధాని నరేంద్రమోదీ అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు మంగళవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. వారి అంకితభావం, శ్రమకు తగిన ప్రతిఫలం లభించిందని పేర్కొన్నారు. విజేత కృషి, ప్రతిభ దేశ భవిష్యత్తుకు తోడ్పడుతుందని వివరించారు. మెరిసిన ఐఐటీ గ్రాడ్యుయేట్ ►సివిల్స్ తొలి ర్యాంకర్ ఆదిత్య శ్రీనివాస్తవ మెయిన్స్ లో తన ఆప్షనల్‌గా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌ను ఎంచుకున్నారు. ఆయన ఐఐటీ–కాన్పూర్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ (బీటెక్) పూర్తిచేశారు. ►రెండో ర్యాంకర్ అనిమేశ్ ప్రధాన్ ఐఐటీ–రూర్కెలాలో కంప్యూటర్ సైన్స్ లో బీటెక్ అభ్యసించారు. సివిల్స్ మెయిన్స్ లో ఆప్షనల్‌గా సోషియాలజీని ఎంచుకున్నారు. ►తెలుగు యువతి, సివిల్స్ మూడో ర్యాంకర్ దోనూరు అనన్యరెడ్డి ఢిల్లీ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్(ఆనర్స్) జాగ్రఫీ చదివారు. సివిల్స్ మెయిన్స్ లో ఆమె ఆప్షనల్ సబ్జెక్టు ఆంథ్రోపాలజీ. -
తెలంగాణకే నా సర్వీస్: ధాత్రిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి సేవలందించడమే తన తొలి ప్రాధాన్యమని, అందుకు అనుగుణంగానే నడుచుకుంటానని సివిల్స్ 46వ ర్యాంకర్ ధాత్రిరెడ్డి స్పష్టం చేశారు. 2018 సివిల్స్‌లో 233వ ర్యాంక్ సాధించి ఐపీఎస్ శిక్షణ తీసుకుంటున్న ఆమె త్వరలో ట్రైనీ ఏసీపీగా ఖమ్మంలో రిపోర్ట్ చేయాల్సి ఉంది. తాజాగా సివిల్స్–2019లో 46వ ర్యాంక్ సాధించి ఔరా అనిపించుకున్న యాదాద్రిభువనగిరి జిల్లా ముద్దుబిడ్డ ధాత్రిరెడ్డి.. ఐపీఎస్ అయినా, ఐఏఎస్ అయినా తెలంగాణకే సేవలందిస్తానని బుధవారం ‘సాక్షి’కి తెలిపారు. ఇంకా ఆమె ఏం చెప్పారంటే.. ఈజీగానే ఇంటర్వ్యూ ఈ ఏడాది జూలై 10కి నేషనల్ పోలీసు అకాడమీ (ఎన్పీఏ)లో ఫేజ్–వన్ ఐపీఎస్ శిక్షణ పూర్తయింది. తెలంగాణ స్టేట్ పోలీసు అకాడమీలో ఈ నెలాఖరుకు శిక్షణ పూర్తవుతుంది. అంతలోనే 2019 సివిల్స్‌కు ప్రిపేరై 46వ ర్యాంకు సాధించడం సంతోషంగా ఉంది. ఎన్పీఏలో శిక్షణ సమయంలోనే 2019 సివిల్స్ ఇంటర్వ్యూకు ప్రిపేరయ్యా. కరెంట్ ఎఫైర్స్ కోసం రెగ్యులర్‌గా పత్రికలు ఫాలో అయ్యాను. ఇంటర్వ్యూలో పర్సనాలిటీ, హబీలు, ఇంట్రెస్ట్, ప్రీవియస్ వర్క్‌పై అడుగుతారని అందుకు తగ్గట్టు ప్రిపేరయ్యా. అయితే ఇంటర్వ్యూ ఈజీగానే అయిపోయింది. ఏదైనా ఇష్టమే.. లక్కీ ప్లేస్‌లో ఉన్నా సివిల్స్ రాయాలని ఎప్పుడైతే అనుకున్నానో.. ఐఏఎస్, ఐపీఎస్ ఏదొచ్చినా ఫర్వాలేదనుకున్నా. రెండు సర్వీసులూ ఇష్టమే. నిజానికి నేను చాలా లక్కీ ప్లేస్‌లో ఉన్నా. సాధారణంగా ఒకరికి ఒక్కటి రావడమే ఎక్కువ. నాకు చాయిస్ ఉంది. ఐపీఎస్ తెలంగాణ క్యాడర్ నాది. ఇక్కడే వర్క్ చేయాలని ఉంది. ఐఏఎస్‌లో కేటాయించే క్యాడర్‌ను బట్టి నిర్ణయం ఉంటుంది. ఏదేమైనా ప్రజాసేవకు మరింత చేరువవుతా. ఇంట్లోనే ప్రిపరేషన్ నాన్న పి.కృష్ణారెడ్డి, తల్లి పి.సుశీల, తమ్ముడు గ్రీష్మన్‌రెడ్డి ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. ఫ్రెండ్స్ కూడా గైడ్ చేసేవారు. హైదరాబాద్‌లోనే ఇంట ర్ వరకు చదివా. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశా. ముంబై, లండన్‌లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్, డ్యూట్చి బ్యాంక్‌లో జాబ్ చేశా. ఆపై ఉద్యోగంలో సంతృప్తి లేకపోవడం తో చిన్నప్పటి కల సివిల్స్ వైపు అడుగులు వేశా. ఢిల్లీలో ఐఏఎస్ కోచింగ్‌కు కూడా వెళ్లా. నచ్చకపోవడంతో వదిలేసి హైదరాబాద్ వచ్చేశా. సరూర్‌నగర్‌లోని మా ఇంటి పక్కనే ఓ ప్రైవేట్ లైబ్రరీకి వెళ్లి చదువుకునేదాన్ని. ప్రత్యేకంగా కోచింగ్ తీసుకున్నది లేదు. సేవంటే మహా ఇష్టం 2016లో ఫీడ్ ఇండియా ఎన్జీవో మొదలెట్టాం. హోటల్స్, క్యాంటీన్లలో ఆహారం మిగిలితే దాన్ని వృద్ధ, అనాథాశ్రమాల్లో పంచేవాళ్లం. ఇందుకోసం క్లింటన్ గ్లోబల్ ఫౌండేషన్ ఇండియా నుంచి మా ఐడియా రిప్రజెంట్ చేయడానికి మియామి వెళ్లాను. స్కూలింగ్ నుంచే ఐపీఎస్ కావాలనేది నా కల. అది నెరవేరడం సంతోషంగా ఉంది. -
సివిల్స్ మెయిన్స్ ఫలితాలు విడుదల
సాక్షి, న్యూఢిల్లీ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్స్ మెయిన్స్ పరీక్ష 2018 ఫలితాలను గురువారం విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. మెయిన్స్ పరీక్షలు 2018 సెప్టెంబరు 28 నుంచి అక్టోబర్ 7 వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. కమిషన్ విడుదల చేసిన ఫలితాలలో 1994 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. ఎంపికైన అభ్యర్థులకు ఫిబ్రవరి 4వ తేదీ నుంచి ఇంటర్వ్యూలు జరగనున్నాయి. అభ్యర్థులు upsc.gov.in, upsconline.nic.in వెబ్సైట్ల ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు. -
సివిల్స్ మెయిన్స్..‘ఆప్షనల్’ ఎంపికలో..!
సివిల్స్ మెయిన్ ఎగ్జామినేషన్‌లో మెరిట్ జాబితా రూపకల్పనకు పరిగణనలోకి తీసుకునే ఏడు పేపర్లలో రెండు పేపర్లు ఆప్షనల్ సబ్జెక్టుకు సంబంధించినవి. అభ్యర్థులు యూపీఎస్సీ నిర్దేశించిన ఆప్షనల్ సబ్జెక్టుల జాబితా నుంచి దీన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఫలితాలపై ఆప్షనల్ సబ్జెక్టు చూపే ప్రభావం గురించి అభ్యర్థుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ‘ఫలానా ఆప్షనల్ స్కోరింగ్‌గా ఉందని లేదా ఫలానా ఆప్షనల్లో సిలబస్ సులభంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి. అయితే ఏ సబ్జెక్టు అయినప్పటికీ యూపీఎస్సీ.. మూల్యాంకన కోణంలో స్కేలింగ్ విధానాన్ని అనుసరిస్తూ అన్ని సబ్జెక్టుల అభ్యర్థులకు సమన్యాయం చేసేలా వ్యవహరిస్తోందని నిపుణులు అంటున్నారు. అందువల్ల ఆప్షనల్ విషయంలో ఆందోళనకు గురికాకుండా స్వీయ సామర్థ్యం మేరకు సబ్జెక్టును ఎంపిక చేసుకోవాలని సూచిస్తున్నారు. ఆసక్తికి ప్రాధాన్యం ఆప్షనల్ సబ్జెక్టు ఎంపిక విషయంలో అభ్యర్థులు ముందుగా తమ ఆసక్తికి ప్రాధాన్యం ఇవ్వాలనేది నిపుణుల అభిప్రాయం. వ్యక్తిగత ఆసక్తితో ఆప్షనల్‌ను ఎంపిక చేసుకుంటే ఆ సబ్జెక్టు సిలబస్ ఎంత క్లిష్టంగా ఉన్నప్పటికీ విజయం సాధించొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మ్యాథమెటిక్స్ అంటే అకడమిక్ పరీక్షల విషయంలోనే విద్యార్థులు ఇబ్బందికరంగా భావిస్తారు. అలాంటి సబ్జెక్టును సివిల్స్–2014 మెయిన్స్‌లో 351 మంది ఆప్షనల్‌గా ఎంపిక చేసుకున్నారు. వీరిలో 35 మంది విజేతలుగా నిలిచారు. మెడికల్ సైన్స్ సబ్జెక్టును 356 మంది ఎంపిక చేసుకోగా, 71 మంది విజేతలుగా నిలిచారు. ఆసక్తి ఉంటే ఏ సబ్జెక్టును ఎంపిక చేసుకున్నప్పటికీ విజయం సాధించొచ్చనే దానికి ఈ గణాంకాలే నిదర్శనం. సిలబస్ పరిశీలన తర్వాతి దశలో అభ్యర్థులు సంబంధిత ఆప్షనల్ సిలబస్‌ను పరిశీలించాలి. అందులోని అంశాలపై పరీక్ష సమయానికి తాము సంసిద్ధత పొందగలమా? లేదా? అని బేరీజు వేసుకోవాలి. కేవలం స్కోరింగ్ పేరుతో ఒక ఆప్షనల్‌ను తీసుకుంటే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. సిలబస్‌తో పాటు సదరు ఆప్షనల్ సబ్జెక్టు గత ప్రశ్నపత్రాలను కూడా పరిశీలించడం ద్వారా మరింత స్పష్టత వస్తుంది. మెటీరియల్ లభ్యత సాధారణంగా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, జాగ్రఫీ, హిస్టరీ, లాంగ్వేజ్ లిటరేచర్ వంటి ఆప్షనల్స్‌కు మార్కెట్లో ప్రామాణిక మెటీరియల్ లభ్యత బాగుంటుంది. మరోవైపు తమ అకడమిక్ నేపథ్యానికి అనుగుణంగా కోర్ సబ్జెక్టులను ఎంపిక చేసుకునే అభ్యర్థులకు మాత్రం మెటీరియల్ లభ్యత కొంత తక్కువే. వీరు తమ అకడమిక్ పుస్తకాలను, ఇతర ఐసీటీ టూల్స్ ఆధారంగా చేసుకొని ప్రిపరేషన్ సాగించాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో కొంత సమయం వృథా అవుతుంది. అయితే.. అకడమిక్స్ పరంగా అన్ని విభాగాల్లో మెరుగ్గా ఉన్న అభ్యర్థులు సంబంధిత ఆప్షనల్‌ను ఎంపిక చేసుకున్నప్పటికీ సులువుగానే విజయావకాశాలను మెరుగుపరచుకోవచ్చు. స్వీయ ప్రిపరేషన్ ఇటీవల కాలంలో కొందరు అభ్యర్థులు ఉద్యోగాలు చేస్తూనో, లేదా శిక్షణ పొందే అవకాశాలు లేకపోవడం కారణంగా స్వీయ ప్రిపరేషన్ సాగించి విజయం సాధిస్తున్నారు. వీరికి దోహద పడుతున్న అంశం ఆప్షనల్ ఎంపికలో శాస్త్రీయ దృక్పథంతో వ్యవహరించడం. ఈ అంశాన్ని ఔత్సాహికులు గుర్తించాలి. సరితూగే సబ్జెక్టు లేకుంటే.. ప్రస్తుతం సివిల్స్ మెయిన్ ఎగ్జామినేషన్‌లో భాషా సాహిత్యం సహా అందుబాటులో ఉన్న ఆప్షనల్ సబ్జెక్టుల సంఖ్య 27. ఈ సబ్జెక్టులను అకడమిక్‌గా అన్ని నేపథ్యాల వారికి సరితూగే విధంగా నిర్దేశించారు. అయితే వీటిలో ఏ సబ్జెక్టు కూడా నచ్చని అభ్యర్థులు లేదా కాంపిటీటివ్ ఎగ్జామ్ కోణంలో సదరు సబ్జెక్టుల సిలబస్ విషయంలో ఆందోళన చెందే అభ్యర్థులు... తాము హైస్కూల్ స్థాయిలో ఆసక్తి కనబరిచిన సబ్జెక్టును అవలోకనం చేసుకుని.. దాని ఆధారంగా ఆప్షనల్ సబ్జెక్టును ఎంపిక చేసుకోవడం ద్వారా కొంతమేరకు సమస్యను అధిగమించొచ్చు. భాషా సాహిత్యం ఆప్షనల్ ఎంపికలో ఇటీవల కాలంలో పలువురు భాషా సాహిత్యం సబ్జెక్టును ఆప్షనల్‌గా ఎంపిక చేసుకోవడానికి ప్రాధాన్యమిస్తున్నారు. మెటీరియల్ లభ్యత, గైడెన్స్, సులువుగా అవగతం చేసుకునే అవకాశాలే దీనికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. అంతేకాకుండా మాతృభాషలో ప్రజెంటేషన్ వల్ల వేగం, కచ్చితత్వంతో వ్యవహరించొచ్చనే ఉద్దేశంతో లాంగ్వేజ్ లిటరేచర్ను ఆప్షనల్‌గా ఎంచుకుంటున్నారు. 2014లో తెలుగు లిటరేచర్ ఆప్షనల్తో 122 మంది హాజరవగా.. 2015లో ఆ సంఖ్య 132. సక్సెస్ రేటు కూడా రెండేళ్లకు కలిపి సగటున 10.5 శాతంగా నమోదైంది. మాతృభాష (తెలుగు)లో పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల పరంగానూ తెలుగు లిటరేచర్ను ఆప్షనల్‌గా తీసుకునే వారి సంఖ్య దాదాపు పది శాతం వరకు ఉంటోంది. పోటీ తక్కువ ఉండే సబ్జెక్టులు మెయిన్స్ ఆప్షనల్ ఎంపిక విషయంలో కొంత వినూత్నంగా వ్యవహరించడం ద్వారా విజయావకాశాలను మెరుగుపరచుకోవచ్చు. ఈ క్రమంలో పోటీ తక్కువ ఉండే సబ్జెక్టులను ఎంపిక చేసుకోవడం మేలు చేస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అకడమిక్ స్థాయిలో సదరు సబ్జెక్టుపై పూర్తి స్థాయిలో పట్టు సాధించిన అభ్యర్థులు అదే సబ్జెక్టును ఆప్షనల్‌గా ఎంపిక చేసుకుంటే పరీక్షలో మెరుగ్గా వ్యవహరించొచ్చు. ఉదాహరణకు ఎకనామిక్స్, మేనేజ్మెంట్, లా వంటి సబ్జెక్టులను తీసుకుంటే వీటిని ఎంపిక చేసుకునే వారి సంఖ్య సగటున 200 ఉంటోంది. అంతేకాకుండా వీటి సక్సెస్ రేటు కూడా ఇతర క్రేజీ సబ్జెక్టుల తరహాలోనే ఉంటోంది. పాపులర్ ఆప్షన్స్‌గా నిలుస్తున్న ఇతర సబ్జెక్టులు ఇటీవల కాలంలో స్కోరింగ్ పరంగా పాపులర్ ఆప్షన్‌గా నిలుస్తున్న ఇతర సబ్జెక్టుల విషయానికొస్తే.. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, జాగ్రఫీ, ఫిలాసఫీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ముందు వరుసలో నిలుస్తున్నాయి. 15 వేల నుంచి 16 వేల మంది వరకు హాజరయ్యే మెయిన్ ఎగ్జామినేషన్‌లో ఈ సబ్జెక్టుల అభ్యర్థులే దాదాపు తొమ్మిది నుంచి పది వేల మంది వరకు ఉంటున్నారు. వీటికి సంబంధించి మెటీరియల్ లభ్యత, సరళీకృత అంశాలు, గైడెన్స్ పరంగా ఫ్యాకల్టీ లభ్యత వంటి అంశాలు ఇందుకు కారణంగా నిలుస్తున్నాయి. అభ్యర్థులు.. తాము ప్రిపరేషన్‌కు కేటాయించే మొత్తం సమయంలో 30 నుంచి 40 శాతం సమయాన్ని ఆప్షనల్ సబ్జెక్టుకు కేటాయించాలి. రిసోర్సెస్ లభ్యతను పరిగణనలోకి తీసుకోవాలి ఆప్షనల్ ఎంపికలో అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టు సిలబస్ అంశాలను బేరీజు వేసుకొని, దానికి సంబంధించి రిసోర్సెస్ లభ్యతను పరిగణనలోకి తీసుకోవాలి. కొందరు అకడమిక్‌గా ఒక సబ్జెక్టులో మెరుగైన ప్రతిభ చూపినప్పటికీ.. పోటీ పరీక్షల కోణంలో రాణించలేరు. అలాంటి అభ్యర్థులు కొంచెం సులువుగా ఉండే హ్యుమానిటీస్‌కు సంబంధించిన ఆప్షనల్స్ తీసుకోవడం మేలు. అందుకే ఇటీవల కాలంలో బీటెక్, మ్యాథమెటిక్స్ నేపథ్యం ఉన్న అభ్యర్థులు కూడా పాలిటీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వంటి వాటిని ఎంపిక చేసుకుంటున్నారు. – వి.గోపాలకృష్ణ, బ్రెయిన్ ట్రీ అకాడమీ. సత్తాను బేరీజు వేసుకోవాలి అకడమిక్ నేపథ్యానికి సంబంధించిన ఆప్షనల్‌ను ఎంపిక చేసుకునే క్రమంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అందులో రాణించే సత్తాను బేరీజు వేసుకోవాలి. అకడమిక్స్‌కు పూర్తి భిన్నమైన సబ్జెక్టును ఆప్షనల్‌గా ఎంచుకుంటే (ఉదాహరణకు ఇంజనీరింగ్ విద్యార్థులు సోషియాలజీ, సైకాలజీ వంటివి) ప్రిపరేషన్ పరంగా అన్వయ సామర్థ్యంపై అవగాహన పెంపొందించుకొని నిర్ణయం తీసుకోవాలి. అంతేకాకుండా తెలుగు మీడియంలో పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు.. ఇంగ్లిష్ మీడియంలో ఉండే మెటీరియల్‌ను తెలుగులోకి అనువాదం చేసుకోవడంలో సులభంగా ఉండే సబ్జెక్ట్‌లను ఎంపిక చేసుకోవడం ఉపయుక్తంగా ఉంటుంది. – పి.అన్వేష రెడ్డి, సివిల్స్ విజేత. -
కాంపిటీటివ్ కౌన్సెలింగ్
సివిల్స్ మెయిన్స్ ప్రిపరేషన్లో ‘రాయడం ప్రాక్టీస్’ చేయడమనేది కీలకమైన అంశం. ఎందుకంటే ఓ అంశానికి సంబంధించి ఎంతటి పరిజ్ఞానం, అవగాహన ఉన్నప్పటికీ రాతపూర్వకంగా సరిగా వ్యక్తీకరించకుంటే ఫలితం శూన్యం! వీలైనన్ని మాక్‌టెస్ట్‌లు రాయడం ద్వారా లోపాలను అధిగమించి, రాత తీరును మెరుగుపరుచుకోవచ్చు. సమకాలీన అంశాలపై ఎస్సేలు రాసి, నిపుణులతో దిద్దించుకోవాలి. దీనివల్ల బలాలు, బలహీనతలు తెలుస్తాయి. మెరుగుపరచుకోవాల్సిన అంశాలపై స్పష్టత వస్తుంది. రోజూ జనరల్ స్టడీస్, ఆప్షనల్ ప్రిపరేషన్‌కు సమయం కేటాయించాలి. ఉదయం జనరల్ స్టడీస్ చదివితే, సాయంత్రం ఆప్షనల్ సబ్జెక్టు చదవాలి. సమయం ఎక్కువగా అందుబాటులో ఉండదు కాబట్టి ఒకట్రెండు పేపర్లతోపాటు ఒక ప్రామాణిక మ్యాగజైన్‌కు పరిమితమవ్వాలి. ముఖ్యమైన అంశాలను ప్రత్యేకంగా నోట్ చేసుకోవాలి. ఎంత ఎక్కువ చదివామనే దానికంటే చదివిన విషయం ఎంత వరకు గుర్తుంది అనేది ప్రధానం. అందుకే పునశ్చరణకు ప్రాధాన్యం ఇవ్వాలి. సామాజిక, ఆర్థిక సర్వే; బడ్జెట్, ముఖ్యమైన కమిటీల నివేదికలు వంటి వాటిని అధ్యయనం చేయడం ముఖ్యం. రాష్ట్రపతి, ప్రధానిమంత్రి ప్రసంగాలపై దృష్టికేంద్రీకరించాలి. ఎందుకంటే వీటి ద్వారా వివిధ అంశాలకు సంబంధించిన ప్రభుత్వ ఆలోచన ధోరణి తేటతెల్లమవుతుంది. సమాధానం రాసేటప్పుడు ఒక ‘ఆఫీసర్’గా రాయాలి. ఆఫీసర్ అయినట్లు ఊహించుకుని సమాధానం రాస్తే మరింత ప్రాక్టికల్‌గా రాసే అవకాశం లభిస్తుంది. ఏదైనా సమస్య పరిష్కారానికి సూచనలు ఇచ్చేటప్పుడు క్షేత్రస్థాయిలో ప్రాక్టికల్‌గా అమలు చేయడానికి వీలయ్యే వాటిని సూచించాలి. సమాధానాల్లో నెగిటివ్ అభిప్రాయాలను రాయొద్దు. అన్నీ సమస్యలే.. అంతా అవినీతిమయం, ఏమీ చేయలేం.. వంటి నిరాశాజనక అభిప్రాయాలను కాకుండా ‘‘తప్పులున్నాయి.. వాటిని సరిదిద్దుకునేందుకు అవకాశముంది..’’ అనే సానుకూల ధోరణిని ప్రతిబింబించాలి. జనరల్ స్టడీస్ పేపర్-4 ప్రిపరేషన్‌కు ఇగ్నో మెటీరియల్‌ను సేకరించి వాటిలోని కేస్ స్టడీలను అధ్యయనం చేయాలి. -
సివిల్స్ మెయిన్స్‌లో మెరుపులకు...
తుది దశ సన్నద్ధత, ఎగ్జామ్ డే టిప్స్ దేశంలో అత్యున్నత సర్వీసులను చేజిక్కించుకునేందుకు వీలుకల్పించే ‘సివిల్స్’ రెండో దశ అయిన మెయిన్స్ పరీక్షలు డిసెంబరు 18 నుంచి జరగనున్నాయి. అందుబాటులో ఉన్న ఈ 15 రోజుల్లో చేసే రివిజన్, పరీక్ష రాసే విధానం విజయంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇప్పటికే కంటెంట్‌పై పట్టు సాధించటాన్ని పూర్తిచేసి ఉంటారు కాబట్టి మిగిలిన సమయంలో రివిజన్, ప్రజంటేషన్పై పూర్తిస్థాయిలో దృష్టిసారించాలంటున్నారు గత విజేతలు. మెయిన్స్ మెట్టును విజయవంతంగా అధిరోహించేందుకు సివిల్స్-2013 టాపర్స్ ముషారఫ్ ఫరూఖి, ఎస్.కృష్ణ ఆదిత్య, సబ్జెక్టు నిపుణులు అందిస్తున్న సూచనల సమాహారం... ప్ర:పరీక్షకు ముందు అందుబాటులో ఉన్న ఈ కొద్ది రోజుల్లో రివిజన్ ఎలా ఉండాలి? జ:ఇది కీలక సమయం. దీన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. ఈ సమయంలో కొత్త అంశాలను చదవకపోవడం ఉత్తమం. సబ్జెక్టుల వారీగా ముఖ్య అంశాలను ఇప్పటికే గుర్తించి ఉంటారు కాబట్టి, వాటిని ఒకటికి రెండుసార్లు చదవాలి. వాటి నుంచి ఎలాంటి ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముందో గుర్తించి, తమదైన శైలిలో సమాధానాలు రాయటాన్ని ప్రాక్టీస్ చేయాలి. దీనివల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్ర:పరీక్షకు ముందు తీవ్ర ఒత్తిడి ఉంటుంది. దీన్ని ఎలా అధిగమించాలి? జ:కొన్ని చాప్టర్లను చదవలేదన్న ఆలోచనలతో చాలా మంది ఈ సమయంలో ఒత్తిడికి గురవుతారు. చదవని అంశాలపై కంటే చదివిన, ముఖ్యమైన అంశాలపై దృష్టిసారించాలి. ఇంకా చదవని అంశాలు చాలా ఉన్నాయనే ఆలోచనలను పక్కన పెట్టాలి. పరీక్షలో బాగా ప్రజెంట్ చేయటంపై పూర్తిస్థాయిలో దృష్టిసారించాలి. ఈ సమయంలో టెన్షన్ ప్రతి అభ్యర్థికీ ఉంటుందని గుర్తిస్తే కాసింత ఉపశమనం లభిస్తుంది. ప్ర:పరీక్షలో చాలా ప్రశ్నలుంటాయి. సమయం తక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితిని విజయవంతంగా అధిగమించాలంటే ఏం చేయాలి? జ:దీనికోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయాన్ని ఉపయోగించుకోవాలి. ఒక అంశంపై ప్రశ్న వస్తే ప్రారంభం ఎలా ఉండాలి? ముగింపు ఎలా ఉండాలి? అందులో ఏ అంశాలను రాయాలి? అనే విషయాలను ప్రాక్టీస్ చేయాలి. ప్రధానంగా ఇతర దేశాలతో భారత్ ఆర్థిక సంబంధాలు, పర్యావరణ సమస్యలు, ఇటీవల కాలంలో రాజ్యాంగానికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేలా రఫ్‌గా ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే పరీక్షలో చాలా సమయం ఆదా అవుతుంది. లేకపోతే గందరగోళం తలెత్తుతుంది. ఇంకా ఒక పాయింట్ మిగిలి ఉంది. దాన్ని ఎక్కడ రాయాలి? ఎలా రాయాలి? ఇలా రకరకాల సందేహాలు తలెత్తి, సమయం వృథా అవుతుంది. ప్ర:పరీక్షలో చేతి రాత ప్రాధాన్యం ఏమిటి? జ:మెయిన్స్ పరీక్షలు డిసెంబరు 18న ప్రారంభమై, 23తో ముగుస్తాయి. ఈ స్వల్ప వ్యవధిలోనే అభ్యర్థులు 9 పేపర్లు రాయాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో సమాధానాలను ప్రజెంట్ చేయటంలో చేతి రాత కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే వేగంగా, స్పష్టంగా రాయటాన్ని ప్రాక్టీస్ చేయాలి. లేకపోతే పరీక్ష మధ్యలో చేతి వేళ్లు పట్టేస్తాయి. దీనివల్ల చాలా సమయం వృథా అవుతుంది. ప్ర:ఈ సమయంలో కూడా న్యూస్ పేపర్లను బాగా చదవాలా? జ:ఇప్పటికే ప్రశ్నపత్రాల రూపకల్పన పూర్తవుతుంది కాబట్టి న్యూస్ పేపర్లను క్షుణ్నంగా చదవాల్సిన అవసరం లేదు. అలాగని చదవటం ఆపేయకూడదు. ముఖ్యమైన అంశాలను చదివితే సరిపోతుంది. దీనివల్ల ప్రశ్నలకు సమాధానాలు రాసేటప్పుడు అప్డేట్ సమాచారం ఇచ్చి, ఎగ్జామినర్‌ను ఆకట్టుకోవచ్చు. ప్ర:పరీక్ష సమయంలో ఆరోగ్య పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జ:ఎంత బాగా చదివినప్పటికీ, పరీక్షలు జరిగే సమయంలో అనారోగ్యానికి గురైతే అంతా వృథా అవుతుంది. అందువల్ల ఆరోగ్యంగా ఉండటానికి జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి. దీన్ని నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. జలుబు, దగ్గు, జ్వరం వంటివి రాకుండా ఉండేందుకు వ్యాధినిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రయత్నించాలి. పాలలో పసుపు కలిిపి (్టఠటఝ్ఛటజీఛి ఝజీజు) తాగటం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. కాచి, వడపోసిన నీరు తాగాలి. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. శాకాహారం తీసుకోవటం మంచిది. తగిన విశ్రాంతి తీసుకోవాలి. శారీరక వ్యాయామానికి రోజూ అరగంట కేటాయించాలి. ప్ర:స్కోరింగ్‌కు కీలకమైన జనరల్ ఎస్సే పేపర్లో అధిక మార్కులు సాధించాలంటే ఏం చేయాలి? జ:గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే ఎస్సేలు ౌఞ్ఛ ్ఛఛ్ఛీఛీగా ఉంటున్నట్లు అర్థమవుతోంది. ఈ పేపర్లో అధిక స్కోర్ సాధించాలంటే ముందే కొన్ని ప్రామాణిక అంశాలపై రెడీమేడ్ ఎస్సేలను సిద్ధంగా ఉంచుకోవాలి. ఇవి బాగా ఉపయోగపడతాయి. ఎస్సే రాసేటప్పుడు ముఖ్యమైన అంశాలను అండర్లైన్ చేస్తే బాగుంటుంది. సబ్‌హెడ్డింగ్స్ పెట్టాలి. అవసరం మేరకు చిన్న చిన్న బొమ్మలు, గ్రాఫ్‌లు ఉపయోగించాలి. ఇచ్చిన అంశం చిన్నదే అనిపించినప్పటికీ (ఉ్ఠ: గిజ్టీజి జట్ఛ్చ్ట్ఛట ఞౌఠ్ఛీట ఛిౌఝ్ఛట జట్ఛ్చ్ట్ఛట ట్ఛటఞౌటజీఛజీజ్టీడ) విస్తృతంగా ఆలోచించి, ఎస్సే రాయాలి. పరిమితులు విధించుకొని రాసే ఎస్సే ప్రభావవంతమైన ఎస్సే అనిపించుకోదు. ఏ అంశం ఇచ్చినా, నిర్దిష్ట అభిప్రాయాన్ని వ్యక్తం చేయగలగాలి. ప్ర:జీఎస్ పేపర్-4 (ఎథిక్స్, ఇంటెగ్రిటీ, ఆప్టిట్యూడ్)లో ఎక్కువ మార్కులు సాధించాలంటే ఏం చేయాలి? జ:ఎథిక్స్ పేపర్లో రెండు (ఫిలాసఫికల్, కేస్‌స్టడీ) భాగాలుంటాయి. కేస్‌స్టడీ విభాగంలో ఒక కలెక్టర్/ఎస్పీ లేదంటే మరో అధికారి రోజువారీ విధుల్లో ఎదురయ్యే అయోమయ (ఛీజ్ఛీఝఝ్చట) పరిస్థితులకు సంబంధించి ప్రశ్నలు ఉంటాయి. వీటికి పాలనా దక్షత, నిజాయితీని ప్రతిబింబించేలా సమాధానాలు రాయాలి. శక్తి, సంపద, ధర్మ (డ్యూటీ), నిజాయితీ తదితర ఫిలాసఫీ అంశాలకు సంబంధించిన సమాధానాల్లో మంచి కొటేషన్స్ రాయాలి. కేస్‌స్టడీలకు సంబంధించి స్వీయ వివేచన ఆధారంగా, నిర్మాణాత్మకంగా, ప్రాక్టికల్‌గా సాధ్యమయ్యేలా సమాధానాలు ఇవ్వాలి. ప్ర:ప్రశ్నలకు సమాధానాలను పాయింట్ల రూపంలో రాయాలా? లేదంటే పారాగ్రాఫ్‌ల రూపంలో రాయాలా? జ:ఇచ్చిన ప్రశ్నను బట్టి సమాధానాన్ని పాయింట్ల రూపంలో రాయాలా? పారాగ్రాఫ్ రూపంలో రాయాలా అనేది నిర్ణయించుకోవాలి. కొన్ని ప్రశ్నలకు పాయింట్ల రూపంలో సమాధానం రాయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. మరికొన్నింటికి రెండు విధానాలనూ జోడిస్తూ రాసినప్పుడే మేలు జరుగుతుంది. ఉదాహరణకు భూసేకరణ బిల్లు-ప్రతిపాదిత సవరణలకు సంబంధించిన సమాధానాన్ని పాయింట్ల రూపంలో రాస్తే బాగుంటుంది. ప్ర:ప్రశ్నల్లో అనలైజ్, క్రిటికల్లీ అనలైజ్, ఎన్యుమరేట్, ఎక్స్ప్లెయిన్, కామెంట్ వంటి పదాలు కనిపిస్తాయి. వీటిని ప్రాధాన్యం ఏమిటి? జ:ఒక ప్రశ్నకు సమాధానం రాసేముందు ఎగ్జామినర్ అభ్యర్థి నుంచి ఎలాంటి సమాధానాన్ని ఆశిస్తున్నారో ఈ పదాల ద్వారా తెలుస్తుంది. అనలైజ్ అంటే ఒక అంశాన్ని లోతుగా పరిశీలిస్తూ, విశ్లేషణాత్మకంగా రాయాలి. క్రిటికల్లీ అనలైజ్ అంటే విమర్శనాత్మ పరిశీలనతో సమాధానం రాయాలి. ఎన్యుమరేట్ అంటే సంబంధిత అంశంపై ఉన్న సమాచారాన్ని యథాతథంగా చెప్పాలి. కామెంట్ అంటే ముఖ్యాంశాలతో పాటు అభ్యర్థి నిర్దేశ అంశంపై తన అభిప్రాయాలను వెల్లడించాలి. ప్ర:పాలిటీ, గవర్నెన్స్‌కు సంబంధించి ముఖ్యంగా దృష్టిసారించాల్సిన అంశాలేవి? జ:నేడు చాలా సందర్భాల్లో ప్రభుత్వాల నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. ఇవి రాజ్యాంగ అమలుకు అడ్డంకులు సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజా సంక్షేమం, ఆర్థికాభివృద్ధి తదితరాలకు సంబంధించి ప్రభుత్వం తీసుకొనే కొన్ని నిర్ణయాలు రాజ్యాంగం కోణంలో ఎలా వివాదాస్పదమవుతున్నాయో అనే కోణంలో ప్రశ్నలు రావొచ్చు. నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ (ఎన్‌జేఏసీ) రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ముఖ్యమైనది. ప్ర:ఎకానమీకి సంబంధించి ఏ అంశాల నుంచి ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది? జ:ఎకానమీకి సంబంధించి ప్రధానంగా పారిశ్రామిక సంస్కరణలు, పన్నుల సంస్కరణలు, మూలధన మార్కెట్లో సంస్కరణల అమలు ఆర్థిక వ్యవస్థపై చూపిన ప్రభావంపై ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనల నేపథ్యంలో వివిధ దేశాలతో భారత్ ఆర్థిక సంబంధాల ముఖచిత్రంపై ప్రశ్నలు రావొచ్చు. మేకిన్ ఇండియా, ఎఫ్‌డీఐ పరిమితులు వంటి అంశాలు ముఖ్యమైనవి. గుర్తుంచుకోండి.. అభ్యర్థుల్లోని విషయ పరిజ్ఞానం, తార్కిక విశ్లేషణ సామర్థ్యం, భావ వ్యక్తీకరణ నైపుణ్యం, ఒత్తిడిని ఎదుర్కొనే సామర్థ్యం- స్థూలంగా సివిల్స్ మెయిన్స్ ప్రధానోద్దేశం ఇదే. అందుకే పరీక్షకు హాజరయ్యే ప్రతి అభ్యర్థి ఈ నాలుగు లక్షణాలను పెంపొందించుకుని ఆత్మవిశ్వాసంతో పరీక్ష హాల్లో అడుగుపెట్టాలి. ఇవన్నీ ఉంటే విజయానికి చేరువైనట్లే. సంబంధిత ప్రశ్నకు సమాధానం రాసేటప్పుడు పరీక్ష రోజు వరకు ఆ అంశం/రంగంపై ప్రస్తుతం ఏయే మార్పులు, పరిణామాలు జరిగాయో తెలుసుకోవాలి. వాటిని అప్లికేషన్ ఓరియెంటెడ్ మెథడ్‌లో సమాధానాలకు వర్తింపచేయాలి.సమాధానం సూటిగా, స్పష్టంగా, క్లుప్తంగా రాయాలి. అభ్యర్థులు అందరి దగ్గర ఒకే విధమైన సమాచారం ఉంటుంది. ఎవరైతే సృజనాత్మకంగా, విశ్లేషణాత్మకంగా, మిగిలినవారికంటే భిన్నంగా రాయగలరో వారే పోటీలో ముందంజలో ఉంటారు. టాపర్స్ టిప్స్ రైటింగ్ ప్రాక్టీస్‌పై దృష్టిసారించాలి ఇప్పుడు దృష్టంతా ప్రశ్నలకు సమాధానాలను ఎలా ప్రజెంట్ చేయాలనే దానిపైనే పెట్టాలి. రైటింగ్ ప్రాక్టీస్‌కు ప్రాధాన్యమివ్వాలి. సబ్జెక్టుల వారీగా ముఖ్య అంశాలను ఇప్పటికే గుర్తించి ఉంటారు కాబట్టి, వాటిని వీలైనన్ని సార్లు చదవాలి. వాటి నుంచి ఏ కోణంలో ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముందో గుర్తించాలి. వాటికి తమదైన శైలిలో సమాధానాలు రాయటాన్ని ప్రాక్టీస్ చేయాలి. దీనివల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఒక అంశంపై ప్రశ్న వస్తే ప్రారంభం ఎలా ఉండాలి? ముగింపు ఎలా ఉండాలి? అందులో ఏ అంశాలను రాయాలి? అనే విషయాలను మెదడులో నిక్షిప్తం చేసుకోవాలి. గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే ఎస్సేలు ౌఞ్ఛ ్ఛఛ్ఛీఛీగా ఉంటున్నట్లు అర్థమవుతోంది. ఈ పేపర్లో అధిక స్కోర్ సాధించాలంటే ముందే కొన్ని ప్రామాణిక అంశాలపై ఎస్సేలను సిద్ధంగా ఉంచుకొని, అధ్యయనం చేయాలి. ఇవి బాగా ఉపయోగపడతాయి. పరిమితులు విధించుకొని రాసే ఎస్సే ప్రభావవంతమైన ఎస్సే అనిపించుకోదు. ఏ అంశం ఇచ్చినా, నిర్దిష్ట అభిప్రాయాన్ని వ్యక్తం చేయగలగాలి. ఎథిక్స్ పేపర్లో ఫిలాసఫికల్, కేస్‌స్టడీలకు సంబంధించిన ప్రశ్నలకు అభ్యర్థులు పాలనా దక్షత, నిజాయితీని ప్రతిబింబించేలా సమాధానాలు రాయాలి. చివరి 5 నిమిషాల్లో ఒకట్రెండు ప్రశ్నలు మిగిలిపోతే, వదిలేయకుండా వాటికి సంబంధించిన కీలక పదాలతో చిన్న వాక్యాలను రాయాలి. ఇలా చేయటం వల్ల పోటీలో ముందుంటాం. బెస్ట్ ఆఫ్ par లక్ఙ- ముషారఫ్ ఫరూఖి, అసిస్టెంట్ కలెక్టర్, ఖమ్మం. ఆత్మవిశ్వాసంతో అడుగేయండి! ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయాన్ని ఆన్సర్ ప్రజెంటేషన్ ప్రాక్టీస్‌కు కేటాయించాలి. రోజుకు కనీసం 5-10 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ఈ సమాధానాలు రాయటాన్ని గంటలోపు పూర్తిచేయాలి. ప్రముఖ శిక్షణ కేంద్రాలు అందుబాటులో ఉంచిన మోడల్ ప్రశ్నల్లో క్లిష్టమైన వాటిని ఎంపిక చేసుకొని, వాటికి సమాధానాలు రాయాలి. తర్వాత గంట సమయాన్ని స్వీయ మూల్యాంకనానికి (self evaluation) కేటాయించాలి. తటస్థ దృక్కోణం (neutral perspective)తో మూల్యాంకనం చేసుకోవాలి. చాలా మంది సమాధానాల్లో కేవలం స్టేట్మెంట్లను మాత్రమే రాస్తారు. అలా కాకుండా వాటికి బలం చేకూర్చే ఫ్యాక్ట్స్‌ను, సమకాలీన అంశాలను జోడించాలి. ఎకానమీ ప్రశ్నలకు రాసే సమాధానాల్లో కరెంట్ ఫ్యాక్ట్స్‌ను రాయటం మరచిపోకూడదు. సమాధానాల్లో ఒకట్రెండు స్టేట్మెంట్లు, ఒకట్రెండు ఫ్యాక్ట్స్, సరైన బాడీ స్ట్రక్చర్ ఉండేలా చూసుకోవాలి. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాసేందుకు ప్రయత్నించాలి. ఇంత వరకు కష్టపడి చదివారు. అదే ఆత్మవిశ్వాసంతో ఎలాంటి నెగిటివ్ ఆలోచనలు లేకుండా పరీక్షకు హాజరైతే విజయం మీ సొంతమవుతుంది. పేపర్ ఎంత క్లిష్టంగా వస్తే అంత మంచిది. దాన్ని సవాలుగా తీసుకొని, శక్తిమేరకు సమాధానాలు రాయాలి. ఆల్ ది par బెస్ట్ఙ- ఎస్.కృష్ణ ఆదిత్య, అసిస్టెంట్ కలెక్టర్, మెదక్. -
సైన్స్ సమాహారం.. మెరుగైన స్కోర్‌కు సోపానం!
సివిల్స్ మెయిన్స్‌లో విజయం సాధించేందుకు కీలమైనవి జనరల్ స్టడీస్ పేపర్లు. జీఎస్ మూడో పేపర్లో సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ నష్టం, జీవ వైవిధ్య సంరక్షణ, మేధో సంపత్తి హక్కులు, విపత్తు నిర్వహణ తదితర అంశాలున్నాయి. వీటి నుంచి2013 జీఎస్-3 ప్రశ్నపత్రంలో 25 ప్రశ్నలకు 9 ప్రశ్నలు వచ్చాయి. ఇంతటి ప్రాధాన్యమున్న ఈ అంశాలపై పట్టు సాధించేందుకు వ్యూహాలు.. మెయిన్స్‌కు అర్హత సాధించిన అభ్యర్థులు ఇప్పటికే వివిధ అంశాలకు సంబంధించిన ప్రిపరేషన్‌ను పూర్తిచేసి ఉంటారు. గత మెయిన్స్ జనరల్ స్టడీస్-3 పేపర్లో కొన్ని 200 పదాల సమాధాన ప్రశ్నలు, మరికొన్ని 100 పదాల సమాధాన ప్రశ్నలు వచ్చాయి. ఈసారి కూడా ఇదే విధానంలో ప్రశ్నలు ఉండొచ్చు లేదంటే స్వల్ప, దీర్ఘ సమాధాన ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. కాబట్టి ఈ కోణంలోనూ ప్రిపరేషన్ తప్పనిసరి. ఏ అంశానికి సంబంధించి అయినా 20, 50, 75, 150, 250 పదాల్లో సమాధానం రాసేలా సన్నద్ధం కావాలి. ఒకే ప్రశ్నలో వివిధ విభాగాలుంటే వాటి సరళిని బట్టి పద పరిమితిని నిర్దేశించుకోవాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్, టెక్నాలజీ విభాగంలో ముఖ్యంగా అంతరిక్ష పరిజ్ఞానం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్స్, నానో టెక్నాలజీ, రోబోటిక్స్, బయోటెక్నాలజీ తదితర అంశాలుంటాయి. ఇటీవల భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కీలక ప్రయోగాలు నిర్వహించింది. ఇండియన్ రీజనల్ నేవిగేషన్ శాటిలైట్ సిస్టమ్, మంగళ్యాన్ వంటి అద్భుత యాత్రలు చేపట్టింది. వీటిపై ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. వీటికి సంబంధించి నిగూఢంగా ఉన్న అంశాలపైనా ప్రశ్నలు రావొచ్చు. ముఖ్యంగా భారత అంతరిక్ష రంగానికి విశిష్ట సేవలు అందిస్తూ, ఎన్నో విదేశీ ఉపగ్రహాలు, వైవిధ్యభరిత ప్రయోగాలు నిర్వహించిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ)పై అభ్యర్థులు దృష్టిసారించాలి. భారత అంతరిక్ష కార్యక్రమంలో పీఎస్ఎల్వీ నిర్మాణం వెనుక ఉద్దేశం, అది చేపట్టిన వైవిధ్యభరిత ప్రయోగాలు, విదేశీ ఉపగ్రహాల ప్రయోగాలు ద్వారా భారత అంతరిక్ష సేవల విస్తరణ, వరుస విజయవంత ప్రయోగాల జైత్రయాత్ర, బలహీనతలు తదితర అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి. ముఖ్యాంశాలు మంగళ్యాన్ ప్రయోగంలో ప్రత్యేకతలు- భారత్ సాధించిన ప్రగతి. టెర్రా ఫార్మింగ్ అంటే ఏమిటి? అంగారక గ్రహ యాత్రలు భవిష్యత్తులో టెర్రా ఫార్మింగ్‌కు ఎలా ఉపయోగపడతాయి? వాయేజర్ ఇంటర్ స్టెల్లార్ మిషన్- సాధించిన ప్రగతి ఏమిటి? ఇండియన్ రీజనల్ నేవిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (ఐఆర్ఎన్ఎస్ఎస్), జీఎస్ఎల్వీ- మార్క్ 3, క్రయోజెనిక్ ఇంజిన్ ప్రాధాన్యత, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం, భారత్ డీప్ స్పేస్ నెట్వర్క్, క్యూరియాసిటీ రోవర్, జీఎస్ఎల్వీ బలహీనతలు. టెలీ మెడిసిన్, టెలీ ఎడ్యుకేషన్, అంతరిక్ష టెక్నాలజీ ద్వారా గ్రామీణాభివృద్ధి తదితర అంశాలు. ఐటీ, కంప్యూటర్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్స్ రంగంలో డిజిటల్ ఇండియా, నేషనల్ ఈ-గవర్నెన్స్ ప్రాజెక్టు, మెడికల్ ఇన్ఫర్మేటిక్స్, గ్రామీణాభివృద్ధిలో ఐటీ, క్లౌడ్ కంప్యూటింగ్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, నెట్ న్యూట్రాలటీ- ప్రయోజనాలు, బిగ్ డేటా, ఓపెన్ గవర్నమెంట్ డేటా తదితర అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి. నానో టెక్నాలజీ రంగంలో అనేక అనువర్తనాలున్నాయి. వీటిని తెలుసుకోవాలి. గతేడాది నిర్మాణరంగానికి సంబంధించి కాంపొజైట్స్పై ప్రశ్న అడిగారు. పర్యావరణ కాలుష్యం నిర్మూలనలో, వైద్య రంగంలో నానో టెక్నాలజీ ప్రయోజనాలపై దృష్టిసారించాలి. అదే విధంగా నానో టెక్నాలజీ ద్వారా ఎలక్ట్రానిక్స్ రంగంలో అనువర్తనాలపై ప్రశ్న వచ్చేందుకు అవకాశముంది. రోబోటిక్స్ రంగంలో కేవలం రోబోటిక్స్ సూత్రాలు, వాటి రకాలు, ఉపయోగాలు మాత్రమే కాకుండా రోబోటిక్ కాళ్లు, చేతులు తయారీ ప్రక్రియపై అవగాహన పెంపొందించుకోవాలి. రోబోటిక్స్‌ను బయోనిక్స్కు అనుసంధానిస్తూ అధ్యయనం చేయాలి. బయోనిక్స్ అంటే ఏమిటి? దాని అనువర్తనాలు ఎలా ఉంటాయి? వైద్య రంగంలో వాటి ప్రాధాన్యం ఏమిటి? తదితర అంశాలను చదవాలి. బయోటెక్నాలజీ బయోటెక్నాలజీ రంగం నుంచి ఈసారి ప్రశ్నలు వచ్చేందుకు చాలా అవకాశాలున్నాయి. ముఖ్యంగా జన్యుమార్పిడి పంటల సాగు, క్షేత్ర పరీక్షలపై దేశంలో గందరగోళ పరిస్థితులపై ప్రశ్నలు అడగొచ్చు. జన్యు మార్పిడి పంటల సాగుపై వ్యతిరేకత ఎందుకు? దాని వల్ల లాభాలు, నష్టాలు ఏమిటి? మరీ ముఖ్యంగా బీటీ ట్రాన్స్‌జెనిక్స్‌పై అభ్యంతరాలు ఏమిటి? జీఎం లేబ్లింగ్ అంటే ఏమిటి? అది భారత్‌లో ఎలా అమలవుతోంది? తదితర అంశాలపై అభ్యర్థులు పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించుకోవడం అవసరం. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, సుప్రీంకోర్టు టెక్నికల్ ఎక్స్పెర్ట్ కమిటీ బీటీ పంటల క్షేత్ర పరీక్షలను ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? ఇలాంటి అంశాలపై అభ్యర్థి అభిప్రాయాలను తెలుసుకునేలా ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. మూలకణాల చికిత్సను నియంత్రించే ఐసీఎంఆర్-డీబీటీ మార్గదర్శకాలు, రీప్రోగ్రామింగ్, కార్డ్ బ్యాంకింగ్, మూలకణాల అనువర్తనాలను అధ్యయనం చేయాలి. ఆర్ఎన్ఏ, ఇంటర్‌ఫెరాన్స్, జన్యు థెరఫీ, మానవ జీన్ పేటెంటింగ్, జీవ ఎరువులు, జీవ క్రిమిసంహారకాలు, ఆర్గానిక్ వ్యవసాయం, బయోరెమిడియేషన్, ఇతర ఇంధనాలు తదితర అంశాలపై అధ్యయనం చేయాలి. పర్యావరణం మెయిన్స్‌లో మరో ముఖ్యమైన అంశం పర్యావరణ నష్టం. తాజాగా దేశంలో స్వచ్ఛ భారత్‌పై బాగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణపై ప్రశ్న రావొచ్చు. ముఖ్యంగా ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణలో లోపాలు, మీ సూచనలు? అనే కోణంలో అధ్యయనం చేయాలి. ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్వహణలో సమస్యలు, లాభాలను తెలుసుకోవాలి. పట్టణీకరణలో ఘన వ్యర్థ నిర్వహణ పాత్రపై అవగాహన పెంపొందించుకోవాలి. బయో మెడికల్ వ్యర్థాలు, రీసైక్లింగ్ పద్ధతులు, భారత్‌లో ఘన వ్యర్థ నిర్వహణకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు వంటి వాటిని చదవాలి. వాతావరణ మార్పుల ప్రభావం ముఖ్యంగా సముద్ర ఆమ్లీకరణ వల్ల వ్యవసాయం, ఆర్థిక వ్యవస్థలకు వాటిల్లే నష్టాలను గురించి తెలుసుకోవాలి. శీతోష్ణస్థితి మార్పు ప్రభావాలను ఎదుర్కొనేందుకు భారత్ సన్నద్ధత, వాతావరణ మార్పుపై జాతీయ కార్యాచరణ ప్రణాళిక (ఎన్ఏపీసీసీ), అందులో భాగంగా అమలవుతున్న ఎనిమిది జాతీయ మిషన్లు, లక్ష్యాలు, ప్రగతి తదితరాల గురించి తెలుసుకోవాలి. కాంతి కాలుష్యం, భారలోహ కాలుష్యం, గంగానది ప్రక్షాళన, అటవీ నిర్మూలనను అరికట్టడం ద్వారా ఉద్గారాలను తగ్గించే కార్యక్రమం (ఆర్ఈడీడీ)పై అవగాహన పెంపొందించుకోవాలి. జీవ వైవిధ్య పరిరక్షణ అంశంలో జీవ వైవిధ్యానికి ఏర్పడుతున్న ముప్పు, సంరక్షణ చర్యలపై దృష్టిసారించాలి. పులి, ఖడ్గమృగం, ఏనుగు, గంగానది డాల్ఫిన్ వంటి వాటి పరిరక్షణ సమస్యల్ని తెలుసుకోవాలి. పశ్చిమ కనుమల పరిరక్షణకు గాడ్గిల్, కస్తూరిరంగన్ కమిటీల సిఫార్సులు, వాటి మధ్య భేదాలను తెలుసుకోవడం మంచిది. భారత్‌లో అభివృద్ధి చర్యల ద్వారా జీవ వైవిధ్యం ఎలా దెబ్బతింటోంది? సుస్థిరాభివృద్ధి విధానాలను ఎలా అమలు చేయాలి? అటవీ హక్కుల అమల్లో సమస్యలపై దృష్టి సారించాలి. అదనంగా నగొయ ప్రొటోకాల్ సమాచారాన్ని తెలుసుకోవాలి. మేధో సంపత్తి మేధో సంపత్తి హక్కుల అంశంలో భారత్, అమెరికాల మధ్య నెలకొన్న వివాదం, యూఎస్ ట్రేడ్ రిప్రెజెంటేటివ్ (యూఎస్టీఆర్) స్పెషల్ 301 కేటగిరీ, భారత్‌లో ఐపీఆర్ విధానం ఎలా ఉండాలి? అమెరికా వంటి దేశాలు భారత మేధోసంపత్తి రంగాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి? తదితర అంశాలపై దృష్టిసారించాలి. అమెరికా ఇటీవల భారత్ విషయంలో అమలు చేయాలని నిర్ణయించిన cycle review విధానం గురించి తెలుసుకోవాలి. దీంతోపాటు మేధోసంపత్తి రకాలు, సంబంధిత చట్టాలు, జియోగ్రఫికల్ ఇండికేషన్ (జీఐ) ద్వారా ఏ విధంగా సంప్రదాయ ఉత్పత్తులకు సంరక్షణ కల్పించవచ్చు అనే అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి. -
విశ్లేషణతో విజయం ముంగిటకు...
గతంలో మాదిరిగా వ్యవస్థల నిర్మాణంపై కాకుండా వాటి పనితీరుపై ప్రశ్నలు వస్తున్నాయి. ఆయా వ్యవస్థలు- సమకాలీన ప్రాధాన్యమున్న అంశాలపై దృష్టికేంద్రీకరించాలి. ప్రస్తుతం వివరణాత్మక సమాధానాలకు కాలం చెల్లింది. విశ్లేషణాత్మక సమాధానాలే మార్కులకు కీలకమయ్యాయి. సమకాలీన రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాల ప్రాతిపదికగా ప్రశ్నలు వస్తున్నాయి. సన్నద్ధత ఇదే కోణంలో ఉండాలి. సివిల్స్ మెయిన్స్ జీఎస్-2 సివిల్స్-2014 ప్రిలిమ్స్‌లో విజయం సాధించిన అభ్యర్థులు ఇప్పుడు మెయిన్స్‌కు సిద్ధమవుతున్నారు. ఇందులోనూ గెలుపు గమ్యాన్ని చేరుకోవాలంటే కీలకమైన జనరల్ స్టడీస్ పేపర్లలో మెరుగైన మార్కులు సాధించాలి. మెయిన్స్‌లో మెరిట్‌కు పరిగణనలోని తీసుకునే ఏడు పేపర్లలో నాలుగు జీఎస్ పేపర్లే! వీటికి వెయ్యి మార్కులు కేటాయించారు. ఈ తరుణంలో పొలిటికల్ సైన్స్ ప్రధానంగా ఉన్న జీఎస్ పేపర్-2 సిలబస్‌లోని అంశాలు, వాటిపై పట్టు సాధించేందుకు వ్యూహాలపై విశ్లేషణ.. పేపర్ 2- పాఠ్యాంశాలు పరిపాలన, రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ, సామాజిక న్యాయం, అంతర్జాతీయ సంబంధాలు. భారత రాజ్యాంగం, చారిత్రక నేపథ్యం, పరిణామ క్రమం, లక్షణాలు, సవరణలు, మూల నిర్మాణం. కేంద్రం, రాష్ట్రాల కార్యకలాపాలు, బాధ్యతలు, సమాఖ్య వ్యవస్థ తీరుతెన్నులు. {పభుత్వంలోని వివిధ అంగాల మధ్య అధికారాల విభజన. వివిధ దేశాల రాజ్యాంగాలు-భారత్ రాజ్యాంగంతో పోలిక. పార్లమెంటు, రాష్ట్రాల శాసన వ్యవస్థలు- నిర్మాణం, కార్యకలాపాలు. కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల నిర్మాణం, పనిచేసే విధానం. {పజా ప్రాతినిధ్య చట్టంలోని ముఖ్యాంశాలు. వివిధ రాజ్యాంగ పదవుల నియామకాలు, రాజ్యాంగ పదవులు, అధికారాలు, విధులు. చట్టబద్ధ, నియంత్రిత, వివిధ పాక్షిక న్యాయ సంస్థలు. {పభుత్వ విధానాలు,ప్రగతికి ప్రభుత్వం చూపే చొరవ. అభివృద్ధి ప్రవృత్తి, ప్రగతికి దోహదం చేసే పరిశ్రమలు.. బలహీన వర్గాలు-సంక్షేమ పథకాలు. సామాజిక రంగ సేవల అభివృద్ధి, నిర్వహణకు సంబంధించిన అంశాలు. పేదరికం, ఆకలి సంబంధిత అంశాలు. పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం. {పజాస్వామ్యంలో సివిల్ సర్వీస్ పాత్ర.. భారత్, పొరుగు దేశాలతో సంబంధాలు., గ్లోబల్ గ్రూపులు. భారత్‌పై అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల విధానాలు, రాజకీయాల ప్రభావం. ముఖ్యమైన అంతర్జాతీయ సంస్థలు. 2012 - 2013: సివిల్స్ మెయిన్స్-2012 జనరల్ స్టడీస్ పేపర్లలో 20 పదాలు, 50 పదాలు, 150 పదాలు ఇలా వివిధ పరిమాణాల సమాధానాలు రాయాల్సిన ప్రశ్నలు వచ్చాయి. దీనికి భిన్నంగా 2013 మెయిన్స్‌లో అన్నీ 200 పదాల ప్రశ్నలే ఎదురయ్యాయి. దీంతో అభ్యర్థులు ఒత్తిడికి గురయ్యారు.గతంలో చాయిస్ ఉండేది. కానీ, 2013లో 25 ప్రశ్నలు ఇవ్వగా, అన్నింటికీ సమాధానాలు రాయమన్నారు.మూడు గంటల సమయంలో 25 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉండటంతో అభ్యర్థులు ఆందోళన చెందారు. ఈ తరుణంలో విజయానికి సమయ పాలన కీలకంగా మారింది. చట్టాలు- అమలు తీరుతెన్నులు: చట్టాలను అమలు చేసే క్రమంలో రాజ్యాంగంలో నిర్దేశించిన అంశాల ఉల్లంఘనకు అవి ఎలా కారణమవుతున్నాయనే దానిపై విశ్లేషణాత్మక అధ్యయనం అవసరం. వీటికి సంబంధించి ప్రశ్నలు వచ్చే అవకాశముంది. ఉదాహరణకు గత పరీక్షలో ‘‘ఐటీ చట్టంలోని సెక్షన్ 66ఏ (ఎలక్ట్రానిక్ మెసేజ్ పంపడం) లోని అంశాల అమలు.. రాజ్యాంగంలోని అధికరణ 19 (భావ ప్రకటన స్వేచ్ఛ) ద్వారా ప్రజలకు సంక్రమించిన హక్కుల ఉల్లంఘనకు కారణమవుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. దీన్ని చర్చించండి..’’ అనే ప్రశ్న వచ్చింది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఇటీవల కాలంలో అమల్లోకి వచ్చిన వివిధ చట్టాలు, వాటి అమలు తీరును రాజ్యాంగ ప్రకరణలకు అన్వయిస్తూ అధ్యయనం చేయాలి. న్యాయ వ్యవస్థదే పైచేయా? నేడు చాలా సందర్భాల్లో ప్రభుత్వాల నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి. ఇవి రాజ్యాంగ అమలుకు అడ్డంకు లు సృష్టిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాల నిర్ణయాలు.. రాజ్యాంగ బద్ధమా.. కాదా? అనే దానిపై కోర్టుల్లో విచారణలు జరిగి, తీర్పులు వెలువడుతున్నాయి. ఈ సందర్భంలో ప్రభుత్వంలోని శాసన నిర్మాణ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, కార్యనిర్వహణ వ్యవస్థల్లో న్యాయ వ్యవస్థదే పైచేయిగా బయటకు కనిపిస్తోంది. అభ్యర్థులు ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం, ఆర్థికాభివృద్ధి తదితరాలకు సంబంధించి తీసుకునే కొన్ని నిర్ణయాలు రాజ్యాంగం కోణంలో ఎలా వివాదాస్పదమవుతున్నాయో తెలుసుకోవాలి. నియంత్రణ వ్యవస్థలకు ప్రాధాన్యం! సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణల నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వాల ప్రాధాన్యం తగ్గి, నియంత్రణ వ్యవస్థల కార్యకలాపాలు కీలకమయ్యాయి. టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ), ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్.. ఇలా వేర్వేరు రంగాలకు చెందిన నియంత్రణ సంస్థలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ క్రమంలో అభ్యర్థులు బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, క్యాపిటల్ మార్కెట్ తదితర రంగాల్లో సమకాలీన పరిణామాలు, నియంత్రణ వ్యవస్థల పాత్రపై అవగాహన పెంపొందించుకోవాలి. సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాలు: పేదరిక నిర్మూలన, అందరికీ విద్య, ఆర్యోగం, మహిళాభివృద్ధి, శిశు మరణాల తగ్గింపు, నిరుద్యోగం తగ్గించడం తదితరాలకు సంబంధించిన సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాలు, వీటిని నెరవేర్చడంలో భారత్ పురోగతిపై అభ్యర్థులు అవగాహన పెంపొందించుకోవాలి. లక్ష్యాల సాధనకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటి? అవి ఎంత వరకు సఫలీకృతమవుతున్నాయి? వంటి వాటిని తెలుసుకోవాలి. ప్రైవేటు రంగ సహకారం పొందడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజలకు చేరువచేయడంలో (ముఖ్యంగా ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్) భారత్ చెప్పుకోదగ్గ పురోగతి సాధించింది. ఇదే సమయంలో ఆకలితో బాధపడే వారి సంఖ్యను తగ్గించే విషయంలో పురోగతి చాలా తక్కువగా ఉంది. గత మెయిన్స్‌లో ఆరోగ్యానికి సంబంధించిన సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాలను గుర్తించి, వాటి సాధనకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఎంతమేర సఫలమయ్యాయో చర్చించండి? అనే ప్రశ్న ఇచ్చారు. పొరుగు దేశాలు-సంబంధాలు: దక్షిణాసియా ప్రాంతంలో భారతదేశం కీలకంగా వ్యవహరిస్తోంది. ఈ ప్రాంతంలోని మిగిలిన దేశాలన్నీ భారత్ వైపే చూస్తున్నాయి. ఇదే సమయంలో ఆయా దేశాల్లోని ప్రభుత్వాలు తమ సమస్యల్ని పరిష్కరించుకోలేక, వాటికి కార ణం భారత్ అంటూ ఆరోపణలు చేస్తున్నాయి. చైనా, జపాన్, వియత్నాం తదితర దేశాలతో భారత్ సం బంధాలను అధ్యయనం చేయాలి. ఇటీవల చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ భారత్‌లో పర్యటించారు. ఈ పర్యటన ఇరు దేశాల సంబంధాల మెరుగుకు ఎంత వరకు దోహదపడగలదో విశ్లేషించండి? అనే కోణంలో ఈసారి ప్రశ్న రావొచ్చు. భారత ప్రధాని నరేంద్ర మోదీ అయిదు రోజుల పాటు జపాన్‌లో పర్యటించడం.. రక్షణ రంగంలో పరస్పర సహకారానికి స్నేహ హస్తం చాచడం.. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ కంపెనీలను ఆహ్వానించడం తదితర పరిణామాలు చోటుచేసుకున్నాయి. మరోవైపు వియత్నాం రక్షణ, భద్రతా దళాల ఆధునికీకరణకు సాయం చేస్తామని భారత్ ప్రకటించింది. భారత్ నుంచి నాలుగు గస్తీ నౌకల కొనుగోలుకు వియత్నాం అంగీకరించడం వంటివి ఈ రెండు దేశాల సంబంధాల బలోపేతానికి జరుగుతున్న కసరత్తులో భాగమే. ఈ నేపథ్యంలో భారత్.. జపాన్, వియత్నాంలతో సంబంధాలు మెరుగుపరుచుకోవాలనుకోవడం చైనాను ఇరుకున పెట్టేందుకేనా? చర్చించండి అనే కోణంలో ప్రశ్న రావొచ్చు. ఇదే విధంగా భారత్ పొరుగుదేశాలతో చైనా సంబంధాలు, వాటి ప్రభావంపైనా ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. కూటములకు ప్రాధాన్యం: గతంతో పోల్చితే ప్రపంచ బ్యాంకు, డబ్ల్యూటీవో, ఐఎంఎఫ్.. తదితర అంతర్జాతీయ సంస్థల కంటే ప్రస్తుతం ప్రాంతీయ కూటములకు ప్రాధాన్యం పెరిగింది. జీ-8, జీ-20, బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా) తదితర కూటములు సమకాలీన ప్రపంచంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. దేశాలు ప్రపంచ ప్రయోజనాలు కాకుండా స్వీయ ప్రయోజనాల కోణంలో ఆలోచిస్తున్నాయి. సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక ప్రయోజనాలు పొందేందుకు అవసరమైన దేశాలతో మాత్రమే జట్టుకడుతున్నాయి. ఈ క్రమంలోనే కూటములకు ప్రాధాన్యం ఏర్పడింది. ఉదాహరణకు బ్రిక్స్‌ను చెప్పుకోవచ్చు. ఈ కూటమి ఆరో సదస్సు 2014, జూలైలో బ్రెజిల్లో జరిగింది. ఇందులో 10,000 కోట్ల డాలర్ల ప్రారంభ అధీకృత మూలధనంతో బ్రిక్స్ బ్యాంక్ నెలకొల్పేందుకు నేతలు ఆమోదం తెలిపారు. అభ్యర్థులు ఈ బ్యాంకు ఏర్పాటుకు కారణాలు; ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకులకు ఇది ఎంత మేరకు పోటీగా నిలుస్తుంది? పర్యవసనాలు? భారత్‌కు ప్రయోజనాలు? తదితర అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి. భారత ప్రయోజనాలే కేంద్రంగా: దేశం, కూటమి, అంతర్జాతీయ సంస్థ.. దేని గురించి చదువుతున్నా భారత్‌ను దృష్టిలో ఉంచుకొని అధ్యయనం చేయాలి. చైనా ఒకవైపు భారత్‌తో సత్సంబంధాలు కొనసాగిస్తున్నానంటూనే మరోవైపు అంతర్జాతీయ వేదికలపై భారత్ వ్యతిరేక చర్యలకు పాల్పడుతోంది. ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో మన దేశానికి శాశ్వత సభ్యత్వం రాకుండా అడ్డుపుల్ల వేస్తోంది. ఆహార భద్రతకు సంబంధించి డబ్ల్యూటీవోలో భారత్ వినిపించిన వాణి వంటి అంశాలను అధ్యయనం చేయాలి. సిద్ధమవ్వండిలా.. మ్యాథ్యమెటిక్స్ పదో తరగతి స్థాయిలో ఉంటుంది. సీబీఎస్ఈ, లేదా స్టేట్ సిలబస్‌లో 9, 10 తరగతుల మ్యాథ్స్ పుస్తకాలు చదివితే సరిపోతుంది. అదనపు సమయం కేటాయిస్తే ఆర్ట్స్ విద్యార్థులు కూడా మ్యాథ్స్ ప్రశ్నలకు సులువుగా సమాధానాలు గుర్తించొచ్చు. ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగ్నామెట్రీ, మెన్సురేషన్ చాప్టర్లకు ఎక్కువ సమయం వెచ్చించాలి. ఈ మూడు చాప్టర్ల నుంచే 40 శాతానికి తక్కువ కాకుండా ప్రశ్నలడుగుతారు. మిగతా చాప్టర్లకు సమానమైన వెయిటేజ్ ఉంటుంది. అర్థమెటిక్‌లో భాగంగా నంబర్ సిస్టమ్, సహజ సంఖ్యలు, వాస్తవ సంఖ్యలు, కూడికలు, తీసివేతలు, గుణకారం, భాగహారం, స్క్వేర్‌రూట్స్, కాలం-దూరం, కాలం-పని, శాతాలు, వడ్డీ-చక్రవడ్డీ, బారువడ్డీ, లాభనష్టాలు మొదలైనవాటిపై ప్రశ్నలడుగుతారు. ఇవన్నీ కూడా హైస్కూల్ స్థాయిలో 6 నుంచి పదో తరగతి మ్యాథ్స్‌లో ఉండేవే. అందువల్ల సంబంధిత తరగతుల పాఠ్యపుస్తకాల్లో ప్రశ్నలను సాధన చేయాలి. వీటితోపాటు ఆర్ఎస్ అగర్వాల్ ఆబ్జెక్టివ్ అర్థమెటిక్ పుస్తకంలోని సమస్యలను ప్రాక్టీస్ చేయాలి. ఇంగ్లిష్ బేసిక్ ఇంగ్లిష్ గ్రామర్‌పై ప్రశ్నలుంటాయి. అభ్యర్థి ఇంగ్లిష్‌ని ఎలా అర్థం చేసుకుంటున్నాడో పరిశీలించే విధంగా ప్రశ్నలడుగుతారు. మార్కెట్లో దొరికే ప్రామాణిక ఆంగ్ల వ్యాకరణ పుస్తకంలో సిలబస్‌లోని అంశాల వరకు చదివితే చాలు. ఈ విభాగంలో 70 శాతం ప్రశ్నలు ప్రాథమిక వ్యాకరణం నుంచి, 30 శాతం ప్రశ్నలు కాంప్రహెన్సన్, యాంటోనిమ్స్, సినోనిమ్స్, అనాలజీ అంశాలపై అడుగుతారు. ఇంగ్లిష్ విభాగంలో ఎక్కువ మార్కులు పొందడానికి రెన్ అండ్ మార్టిన్ హైస్కూల్ ఇంగ్లిష్ గ్రామర్ పుస్తకం, నార్మన్ లూయీస్ రాసిన వర్డ్ పవర్ మేడ్ ఈజీ బాగా ఉపయోగపడతాయి. జనరల్ నాలెడ్జ్ వర్తమాన వ్యవహారాల కోసం రోజూ ప్రామాణిక దినపత్రికలు చదవాలి. స్టాక్ జీకే కోసం ఏదైనా జనరల్ నాలెడ్జ్ పుస్తకం చదివితే సరిపోతుంది. పరిసరాలపై కాస్త అవగాహన ఉంటే జీకే ప్రశ్నలకు సమాధానాలు గుర్తించడం తేలికే. భారతదేశ చరిత్ర, భూగోళశాస్త్రం, పాలిటీ, ఎకానమీ ప్రశ్నల కోసం 8, 9, 10 తరగతుల సోషల్ పుస్తకాలు చదవాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ, అవార్డులు, ఆవిష్కరణల కోసం ఏదైనా ఇయర్ బుక్‌లోని కరెంట్ అఫైర్స్ సెక్షన్‌ను ఔపోసన పట్టాలి. శాస్త్ర, సాంకేతిక అంశాలు ముఖ్యమైనవే. ఇటీవల కాలంలో మన దేశం ప్రయోగించిన వివిధ క్షిపణులు, వాటి పరిధి, అంతరిక్ష ఉపగ్రహాలు, వాటిని వేటి కోసం ఉద్దేశించారు? ఎక్కడి నుంచి ప్రయోగించారు? ఇలా అన్ని కోణాల్లో సిద్ధమవ్వాలి. ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ రాత పరీక్ష, వైద్య, శారీరక పరీక్షల్లో విజయం సాధించిన వారిని ఖాళీలకనుగుణంగా పర్సనాలిటీ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు. దీన్ని వ్యక్తిత్వ పరీక్షగా చెప్పుకోవచ్చు. ఇందులో విజయం సాధించడానికి ప్రతిరోజూ ఏదైనా పేపర్ చదవాలి. జాతీయ ఇంగ్లిష్ చానళ్లలో వచ్చే చర్చా కార్యక్రమాలు వినాలి. ఏదైనా టాపిక్ ఎంచుకొని అద్దం ముందు నిల్చొని కనీసం ఐదు నిమిషాలు మాట్లాడాలి. అలా కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపర్చుకోవాలి. ఇంటర్వ్యూలో భాగంగా ఇంకా వివిధ పరీక్షలు నిర్వహిస్తారు. గ్రూప్ డిస్కషన్‌తోపాటు ఏదైనా సందర్భం చెప్పి దానికి అభ్యర్థి ఎలా స్పందిస్తారో తెలుసుకుంటారు. ఔట్‌డోర్ గ్రూప్ టాస్క్ కూడా ఉంటుంది. ఏదైనా అంశంలో ఉపన్యసించమని కూడా అడుగుతారు. ఎయిర్‌ఫోర్స్ అకాడెమీ అభ్యర్థులకు పైలట్ బ్యాటరీ ఆప్టిట్యూడ్ టెస్ట్ (పీబీఏటీ)ను కూడా నిర్వహిస్తారు. వర్తమాన వ్యవహారాలతోపాటు వివిధ అంశాలపై ప్రశ్నిస్తారు. ఇంటర్వ్యూలో ఎక్కువ మార్కుల కోసం అన్ని విషయాల్లోనూ ప్రాథమిక పరిజ్ఞానంతో పాటు లాజికల్ థింకింగ్‌ను అలవర్చుకోవాలి. రిఫరెన్స్ బుక్స్: పాత్‌ఫైండర్ సీడీఎస్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ చాప్టర్వైజ్-సెక్షన్ వైజ్ సీడీఎస్ సాల్వ్డ్ పేపర్స్ -అర్హింత్ పబ్లికేషన్స్ ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ -ఉప్కార్ పబ్లికేషన్స్ గుర్తుంచుకోండి.. గత మెయిన్స్ విధానాన్నే ఈసారి కూడా కొనసాగించవచ్చని ఆశించవచ్చు. అదే జరిగితే సమయానికి ప్రాధాన్యమివ్వాలి. ఒక్కో ప్రశ్నకు దాదాపు ఏడు నిమిషాలు అందుబాటులో ఉంటుంది.200 పదాలకు మించకుండా సమాధానం రాయమన్నారేగానీ కచ్చితంగా అన్ని పదాల్లో సమాధానం ఉండాలని లేదన్నది గుర్తించాలి.సూచనల్లో ‘సమాధానం పరిమాణం కంటే దాని నాణ్యత ప్రధానమని’ ఇచ్చారు. అందువల్ల ఎంత రాశామనేదాని కంటే ఎంత కచ్చితమైన విశ్లేషణను అందించామన్నదే ముఖ్యమని గుర్తించాలి. ఒకట్రెండు తప్ప అన్ని ప్రశ్నలకూ సమాధానం రాసేందుకు ప్రయత్నించాలి. మెయిన్స్ ప్రిపరేషన్ లో భాగంగా రైటింగ్ ప్రాక్టీస్‌కూ ప్రాధాన్యమివ్వాలి. డా॥బి.జె.బి. కృపాదానం సీనియర్ సివిల్స్ ఫ్యాకల్టీ ఆర్.సి. రెడ్డి స్టడీ సర్కిల్ -
జాగ్రఫీ ఆప్షనల్ పేపర్-1కు ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలపండి?
కాంపిటీటివ్ కౌన్సెలింగ్: సివిల్స్ మెయిన్స్ లో జాగ్రఫీ పేపర్-1లో భౌతిక, మానవ భూగోళ శాస్త్రాలకు సంబంధించిన భావనలు, సిద్ధాంతాలను పొందుపరిచారు. -భూస్వరూప శాస్త్రానికి సంబంధించి భూ అయస్కాంతత్వం (జియోమాగ్నటిజం) ప్రాథమిక భావనలు, భూ అభినితి (జియోసింక్లైన్), భూ సమస్థితి, డబ్ల్యు.జె. మోర్గాన్ ప్రతిపాదించిన ఫలకవిరూపక సిద్ధాంతం ఆధారంగా భూకంపాలు, సునామీలు ఏర్పడే విధానం- విశ్లేషణ, జియోహైడ్రాలజీ మొదలైన అంశాలు కీలకమైనవి. వీటిపై పరిపూర్ణ పట్టు సాధించే విధంగా ప్రిపరేషన్ సాగించాలి. - ఎం.సింధు, సైనిక్‌పురి శీతోష్ణస్థితి శాస్త్రానికి సంబంధించి క్షితిజ సమాంతర ఉష్ణోగ్రతా విస్తరణ దాన్ని ప్రభావితం చేసే అంశాలు, ఊర్ధ్వ ఉష్ణోగ్రతా విస్తరణ, ఉష్ణ సమతుల్యం, రుతుపవనాలు, జెట్‌స్ట్రీమ్, వాయురాశులు, వాతాగ్రాలు, సమ శీతోష్ణ మండల, ఉష్ణమండల చక్రవాతాలు, వాటి మధ్య తేడాలు, వర్షపాత రకాలు, జల సంబంధిత చక్రం, అనువర్తిత శీతోష్ణస్థితి శాస్త్రం మొదలైన అంశాలను విశ్లేషణాత్మక దృష్టితో ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. జైవిక భూగోళ శాస్త్రానికి సంబంధించి మృత్తిక వర్గీకరణ, విస్తృతి, మృత్తిక క్రమక్షయం, నిమ్నీకరణకు కారణాలు, వాటి సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, అటవీ నిర్మూలన వల్ల ఎదురయ్యే సమస్యలు, వాటి సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు మొదలైన అంశాలను విస్తృత స్థాయిలో అధ్యయనం చేయాలి. ఎన్విరాన్మెంటల్ జాగ్రఫీకి సంబంధించి ఆవరణశాస్త్ర ప్రాథమిక భావనలు, పర్యావరణంపై మానవ ప్రభావం, ఆవరణ వ్యవస్థల నిర్వహణకు చేపట్టాల్సిన చర్యలు, వాటి సంరక్షణ, జీవ వైవిధ్యత సంరక్షణలో సుస్థిరాభివృద్ధి పాత్ర మొదలైన అంశాలను విశ్లేషణాత్మకంగా ప్రిపేర్ కావాలి. మానవీయ భూగోళ శాస్త్త్రంలోని దృక్పథాలకు సంబంధించి పర్యావరణ వాదం, పరిణామాత్మక విప్లవం, ద్వంద్వ భావన, రాడికల్, ప్రవర్తనా వాద దృక్పథాలు, ప్రపంచ సాంస్కృతిక మండలాలు మొదలైన అంశాలను అధ్యయనం చేయాలి. ఆర్థిక భూగోళ శాస్త్రానికి సంబంధించి, వనరులు వాటి విస్తరణ, ఇంధన సమస్య, ప్రపంచ వ్యవసాయ మండలాలు - రకాలు, ఆహార భద్రత, దుర్భిక్షం -కారణాలు - ప్రభావాలు - నివారణ చర్యలు మొదలైన అంశాలను విశ్లేషణాత్మకంగా ప్రిపేర్ కావాలి. ప్రాంతీయ భూగోళ శాస్త్త్రంలో ప్రాంతీయ భావన, రకాలు, ప్రాంతీయ అసమానతలకు కారణాలు, వాటి అభివృద్ధి వ్యూహాలు, ప్రాంతీయ ప్రణాళికలను రూపొందించడంలో పర్యావరణ సంబంధిత అంశాల పాత్ర మొదలైన అంశాలను చదవాలి. మానవ భూగోళ శాస్త్త్రంలోని నమూనాలు, సిద్ధాంతాలు, జనాభా పరివర్తన నమూనాలు, ఓస్టోవ్‌స నమూనాలోని వృద్ధి దశలు, హృదయభూమి, అంచుల భూమి సిద్ధాంతాలు మొదలైన అంశాలను చదవాల్సి ఉంటుంది. జాబ్స్ అలర్ట్స: ట్రైనీ కంటెంట్ డెవలపర్ ట్రైనీ కంటెంట్ డెవలపర్ల నియామకానికి సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం దరఖాస్తులు కోరుతోంది. ట్రైనీ కంటెంట్ డెవలపర్ అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులు. ఇంగ్లిష్ లాంగ్వేజ్ స్కిల్స్ ఉండాలి. వయసు: ఆగస్టు 1, 2014నాటికి 30 ఏళ్లకు మించకూడదు. ఎంపిక: ’What are the problems faced by Telangana and Andhra Pradesh after State bifurcation? Suggest your solutions to the problems' అంశంపై 750 పదాలకు తక్కువ కాకుండా వ్యాసాన్ని స్వయంగా ఆంగ్లంలో రాసి పంపాలి(టైప్ చేసి పంపకూడదు). వ్యాసం ఆధారంగా అభ్యర్థులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ఆరు నెలల శిక్షణ కాలంలో నెలకు రూ.10 వేల చొప్పున స్టైఫెండ్ అందజేస్తారు. దరఖాస్తు విధానం: ‘జగతి పబ్లికేషన్స్ లిమిటెడ్’ పేరుతో హైదరాబాద్‌లో చెల్లేలా తీసిన రూ.200 డిమాండ్ డ్రాఫ్ట్‌ను వ్యాసం, రెజ్యుమెతో జతచేసి కింది చిరునామాకు పంపాలి. చిరునామా: సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం, 8-2-696,697/75/1, సితార గ్రాండ్ హోటల్ పక్కన, రోడ్ నెం 12, బంజారాహిల్స్, హైదరాబాద్ - 500008 చివరి తేది: ఆగస్టు 17, రాత పరీక్ష తేది: ఆగస్టు 31 ఇంటర్వ్యూ: సెప్టెంబరు 15 క్లాసులు ప్రారంభం: అక్టోబరు 1 నుంచి మనదేశంలో పరిశోధనా సంస్థలు మీకు తెలుసా? - భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) - బెంగళూరు - ఫిజికల్ రీసెర్చ లేబొరేటరీ(అహ్మదాబాద్): ఖగోళ భౌతిక శాస్త్రం, సౌరకుటుంబ భౌతిక శాస్త్రం, ప్లాస్మా భౌతిక శాస్త్రం, పురావస్తు శాస్త్రాల అధ్యయనం. - సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం - శ్రీహరికోట, నెల్లూరు జిల్లా: రాకెట్లు, ఉపగ్రహాలను ప్రయోగించే కేంద్రం. - విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ - తిరువనంతపురం: ఉపగ్రహ వాహక నౌకల తయారీ కేంద్రం. - తుంబా ఈక్వెటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ - తిరువనంతపురం: రాకెట్లను ప్రయోగించే ప్రదేశం. - నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ - హైదరాబాద్: దీనిని గతంలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ అని పిలిచేవారు. ముఖ్య గ్రంథాలు, రచయితల పేర్లు ఇవే.. రచయిత గ్రంథం.. జాయపసేనాని నృత్య రత్నావళి, గీత రత్నావళి, వాద్య రత్నావళి క మూలఘటిక కేతన ఆంధ్రభాషా భూషణం, విజ్ఞానేశ్వరీయం క నాగార్జున సిద్ధుడు రసరత్నాకరం క రషీద్ ఎద్దిన్ మొట్టమొదటి చరిత్ర పుస్తకాన్ని ప్రచురించాడు క విష్ణుశర్మ పంచతంత్రాన్ని సంస్కృతంలో రచించాడు క విశాఖదత్తుడు ముద్రా రాక్షసం క గడియారం వెంకటశేషశాస్త్రి శివభారతం నాలుగో పంచవర్ష ప్రణాళిక కాలం? ఆర్థిక ప్రణాళిక: ూ 1966-69 మధ్య కాలాన్ని భారత ప్రణాళికా వ్యవస్థలో ప్రణాళికా విరామంగా వ్యవహరిస్తారు. ఈ కాలంలో కేవలం వార్షిక ప్రణాళికలు మాత్రమే అమలయ్యేవి. - నాలుగో పంచవర్ష ప్రణాళిక ఏప్రిల్ 1, 1969 నుంచి మార్చి 31, 1974 వరకు అమల్లో ఉంది. - సుస్థిరతతో కూడిన వృద్ధిని నాలుగో పంచవర్ష ప్రణాళిక లక్ష్యంగా పెట్టుకుంది. - ఐదో పంచవర్ష ప్రణాళిక కాలం ఏప్రిల్ 1, 1974 నుంచి మార్చి 31, 1979 వరకు అని నిర్ణయించారు. - జనతా ప్రభుత్వం అధికారంలోకి రావడం వల్ల ఐదో పంచవర్ష ప్రణాళిక ఒక సంవత్సరం ముందే అంటే మార్చి 31, 1978న ముగిసింది. -
జనరల్ స్టడీస్ పేపర్-3లో ఎకానమీ ప్రిపరేషన్ ఎలా ?
కాంపిటీటివ్ కౌన్సెలింగ్: నేను సివిల్స్ మెయిన్స్‌కు సన్నద్ధమవుతున్నాను. జనరల్ స్టడీస్ పేపర్-3లో ఎకానమీ ప్రిపరేషన్‌కు సంబంధించి తగిన సూచనలివ్వండి. - బి. సుస్మిత, బషీర్‌బాగ్. ఎకానమీకి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు రాయడం కోసం అభ్యర్థులు ముందుగా కాన్సెప్ట్‌పై పూర్తి పట్టు సాధించాలి. గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే జనరల్ స్టడీస్ పేపర్-3లో ఎకానమీకి సంబంధించిన ప్రశ్నలు వర్తమాన అంశాలకు అనుగుణంగా ఇచ్చారు. ఒక టాపిక్‌పై ఇచ్చిన ప్రశ్నకు వర్తమాన అంశాలతో అనుసంధానిస్తూ జవాబు రాసినప్పుడే అధిక మార్కులు సాధించవచ్చు. ిఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ (ఎఫ్ఆర్బీఎం), సమ్మిళిత వృద్ధి, నూతన కంపెనీల బిల్లు 2013, పన్ను వ్యయం, ఆహార భద్రతా బిల్లు, వ్యవసాయ సబ్సిడీలు, పింక్ రివల్యూషన్, ప్రపంచీకరణ, భూ సంస్కరణలు, వ్యవసాయ ఉత్పాదకత, పేదరికం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, మల్టీ బ్రాండ్ రిటైల్ రంగం, వస్తు, సేవలు లాంటి అంశాలపై కాన్సెప్ట్‌ల ఆధారంగానే ప్రశ్నలను అడుగుతున్నారు. ప్రతి కాన్సెప్ట్‌ను వర్తమాన అంశాలకు అన్వయించి ప్రశ్నలు రూపొందిస్తున్నారు. సిలబస్‌లో భాగంగా కాన్సెప్ట్‌లను చదివే క్రమంలో వివిధ అంశాలకు సంబంధించి లోతైన అధ్యయనం చేసినవారికి ఎకానమీ ప్రశ్నలకు సమాధానం రాయడం కష్టమేమీ కాదు. అందువల్ల సివిల్స్ మెయిన్స కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులు ఎకానమీని అధ్యయనం చేసేటప్పుడు కాన్సెప్ట్లపై అవగాహనతో పాటు వాటిని వివిధ అంశాలకు అన్వయించుకుంటూ చదవాలి. ఎకానమీలో ప్రతి ప్రశ్నకు వాస్తవికతకు దగ్గరగా ఉండేలా సమాధానం రాయాల్సి ఉంటుంది. అందువల్ల వివిధ గణాంకాలు, డేటాపై తప్పనిసరిగా అవగాహన పెంచుకోవాలి. గతంలో పరీక్ష రాసిన చాలామంది అభ్యర్థులు ఎకానమీ విభాగానికి సమయం సరిపోలేదని తెలిపారు. అందువల్ల ఇప్పటి నుంచే ప్రతి ప్రశ్నకు సూటిగా, నిర్దిష్టంగా 200 పదాల పరిమితిలో జవాబులు రాయడం ప్రాక్టీస్ చేయాలి. సమయ పరిమితిలోగా అన్ని ప్రశ్నలకు జవాబు రాసే విధంగా సంసిద్ధమవ్వాలి. ఇన్పుట్స్: తమ్మా కోటిరెడ్డి, సివిల్స్ సీనియర్ ఫ్యాకల్టీ జనరల్ నాలెడ్‌జ పాలిటీ: భారత రాజ్యాంగం భారత రాజ్యాంగ నిర్మాణ క్రమం ‘రాజ్యాంగ పరిషత్’ భారతదేశానికి రాజ్యాంగాన్ని రూపొందించింది. 1942: క్రిప్స్ మిషన్ మొట్టమొదటిసారిగా రాజ్యాంగ పరిషత్ ఏర్పాటును ప్రతిపాదించింది 1946: ‘క్యాబినెట్ మిషన్’ సూచన మేరకు రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటు చేశారు. 1946: జూలైలో రాజ్యాంగ పరిషత్‌కు ఎన్నికలు నిర్వహించారు. (ఇందులో రాష్ట్రాలకూ, రాజ సంస్థానాలకూ జనాభా ప్రాతిపదికన ప్రాతినిధ్యం కల్పించారు. రాష్ట్రాల విధాన సభల సభ్యులు ఓటు బదిలీ పద్ధతి ద్వారా తమ ప్రతినిధులను ఎన్నుకున్నారు. రాజ్యాంగ పరిషత్‌లో మొత్తం 389 మంది సభ్యుల్లో బ్రిటిష్ రాష్ట్రాల నుంచి 292 మంది, స్వదేశీ సంస్థానాల నుంచి 93 మంది ప్రాతినిధ్యం వహించారు. (రాజ్యాంగ పరిషత్ చిహ్నం ఐరావతం) 1946: డిసెంబర్ 9న, రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం తాత్కాలిక అధ్యక్షుడు డా॥ సచ్చిదానంద సిన్హా అధ్యక్షతన జరిగింది. 1946: డిసెంబర్ 11న డా॥బాబూ రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ పరిషత్ శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1946: డిసెంబర్ 13న జవహర్లాల్ నెహ్రూ లక్ష్యాలు - తీర్మానం (పీఠిక) అనే తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీన్ని 1947 జనవరి 22న ఆమోదించారు. 1947: ఆగస్ట్ 29న రాజ్యాంగ ముసాయిదా కమిటీని పరిషత్ ఏర్పాటు చేసింది. దీని అధ్యక్షుడు డా॥అధ్యక్షుడితో కలిపి ఈ ముసాయిదా కమిటీలో ఏడుగురు సభ్యులు ఉన్నారు. 1947: జూలై 22న రాజ్యాంగ పరిషత్ జాతీయ పతాకాన్ని ఆమోదించింది. భారతదేశ చరిత్రలో ప్రముఖ యుద్ధాలు యుద్ధం జరిగిన సం॥ వివరాలు సర్హింద్ యుద్ధం 1555 హూమాయూన్ చేతిలో అఫ్ఘన్ల ఓటమి రెండో పానిపట్ యుద్ధం 1556 అక్బర్ చేతిలో హేమూ పరాజయం, మొఘల్ సామ్రాజ్య పరిపాలనకు పునాది రాక్షస తంగడి 1565 విజయనగర సామ్రాజ్య సైన్యం, ముస్లిం (తళ్లికోట, బన్నిహట్టి) సైన్యాల కూటమి చేతిలో ఓటమి హాల్దీఘాట్ యుద్ధం 1576 అక్బర్, రాణా ప్రతాప్‌కు మధ్య భోపాల్ యుద్ధం 1737 పీష్వా మొదటి బాజీరావు చేతిలో నిజాం ఓటమి కర్నాల్ యుద్ధం 1739 నాదిర్షా పూర్తిగా మొఘలుల సైన్యాన్ని ఓడించాడు మొదటి కర్ణాటక యుద్ధం 1745-48 {బిటీష్, ఫ్రెంచి సైన్యాలకు మధ్య జరిగింది రెండో కర్ణాటక యుద్ధం 1749-54 {బిటీషు, ఫ్రెంచి వారి మధ్య జరిగింది మూడో కర్ణాటక యుద్ధం 1756-63 యూరప్‌లో సప్తవర్ష సంగ్రామ ఫలితంగా భారత్‌లో బ్రిటీష్, {ఫెంచి వారి మధ్య ఆధిపత్య పోరు, బ్రిటీషు వారి ఆధిపత్యం ప్లాసీ యుద్ధం 1757 బెంగాల్ నవాబు సిరాజ్ - ఉద్దౌలాకు, క్లైవ్ నాయకత్వంలో బ్రిటీషు సైన్యానికి మధ్య, నవాబు ఓటమి. బ్రిటీషు పరిపాలనకు నాంది బక్సార్ యుద్ధం 1764 బెంగాల్ నవాబు మీర్ ఖాసీం, అవధ్ నవాబు షుజా - ఉద్దౌలా, మొఘల్ చక్రవర్తి రెండో షా అలమ్ల మిత్ర సైన్యం కూటమి, మేజర్ మన్రో నాయకత్వంలోని ఆంగ్ల సైన్యం చేతిలో ఓటమి జాబ్స్ అలర్ట్స సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) సైంటిస్ట్‌ల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది. సైంటిస్ట్/ ఇంజనీర్ (ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్) అర్హతలు: ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో 65 శాతం మార్కులతో బీఈ/ బీటెక్ ఉండాలి. సైంటిస్ట్/ ఇంజనీర్ (ఇండస్ట్రియల్ సేఫ్టీ) అర్హతలు: ఇండస్ట్రియల్ సేఫ్టీలో 60 శాతం మార్కులతో ఎంఈ/ ఎంటెక్ (ఎమ్మెస్సీ ఇంజనీరింగ్) ఉండాలి. వయసు: 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: ఆగస్టు 21 వెబ్సైట్: www.shar.gov.in -
కాంపిటీటివ్ కౌన్సెలింగ్
సివిల్స్ మెయిన్స్ జనరల్ స్టడీస్ పేపర్-1లో హిస్టరీ, జాగ్రఫీల నుంచి ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారోవివరించండి. - సీహెచ్ చైతన్యప్రసాద్, బోయిన్పల్లి గతేడాది సివిల్స్ మెయిన్స్ జీఎస్ పేపర్-1లో హిస్టరీ నుంచి 14 ప్రశ్నల వరకు అడిగారు. ఒక్కో ప్రశ్నకు పది మార్కులు. కాబట్టి హిస్టరీ నుంచే 140 మార్కులు సాధించే అవకాశం ఉంది. ఈ పేపర్లోని ప్రశ్నలన్నింటికీ తప్పనిసరిగా సమాధానాలు రాయాలి. ఛాయిస్ లేదు. ఈ ప్రశ్నలన్నింటినీ ఏపీపీఎస్సీ గ్రూప్-1 మాదిరిగా పది మార్కులకే అడిగినా.. ప్రశ్నల ప్రామాణికత విషయంలో చాలా తేడా ఉంది. ఎక్కువగా శాస్త్ర, సాంకేతిక, సాంస్కృతిక, ఆర్థిక, సామాజిక దృక్కోణంలో ప్రశ్నలు అడిగారు. ఉదా: 1. దేవాలయ వాస్తు కళా వికాసంలో చోళుల వాస్తు కళను అత్యున్నతమైన దశగా ఎందుకు భావిస్తారు? 2. డల్హౌసీని ఆధునిక భారత నిర్మాతగా నిరూపించండి? ఈ ప్రశ్నల సరళిని బట్టి చూస్తే అభ్యర్థులు గతంలో మాదిరిగా హిస్టరీ విషయంలో సెలెక్టివ్ విధానాన్ని అనుసరించడం సాధ్యం కాదని గమనించాలి. ఇక జాగ్రఫీ నుంచి అణు విద్యుత్, చమురు, సహజవాయువుకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో వాటిపై ప్రశ్నలు అడిగారు. సదరన్ స్టేట్స్లో పంచదార మిల్లులు ఎక్కువగా ఉండటానికి, పత్తి, వస్త్ర పరిశ్రమలు వికేంద్రీకృతం కావడానికి గల కారణాలను విశ్లేషించండి? పశ్చిమ కనుమల్లో నదులు డెల్టాలను ఏర్పరచకపోవడానికి కారణాలేంటి? లాంటి ప్రశ్నలు కూడా ఇచ్చారు. ‘తూర్పు కోస్తా తీరంలో ఫైలిన్ సంభవించింది. ప్రపంచవ్యాప్తంగా తుపానులకు ఏవిధంగా పేర్లు పెడతారు? - వివరించండి’ లాంటి ప్రశ్నల తీరును చూస్తే ఇవన్నీ వర్తమాన వ్యవహారాలకు అనుసంధానంగానే ఉంటున్నట్లు గమనించవచ్చు. చిన్నరాష్ట్రాలపై చర్చ నడుస్తున్న నేపథ్యంలో ‘ప్రాంతీయవాదం ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్ చేయడంలో ప్రధాన భూమిక పోషిస్తోంది - వివరించండి’ అని అడిగారు. ప్రపంచీకరణ భారతదేశంలో ఏజ్డ్ పాపులేషన్‌పై ఎలాంటి ప్రభావం చూపిస్తోంది? భారతదేశంలో పట్టణీకరణ వేగవంతమవుతున్న నేపథ్యంలో ఎదురయ్యే సామాజిక సమస్యలను చర్చించండి - లాంటి ప్రశ్నలు కూడా సమకాలీన పరిస్థితులపైనే ఉన్నాయి. కాబట్టి అభ్యర్థులు వర్తమాన పరిస్థితులను గమనిస్తూ వాటికి సంబంధించిన చారిత్రక అంశాలపై దృష్టి సారించాలి. దీని కోసం విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలి. మారుతున్న ప్రశ్నల సరళిని దృష్టిలో ఉంచుకొని ప్రతి అంశాన్ని సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక కోణంలో పరిశీలిస్తూ సన్నద్ధమవ్వాలి. ఈ విషయంలో ప్రామాణిక పుస్తకాలు బాగా తోడ్పడతాయి. ఇన్పుట్స్: యాకూబ్ బాష, గురజాల శ్రీనివాసరావు,సివిల్స్ సీనియర్ ఫ్యాకల్టీ -
సివిల్స్ మెయిన్స్ జాగ్రఫీకి ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియజేయండి?
- పి.సంయుక్త, తిలక్‌నగర్ కాంపిటీటివ్ కౌన్సెలింగ్ : సివిల్స్ మెయిన్స్ జనరల్ స్టడీస్ పేపర్-1లో జాగ్రఫీకి సంబంధించి సిలబస్‌లో పేర్కొన్న అంశాలు: వరల్డ్ జాగ్రఫీ-కీలక అంశాలు, ప్రపంచవ్యాప్తంగా (దక్షిణాసియా, భారత ఉపఖండంతో సహా) ప్రధాన సహజ వనరుల విస్తరణ, ప్రపంచ వ్యాప్తంగా (భారత్ సహా) వివిధ ప్రాంతాల్లో పరిశ్రమల ఉనికి. గతంతో పోలిస్తే జనరల్ స్టడీస్ పేపర్లో జాగ్రఫీ సబ్జెక్టు పరిధి విస్తృతమైంది. గతేడాది కేవలం ఇండియా జాగ్రఫీని మాత్రమే సిలబస్‌లో పేర్కొంటే.. ఈసారి వరల్డ్ జాగ్రఫీని అదనంగా చేర్చారు. జాగ్రఫీకి సంబంధించి ఏ మూల నుంచైనా ప్రశ్నలు రావొచ్చు. ఈ నేపథ్యంలో జాగ్రఫీ ఆప్షనల్తో పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఈ పేపర్లో మంచి స్కోర్ సాధించడానికి వీలుంది. వరల్డ్ ఫిజికల్ జాగ్రఫీ: వరల్డ్ ఫిజికల్ జాగ్రఫీలోని అంశాలకు ఆకాశమే హద్దు. అందువల్ల ప్రిపరేషన్లో భాగంగా తొలుత బేసిక్ అంశాలపై పట్టు సాధించాలి. ఆ తర్వాత ముఖ్యమైన అంశాలను, సమకాలీన అంశాలతో అనుసంధానం చేసుకుంటూ ప్రిపరేషన్ కొనసాగించాలి. ఇందులోని ముఖ్యాంశాలు.. భూ స్వరూపాలు (ల్యాండ్ ఫార్మ్స్), వాతావరణం, మృత్తికలు, సహజ ఉద్భిజాలు(నేచురల్ వెజెటేషన్) వంటి భౌతిక, భౌగోళిక అంశాలు. వీటిని రెండు విధాలుగా విభజించి చదవాలి. అప్పుడే పేపర్లో గరిష్టంగా మార్కులు సాధించడానికి వీలుంటుంది. భౌతిక, భౌగోళిక అంశాలు: 1. సమకాలీన ప్రాధాన్యం ఉన్న అంశాలు. 2. ప్రత్యేక లక్షణాలున్న అంశాలు. ఓ విషయం గురించి చదువుతున్నప్పుడు ఆ అంశం నుంచి ఎలాంటి ప్రశ్నలు రావడానికి అవకాశముందో ఆలోచించి చదవాలి. అప్పుడే ప్రిపరేషన్ సఫలీకృతమవుతుంది. ఉదా: శీతోష్ణస్థితి అనే అంశంపై చదువుతున్నప్పుడు ఒక ప్రాంతంలోని శీతోష్ణస్థితి అక్కడి ఆర్థిక వ్యవస్థపై ఎలా ప్రభావం చూపుతోందన్న దానిపై దృష్టి సారించాలి. ముఖ్యమైన భూభౌతిక దృగ్విషయాలు: భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాలు, తుపానులు తదితరాలు. తొలుత ఈ అంశాలపై శాస్త్రీయ అవగాహన పెంపొందించుకోవాలి. తర్వాత అవి ఎక్కడెక్కడ.. ఎందుకు? సంభవిస్తున్నాయో తెలుసుకోవాలి. - మానవ జోక్యం వల్ల ఏ భౌగోళిక అంశాల్లో మార్పులు వస్తున్నాయి? ఆయా మార్పుల ప్రభావం ఏమిటి? వంటి అంశాలపై దృష్టి సారించాలి. క్లుప్తంగా చెప్పాలంటే.. ‘అభివృద్ధి-పర్యావరణం’ కోణంలో చదవాలి. - జాగ్రఫీ సిలబస్‌లోని మరొక కీలకాంశం- ముఖ్యమైన సహజ వనరుల విస్తరణ. దీనిపై ప్రిపరేషన్లో భాగంగా సహజ వనరుల్లో ప్రధానమైనవి, సమకాలీన (వివాదాల్లో ఉండటం వంటివి) ప్రాధాన్యం ఉన్నవి ఏమిటో గుర్తించాలి. ఏ రకమైన వనరులు ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి.. అలా ఉండటానికి అనుకూలించిన పరిస్థితులు ఏమిటి? తదితర విషయాలపై అభ్యర్థులు అవగాహన పెంపొందించుకోవాలి. ఓ ప్రాంత అభివృద్ధిలో అక్కడి సహజ వనరులు ఎలాంటి పాత్ర పోషిస్తున్నాయో చూడాలి. అభివృద్ధికి, వనరుల విస్తరణకు మధ్య సంబంధాన్ని అవగతం చేసుకోవాలి. సహజ వనరుల విస్తరణకు సంబంధించి దక్షిణాసియా, భారత ఉపఖండానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రపంచంలో ఏ ప్రాంతాల్లో ఏ రకమైన పరిశ్రమలు ఎక్కువగా కేంద్రీకృతమై ఉన్నాయి? దానికి గల కారణాలేంటి? వనరుల విస్తరణకు, పరిశ్రమల అభివృద్ధికి మధ్య సంబంధాలను అధ్యయనం చేయాలి. పరిశ్రమలకు సంబంధించి భారత్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఇన్పుట్స్: గురజాల శ్రీనివాసరావు, సివిల్స్ సీనియర్ ఫ్యాకల్టీ, హైదరాబాద్ విపత్తుల గుర్తింపులో ప్రాథమిక భావనల ప్రాధాన్యం ఏమిటి? వివిధ పోటీ పరీక్షల్లో ఈ అంశం నుంచి ఏమైనా ప్రశ్నలు అడుగుతున్నారా? - సందీప్‌రెడ్డి, కుషాయిగూడ గత యూపీఎస్సీ, ఎపీపీఎస్సీ పరీక్షల ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే విపత్తు నిర్వహణ పాఠ్యాంశం నుంచి కొన్ని ప్రశ్నలను తరచూ అడుగుతున్నారు. విపత్తుల చారిత్రక పరిశీలన, ప్రాథమిక భావనలను క్షుణ్నంగా అర్థం చేసుకున్నప్పుడే.. ఈ పాఠ్యాంశం నుంచి ఎలాంటి ప్రశ్నలు వచ్చినా సులభంగా సమాధానాలు రాయగలరు. ఒక భౌగోళిక ప్రాంతంలో సంభవించిన దుర్ఘటన విపత్తు అవునా? కాదా? అని తెలుసుకోవడానికి విపత్తు ప్రాథమిక భావనలు ఉపయోగపడతాయి. ఎందుకంటే.. అన్ని వైపరీత్యాలు విపత్తు రూపాన్ని సంతరించుకోలేవు. ఉదాహరణకు.. వివిధ పోటీ పరీక్షల్లో అడిగిన కొన్ని ప్రశ్నలను పరిశీలించండి. విపత్తులను నమోదు చేసే కార్యక్రమం ఎప్పటినుంచి మొదలైంది? సమాధానం: క్రీ.పూ.435 2005లో భారత ప్రభుత్వం నెలకొల్పిన విపత్తు నిర్వహణ సంస్థ దేశంలో, వివిధ ప్రాంతాల్లో సంభవించే విపత్తులను ఎన్ని రకాలుగా విభజించింది? సమాధానం: 31 వాస్తవాధారిత ప్రశ్నలు, మరికొన్ని ఎనలిటికల్ బేస్డ్ ప్రశ్నలను కూడా విపత్తుల నిర్వహణ పాఠ్యాంశం నుంచి అడుగుతున్నారు. ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలను ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు సీబీఎస్ఈ సిలబస్‌లో ఉన్న పాఠ్యపుస్తకాల నుంచి గ్రహించవచ్చు. కాబట్టి అభ్యర్థులు దీన్ని దృష్టిలో ఉంచుకుని అధ్యయనం కొనసాగించాలి. ఇన్పుట్స్: ఎ.డి.వి.రమణ రాజు సీనియర్ ఫ్యాకల్టీ ఇన్ జాగ్రఫీ, హైదరాబాద్. -
నేటి నుంచి సివిల్స్ మెయిన్స్ పరీక్షలు
ఐఏఎస్, ఐపీఎస్, ఇతర సర్వీసులకు ఎంపికయ్యేందకు గాను యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలు సోమవారం నుంచి ఈనెల 8వ తేదీ వరకు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా కొన్ని ప్రధాన కేంద్రాల్లో మాత్రమే జరిగే ఈ పరీక్షలు హైదరాబాద్ నగరంలోని రెండు కేంద్రాల్లో కూడా ఉంటాయి. మల్లేపల్లిలోని అన్వర్ ఉల్ ఉలూమ్ కళాశాలతోపాటు.. సికింద్రాబాద్ ప్రాంతంలోని పీజీ కళాశాలలో కూడా ఈ పరీక్ష కేంద్రాలు ఉంటాయి. ప్రిలిమ్స్ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన వారు ఈ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. వీటిలోనూ ఉత్తీర్ణత సాధిస్తే ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. -
సిలబస్, సమకాలీన అంశాల సమన్వయంతో..
డా॥తమ్మా కోటిరెడ్డి, ప్రొఫెసర్, ఐబీఎస్ హైదరాబాద్. సివిల్స్ మెయిన్స్ పరీక్షలు డిసెంబర్లో ప్రారంభం కానున్నాయి. పోటీ లక్షల నుంచి వేలకు చేరింది. ఇక్కడి నుంచి పకడ్బందీ వ్యూహాలు.. పక్కా ప్రిపరేషన్ ప్లాన్ సాగిస్తేనే చివరి దశ ఇంటర్వ్యూకు అర్హత సాధించడం సాధ్యం.. ఈ నేపథ్యంలో పేపర్-4 (జనరల్ స్టడీస్-3)లో భాగంగా ఉన్న ఎకానమీలో మెరుగైన మార్కులు సాధించేందుకు ఎటువంటి ప్రణాళికలు అనుసరించాలి.. దృష్టి సారించాల్సిన అంశాలు.. వాటిని ఏ విధంగా ప్రిపేర్ కావాలి తదితర అంశాలపై ఫోకస్.. సివిల్స్ మెయిన్స్ పేపర్-4 (జనరల్ స్టడీస్-3) సిలబస్‌లో టెక్నాలజీ, ఆర్థికాభివృద్ధి, బయోడైవర్సిటీ, పర్యావరణం, రక్షణ డిజాస్టర్ మేనేజ్మెంట్(Technology, Economic Development, Biodiversity, Environment, Security and Disaster Management) అంశాలను పొందుపరిచారు. ఈ పేపర్‌కు మొత్తం 250 మార్కులు కేటాయించారు. ప్రశ్నల సరళిని పరిశీలిస్తే.. దీర్ఘ, మధ్య, స్వల్ప తరహా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. దీర్ఘ ప్రశ్నలను 15 మార్కులకు, మధ్యతరహా ప్రశ్నలను 8 మారులకు, స్వల్ప ప్రశ్నలను 5 మార్కులకు అడగొచ్చు. నిర్ణాయక అంశాలు: భారత ఆర్థిక వ్యవస్థ-ప్రణాళిక, వనరుల సమీకరణ, వృద్ధి, ఆర్థికాభివృద్ధి, ఉపాధి అనే అంశాలను ఒక చాప్టర్‌గా పొందుపరిచారు. ఈ అంశాలను అధ్యయనం చేసే క్రమంలో మొదటిగా ఆర్థికాభివృద్ధిని నిర్ణయించే అంశాలను పరిశీలించాలి. ఆర్థికాభివృద్ధి ధ్యేయంగా అమలు చేసిన పంచవర్ష ప్రణాళికలు లక్ష్యాల సాధనలో ఏమేరకు విజయం సాధించాయో తెలుసుకోవాలి. ఈ అంశం నుంచి ప్రభుత్వ రంగ పెట్టుబడికి ఆధారాలు-వాటి ధోరణులు, 11వ ప్రణాళిక సమీక్ష, ప్రణాళికా యుగంలో వనరుల పంపిణీని విమర్శనాత్మకంగా పరిశీలించడం వంటి వాటిపై దీర్ఘ తరహా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ప్రణాళికా వికేంద్రీకరణ, నిరంత ప్రణాళిక, 12వ ప్రణాళిక లక్ష్యాలు, ఆర్థికాభివృద్ధి, ఉపాధి రహిత వృద్ధి, ధీర్ఘకాలిక ప్రణాళిక, ప్రణాళికల పరంగా అవలంబించిన వ్మూహాలు, తదితరాల నుంచి మధ్య-స్వల్ప తరహా ప్రశ్నలు రావచ్చు. చర్చనీయాంశం సమ్మిళితవృద్ధి: ఇటీవలి కాలంలో సమ్మిళిత వృద్ధి చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకున్న వృద్ధి.. ఉపాధి రహిత వృద్ధిగా నిలిచింది. సమ్మిళిత వృద్ధిలో భాగంగా అనుసరించిన ట్రికిల్ డౌన్ (ఖీటజీఛిజ్ఛు ఈౌఠీ) వ్యూహం ఆచరణలో వైఫల్యం చెందింది. సమ్మిళిత వృద్ధిపై దీర్ఘ తరహా ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. ఇందులో భాగంగా సాంఘిక రంగం, మానవాభివృద్ధికి సంబంధించిన అంశాలపై నోట్స్ రూపొందించుకోవాలి. ప్రపంచీకరణ కాలంలో అవలంభించిన విధానాలు, సమ్మిళిత వృద్ధి సాధనకు అవరోధంగా నిలిచాయి. దీనికనుగుణంగా పేదరికం, నిరుద్యోగంపై ప్రపంచీకరణ ప్రభావాన్ని అధ్యయనం చేయాలి. ప్రపంచీకరణ నేపథ్యంలో ఎదురవుతున్న సవాళ్లను పరిశీలించాలి. సమ్మిళిత వృద్ధి సాధనలో భాగంగా మానవాభివృద్ధి కీలకమైన అంశం. కాబట్టి ఈ అంశానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. అవగాహనతో బడ్జెటింగ్: గవర్నమెంట్ బడ్జెటింగ్‌లో భాగంగా ప్రభుత్వ రాబడి, వ్యయధోరణులను పరిశీలించాలి. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల రాబడి ధోరణులు, ప్రభుత్వ వ్యయ వర్గీకరణ పట్ల అవగాహన పెంచుకోవాలి. ప్రభుత్వ వ్యయ వర్గీకరణను క్రమ బద్దీకరించే క్రమంలో ఇటీవలి కాలంలోని ఫిస్కల్ కన్సాలిడేషన్ (Fiscal Consolidation)కు ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ అంశం నుంచి ప్రధాన (దీర్ఘ) ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తదనుగుణంగా నోట్స్ రూపొందించుకోవాలి. దీంతోపాటు వస్తు, సేవలపై పన్ను, సరళీకరణ విధానాల కాలంలో పన్ను సంస్కరణలు, భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కోశ విధాన పాత్ర అనే అంశాల నుంచి కూడా ప్రశ్నలు రావచ్చు. రెవెన్యూ రాబడి, రెవెన్యూ వ్యయం, మూలధన రాబడి-వ్యయం, ప్రణాళిక-ప్రణాళికేతర వ్యయం, ద్రవ్యలోటు వంటి అంశాలు కూడా కీలకమైనవి. వీటి నుంచి మధ్య-స్వల్ప తరహా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. కీలకం ఉత్పాదితాలు పంటల తీరు, నీటిపారుదల పద్ధతులు, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా- మార్కెటింగ్, ఈ-టెక్నాలజీ అంశాలతో కూడిన చాప్టర్లో వ్యవసాయ రంగ అభివృద్ధికి అవసరమైన ఉత్పాదితా (Inputs)లను పొందుపరిచారు. ఈ విభాగంలో పంటల తీరు నిర్ణయించే అంశాలు-పంటల తీరును మెరుగుపరచడానికి చర్యలు, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌లో సహకార మార్కెటింగ్ పాత్ర, వ్యవసాయ రంగ అభివృద్ధిలో ఈ-టెక్నాలజీ పాత్ర అనే అంశాలను విస్తృత స్థాయిలో అధ్యయనం చేయాలి. వీటి నుంచి పెద్ద తరహా ప్రశ్నలు రావచ్చు. క్రమబద్ధమైన మార్కెట్లు, చిన్న నీటిపారుదల, డ్రిప్ ఇరిగేషన్, వ్యవసాయ ఉత్పత్తుల స్టోరేజ్ సౌకర్యాలు వంటి అంశాలకు కూడా తగినంత ప్రాధాన్యతనివ్వాలి. వీటి నుంచి మధ్య-స్వల్ప తరహా ప్రశ్నలను అడగొచ్చు. ప్రధానంగా ప్రజా పంపిణీ ప్రత్యక్ష-పరోక్ష వ్యవసాయ సబ్సిడీలు, మద్దతు ధరలు, ప్రజా పంపిణీ వ్యవస్థ, ఆహార భద్రత, బఫర్ స్టాక్, టెక్నాలజీ మిషన్ వంటి అంశాలను ఒక చాప్టర్‌గా పొందుపరిచారు. ఇందులో ప్రజా పంపిణీ వ్యవస్థ, మద్ధతు ధరలు, ఆహార భద్రతపై ప్రశ్నలు అడిగే అవ కాశం ఉంది. మద్దతు ధరల ధోరణి-సమగ్ర మద్దతు ధరల విధానం కోసం తీసుకోవాల్సిన చర్యలు, ఆహార భద్రత సాధించే క్రమంలో.. ఆహార భద్రతా బిల్లు అమలు కోసం చేపట్టాల్సిన చర్యలు, ప్రజా పంపిణీ వ్యవస్థ అమల్లో ఎదురవుతున్న ఇబ్బందులు, ప్రజా పంపిణీ వ్యవస్థ అమల్లో ఎదురవుతున్న ఇబ్బందుల నేపథ్యంలో నగదు బదిలీ ఎంత వరకు ప్రత్యామ్నాయం కాగలదు? వంటి అంశాల నుంచి దీర్ఘ తరహా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. వ్యవసాయ సబ్సిడీలు, లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థ, పునర్నిర్మిత ప్రజా పంపిణీ వ్యవస్థ, వ్యవసాయ వ్యయాలు- ధరల కమిషన్, ఆహార భద్రతకు చర్యలు, ఆహార నిల్వలకు సంబంధించిన గణాంకాలు వంటి అంశాలపై కూడా దృష్టి సారించాలి. ఈ అంశాలపై మధ్య-స్వల్ప తరహా ప్రశ్నలను అడిగే అవకాశం ఉంది. ఫుడ్ ప్రాసెసింగ్‌కు ప్రాధాన్యత చిన్న తరహా పరిశ్రమలు, ఫ్యాక్టరీలు అంశంలో ఫుడ్ ప్రాసెసింగ్ (Food Processing) పరిశ్రమలు అధిక ప్రాధాన్యత పొందాయి. ఈ అంశానికి సంబంధించి భారత్ వంటి ఆర్థిక వ్యవస్థలో ఆయా పరిశ్రమల ప్రాధాన్యత-ప్రగతి, అవి ఎదుర్కొంటున్న సవాళ్లను పరిశీలించాలి. డౌన్ స్ట్రీమ్(Down Stream), అప్ స్ట్రీమ్ (Up Stream)రిక్వైర్‌మెంట్స్‌లో భాగంగా సాంకేతిక విజ్ఞానం, ఉత్పాదితాలు, కోల్డ్ స్టోరేజ్, పంపిణీ నెట్‌వర్క్‌కు సంబంధించిన ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. తప్పకుండా భూసంస్కరణలు అంశం నుంచి తప్పకుండా ప్రశ్న రావచ్చు. స్వాతంత్య్రానంతరం భూసంస్కరణల అమలు తీరుపై నోట్స్ రూపొందించుకోవాలి. ప్రపంచీకరణ నేపథ్యంలో భూసంస్కరణలపై ప్రభావం అనే అంశానికి సంబంధించి ప్రామాణిక పుస్తకాలు-జర్నల్స్ నుంచి సమాచారాన్ని సేకరించాలి. భూసంస్కరణల అమల్లో ఎదురవుతున్న సమస్యలను పరిశీలించాలి. రైత్వారీ విధానం, భూ రికార్డులు, మహల్వారీ విధానం, శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి, కౌలు సంస్కరణలు అనే అంశాల నుంచి మధ్య-స్వల్ప తరహా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. సరళీకరణ విధానాలు ఆర్థిక వ్యవస్థపై సరళీకరణ విధానాల ప్రభావం, పారిశ్రామిక విధానంలో మార్పులు, పారిశ్రామికాభివృద్ధిపై పారిశ్రామిక విధానాల ప్రభావం అనే అంశాలను ఒక చాప్టర్‌గా పొందుపరిచారు. సంస్కరణల కాలంలో ప్రభుత్వ రంగ పాత్ర, భవిష్యత్‌లో ప్రభుత్వం అనుసరించాల్సిన విధానం, పారిశ్రామికాభివృద్ధిపై సరళీకరణ విధానాల ప్రభావం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు-పారిశ్రామికాభివృద్ధి వంటి అంశాలు కీలకమైనవి. వీటిని విస్తృత స్థాయిలో ప్రిపేర్ కావాలి. ఈ అంశాల నుంచి దీర్ఘ తరహా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ప్రత్యే ఆర్థిక మండళ్లు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ, కాంపిటీటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా(Competitive Commission of India), లెసైన్సింగ్ విధానం, ప్రైవేటీకరణ విధానంలోని లోపాలు, ప్రైవేటీకరణతో సమస్యలు వంటి అంశాలకు కూడా తగినంత ప్రాధాన్యత నివ్వాలి. వీటి నుంచి మధ్య-స్వల్ప తరహా ప్రశ్నలను అడగొచ్చు. అవస్థాపనా సౌకర్యాలు-ఆర్థికాభివృద్ధి అవస్థాపనా సౌకర్యాలకు, ఆర్థికాభివృద్ధికి దగ్గరి సంబంధం ఉంది. అవస్థాపనా సౌకర్యాల్లో భాగంగా శక్తి, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, రైల్వేలు, రోడ్లు అనే అంశాలను సిలబస్‌లో పొందుపరిచారు. ఇందులో అవస్థాపనా సౌకర్యాలు-ఆర్థికాభివృద్ధి, అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధిలో ఎదురవుతున్న సమస్యలు, శక్తి సంక్షోభానికి కారణాలు-సమగ్ర శక్తి విధానం వంటివి కీలకాంశాలు. వీటి నుంచి దీర్ఘ తరహా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. గ్రామీణ మౌలిక సౌకర్యాల అభివృద్ధి నిధి, అణు శక్తి, జల విద్యుత్, పౌర విమానయాన రంగం ఎదుర్కోంటున్న సమస్యలు, ఇటీవలి కాలంలో రోడ్ సెక్టర్ ప్రాజెక్ట్ ప్రగతి వంటి అంశాల నుంచి మధ్య-స్వల్ప తరహా ప్రశ్నలు అడగొచ్చు. పీపీపీ అవశ్యకత పెట్టుబడి నమూనా అంశంలో ప్రభుత్వ-ప్రైవేట్ భాగ స్వామ్యం కీలకాంశం. వివిధ రంగాల్లో ప్రభుత్వ-ప్రైవేట్ భాగ స్వామ్యం (Public Private Participation - PPP)ఆవశ్యకత, ఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించాలి. భారీ, మధ్య తరహా ప్రాజెక్ట్‌లు, పబ్లిక్ వర్క్స్‌కు సంబంధించి వివిధ పీపీపీ నమూనాలు అమల్లో ఉన్నాయి. ఆయా అంశాలకు సంబంధించి సమగ్రమైన సమాచారాన్ని సేకరించాలి. కాన్సెప్ట్స్ నుంచి పేపర్-4 (జనరల్ స్టడీస్-3)లోని ఎకానమీకి సంబంధించిన సిలబస్‌ను చాప్టర్ల వారీగా పొందుపరిచారు. వీటిని అధ్యయనం చేసేటప్పుడు ప్రాథమిక భావనల (కాన్సెప్ట్స్) నుంచి ప్రారంభించాలి. దాంతోపాటు ఎకానమీలో విస్తృతంగా ఉపయోగించే వివిధ పదాల పట్ల అవగాహన కూడా పెంచుకోవాలి. ఎందుకంటే ఎకానమీ అంశాలను విశ్లేషణాత్మకంగా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. కాన్సెప్ట్స్‌పై పట్టు, పదాలపై అవగాహనతోనే ఈ తరహా ప్రిపరేషన్ సాధ్యమవుతుంది. ముఖ్యంగా సైన్స్ నేపథ్యంగా ఉన్న అభ్యర్థులు ఈ అంశాన్ని గమనించాలి. ఇందుకోసం ఎన్సీఈఆర్టీ (+1, +2 తరగతులు) పుస్తకాల ద్వారా వివిధ పద కోశాలైన.. ఆర్థికాభివృద్ధి, జాతీయాదాయానికి సంబంధించి స్థూల జాతీయోత్పత్తి, స్థూల దేశీయోత్పత్తి, నికర జాతీయోత్పత్తి, ఉత్పత్తి కారకాల పంపిణీ దృష్ట్యా జాతీయాదాయం,వ్యష్టి-వ్యయార్హ ఆదాయం, తలసరి ఆదాయం వంటి ప్రాథమిక అంశాలు-వాటి నిర్వచనాలను తెలుసుకోవాలి. మానవాభివృద్ధి, జనాభా స్థితి గతులు, వివిధ ప్రభుత్వ విధానాలు, ద్రవ్యోల్బణం, ఆర్థిక సంఘం, కేంద్ర బ్యాంకు విధులు, సుస్థిర వృద్ధి, సమ్మిళిత వృద్ధి, ప్రత్యక్ష-పరోక్ష పన్నులు, కరెంట్ అకౌంట్ లోటు, వాణిజ్య లోటు, ఉపాధి పథకాలు, ప్రణాళికల లక్ష్యాలు, బడ్జెటరీ ప్రక్రియలో వినియోగించే పదాలపై కనీస పరిజ్ఞానం పెంచుకోవాలి. సమకాలీనంగా ప్రిపరేషన్లో గమనించాల్సిన మరో అంశం.. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను సిలబస్‌లోని వివిధ అంశాలతో అన్వయిస్తూ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ద్రవ్యోల్బణం, కరెంట్ అకౌంట్ లోటు, రుపాయి విలువ క్షీణత వంటి అంశాలకు సిలబస్‌ను దృష్టిలో ఉంచుకుని నోట్స్ రూపొందించుకోవాలి. ప్రభుత్వ విధానంలో భాగంగా వస్తు, సేవలపై పన్ను, ఆహార భద్రతా బిల్లు, భూసేకరణ బిల్లు వంటి కీలక అంశాల పట్ల విస్తృత స్థాయిలో అవగాహన పెంచుకోవాలి. రిఫరెన్స్ బుక్స్ Human Development Index Report 2013 UNDP India Infrastructure Report &Oxford university press World Development Report Economic Survey 2012-13 Fundamentals of Agricultural Economics& Sadhu & Singh Indian Economy& Misra & Puri Selected Essays on Indian Economy &C.Rangarajan