జాగ్రఫీ ఆప్షనల్ పేపర్-1కు ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలపండి? | how to prepare for Geography Paper 1 from Civils mains exam ? | Sakshi
Sakshi News home page

జాగ్రఫీ ఆప్షనల్ పేపర్-1కు ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలపండి?

Published Tue, Aug 12 2014 12:04 AM | Last Updated on Sat, Sep 2 2017 11:43 AM

జాగ్రఫీ ఆప్షనల్ పేపర్-1కు ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలపండి?

జాగ్రఫీ ఆప్షనల్ పేపర్-1కు ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలపండి?

కాంపిటీటివ్ కౌన్సెలింగ్:  సివిల్స్ మెయిన్స్ లో జాగ్రఫీ పేపర్-1లో భౌతిక, మానవ భూగోళ శాస్త్రాలకు సంబంధించిన భావనలు, సిద్ధాంతాలను పొందుపరిచారు.  -భూస్వరూప శాస్త్రానికి సంబంధించి భూ అయస్కాంతత్వం (జియోమాగ్నటిజం) ప్రాథమిక భావనలు, భూ అభినితి (జియోసింక్లైన్), భూ సమస్థితి, డబ్ల్యు.జె. మోర్గాన్ ప్రతిపాదించిన ఫలకవిరూపక సిద్ధాంతం ఆధారంగా భూకంపాలు, సునామీలు ఏర్పడే విధానం- విశ్లేషణ, జియోహైడ్రాలజీ మొదలైన అంశాలు కీలకమైనవి. వీటిపై పరిపూర్ణ పట్టు సాధించే విధంగా ప్రిపరేషన్ సాగించాలి.
- ఎం.సింధు, సైనిక్‌పురి
 
 శీతోష్ణస్థితి శాస్త్రానికి సంబంధించి క్షితిజ సమాంతర ఉష్ణోగ్రతా విస్తరణ దాన్ని ప్రభావితం చేసే అంశాలు, ఊర్ధ్వ ఉష్ణోగ్రతా విస్తరణ, ఉష్ణ సమతుల్యం, రుతుపవనాలు, జెట్‌స్ట్రీమ్, వాయురాశులు, వాతాగ్రాలు, సమ శీతోష్ణ మండల, ఉష్ణమండల చక్రవాతాలు, వాటి మధ్య తేడాలు, వర్షపాత రకాలు, జల సంబంధిత చక్రం, అనువర్తిత శీతోష్ణస్థితి శాస్త్రం మొదలైన అంశాలను విశ్లేషణాత్మక దృష్టితో ప్రిపేర్ కావాల్సి ఉంటుంది.  జైవిక భూగోళ శాస్త్రానికి సంబంధించి మృత్తిక వర్గీకరణ, విస్తృతి, మృత్తిక క్రమక్షయం, నిమ్నీకరణకు కారణాలు, వాటి సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, అటవీ నిర్మూలన వల్ల ఎదురయ్యే సమస్యలు, వాటి సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు మొదలైన అంశాలను విస్తృత స్థాయిలో అధ్యయనం చేయాలి. ఎన్విరాన్‌మెంటల్ జాగ్రఫీకి సంబంధించి ఆవరణశాస్త్ర ప్రాథమిక భావనలు, పర్యావరణంపై మానవ ప్రభావం, ఆవరణ వ్యవస్థల నిర్వహణకు చేపట్టాల్సిన చర్యలు, వాటి సంరక్షణ, జీవ వైవిధ్యత సంరక్షణలో సుస్థిరాభివృద్ధి పాత్ర మొదలైన అంశాలను విశ్లేషణాత్మకంగా ప్రిపేర్ కావాలి. మానవీయ భూగోళ శాస్త్త్రంలోని దృక్పథాలకు సంబంధించి పర్యావరణ వాదం, పరిణామాత్మక విప్లవం, ద్వంద్వ భావన, రాడికల్, ప్రవర్తనా వాద దృక్పథాలు, ప్రపంచ సాంస్కృతిక మండలాలు మొదలైన అంశాలను అధ్యయనం చేయాలి. ఆర్థిక భూగోళ శాస్త్రానికి సంబంధించి, వనరులు వాటి విస్తరణ, ఇంధన సమస్య, ప్రపంచ వ్యవసాయ మండలాలు - రకాలు, ఆహార భద్రత, దుర్భిక్షం -కారణాలు - ప్రభావాలు - నివారణ చర్యలు మొదలైన అంశాలను విశ్లేషణాత్మకంగా ప్రిపేర్ కావాలి.
 
  ప్రాంతీయ భూగోళ శాస్త్త్రంలో ప్రాంతీయ భావన, రకాలు, ప్రాంతీయ అసమానతలకు కారణాలు, వాటి అభివృద్ధి వ్యూహాలు, ప్రాంతీయ ప్రణాళికలను రూపొందించడంలో పర్యావరణ సంబంధిత అంశాల పాత్ర మొదలైన అంశాలను చదవాలి. మానవ భూగోళ శాస్త్త్రంలోని నమూనాలు, సిద్ధాంతాలు, జనాభా పరివర్తన నమూనాలు, ఓస్టోవ్‌‌స నమూనాలోని వృద్ధి దశలు, హృదయభూమి, అంచుల భూమి సిద్ధాంతాలు మొదలైన అంశాలను చదవాల్సి ఉంటుంది.
 
 జాబ్స్ అలర్‌‌ట్స: ట్రైనీ కంటెంట్ డెవలపర్
 ట్రైనీ కంటెంట్ డెవలపర్‌ల నియామకానికి సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం దరఖాస్తులు కోరుతోంది.
 ట్రైనీ కంటెంట్ డెవలపర్
 అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులు. ఇంగ్లిష్ లాంగ్వేజ్ స్కిల్స్ ఉండాలి.
 వయసు:  ఆగస్టు 1, 2014నాటికి 30 ఏళ్లకు మించకూడదు.
 ఎంపిక: ’What are the problems faced by Telangana and Andhra Pradesh after State bifurcation? Suggest your solutions to the problems' అంశంపై 750 పదాలకు తక్కువ కాకుండా వ్యాసాన్ని స్వయంగా ఆంగ్లంలో రాసి పంపాలి(టైప్ చేసి పంపకూడదు). వ్యాసం ఆధారంగా అభ్యర్థులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ఆరు నెలల శిక్షణ కాలంలో నెలకు రూ.10 వేల చొప్పున స్టైఫెండ్ అందజేస్తారు.
 దరఖాస్తు విధానం:  ‘జగతి పబ్లికేషన్స్ లిమిటెడ్’ పేరుతో హైదరాబాద్‌లో చెల్లేలా తీసిన రూ.200 డిమాండ్ డ్రాఫ్ట్‌ను వ్యాసం, రెజ్యుమెతో జతచేసి కింది చిరునామాకు పంపాలి.
 
 చిరునామా:    సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం,
     8-2-696,697/75/1,
     సితార గ్రాండ్ హోటల్ పక్కన,
     రోడ్ నెం 12, బంజారాహిల్స్,
     హైదరాబాద్ - 500008
 చివరి తేది: ఆగస్టు 17, రాత పరీక్ష తేది: ఆగస్టు 31
 ఇంటర్వ్యూ: సెప్టెంబరు 15
 క్లాసులు ప్రారంభం: అక్టోబరు 1 నుంచి
 
  మనదేశంలో పరిశోధనా సంస్థలు మీకు తెలుసా?
 -    భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) - బెంగళూరు
 -    ఫిజికల్ రీసెర్‌‌చ లేబొరేటరీ(అహ్మదాబాద్): ఖగోళ భౌతిక శాస్త్రం, సౌరకుటుంబ భౌతిక శాస్త్రం, ప్లాస్మా భౌతిక శాస్త్రం, పురావస్తు శాస్త్రాల అధ్యయనం.
 -    సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం - శ్రీహరికోట, నెల్లూరు జిల్లా: రాకెట్లు, ఉపగ్రహాలను ప్రయోగించే కేంద్రం.
 -    విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ - తిరువనంతపురం: ఉపగ్రహ వాహక నౌకల తయారీ కేంద్రం.
 -    తుంబా ఈక్వెటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ - తిరువనంతపురం: రాకెట్‌లను ప్రయోగించే ప్రదేశం.
 -    నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ - హైదరాబాద్: దీనిని గతంలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ అని పిలిచేవారు.
 
 ముఖ్య గ్రంథాలు, రచయితల పేర్లు ఇవే..
 రచయిత    గ్రంథం..  జాయపసేనాని    నృత్య రత్నావళి, గీత రత్నావళి,
     వాద్య రత్నావళి
 క మూలఘటిక కేతన    ఆంధ్రభాషా భూషణం,
     విజ్ఞానేశ్వరీయం
 క నాగార్జున సిద్ధుడు    రసరత్నాకరం
 క రషీద్ ఎద్దిన్    మొట్టమొదటి చరిత్ర పుస్తకాన్ని ప్రచురించాడు
 క విష్ణుశర్మ    పంచతంత్రాన్ని సంస్కృతంలో రచించాడు
 క విశాఖదత్తుడు    ముద్రా రాక్షసం
 క గడియారం వెంకటశేషశాస్త్రి శివభారతం
 
 నాలుగో పంచవర్ష ప్రణాళిక కాలం?
 ఆర్థిక ప్రణాళిక: ూ 1966-69 మధ్య కాలాన్ని భారత ప్రణాళికా వ్యవస్థలో ప్రణాళికా విరామంగా వ్యవహరిస్తారు. ఈ కాలంలో కేవలం వార్షిక ప్రణాళికలు మాత్రమే అమలయ్యేవి.
 -    నాలుగో పంచవర్ష ప్రణాళిక ఏప్రిల్ 1, 1969 నుంచి మార్చి 31, 1974 వరకు అమల్లో ఉంది.  
 -    సుస్థిరతతో కూడిన వృద్ధిని నాలుగో పంచవర్ష ప్రణాళిక లక్ష్యంగా పెట్టుకుంది.
 -    ఐదో పంచవర్ష ప్రణాళిక కాలం ఏప్రిల్ 1, 1974 నుంచి మార్చి 31, 1979 వరకు అని నిర్ణయించారు.  
 -    జనతా ప్రభుత్వం అధికారంలోకి రావడం వల్ల ఐదో పంచవర్ష ప్రణాళిక ఒక సంవత్సరం ముందే అంటే మార్చి 31, 1978న ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement