Competitive counselling
-
పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలో అత్యధిక మార్కులు ఎలా ?
కాంపిటీటివ్ కౌన్సెలింగ్ : పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలో భారతీయ చరిత్ర, సంస్కృతి, జాతీయోద్యమాల నుంచి ఎలాంటి ప్రశ్నలు వస్తాయి? వీటిలో అత్యధిక మార్కులు సాధించడం ఎలా? -కె.సుమలత, సరూర్‌నగర్ పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలో అడిగే ఏడు విభాగాల్లో ఒకటి.. భారతదేశ చరిత్ర-సంస్కృతి-జాతీయోద్యమం. ఈ విభాగాన్ని పరిశీలిస్తే భారతదేశ చరిత్రలో మూడు భాగాలు ఉంటాయి. అవి.. ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక చరిత్ర. ఈ క్రమంలో హరప్పా నాగరికత నుంచి వేద యుగం, మౌర్యులు, గుప్తులు, శాతవాహనులు, కాకతీయుల కాలం నాటి సాంఘిక, రాజకీయ, ఆర్థిక, మత పరిస్థితులను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. అరబ్బులు, మొఘల్ సామ్రాజ్యం, బహమనీ సుల్తానులు, విజయనగర రాజులు, ప్రముఖ కవులు - వారి రచనల వరకు అన్ని అంశాలను చదవాలి. భారత జాతీయోద్యమంలో భాగంగా 1857 సిపాయిల తిరుగుబాటు, ఈస్టిండియా పాలన, భారత జాతీయ కాంగ్రెస్, అతివాదులు, మితవాదులు, బెంగాల్ విభజన, వందేమాతర ఉద్యమం, జలియన్ వాలాబాగ్ ఉదంతం, గాంధీజీ భారతదేశానికి రాక, దండి మార్చ్, సహాయ నిరాకరణోద్యమం, చౌరీచౌరా సంఘటన, భారత జాతీయ సైన్యం, క్విట్ ఇండియా ఉద్యమం, భారతదేశానికి సైమన్ కమిషన్ రాక, 1909 సంస్కరణలు, 1919 సంస్కరణలు, రౌలత్ చట్టం, ద్విజాతి సిద్ధాంతం, జాతీయోద్యమంలో పత్రికల పాత్ర, ప్రముఖుల నినాదాలు, స్వాతంత్య్రోద్యమంలో గాంధీజీ పాత్ర వంటి అంశాలను అధ్యయనం చేయాలి. పోలీస్ కానిస్టేబుల్ -2012 పరీక్షలో అడిగిన కొన్ని ప్రశ్నలు: 1. ఏ యుద్ధంతో విజయనగర సామ్రాజ్యం అంతరించింది? ఎ) తళ్లికోట యుద్ధం బి) పానిపట్టు యుద్ధం సి) మైసూర్ యుద్ధం డి) వెల్లూర్ యుద్ధం సమాధానం: ఎ 2. శాతవాహన వంశాన్ని ఎవరు స్థాపించారు? ఎ) హాలుడు బి) యజ్ఞశ్రీ సి) శ్రీముఖుడు డి) శాతకర్ణి సమాధానం: సి 3. జలియన్ వాలాబాగ్ మారణకాండ ఎప్పుడు జరిగింది? ఎ) 1918 బి) 1919 సి) 1920 డి)1921 సమాధానం: బి ఇన్పుట్స్: బి.ఉపేంద్ర, డెరైక్టర్, క్యాంపస్ స్టడీసర్కిల్, హైదరాబాద్ ఎడ్యూ న్యూస్: ఐఈఎల్టీఎస్ స్కాలర్షిప్స్ అందజేత ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ లాంగ్వే జ్ టెస్టింగ్ సిస్టమ్(ఐఈఎల్టీఎస్) ద్వారా వివిధ కోర్సుల్లో ప్రవేశం కల్పించేందుకు ఈ ఏడాది నుంచి మరికొన్ని దేశాలు ముందుకొచ్చాయని ఐఈఎల్టీఎస్ ఎగ్జామినేషన్ ఇండియా, కస్టమర్ సర్వీసెస్ సౌత్ ఆసియా డెరైక్టర్ సారా డెవెరాల్ తెలిపారు. ఎనిమిది మంది భారతీయ విద్యార్థులకు గురువారం నగరంలో బ్రిటీష్ కౌన్సిల్ నుంచి ఐఈఎల్టీఎస్ స్కాలర్షిప్లను అందజేశారు. ఈ సందర్భంగా డెవెరాల్ మాట్లాడుతూ... అంతర్జాతీయంగా 135 దేశాల్లోని 9000 సంస్థలు ఐఈఎల్టీఎస్ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నాయని చెప్పారు. ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు స్కాలర్షిప్లు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఎంపికైన విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.3 లక్షలు ఉపకార వేతనంగా ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ (హైదరాబాద్) ఆండ్రూ మెక్అలిస్టర్ తదితరులు పాల్గొన్నారు. జాబ్స్, అడ్మిషన్స అలర్ట్స గెయిల్ ఇండియా లిమిటెడ్: గెయిల్ ఇండియా లిమిటెడ్ సీనియర్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతోంది. ఖాళీల సంఖ్య: 61 విభాగాలు: కెమికల్, పీసీ ఆపరేషన్స్, మెకానికల్ - పీసీ ఓఅండ్ఎం, ఎలక్ట్రికల్ - పీసీ ఓఅండ్ఎం, ఇన్స్ట్రుమెంటేషన్ - పీసీ ఓఅండ్ఎం, మెకానికల్ - పైప్‌లైన్ ఓఅండ్ఎం, ఎలక్ట్రికల్ - పైప్‌లైన్ ఓఅండ్ఎం, ఇన్స్ట్రుమెంటేషన్ - పైప్‌లైన్ ఓఅండ్ఎం అర్హతలు: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత. ఆన్లైన్ రిజిస్ట్రేషన్: ఆగస్టు 11 - 25. వెబ్సైట్: www.gail.nic.in భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిప్యూటీ ఇంజనీర్ (సివిల్) అర్హత: మొదటి శ్రేణిలో బీఈ/బీటెక్ (సివిల్) ఉత్తీర్ణతతోపాటు సంబంధిత రంగంలో ఏడాది అనుభవం ఉండాలి. డిప్యూటీ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) అర్హతలు: మొదటి శ్రేణిలో బీఈ/బీటెక్ (ఎలక్ట్రికల్) ఉత్తీర్ణతతోపాటు సంబంధిత రంగంలో ఏడాది అనుభవం ఉండాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: ఆగస్టు 20. వెబ్సైట్: www.bel-india.com నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ కాలికట్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింది కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. పీజీ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్ సిస్టమ్ డిజైన్ అర్హత: బీఈ/ బీటెక్ (ఈఈ/ ఈఈఈ/ ఐఅండ్‌సీ/ ఈసీ/ ఏఈ అండ్ ఐ/ ఇన్స్ట్రుమెంటేషన్/ మెకట్రానిక్స్/ సీఎస్ఈ). అడ్వాన్స్డ్ డిప్లొమా - పీఎల్సీ/ స్కాడా/ డీసీఎస్ అర్హత: డిప్లొమా, ఎమ్మెస్సీ (ఇన్స్ట్రుమెంటేషన్/ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్) లేదా బీఈ/ బీటెక్ ఉండాలి. వెబ్సైట్: http://calicut.nielit.in అన్నా యూనివర్సిటీ చెన్నైలోని అన్నా యూనివర్సిటీ ఎంఎస్, పీహెచ్డీ ప్రోగ్రామ్‌ల్లో ప్రవేశానికి దరఖాస్తులను కోరుతోంది. విభాగాలు: ఇంజనీరింగ్/టెక్నాలజీ, సైన్స, హ్యుమానిటీస్, మేనేజ్మెంట్, ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ అర్హతలు: సంబంధిత విభాగంలో 55 శాతం మార్కులతో ఎంఎస్ ప్రోగ్రామ్‌కు బీఈ/బీటెక్, పీహెచ్డీ ప్రోగ్రామ్‌లకు మాస్టర్స డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తులకు చివరి తేది: ఆగస్టు 30 వెబ్సైట్: http://cfr.annauniv.edu/ జనరల్ నాలెడ్‌జ పాలిటీ: భారత రాజ్యాంగం ముఖ్యమైన కమిటీలు నాయకత్వం కేంద్ర అధికారాలు జవహర్లాల్ నెహ్రూ నిబంధనల కమిటీ డా॥రాజేంద్రప్రసాద్ రాష్ట్రాలకు సంబంధించిన కమిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రాథమిక హక్కులు సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టీరింగ్ కమిటీ డా॥కె.ఎం. మున్షీ మైనారిటీల కమిటీ హెచ్.సి. ముఖర్జీ సలహా సంఘం సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయోద్యమ కాలం నాటి పత్రికలు పత్రిక పేరు సంవత్సరం, ప్రదేశం వ్యవస్థాపకుడు నవసాహిత్యమాల అనంతపురం విద్వాన్ విశ్వం, తరిమెల నాగిరెడ్డి కృష్ణా పత్రిక 1902, మచిలీపట్నం కొండా వెంకటప్పయ్య ఆంధ్ర పత్రిక 1908, బొంబాయి కాశీనాథుని నాగేశ్వరరావు వార్త పత్రిక 1925, తెనాలి కొమ్మూరి వెంకటరామయ్య గోల్కొండ పత్రిక 1926 సురవరం ప్రతాపరెడ్డి మీజాన్ పత్రిక 1943, హైదరాబాద్ అడవి బాపిరాజు స్వరాజ్య పత్రిక ---- గాడిచర్ల హరిసర్వోత్తమరావు -
జనరల్ స్టడీస్ పేపర్-3లో ఎకానమీ ప్రిపరేషన్ ఎలా ?
కాంపిటీటివ్ కౌన్సెలింగ్: నేను సివిల్స్ మెయిన్స్‌కు సన్నద్ధమవుతున్నాను. జనరల్ స్టడీస్ పేపర్-3లో ఎకానమీ ప్రిపరేషన్‌కు సంబంధించి తగిన సూచనలివ్వండి. - బి. సుస్మిత, బషీర్‌బాగ్. ఎకానమీకి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు రాయడం కోసం అభ్యర్థులు ముందుగా కాన్సెప్ట్‌పై పూర్తి పట్టు సాధించాలి. గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే జనరల్ స్టడీస్ పేపర్-3లో ఎకానమీకి సంబంధించిన ప్రశ్నలు వర్తమాన అంశాలకు అనుగుణంగా ఇచ్చారు. ఒక టాపిక్‌పై ఇచ్చిన ప్రశ్నకు వర్తమాన అంశాలతో అనుసంధానిస్తూ జవాబు రాసినప్పుడే అధిక మార్కులు సాధించవచ్చు. ిఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ (ఎఫ్ఆర్బీఎం), సమ్మిళిత వృద్ధి, నూతన కంపెనీల బిల్లు 2013, పన్ను వ్యయం, ఆహార భద్రతా బిల్లు, వ్యవసాయ సబ్సిడీలు, పింక్ రివల్యూషన్, ప్రపంచీకరణ, భూ సంస్కరణలు, వ్యవసాయ ఉత్పాదకత, పేదరికం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, మల్టీ బ్రాండ్ రిటైల్ రంగం, వస్తు, సేవలు లాంటి అంశాలపై కాన్సెప్ట్‌ల ఆధారంగానే ప్రశ్నలను అడుగుతున్నారు. ప్రతి కాన్సెప్ట్‌ను వర్తమాన అంశాలకు అన్వయించి ప్రశ్నలు రూపొందిస్తున్నారు. సిలబస్‌లో భాగంగా కాన్సెప్ట్‌లను చదివే క్రమంలో వివిధ అంశాలకు సంబంధించి లోతైన అధ్యయనం చేసినవారికి ఎకానమీ ప్రశ్నలకు సమాధానం రాయడం కష్టమేమీ కాదు. అందువల్ల సివిల్స్ మెయిన్స కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులు ఎకానమీని అధ్యయనం చేసేటప్పుడు కాన్సెప్ట్లపై అవగాహనతో పాటు వాటిని వివిధ అంశాలకు అన్వయించుకుంటూ చదవాలి. ఎకానమీలో ప్రతి ప్రశ్నకు వాస్తవికతకు దగ్గరగా ఉండేలా సమాధానం రాయాల్సి ఉంటుంది. అందువల్ల వివిధ గణాంకాలు, డేటాపై తప్పనిసరిగా అవగాహన పెంచుకోవాలి. గతంలో పరీక్ష రాసిన చాలామంది అభ్యర్థులు ఎకానమీ విభాగానికి సమయం సరిపోలేదని తెలిపారు. అందువల్ల ఇప్పటి నుంచే ప్రతి ప్రశ్నకు సూటిగా, నిర్దిష్టంగా 200 పదాల పరిమితిలో జవాబులు రాయడం ప్రాక్టీస్ చేయాలి. సమయ పరిమితిలోగా అన్ని ప్రశ్నలకు జవాబు రాసే విధంగా సంసిద్ధమవ్వాలి. ఇన్పుట్స్: తమ్మా కోటిరెడ్డి, సివిల్స్ సీనియర్ ఫ్యాకల్టీ జనరల్ నాలెడ్‌జ పాలిటీ: భారత రాజ్యాంగం భారత రాజ్యాంగ నిర్మాణ క్రమం ‘రాజ్యాంగ పరిషత్’ భారతదేశానికి రాజ్యాంగాన్ని రూపొందించింది. 1942: క్రిప్స్ మిషన్ మొట్టమొదటిసారిగా రాజ్యాంగ పరిషత్ ఏర్పాటును ప్రతిపాదించింది 1946: ‘క్యాబినెట్ మిషన్’ సూచన మేరకు రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటు చేశారు. 1946: జూలైలో రాజ్యాంగ పరిషత్‌కు ఎన్నికలు నిర్వహించారు. (ఇందులో రాష్ట్రాలకూ, రాజ సంస్థానాలకూ జనాభా ప్రాతిపదికన ప్రాతినిధ్యం కల్పించారు. రాష్ట్రాల విధాన సభల సభ్యులు ఓటు బదిలీ పద్ధతి ద్వారా తమ ప్రతినిధులను ఎన్నుకున్నారు. రాజ్యాంగ పరిషత్‌లో మొత్తం 389 మంది సభ్యుల్లో బ్రిటిష్ రాష్ట్రాల నుంచి 292 మంది, స్వదేశీ సంస్థానాల నుంచి 93 మంది ప్రాతినిధ్యం వహించారు. (రాజ్యాంగ పరిషత్ చిహ్నం ఐరావతం) 1946: డిసెంబర్ 9న, రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం తాత్కాలిక అధ్యక్షుడు డా॥ సచ్చిదానంద సిన్హా అధ్యక్షతన జరిగింది. 1946: డిసెంబర్ 11న డా॥బాబూ రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ పరిషత్ శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1946: డిసెంబర్ 13న జవహర్లాల్ నెహ్రూ లక్ష్యాలు - తీర్మానం (పీఠిక) అనే తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీన్ని 1947 జనవరి 22న ఆమోదించారు. 1947: ఆగస్ట్ 29న రాజ్యాంగ ముసాయిదా కమిటీని పరిషత్ ఏర్పాటు చేసింది. దీని అధ్యక్షుడు డా॥అధ్యక్షుడితో కలిపి ఈ ముసాయిదా కమిటీలో ఏడుగురు సభ్యులు ఉన్నారు. 1947: జూలై 22న రాజ్యాంగ పరిషత్ జాతీయ పతాకాన్ని ఆమోదించింది. భారతదేశ చరిత్రలో ప్రముఖ యుద్ధాలు యుద్ధం జరిగిన సం॥ వివరాలు సర్హింద్ యుద్ధం 1555 హూమాయూన్ చేతిలో అఫ్ఘన్ల ఓటమి రెండో పానిపట్ యుద్ధం 1556 అక్బర్ చేతిలో హేమూ పరాజయం, మొఘల్ సామ్రాజ్య పరిపాలనకు పునాది రాక్షస తంగడి 1565 విజయనగర సామ్రాజ్య సైన్యం, ముస్లిం (తళ్లికోట, బన్నిహట్టి) సైన్యాల కూటమి చేతిలో ఓటమి హాల్దీఘాట్ యుద్ధం 1576 అక్బర్, రాణా ప్రతాప్‌కు మధ్య భోపాల్ యుద్ధం 1737 పీష్వా మొదటి బాజీరావు చేతిలో నిజాం ఓటమి కర్నాల్ యుద్ధం 1739 నాదిర్షా పూర్తిగా మొఘలుల సైన్యాన్ని ఓడించాడు మొదటి కర్ణాటక యుద్ధం 1745-48 {బిటీష్, ఫ్రెంచి సైన్యాలకు మధ్య జరిగింది రెండో కర్ణాటక యుద్ధం 1749-54 {బిటీషు, ఫ్రెంచి వారి మధ్య జరిగింది మూడో కర్ణాటక యుద్ధం 1756-63 యూరప్‌లో సప్తవర్ష సంగ్రామ ఫలితంగా భారత్‌లో బ్రిటీష్, {ఫెంచి వారి మధ్య ఆధిపత్య పోరు, బ్రిటీషు వారి ఆధిపత్యం ప్లాసీ యుద్ధం 1757 బెంగాల్ నవాబు సిరాజ్ - ఉద్దౌలాకు, క్లైవ్ నాయకత్వంలో బ్రిటీషు సైన్యానికి మధ్య, నవాబు ఓటమి. బ్రిటీషు పరిపాలనకు నాంది బక్సార్ యుద్ధం 1764 బెంగాల్ నవాబు మీర్ ఖాసీం, అవధ్ నవాబు షుజా - ఉద్దౌలా, మొఘల్ చక్రవర్తి రెండో షా అలమ్ల మిత్ర సైన్యం కూటమి, మేజర్ మన్రో నాయకత్వంలోని ఆంగ్ల సైన్యం చేతిలో ఓటమి జాబ్స్ అలర్ట్స సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) సైంటిస్ట్‌ల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది. సైంటిస్ట్/ ఇంజనీర్ (ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్) అర్హతలు: ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో 65 శాతం మార్కులతో బీఈ/ బీటెక్ ఉండాలి. సైంటిస్ట్/ ఇంజనీర్ (ఇండస్ట్రియల్ సేఫ్టీ) అర్హతలు: ఇండస్ట్రియల్ సేఫ్టీలో 60 శాతం మార్కులతో ఎంఈ/ ఎంటెక్ (ఎమ్మెస్సీ ఇంజనీరింగ్) ఉండాలి. వయసు: 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: ఆగస్టు 21 వెబ్సైట్: www.shar.gov.in -
సివిల్స్ మెయిన్స్ జనరల్ స్టడీస్ పేపర్-3ఎలా పిపేరవ్వాలి?
కాంపిటీటివ్ కౌన్సెలింగ్: సివిల్స్ మెయిన్స్ జనరల్ స్టడీస్ పేపర్-3లో సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాన్ని ఏవిధంగా ప్రిపేరవ్వాలి? - టి. నాగమణి, అల్వాల్. జనరల్ స్టడీస్ పేపర్-3లో ఎకనమిక్ డెవలప్మెంట్, టెక్నాలజీ, బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంట్, సెక్యూరిటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే అంశాలున్నాయి. వీటి నుంచి 25 ప్రశ్నలు అడుగుతున్నారు. సివిల్స్ 2013లో ఎకానమీ నుంచి 12 ప్రశ్నలు ఇవ్వగా, మిగిలిన అంశాల నుంచి 13 ప్రశ్నలు ఇచ్చారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, బయోడైవర్సిటీ, సెక్యూరిటీ, మేధో సంపత్తి హక్కులు, డిజాస్టర్ మేనేజ్మెంట్లో ప్రశ్నలన్నీ దాదాపు సమకాలీన అంశాలపైనే ఉండటం గమనార్హం. మేధో సంపత్తి హక్కులు అనే అంశంలో 1970 నాటి భారత పేటెంట్ చట్టానికి 2005లో జరిగిన సవరణలకు కారణాలు అడుగుతూనే.. నోవార్టిస్ ఫైల్ చేసిన పేటెంట్స్‌ను తిరస్కరించడంలో సుప్రీంకోర్టు ఈ సవరణను ఎలా ఉపయోగించుకుందో వివరించమని ఇచ్చారు. డిజిటల్ సిగ్నేచర్, 3డీ ప్రింటింగ్ టెక్నాలజీ, క్రికెట్లో అంపైర్ డెసిషన్ రివ్యూ సిస్టమ్ మొదలైన వాటిని వివరించమని ప్రశ్నలు అడిగారు. సిలబస్‌లోని ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్లో భాగంగా అక్రమ మైనింగ్ అంటే ఏమిటి? అనే ప్రశ్న అడిగారు. సమకాలీన అంశాల్లో మరొకటి సోషల్ నెట్వర్కింగ్ సైట్లు. వీటి ద్వారా భద్రత ఏవిధంగా ప్రభావితమవుతుందో వివరించమని అడిగారు. సైబర్ సెక్యూరిటీలో భాగంగా.. సైబర్ వార్ఫేర్ అనేది ఉగ్రవాదం కంటే ఏవిధంగా తీవ్రమైంది? భారత్ ఏవిధంగా దాని ప్రభావానికి గురవుతోంది? భారత్‌లో ఈ అంశానికి చెందిన సంసిద్ధత ఎలా ఉంది? అని అడిగారు. ఇలా అన్ని ప్రశ్నలు దాదాపుగా సమకాలీన అంశాలతో ముడిపడి ఉన్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ కింద ఇచ్చిన రెండు ప్రశ్నలు వైద్య రంగానికి సంబంధించినవి. ఆ రెండు ప్రశ్నలు ఇన్‌డెప్త్‌గా, వైద్య రంగంలో అసాధారణమైన పట్టు ఉన్నవారు తప్ప మిగిలినవారు సమాధానం రాయలేనివిధంగా ఉన్నాయి. ప్రశ్నలన్నీ సమకాలీన సమస్యలపై అప్లికేషన్ ఓరియంటెడ్ విధానంలో ఉంటున్నాయి. దీన్ని ఆహ్వానించదగ్గ పరిణామంగా గుర్తించాలి. అభ్యర్థి సమగ్ర ఆలోచనా విధానాన్ని, వ్యక్తిత్వాన్ని అంచనా వేసేలా ప్రశ్నల కూర్పు ఉంది. కాబట్టి అభ్యర్థులు ఒక అంశానికి సంబంధించిన ప్రాథమిక భావనలతోపాటు దానితో ముడిపడి ఉన్న వర్తమాన అంశాలన్నింటిపై అవగాహన పెంచుకోవాలి. దీనికోసం విస్తృతంగా అధ్యయనం చేయాలి. దినపత్రికల్లో వచ్చే విశ్లేషకుల ఆర్టికల్స్‌ను తప్పనిసరిగా చదవాలి. ఇన్పుట్స్: సి.హరికృష్ణ, సివిల్స్ సీనియర్ ఫ్యాకల్టీ జనరల్ నాలెడ్జ్ అంతర్జాతీయ సంస్థలు ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్(ఇంటర్‌పోల్) ప్రధాన కార్యాలయం: లయోన్స (ఫ్రాన్స) ఏర్పాటైన సంవత్సరం: 1923, సభ్యదేశాల సంఖ్య: 184 లక్ష్యం: సభ్య దేశాల్లోని పోలీసు వ్యవస్థలతో కలిసి సమన్వయంతో పనిచేయడం అంతర్జాతీయ అణుశక్తి సంస్థ(IAEA) ప్రధాన కార్యాలయం: వియన్నా (ఆస్ట్రియా) ఏర్పాటైన సంవత్సరం: 1957. సభ్యదేశాల సంఖ్య: 138 లక్ష్యం: అణుశక్తిని శాంతియుత ప్రయోజనాల కోసం ఉపయోగించేలా చేయడం. అమెరికా మాజీ అధ్యక్షుడు ఐసన్ హోవర్ సూచనల మేరకు ఈ సంస్థ ఏర్పాటైంది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధానికి సమర్థంగా కృషి చేసినందుకు 2005లో ఈ సంస్థకు, అధ్యక్షుడికి(ఎల్బరాది) నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ది రెడ్‌క్రాస్ (ICRC) ప్రధాన కార్యాలయం : జెనీవా (స్విట్జర్లాండ్) ఏర్పాటైన సంవత్సరం: 1864 లక్ష్యాలు: - రెడ్‌క్రాస్ సంస్థను స్విట్జర్లాండ్‌కు చెందిన హెన్రీ డ్యూ నాంట్ ప్రారంభించాడు. ఇది అంతర్జాతీయ వైద్యసంస్థ. ప్రకృతి వైపరీత్యాలు, అంతర్యుద్ధాలు సంభవించినప్పుడు బాధితులకు ఉచితంగా, స్వచ్ఛందంగా వైద్య సేవలు అందింస్తుంది. రెడ్‌క్రాస్ సంస్థ చేసిన కృషికిగానూ మూడుసార్లు నోబెల్ శాంతి బహుమతి లభించింది. రెడ్‌క్రాస్ సంస్థను ‘హ్యూమానిటేరియన్ లా కమిషన్’గా కూడా పిలుస్తారు. - 'Charity in war’ అనేది ఈ సంస్థ నినాదం. అంతరిక్ష శాస్త్ర విజ్ఞానంలో భారతదేశం ప్రాజెక్టు/ఉపగ్రహం: ఎరైస్ (ARISE) అగ్రికల్చరల్ రిసోర్సెస్ ఇన్వెంటరీ అండ్ సర్వే ఎక్స్పెరిమెంట్, సంవత్సరం: 1974 వివరాలు: ISRO, ICAR (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ) ఉమ్మడి ప్రాజెక్టు అనంతపురం(ఆంధ్రప్రదేశ్), పాటియాలా జిల్లా (పంజాబ్)లో పంటల, భూమి తీరుతెన్నులను పరిశీలించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం ప్రాజెక్టు/ఉపగ్రహం: ఆర్యభట్ట, సంవత్సరం: 1975 వివరాలు: ఒ భారతదేశ మొట్టమొదటి ఉపగ్రహం ఒ పూర్తిగా భారతీయ శాస్త్రవేత్తల రూపకల్పన బెంగళూరు సమీపంలో ఇస్రో ఉపగ్రహ కేంద్రంలోనే నిర్మాణం జరిగింది. రష్యా రాకెట్ ద్వారా ప్రయోగించారు. ప్రాజెక్టు/ఉపగ్రహం: స్టెప్ (STEP) (శాటిలైట్ టెలి కమ్యూనికేషన్ ఎక్స్పెరిమెంట్ ప్రాజెక్టు), సంవత్సరం: 1977 వివరాలు: ఇస్రో, తంతితపాల శాఖల సంయుక్త ప్రాజెక్టు జియో స్టేషనరీ ఉపగ్రహాల ద్వారా సమాచార వ్యవస్థను అభివృద్ధిపర్చడం ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యం -
ఆర్బీఐ అసిస్టెంట్స్ పరీక్షలో రీజనింగ్ నుంచి ఏ ప్రశ్నలు..?
కాంపిటీటివ్ కౌన్సెలింగ్ : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అసిస్టెంట్స్ పరీక్షలో రీజనింగ్ నుంచి ఎలాంటి ప్రశ్నలు వస్తాయి? - ఏల్చూరి ప్రవళిక, ఉప్పుగూడ బ్యాంక్ పరీక్షల్లో రీజనింగ్‌కు అధిక ప్రాముఖ్యం ఉంది. అభ్యర్థి ఆలోచన సామర్థ్యాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు అడుగు తారు. గ్రూప్ ప్రశ్నలను రీజనింగ్ నుంచి ఎక్కువగా ఇస్తారు. ఇందులో ముఖ్యంగా సీటింగ్ అరేంజ్మెంట్, లాజికల్ స్టేట్ మెంట్స్ అండ్ కన్‌క్లూజన్స్, బ్లడ్ రిలేషన్స్, ఇన్ ఈక్వాలిటీస్, డేటా సఫీషియన్సీ, ఎనలిటికల్ రీజనింగ్, ఆల్ఫాబెట్స్‌కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. స్టేట్మెంట్స్ అండ్ కన్‌క్లూజన్స్ నుంచి ఐదు మార్కులకు ప్రశ్నలు వస్తాయి. వీటికి సమాధానం గుర్తించాలంటే అభ్యర్థి కచ్చితమైన కన్క్లూజన్లు, పాసిబిలిటీల మధ్య వ్యత్యాసాలను గమనించాలి. సమాధానంలో ఏ మాత్రం తేడా అనిపించినా అది పాసిబిలిటీగాను, కచ్చిత మైన సమాధానం వస్తే అది కన్క్లూజన్గానూ పరిగణించాలి. బ్లడ్ రిలేషన్స్ నుంచి ఎక్కువ మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది. వీటిపై రెండు నుంచి ఐదు మార్కులకు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. దీంట్లో ఎక్కువగా ఆపరేషన్స్‌కు సంబంధించిన ప్రశ్నలను అభ్యర్థులు సాధన చేయాలి. సీటింగ్ అరేంజ్‌మెంట్‌కు సంబంధించి ఇటీవల నిర్వహించిన బ్యాంక్ పరీక్షలలో 10 నుంచి 15 మార్కులకు ప్రశ్నలు అడిగారు. సీటింగ్ అరేంజ్మెంట్ ప్రశ్నల్లో.. వ్యక్తులందరూ ఒకే వైపు ముఖం ఉండేవిధంగా కూర్చొని ఉన్నవి; కొంతమంది వెలుపలి వైపు, మరికొంతమంది లోపలి వైపు కూర్చొని ఉండే ప్రశ్నలు ఇలా రకరకాలుగా అడుగుతున్నారు. వీటిని జాగ్రత్తగా చేయాలి. వీటిని సాధించడంలో చిన్న పొరపాటు చేసినా, దానికి సంబంధించిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తప్పుగా గుర్తించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ విధమైన ప్రశ్నలను ఎక్కువగా సాధన చేయాలి. ఇన్‌ఈక్వాలిటీస్ నుంచి ఐదు మార్కులకు ప్రశ్నలు రావచ్చు. నంబర్ సిరీస్ నుంచి గతంతో పోలిస్తే మరింత క్లిష్టమైన ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ విభాగం నుంచి ఐదు మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. నాన్ వెర్బల్‌కు సంబంధించిన ప్రశ్నలను అడగడం లేదు. అయితే వీటిపై కొంతైనా అవగాహన ఉండటం ప్రయోజనకరం. - ఇన్పుట్స్: ఇ.సంతోష్ రెడ్డి, సీనియర్ ఫ్యాకల్టీ -
ఆన్లైన్ విధానంలో ఎస్బీఐ క్లర్క్స్ ఎగ్జామినేషన్
నేను ఎస్బీఐ క్లర్క్స్ ఎగ్జామినేషన్ రాయబోతున్నాను. ఆన్లైన్ విధానంలో పరీక్ష ఎదుర్కోవడం ఇదే తొలిసారి. తగిన సూచనలివ్వండి. - బి.శ్రీలత, మియాపూర్ కాంపిటీటివ్ కౌన్సెలింగ్ : పరీక్షా కేంద్రంలో అభ్యర్థులు తమ యూజర్ ఐడీ, పాస్వర్డలను ఉపయోగించి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. వీటిని పరీక్ష ప్రారంభానికి ముందే అభ్యర్థులకు తెలియ జేస్తారు. లాగిన్ అయిన వెంటనే కంప్యూటర్ స్క్రీన్‌పై పరీక్షకు సంబంధించిన సూచనలు కనిపిస్తాయి. వాటిని జాగ్రత్తగా చదవాలి. ‘ఐ యామ్ రెడీ’ అనే బటన్‌పై క్లిక్ చేయగానే ప్రశ్నాపత్రం వస్తుంది. అప్పటి నుంచి నిర్ణీత పరీక్షా సమయం ప్రారంభమవుతుంది. స్క్రీ న్పై సమయం కనిపిస్తూ ఉంటుంది. దాన్ని గమనిస్తూ అభ్యర్థులు ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ప్రతి ప్రశ్నకు 5 ఆప్షన్లుంటాయి. స్క్రీన్‌పై ఒకసారి ఒకే ప్రశ్న కనిపిస్తుంది. - సరైన సమాధానంగా భావించిన ఆప్షన్ైపై అభ్యర్థి మౌస్తో క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఆ ఆప్షన్ ప్రముఖంగా కనిపిస్తుంది. సమాధానాన్ని గుర్తించిన తర్వాత అభ్యర్థి ‘సేవ్ అండ్ నెక్ట్స్’ బటన్‌పై క్లిక్ చేయాలి. అప్పుడు క్లిక్ చేసిన సమాధానం సేవ్ అయి, స్క్రీన్‌పై తర్వాతి ప్రశ్న వస్తుంది. ఏదైనా ప్రశ్నను వదిలేయాలంటే ఆ ప్రశ్నకు సంబంధించిన ఏ ఆప్షన్పైనా క్లిక్ చేయకూడదు. కచ్చితమైన నిర్ధారణకు రాని సందర్భాల్లో ‘రివ్యూ లేటర్’ బటన్‌ను ఉపయోగించి పరీక్ష చివర్లో సమయం లభిస్తే సమాధానాన్ని మార్చుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. రివ్యూ కోసం పెట్టుకున్న ప్రశ్నలకు ఒకవేళ సమాధానాన్ని మార్చ లేకపోతే మూల్యాంకనంలో ముందు గుర్తించిన జవాబునే పరిగణనలోకి తీసుకుంటారు. - సమాధానాలను గుర్తించిన, గుర్తించని ప్రశ్నలు వాటి వరుస సంఖ్యల ఆధారంగా స్క్రీన్‌పై కుడిచేతి వైపున కనిపిస్తాయి. ప్రతి ప్రశ్నకు నిర్ధారితరంగు ఉంటుంది. తెలుపు రంగు - నాట్ విజిటెడ్ (అసలు చూడకుండా వదిలేసిన ప్రశ్న) ఎరుపు రంగు - నాట్ ఆన్సర్‌డ (ప్రశ్నను చూసినప్పటికీ సమాధానం గుర్తించలేదు) ఆకుపచ్చ రంగు - ఆన్సర్‌డ (సమాధానం కచ్చితంగా గుర్తించింది) ఊదా రంగు (గజీౌ్ఛ్ట) - మార్కడ్ ఫర్ రివ్యూ లేటర్ (అన్ని ప్రశ్నలను గుర్తించిన తర్వాత మిగిలిన సమయంలో వీటికి సమాధానాలు గుర్తించవచ్చు.) - ఆన్లైన్ విధానంలో ఒక విభాగం నుంచి మరో విభాగానికి, ఒక ప్రశ్న నుంచి మరో ప్రశ్నకి సులభంగా వెళ్లగలిగే అవకాశం ఉంటుంది. వేగంగా, తేలికగా చేయగలిగే విభాగానికి సంబంధించిన ప్రశ్నలను ముందుగా ఎంచుకోవడం ఉత్తమం. చాలామంది అభ్యర్థులు జనరల్ అవేర్నెస్, ఇంగ్లిష్ లాంటి విభాగాలకు ముందుగా జవాబులను గుర్తించి, రీజనింగ్, అరిథ్‌మెటిక్ లాంటి టాపిక్‌లకు చెందిన ప్రశ్నలను చివర్లో తీసుకుంటారు. - {పశ్న పత్రం మొత్తాన్ని మౌస్‌తోనే సాల్వ్ చేయాలి. కీబోర్డ ఉపయోగం ఉండదు. రఫ్ వర్క్ చేసుకోవడానికి పరీక్షా కేంద్రంలో పేపర్లను అందజేస్తారు. నిర్ణీత సమయం పూర్తవగానే సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేస్తే పరీక్ష పూర్తవుతుంది. - ఎన్. విజయేందర్ రెడ్డి బ్యాంకింగ్ పరీక్షల శిక్షణా నిపుణులు ఎడ్యూ న్యూస్ ఎడెక్స్ ద్వారా కోర్సులందించనున్న భారత విద్యా సంస్థలు మనదేశంలో ఎన్నో ప్రముఖ విద్యాసంస్థలు నిపుణులైన ఫ్యాకల్టీ కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో తెర మీదకొచ్చిందే ఎడెక్స్. ఇది ఒక ఆన్లైన్ కోర్సులు అందించే ఓపెన్ ఎడ్యుకేషన్ ఫ్లాట్‌ఫాం. ఎడెక్స్.. ప్రపంచస్థాయి యూనివర్సిటీలతో ఒప్పందాల ద్వారా ఆన్లైన్లో వివిధ కోర్సులు అందిస్తోంది. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా అనుభవజ్ఞులైన నిపుణులైన ఫ్యాకల్టీ లభిస్తారు. ఆన్లైన్ ద్వారా వారి పాఠాలను మనం చూడొచ్చు, వినొచ్చు. మనదేశానికి చెందిన ప్రముఖ సంస్థలు కూడా ఎడెక్స్‌తో చేతులు కలిపాయి. అవి.. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ)- బెంగళూరు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)- బాంబే, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) - పిలానీ. రాబోయే సంవత్సరాల్లో ఐఐఐటీ - బెంగళూరు.. ఎడెక్స్ ద్వారా డిగ్రీ కోర్సులను ఆఫర్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. వచ్చే రెండేళ్లలో మొత్తం 12 కోర్సులను అందిస్తారు. మరో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ బిట్స్ పిలానీ కూడా ఎడెక్స్ ద్వారా ఆన్లైన్ కోర్సులను ఆఫర్ చేయనుంది. టెక్నాలజీ, సైన్స్ మొదలైన సబ్జెక్టుల్లో కోర్సులను అభ్యసించవచ్చు. ఈ కోర్సుల ద్వారా విద్యార్థులు సంబంధిత సబ్జెక్టుల్లో అడ్వాన్స్డ్ నాలెడ్జ్ పొందొచ్చు. ఎడెక్స్ ద్వారా పది ఆన్ క్యాంపస్ కోర్సులు అందించడానికి బిట్స్ పిలానీ రూ. 2 కోట్లు పెట్టుబడి పెట్టింది. వచ్చే మూడేళ్లలో మరో 60 కోర్సులను ఆఫర్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. మరిన్ని వివరాలకు www.edx.org చూడొచ్చు. ఐఐటీ - బాంబే, వాషింగ్టన్ యూనివర్సిటీల.. ఈ-ఎంబీఏ ప్రోగ్రామ్ ప్రతిష్టాత్మక విద్యా సంస్థ.. ఐఐటీ-బాంబే, యూఎస్‌లోని వాషింగ్టన్ యూనివర్సిటీ-సెయింట్ లూయిస్ కలిసి ఎగ్జిక్యూటివ్ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఈ-ఎంబీఏ) కోర్సును అందించనున్నాయి. 2015 ప్రారంభంలో ఈ కోర్సు ప్రారంభమవుతుంది. ఈ కోర్సు వ్యవధి 18 నెలలు. కోర్సు ఫీజు 55000 యూఎస్ డాలర్ల నుంచి 60000 యూఎస్ డాలర్ల వరకు ఉంటుంది. క్లాసులు ఐఐటీ - బాంబేలో ఉంటాయి. రెండు దేశాలకు చెందిన ఫ్యాకల్టీ పాఠాలు బోధిస్తారు. కోర్సు పూర్తయ్యాక జాయింట్ డిగ్రీ అందిస్తారు. నిఫ్ట్‌లో ‘కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్’ దరఖాస్తులకు చివరి తేది జూలై 31 ఫ్యాషన్ అంటే ఆసక్తి.. డిజైనింగ్ రంగంలో కొంత అనుభవం ఉన్న ఔత్సాహికులకు హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్) కోర్సులను ఆఫర్ చేస్తోంది. ‘కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్’లో భాగంగా ఏడాది, ఆరు నెలలు, 3 నెలల కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఏడాది కోర్సులు కాంటెంపరరీ టెక్స్టైల్స్ ఫర్ ఇంటీరియర్ స్పేసెస్, కాంటెంపరరీ ఎథ్నిక్ వేర్, ఫ్యాషన్, క్లాతింగ్ టెక్నాలజీ, ఇండియన్ ఫ్యాషన్ అప్పెరల్, బొటిక్ మేనేజ్మెంట్, టెక్స్టైల్ డిజైన్, అప్పెరల్ క్లాతింగ్. ప్రతి విభాగానికి 30 సీట్లు. ఫీజు రూ.60వేల నుంచి రూ.75 వేలు. ఆరు నెలల కోర్సులు అప్పెరల్ డిజైన్, డెవలప్మెంట్(మహిళలకు మాత్రమే) సీట్లు 30, ఫీజు రూ.35,000 మూడు నెలల కోర్సులు గార్మెంట్ ప్రొడక్షన్ టెక్నాలజీ, ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఇన్ ఉమెన్ వేర్, సిక్స్ సిగ్మా-బ్లాక్ బెల్ట్ సర్టిఫికేషన్. ఒక్కో విభాగంలో 30 సీట్లు, ఫీజు రూ.30,000 అర్హత: 10+2, 10+2+డిప్లొమా. దరఖాస్తుకు చివరి తేది: జూలై 31 వివరాలకు: 040-23110841, 23110630 వెబ్సైట్: www.nift.ac.in నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్టీపీసీ) ఉత్తరప్రదేశ్‌లోని రియాండ్ థర్మల్ పవర్ ప్రాజెక్టులో ఆర్టిసన్ ట్రెయినీ, ల్యాబ్ అసిస్టెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆర్టిసన్ ట్రెయినీ: 129 విభాగాలు: ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ అర్హతలు: సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉండాలి. వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ల్యాబ్ అసిస్టెంట్ ట్రెయినీ: 14 అర్హతలు: బీఎస్సీ (కెమిస్ట్రీ) ఉత్తీర్ణులై ఉండాలి. వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్వూ ద్వారా. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: ఆగస్టు 11 వెబ్సైట్: http://ntpcrihand.co.in ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. కోర్సు: డిప్లొమా కోర్స్ ఇన్ జర్నలిజమ్ (ఉర్దూ) సీట్ల సంఖ్య: 25 అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఉర్దూలో పరిజ్ఞానం ఉండాలి. ఎంపిక: ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: ఆగస్టు 8 వెబ్సైట్: www.iimc.gov.in -
సివిల్స్ మెయిన్స్‌లో ఇంగ్లిష్ ప్రాధాన్యం ఎంతమేరకు?
సివిల్స్ మెయిన్స్‌లో ఇంగ్లిష్ ప్రాధాన్యం ఎంతమేరకు ఉంటుందో తెలపండి? - ప్రవళిక, ఫిల్మ్‌నగర్ కాంపిటీటివ్ కౌన్సెలింగ్ : మారిన సివిల్స్ మెయిన్స్ పరీక్షల్లో ఇంగ్లిష్ ప్రాధాన్యం ఎంతో ఉంది. చాలామంది అభ్యర్థులకు సబ్జెక్ట్‌పై అవగాహన ఉన్నా ఇంగ్లిష్ రాకపోవడం వల్ల మార్కులు సాధించలేకపోతున్నారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశానికి చెందిన విద్యార్థులు ఈ అంశంలో వెనుకంజలో ఉంటున్నారు. ఉత్తర భారతదేశానికి చెందిన అభ్యర్థులకు హిందీలో లేదంటే ఇంగ్లిష్‌లో మంచి పట్టు ఉంటుంది. కాబట్టి చక్కటి ఇంగ్లిష్ రావడానికి రోజూ హిందూ దినపత్రికను చదవడంతోపాటు లోక్‌సభ, రాజ్యసభ, బీబీసీ, ఎన్డీటీవీ వంటి న్యూస్ చానెళ్లను రోజూ అరగంట సేపైనా చూడాలి. ఆల్ ఇండియా రేడియోను కూడా వినొచ్చు. వీటిల్లో మంచి ఉచ్ఛారణతో కూడిన ఇంగ్లిష్ ఉంటుంది. అంతేకాకుండా వివిధ అంశాలు చర్చకు వస్తుంటాయి. ప్రిపరేషన్ కోణంలోనూ ఉపయుక్తంగా ఉంటుంది. సివిల్స్ మెయిన్స్‌లో పాపులర్ ఆప్షన్స్ ఏవి? - భువన, సనత్‌నగర్ మెయిన్స్ పరీక్షల్లో ఆప్షనల్లో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 250 మార్కులుంటాయి. ఒక్కో పేపర్ పరీక్ష వ్యవధి మూడు గంటలు. జాతీయస్థాయిలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ బాగా పాపులర్ అని చెప్పొచ్చు. ఇవేకాకుండా హిస్టరీ, జాగ్రఫీ, సోషియాలజీ, సైకాలజీ, ఆంత్రోపాలజీ వంటి సబ్జెక్టులను ఎక్కువమంది విద్యార్థులు ఎంచుకుంటున్నారు. కోచింగ్ సదుపాయం అందుబాటులో ఉండటంతోపాటు కొన్ని సబ్జెక్టుల సిలబస్ తక్కువ ఉండటం ఇందుకు కారణంగా చెప్పొచ్చు. ఆయా రాష్ట్రాల విద్యార్థులు తమ మాతృభాషల సాహిత్యాన్ని ఎంచుకుని కూడా పరీక్షలు రాస్తున్నారు. మన రాష్ట్ర విద్యార్థులు తెలుగు సాహిత్యాన్ని ఎంచుకుంటున్నారు. ఆప్షనల్లో అత్యధిక మార్కులు సాధించాలంటే అన్ని అంశాలపై పట్టుండాలి. మారిన విధానంలో చాయిస్ కూడా చాలా తక్కువ ఉంది. దాదాపు అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. ప్రతి ప్రశ్న లో అనేక ఉప ప్రశ్నలు ఉంటున్నాయి. ప్రశ్నలు పరోక్షంగా ఉంటున్నాయి. థియరీ కంటే కూడా అప్లికేషన్ ఓరియెంటేషన్‌కు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. సమకాలీన అంశాలు, సమస్యలపై ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి అభ్యర్థులు విశ్లేషణాత్మకంగా, కూలంకషంగా అధ్యయనం చేయాలి. ఇన్పుట్స్: డా.జె.బి.కృపాదానం, సీనియర్ సివిల్స్ ఫ్యాకల్టీ, హైదరాబాద్ సివిల్స్ 2013 ప్రిలిమ్స్ కరెంట్ అఫైర్స్, జీకేలో ఎలాంటి ప్రశ్నలు వచ్చాయో విశ్లేషణ ఇవ్వండి? - కె.రమేశ్, మెహదీపట్నం సివిల్స్-2013 ప్రిలిమ్స్‌లో కరెంటు అఫైర్స్, స్టాండర్డ్ జీకేలకు ప్రాధాన్యం బాగా తగ్గింది. ఈ విభాగాల నుంచి ఒకట్రెండు ప్రశ్నలు మాత్రమే వచ్చాయి. మొత్తంమీద చూస్తే పేపర్-1 గతంతో పోలిస్తే తేలిగ్గా ఉంది. పేపర్-2 (ఆప్టిట్యూడ్ టెస్ట్)లో రీడింగ్ కాంప్రెహెన్షన్ పరిధిని తగ్గించి బేసిక్ న్యూమరసీ విభాగం నుంచి ప్రశ్నల సంఖ్యను పెంచారు. మొత్తంగా ఈ పేపర్ మధ్యస్తంగా ఉందని చెప్పొచ్చు. పేపర్-1లో 100 ప్రశ్నలు, 200 మార్కులకు ఇచ్చారు. అలాగే పేపర్-1లో హిస్టరీ నుంచి 15 ప్రశ్నలు, పాలిటీ 19, జాగ్రఫీ, ఎకాలజీల నుంచి 27, సైన్స్ 21, ఎకానమీ నుంచి 18 ప్రశ్నలు వచ్చాయి. సివిల్స్ 2013 ప్రిలిమ్స్ పేపర్ 1లో సైన్స్ నుంచి ఎలాంటి ప్రశ్నలు వచ్చాయో తెలపండి? - పి.సుదర్శన్, ఉస్మానియా యూనివర్సిటీ ఫిజిక్స్‌కు సంబంధించిన ప్రశ్నలు తేలిగ్గా సమాధానాలు గుర్తించేవిగా ఉన్నాయి. ప్రాథమిక అంశాలపైన ఎక్కువగా అడిగారు. ఫ్రిక్షన్, ఆప్టికల్ ఇల్యూజన్, రెయిన్బో తదితర అంశాలపై ప్రశ్నలు వచ్చాయి. సమకాలీన అంశమైన హిగ్స్ బోసన్ పార్టికల్పై ప్రశ్న వచ్చింది. ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షలకు సిద్ధమవుతున్న వారు సైతం గుర్తించగలిగేలా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. Ex: Ball bearings are used in bicycles, cars, etc., because a) the actual area of contact between the wheel and axle is increased b) the effective area of contact between wheel and axle is decreased c) the effective area of contact between the wheel and axle is increased d) None of the above statements is correct జవాబు: c సైన్స్ అండ్ టెక్నాలజీ, కెమిస్ట్రీకి సంబంధించి ప్రశ్నలు దాదాపు కనుమరుగయ్యాయి. బయాలజీ విభాగం నుంచి ప్రశ్నలు కఠినంగా వచ్చాయి. కాన్సెప్ట్లపై పట్టున్న వారు మాత్రమే సమాధానాలు గుర్తించగలిగేలా ఉన్నాయి. - ఇన్పుట్స్: ఆకేపాటి శ్రీనివాసులురెడ్డి, సి.హరికృష్ణ, సి.హెచ్.మోహన్, సీనియర్ ఫ్యాకల్టీ -
అడ్మిషన్స్ అలర్ట్స్, కాంపిటీటివ్ కౌన్సెలింగ్
సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్-న్యూఢిల్లీ, కోర్సు: పీహెచ్డీ ప్రోగ్రామ్; విభాగం: ఎడ్యుకేషన్ వ్యవధి: మూడు నుంచి నాలుగేళ్లు; అర్హతలు: ఎడ్యుకేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ లేదా ఎంఎడ్/ఎంఫిల్ ఉండాలి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జూలై 4; వెబ్సైట్: http//cie.du.ac.in ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మేనేజ్మెంట్ కోర్సు: మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్; వ్యవధి: ఏడాది; అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు సంబంధిత విభాగంలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. జీఆర్ఈ/జీమ్యాట్‌లో అర్హత సాధించాలి; ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: ఆగస్టు 15; వెబ్సైట్: http://mph.iihmr.org/ టాటా మెమోరియల్ సెంటర్-ముంబై కోర్సు: ఎమ్మెస్సీ ఇన్ క్లినికల్ రీసెర్చ్; అర్హతలు: బయోసెన్సైస్/ లైఫ్ సెన్సైస్/ కెమిస్ట్రీ/ క్లినికల్ న్యూట్రిషన్/ఫార్మసీ/ఫార్మాస్యూటికల్ సెన్సైస్/ మెడిసిన్/ డెంటిస్ట్రీ/ అక్యుపేషనల్ థెరపీ/ ఫిజియోథెరపీ/ నర్సింగ్‌లో 50 శాతం మార్కులతో బీఎస్సీ ఉండాలి; వయసు: 30 ఏళ్లకు మించకూడదు. దరఖాస్తులకు చివరి తేది: జూలై 15; వెబ్సైట్: https://tmc.gov.in/ ఎన్డీఏ-ఎన్ఏ ఎగ్జామ్‌ను ఎవరు నిర్వహిస్తారు? దీని ద్వారా ఏయే ఉద్యోగాలు లభిస్తాయి? అర్హతలు, ఎంపిక విధానం తెలపండి? - సమీహ, జూబ్లీహిల్స్ త్రివిధ దళాలు (భారత సైన్యం, భారత వాయుసేన, భారత నౌకాదళం)లో ఆఫీసర్ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ప్రతి ఏటా నేషనల్ డిఫెన్స్ అకాడెమీ అండ్ నేవల్ అకాడెమీ (ఎన్డీఏ అండ్ ఎన్ఏ) పరీక్షను రెండుసార్లు నిర్వహిస్తోంది. ప్రస్తుతం ప్రకటన విడుదలైంది. ఈ ఏడాది పరీక్షను సెప్టెంబర్ 28న నిర్వహించనున్నారు. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ జూలై 21. పోస్టులు : మొత్తం 375 అర్హత : ఆర్మీ (ఎన్డీఏ): సబ్జెక్టులతో 10+2 ఉత్తీర్ణత. ఎయిర్‌ఫోర్స్, నేవీ (ఎన్డీఏ); 10+2 కేడెట్ ఎంట్రీ స్కీమ్ (ఇండియన్ నేవల్ అకాడమీ): ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో 10+2 ఉత్తీర్ణత. అవివాహితులైన పురుషులు మాత్రమే అర్హులు. నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి. వయోపరిమితి : జనవరి 2, 1996 - జనవరి 1, 1999 మధ్య జన్మించి ఉండాలి. ఎంపిక : రాత పరీక్ష, సర్వీస్ సెలెక్షన్ బోర్డ్ ఇంటర్వ్యూ. పరీక్ష విధానం : పరీక్షలో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. అవి.. 1. మ్యాథమెటిక్స్ (300 మార్కులు), జనరల్ ఎబిలిటీ టెస్ట్ (600 మార్కులు). ప్రతి పేపర్ పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. తప్పుగా గుర్తించిన సమాధానాలకు నెగెటివ్ మార్కులు (ప్రతి తప్పు సమాధానానికి 0.33 మార్కుల కోత) ఉంటాయి. మ్యాథమెటిక్స్ : ఇందులో ఆల్జీబ్రా, మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్, ట్రిగ్నామెట్రీ, ఎనలిటికల్ జామెట్రీ , డిఫరెన్షియల్ కాలిక్యులస్, ఇంటిగ్రల్ కాలిక్యులస్ అండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, వెక్టార్ ఆల్జీబ్రా, స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీలపై ప్రశ్నలుంటాయి. జనరల్ ఎబిలిటీ టెస్ట్ : దీనికి 600 మార్కులు కేటాయించారు. జనరల్ ఎబిలిటీ టెస్ట్‌లో భాగంగా జనరల్ ఇంగ్లిష్ (200 మార్కులు), జనరల్ నాలెడ్జ్ (400) ఉంటాయి. ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ : రాతపరీక్ష ఉత్తీర్ణులకు ఇంటర్వ్యూ ఉంటుంది. దీనికి 900 మార్కులు కేటాయించారు. ఇంటర్వ్యూ రెండు దశలుగా ఉంటుంది. ఎయిర్‌ఫోర్స్ అభ్యర్థులకు పైలట్ ఆప్టిట్యూడ్ బ్యాటరీ టెస్ట్ (పీఏబీటీ) నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలో విజేతలుగా నిలిచినవారిని శిక్షణకు ఎంపిక చేస్తారు. మూడేళ్లపాటు నేషనల్ డిఫెన్స్ అకాడెమీ-పుణెలో శిక్షణ ఉంటుంది. నేవల్ అకాడెమీ (10+2 కేటెడ్ ఎంట్రీ స్కీమ్)కి ఎంపికైనవారికి నాలుగేళ్లపాటు ఇండియన్ నేవల్ అకాడమీ- ఎజిమల (కేరళ)లో శిక్షణ ఉంటుంది. తర్వాత బీటెక్ డిగ్రీని అందిస్తారు. శిక్షణలో నెలకు రూ.21,000 స్టైఫండ్‌గా అందిస్తారు. శిక్షణ పూర్తిచేసుకున్నవారిని త్రివిధ దళాల్లో వివిధ హోదాల్లో నియమిస్తారు. రిఫరెన్స బుక్స్: నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ - ఆర్.గుప్తా మ్యాథమెటిక్స్ ఫర్ ఎన్డీఏ అండ్ ఎన్ఏ - ఎస్ఎల్ గులాటి ఎన్డీఏ-ఎన్ఏ సాల్వ్డ్ పేపర్స్ - దిశ పబ్లికేషన్స్ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్: ఎన్సీఈఆర్టీ ఆరు నుంచి 12 వతరగతి సైన్స్, సోషల్ పాఠ్యపుస్తకాలు ఇంగ్లిష్: రెన్ అండ్ మార్టిన్ గ్రామర్ మన రాష్ట్రంలో పరీక్ష కేంద్రం: హైదరాబాద్ వెబ్సైట్:www.upsconline.nic.in