సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్-న్యూఢిల్లీ,
కోర్సు: పీహెచ్‌డీ ప్రోగ్రామ్; విభాగం: ఎడ్యుకేషన్
వ్యవధి: మూడు నుంచి నాలుగేళ్లు; అర్హతలు: ఎడ్యుకేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ లేదా ఎంఎడ్/ఎంఫిల్ ఉండాలి.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జూలై 4; వెబ్‌సైట్: http//cie.du.ac.in
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మేనేజ్‌మెంట్
కోర్సు: మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్; వ్యవధి: ఏడాది; అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు సంబంధిత విభాగంలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. జీఆర్‌ఈ/జీమ్యాట్‌లో అర్హత సాధించాలి; ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: ఆగస్టు 15; వెబ్‌సైట్: http://mph.iihmr.org/
టాటా మెమోరియల్ సెంటర్-ముంబై
కోర్సు: ఎమ్మెస్సీ ఇన్ క్లినికల్ రీసెర్చ్; అర్హతలు: బయోసెన్సైస్/ లైఫ్ సెన్సైస్/ కెమిస్ట్రీ/ క్లినికల్ న్యూట్రిషన్/ఫార్మసీ/ఫార్మాస్యూటికల్ సెన్సైస్/ మెడిసిన్/ డెంటిస్ట్రీ/ అక్యుపేషనల్ థెరపీ/ ఫిజియోథెరపీ/ నర్సింగ్‌లో 50 శాతం మార్కులతో బీఎస్సీ ఉండాలి; వయసు: 30 ఏళ్లకు మించకూడదు.
దరఖాస్తులకు చివరి తేది: జూలై 15; వెబ్‌సైట్: https://tmc.gov.in/
ఎన్‌డీఏ-ఎన్‌ఏ ఎగ్జామ్‌ను ఎవరు నిర్వహిస్తారు? దీని ద్వారా ఏయే ఉద్యోగాలు లభిస్తాయి? అర్హతలు, ఎంపిక విధానం తెలపండి?
- సమీహ, జూబ్లీహిల్స్
త్రివిధ దళాలు (భారత సైన్యం, భారత వాయుసేన, భారత నౌకాదళం)లో ఆఫీసర్ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ప్రతి ఏటా నేషనల్ డిఫెన్స్ అకాడెమీ అండ్ నేవల్ అకాడెమీ (ఎన్‌డీఏ అండ్ ఎన్‌ఏ) పరీక్షను రెండుసార్లు నిర్వహిస్తోంది. ప్రస్తుతం ప్రకటన విడుదలైంది. ఈ ఏడాది పరీక్షను సెప్టెంబర్ 28న నిర్వహించనున్నారు. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ జూలై 21.
పోస్టులు : మొత్తం 375
అర్హత : ఆర్మీ (ఎన్‌డీఏ): సబ్జెక్టులతో 10+2 ఉత్తీర్ణత.
ఎయిర్‌ఫోర్స్, నేవీ (ఎన్‌డీఏ); 10+2 కేడెట్ ఎంట్రీ స్కీమ్ (ఇండియన్ నేవల్ అకాడమీ): ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో 10+2 ఉత్తీర్ణత. అవివాహితులైన పురుషులు మాత్రమే అర్హులు. నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి.
వయోపరిమితి : జనవరి 2, 1996 - జనవరి 1, 1999 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక : రాత పరీక్ష, సర్వీస్ సెలెక్షన్ బోర్డ్ ఇంటర్వ్యూ.
పరీక్ష విధానం : పరీక్షలో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. అవి.. 1. మ్యాథమెటిక్స్ (300 మార్కులు), జనరల్ ఎబిలిటీ టెస్ట్ (600 మార్కులు). ప్రతి పేపర్ పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. తప్పుగా గుర్తించిన సమాధానాలకు నెగెటివ్ మార్కులు (ప్రతి తప్పు సమాధానానికి 0.33 మార్కుల కోత) ఉంటాయి.
మ్యాథమెటిక్స్ : ఇందులో ఆల్జీబ్రా, మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్, ట్రిగ్నామెట్రీ, ఎనలిటికల్ జామెట్రీ , డిఫరెన్షియల్ కాలిక్యులస్, ఇంటిగ్రల్ కాలిక్యులస్ అండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, వెక్టార్ ఆల్జీబ్రా, స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీలపై ప్రశ్నలుంటాయి.
జనరల్ ఎబిలిటీ టెస్ట్ : దీనికి 600 మార్కులు కేటాయించారు. జనరల్ ఎబిలిటీ టెస్ట్‌లో భాగంగా జనరల్ ఇంగ్లిష్ (200 మార్కులు), జనరల్ నాలెడ్జ్ (400) ఉంటాయి.
ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ : రాతపరీక్ష ఉత్తీర్ణులకు ఇంటర్వ్యూ ఉంటుంది. దీనికి 900 మార్కులు కేటాయించారు. ఇంటర్వ్యూ రెండు దశలుగా ఉంటుంది. ఎయిర్‌ఫోర్స్ అభ్యర్థులకు పైలట్ ఆప్టిట్యూడ్ బ్యాటరీ టెస్ట్ (పీఏబీటీ) నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలో విజేతలుగా నిలిచినవారిని శిక్షణకు ఎంపిక చేస్తారు. మూడేళ్లపాటు నేషనల్ డిఫెన్స్ అకాడెమీ-పుణెలో శిక్షణ ఉంటుంది. నేవల్ అకాడెమీ (10+2 కేటెడ్ ఎంట్రీ స్కీమ్)కి ఎంపికైనవారికి నాలుగేళ్లపాటు ఇండియన్ నేవల్ అకాడమీ- ఎజిమల (కేరళ)లో శిక్షణ ఉంటుంది. తర్వాత బీటెక్ డిగ్రీని అందిస్తారు. శిక్షణలో నెలకు రూ.21,000 స్టైఫండ్‌గా అందిస్తారు. శిక్షణ పూర్తిచేసుకున్నవారిని త్రివిధ దళాల్లో వివిధ హోదాల్లో నియమిస్తారు.
రిఫరెన్‌స బుక్స్:
నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ - ఆర్.గుప్తా
మ్యాథమెటిక్స్ ఫర్ ఎన్‌డీఏ అండ్ ఎన్‌ఏ - ఎస్‌ఎల్ గులాటి
ఎన్‌డీఏ-ఎన్‌ఏ సాల్వ్‌డ్ పేపర్స్ - దిశ పబ్లికేషన్స్
జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్: ఎన్‌సీఈఆర్‌టీ ఆరు నుంచి 12 వతరగతి సైన్స్, సోషల్ పాఠ్యపుస్తకాలు
ఇంగ్లిష్: రెన్ అండ్ మార్టిన్ గ్రామర్
మన రాష్ట్రంలో పరీక్ష కేంద్రం: హైదరాబాద్
వెబ్‌సైట్:www.upsconline.nic.in
అడ్మిషన్స్ అలర్ట్స్, కాంపిటీటివ్ కౌన్సెలింగ్
Published Thu, Jun 26 2014 1:56 AM | Last Updated on Fri, Aug 17 2018 3:08 PM
Advertisement