Courses
-
‘ఎడెక్స్’ కోర్సులకు మంగళం!
ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు మేలు జరిగేలా అందుబాటులోకి తెచ్చిన ‘ఎడెక్స్’ సర్టిఫికేషన్ కోర్సులు నిలిచిపోనున్నాయి. విద్యా సంస్కరణల్లో భాగంగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మన రాష్ట్ర విద్యార్థులు ప్రపంచస్థాయి ప్రమాణాలు అందుకోవాలన్న ఉన్నతాశయంతో అందుబాటులోకి తెచ్చిన ఈ కోర్సులను టీడీపీ కూటమి ప్రభుత్వం జగన్‌పై అక్కసుతో అటకెక్కిస్తోంది. దీంతో రాష్ట్రంలోని గ్రాడ్యుయేట్లకు మేలు చేసే ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీల సర్టిఫికేషన్ కోర్సులు దూరం కానున్నాయి. సరిగ్గా ఏడాది క్రితం ఎడెక్స్‌తో ఒప్పందం చేసుకుని రెండువేల కోర్సులను వర్చువల్‌గా చదువుకునే అవకాశాన్ని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కల్పించింది. నాలుగు నెలలకు 4 లక్షల మంది చొప్పున ఏడాదిలో 12 లక్షల మందికి మేలుచేయాలన్న లక్ష్యంతో గతేడాది ఫిబ్రవరిలో ఈ కోర్సులు అందుబాటులోకి రాగా, తొలి నాలుగు నెలల్లో 3.83 లక్షల మంది ఎన్రోల్ అయ్యి.. 3.20 లక్షల మంది కోర్సులు పూర్తిచేశారు. జూన్‌లో కూటమి ప్రభుత్వం రాగానే ఎడెక్స్ కోర్సులను నిర్లక్ష్యం చేయడంతో పాటు విద్యార్థులను సైతం ఈ దిశగా ప్రోత్సహించలేదు. దీంతో ప్రభుత్వం డబ్బులు చెల్లించి అందుబాటులోకి తెచ్చిన కోర్సులు విద్యార్థులకు చేరువ కాలేకపోయాయి. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిది నెలల్లో రెండువేల సర్టిఫికెట్ కోర్సులు కూడా విద్యార్థులు చేయలేదంటే పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అర్థంచేసుకోవచ్చు. 12 లక్షల మంది విద్యార్థులకు లబ్ధిచేసేలా అందుబాటులోకి తెచ్చిన కోర్సులు టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో కేవలం 3.20 లక్షల మందికే పరిమితమయ్యాయి. ఎడెక్స్‌తో జరిగిన ఒప్పందం ఇక శుక్రవారంతో ముగియనుంది. – సాక్షి, అమరావతిఉచితంగా వరల్డ్ క్లాస్ వర్సిటీ కోర్సులు..ప్రపంచ వ్యాప్తంగా శరవేగంగా చోటుచేసుకుంటున్న శాస్త్ర, సాంకేతిక మార్పులకు అనుగుణంగా మన విద్యార్థులను సన్నద్ధం చేస్తూ మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం విద్యారంగ సంస్కరణలు చేపట్టింది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, హార్వర్డ్, ఎంఐటీ, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జి వంటి అత్యుత్తమ వర్సిటీలు అందించే కోర్సులను విదేశాలకు వెళ్లి చదువుకోలేని పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఉచితంగా అందుబాటులోకి తెచ్చింది. ఒక్కో కోర్సుకు సుమారు రూ.30 వేలు ఖర్చయ్యే అవకాశం ఉన్నా గత ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం ప్రఖ్యాత మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సుల సంస్థ ‘ఎడెక్స్’తో ఏడాది క్రితం ఒప్పందం చేసుకుంది. పాఠ్య ప్రణాళిక కోర్సుల్లో విద్యార్థి తనకు నచ్చిన వర్టికల్ను చదువుకునే అవకాశం కల్పించి, 2024 ఫిబ్రవరి 16 నుంచి వర్సిటీల్లో అందుబాటులోకి తెచ్చారు. ఈ–లెర్నింగ్ ప్లాట్ఫారం అయిన ఎడెక్స్ ద్వారా 180కి పైగా వరల్డ్ క్లాస్ వర్సిటీలు రూపొందించిన వివిధ కోర్సుల్లోని రెండువేలకు పైగా వర్టికల్స్‌ను విద్యార్థులు చదువుకునే అవకాశం కల్పించారు. ఇక ఎడెక్స్ సంస్థ సంబంధిత అంతర్జాతీయ వర్సిటీతో కలిసి విద్యార్థి అసైన్మెంట్స్, ప్రతిభ ఆధారంగా సర్టిఫికెట్ అందిస్తుంది. రాత పరీక్షను ఎడెక్స్ రూపొందించిన ప్రశ్నపత్రాలతో మన వర్సిటీలే నిర్వహిస్తున్నాయి. క్రెడిట్స్‌ను కూడా వర్సిటీలే ఇస్తున్నాయి. విద్యార్థి ఆసక్తి మేరకు ఒకటి కంటే ఎక్కువ కోర్సులను కూడా చేసే వెసులుబాటు ఉంది. వాటిని వేల్యూ యాడెడ్ కోర్సులుగా పరిగణించి సర్టిఫికెట్ ఇస్తారు.ఉద్యోగ, ఉపాధిలో కీలకమైన కోర్సులకు మంగళం..ఇక ఎడెక్స్ ద్వారా రెగ్యులర్ కోర్సులు కాకుండా ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉన్న మార్కెట్ ఓరియంటెడ్ కోర్సులనే అందిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా మైనింగ్, డేటా అనలిటిక్స్, వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్, పైథాన్ వంటి కోర్సులకు వర్తమాన ప్రపంచంలో బాగా డిమాండ్ ఉంది. ఇవేగాక.. ప్రపంచ ప్రఖ్యాత వర్సిటీల ఫ్యాకల్టీ తరగతులను మన విద్యార్థులు వినే అవకాశం గత ప్రభుత్వం కల్పించింది. తద్వారా విద్యార్థుల నైపుణ్యాలు మెరుగుపడడంతో పాటు కోరుకున్న ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందే అవకాశాలు వారికి అందించింది. ఇందులో భాగంగా.. ఏడాది కాలానికి నాలుగు లక్షల లైసెన్సులు తీసుకుని, రెండువేల కోర్సులను అందుబాటులోకి తెచ్చింది. నాలుగు నెలలను ఒక సెమిస్టర్గా 12 నెలలకు మూడు సెమిస్టర్ల రూపంలో అమలుచేసింది. ఒక సెమిస్టర్లో 4 లక్షల మంది విద్యార్థులకు లైసెన్సు అందుబాటులో ఉంచింది. వీరి తర్వాత రెండో సెమిస్టర్ మరో 4 లక్షల మందికి అందిస్తారు. ఇలా ఒక్కో విద్యార్థి నాలుగు నెలల్లో రెండు వేల కోర్సుల్లో ఎన్ని కోర్సులైనా చేసుకునే అవకాశం కల్పించింది. నిజానికి.. మార్కెట్లో ఒక్కో కోర్సు లైసెన్సు రూ.30 వేల వరకు ఉండగా గత ప్రభుత్వం రూ.వెయ్యికే పొందింది. అయితే, కూటమి ప్రభుత్వం వచ్చాక జూన్ నుంచి రెండు, మూడు సెమిస్టర్లకు విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌ను ప్రోత్సహించలేదు. దీంతో.. గత ప్రభుత్వం చేపట్టిన విద్యా యజ్ఞం బూడిదలో పోసిన పన్నీరైంది. -
‘క్లినికల్ సైకాలజీ’లో ఎం.ఫిల్, డిప్లొమా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తొలిసారిగా క్లినికల్ సైకాలజీ(Clinical Psychology) కోర్సులు ప్రారంభమవుతున్నాయి. రెండేళ్ల వ్యవధితో ఎం.ఫిల్, ఏడాది వ్యవధితో ప్రొఫెషనల్ డిప్లొమా ఇన్ క్లినికల్ సైకాలజీ కోర్సులు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం క్లినికల్ సైకాలజీ విద్యను నియంత్రించే రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు.మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి వ్యాధి నిర్ధారణ, చికిత్స అందించడంతో పాటు వారు పూర్తిగా కోలుకోవడంలో క్లినికల్ సైకాలజిస్ట్‌లు కీలకపాత్ర వహిస్తారు. కాగా, ఈ కోర్సుల కోసం మార్గదర్శకాలు తయారు చేయాలని అధికారులను ఆదేశించినట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్(Satyakumar Yadav)తెలిపారు. -
సరికొత్తగా ‘డిగ్రీ’
సాక్షి, హైదరాబాద్: సంప్రదాయ డిగ్రీ కోర్సులను సరికొత్తగా తీర్చిదిద్దేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) మార్గదర్శకాలకు అనుగుణంగా డిగ్రీ లో కొత్త కోర్సులను ప్రవేశపెట్టడం, సంప్రదాయ కోర్సుల్లో ఆధునిక అవసరాలకు తగ్గట్లుగా సిలబస్‌ను మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. యూజీసీ మార్గదర్శకాలపై అధ్యయనానికి తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఇప్పటికే కమిటీ వేసింది.త్వరలో సిలబస్‌ను ఖరారు చేయబోతోంది. త్వరలోనే విధివిధానాలను వెల్లడిస్తామని మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి తెలిపారు. డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థి పూర్తి నైపుణ్యంతో ధైర్యంగా ఉపాధి కోసం వెళ్లేలా సిలబస్ ఉండబోతోందని చెప్పారు. దేశవ్యాప్తంగా ఆనర్స్ కోర్సులకు ప్రాధాన్యత పెరుగుతుండటాన్ని కూడా పరిగణనలోనికి తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. క్రెడిట్స్‌కే ప్రాధాన్యం.. ప్రపంచవ్యాప్తంగా విద్యా విధానం క్రెడిట్ స్కోర్ ఆధారంగా నడుస్తోంది. టెన్త్, డిగ్రీ, పీజీ, సాంకేతిక విద్యకు ప్రత్యేకంగా క్రెడిట్స్ ఇవ్వనున్నారు. ఈ విధానం వల్ల ఇతర దేశాల్లోనూ ఉపాధి కోసం వెళ్లవచ్చని అధికారులు అంటున్నారు. విద్యార్థులు మూడేళ్లలో 120 క్రెడిట్లు పూర్తి చేస్తేనే అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) డిగ్రీకి అర్హులవుతారు. అదే విద్యార్థి నాలుగేళ్లలో 160 క్రెడిట్లను పూర్తి చేస్తేనే యూజీ ఆనర్స్ డిగ్రీ పట్టా లభిస్తుంది.ఆనర్స్ డిగ్రీ కోర్సుల్లో చేరేవారు రీసెర్చ్ కోసం వెళ్లాలనుకుంటే నాలుగేళ్ల కోర్సులోనే ప్రాజెక్టులను చేపట్టాల్సి ఉంటుంది. మొదటి ఆరు సెమిస్టర్లలో 75 శాతం.. అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు యూజీ స్థాయిలో పరిశోధనలు చేపట్టాలనుకుంటే నాలుగో ఏడాది పరిశోధనా ప్రాజెక్టును ఎంచుకోవచ్చు. దీన్ని పూర్తి చేస్తే వారికి యూజీ (ఆనర్స్ విత్ రీసెర్చ్) డిగ్రీని ప్రదానం చేస్తారు. ఆనర్స్‌కు కొత్త బోధనా ప్రణాళిక.. ప్రస్తుతం మూడేళ్ల డిగ్రీ కోర్సులు చేస్తున్నవారు కూడా నాలుగేళ్ల ఆనర్స్ కోర్సులకు మారేందుకు కొత్త కరిక్యులం ఫ్రేమ్ వర్క్ అవకాశం కల్పిస్తోంది. ఇప్పటికే చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ (సీబీసీఎస్) ప్రకార మూడేళ్ల యూజీ కోర్సుల్లో పేర్లు నమోదు చేసుకున్న, అభ్యసిస్తున్న విద్యార్థులు కూ డా నాలుగేళ్ల యూజీ ఆనర్స్ కొనసాగించడానికి అర్హులని కొత్త నిబంధనల్లో పేర్కొన్నారు. అయితే, ఆనర్స్ కోర్సుల్లోకి మారడానికి ఆఫ్‌లైన్ లేదా ఆన్లైన్లో వర్సిటీలు అందించే బ్రిడ్జ్ కోర్సు లు చేయటం తప్పనిసరి. నాలుగేళ్ల యూజీ ఆనర్స్ కోర్సుల్లో విద్యార్థులకు బహుళ ప్రవేశ, నిష్క్రమణలకు అవకాశం కల్పించబోతున్నారు.మొదటి ఏడాది పూర్తి చేస్తే సర్టీఫికెట్ లభిస్తుంది. రెండేళ్లు చదివితే డిప్లొమా ఇస్తారు. మూడేళ్లు చది వితే బ్యాచిలర్ డిగ్రీ పట్టా లభిస్తుంది. నాలుగేళ్లు పూర్తి చేస్తే ఆనర్స్ బ్యాచిలర్ డిగ్రీ పట్టా అందుతుంది. ఈ మేరకు విద్యార్థులు తమ ప్రాధాన్యతలను ఎంచుకోవడానికి అనుమతిస్తారు. నాలుగేళ్ల ఆనర్స్‌లో చేరినవారు మూడేళ్లలోపు నిష్క్రమిస్తే, అప్పటి నుంచి మూడేళ్లలోపు మళ్లీ కోర్సులో చేరేందుకు అవకాశం ఇస్తారు. అలాంటి వారు ఏడేళ్ల వ్యవధిలో కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంది.డిగ్రీలోనూ ఏఐ కోర్సులుడిగ్రీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కోర్సులకు ప్రాధాన్యం ఇవ్వాలని యూజీసీ మార్గదర్శకాల్లో సూచించింది. తెలంగాణలో నాలుగేళ్ల బీఎస్సీ (హానర్స్) కంప్యూటర్స్‌ను 50కి పైగా కాలేజీల్లో అందుబాటులోకి తెచ్చా రు. ఏఐ, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటి అంశాలు హానర్స్‌లో చోటు చేసుకోబోతున్నాయి. కంప్యూటర్ పరిజ్ఞానంతో కూడిన అనలిస్టులు, అకౌంటెంట్లకు మంచి వేతనాలతో కూడిన ఉపాధి లభిస్తోంది.ఈ కారణంగా డిగ్రీ కోర్సుల్లో కామర్స్‌ను ఎంచుకునే వారి సంఖ్య 36 శాతం నుంచి 41 శాతానికి పెరిగింది. బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ) లో చేరికలు కూడా ఆరేళ్లలోనే ఏడు రెట్లు పెరిగాయి. బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (బీసీఏ)లో ప్రవేశాలు 9 రెట్లు పెరిగాయి. దీంతో బీకాం కోర్సులను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు. బీకాం జనరల్‌తో పాటు, కంప్యూటర్స్, ట్యాక్సేషన్, ఆనర్స్, బిజినెస్ అనలిటిక్స్ వంటి కొత్త స్పెషలైజేషన్లను తీసుకొచ్చారు. బీమా, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెరగడం, జీఎస్టీ తీసుకురావడంతో ట్యాక్స్ నిపుణుల అవసరం రెట్టింపైంది. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఈ కామర్స్, రిటైల్ సంస్థల పెరుగుదల కూడా కలిసివచ్చింది. -
ఉపాధి కల్పనలో గేమ్ ఛేంజర్!
మన సంప్రదాయ విద్యావ్యవస్థ తయారు చేస్తున్న విద్యావంతులు నైపుణ్యాల లేమితో కునారిల్లుతున్నారు. ఒకవైపు ఏటికేడాది నిరుద్యోగుల సంఖ్య పెరుగుతూ ఉంటే... మరోవైపు పరిశ్రమలు నైపుణ్యం గలవారు దొరక్క సమస్యల నెదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితిని మార్చడం కోసం తెలంగాణ ప్రభుత్వం ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ని స్థాపించింది. విద్యా సంస్థలు– పరిశ్రమల సమన్వయం ఆధారంగా ఇది పనిచేస్తుంది. విద్యార్థులు సంప్రదాయ పరీక్షల విధానంలోనే కాకుండా... ఫ్యాక్టరీల్లో, పెద్ద పెద్ద కంపెనీల్లో ‘ఆన్ హ్యాండ్’ పద్ధతిలో నైపుణ్యాలను నేర్చుకుంటారు. అప్రెంటిస్‌లుగా పనిచేస్తారు. మొత్తం మీద రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు దారి చూపే ఒక చుక్కాని లాంటి దార్శనిక సంస్థ ఇది. భారతదేశం ఇప్పుడు ఓ పరివర్తన దశలో ఉంది. నవ నవోన్మేషంతో ఉరకలెత్తే యువత అభివృద్ధిలో మరింత ఎత్తుకు ఎదిగే అవకాశం ఒకపక్క ఉంటే... నిరు ద్యోగం మునుపెన్నడూ లేనంత స్థాయిలో ఉండటం, నైపుణ్యాలతో కూడిన మానవ వనరుల కోసం కర్మాగారాలు సమస్యలను ఎదుర్కో వడం ఇంకో పక్కన ఉన్నాయి. ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సి టీ’ని స్థాపించడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఈ సవాలును ఎదు ర్కొనేందుకు సిద్ధమైంది. దేశంలో మునుపెన్నడూ లేని చందంగా విద్య, ఉపాధుల మధ్య వారధిగా నిలవడంతోపాటు... రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు దారి చూపే ఒక చుక్కానిలాంటి దార్శనిక సంస్థ ఇది. నైపుణ్యాలతో కూడిన మానవ వనరులను అందించి పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేయడానికి ఈ వర్సిటీ ఎంతగానో ఉపకరిస్తుంది. ఎందుకంటే... ఇక్కడ పరిశ్రమలే తమకు అవసరమైన నైపు ణ్యాల్లో యువతకు శిక్షణ ఇచ్చి కార్మికులుగా, ఉద్యోగులుగా, ఇంజ నీర్లుగా ఉద్యోగాలిస్తాయి.దేశంలో ఏటా కొన్ని లక్షల మంది విద్యార్థులు పట్టభద్రులు అవు తున్నారు. పట్టభద్రుల్లో 47 శాతం మందికి పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు లేని కారణంగా ఉద్యోగార్హత లేదని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ విషయానికి వస్తే ఏటా రెండు లక్షల మంది ఇంజినీర్లు, మరో రెండు లక్షల మంది సాధారణ డిగ్రీలు, ఐటీఐ, డిప్లోమా కోర్సులు పూర్తి చేస్తున్నారు. రాష్ట్రంలో సుమారు 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. దురదృష్టవశాత్తు సంప్రదాయ విద్యా వ్యవస్థలో సిద్ధాంతాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటోంది. ఫలితంగా ఈ వ్యవస్థ నుంచి బయ టకు వచ్చేవారికి నిజ జీవిత సవాళ్లను ఎదుర్కోవడం కష్టసాధ్య మవుతోంది. పాతబడిపోయిన పాఠ్యాంశాలు, ప్రాక్టికల్ ట్రెయినింగ్ తక్కువగా ఉండటం, సాఫ్ట్ స్కిల్స్‌కు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం వంటివి... నైపుణ్యాల కొరతను ఎక్కువ చేశాయి. ఐటీ, ఉత్పాదన, ఆరోగ్య రంగం, సంప్రదాయేతర విద్యుత్తు... ఇలా ఏ రంగం తీసు కున్నా చాలామంది తాజా పట్టభద్రుల్లో నైపుణ్యాల లేమి స్పష్టంగా కనిపిస్తోంది. ఫలితంగా ఓ విచిత్రమైన ద్వైదీభావం ఏర్పడుతోంది. విద్యార్థులేమో ఉద్యోగాల కోసం... పరిశ్రమల వారేమో శిక్షణ, తగిన నైపుణ్యాలున్న వారి కోసం నిత్యం వెతుకుతూనే ఉన్న పరిస్థితి ఉంది. అందుకే నైపుణ్యాలే కేంద్ర బిందువుగా ఉండే విద్యా వ్యవస్థలోభాగంగా పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టు నైపుణ్యాలను ప్రోదిచేసే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటైంది. ఈ యూనివర్సిటీ దేశంలోనే మొట్ట మొదటిది మాత్రమే కాదు, విప్లవాత్మకమైంది కూడా. నిరుద్యోగ యువత సాధికారత కోసం ఉద్దే శించింది. వివిధ రంగాల్లో డిమాండ్ ఉన్న నైపుణ్యాలను గుర్తించి వాటిల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తుంది. ఆధునిక టెక్నాలజీలను నిజ జీవిత పరిస్థితుల్లో విద్యార్థులకు ప్రాక్టికల్‌గా ట్రెయినింగ్ ఇస్తారు. తద్వారా విద్యార్థులు కేవలం పట్టభద్రుల్లా కాకుండా... అసలైన వృత్తి నిపుణుల్లా తయారవుతారు. విద్యా సంస్థలు, పరిశ్రమల సమన్వయం ఆధారంగానే ఈ వర్సిటీ పనిచేస్తుంది. విద్యార్థులు సంప్రదాయ పరీక్షల విధానంలోనే కాకుండా... ఫ్యాక్టరీల్లో, పెద్ద పెద్ద కంపెనీల్లో ‘ఆన్ హ్యాండ్’ పద్ధతిలో నైపుణ్యాలను నేర్చుకుంటారు. అప్రెంటిస్‌లుగా పనిచేస్తారు. అది కూడా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సంప్రదాయేతర ఇంధన వనరుల వంటి అత్యాధునిక టెక్నాలజీరంగాల్లో! పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా బోధనాంశాలను రూపొందించడం వల్ల తెలంగాణ విద్యార్థులకు డిమాండ్ పెరుగుతుంది. మంచి జీతం వచ్చే అవకాశం ఉంటుంది. వీరంతా ఉద్యోగాల్లో స్థిరపడితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటును అందించిన వారవుతారు. ఈ ఏడాది నవంబరు 4న ఏడు కోర్సులతో అధికారికంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించడం తెలిసిందే. పూర్తి స్థాయిలో కార్యకలాపాలు మొదలు పెడితే తయారీ, సేవా రంగాలకు చెందిన 18 అంశాల్లో కోర్సులు ఉంటాయి. వర్సిటీ నిర్మాణం కోసం ముచ్చెర్ల వద్ద ‘నెట్‌జీరో సిటీ’లో 150 ఎకరాల స్థలం కేటాయించాం. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా మేఘా ఇంజినీరింగ్ సంస్థ రూ. 200 కోట్లతో వర్సిటీ నిర్మాణాన్ని చేపట్టింది. దేశంలోనే దిగ్గజ పారిశ్రామికవేత్త ఆనంద్ మహింద్రా ఇప్పటికే వర్సిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు కూడా. ఆనంద్ మహింద్రా నాయకత్వం, దార్శనికతలు ఈ విశ్వవిద్యాలయాన్ని నైపుణ్యాభివృద్ధి విషయంలో దేశానికే ఆదర్శంగా నిలుపుతాయనడంలో సందేహం లేదు. మరో పక్క రాష్ట్రంలోని 65 ప్రభుత్వ ఐటీఐల ఆధునికీకరణ కూడా చేపట్టాం. అడ్వాన్స్డ్ ట్రెయినింగ్ సెంటర్లుగా వీటిని ఇప్పటికే అప్ గ్రేడ్ చేసే కార్యక్రమం జరుగుతోంది. ఇకపై ఈ సెంటర్లు స్కిల్స్ యూనివర్సిటీ సిలబస్ ప్రకారం విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్నిఅందిస్తూ... ప్రస్తుతం పరిశ్రమల్లో అవసరమైన నైపుణ్యాల్లో శిక్షణఅందిస్తాయి. ఈ ఆధునికీకరణ కారణంగా నైపుణ్యాభివృద్ధిలో తెలంగాణలో ఒక సమగ్రమైన ప్రతిభావంతుల వ్యవస్థ ఏర్పాటు అవుతుంది. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ పరిశ్రమలు కూడా పాలుపంచు కునేలా చేస్తున్నాం. తద్వారా వారు తమకు అవసరమైన నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చుకునే వీలేర్పడుతుంది. అంటే పరిశ్రమలే తమకు అవసర మైన మానవ వనరులను తయారు చేసుకుంటాయన్నమాట. ప్రత్యేక కార్యక్రమాలు, కోర్సుల ద్వారా పరిశ్రమల అవసరాల న్నింటినీ వర్సిటీ తీరుస్తుంది. కమ్యూనికేషన్ స్కిల్స్, టీమ్ వర్క్, నాయకత్వం వంటి సాఫ్ట్ స్కిల్స్‌పై కూడా శిక్షణ ఇస్తుండటం వల్ల పరిశ్రమలకు అన్ని నైపుణ్యాలున్న మానవ వనరులు లభిస్తాయి. యువత సొంతంగా పరిశ్రమలు స్థాపించుకునేలా ప్రోత్సహించేందుకు కూడా ఈ వర్సిటీ చర్యలు తీసుకుంటుంది. ఉపాధి అవకాశాల్లో గేమ్ ఛేంజర్స్కిల్స్ యూనివర్సిటీ ఉద్యోగ ప్రపంచంపై చూపే ప్రభావాన్ని ఏమాత్రం తక్కువ చేయలేం. ఆధునిక నైపుణ్య శిక్షణకు వాస్తవిక విద్య కూడా తోడవడం వల్ల నిరుద్యోగ సమస్యను ఎదుర్కొనేందుకు ఇదో మేలిమి సాధనంగా మారనుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవారు లక్షల్లో ఉంటే ఖాళీలు వేలల్లో మాత్రమే ఉంటా యన్నది తెలిసిన విషయమే. అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం సంపాదించేందుకు ఉన్న అవకాశం 0.1 నుంచి ఒక శాతం మాత్రమే అన్నమాట. ప్రత్యామ్నాయ ఉద్యోగ అవకాశాల అవసరాన్ని ఈ అంకెలే చెబు తున్నాయి. ప్రైవేట్ రంగంలో నైపుణ్యాలున్న వారికి ఉద్యోగ అవ కాశాలు మెండు. అందుకే తెలంగాణ ప్రభుత్వపు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ దేశానికి ఒక మోడల్‌గా ఉపయోగపడుతుందని చెప్పడం! స్కిల్స్ యూనివర్సిటీలో కోర్సులు రెండు వేల మందితో మొద లవుతాయి. వచ్చే ఏడాది ఈ సంఖ్య పదివేలకు చేరుతుంది. క్రమంగా ఇది 30 వేలకు చేరుతుంది. యూనివర్సిటీ భవన నిర్మాణాలు పూర్త య్యేంత వరకు గచ్చిబౌలిలోని ‘ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ఇండియా’ (ఈఎస్సీఐ), హైటెక్ సిటీలోని ‘నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్’ ప్రాంగణాల్లో ప్రస్తుతం శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. వర్సిటీ ఫీజుల విషయంలోనూ తెలంగాణ ప్రభుత్వం చాలా స్పష్టతతో ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాల వారందరికీ ఫీజుల్లో రాయితీ ఉంటుంది. వర్సిటీ కార్యకలాపాల కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రూ. 100 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. ఇది ప్రారంభమే కాదు... ఉపాధి విప్లవానికి రాచబాట!- వ్యాసకర్త తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి- దుద్దిళ్ల శ్రీధర్ బాబు -
18 నుంచి వ్యవసాయ కోర్సులకు మూడో దశ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్/ఏజీవర్సిటీ: వ్యవసాయ, ఉద్యాన కోర్సుల్లో రెగ్యులర్ కోటా సీట్ల ఖాళీల భర్తీ కోసం ఈనెల 18వ తేదీ నుంచి మూడో దశ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వ్యవసాయ వర్సిటీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. వ్యవసాయ, ఉద్యాన డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం జరుగుతున్న స్పెషల్ కోటా మొదటి దశ కౌన్సెలింగ్ ఆదివారంతో పూర్తయింది. రెండు దశల్లో జరిగిన రెగ్యులర్ కోటా కౌన్సెలింగ్, అలాగే ఆదివారంతో పూర్తయిన మొదటి దశ స్పెషల్ కోటా కౌన్సెలింగ్ తర్వాత వ్యవసాయ, అనుబంధ కోర్సుల్లో సుమారు 213 ఖాళీలు ఏర్పడినట్లు జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డి.శివాజీ తెలిపారు.బీఎస్సీ (హానర్స్) అగ్రికల్చర్లో 80, బీవీఎస్సీ – 08, బీఎస్సీ (హానర్స్) హారి్టకల్చర్ – 70, బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్ – 40, బీటెక్ ఫుడ్ టెక్నాలజీలో 15 సీట్లు ఖాళీగా ఉన్నట్టు వివరించారు. 18 నుంచి జరిగే మూడో దశ కౌన్సెలింగ్ ద్వారా ఈ కోర్సులలో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయనున్నట్లు రిజి్రస్టార్ తెలిపారు. మూడో దశ కౌన్సెలింగ్ షెడ్యూలు, కోర్సుల్లో ఖాళీలు తదితర వివరాలను విశ్వవిద్యాలయ వెబ్సైట్ www.pjtau.edu.in లో పొందవచ్చని ఆయన వివరించారు. మెరిట్ ఆధారంగానే సీట్లను భర్తీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రవేశాల్లో దళారుల ప్రమేయం ఉండదని, వారి మాయ మాటలు నమ్మి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మోసపోవద్దని ఆయన సూచించారు. -
చదువుకు.. చలో దుబాయ్
ప్రపంచంలోని అత్యంత సంపన్న నగరాల్లో ఒకటి. ఆకాశహర్మ్యాలతో మెట్రోపాలిటన్ సంస్కృతికి అద్దం పట్టేలా నైట్ లైఫ్. అబ్బురపరిచే షాపింగ్ ఫెస్టివల్స్. ఒంటెలపై సఫారి. వీటితోనే ఎడారి దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ నగరం అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఇంతకాలం టూరిస్ట్ స్పాట్‌గా వెలుగొందిన దుబాయ్ ఇప్పుడు అంతర్జాతీయ ఉన్నత విద్యకు గమ్యస్థానంగా మారుతోంది. ముఖ్యంగా భారతీయ విద్యార్థులు అత్యధిక సంఖ్యలో దుబాయ్‌లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు పయనమవుతున్నారు. 60కి పైగా విదేశీ వర్సిటీలు, కాలేజీల క్యాంపస్‌లకు దుబాయ్ నిలయంగా ఉంది. ఇప్పటికే యూఎస్, యూకేకు చెందిన వర్సిటీలు సైతం దుబాయ్‌లో క్యాంపస్‌లను నెలకొల్పగా.. మరిన్ని సంస్థలు సేవలందించేందుకు సిద్ధమవుతున్నాయి. భారతీయ సంస్కృతితో ముడిపడి..భారతీయులకు అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యలో ప్రపంచస్థాయి గమ్యస్థానంగా దుబాయ్ మారుతోంది. గత ఏడాది 2.43 లక్షల మంది విద్యార్థులు చదువు కోసం అక్కడికి వెళ్లారు. భారత్‌కు దుబాయ్ మూడు గంటల ప్రయాణ దూరంలో ఉండటం ఎక్కువగా విద్యార్థులకు కలిసివస్తోంది. ప్రధాన భారతీయ నగరాల నుంచి నేరుగా విమాన సౌకర్యాలు అందుబాటులో ఉండటం మరో అంశం. దుబాయ్ కృత్రిమ మేధస్సు, సుస్థిరత, నిర్మాణం, పర్యాటక రంగంలో వినూత్న ప్రాజెక్టులు రూపొందిస్తోంది. ఈ తరుణంలో దుబాయ్ దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మానవ వనరులు ఎంతో కీలకం.అందుకే అకడమిక్–పరిశ్రమల మధ్య భాగస్వామ్యం పెంచుతూ తరగతి గదికి మించిన విజ్ఞానాన్ని అందించేందుకు దుబాయ్ అవకాశాలు కల్పిస్తోంది. చాలామంది విద్యార్థులు తమ చదువు సమయంలో దుబాయ్‌లో ఉపాధి సైతం పొందుతున్నారు. దుబాయ్‌లోని బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో 95 దేశాలకుపైగా విద్యార్థులు ప్రాతినిధ్యం వహించే అధ్యయన గమ్యస్థానంగా పేరొందింది. అంతర్జాతీయ విద్యార్థులలో భారతీయ విద్యార్థులే అగ్రస్థానంలో నిలుస్తున్నారు. దుబాయ్‌లో భాష, ఆచారాలు, వంటకాలు, సంస్కృతితో భారతీయుల్లో ప్రత్యేకమైన అనుబంధం ఉన్నందున అక్కడకు వెళ్లేందుకు విద్యార్థులు ఇష్టపడుతున్నారుగోల్డెన్ వీసాతో..దుబాయ్ వృద్ధికి గోల్డెన్ వీసా కీలకంగా మారింది. యూఏఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దీర్ఘకాలిక రెసిడెన్సీ వీసా విదేశీ ప్రతిభను, పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా పెట్టుకుంది. గోల్డెన్ వీసా పెట్టుబడిదారులు, ఎంట్రపెన్యూర్స్, ప్రత్యేక ప్రతిభావంతులు, పరిశోధకులు, అత్యుత్తమ విద్యార్థులు, సైన్స్, ఇంజినీరింగ్, ఆరోగ్యం, విద్య, కళల వంటి రంగాలలో అసాధారణ నైపుణ్యాలు కలిగిన వ్యక్తులకు ఎంతగానో ఉపయోగపడుతోంది.ఈ వీసాను సాధారణంగా 5–10 సంవత్సరాలకు జారీ చేస్తారు. మళ్లీ పునరుద్ధరించుకోవచ్చు. గోల్డెన్ వీసా హోల్డర్లను జాతీయ స్పాన్సర్ అవసరం లేకుండా యూఏఈలో నివసించడానికి, పని చేయడానికి చదువుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఇప్పటివరకు దుబాయ్‌లో పోస్ట్–స్టడీ ఉపాధి వీసాలు లేవు. అయితే.. అంతర్జాతీయ విద్యార్థులు తమ విద్యను పూర్తిచేసిన తర్వాత అక్కడే ఉండేందుకు గోల్డెన్ వీసా కాకుండా ఉపాధి వీసా, ఉద్యోగార్థుల వీసా, ఫ్రీలాన్స్ వీసా, ఇన్వెస్టర్ వీసా, ఫ్యామిలీ స్పాన్సర్షిప్ ద్వారా రెసిడెన్సీ వీసాలను తీసుకొచ్చారు. భద్రతలోనూ ఇదే టాప్భద్రతా ప్రమాణాలు, వ్యక్తులకు సురక్షితమైన దేశాలలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అంతర్జాతీయంగా ఖ్యాతి గడించింది. అబుదాబి, దుబాయ్‌లలో నేరాల శాతం చాలా తక్కువగా ఉంది. ఇది సురక్షితమైన విద్యార్థి వాతావరణానికి దోహదం చేస్తుంది. గతేడాది అబుదాబి 11.5 క్రైమ్ ఇండెక్స్, 88.5 సేఫ్టీ ఇండెక్స్‌తో ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన నగరంగా ర్యాంక్ పొందింది. దుబాయ్ నేరాల సూచిక 16.5, భద్రతా సూచిక 83.5గా ఉంది. ఈ నేపథ్యంలోనే విద్యార్థులు హాయిగా విద్యపై దృష్టి పెట్టొచ్చు.జాబ్ ఓరియంటెడ్ కోర్సులుదుబాయ్లోని చాలా విశ్వవిద్యాలయాలు వ్యాపార రంగంలోని మానవ వనరుల కొరతను అధిగమించేందుకు జాబ్ ఓరియంటెడ్ కోర్సులను అందిస్తున్నాయి. మనస్తత్వ శాస్త్రం, వ్యాపారం, మార్కెటింగ్, ఆర్థిక శాస్త్రం, ఫైనాన్స్‌తోపాటు అత్యధికంగా కంప్యూటర్ సైన్స్, బయో మెడికల్ సైన్సెస్‌పై భారతీయ విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు. మెకానికల్ ఇంజనీరింగ్ వంటి ప్రోగ్రామ్‌లు సైతం అక్కడ క్రమంగా విస్తరిస్తున్నాయి.అంతర్జాతీయంగా పేరొంచిన పోస్టు గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ హెల్త్ సైన్సెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), కంప్యూటర్ సైన్స్–ఇంజనీరింగ్, ఐటీ వంటివి ఉన్నాయి. ఉద్యోగాలను సృష్టించే ఎంట్రపెన్యూరల్ వాతావరణాన్ని ప్రఖ్యాత ప్రపంచ విశ్వవిద్యాలయాల క్యాంపస్‌లతో దుబాయ్‌లో చదువుకునేందుకు అవకాశాలు పెరిగాయి. దుబాయ్‌లో చదువుకోవాలనుకునే అంతర్జాతీయ విద్యార్థులకు అనేక స్కాలర్షిప్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. అకాడెమిక్ ఎక్స్‌లెన్స్ స్కాలర్షిప్లు, మల్టీ కల్చరల్ స్టూడెంట్ స్కాలర్షిప్, ఇంటర్నేషనల్ స్టూడెంట్ ట్యూషన్ స్కాలర్షిప్లు పొందొచ్చు. -
డబ్బు కట్టాం.. సీట్లు ఇవ్వాల్సిందే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొన్ని ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు, విద్యార్థుల మధ్య సీట్ల పంచాయితీ ముదురుతోంది. డిమాండ్ లేని కోర్సులను రద్దు చేసుకున్న కాలేజీలు వాటి స్థానంలో కొత్త సీట్లు వస్తాయని భావించి యాజమాన్య కోటా కింద విద్యార్థుల నుంచి ముందే డబ్బు దండుకున్నాయి. కానీ కొత్త సీట్లకు ప్రభుత్వం అనుమతించకపోవడం, దీనిపై హైకోర్టుకెక్కినా కాలేజీలకు ఊరట లభించకపోవడంతో విద్యార్థులు నిరాశ చెందుతున్నారు. వివిధ కాలేజీల్లో దాదాపు 5 వేల మందికి ఈ తరహాలో సీట్లు ఇస్తామని యాజమాన్యాలు ఆశలు రేపాయి. అందులో టాప్ కాలేజీలే ఎక్కువగా ఉన్నాయి. దాదాపు అన్ని బ్రాంచీల్లో సీట్లు భర్తీ అయినందున ఇప్పుడు సీట్లు లేవని చెబుతున్న కాలేజీలు.. కావాలంటే కట్టిన సొమ్మును తిరిగిచ్చేస్తామని అంటున్నాయి. కానీ దీనికి విద్యార్థులు ఒప్పుకోవట్లేదు. ఇంజనీరింగ్ ప్రవేశాలు దాదాపు పూర్తికావడంతో ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్లాలని ప్రశి్నస్తున్నారు. ఏదో ఒక బ్రాంచీలో తమకు సీట్లు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. మండలి వద్ద గందరగోళంఉన్నత విద్యామండలి కార్యాలయం వద్ద మంగళవారం గందరగోళ పరిస్థితి కనిపించింది. ప్రైవేటు కాలేజీలు మోసం చేశాయని విద్యార్థులు అధికారులకు మొర పెట్టుకున్నారు. విద్యాసంవత్సరం నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని పట్టుబట్టారు. కొందరు ఆవేశంతో మాట్లాడుతూ తీవ్ర నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ పరిణామాలతో అధికారులు అవాక్కయ్యారు. యాజమాన్యాల ప్రతినిధులతో మాట్లాడేందుకు విఫలయత్నం చేశారు. సీట్లు లేనప్పుడు ఎలా ఇవ్వగలమని కాలేజీల నుంచి సమాధానం రావడంతో నిస్సహాయత వ్యక్తం చేశారు. స్పాట్ షురూ స్లైడింగ్ తర్వాత 11 వేల పైచిలుకు ఇంజనీరింగ్ సీట్లు మిగిలాయి. వాటికి స్పాట్ అడ్మిషన్లు చేపట్టేందుకు వీలుగా సాంకేతిక విద్యామండలి మంగళవారం మార్గదర్శకాలు జారీ చేసింది. కాలేజీకి వచి్చన వారిలో ర్యాంకు ప్రకారం సీట్లు ఇవ్వాలని సూచించింది. బుధవారం నుంచి స్పాట్ అడ్మిషన్లు చేపట్టాలని సూచించింది. బుధ, గురువారాల్లో కాలేజీలవారీగా ఖాళీగా ఉన్న సీట్లను పత్రికల ద్వారా వెల్లడించాలని, ఈ నెల 30 నుంచి సెపె్టంబర్ 2 వరకు స్పాట్ అడ్మిషన్లు చేపట్టాలని తెలిపింది. వచ్చే నెల 3న స్పాట్లో ప్రవేశాలు పొందిన విద్యార్థుల వివరాలను కాలేజీలు ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అన్ని డాక్యుమెంట్లను సాంకేతిక విద్య విభాగానికి వచ్చే నెల 4లోగా కాలేజీలు అందజేయాల్సి ఉంది. మరోవైపు ఇప్పటికే యాజమాన్య కోటా కింద భర్తీ చేసిన సీట్లకు సెపె్టంబర్ 5 నుంచి ర్యాటిఫికేషన్ ప్రక్రియ నిర్వహించాలని ఉన్నత విద్యామండలి షెడ్యూల్ విడుదల చేసింది. సీట్ల కేటాయింపును అన్ని డాక్యుమెంట్లతో వచ్చే నెల 10లోగా అప్లోడ్ చేయాలని సూచించింది. -
డిగ్రీకి డిగ్నిటీ...పీజీకి ఫుల్ పవర్
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యలో ఈ విద్యా సంవత్సరం నుంచి సరికొత్త కోర్సులను అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. మార్కెట్ డిమాండ్‌ను బట్టి ఆయా కోర్సులను డిజైన్ చేస్తున్నారు. ఇంజనీరింగ్‌కు సమాంతరంగా డిగ్రీ, పీజీ కోర్సులను తీర్చిదిద్దాలని యూజీసీ అన్ని రాష్ట్రాలకూ సూచించింది. ఈ దిశగా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఇప్పటికే పలు కొత్త కోర్సులకు శ్రీకారం చుట్టింది. సంప్రదాయ కోర్సుల స్థానంలో ఆనర్స్ కోర్సులు తీసుకొస్తున్నారు.తాజాగా బీఎస్సీలో బయో మెడికల్ కోర్సును, బీకాంలో ఇన్సూరెన్స్ మేనేజ్మెంట్ కోర్సులను పరిచయం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. బీఏ ఆనర్స్లోనూ ఎనలైటికల్ కంప్యూటర్స్ కోర్సులను తీసుకొచ్చే యోచనలో ఉన్నారు. విస్తరిస్తున్న కార్పొరేట్ ఆసుపత్రుల్లో విధులు నిర్వహించేందుకు బయో మెడికల్ కోర్సు ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. డిగ్రీ తర్వాత చేసే పోస్టు–గ్రాడ్యుయేట్ కోర్సుల్లోనూ స్కిల్ ప్రాధాన్యత పెంచాలని భావిస్తున్నారు. ఎమ్మెస్సీ డేటా సైన్స్‌లో మార్పులు.. » పీజీ కోర్సులకు జవసత్వాలు అందించే యోచనలోనూ కసరత్తు జరుగుతోంది. ఎంఎస్సీ డేటా సైన్స్, ఫుడ్ సైన్స్, న్యూట్రిషన్ వంటి కోర్సుల్లో మార్పులు చేశారు. పుస్తకాల ద్వారా సంపాదించే పరిజ్ఞానం తగ్గించి, పరిశ్రమల్లో నేరుగా విజ్ఞానం పొందే విధానాన్ని తీసుకొచ్చే యోచనలో ఉన్నారు. పరిశ్రమల భాగస్వామ్యంతో పీజీ కోర్సులు నిర్వహించాలని యూజీసీ సూచిస్తోంది. పీజీ తర్వాత పరిశోధన రంగానికి ఆయా విద్యార్థులు వెళ్లేలా నూతన విధానంపై కసరత్తు చేయాలని సూచించింది. దీనిపై ఈ విద్యా సంవత్సరంలోగా సరికొత్త ప్రణాళిక సిద్ధం చేయాలని యూజీసీ భావిస్తోంది. ఉపాధే లక్ష్యంగా... » కొన్నేళ్లుగా విద్యార్థుల ఆలోచనా విధానంలో మార్పు కనిపిస్తోంది. గ్రాడ్యుయేషన్ తర్వాత తక్షణ ఉపాధి కోరుకుంటున్నారు. రాష్ట్రంలో దాదాపు 4 లక్షల మంది ఇంటర్ పాసవుతుంటే, వీరిలో 90 వేల మంది ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరుతున్నారు. మరో 20 వేల మంది ఇతర రాష్ట్రల్లోని డీమ్డ్ వర్సిటీల్లోకి వెళ్తున్నారు. 40 వేల మంది వరకూ ఇంటర్‌తో విద్య ముగించి ఏదో ఒక వృత్తి, ఉద్యోగంలో స్థిరపడుతున్నారు. ఇక బీఏ, బీకాం, బీఎస్సీ సహా ఇతర డిగ్రీ కోర్సుల్లో చేరే వారి సంఖ్య ఏటా 2.20 లక్షల వరకూ ఉంటుంది. ఇందులోనూ కంప్యూటర్ నేపథ్యం ఉన్న బీకాం, హానర్స్ బీఏ వంటి కోర్సులకే ప్రాధాన్యమిస్తున్నారు. డిగ్రీ తర్వాత ఉన్న పరిజ్ఞానంతో ఏదో ఒక ఉద్యోగంలోకి వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. బీఎస్సీ చేసిన విద్యార్థులు కూడా ఫార్మా కంపెనీల్లో ఉద్యోగాల వైపు చూస్తున్నారు. పోస్టు గ్రాడ్యుయేట్ చేసినా పెద్దగా ఉద్యోగాలు ఉండవని, లెక్చరర్‌గా వెళ్లేందుకు మాత్రమే ఇది తోడ్పడుతుందనే భావన యువతలో ఉంది. దీంతో డిగ్రీ చేసినా పీజీకి వెళ్లడం లేదని ఇటీవల యూజీసీ జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. వాస్తవానికి ఇప్పుడున్న సంప్రదాయ కోర్సులైన బీఏ కోర్సుల్లో చేరే వాళ్లే తక్కువగా ఉంటుంటే, ఎంఏ వరకూ వెళ్లాలనుకునే వారి సంఖ్య ఇంకా తక్కువ. గ్రూప్స్, సివిల్స్ రాయాలనుకునే విద్యార్థులు ఇటువైపు వెళ్తున్నారు. ఈ మూడు ప్రధాన కోర్సులకు కలిపి రాష్ట్రంలో 50 వేల కనీ్వనర్ కోటా సీట్లు ఉంటే, గడచిన విద్యా సంవత్సరంలో చేరిన విద్యార్థులు 20,484 మంది మాత్రమే. అందుకే ఇలాంటి కోర్సులను కొత్త పద్ధతుల్లో నిర్వహించడం వల్ల విద్యార్థులు ఆకర్షితులవుతారనేది ఉన్నత విద్యా మండలి ఆలోచన. బీకాంలో కంప్యూటర్ అనుసంధానం చేయడం, ఇన్సూరెన్స్, మార్కెటింగ్ రంగంలో ఉపాధి పోటీని నిలబెట్టుకునే కోర్సులను ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. వీటిని ఆయా రంగాల్లో పరిశ్రమల్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ పొందేలా మార్పులు తెస్తున్నారు. -
పైసా ఖర్చు లేకుండా ప్రపంచ స్థాయి నైపుణ్యాలు
సాక్షి, అమరావతి: ప్రపంచంలోనే అత్యుత్తమ, నాణ్యమైన విద్యను అందించడం.. విద్యార్థులు ప్రపంచ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకోవడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా ఆన్లైన్ కోర్సులు అందించడంలో ప్రపంచంలోనే దిగ్గజ ఎడ్యుటెక్ సంస్థ.. ఎడెక్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఎడెక్స్ ద్వారా 260కిపైగా వరల్డ్ క్లాస్ వర్సిటీలు, కంటెంట్ పార్టనర్స్‌తో కలిసి 2వేలకు పైగా కోర్సులను ఉచితంగా అందుబాటులోకి తెచి్చంది. దీంతో పైసా ఖర్చు లేకుండా వీటిని అభ్యసిస్తున్న విద్యార్థులు సర్టీఫికేషన్ల సాధనలో రికార్డులు సృష్టిస్తున్నారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ‘ఎడెక్స్’ కోర్సులు ప్రారంభించిన నెల రోజుల్లోనే ఏకంగా 1,03,956 సర్టీఫికేషన్లు సాధించి సత్తా చాటారు. దీంతో ఎడెక్స్ చరిత్రలోనే ఏపీ అతిపెద్ద సర్టిఫికేషన్ హబ్‌గా ఆవిర్భవించింది. ఏటా ప్రపంచవ్యాప్తంగా ఎడెక్స్ కేవలం 5 లక్షల సర్టీఫికేషన్లు మాత్రమే అందిస్తోంది. కానీ, రాష్ట్ర విద్యార్థులకు ఏడాదికి 12లక్షల సర్టీఫికేషన్లు ఇచ్చేలా ప్రభుత్వం ఎడెక్స్‌తో ఒప్పందం చేసుకోవడం విశేషం. 1,469 కోర్సుల్లో సర్టీఫికేషన్లు.. ఎడెక్స్ ద్వారా కోర్సులు అందిస్తున్నవాటిలో హార్వర్డ్, ఎంఐటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, కొలంబియా, న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్, ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు ఉన్నాయి. రాష్ట్ర విద్యార్థులు 100 ప్రపంచ స్థాయి వర్సిటీల నుంచి 1,469 రకాల కోర్సుల్లో లక్షకుపైగా సర్టీఫికేషన్లు సాధించారు. ఎంఐటీ 320, హార్వర్డ్ 1,560, గూగుల్ 410, ఐబీఎం 33,700, ఏడబ్ల్యూఎస్ 770, ఏఆర్ఎం 6,400, కొలంబియా వర్సిటీ 100, ఐఐఎం బెంగళూరు 1,957, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ 170, ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ 700, స్టాన్‌ఫర్డ్ 2,200, ఫుల్ బ్రిడ్జి (హార్వర్డ్, ఎంఐటీ సంయుక్తంగా అందిస్తున్న కోర్సులు)ద్వారా 13,500 సర్టిఫికేషన్లు పొందారు. ఉన్నత విద్యా మండలి ఒక ఎడెక్స్ కోర్సును తప్పనిసరి సబ్జెక్టుగా చదివేలా కరిక్యులంలో చేర్చింది. వీటికితోడు విద్యారి్థకి నచి్చనన్ని ఎడెక్స్ కోర్సులను వ్యాల్యూ యాడెడ్‌గా చదువుకోవడానికి వీలు కలి్పస్తోంది. సులభంగా ప్రవేశాలు.. ఎడెక్స్ ద్వారా మైక్రో మాస్టర్స్ కోర్సులో 7 వేల మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. దీన్ని పూర్తి చేస్తే విదేశాల్లో ఎంఎస్‌లో చేరడం సులువవుతుంది. పైగా అక్కడికి వెళ్లాక సిలబస్‌లో ప్రస్తుతం ఎడెక్స్‌లో నేర్చుకున్న గ్రూప్ మాడ్యూల్స్‌ను మినహాయిస్తారు. తద్వారా విద్యారి్థకి ఎంఎస్‌లో చదవాల్సింది తగ్గడంతో పాటు సంబంధిత కోర్సుకు చెల్లించాల్సిన ఫీజు కూడా ఆదా అవుతుంది. రూ.382 కోట్లు వ్యయమయ్యే కోర్సులు ఉచితంగా.. ఇప్పటి వరకు 3 లక్షల మంది విద్యార్థులు, బోధన సిబ్బంది ఎడెక్స్ కోర్సులకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరందరూ ఎడెక్స్ అందించే 2 వేల కోర్సుల్లో ఒక్కో కోర్సు చొప్పున బయట చదువుకుంటే మార్కెట్ రేటు ప్రకారం ఏకంగా రూ.382 కోట్లు వ్యయమవుతుంది. ఇప్పటివరకు సుమారు 75వేల మందికిపైగా విద్యార్థులు ఆయా కోర్సులు పూర్తి చేసి 1,03,956 సర్టిఫికేషన్లు పొందారు. ఈ కోర్సుల మార్కెట్ విలువ రూ.115 కోట్ల వరకు ఉంది. ఇంత ఖరీదైన కోర్సులను విద్యార్థులపై నయాపైసా భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భరిస్తోంది. మన వర్సిటీల్లోకి అంతర్జాతీయ స్థాయి విద్య అంతర్జాతీయ స్థాయి విద్యను మన వర్సిటీల్లోకి తేవాలన్నదే మా లక్ష్యం. అందుకే ఎడెక్స్‌తో ఒప్పందం చేసుకున్నాం. ప్రపంచంలో టాప్ 50లో ఉన్న 37 వర్సిటీలు ఇందులో కోర్సులు ఆఫర్ చేస్తున్నాయి. దేశంలో ఇంత పెద్ద ఎత్తున ఎడెక్స్ ద్వారా అంతర్జాతీయ కోర్సులు అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ ఒక్కటే. ప్రపంచంలో అత్యుత్తమ అధ్యాపకులతో మన విద్యార్థులకు బోధన అందిస్తున్నాం. – కె.హేమచంద్రారెడ్డి, చైర్మన్, ఉన్నత విద్యా మండలి 32 కోర్సుల్లో సర్టీఫికేషన్లు.. మాది మదనపల్లె. అమ్మా కూరగాయలు అమ్ముతూ, నాన్న ఆటో నడుపుతూ నన్ను, తమ్ముడిని చదివిస్తున్నారు. జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన సాయంతో ఇంజనీరింగ్ చదువుతున్నా. నేను ఎడెక్స్ ద్వారా ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా సంస్థలు అందిస్తున్న 32 రకాల కోర్సులు పూర్తి చేశాను. డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, ఏఐ వంటి కోర్సుల్లో అడ్వాన్స్డ్ మెథడ్స్ నేర్చుకున్నాను. హార్వర్డ్, ఐబీఎం, గూగుల్ వంటి సంస్థల నుంచి సర్టీఫికేషన్లు పొందాను. ఈ కోర్సులు బయట చేయాలంటే వేల రూపాయలు పెట్టాలి. ఎడెక్స్ కోర్సులతో నాలాంటి పేద విద్యార్థులకు పెద్ద సంస్థల్లో మంచి ఉద్యోగాలు దక్కుతాయనే నమ్మకం ఉంది. – టి.మోక్షిత్ సాయి, బీటెక్ , శ్రీ వేంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, చిత్తూరు కర్టీన్ వర్సిటీ నుంచి సర్టిఫికేషన్.. మాది నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం గోవిందిన్నె గ్రామం. అమ్మ చిరుద్యోగి. నాన్న కూలి పనులకు వెళ్తారు. మా అన్నను, నన్ను జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు ఆదుకున్నాయి. నేను నంద్యాలలో రాజీవ్‌గాంధీ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాను. ఎడెక్స్‌లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ)లో మైక్రో మాస్టర్స్ గ్రూప్ కోర్సు చేశాను. క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 182వ స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాలోని కర్టీన్ వర్సిటీ నుంచి సర్టిఫికేషన్ సాధించాను. – దూలం చందు, బీటెక్ (ఈఈఈ) స్పెయిన్ వర్సిటీ నుంచి ఐవోటీ చేశా.. నేను ఉచితంగా ఎడెక్స్ ద్వారా ప్రపంచంలోనే అడ్వాన్స్డ్ కోర్సులు నేర్చుకుంటున్నా. స్పెయిన్‌కు చెందిన ‘వాలెన్సియా పాలిటెక్నిక్ విశ్వవిద్యాలయం’ నుంచి ఐవోటీలో మైక్రో మాస్టర్స్ కోర్సు పూర్తి చేశాను. మరో రెండు కోర్సులను కూడా త్వరలో పూర్తి చేయబోతున్నా. సొంతంగా డబ్బులు ఖర్చుపెట్టి చదవలేని నాలాంటి వారందరికీ ఎడెక్స్ కోర్సులను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. – అర్వా నాగ సుజిత, బీటెక్ (ఈఈఈ), రాజీవ్‌గాంధీ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, నంద్యాల -
ఉన్నత విద్యకు ‘స్కిల్’ జత
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యలో నైపుణ్యం దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే స్వల్పకాలిక నైపుణ్యాభివృద్ధి కోర్సులను కాలేజీలు, యూనివర్సిటీలు అందుబాటులోకి తెచ్చేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అంగీకారం తెలిపింది. తాజా బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని ప్రస్తావించింది. విధాన పరమైన నిర్ణయాన్ని ప్రకటించినప్పటీకీ పెద్దగా నిధులు కేటాయించక పోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డిగ్రీ, ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థుల్లో నైపుణ్యం ఉండటం లేదన్నది భారత పారిశ్రామిక వేత్తల అభిప్రాయం. సీఐఐ, ఎఫ్ఐఐ, నాస్కామ్ వంటి సంస్థల అధ్యయనంలోనూ ఇదే వెల్లడైంది. ఈ నేపథ్యంలో పారిశ్రామిక భాగస్వామ్యంతో ఈ కోర్సులను ముందుకు తీసుకెళ్ళాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా కన్పిస్తోంది. తక్షణ అవసరం ఇదే..: దేశంలో ఇంజనీరింగ్ పూర్తి చేసే విద్యార్థుల్లో కేవలం 8 శాతం మంది మాత్రమే నైపుణ్యం (స్కిల్)తో బయటకు వస్తున్నారు. మిగతా వాళ్ళలో కొంతమంది స్కిల్ కోసం ప్రత్యేక కోర్సులు నేర్చుకుంటున్నారు. అయితే వాళ్లలో కోర్సు నేర్చుకునే నాటికే కొత్త నైపుణ్యాలు మార్కెట్లోకి వస్తున్నాయి. దీంతో మళ్ళీ కొత్త టెక్నాలజీ నేర్చుకుంటే తప్ప మంచి వేతనంతో ఉద్యోగం లభించే అవకాశం కన్పించడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకునే విశ్వవిద్యాలయాలకు యూజీసీ తక్షణ మార్పులను సూచించింది. నైపుణ్యాభివృద్ధి మండళ్లు స్వల్ప వ్యవధి కోర్సులను ప్రారంభించేందుకు అనుమతి అక్కర్లేదని కూడా తెలిపింది. కాకపోతే పారిశ్రామిక భాగస్వామ్యం తప్పనిసరి. అప్పుడే విద్యార్థి అనుభవ పూర్వకంగా నైపుణ్యం సంపాదించేందుకు అవకాశం ఉంటుంది. ఇంటర్ ఉత్తీర్ణత సాధించి డిగ్రీ, బీటెక్ కోర్సుల్లో చేరే విద్యార్థులకు 3–6 నెలల వ్యవధిలో 27 రకాల నైపుణ్య కోర్సులను యూజీసీ సూచిస్తోంది. వీటికి 12 నుంచి 30 క్రెడిట్స్ ఇవ్వాలని కూడా నిర్ణయించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సమీక్ష జరిపింది. ఏయే కోర్సులు అందుబాటులోకి తేవచ్చు అనే విషయాన్ని ప్రభుత్వానికి ఉన్నతాధికారులు వివరించారు. ఇవీ స్కిల్ కోర్సులు అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసే కాలంలో మొత్తం 27 స్కిల్ కోర్సులను నేర్చుకోవడానికి అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులకే అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. ఇందులో ఏఐ అండ్ ఎంఎల్, రోబోటిక్స్, ఐవోటీ, ఇండ్రస్టియల్ ఐవోటీ, స్మార్ట్ సిటీస్, డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్, వీఆర్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఫోరెన్సిక్, 5 జీ కనెక్టివిటీ, ఇండ్రస్టియల్ ఆటోమేషన్, ఎల్రక్టానిక్స్ సిస్టమ్ డిజైన్, వీఎస్‌ఎస్‌ఐ డిజైన్స్, కంప్యూటర్ భాషలో ప్రాథమిక అవగాహన, మెకానికల్ టూలింగ్, మొబైల్ కమ్యూనికేషన్ లాంటి ప్రధానమైన కోర్సులున్నాయి. తెలంగాణలో కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీల భాగస్వామ్యంతో ఐవోటీ, ఏఐఎంఎల్ సహా ఇతర కంప్యూటర్ కోర్సుల్లో స్వల్పకాలిక కోర్పులు నిర్వహించవచ్చని అధికారులు అంటున్నారు. సైబర్ సెక్యూరిటీ, డేటా అనాలసిస్ వంటి వాటికి విస్తృత అవకాశాలున్నాయని భావిస్తున్నారు. తొలి దశలో ప్రైవేటు యూనివర్సిటీలు మాత్రమే ఈ దిశగా ముందుకు వెళ్ళే వీలుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కొన్ని డీమ్డ్ వర్సిటీలు ఈ దిశగా కొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాయి. స్కిల్‌తో ఉద్యోగం సులభం డిగ్రీతో పాటు నైపుణ్యం ఉంటే ఉద్యోగం లభించడమే కాదు.. అందులో రాణించడం కూడా సులభం. కంపెనీలు ఇలాంటి అర్హతలే కోరుకుంటున్నాయి. అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే నాటికి ఏదైనా ఒక రంగంలో నైపుణ్యం అవసరం. ఈ దిశగా ప్రభుత్వం, వర్సిటీలు అడుగులు వేయడం అభినందనీయం. – శ్రీరాం వెంకటేష్ (ఉన్నత విద్య మండలి కార్యదర్శి) -
ఏపీ వర్సిటీల్లో అంతర్జాతీయ కోర్సులు
సాక్షి, అమరావతి: ఉన్నత విద్యలో అంతర్జాతీయ యూనివర్సిటీల కోర్సులను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. విద్యార్థులకు కెరీర్ గైడెన్స్‌పై సమగ్ర అవగాహన కల్పించేలా ఉన్నత విద్యామండలి రూపొందించిన ‘కెరీర్ టూల్ కిట్’ ఆన్లైన్ టీచింగ్ ప్రోగ్రామ్‌ను ఆయన మంగళవారం విజయవాడలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ రాష్ట్రంలోని యూనివర్సిటీలు ప్రపంచ వ్యాప్తంగా టాప్ 50 (సబ్జెక్టుల వారీగా) విశ్వవిద్యాలయాలతో కలిసి పనిచేసేలా కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. తద్వారా విదేశాలకు వెళ్లి చదువుకోలేని ఎందరో విద్యార్థులు ఎంఐటీ, హార్వర్డ్ వంటి ప్రఖ్యాత వర్సిటీలు అందించే సుమారు 2 వేల కోర్సులను ఆన్లైన్లో చదువుకునే వెసులుబాటు కల్పింస్తున్నట్టు పేర్కొన్నారు. దేశంలోనే విద్యార్థులపై ఆర్థిక భారం పడకుండా చదువులు అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా ఏపీ నిలుస్తోందన్నారు. నూతన జాతీయ విద్యావిధానం కంటే ముందుగానే ఏపీ విద్యావ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. ఇందులో భాగంగా ఉన్నత విద్యలో 10 నెలల ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేశామన్నారు. తాజాగా తొలిసారిగా స్టైఫండ్‌తో కూడిన ఇంటర్న్‌షిప్‌ను ఇచ్చేలా అనేక కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నట్టు చెప్పారు. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలతో కలిసి విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి శ్రీకారం చుట్టామన్నారు. ఉన్నత విద్యామండలి 10 లక్షల మందికిపైగా విద్యార్థులకు మేలు చేస్తూ ప్రతి సెమిస్టర్లో విభిన్న అంశాల్లో మార్గనిర్దేశం చేసేలా ‘కెరీర్ టూల్ కిట్’ను తీసుకురావడం అభినందనీయమన్నారు. ఉన్నత విద్య ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు మాట్లాడుతూ విద్యార్థుల్లో ఫ్యూచర్ స్కిల్స్, నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టిందన్నారు. వాటి ఫలితాలే ఇండియా స్కిల్ రిపోర్టులో ఏపీని అగ్రగామిగా నిలబెట్టాయన్నారు. సెమిస్టర్ల వారీగా కెరీర్ గైడెన్స్ ఉన్నత విద్యామండలి చైర్మన్ కె.హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు సెమిస్టర్ల వారీగా కార్యాచరణ ప్రణాళిక అందించడం, ఎంచుకున్న రంగాల్లో నైపుణ్యం, సాఫ్ట్ స్కిల్స్ పెంపుపై ‘కెరీర్ టూల్‌కిట్’ మెంటార్‌గా నిలుస్తుందన్నారు. విద్యా ప్రయాణంలో ప్రతి దశలో విద్యార్థులకు వ్యక్తిగత మార్గదర్శకంగా పని చేసేలా 19 రకాల కెరీర్ టూల్ కిట్లను రూపొందించామని తెలిపారు. దేశంలో ఏ యూనివర్సిటీ, విద్యామండలి చేయని విధంగా విద్యార్థి కోర్సులో చేరినప్పటి నుంచి పూర్తి చేసి బయటకు వెళ్లేంత వరకు జాబ్, రీసెర్చ్ ఓరియంటేషన్, పర్సనాలిటీ డెవలప్మెంట్, ఆర్థిక క్రమశిక్షణ, సామాజిక దృక్పథాన్ని పెంపొందించేలా ‘కెరీర్ టూల్ కిట్’ను తీసుకొచ్చామన్నారు. ఉన్నత విద్యామండలి వైస్ చైర్పర్సన్లు రామ్మోహనరావు, ఉమా మహేశ్వరిదేవి, సెక్రటరీ నజీర్ అహ్మద్, సెట్స్ స్పెషల్ ఆఫీసర్ సు«దీర్‌రెడ్డి పాల్గొన్నారు. -
పీజీ ఇంకా ఈజీ
సాక్షి, హైదరాబాద్: పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ) విద్యను మరింత సరళీకరించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిర్ణయించింది. నాణ్యత ప్రమాణాలను మెరుగుపర్చడం దీని ఉద్దేశంగా పేర్కొంది. సరికొత్త పీజీ డిగ్రీ విధానంపై యూజీసీ ఇటీవల ముసాయిదా ప్రతిని రూపొందించింది. దీన్ని అన్ని రాష్ట్రాలకూ పంపింది. సలహాలు, సూచనలు, అభ్యంతరాల ప్రక్రియ వచ్చే నెల రెండో వారంతో ముగుస్తుంది. జనవరి ఆఖరి వారం లేదా ఫిబ్రవరిలో కొత్త పీజీ డిగ్రీ విధివిధానాలను ఖరారు చేయాలని భావిస్తోంది. డిగ్రీస్థాయి నుంచే ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సును అందించేలా ఇందులో ప్రతిపాదనలు పెట్టింది. మారుమూల గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు సైతం తేలికగా ఆన్లైన్ ద్వారా ఈ కోర్సులను చేసే వీలు కల్పించాలని యోచిస్తోంది. అయితే, ఈ పీజీ చేసే ముందు డిగ్రీలో కొంత కష్టపడాల్సి ఉంటుంది. ఏడాదిలోనే పూర్తి ఇక మీదట కేవలం ఒక ఏడాదిలోనే పీజీ కోర్సులు పూర్తి చేసే అవకాశం కల్పించబోతున్నారు. ప్రస్తుతం ఇది రెండేళ్ల కాలపరిమితితో ఉంది. అయితే, నాలుగేళ్ల డిగ్రీ కోర్సులు చేసిన వారే దీనికి అర్హులుగా యూజీసీ చెబుతోంది. వాస్తవానికి జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)–2020 అమలులో భాగంగా దేశవ్యాప్తంగా నాలుగేళ్ల కాలపరిమితి గల డిగ్రీ (ఆనర్స్) కోర్సులకు ప్రాధాన్యత పెరిగింది. క్రెడిట్ విధానం అందుబాటులోకి తెచ్చేందుకు ఇప్పటికే రంగం సిద్ధమైంది. ప్రాథమిక విద్య మొదలు పీజీ వరకూ క్రెడిట్ విధానం అమలు చేయబోతున్నారు. ఏకీకృత విద్యా విధానం అమలు చేయడం, స్కోర్ బ్యాంకులు ఏర్పాటు చేయడం ఎన్ఈపీలో భాగం. దీనివల్ల విదేశాలకు వెళ్లినా ఆన్లైన్ ద్వారా విద్యార్థి స్థాయిని లెక్కగట్టే వీలుంది. టెన్త్ వరకు ఒక గ్రేడ్, ప్లస్ టూకు మరో గ్రేడ్, డిగ్రీ, పోస్టు–గ్రాడ్యుయేషన్‌కు ఇంకో గ్రేడ్ ఇస్తారు. దీన్నిబట్టి స్కిల్, అన్ స్కిల్ విభజన చేస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మూడేళ్ల డిగ్రీతోపాటు పీజీ కూడా చేసే సమీకృత విధానం అందుబాటులోకి తెస్తారు. అంటే నాలుగేళ్లు డిగ్రీ చేసిన విద్యార్థి ఏడాది పీజీ చేస్తే సరిపోతుంది. ఆన్‌లైన్‌లోనూ అవకాశం ఏడాది పీజీ కోర్సులను ఆన్లైన్ ద్వారా కూడా చేసే వెసులుబాటు కొత్త విధానంలో తీసుకురాబోతున్నారు. నాలుగేళ్ల డిగ్రీలో అవసరమైన సాంకేతిక అంశాలను చేరుస్తారు. ముఖ్యంగా అన్ని గ్రూపుల్లో కంప్యూటర్ అనుసంధాన సిలబస్‌ను ప్రవేశ పెట్టాలన్నది యూజీసీ ఆలోచన. డిగ్రీలో అవసరమైన పారిశ్రామిక భాగస్వామ్య ఇంటర్న్‌షిప్ ఉంటుంది. విద్యార్థి ఈ దశలోనూ ప్రాక్టికల్ నాలెడ్జ్ పొందుతారు. ఈ కారణంగా పోస్టు గ్రాడ్యుయేషన్ ఫీల్డ్ వర్క్ కొంత తగ్గుతుంది. కాబట్టి ఆన్లైన్ ద్వారా పీజీ చేసినా విద్యార్థిలో నాణ్యత తగ్గే అవకాశం లేదని యూజీసీ విశ్లే షిస్తోంది. ఆన్లైన్ విధానం అందుబాటులోకి తేవడం వల్ల ఇతర దేశాల్లో పీజీ కోర్సులను చేసే వీలుందని యూజీసీ వర్గాలు అంటున్నాయి. పీజీ విద్యలో ఇది గుణాత్మక మార్పు తెస్తుందని చెబుతున్నాయి. -
దేశరక్షకులకు ఏయూ బాసట
దేశరక్షణ కోసం చిన్నతనంలోనే పనిచేసే సైనికులు.. ఉద్యోగ విరమణ తరువాత ఉపాధి అవకాశాల కోసం అన్వేషిస్తూ.. విద్యార్హతల విషయంలో భంగపడేవారు. సైనికుల సమస్యలకు పరిష్కారం చూపుతూ త్రివిధ దళాల్లో పనిచేస్తున్న సైనికులకు ఉన్నత విద్యను చేరువచేసే దిశగా ఆంధ్ర విశ్వవిద్యాలయం తీసుకున్న నిర్ణయం.. వారి జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకొచ్చింది. దేశంలోనే తొలిసారిగా సైనికోద్యోగులకు ఉన్నత విద్య అవకాశాలను, నైపుణ్యం కలిగిన కోర్సులను అందించింది. సైనికులకు మరిన్ని సేవలందించేందుకు సెంటర్ ఫర్ డిఫెన్స్ స్టడీస్‌ని స్కూల్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్‌గా మార్చింది. -సాక్షి, విశాఖపట్నం దేశరక్షణ కోసం అహర్నిశలు సరిహద్దుల్లో పోరాడుతున్న ఉద్యోగులకు, మాజీ సైనికులకు అవసరమైన విద్యాసంబంధ కోర్సులను అందించాలని ఏయూ సంకల్పించింది. దీన్ని ఆచరణలో పెట్టే దిశగా 2017లో ఏయూ ఇంజినీరింగ్ కళాశాల వేదికగా ఇండియన్ నేవీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ రీ సెటిల్మెంట్ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించింది. ఏయూతో ఒప్పందాలు చేసుకునేందుకు వారు ముందుకొచ్చారు. ఇంటర్ విద్యార్హతతో ఎయిర్‌ఫోర్స్‌లో చేరేవారికి డిప్లొమా కోర్సులను అందించడం ప్రారంభించారు. అలా ఒక డిప్లొమా కోర్సుతో మొదలుపెట్టిన ఏయూ అధికారులు ఇప్పుడు 26 డిప్లొమా కోర్సుల్ని అందిస్తున్నారు. కెమికల్, ఎలక్ట్రికల్, అకౌంటింగ్–మేనేజ్మెంట్, ఆఫీస్ మేనేజ్మెంట్, ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనింగ్, సెక్యూరిటీ అండ్ ఇంటెలిజె¯న్స్ సర్విస్, టీచింగ్ అండ్ ఎడ్యుకేష¯న్ సర్వీసెస్, హౌస్‌కీపింగ్, మ్యూజిక్, ఎయిర్‌ఫీల్ట్ సేఫ్టీ, అకౌంటింగ్ అండ్ ఆడిట్ మేనేజ్మెంట్, క్యాటరింగ్ మేనేజ్మెంట్, ఎయిర్‌సేఫ్టీ, మెటరలాజికల్ అసిస్టెŒన్స్ తదితర కోర్సులు అందిస్తున్నారు. సైనికులకు విద్యనందించాలన్న ఆశయంతో ఏర్పాటు చేసిన సెంటర్ ఫర్ డిఫెన్స్ స్టడీస్‌ని స్కూల్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్‌గా ప్రత్యేక కేంద్రంగా మార్చి సేవలను విస్తరించారు. బీఎస్సీ డిగ్రీలు, పీహెచ్‌డీలు ఐఎన్ఎస్ విశ్వకర్మలో పనిచేస్తున్న సిబ్బందికి డిగ్రీలు అందించే దిశగా అవగాహన ఒప్పందం చేసుకున్నారు. ఉద్యోగ విరమణకు దగ్గరలో ఉన్నవారికోసం ప్రత్యేకంగా నూతన ఉపాధి అవకాశాల కల్పన గురించి ఆలోచించిన ఏయూ.. పలు ప్రీ రిలీజ్ కోర్సులను ప్రారంభించింది. ఏడాదికి 15 బ్యాచ్‌ల వరకు ఈ కోర్సులను నిర్వహిస్తున్నారు. ఒక్కో కోర్సులో 30 నుంచి 50 మంది వరకు సైనికోద్యోగులు పాల్గొంటున్నారు. వీటికి ప్రత్యేకమైన సిలబస్ రూపొందించి ఏయూ అకడమిక్ సెనేట్‌లో ఆమోదించారు. ఇప్పటివరకు 58 బ్యాచ్‌లను నిర్వహించిన ఆంధ్ర విశ్వవిద్యాలయం 2,900 మందికిపైగా సైనికోద్యోగులకు ధ్రువపత్రాల్ని అందించింది. ఎగ్జిక్యూటివ్ కేటరిగీలో ఉన్న ఎయిర్‌ఫోర్స్ అధికారులకు పీహెచ్‌డీలో ప్రవేశాలు కల్పిస్తోంది. ఇప్పటికే 38 మంది అధికారులు పీహెచ్డీ చేశారు. కాలేజ్ ఆఫ్ ఎయిర్ వార్ఫేర్తో జత హైదరాబాద్‌లో ఉన్న కాలేజ్ ఆఫ్ ఎయిర్ వార్ఫేర్, దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీతో ఏయూ ఒప్పందాలు చేసుకుంది. ఎయిర్ వార్ఫేర్ కాలేజీతో ఎం.ఏ. పొలిటికల్ సైన్స్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ కోర్సుల్ని అందిస్తోంది. గ్రూప్ కెపె్టన్, వింగ్ కమాండర్ స్థాయి వారికి ఈ కోర్సును అందిస్తున్నారు. ఎయిర్‌ఫోర్స్ అకాడమీలోని జూనియర్ ఆఫీసర్ ట్రైనీగా పనిచేస్తున్న వారికి పీజీ డిప్లొమాని డిజైన్ చేసి అందిస్తున్నారు. ఇంజినీరింగ్ విద్యను మధ్యలో ఆపేసిన ఎయిర్‌ఫోర్స్, ఇండియన్ నేవీ అధికారులకోసం బీటెక్‌లో లేటరల్ ఎంట్రీ విభాగం ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు దాదాపు ఆరువేలమంది సైనికులు ఈ ఎంవోయూ ఫలితంగా బీఏ డిగ్రీలను పొంది బ్యాంకులు తదితర రంగాల్లో ఉద్యోగులుగా స్థిరపడ్డారు. దేశరక్షణకు ప్రాణాలకు తెగించి శ్రమిస్తున్న సైనికులకు ఏయూ వందనం చేస్తోంది. వారి సేవల్ని గుర్తించి.. సైనికుల జీవితాల్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ఉన్నతవిద్య అందిస్తోంది. గత వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ప్రసాదరెడ్డి చొరవతో ఎయిర్‌ఫోర్స్, నేవీ, ఆర్మీతో ఒప్పందాలు చేసుకున్నాం. ఇంజనీరింగ్, లా, ఫార్మసీ కోర్సుల్లో సైనికోద్యోగులకు, సైనిక వీరులకు ప్రవేశాలు కల్పిల్పిస్తున్నాం. నేవీ సిబ్బంది ఎంటెక్ చదివే అవకాశం ఉంది. ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో శిక్షణ పొందిన సైనికోద్యోగులకు బీపీఈడీ కోర్సు సర్టిఫికెట్లు ఇస్తున్నాం. ఇండియన్ కోస్ట్‌గార్డ్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌తోను ఎంవోయూ కుదుర్చుకున్నాం. – ప్రొఫెసర్ జేమ్స్ స్టీఫెన్, ఏయూ రిజిస్ట్రార్ -
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వైద్యరంగ అనుబంధ కోర్సులు
ఎంవీపీకాలనీ (విశాఖ తూర్పు): ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వైద్య రంగానికి అనుబంధంగా కొత్త కోర్సులు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించనున్నట్లు ఏయూ వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి తెలిపారు. ఏయూ న్యూక్లియర్ ఫిజిక్స్ విభాగం, నేషనల్ అసోసియేషన్ ఫర్ అప్లికేషన్ ఆఫ్ రేడియో ఐసోటోప్స్ అండ్ రేడియేషన్ ఇన్ ఇండస్ట్రీ(నారీ) సంయుక్త ఆధ్వర్యాన గురువారం బీచ్‌రోడ్డులోని ఏయూ సాగరిక కన్వెన్షన్‌లో ‘రీసెంట్ ట్రెండ్స్ ఆన్ ఆప్లికేషన్స్ ఆఫ్ రేడియో ఐసోటోప్స్ అండ్ రేడియేషన్ టెక్నాలజీస్’ అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి మాట్లాడుతూ నూతన జాతీయ విద్యావిధానంలో భాగంగా ఉన్నత విద్యాసంస్థలు అన్ని అంశాల్లోనూ భాగస్వాములుగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో 98 ఏళ్ల ప్రస్థానం కలిగిన ఆంధ్ర వి«శ్వవిద్యాలయంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఏయూ ఫార్మసీ, మైక్రో బయాలజీ, బయో కెమిస్ట్రీ, సైకాలజీ వంటి మెడికల్ సంబంధిత కోర్సులను అందిస్తోందని చెప్పారు. ప్రస్తుతం అనేక రంగాల్లో రేడియేషన్ టెక్నాలజీ పాత్ర పెరుగుతోందని, ఈ రంగంలో ఉన్న అద్భుత అవకాశాలను వినియోగించుకునేందుకు యువ పరిశోధకులు కృషి చేయాలన్నారు. డాక్టర్ అబ్రహాం వర్గీస్ మాట్లాడుతూ రేడియేషన్ టెక్నాలజీలో విస్తృత అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అన్ని రంగాలు, పరిశ్రమల్లో పెద్ద ఎత్తున ఈ సాంకేతికతను వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు యువ పరి«శోధకులు, ఆచార్యులు నూతన ఆవిష్కరణలకు కృషి చేయాలని సూచించారు. అనంతరం వీసీ ప్రసాదరెడ్డి, ‘నారీ’ ప్రధాన కార్యదర్శి పీజే చాండీ, డాక్టర్ అబ్రహాం తదితరులు సదస్సు ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. రేడియేషన్ టెక్నాలజీకి సంబంధించిన పరికరాలతో కూడిన ఎగ్జిబిషన్‌ను అతిథులు, విద్యార్థులు తిలకించారు. బ్రిట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రదీప్ ముఖర్జి, ఏయూ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య కె.శ్రీని, సదస్సు చైర్మన్ ఆచార్య దుర్గాప్రసాద్, న్యూక్లియర్ ఫిజిక్స్ విభాగాధిపతి ఆచార్య లక్ష్మీనారాయణ, జాతీయ స్థాయిలో వివిధ విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. -
స్కిల్ యూనివర్స్ పేరుతో డాష్ బోర్డు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిర్వహించే నైపుణ్య శిక్షణ కోర్సులు, ఉపాధి కల్పన వంటి వివరాలు 24గంటలు అందుబాటులో ఉండేవిధంగా ‘స్కిల్ యూనివర్స్’ పేరుతో డ్యాష్ బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. ఈ మేరకు ప్రత్యేక పోర్టల్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) త్వరలో అందుబాటులోకి తీసుకువస్తుందని చెప్పారు. విజయవాడ ఆటోనగర్‌లోని తన క్యాంప్ కార్యాలయంలో మంత్రి బుగ్గన శుక్రవారం నైపుణ్య శిక్షణ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు.ట్రైనింగ్, ప్లేస్మెంట్లకు సంబంధించిన సమగ్ర సమాచారం యువతకు ఎప్పటికప్పుడు తెలిసేలా డాష్ బోర్డును తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి తెలిపారు. ఏపీఎస్ఎస్డీసీ, సీడ్యాప్, న్యాక్, పీఏడీఏ వంటి వివిధ సంస్థలకు చెందిన శిక్షణ వివరాలు పోర్టల్‌లో నమోదు చేయనున్నట్టు చెప్పారు. రాష్ట్ర యువతి, యువకులు నైపుణ్య శిక్షణ కోసం నమోదు చేసుకునేవారు, శిక్షణ దశలో ఉన్నవారు, శిక్షణ పూర్తి చేసుకున్నవారు, ఉద్యోగాల్లో చేరినవారు... ఇలా సమగ్ర సమాచారం ఆన్లైన్ పోర్టల్‌లో ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యే విధంగా డ్యాష్‌బోర్డును అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు.కేతిక, నైపుణ్య విద్యను అభ్యసించే యువతి, యువకులకు అధ్యాపకుల కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. నూతన పోర్టల్‌లో అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాలతో కరిక్యులమ్(రెజ్యూమ్) తయారు చేసుకునే వెసులుబాటు కూడా కల్పిస్తున్నట్లు నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌కుమార్ తెలిపారు. వాటర్ మేనేజ్మెంట్, ప్లంబింగ్ స్కిల్ కౌన్సిల్లో ఏపీఎస్ఎస్డీసీ సాధించిన అవార్డును మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పరిశీలించారు. నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ కార్యదర్శులు, ఎండీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లను మంత్రి అభినందించారు. ఈ సమావేశంలో సాంకేతిక విద్యాశాఖ డైరెక్టర్ నాగరాణి, ఏపీఎస్ఎస్డీసీ ఎండీ డాక్టర్ వినోద్‌కుమార్, ఈడీ దినేష్‌కుమార్, ఉపాధి, శిక్షణ శాఖ డైరెక్టర్ నవ్య, సీడ్యాప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. -
రోగాలను బట్టి పీజీ మెడికల్ సీట్లు!
సాక్షి, హైదరాబాద్: ఆయా ప్రాంతాల్లో వ్యాధులు.. రోగుల సంఖ్య..అందుతున్న వైద్య సేవలను బట్టి మెడికల్ కాలేజీలకు పీజీ సీట్లు కేటాయించాలని జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నిర్ణయించింది. అంటే ఏ ప్రాంతంలో ఎలాంటి రోగాలున్నాయో, ఆయా ప్రాంతాల్లోని మెడికల్ కాలేజీలకు ఆయా స్పెషాలిటీల్లో పీజీ మెడికల్ సీట్లు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఈ మేరకు కొత్త పీజీ మెడికల్ ముసాయిదాను విడుదల చేసింది. దీని ప్రకారం.. మెడికల్ కాలేజీలో సంబంధిత స్పెషాలిటీ వైద్యంలో ఔట్ పేషెంట్ (ఓపీ)ల సంఖ్య 50కి తగ్గకుండా ఉంటేనే రెండు ఎండీ లేదా ఎంఎస్ సీట్లను ఎన్ఎంసీ మంజూరు చేస్తుంది. ఉదాహరణకు ఒక మెడికల్ కాలేజీకి రెండు పీడియాట్రిక్ సీట్లు కావాలంటే సంబంధిత కాలేజీలో రోజుకు చిన్న పిల్లల ఓపీ కనీసం 50 ఉండాలి. ఒక ఆపరేషన్ థియేటర్ 24 గంటలు పనిచేస్తేనే రెండు పీజీ అనస్తీషియా సీట్లు ఇస్తారు. వారానికి 20 ప్రసవాలు జరిగితేనే రెండు గైనిక్ సీట్లు ఇస్తారు. ఇక సంబంధిత స్పెషాలిటీలో అదనంగా మరో సీటు కావాలంటే 20 శాతం ఓపీ పెరగాలి. సూపర్ స్పెషాలిటీకి సంబంధించి రెండు సీట్లు కేటాయించాలంటే ఆయా సూపర్ స్పెషాలిటీ విభాగంలో రోజుకు 25 ఓపీ ఉండాలి. పడకల్లో 75% ఆక్యుపెన్సీ ఉండాలి ఎన్ఎంసీ మరికొన్ని కొత్త నిబంధనలను కూడా ముసాయిదాలో చేర్చింది. మెడికల్ కాలేజీల్లోని స్పెషాలిటీ పడకల్లో 75 శాతం ఆక్యుపెన్సీ ఉండాలి. అల్ట్రా సౌండ్లు రోజుకు 30 జరగాలి. 10 సీటీ స్కాన్లు చేయాలి. రోజుకు మూడు ఎంఆర్ఐ స్కాన్లు తీయాలి. రోజుకు 15 శాతం మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించాలి. గతంలో ఇలాంటి నిబంధనలు లేవు. సంబంధిత స్పెషాలిటీలో నిర్ణీత ఓపీ సంఖ్యతో సంబంధం లేకుండా మౌలిక సదుపాయాలు, సర్జరీలు, అన్ని రకాల ఓపీలు, ఐపీలు, బ్లడ్ బ్యాంకు నిర్వహణ, సీటీ స్కాన్, ఎంఆర్ఐ యంత్రాలు ఉన్నాయా లేవా? వంటివి మాత్రమే చూసి సీట్లు ఇచ్చేవారు. ఇప్పుడు ప్రధానంగా ఓపీని ప్రామాణికంగా తీసుకొని ఇవ్వాలని నిర్ణయించారు. ఐసీఎంఆర్ ఆన్లైన్ కోర్సులు చదవాలి ఎండీలో కొత్తగా 3 కోర్సులను ఎన్ఎంసీ చేర్చింది. ప్రజా రోగ్యం, బయో ఫిజిక్స్, లేబొరేటరీ మెడిసిన్లను ప్రవేశపెట్టింది. అలాగే సూపర్ స్పెషాలిటీలో ఉండే చిన్న పిల్లల గుండె, రక్తనాళాల కోర్సులను ఎత్తివేసి, సాధారణ గుండె, ఛాతీ, రక్తనా ళాల సర్జరీలో చేర్చింది. సూపర్ స్పెషాలిటీలో ఉన్న ఛాతీ శస్త్రచి కిత్స కోర్సును ఎత్తివేసి సాధారణ గుండె శస్త్రచికిత్సలో కలి పేసింది. అలాగే 11 పోస్ట్ డాక్టర్ సర్టిఫికెట్ కోర్సులు ప్రవేశపె ట్టింది. అవయవ మార్పిడి అనెస్తీషియా, పీడియాట్రిక్ ఎండోక్రైనాలజీ, లేబొరేటరీ ఇమ్యునాలజీ, న్యూక్లియర్ నెఫ్రాలజీ, రీనాల్ పెథాలజీ, గ్యాస్ట్రో రేడియాలజీ, రక్తమార్పిడి థెరపీ, పెయిన్ మేనేజ్మెంట్, హిమటో ఆంకాలజీ, పీడియాట్రిక్ ఈ ఎన్టీ, స్పైన్ సర్జరీ కోర్సులు ప్రవేశపెట్టారు. పీజీ అయిపో యిన వారు ఈ కోర్సులను చేసే సదుపాయం కల్పించారు. ప్రతి పీజీ విద్యార్థి మొదటి ఏడాది ఐసీఎంఆర్ నిర్వహించే ఆన్ లైన్ కోర్సులు తప్పనిసరిగా చదవాలి. ఈ ముసాయిదా లోని అంశాలపై అభ్యంతరాలను 15లోగా తెలియజేయాలన్నారు. ఇలా అయితేనే ఉపయోగం రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు దాదాపు అన్ని జిల్లాలకు విస్తరించాయి. అందువల్ల ఆయా మెడికల్ కాలేజీల్లో పీజీ మెడికల్ సీట్లను స్థానిక రోగాలను బట్టి కేటాయిస్తేనే ఉపయోగం ఉంటుంది. ఎన్ఎంసీ తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో శాస్త్రీయ మైనది. ఆయా ప్రాంతాల రోగులకు సంబంధిత వైద్యం అందుబాటులోకి వస్తుంది. – డాక్టర్ కిరణ్ మాదల,ఐఎంఏ సైంటిఫిక్ కన్వీనర్, తెలంగాణ -
భారత విద్యార్థులకు అమెరికా ప్రత్యేక కోర్సులు..
న్యూయార్క్: మన దేశంలో ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానానికి అనుగుణంగా అమెరికా కూడా భారతీయ విద్యార్థులకు కొత్త ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది. ఏడాది పాటు ఉండే ప్రొఫెషనల్ మాస్టర్స్ డిగ్రీ కోర్సును అందుబాటులోకి తెచ్చింది. అమెరికన్ విశ్వవిద్యాలయాలలో పారిశ్రామిక స్పెషలైజేషన్‌తో విద్యను అభ్యసించనున్నారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్ విభాగాల్లో ఈ కోర్సు ఉండనుంది. 2024 సెమిస్టర్ నుంచి ఈ కోర్సు అందుబాటులో ఉంటుందని సంబంధిత అధికారిక విభాగం వెల్లడించింది. కోర్సు పూర్తిచేసిన తర్వాత విద్యార్థులు వీసా నిబంధనలకు అనుగుణంగా మూడేళ్లపాటు అక్కడే ఉండే అవకాశం ఉంది. పనిలో అనుభవం తెచ్చుకోవడంతో పాటు స్టుడెంట్ లోన్స్ పూర్తి చేయడానికి వీలవుతుంది. అమెరికాకు చెందిన 20 యూనివర్సిటీలు 15 ఇండియన్ యూనివర్సిటీలు ఈ కోర్సుపై ఇప్పటికే చర్చలు ప్రారంభించాయి. భారతదేశం 2020లో కొత్త విద్యావిధానాన్ని తీసుకువచ్చింది. అందరికీ అందుబాటులో విద్య, భారత సంస్కృతి రక్షణ, గ్లోబర్ ఛాలెంజ్ వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని విద్యా విధానాలను రూపొందించారు. ఇదీ చదవండి: Viral: సింగిల్‌గా ఉంటే.. చిరుతైనా గమ్మునుండాల్సిందే!లేదంటే.. -
వైద్య విద్య యూజీ కోర్సుల ఫీజుల ఖరారు
సాక్షి, అమరావతి: 2023–24 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని ప్రైవేట్ వైద్య, డెంటల్ కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులకు ఫీజులు ఖరారు చేస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు మంగళవారం ఉత్తర్వులిచ్చారు. హైకోర్టు తుది తీర్పునకు లోబడి ఫీజుల అమలు ఉంటుందని పేర్కొన్నారు. 2022–23లో అమలైన ఫీజులపై 10% మేర పెంపుదల చేసి కొత్త ఫీజులను ఖరారు చేశారు. ఎంబీబీఎస్ కన్వనర్ కోటా ఫీజును రూ.16,500గా నిర్ణయించారు. బీ కేటగిరికి రూ.13.20 లక్షలు, సీ కేటగిరి (ఎన్ఆర్ఐ కోటా)కు రూ.39.60 లక్షలు చొప్పున ఫీజులు ఉన్నాయి. బీడీఎస్ కన్వనర్ కోటాకి రూ.14.300..బీ కేటగిరీకి రూ.4.40 లక్షలు, ఎన్ఆర్ఐ కోటాకి రూ.13.20 లక్షలు చొప్పున ఫీజు ఖరారు చేశారు. 2020లో ఖరారు చేసిన ఫీజుల ప్రకారం 2022–23 విద్యా సంవత్సరం వరకు ప్రవేశాలు చేపట్టారు. నీట్ యూజీ–2023లో ఏపీలో 42,836 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య వర్సిటీ ఇటీవల నోటిఫికేషన్ ఇచ్చింది. నీట్ యూజీ అర్హత సాధించినవారు దరఖాస్తు చేసుకుంటున్నారు. వ్యాయామ కళాశాలల్లో కోర్సులకు ఇలా.. ప్రైవేట్, అన్–ఎయిడెడ్ వ్యాయామ కళాశాలల్లో డీపీఈడీ, బీపీఈడీ, ఎంపీఈడీ కోర్సులకు ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సిఫారసుల మేరకు 2023–26 విద్యా సంవ్సతరానికి ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. కన్వనర్ కోటా కింద రెండేళ్ల కోర్సుల్లో భాగంగా డిప్లొమో (డీపీఈడీ)కు రూ.14 వేల నుంచి రూ.16 వేలు, బ్యాచ్‌లర్ (బీపీఈడీ)కు రూ.15 వేల నుంచి రూ.24,500, మాస్టర్స్ (ఎంపీఈడీ)కు రూ.25 వేల నుంచి రూ.35 వేల మధ్య ఆయా కళాశాలల్లోని వసతులు, విద్యా బోధనను బట్టి ఫీజులను నిర్ణయించింది. ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోని ఒక కళాశాలతో పాటు, గత అడ్మిషన్లలో 25% కంటే తక్కువ నమోదైన 5 కళాశాలలకు అడ్మిషన్లను 2023–26 విద్యా సంవత్సరానికి బ్లాక్ చేసినట్లు ఉన్నత విద్య ముఖ్య కార్యదర్శి శ్యామలరావు ఉత్తర్వులిచ్చారు. -
ఉచితంగా ‘AI’ నేర్పిస్తాం.. మైక్రోసాఫ్ట్ బంపరాఫర్!
అందరి నోళ్ళలో నానుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పై ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కీలక ప్రకటన చేసింది. ఏఐ’ని సమర్ధవంతంగా వినియోగించేందుకు, ఉపాధి పొందేలా ఉచితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కోర్స్‌లను నేర్పిస్తున్నట్లు తెలిపింది. ఈ కోర్స్‌లను లింక్డిన్తో కలిసి అభివృద్ది చేసినట్లు వెల్లడించింది. జనరేటివ్ ఏఐ లెర్నింగ్ కంటెంట్ పేరుతో ఫ్రీగా నేర్పించే ఈ కోర్స్‌ను ఔత్సాహికులు నేర్చుకోవచ్చని మైక్రోసాఫ్ట్ పేర్కొంది. కోర్స్ నేర్చుకున్న అనంతరం కెరియర్ ఎసెన్షియల్ సర్టిఫికెట్ సైతం పొందవచ్చు. తద్వారా ఏఐని ప్రొఫెషనల్‌గా మారి ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకొని ఉపాధి పొందవచ్చు. ఇటీవల భారత ఐటీ పరిశ్రమ సమాఖ్య నాస్కామ్ నివేదిక ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా భారతీయ యువత ఏఐ నేర్చుకొని, ఉద్యోగాలు చేస్తే సత్తా విషయంలో రెండో స్థానంలో ఉన్నట్లు నివేదికను విడుదల చేసింది. ఏఐ స్కిల్స్, విస్తరించే విషయంలో మొదటిస్థానంలో ఉంది. అయితే, ప్రస్తుతం టాలెంట్ ఉన్న 420,000 మంది నిపుణులను పరిగణలోకి తీసుకుంటే ఏఐ/ఎంఎల్ బిగ్ డేటా అనలిటిక్స్ టెక్ టాలెంట్ల డిమాండ్, సప్లయ్‌ల మధ్య అంతరాయం 51 శాతంగా ఉంది. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు మాట్లాడుతూ ఏఐ సరికొత్త పని విధానాన్ని రూపొందించడానికి సిద్ధంగా ఉంది. నైపుణ్యం పరంగా వృద్ది సాధించేలా తాము అభివృద్ది చేసిన ఏఐ కోర్స్ ఉపయోగపడుతుంది. గత రెండేళ్లలో టైర్ 2, టైర్ 3 పట్టాణాల నుండి దాదాపు 70,000 మంది విద్యార్ధినులు ఏఐ నైపుణ్యాలలో శిక్షణ పొందారని చెప్పారు. చదవండి👉 : ‘వెన్న తెచ్చిన తంటా’, ఉద్యోగుల తొలగింపు.. స్టార్టప్ మూసివేత! -
కోరుకున్న కాలేజీ.. కోర్సు
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ ఆన్లైన్ సేవలు, తెలంగాణ (దోస్త్) ద్వారా తొలిదశ డిగ్రీ సీట్ల కేటాయింపు శుక్రవారం పూర్తయింది. మొత్తం 1,05,935 మంది రిజిస్టర్ చేసుకున్నారు. 78,212 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. ఇందులో 73,226 మందికి సీట్లు కేటాయించారు. 4,992 మంది తక్కువ వెబ్ ఆప్షన్లు ఇవ్వడం వల్ల వారికి సీట్లు కేటాయించలేదు. ఎక్కువ మందికి కోరుకున్న కోర్సులు, కాలేజీల్లోనే సీట్లు వచ్చాయి. 53,032 (72శాతం) మందికి వారు పెట్టుకున్న తొలి ప్రాధాన్యత ప్రకారమే సీట్లు దక్కాయి. ఉన్నత విద్యా మండలిలో జరిగిన సమావేశంలో తొలి దశ సీట్ల కేటాయింపు వివరాలను మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్, మండలి కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్ మీడియాకు వెల్లడించారు. కామర్స్‌కు ఫుల్ క్రేజ్ దోస్త్‌లో మొత్తం 889 కాలేజీలు పాల్గొన్నాయి. 512 కోర్సులకు మొత్తం 3,56,258 సీట్లు ఉన్నాయి. విద్యార్థులు 3,43,102 ఆప్షన్లు ఇచ్చారు. 63 కాలేజీలకు ఒక్క ఆప్షన్ కూడా రాకపోవడం గమనార్హం. కాగా సీట్లు దక్కిన వారిలో బాలురు 29,107 మంది ఉంటే, బాలికలు 44,119 మంది ఉన్నారు. కామర్స్ కోర్సుకు డిమాండ్ పెరుగుతోందని మరోసారి రుజువైంది. దోస్త్‌లో ఈ కోర్సుకు 1,04,687 ఆప్షన్లు అందాయి. తొలిదశలో 33,251 సీట్లు కేటాయించారు. ఈ ఏడాది కొత్తగా ప్రవేశపెట్టిన బీఎస్సీ (ఆనర్స్) కంప్యూటర్ సైన్స్ కోర్సుకూ పోటీ ఎక్కువే ఉంది. ఈ కోర్సు అందుబాటులో ఉన్న 14 కాలేజీల్లో ఒక్కో కాలేజీలో 60 సీట్లు ఉంటే, అన్నీ తొలి దశలోనే భర్తీ అయ్యాయి. బీఎస్సీ (ఆనర్స్) బయో టెక్నాలజీ కోర్సును సిటీ కాలేజీలో ప్రవేశపెట్టారు. ఇక్కడ 60 సీట్లూ తొలి విడతలోనే భర్తీ అయ్యాయి. ఆర్ట్స్‌లో 1771, లైఫ్సైన్సెస్లో 16,434, ఫిజికల్ సైన్స్‌లో 13,468, డేటా సైన్స్ (ఏఐఎంఎల్)లో 1955, డి ఫార్మసీలో 254, ఇతర కోర్సుల్లో 87 మందికి సీట్లు కేటాయించారు. 30న రెండోదశ కేటాయింపు: మిత్తల్ దోస్త్ ద్వారా తొలి దశలో సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 25లోగా ఆన్లైన్ రిపోర్టింగ్ చేయాలని నవీన్ మిత్తల్ తెలిపారు. ఇలా చేయని పక్షాన సీటు మాత్రమే కాకుండా, దోస్త్ రిజిస్ట్రేషన్ కూడా రద్దవుతుందన్నారు. రిజిస్ట్రేషన్ కోసం స్వల్పంగా ఫీజు ఉంటుందని తెలిపారు. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినప్పటికీ విద్యార్థులు తదుపరి దశల్లో మెరుగైన బ్రాంచీలో, కాలేజీల్లో సీటు కోసం ప్రయత్నించవచ్చన్నారు. అప్పటివరకు కాలేజీల్లో సర్టీఫికెట్లు ఇవ్వొద్దని స్పష్టం చేశారు. రెండో దశ సీట్ల కేటాయింపు ఈ నెల 30న ఉంటుందన్నారు. ఈ సారి 83 మంది విద్యార్థులు ఇల్లు కదలకుండానే ఆధార్ అనుసంధానంతో ఓటీపీ ద్వారా దోస్త్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. జూలై 17 నుంచి డిగ్రీ క్లాసులు ప్రారంభిస్తామని తెలిపారు. -
లోతైన పరిజ్ఞానం.. తక్షణ ఉపాధి
సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా కోట్లాది మంది చదువుతున్న అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) డిగ్రీ స్వరూపం క్రమంగా మారబోతోంది. ఇప్పటిలా మూడేళ్ళు కాకుండా, నాలుగేళ్ళ కాలపరిమితితో డిగ్రీ (యూజీ ఆనర్స్) ఉండనుంది. సాధారణ సంప్రదాయ కోర్సులు భవిష్యత్‌లో తెరమరుగయ్యే వీలుంది. బీఏ, బీకాం, బీఎస్సీ..లాంటివి ప్రత్యేకంగా ఉండకుండా వీటికి కంప్యూటర్స్, డేటాసైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ).. లాంటి కోర్సులు జత కానున్నాయి. విద్యార్థికి లోతైన పరిజ్ఞానం అందించడమే లక్ష్యంగా ఈ కోర్సులు ఉండనున్నాయి. ఆర్ట్స్ విద్యారి్థకి కంప్యూటర్ పరిజ్ఞానం.. సైన్స్ విద్యార్థికి సామాజిక అవగాహన కోర్సుల వంటి మార్పులతో నాలుగేళ్ల డిగ్రీ ఉండనుంది. జాతీయ విద్యావిధానం–2020లో భాగంగా ఈ తరహా బోధన ప్రణాళికను (కొత్త కరిక్యులం ఫ్రేమ్‌వర్క్) యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఇప్పటికే సిద్ధం చేసింది. యూజీసీ కొత్త ప్రణాళికలను అన్ని రాష్ట్రాలూ ఆమోదించాయి. తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాల్లో నాలుగేళ్ల యూజీ ఆనర్స్ డిగ్రీ కోర్సులను పరిమితంగా ప్రవేశపెట్టారు. భవిష్యత్తులో ఇది మరింత విస్తృతం కానుండగా..రాష్ట్రంలోని ప్రైవేటు కాలేజీలు కూడా ఆనర్స్ డిగ్రీ కోర్సులను అందుబాటులోకి తెచ్చేందుకు ముందుకొస్తున్నాయి. ఇకనుంచి క్రెడిట్స్ విధానం ఇక నుంచి డిగ్రీ పట్టాలు క్రెడిట్స్ ఆధారంగా ఉంటాయి. ఒక్కో స్థాయికి కొన్ని క్రెడిట్స్ ఉంటాయి. విద్యార్థులు మూడేళ్లలో 120 క్రెడిట్లు పూర్తి చేస్తేనే యూజీ డిగ్రీకి అర్హులవుతారు. సబ్జెక్టులను బట్టి క్రెడిట్లు ఉంటాయి. కాగా విద్యార్థి నాలుగేళ్లలో 160 క్రెడిట్లను పూర్తి చేస్తేనే యూజీ ఆనర్స్ డిగ్రీ పట్టా లభిస్తుంది. అలాగే ఆనర్స్ డిగ్రీ కోర్సుల్లో చేరేవారు రీసెర్చ్ కోసం వెళ్లాలనుకుంటే తమ నాలుగేళ్ల కోర్సులోనే రీసెర్చ్ ప్రాజెక్టులను చేపట్టాల్సి ఉంటుంది. మొదటి ఆరు సెమిస్టర్లలో 75 శాతం అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు పరిశోధనలు చేపట్టాలనుకుంటే నాలుగో ఏడాదిలో పరిశోధనా ప్రాజెక్టును ఎంచుకోవచ్చు. దీన్ని పూర్తి చేస్తే వారికి యూజీ ఆనర్స్ విత్ రీసెర్చ్ డిగ్రీని ప్రదానం చేస్తారు. మూడేళ్ల కోర్సు చేస్తున్నవారికీ అవకాశం ప్రస్తుతం మూడేళ్ల డిగ్రీ కోర్సులు చేస్తున్నవారు కూడా నాలుగేళ్ల ఆనర్స్ కోర్సులకు మారేందుకు కొత్త కరిక్యులం ఫ్రేమ్‌వర్క్ అవకాశం కల్పిస్తుంది. ఇప్పటికే చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ (సీబీసీఎస్) ప్రకారం మూడేళ్ల యూజీ కోర్సుల్లో పేర్లు నమోదు చేసుకున్న, అభ్యసిస్తున్న విద్యార్థులు కూడా నాలుగేళ్ల యూజీ ఆనర్స్ కొనసాగించడానికి అర్హులని నిబంధనల్లో పేర్కొన్నారు. ఇలాంటి విద్యార్థులు బ్రిడ్జి కోర్సులు పూర్తి చేయడం తప్పనిసరి అని యూజీసీ పేర్కొంది. ఏడాది చదివితే సరి్టఫికెట్.. రెండేళ్లయితే డిప్లొమా నాలుగేళ్ల యూజీ ఆనర్స్ కోర్సు విద్యార్థులకు బహుళ ప్రవేశ, నిష్క్రమణలకు అవకాశం కల్పించనున్నారు. ఇందులో భాగంగా మొదటి ఏడాది పూర్తి చేస్తే ఆ మేరకు విద్యారి్థకి సర్టిఫికెట్ లభిస్తుంది. రెండేళ్లు చదివితే డిప్లొమా లభిస్తుంది. మూడేళ్లు చదివితే డిగ్రీ పట్టా లభిస్తుంది. నాలుగేళ్లు పూర్తి చేస్తే ఆనర్స్ బ్యాచిలర్ డిగ్రీ పట్టా అందుతుంది. బోధనలోనూ మార్పులు.. ళీయూజీ ఆనర్స్‌ను మార్కెట్లో తక్షణ ఉపాధి లభించేలా, వైవిధ్యంగా నైపుణ్యాత్మకంగా అందించాలని నిర్ణయించారు. మెయిన్, మైనర్ స్ట్రీమ్ కోర్సులు, భాష, నైపుణ్య కోర్సులు, పర్యావరణ విద్య, డిజిటల్, సాంకేతిక పరిష్కారాలు తదితర విభాగాల కోర్సులు ఉంటాయి. కొత్తగా ఆరోగ్యం, యోగా, క్రీడలు, ఫిట్నెస్ వంటివి కూడా చేర్చారు. ఆధునిక భారతీయ భాష, సంస్కృతి, ఆంగ్ల భాష, నైపుణ్యాల పెంపుదల, నైతిక విలువల కోర్సులు ఉంటాయి. అలాగే విద్యార్థుల ఉపాధి అవకాశాలు పెంపొందించడానికి ఆచరణాత్మక నైపుణ్యాలు, శిక్షణ, సాఫ్ట్ స్కిల్స్ అందించడం లక్ష్యంగా ప్రత్యేక కోర్సులను చేర్చారు. లోతైన పరిజ్ఞానం అందించడమే లక్ష్యం ఆనర్స్ డిగ్రీ కోర్సుల్లో లోతైన పరిజ్ఞానం అందించేలా బోధన ఉంటుంది. బహుళ ప్రయోజనాలు ఉండాలన్నదే సరికొత్త మార్పుల లక్ష్యం. భవిష్యత్‌లో ఇక నాలుగేళ్ళ ఆనర్స్ కోర్సులే ఉండే వీలుంది. ఇందుకు అనుగుణంగానే తెలంగాణలోనూ బోధన ప్రణాళిక, పరీక్ష విధానంపై మార్పులకు అధ్యయనాలు జరుగుతున్నాయి. – ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆనర్స్ వైపే అందరిచూపు.. విద్యార్థులు డిగ్రీ విద్యలో మార్పు కోరుకుంటున్నారు. ఆనర్స్ కోర్సులకు ప్రాధాన్యత పెరుగుతోంది. అందుకే ప్రైవేటు కాలే జీలు కూడా విద్యార్థులు కోరుకుంటున్న ఆనర్స్ కోర్సులు అందించేందుకు యతి్నస్తున్నాయి. ఈ మేరకు మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నాయి. – ఎక్కల్దేవి పరమేశ్వర్, ప్రైవేటు డిగ్రీ కాలేజీల సంఘం ప్రధాన కార్యదర్శి -
డ్రోన్ పైలట్ అవుతారా? శిక్షణ కోర్సులు అందించనున్న ఎయిర్‌బస్
ముంబై: యూరోపియన్ ఏవియేషన్ దిగ్గజం ఎయిర్‌బస్ భారత్‌లో డ్రోన్ పైలట్ల శిక్షణ కోర్సులను అందించనున్నట్లు వెల్లడించింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆమోదం పొందిన ఈ సర్టిఫికెట్ కోర్సులు అయిదు రోజుల పాటు ఉంటాయి. సూక్ష్మ, చిన్న కేటగిరీ డ్రోన్ల కోసం ఉద్దేశించిన కోర్సులు బెంగళూరులోని ఎయిర్‌బస్ ట్రైనింగ్ సెంటర్లో జూన్ 26 నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. డ్రోన్ల నిబంధనలు, ఫ్లయిట్ ప్రాథమిక సూత్రాలు, నిర్వహణ మొదలైన వాటిపై డీజీసీఏ ఆమోదించిన ఇన్స్ట్రక్టర్లు శిక్షణనిస్తారని పేర్కొంది. సిమ్యులేటర్ శిక్షణతో పాటు ప్రాక్టికల్ ఫ్లయింగ్ పాఠాలు కూడా ఉంటాయని వివరించింది. 10వ తరగతి పూర్తి చేసిన, 18 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులు ఈ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇందు కోసం దరఖాస్తు చేసుకునేవారికి తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే భారతీయ పాస్‌పోర్ ఉండాలి. అలాగే శిక్షణ పొందేందుకు, డ్రోన్లను ఆపరేట్ చేయడానికి ఫిట్నెస్ను ధ్రువీకరించే మెడికల్ సర్టిఫికేట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. ఇదీ చదవండి: Palm Payment: ఇదేదో బాగుందే.. వట్టి చేతులు చాలు! పేమెంట్ ఈజీ -
డిగ్రీకి డిమాండ్ పెరిగేనా?
విద్యార్థులను డిగ్రీ కోర్సుల వైపు మళ్లించేందుకు దేశవ్యాప్తంగా కసరత్తు జరుగుతోంది. ఇందులోభాగంగా కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. మార్కెట్ అవసరాలకు అనువైన కోర్సులను తెస్తున్నారు. ఈ ఏడాది ఇంటర్మిడియెట్ 2.95 లక్షల మంది పాసయ్యారు. రాష్ట్రంలో 1.10 లక్షల ఇంజనీరింగ్ సీట్లుండగా, వీటిలో ఏటా 90 వేల మంది వరకు చేరుతున్నారు. మిగతా వాళ్లంతా డిగ్రీ వైపే మొగ్గు చూపుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే నాలుగేళ్ల డిగ్రీ కోర్సులు, ఇంజనీరింగ్‌తో సమానమైన కంప్యూటర్ సైన్స్, డేటాసైన్స్ కోర్సులను ఉన్నత విద్యామండలి తెస్తోంది. ఈ ఏడాది నుంచి 11 డిగ్రీ కాలేజీల్లో కంప్యూటర్ సైన్స్‌ను ఆనర్స్ కోర్సుగా అందిస్తున్నారు. అయితే ఈ ప్రయత్నాలు ఏమేరకు ఫలితాలిస్తాయన్నది వేచి చూడాలని, ఇది అనేక అంశాలపై ఆధారపడి ఉందని అధికారులు చెబుతున్నారు. - సాక్షి , హైదరాబాద్ రాష్ట్రంలో మొత్తం 1,073 డిగ్రీ కాలేజీలుండగా, 4,68,880 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఏటా వీటిలో సగం కూడా భర్తీ అవ్వడం లేదు. దీంతో గత ఏడాది 3,86,544కు సీట్లను కుదించారు. అయినా భర్తీ అయినవి 2,12,818 మాత్రమే. ఈ నేపథ్యంలో అధికారులు ఈసారి మరో 82,336 సీట్లకు కోత పెట్టారు. కొత్త కోర్సులు పెట్టుకుంటే తప్ప సీట్లకు అనుమతించలేమని ఉన్నత విద్యామండలి స్పష్టం చేసింది. కంప్యూటర్ సైన్స్, బీకాం కంప్యూటర్స్, డేటా సైన్స్ వంటి కోర్సులు కేవలం ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోనే ఎక్కువగా పెడుతున్నారు. హైదరాబాద్ వంటి నగర ప్రాంతాల్లో ఉండే కాలేజీలు కొత్త కోర్సులను పెడుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కాలేజీలు మాత్రం దీన్ని సాహసంగానే భావిస్తున్నాయి. కంప్యూటర్ కోర్సులు తెచ్చినా, అత్యధిక వేతనాలిచ్చి ఫ్యాకల్టీ సమకూర్చడం, మౌలిక వసతులు ఏర్పాటు చేయడం కష్టమనే ధోరణితో ఉన్నాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో కాలేజీల్లోని సీట్లు మిగిలిపోతున్నాయి. విద్యార్థులు కూడా ఇంటర్ తర్వాత రాజధాని బాట పడుతున్నారు. డిగ్రీతోపాటు ఉపాధి లభించే కొన్ని సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకోవచ్చనే యోచనతో ఉన్నారు. కారణాలేంటి? ♦ సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) అధ్యయనం ప్రకారం రాష్ట్రంలో పేద, మధ్య తరగతి విద్యార్థులు చాలా వరకూ డిగ్రీ తర్వాత ఏదో ఒక ఉపాధిని ఎంచుకుంటున్నారు. కరోనా తర్వాత ఈ పరిస్థితి స్పష్టంగా కన్పిస్తోంది. ♦ ఇంజనీరింగ్‌లో సాఫ్ట్వేర్ రంగంలో సులభంగా స్థిరపడొచ్చని విద్యార్థులు భావిస్తున్నారు. దీంతో సీఎస్ఈ, ఇతర కంప్యూటర్ సైన్స్ కోర్సుల వైపు వెళ్తున్నారు. గత ఐదేళ్లలో 90 శాతం విద్యార్థుల కౌన్సెలింగ్ ఆప్షన్లు ఈవిధంగానే ఉన్నాయి. ♦ డిగ్రీలో కామర్స్ వైపు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అకౌంటింగ్‌తోపాటు, కంప్యూటర్ కోర్సులూ దీనికి అనుసంధానమై ఉన్నాయి. దీంతో ప్రైవేటు సెక్టార్లో డిగ్రీ తర్వాత స్థిరపడే వీలుందని భావిస్తున్నారు. గత ఏడాది దోస్త్‌లో కూడా 37 శాతం మంది విద్యార్థులు కామర్స్‌ను ఎంచుకున్నారు. ♦ లైఫ్ సైన్స్కూ ఓ మోస్తరు డిమాండ్ పెరుగుతోంది. కార్పొరేట్ సెక్టార్లో ఉపాధికి అవకాశాలున్నాయని విద్యార్థులు అంచనా వేస్తున్నారు. దీంతో 19 శాతం మంది లైఫ్ సైన్స్‌ను ఎంచుకుంటున్నారు. తర్వాత స్థానాల్లో ఆర్ట్స్, ఫిజికల్ సైన్స్ కోర్సులున్నాయి. డిమాండ్ పెరగొచ్చు ఈ ఏడాది కొత్త కోర్సులు తేవాలని అన్ని కాలేజీలకు చెప్పాం. డిమాండ్ లేని కోర్సుల్లో సీట్లు తగ్గించినా, డిమాండ్ ఉండే కోర్సుల్లో మార్పులు తెస్తే అనుమతిస్తాం. ఇంజనీరింగ్‌తో సమానంగా డిగ్రీ కోర్సులూ ఉపాధి మార్గాలు కావాలన్నదే మండలి లక్ష్యం. ఈ దిశగా గుణాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాం. డిగ్రీ కోర్సులకు మంచి ఆదరణ పెరుగుతుందనే విశ్వాసం ఉంది. – ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్ -
తెలంగాణ సర్కార్ వినూత్న ఆలోచన.. చదువుకుంటూనే సంపాదన!
సాక్షి, హైదరాబాద్: నైపుణ్యంతో కూడిన డిగ్రీ కోర్సులకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించిన రాష్ట్ర ఉన్నత విద్యామండలి.. అందుకనుగుణంగా ప్రణాళికను సిద్ధంచేస్తోంది. వచ్చే ఏడాది (2023–24) నుంచి ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేసే వీలుంది. ఈ క్రమంలో ఈనెల 28న వంద కాలేజీల ప్రిన్సిపల్స్, ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహిస్తున్నట్టు మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి తెలిపారు. ఏ కాలేజీలో ఏ కోర్సు సాధ్యమనేది చర్చించి, త్వరలో ప్రణాళికను ప్రకటిస్తామని చెప్పారు. ఇప్పటికే సంప్రదాయ డిగ్రీ కోర్సుల స్థానంలో ఇంజనీరింగ్‌తో సమానంగా డేటా సైన్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్, ఆనర్స్ కోర్సులను అందుబాటులోకి తెచ్చారు. తాజాగా ప్రవేశపెట్టే నైపుణ్య కోర్సులు డిగ్రీ విద్య స్వరూప స్వభావాల్ని మారుస్తాయని, చదువుతూనే ఉపాధి పొందవచ్చని మండలి అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన విధివిధానాలనూ తెలంగాణ స్టేట్ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ తయారుచేస్తోందని ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. చదవండి: 3 నెలల్లో ఆర్టీసీ ఎన్నికలు నిర్వహించండి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం ఏమిటీ కోర్సులు? కేంద్ర ప్రభుత్వ స్కిల్ ఇండియా పథకంలో భాగంగా స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంట్రప్రెన్యూర్షిప్ కొన్నేళ్లుగా సరికొత్త కోర్సులపై అధ్యయనం చేసి.. 14 నైపుణ్య కోర్సులకు రూపకల్పన చేసింది. వీటిలో రిటైల్ మేనేజ్మెంట్, క్రియేటివ్ రైటింగ్, ఈ–కామర్స్, లాజిస్టిక్స్, గేమింగ్ అండ్ యానిమేషన్ వంటి కోర్సులున్నాయి. స్కిల్ కోర్సులను రెండు రకాలుగా నిర్వహించాలని యోచిస్తున్నారు. ఫస్టియర్ నుంచే స్కిల్ కోర్సులుండేలా ఒక పథకం, రెండో ఏడాది నుంచి వీటిని అమలు చేయడం మరో విధానంగా తీసుకురానున్నారు. చదివే సమయంలోనే స్టైపెండ్ డిగ్రీ చదివే సమయంలో స్కిల్ కోర్సులను ప్రాక్టికల్‌గా నేర్పుతారు. ఇందుకు కొన్ని సంస్థలతో ఉన్నత విద్యామండలి ఒప్పందం చేసుకుంటుంది. ఆయా సంస్థల్లో వారానికి మూడు రోజులు విద్యార్థి ప్రాక్టికల్‌గా శిక్షణ పొందుతారు. ఈ సమయంలో రూ.10 వేల వరకూ నెలకు ఉపకార వేతనం అందుతుంది. రాష్ట్రంలో మొత్తం 1,056 డిగ్రీ కాలేజీలున్నాయి. వీటిలో తొలుత 103 ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో స్కిల్ కోర్సులు ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నారు. చదవండి: బీఆర్ఎస్ దేశంలోనే నంబర్-1.. సెకండ్ ప్లేస్‌లో ఆప్..! -
విద్యా సంస్థలకు యూజీసీ లేఖ
సాక్షి, అమరావతి: దేశంలో అనాధ విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన సూపర్ న్యూమరరీ సీట్లతో ఎంతమంది విద్యార్థులకు లబ్ధి చేకూరింది? ఎన్ని విద్యా సంస్థల్లో వారికి సీట్లు ఇచ్చారో తెలపాలని అన్ని యూనివర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు వాటికి లేఖ రాసింది. ఇందుకు సంబంధించిన నోటీసును తన అధికారిక వెబ్సైట్లో పొందుపరిచింది. కోవిడ్‌తో 2020, 2021ల్లో అనేక మంది మృత్యువాత పడ్డ సంగతి తెలిసిందే. కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులిద్దరూ మరణించడంతో పిల్లలు అనాధలుగా మారారు. వీరిలో కొంతమంది పాఠశాల చదువుల్లో ఉండగా మరికొంతమంది ఉన్నత విద్యనభ్యసిస్తున్నారు. వీరు తదుపరి ఉన్నత తరగతుల్లో చేరేందుకు ఎలాంటి సమస్యలు లేకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ‘పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్’ కింద అన్ని విద్యాసంస్థల్లోనూ సూపర్ న్యూమరరీ సీట్లు ప్రవేశపెట్టాలని గతేడాది మార్చిలో సూచించింది. ఈ మేరకు అన్ని విద్యాసంస్థలూ సూపర్ న్యూమరరీ సీట్లను అనాధ విద్యార్థులకు కేటాయించేలా చేసింది. ఇప్పుడు విద్యా సంవత్సరం పూర్తవుతున్న నేపథ్యంలో సూపర్ న్యూమరరీ సీట్లతో లబ్ధి పొందిన వారి సమాచారాన్ని తెలియచేయాలని యూజీసీ ఆయా విద్యాసంస్థలకు సూచించింది. విద్యార్థుల సంఖ్యతో పాటు వారు ఏయే కోర్సులు అభ్యసిస్తున్నారు? వారు ఎలాంటి సహాయం పొందుతున్నారు? వంటి అంశాలను కూడా అందించాలని కోరింది. -
కొత్తగా సైబర్ సెక్యూరిటీ కోర్సు
సాక్షి, హైదరాబాద్: అండర్ గ్రాడ్యుయేషన్‌లో కొత్తగా సైబర్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ కోర్సును ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కసరత్తు వేగవంతం చేసింది. 2023–24 విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి తీసుకు రానున్నట్లు ప్రకటించిన టీఎస్సీహెచ్ఈ... ఆ కోర్సు పాఠ్యాంశం, విధానాలు తదితరాల ఖరారు కోసం డీజీపీ కార్యాలయం, ఉస్మా ని యా, జేఎన్టీయూ, నల్సార్ యూనివర్సిటీల తో పాటు ఐఐటీ హైదరాబాద్‌లను ప్రతి పాది స్తూ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా గురువారం టీఎస్సీ హెచ్ఈ కార్యాలయంలో ప్రత్యేక కమిటీ ప్రతినిధులతో సమావేశం జరిగింది. సైబర్ సెక్యూరిటీ అండ్ సైన్స్ కోర్సు విధివిధానాలపై చర్చించారు. -
లక్షన్నర డిగ్రీ సీట్లు కుదింపు
సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల నుంచి డిమాండ్ లేని కోర్సులను భారీగా కుదించాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. కనీసం 15 శాతం విద్యార్థులు చేరని కాలేజీలకూ అనుమతి నిరాకరించాలని భావిస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే దీన్ని కచ్చితంగా అమలు చేస్తామని మండలి వర్గాలు తెలిపాయి. త్వరలో అధికారులు సమావేశమై దీనిపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఇంజనీరింగ్ విద్యలో ఈ స్థాయి మార్పును ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేస్తున్నారు. విద్యార్థులు చేరని సివిల్, మెకానికల్ కోర్సుల్లో దాదాపు 10 వేల వరకూ సీట్లు తగ్గించారు. వాటి స్థానంలో కంప్యూటర్ కోర్సులకు అనుమతించారు. ఈ సీట్లు ఈ సంవత్సరం 9 వేలకుపైగా పెరిగాయి. ఇదే విధానాన్ని డిగ్రీ కోర్సుల్లోనూ అమలు చేయాలని భావిస్తున్నారు. దీనివల్ల గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో కొన్ని డిగ్రీ కోర్సులు తగ్గబోతున్నాయి. 1.50లక్షల సీట్లు కుదింపు సీట్ల తగ్గింపు ప్రక్రియకు ఈ ఏడాది దోస్త్ ప్రవేశాలను కొలమానంగా తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యికిపైగా కాలేజీల్లో 4.60 లక్షల డిగ్రీ సీట్లున్నాయి. వీటిలో ఈ ఏడాది దోస్త్‌లో 2,10,970 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. నాన్–దోస్త్ కాలేజీలు కలుపుకుంటే 2.20 లక్షల సీట్లు భర్తీ అయినట్టు అధికారులు తెలిపారు. ఈ లెక్కన దాదాపు 2.40 లక్షల సీట్లు మిగిలిపోయాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని దాదాపు 1.50లక్షల సీట్లు వచ్చే దోస్త్‌లో లేకుండా చేయాలనే నిర్ణయానికి వచ్చారు. గత కొన్నేళ్ల ట్రెండ్‌ను పరిశీలిస్తే బీకాం, బీఎస్సీ కోర్సుల్లో విద్యార్థులు ఎక్కువగా చేరుతున్నారు. ఈ ఏడాది బీకాంలో 87,480 మంది చేరితే బీఎస్సీ లైఫ్‌సైన్స్, ఫిజికల్ సైన్స్‌లో కలిపి 75896 మంది చేరారు. సగానికిపైగా ఆక్రమించిన ఈ కోర్సులకు రాబోయే కాలంలోనూ మంచి డిమాండ్ ఉండొచ్చనే ఆలోచనతో ఉన్నారు. ఇక బీఏలో కేవలం 31838 మంది చేరారు. ఈ కోర్సులో 75 వేలకుపైగా సీట్లున్నాయి. ఇలాంటి కోర్సులను తగ్గించే యోచనలో ఉన్నారు. బీబీఎం, ఒకేషనల్, బీఎస్‌డబ్ల్యూ వంటి కోర్సుల వైపు విద్యార్థులు మొగ్గు చూపడం లేదు. కాలేజీల్లో అవగాహన గత నాలుగేళ్ల డేటాను సేకరించిన ఉన్నత విద్యా మండలి జీరో అడ్మిషన్లు ఉన్న కాలేజీలను 50 వరకూ గుర్తించారు. 15 శాతం లోపు విద్యార్థులు చేరిన సెక్షన్లు వంద వరకూ ఉంటాయని అంచనా. ఇలాంటి కాలేజీల యాజమాన్యాల్లో ముందుగా అవగాహన కల్గించే యోచనలో ఉన్నారు. విద్యార్థులు ఎక్కువగా డిగ్రీ కోర్సులకు కూడా హైదరాబాద్ వరకూ వస్తున్నారు. డిగ్రీతో పాటు ఇతర కోర్సులు నేర్చుకునే అవకాశం ఉండటంతో ఈ తరహా ప్రాధాన్యమిస్తున్నారు. ఈ కారణంగా గ్రామీణ ప్రాంతాలకు దగ్గరగా ఉండే కాలేజీల్లో చేరికలు తక్కువగా ఉన్నాయి. ఇలాంటి కాలేజీల్లో కంప్యూటర్ అనుసంధానమైన కోర్సులు ప్రవేశపెట్టేందుకు యాజమాన్యాలు ముందుకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. ముందుగా ఇతర కోర్సుల్లోకి సీట్లు మార్చుకునే అవకాశం కల్పించాలని నిర్ణయించారు. దీనికి ముందుకు రాకపోతే కాలేజీల్లో సీట్లు తగ్గించడం, విద్యార్థులు లేని కాలేజీలకు అనుమతులు రద్దు చేసే వీలుంది. సీట్ల మార్పిడికి అవకాశం విద్యార్థులు చేరని కోర్సులను ఇంకా కొనసాగించడం సరికాదు. డిమాండ్ ఉన్న కోర్సుల్లో, అదనపు సెక్షన్లు పెంచుకునే అవకాశం కల్పిస్తాం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీన్ని అమలు చేయాలనే సంకల్పంతో ఉన్నాం. డిమాండ్‌కు తగ్గట్టుగానే డిగ్రీ సీట్లకు అనుమతించాలనే ఆలోచనకు కార్యరూపం తీసుకొస్తాం. – ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ఉన్నత విద్య మండలి చైర్మన్ -
ఊహించనివిధంగా సీఎస్సీ కటాఫ్
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ జాతీయ ఇంజనీరింగ్ సంస్థల్లోనూ విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ (సీఎస్సీ) కోర్సులో చేరడానికి ఎక్కువగా మొగ్గుచూపిస్తున్నారు. తాజాగా ఐఐటీలు, ఎన్ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇతర విద్యా సంస్థల్లో జోసా నిర్వహించిన ఆరు రౌండ్ల కౌన్సెలింగ్‌లో ఇది స్పష్టమైంది. ప్రధాన ఐఐటీల్లో కంప్యూటర్ సైన్స్ కోర్సుల కటాఫ్ ర్యాంకులు ఊహించని విధంగా ఉన్నాయి. బాలికలకు సూపర్‌న్యూమరరీ సీట్లు కేటాయించడంతో వారి పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. ఓపెన్ కేటగిరీలో కొన్ని సంస్థల్లో వందలోపు ర్యాంకు వచ్చిన వారికి కూడా సీట్లు దక్కలేదు. ముంబై, కాన్పూర్, ఢిల్లీ ఐఐటీలలో పోటీ ఈసారి తీవ్రంగా ఉంది. పాలక్కడ్, భిలాయ్ ఐఐటీల్లో 5 వేల పైన ర్యాంకు వచ్చిన వారికీ సీటు దక్కడం విద్యార్థులకు కాస్తా ఊరటనిచ్చింది. ఎన్ఐటీల్లోనూ అదే జోరు.. జాతీయ ఇంజనీరింగ్ సంస్థల్లో (ఎన్ఐటీలు) ఈసారి కూడా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్సుకే డిమాండ్ కొనసాగింది. ఇతర బ్రాంచీలకన్నా సీఎస్సీ కోర్సులకు విద్యార్థులు 10 రెట్లు ఎక్కువగా ఆప్షన్లు ఇచ్చారు. అందులోనూ ఎన్ఐటీలను మొదటి ఐచ్చికంగా ఎంచుకున్నారు. దీంతో వరంగల్ నిట్‌లో ఓపెన్ కేటగిరీలో బాలురకు 2 వేల లోపు ర్యాంకు వరకే సీట్లు దక్కాయి. తిరుచనాపల్లిలో వెయ్యిలోపు ర్యాంకు వరకే సీట్లు వచ్చాయి. ఏపీ, కాలికట్, జలంధర్, సిక్కిం, హమీర్పూర్ ఎన్ఐటీల్లో 10 వేల పైబడ్డ ర్యాంకుల వరకు సీట్లు లభించాయి. బాలికలకు కొంత మెరుగు తాజాగా ఐఐటీ, ఎన్ఐటీలలో కటాఫ్ తీరును పరిశీలిస్తే బాలురకన్నా, బాలికల పరిస్థితి కాస్తా మెరుగ్గా కనిపించింది. ఆరు రౌండ్ల సీట్ల కేటాయింపు తర్వాత ముంబై ఐఐటీలో బాలికలకు 305 ర్యాంకు వరకూ సీటు వచ్చింది. తిరుపతిలో 5,901 వరకూ, భిలాయ్‌లో 7,176 వరకూ సీటు వచ్చింది. ఎన్ఐటీల విషయానికి వస్తే హమీర్పూర్ ఎన్ఐటీలో 18 వేల వరకూ కటాఫ్ ఉంటే, తిరుచనాపల్లిలో 1,852 బాలికల కటాఫ్‌గా ఉంది. దీంతో ఓపెన్ కేటగిరీలో బాలికలు సాధారణ పోటీతో సీట్లు దక్కించుకోవడం సాధ్యమైందని విశ్లేషకులు అంటున్నారు. కోవిడ్ తర్వాత జరిగిన జేఈఈ మెయిన్స్ పేపర్లు కఠినంగానే ఉన్నాయని చెబుతున్నారు. దీంతో ర్యాంకుల సాధనలోనూ ఈసారి పోటీ వాతావరణం కనిపించింది. -
ఒకేసారి డబుల్ డిగ్రీలు.. యూజీసీ మార్గదర్శకాలు ఇవే..
సాక్షి, అమరావతి: జాతీయ నూతన విద్యావిధానాన్ని అనుసరించి దేశవ్యాప్తంగా విద్యార్ధులు ఏకకాలంలో రెండు కోర్సులు అభ్యసించేందుకు వీలుగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మార్గదర్శకాలు జారీచేసింది. పీహెచ్డీ మినహా మిగిలిన కోర్సులకు నిబంధనలను అనుసరించి వీటిని విద్యార్ధులకు అందుబాటులో ఉంచాలని సూచించింది. అన్ని వర్సిటీలు, ఇతర ఉన్నత విద్యాసంస్థలు ఈమేరకు చర్యలు చేపట్టాలని తాజాగా ఆదేశించింది. చదవండి: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ ప్రాంతాల్లో మూడు రోజులు వర్షాలు ఈ మేరకు జాతీయ విద్యా విధానం 2020 విధానాల్లో పూర్తిగా మార్పులు చేయాలని సూచించింది. విద్యార్థుల ఆసక్తికి అనుగుణంగా ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ (ఓడీఎల్) విధానంలో నచ్చిన కోర్సులను అభ్యసించేందుకు అవకాశం కల్పించాలని, ఆన్లైన్ విద్య కార్యక్రమాలను సిద్ధం చేయాలని ఆయా విద్యాసంస్థలను యూజీసీ ఆదేశించింది. ఇవీ మార్గదర్శకాలు ♦ఒక విద్యార్థి ఫిజికల్ మోడ్‌లో రెండు విద్యా కార్యక్రమాలను పూర్తి సమయం కొనసాగించవచ్చు. తరగతి సమయాలు భిన్నంగా ఉండేలా చూడాలి. ♦విద్యార్థి రెండు విద్యా కార్యక్రమాలను ఒకేసారి కొనసాగించవచ్చు, ఒకటి పూర్తి సమయం భౌతికంగా మరొకటి ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ (ఓడీఎల్)/ఆన్లైన్ మోడ్‌లో చేయవచ్చు. లేదా రెండూ ఓడీఎల్/ఆన్లైన్ ప్రోగ్రామ్‌లలో ఏకకాలంలో అభ్యసించవచ్చు. ♦ఓడీఎల్/ఆన్లైన్ మోడ్ కింద డిగ్రీ లేదా డిప్లొమా ప్రోగ్రామ్‌లు యూజీసీ/చట్టబద్ధ సంస్థలు, ప్రభుత్వాలు గుర్తించిన కార్యక్రమాలకే పరిమితం కావాలి. ప్రభుత్వ అనుమతి ఉన్న సంస్థలే వీటిని చేపట్టాలి. ♦యూజీసీ నోటిఫికేషన్ జారీ చేసినప్పటి నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి వస్తుంది. ఇప్పటికే రెండు డిగ్రీలు చదువుతున్న విద్యార్ధులు ఎవరైనా ఉంటే యూజీసీ నిబంధనలను అనుసరించి అనుమతి పొందాలి. నూతన విధానం లక్ష్యాలు ♦విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని ఏకకాలంలో రెండు విద్యా కార్యక్రమాలను కొనసాగించేందుకు అనుమతించాలి. ♦సైన్స్, సోషల్ స్టడీస్, ఆర్ట్స్ సహా ఇతర విభాగాల్లో అవకాశం కల్పించాలి. ♦భాష, ప్రొఫెషనల్, టెక్నికల్, వొకేషనల్ విషయాలను కూడా అందుబాటులోకి తేవాలి. ♦నచ్చిన అంశాలను నేర్చుకోవడంతోపాటు ఆసక్తి ఉన్న ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అంశాలలో క్షుణ్నంగా అధ్యయనానికి వీలు కల్పించాలి. -
నర్సింగ్‌లో ఏడాది రెసిడెంట్ శిక్షణ
సాక్షి, హైదరాబాద్: భారత నర్సింగ్ మండలి (ఐఎన్‌సీ) ఆస్పత్రుల్లోని క్రిటికల్ కేర్ విభాగాల్లో సేవలందించేందుకు కొత్తగా స్పెషాలిటీ కోర్సును ప్రవేశపెట్టింది. దీనిని పోస్ట్ బేసిక్ డిప్లొమా ఇన్ క్రిటికల్ కేర్ స్పెషాలిటీ నర్సింగ్– రెసిడెన్సీగా పిలుస్తారు. ఈ కోర్సులో చేరేవారికి ఏడాదిపాటు రెసిడెంట్ శిక్షణ ఇస్తారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా మార్గదర్శకాలు జారీచేసింది. 200 పడకలున్న ఆస్పత్రులు ఈ కోర్సును బోధించేందుకు అనుమతిస్తారు. కరోనా కాలంలో క్రిటికల్ కేర్ వైద్యం అనేది కీలకంగా మారింది. దీంతో క్రిటికల్ కేర్ మెడిసిన్ వేగంగా అభివృద్ధి చెందింది. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న రోగుల సంరక్షణ కోసం నర్సుల నైపుణ్యాలను పెంచాల్సిన అవసరముందని ఆ మార్గదర్శకాల్లో కేంద్రం నొక్కి చెప్పింది. ఐసీయూ సేవలు అవసరమయ్యే రోగుల సంఖ్య పెరుగుతోందని పేర్కొంది. ఈ రోగులను చూసుకోవడానికి నర్సులు ఉండాల్సిన అవసరముందని తెలిపింది. రోగికి అవసరమైన పోషకాహారం, కమ్యూనికేషన్, ఎండ్ ఆఫ్ లైఫ్ కేర్ మొదలైన అంశాలపై వీరు దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఏడాది రెసిడెన్సీ కోర్సులో 10 శాతం థియరీ, 90 శాతం స్కిల్ ల్యాబ్, క్లినికల్ అంశాల్లో అభ్యసనం ఉంటుంది. జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ పూర్తయిన వారు ఈ కోర్సును చేయవచ్చు. ఈ కోర్సు పూర్తి చేసిన నర్సులను మల్టీ–స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏదైనా క్రిటికల్ కేర్ యూనిట్లో మాత్రమే నియమించాలి. క్రిటికల్ కేర్ విభాగంలో పనిచేసే నైపుణ్యం కలిగిన నర్సులు అవసరమని భావించి కేంద్రం ఈ కోర్సు ప్రవేశపెట్టిందని నర్సింగ్ నిపుణులు అనిల్‌కుమార్, రుఢావత్ లక్ష్మణ్ పేర్కొన్నారు. -
మీడియా అకాడమీ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు బ్రిడ్జి కోర్సు
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా, ఇతర వర్సిటీల సహకారంతో జర్నలిస్టుల కోసం ఒక బ్రిడ్జి కోర్సుకు రూపకల్పన చేస్తున్నామని, సర్టిఫికెట్ సైతం జారీ చేస్తామని రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. హైదరాబాద్ జర్నలిస్టుల కోసం మీడియా అకాడమీ నిర్వహించిన రెండు రోజుల శిక్షణా శిబిరం ముగింపులో ఆయన మాట్లాడారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను ఆచరణ లో పెట్టాలని జర్నలిస్టులకు సూచించారు. 9 ఉమ్మడి జిల్లాల్లో తరగతులు నిర్వహించి ఆరు వేల మంది జర్నలిస్టులకు శిక్షణ ఇచ్చామని, దళిత, మహిళా, హైదరాబాద్ జర్నలిస్టులకు ప్రత్యేక శిక్షణా తరగతుల నిర్వహణతో మరో 1,000 మంది లబ్ధి పొందారని చెప్పారు. అకాడమీ 12 పుస్తకాలు ప్రచురించి జర్నలి స్టులకు అందజేసిందని, అకాడమీ కోసం నిర్మిస్తున్న నూతన భవనంలో ఒక ఆడిటో రియం, ఒక డిజిటల్ క్లాస్ రూమ్ ఉంటాయని తెలిపారు. రెండు రోజుల శిక్షణ తరగతుల్లో పాల్గొన్న జర్నలిస్టులకు వెటరన్ జర్నలిస్ట్, ‘మహిళా విజయం’ మాస పత్రిక సంపాదకు రాలు, వాసిరెడ్డి కాశీరత్నం చేతుల మీదుగా సర్టిఫికెట్స్ అందజేశారు. -
డిమాండ్‌లో ఉన్న టెక్ స్కిల్స్!! అత్యధిక జీతం అందించే 'సాఫ్ట్వేర్ ఉద్యోగాలు' ఇవే!
సాఫ్ట్వేర్ జాబ్ చేయడం మీ కలనా? అయితే మీకో శుభవార్త. సాఫ్ట్వేర్ జాబ్ చేయాలని ఉంటుంది. కానీ ఏ కోర్స్ చేస్తే ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఏ కోర్స్ చేస్తే ఎంత శాలరీ వస్తుంది. ఈ కోర్స్ చేయడం మంచిదేనా అంటూ ఇలా రకరకాల అనుమానాలతో సందిగ్ధతకు గురవుతుంటారు. అలాంటి అనుమానాలకు చెక్ పెడుతూ ఇటీవల జరిగి ఓ సర్వే రాబోయే రోజుల్లో సాఫ్ట్వేర్ జాబ్ పొందాలంటే ఎలాంటి కోర్స్‌లు నేర్చుకుంటే భవిష్యత్ బాగుంటుందనే విషయాల్ని వెల్లడించింది. '2022 టెక్ స్కిల్స్ అండ్ ట్రెండ్స్ రిపోర్ట్' పేరుతో ఇటీవల వెలుగులోకి వచ్చిన సర్వే ప్రకారం.. 2019-2021 మధ్య 2లక్షలకు పైగా అసెస్మెంట్ల ద్వారా సేకరించిన డేటా ఆధారంగా, సాంకేతిక నైపుణ్యాలు నిరంతరం అభివృద్ధి చెందుతూ, డిజిటలైజేషన్ ప్రక్రియ వ్యాపార కోణాన్ని మారుస్తోందని నివేదిక గుర్తించింది. అందువల్ల, జావా, జావాస్క్రిప్ట్, ఎస్‌క్యూఎల్ డెవలపర్లు ఈ సంవత్సరంలో అన్ని టెక్ విభాగాల్లో డిమాండ్ ఉన్న స్కిల్‌గా భావిస్తున్నారు. ఫ్రంటెండ్, బ్యాకెండ్ ఫుల్ స్టాక్ డెవలపర్లకు బీభత్సమైన డిమాండ్ ఉంది. అయితే డేటా సైన్స్, ఏడబ్ల్యూఎస్, ఎజెడ్యూఆర్ఈAzure, ఎస్‌క్యూఎల్, డేటా విశ్లేషణ, క్లౌడ్ సిస్టమ్, ఆటోమేషన్, డేటా సైన్స్, వెబ్ ప్రోగ్రామింగ్ తో పాటు డేటా విజువలైజేషన్లో ఉపయోగించడం వల్ల పైథాన్ అత్యంత ప్రజాదరణ పొందిన కోడింగ్‌గా ఉద్భవించిందని సర్వేలో తేలింది. -
ఆనర్స్.. బోధించేవారు లేరు సార్!
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యామండలి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెచ్చిన బీఏ ఆనర్స్ కోర్సు ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. పెద్ద ఎత్తున ప్రచారం కల్పించి తీసుకొచ్చిన ఈ కోర్సు ప్రణాళిక ప్రకారం ముందుకు సాగడం లేదు. ఇప్పుడున్న కోర్సులకన్నా భిన్నంగా వీటిని ముందుకు తీసుకెళ్లాలని భావించినప్పటికీ ఫ్యాకల్టీ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. దీన్ని పరిష్కరించేందుకు అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రభుత్వం ఈ ఏడాది నిజాం కాలేజీలో ఎకనామిక్స్, కోఠి ఉమెన్స్ కాలేజీలో పొలిటికల్ సైన్స్ సబ్జెక్టులను ఆనర్స్‌గా ప్రారంభించింది. సీట్లు కూడా భర్తీ అయ్యాయి. ప్రాజెక్టు వర్క్, ఫీల్డ్ స్టడీ ఎక్కువగా ఉండేలా సిలబస్ రూపొందించారు. సామాజిక అవసరాలకు అనుగుణంగా వీటిని తీర్చిదిద్దడం వల్ల ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయని భావించారు. అయితే, రాష్ట్రంలో ఆ స్థాయిలో ప్రత్యేక బోధన చేపట్టగల అధ్యాపకులు దొరకడం లేదు. ఇతర రాష్ట్రాల్లోని అధ్యాపకుల కోసం సైతం వేట మొదలు పెట్టారు. ఈ ప్రయత్నంలోనూ అవాంతరాలు ఎదురవుతున్నాయని అధికారవర్గాలు చెబుతున్నాయి. దీంతో ఎలాంటి పురోగతి కన్పించడం లేదనే విమర్శలొస్తున్నాయి. (బాసర ట్రిపుల్ఐటీకి న్యాక్ ‘సి’ గ్రేడ్.. అధికారుల తీరే కారణమా..?) నిపుణుల కోసం వేట.. ► ఆనర్స్ కోర్సుల్లో ఎదురవుతున్న సమస్యలపై ఇటీవల అధికారులు చర్చించారు. నిపుణుల కోసం జల్లెడ పట్టాలని నిర్ణయించారు. ఇతర రాష్ట్రాల్లో పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ బోధన విజయవంతంగా సాగుతుండటంతో అక్కడి అధ్యాపకులను రప్పించేందుకు సంప్రదింపులు చేపడుతున్నారు. కానీ పూర్తిస్థాయి బోధనకు వారు సుముఖంగాలేరని తెలిసింది. హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక క్లాసు చెప్పగలమే తప్ప పూర్తిస్థాయిలో బోధించలేమని వారు చెబుతున్నారు. దీంతో కచ్చితమైన ప్రణాళిక కష్టమని అధికారులు వాపోతున్నారు. ► వీలైతే ఇతర రాష్ట్రాల అధ్యాపకుల చేత ఆన్లైన్ క్లాసులైనా ఇప్పించాలనుకుంటున్నారు. దీనికోసం అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఈ ప్రయోగం ఏమేర సత్ఫలితాలనిస్తుందనేది చెప్పలేమని అధికారులు అంటున్నారు. కొత్త కోర్సు కావడంతో విద్యార్థుల సందేహాల నివృత్తి వీలవుతుందా అనే అనుమానాలున్నాయి. ఇతర రాష్ట్రాల ఫ్యాకల్టీ ఆన్లైన్ ద్వారా కొద్దిసేపు మాత్రమే బోధించే వీలుందని నిజాం కాలేజీ అధ్యాపకుడు ఒకరు చెప్పారు. ► ప్రముఖులతో విశ్లేషణలు ఆనర్స్ కోర్సుల్లో ప్రధానాంశం. అవసరమైతే ఆర్బీఐ మాజీ గవర్నర్, ఆ స్థాయి అధికారులతో ఆర్థిక శాస్త్రంలో మార్పులపై చెప్పిస్తామని అధికారులు చెప్పినా.. ఇంతవరకు సరైన ప్రణాళిక లేదు. ఎవరిని, ఎప్పుడు పిలవాలి? అనే దానిపై విద్యార్థులకు ఎలాంటి షెడ్యూల్ ఇవ్వలేదు. -
నాణ్యమైన విద్య కోసమే ఫీజుల పెంపు
సాక్షి, హైదరాబాద్: నాణ్యమైన విద్య కోసం సెల్ఫ్ ఫైనాన్స్ వ్యవసాయ కోర్సుల్లో ఫీజులు పెంచక తప్పదని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్‌చాన్స్‌లర్ డాక్టర్ వి.ప్రవీణ్‌రావు స్పష్టం చేశారు. ఒకేసారి డొనేషన్ ఫీజు కింద రూ.10 లక్షలు, ఏడాదికి రెగ్యులర్ ఫీజు కింద రూ.50 వేల చొప్పున వసూలు చేస్తున్నామన్నారు. ఈవిధంగా వచ్చిన సొమ్మును హాస్టళ్ల అభివృద్ధికి కేటాయిస్తున్నామని చెప్పారు. ఇక్కడ కల్పిస్తున్న మౌలిక వసతులు ఫైవ్‌స్టార్ స్థాయిలో ఉనప్పటికీ ఫీజులు మాత్రం దేశంలో అన్ని రాష్ట్రాల కంటే తక్కువగానే ఉన్నాయని పేర్కొన్నారు. వ్యవసాయ విద్యను అభ్యసిస్తున్న ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం 20–25 లక్షల రూపాయలు ఖర్చు చేస్తోందని వివరించారు. కొత్తగా 11 రకాల వంగడాలను గురువారం ఆవిష్కరించిన సందర్భంగా ప్రవీణ్‌రావు మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ప్రైవేటు వ్యవసాయ కళాశాలలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. గత ఐదారేళ్లలో 47 రకాల వంగడాలను విడుదల చేశామన్నారు. ఐదు రకాల వరి కొత్త వంగడాలు కొత్తగా విడుదల చేస్తున్న 11 వంగడాల్లో ఐదు వరి రకాలు, రెండు జొన్న, కంది, పెసర, సోయా చిక్కుడు, నువ్వులకు చెందిన వంగడాలు ఒకటి చొప్పున ఉన్నాయని ప్రవీణ్ రావు తెలిపారు. జొన్న రకాల వంగడాలను పండించాక వాటిని తిన్నవారికి ఆరోగ్యకర ప్రయోజనాలు ఉంటాయన్నారు. గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుందని, ఇది డయాబెటిస్ రోగులకు ప్రయోజనమన్నారు. చీడపీడల్ని తట్టుకునే వంగడాల రూపకల్పనకి వర్సిటీ ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. వర్సిటీ విద్యార్థులు ఏటా 30కిపైగా జేఆర్ఎఫ్ (జూనియర్ రీసెర్చ్ ఫెలోషిఫ్)లు సాధిస్తున్నారన్నారు. రోబోటిక్స్‌తో కలుపు నివారణ రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ వంటి అధునాతన పరిజ్ఞాన వినియోగంలో వర్సిటీ ముందంజలో ఉందని ప్రవీణ్ రావు వివరించారు. ‘రోబోటిక్స్ సాంకేతికతను మొక్కజొన్న పంటల్లో కలుపు నివారణకు ఉపయోగించుకోవచ్చు. డ్రోన్ పరిజ్ఞానాన్ని ప్రతీ గ్రామానికి తీసుకెళ్లాలని భావిస్తున్నాం. తద్వారా డ్రోన్లతో పంటలపై పురుగు మందులను పిచికారీ చేయొచ్చు. డ్రోన్లపై నిరుద్యోగ యువకులకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించవచ్చు. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్స్‌లో శిక్షణ ఇచ్చేందుకు వర్సిటీలో త్వరలోనే అగ్రిహబ్‌ని ప్రారంభిస్తున్నాం. కేంద్రప్రభుత్వం ఈ మధ్య ఒక జిల్లాకి ఒక పంట పథకంలో భాగంగా మన వర్సిటీకి మూడు జిల్లాలకి రూ.8.4 కోట్లు మంజూరు చేసింది. వాటిని జగిత్యాలలో వరి, మామిడి, వరంగల్ జిల్లాలో పసుపు, మిరప, హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో చిరుధాన్యాల అభివృద్ధి కోసం ఖర్చు చేస్తాం’అని వివరించారు. వర్సిటీ తరపున రాష్ట్రంలోని అన్ని జిల్లాల సాయిల్ మ్యాపింగ్ పూర్తయిందని ఆయన చెప్పారు. -
నాన్ ఇంజనీరింగ్ విద్యార్థులకు వీఐటీ స్కాలర్షిప్
సాక్షి, అమరావతి: నాన్ ఇంజనీరింగ్ చదవాలనుకునే విద్యార్థులకు వీఐటీ యూనివర్శిటి శుభవార్త అందించింది. తమ యూనివర్శిటీలో ఆర్ట్స్ బీబీఏ, లా, బీ.కమ్, బీఏ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులలో చేరే అభ్యర్థులకు ఆర్థికంగా మద్దతు ఇచ్చే లక్ష్యంగా జీవీ మెరిట్ స్కాలర్‌షిప్‌తో పాటు రాజేశ్వరి అమ్మాళ్ మెరిట్ స్కాలర్షిప్ను ఇవ్వనున్నట్లు గురువారం వీఐటీ యూనివర్శిటీ ఉపాధ్యక్షుడు డా.శేఖర్ విశ్వనాథన్ ప్రకటించారు. విశ్వవిద్యాలయ సామజిక బాధ్యతగా సాగుతున్న స్టార్స్ ప్రోగ్రామ్ కూడా కొనసాగుతూనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. జీవీ మెరిట్ స్కాలర్షిప్ దేశవ్యాప్తంగా ఏ బోర్డు టాపర్కైనా అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంలో ప్రతి సంవత్సరం వందశాతం స్కాలర్షిప్ లభిస్తుందని వీఐటీ-ఏపీ వైస్ ఛాన్సలర్ డా.ఎస్ వి కోటా రెడ్డి అన్నారు. వీఐటీ-ఏపీ రిజిస్ట్రార్ డా.సి.ఎల్.వి శివకుమార్ మాట్లాడుతూ.. రాజేశ్వరి అమ్మాళ్ మెరిట్ స్కాలర్షిప్ పొందటానికి అర్హతలుగా అభ్యర్థి దేశవ్యాప్తంగా ఏదేని జిల్లా టాపర్‌గా ఉండాలన్నారు. అతను/ఆమె డిగ్రీ ప్రోగ్రాంలో అన్ని సంవత్సరాలకు 50 శాతం స్కాలర్షిప్ పొందుతారని తెలిపారు. జిల్లా టాపర్ ఒక అమ్మాయి అయితే, ఆమెకు అదనంగా 25 శాతం స్కాలర్షిప్ లభిస్తుంది దీంతో మొత్తం 75 శాతం స్కాలర్షిప్ అవుతుంది. అందుబాటులో ఉన్న కోర్సుల వివరాలు.. ⇔ బీబీఏలో జనరల్ మేనేజ్మెంట్, బిజినెస్ అనలిటిక్స్, డిజిటల్ మార్కెటింగ్, ఫిన్‌టెక్ కోర్సులు, ⇔ న్యాయ విభాగంలో బి.ఏ. ఎల్.ఎల్.బి (హనర్స్), బి.బి.ఏ. ఎల్.ఎల్.బి (హనర్స్) కోర్సులను, ⇔ బి.కామ్ కోర్స్మూడేళ్ళతోపాటుసిఎంఏ, సిఏ, ఏసిఎస్ లకుప్రాధమికంగా బోదించటం జరుగుతుంది. అదే విధంగా డ్యూయల్ డిగ్రీ విభాగంలో బి.ఏ. మరియు ఎం.ఏ (పబ్లిక్సర్వీసెస్), బి.ఎస్సి. మరియు ఎం.ఎస్సి (డేటాసైన్సు) కోర్సులను అందచేయటం జరుగుతుంది. ఈ రెండు మెరిట్ స్కాలర్షిప్లను నాన్ ఇంజనీరింగ్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ అడ్మిషన్స్ 2021 నుండి అమలులోనికి వస్తాయని యూనివర్శిటీ యాజమాన్యం పేర్కొంది. ఈ అర్హత కలిగి విద్యార్థిని/ విద్యార్థులు తేదీ 17.02.2021 నుంచి 31.05.2021 లోపు దరఖాస్తు చేసుకోవాలని వీఐటీ-ఏపీ విశ్వవిద్యాలయ అసిస్టెంట్ డైరెక్టర్ –అడ్మిషన్స్ డా. ఆర్. తహియా అఫ్జల్ తెలిపారు. మరిన్ని వివరాలకు కోసం విశ్వవిద్యాలయ వెబ్ సైట్ www.vitap.ac.in నుసందర్శించవచ్చని లేదా 7901091283కి కాల్ చేసి లేదా admission@vitap.ac.inకి ఈ-మెయిలు చేసి వివరాలను పొందవచ్చని చెప్పారు. -
సీట్లు ఖాళీ.. కోర్సులు మాయం
సాక్షి, మహబూబ్‌నగర్ : పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో 2019–20 విద్యా సంవత్సరంలో సీట్లు భారీ మొత్తంలో మిగిలియాయి. దీని కారణంగా కొన్ని ప్రైవేట్ కళాశాలల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు డిగ్రీలో ప్రవేశం పొందేందుకు మూడు దశల్లో కౌన్సెలింగ్ నిర్వహించింది. మొత్తంగా కేవలం 38 శాతం సీట్లు మాత్రమే భర్తీ అయినట్లు తెలుస్తోంది. అయితే ఆన్లైన్ విధానంపై విద్యార్థులకు సరైన అవగాహన లేకపోవడమే ప్రధాన కారణంగా చెప్పవచ్చు. అంతేకాకుండా ఇంటర్మీడియట్ ఫలితాల్లో నెలకొన్న గందరగోళ పరిస్థితులు కూడా ఒకింత ప్రభావం చూపాయని పలువురు తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. సీట్లు పొందిన వారు వివిధ కళాశాలల్లో సంబంధిత కోర్సుల్లో 25 శాతం కంటే తక్కువ సీట్లు పొందిన వారిని, అక్కడ కోర్సు నిలిపివేసి దగ్గరలో ఉన్న మరో కళాశాలలో విలీనం చేసేందుకు యూనివర్సిటీ అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఉమ్మడి జిల్లాలో 90 కళాశాలలు ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 90 డిగ్రీ కళాశాలలు ఉండగా ఇందులో 21 ప్రభుత్వ, 3 అటానమస్ కళాశాలలు ఉన్నాయి. మొత్తం 33,380 సీట్లకు విద్యార్థులు అడ్మిషన్ పొందాల్సి ఉండగా.. కేవలం 8,978 మంది మాత్రమే ప్రవేశం పొందారు. మొత్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో కలిపి 38 శాతమే భర్తీ అయ్యింది. అయితే చాలా వరకు ప్రైవేట్ కళాశాలల్లో సీట్లు భర్తీ కాలేదని చాలామంది అభిప్రాయపడుతున్నా.. కొన్ని ప్రభుత్వ కళాశాలల్లోనూ అదే పరిస్థితి నెలకొంది. కొంత మంది విద్యార్థులు సంప్రదాయ కోర్సుల వైపు మొగ్గు చూపకపోవడం, అనుకున్న చోట సీటు రాకపోవడం వంటి కారణాలున్నాయి. అయితే రెండో దశ కౌన్సెలింగ్‌లో అవే కళాశాలల్లో సీట్లు కావాలని విద్యార్థులు ఎక్కువగా ఆప్షన్లు ఇచ్చుకున్నారు. ఈ క్రమంలో రూరల్ ప్రాంతాల్లో ఉన్న కళాశాలల్లో ఎక్కవ మొత్తంలో సీట్లు మిగిలిపోయాయి. ఇక మూడో దశలో కూడా ఇలాగే జరిగింది. అయితే ఏ కళాశాలలో ఎన్ని సీట్లు ఉన్నాయి.. ఎక్కడ సీట్లు భర్తీ అయ్యాయి అనే అంశాలు తెలియకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో సీట్లు రాని చాలామంది విద్యార్థులు టీటీసీ, ఇంజినీరింగ్‌తోపాటు ఐటీఐ, డిప్లొమా వంటి కోర్సులకు మళ్లారు. ప్రస్తుతం మారుతున్న పరిస్థితుల్లో సంప్రదాయ కోర్సులైన బీఏ, బీకాం, బీఎస్సీ వంటి కోర్సులు చాలా వరకు ఆదరణ తగ్గిందనే చెప్పవచ్చు. కొత్తగా ప్రారంభించిన కోర్సుల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రైవేట్ కళాశాలలపై ప్రభావం విద్యార్థులకు సీట్ల కేటాయింపుల్లో మార్కులు, ఆర్థిక, సామాజిక అంశాల వారీగా సీట్లు కేటాయించే ప్రక్రియ మూడు దశల్లో కౌన్సెలింగ్‌లో జరిగింది. అయితే విద్యార్థులకు ప్రభుత్వం అందించే ట్యూషన్ ఫీజు, ఫీజు రీయంబర్స్మెంట్ వంటివి అందించగా నేరుగా యాజమాన్యాలు వివిధ కోర్సుల ఆధారంగా రూ.14 వేల నుంచి రూ.20 వేలు వసూలు చేసేలా వెసులుబాటు కల్పించింది. దీని కారణంగా ఎక్కువ మంది విద్యార్థులు ప్రతిభ ఉన్న విద్యార్థులు ప్రభుత్వ యాజమాన్యా కళాశాలల వైపు మొగ్గుచూపారు. ఈ కారణంగా ఎక్కువ సీట్లు ప్రైవేట్ కళాశాలల్లో మిగిలిపోయాయి. దీంతో 25 శాతం కంటే తక్కువ సీట్లు ఉన్న సీట్లను ఇతర కళాశాలల్లో విలీనం చేయడం వల్ల వాటి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. కోర్సులు విలీనం ఉమ్మడి పాలమూరులోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో సీట్లు భారీగా మిగిలిపోయాయి. ఈ క్రమం లో వివిధ కళాశాలల్లో విద్యార్థులకు సీట్లు దొరకని పరిస్థితి నెలకొంది. అయితే కోర్సుల్లో 25 శాతం సీట్లు భర్తీ కానీ కళాశాలల్లో వి ద్యార్థులను ఇతర కళాశాలల్లోకి మార్చనున్నారు. ఒక కోర్సులో మొ త్తం 40 సీట్లు ఉంటాయి. వీటిలో కనీసం 10 మంది విద్యార్థులైనా అడ్మిషన్ లేకపోతే అక్కడ వారికి తరగతులు బోధించడం అనేది ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలకు తలమించిన భారం. ఈ కారణంగా అధికారులు విద్యార్థులకు సకాలంలో నాణ్యమైన విద్యను అందించాలంటే కోర్సులను ఇతర కళాశాలల్లో విలీనం చేయనున్నారు. ఇక జీరో శాతం అడ్మిషన్లు ఉన్న కళాశాలలో పూర్తిగా కోర్సులను తొలగించనున్నారు. మరోసారి నిర్వహిస్తాం.. ఈ సంవత్సరం దోస్తు వెబ్సైట్ ద్వారా జరుగుతున్న డిగ్రీ అడ్మిషన్లు గతం కంటే చాలా తక్కువగా భర్తీ అయ్యాయి. ఇప్పటికే మూడు దశల్లో కౌన్సిలింగ్ నిర్వహించాం. మరోమారు నిర్వహించే అవకాశం ఉంది. అయితే వివిధ కళాశాలల్లో కోర్సుల వారీగా 25 శాతం కంటే తక్కువ అడ్మిషన్లు జరిగిన విద్యార్థులను ఇతర కళాశాలల్లోకి మార్పు చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని గతంలో తక్కువ అడ్మిషన్లు అయిన కళాశాలలకు నిలిపివేశాం. – రాజారత్నం, వైస్ చాన్స్‌లర్, పాలమూరు యూనివర్సిటీ -
విద్యావ్యవస్థను సంస్కరించండి
న్యూఢిల్లీ: వివిధ కోర్సుల అడ్మిషన్ల సమయంలో విద్యార్థులకు అధిక ఆర్థిక భారం, మానసిక ఒత్తిడి లేకుండా చూడటం కోసం మొత్తం విద్యా వ్యవస్థలో మార్పులు చేయాలని కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలను సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. మహారాష్ట్రలో 2019–20 విద్యా సంవత్సరానికి పీజీ మెడికల్, డెంటల్ కోర్సుల అడ్మిషన్లలో నెలకొన్న అనిశ్చితి కారణంగా విద్యార్థులు పడుతున్న దురవస్థ గురించి కోర్టు ప్రస్తావిస్తూ, ప్రతిభావంతులైన విద్యార్థులకు ఇది కష్టంగా ఉంటుందని వ్యాఖ్యానించింది. ‘మా విచారం అంతా విద్యార్థుల గురించే. ఇది ప్రతి ఏడాదీ జరుగుతుంది. మెడికల్ లేదా ఇతర కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి విద్యార్థుల మెదళ్లలో అనిశ్చితి నెలకొంటోంది’ అని జస్టిస్ ఇందూ మల్హోత్రా, జస్టిస్ ఎంఆర్ షాల వేసవికాల సెలవుల ధర్మాసనం పేర్కొంది. ‘విద్యా వ్యవస్థను మీరు పూర్తిగా ఎందుకు మార్చరు? విద్యార్థులకు ఈ మానసిక క్షోభ, ఒత్తిడి ఎందుకు? ఈ కేసులన్నీ ఎందుకు? విద్యార్థుల దుస్థితిని ఒకసారి పరిశీలించాల్సిందిగా కేంద్రం అలాగే అన్ని రాష్ట్రాలను మేం ఆదేశిస్తున్నాం. ఇలాంటి అనిశ్చితి కారణంగా విద్యార్థుల మొత్తం కెరీర్‌పైనే దుష్ప్రభావం పడుతుంది’ అని సుప్రీంకోర్టు పేర్కొంది. 14లోపు తుది కౌన్సెలింగ్ నిర్వహించండి మహారాష్ట్రలో 2019–20 విద్యా సంవత్సరానికి సంబంధించి పీజీ మెడికల్, డెంటల్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 14లోపు తుది విడత కౌన్సెలింగ్‌ను నిర్వహించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. ఈ కేసులో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు సంబంధించిన నోటిఫికేసన్‌పై తాము స్టే విధించిన తర్వాత కూడా ఇంకా కౌన్సెలింగ్‌ను ఎందుకు పూర్తి చేయలేదని కోర్టు ప్రశ్నించింది. కౌన్సెలింగ్‌కు సంబంధించి స్థానిక వార్తా పత్రికల్లో ప్రభుత్వం వెంటనే ప్రకటనలు ఇవ్వాలనీ, 14వ తేదీలోపు కౌన్సెలింగ్ నిర్వహించి తీరాలని కోర్టు చెప్పింది. ఈ విడత కౌన్సెలింగే చివరిదని కూడా ప్రకటనల్లో స్పష్టంగా పేర్కొనాలంది. అలాగే ఈ కేసులో తాము ఇప్పుడు ఇస్తున్న ఉత్తర్వులే అంతిమమనీ, ఇకపై ఈ కేసుకు సంబంధించి ఎలాంటి పిటిషన్లనూ దేశంలోని ఏ కోర్టూ స్వీకరించకూడదని జస్టిస్ ఇందూ మల్హోత్రా, జస్టిస్ ఎంఆర్ షాలు స్పష్టం చేశారు. -
1న డ్రయ్యర్ల తయారీపై శిక్షణ
ఉల్లిపాయలు, అల్లంలో తేమను తగ్గించుకొని దీర్ఘకాలం నిల్వ ఉంచుకునేందుకు, అధిక ధరకు విక్రయించుకోవడానికి రైతులకు డ్రయ్యర్లు ఉపకరిస్తాయి. కరివేపాకు, మునగాకులను కూడా డ్రయ్యర్ల ద్వారా ఎండబెట్టుకొని పొడులుగా మార్చవచ్చు. ఇందుకు ఉపకరించే డ్రయ్యర్లను రైతులు తమకు తామే తయారు చేసుకోవడంపై గుంటూరు జిల్లా పెదవడ్లపూడిలో నవంబర్ 1న ఎల్. శ్రీనివాసరావు శిక్షణ ఇవ్వనున్నారు. వివరాలకు.. 99123 47711 -
టెక్ బడి.. ‘బిజ్ ఏక్టివ్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఏఐ, బ్లాక్ చెయిన్ వంటి కొత్త టెక్నాలజీ కోర్సులు నేర్చుకోవాలంటే సిటీకి రావాలా? ట్రెయినింగ్ సెంటర్లో చేరాలా? ఇవన్నీ వద్దంటోంది స్టార్టప్ కంపెనీ ‘బిజ్ ఏక్టివ్’. ఒకటీ రెండూ కాదు ఏకంగా 87 రకాల టెక్నాలజీ కోర్సులు తమ సైట్ ద్వారానే నేర్చుకోవచ్చని చెబుతోంది ఈ సంస్థ. ‘వరంగల్’ కేంద్రంగా సేవలందిస్తున్న బిజ్ ఏక్టివ్‌లో బెంగళూరు, ముంబై, చెన్నై, కోల్‌కతా వంటి నగరాల నుంచి కూడా విద్యార్థులున్నారు. మరిన్ని వివరాలు బిజ్ ఏక్టివ్ ఫౌండర్ మహ్మద్ యాకుబ్ పాషా మాటల్లోనే.. ‘‘మాది వరంగల్ జిల్లా మల్లంపల్లి. ఆర్ధిక పరిస్థితుల కారణంగా బీటెక్‌ను మధ్యలోనే ఆపేసి వరంగల్‌లో ఢిల్లీకి చెందిన ఓ ఎడ్యుకేషన్ కంపెనీలో ఉద్యోగంలో చేరా. గ్రామీణ ప్రాంతం నుంచి రావటంతో టెక్నాలజీ కోర్సులను అంత త్వరగా అందుకోలేకపోయా. ఇది నా ఉద్యోగంపై ప్రభావం చూపించింది. నాలా ఇతర గ్రామీణ యువత ఇబ్బంది పడకూడదన్న అభిప్రాయంతో అందుబాటు సమయంలో తక్కువ ఖర్చుతో సాంకేతిక కోర్సులను అందించాలనే లక్ష్యంతో బిజ్‌ఏక్టివ్ సర్వీసెస్‌ను ఆరంభించా. 2016 మార్చిలో లక్ష రూపాయల పెట్టుబడితో వరంగల్ కేంద్రంగా ‘బిజ్‌ఏక్టివ్’ సర్వీసెస్‌ను ప్రారంభించా. తెలుగు, హిందీ భాషల్లో గ్రామీణులకు అర్థమయ్యేలా సులువైన పద్ధతుల్లో కోర్సులను అందించడమే మా ప్రత్యేకత. బిజ్‌ఏక్టివ్‌లో 2 ప్యాకేజీలు.. ప్రస్తుతం బిజ్‌ఏక్టివ్‌లో 2 రకాల ప్యాకేజీలున్నాయి. 1. ఎడ్యు అడ్వాన్స్డ్. ధర రూ.2,999. ఇందులో 152 అంశాలకు సంబంధించిన 87 రకాల కంప్యూటర్ కోర్సులుంటాయి. హిందీ భాషలో 10 రకాల కోర్సులుంటాయి. ఇవన్నీ ఆడియో, వీడియో ట్యుటోరియల్స్ రూపంలో ఉంటాయి. స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సుతో పాటూ 200 రకాల ఈ–పుస్తకాలను కూడా అందిస్తాం. ఇంటర్నెట్ అందుబాటులో లేనివాళ్ల కోసం ఆయా ప్యాకేజీ కోర్సుల పుస్తకాలను పెన్‌డ్రైవ్‌లో అందిస్తాం. రెండోది, ఎడ్యు అల్టిమేట్. ధర రూ.6,600. ఇందులో మొదటి ప్యాకేజీతో పాటూ షాపింగ్ చేసుకునేందుకు వీలుగా స్మార్ట్ కార్డ్‌ను ఇస్తాం. బిజ్కార్ట్.కామ్‌లో షాపింగ్ చేసుకోవచ్చు. 4 లక్షలకు పైగా ఉత్పత్తులున్నాయి. రీచార్జ్, కరెంట్ బిల్లుల వంటి యుటిలిటీ సేవలతో పాటూ బస్, రైలు, విమాన టికెట్లను కూడా బుకింగ్ చేసుకోవచ్చు. నేపాల్, దుబాయ్‌లకు విస్తరణ... ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటూ చెన్నై, ముంబై, కోల్కత్తా, బెంగళూరు నగరాల్లో సేవలందిస్తున్నాం. 18 వేల మంది కస్టమర్లున్నారు. మా ఉత్పత్తులకు నేపాల్, దుబాయ్‌ల నుంచి డిమాండ్ ఉంది. త్వరలోనే ఆయా ప్రాంతా ల్లో కేంద్రాలను ఆరంభించనున్నాం. అనుమతికి దరఖాస్తు చేశాం. ఏడాదిలో లక్ష కస్టమర్లను చేరుకోవాలన్నది లక్ష్యం. అందుకే ఆఫ్‌లైన్‌లో శిక్షణ ప్రారంభించాం. ఇందుకు ప్రముఖ అంతర్జాతీయ సాఫ్ట్ స్కిల్ ట్రైనర్ వేణుగోపాల్ లక్ష్మీపురంను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్నాం. రూ.2 కోట్ల నిధుల సమీకరణ.. ప్రస్తుతం మాకు 200 మంది డిస్ట్రిబ్యూటర్లున్నారు. ఏడాదిలో 500 మందికి చేర్చుతాం. మా ప్యాకేజీ అమ్మకం మీద దాదాపు 10 శాతం కమీషన్ ఉంటుంది. గత రెండేళ్లలో రూ.3 కోట్ల టర్నోవర్‌ను చేరుకున్నాం. వచ్చే ఏడాది కాలంలో రూ.10 కోట్ల ఆదాయాన్ని చేరుకోవాలన్నది టార్గెట్. ప్రస్తుతం మా సంస్థలో 8 మంది ఉద్యోగులున్నారు. పలు ఎన్జీవో, ఏంజిల్ ఇన్వెస్టర్లతో చర్చలు చేస్తున్నాం. ఏడాదిలో రూ.2 కోట్ల నిధులను సమీకరించనున్నాం’’ అని పాషా వివరించారు. -
మూడేళ్ల డిగ్రీగా గేమింగ్, యానిమేషన్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇన్నాళ్లు అధికారిక గుర్తింపు లేకుండా కొనసాగిన గేమింగ్, యానిమేషన్ వంటి కోర్సులు ఇకపై మూడేళ్ల డిగ్రీ కోర్సులుగా కొనసాగించేందుకు యాజమాన్యాలు ముందుకొచ్చాయి. దీంతో వాటికి ప్రభు త్వం నుంచి త్వరలోనే అనుమతులు లభించే అవకాశం ఉంది. నిబంధనలకు విరుద్ధంగా జవహర్‌లాల్‌నెహ్రూ అర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీతో (జేఎన్ఏఎఫ్ఏయూ) ఒప్పం దం చేసుకొని, ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతుల్లేకుండానే 17 విద్యా సంస్థలు వివిధ కోర్సులను నిర్వహిస్తున్నాయి. అయితే వాటిపై అనేక ఫిర్యాదులు రావడం, విద్యార్థుల నుంచి భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం వాటిపై దృష్టి సారించింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) గుర్తించని కోర్సులను డిగ్రీలుగా ఎలా కొనసాగిస్తున్నారని, వాటి నిర్వహణకు జేఎన్ఏఎఫ్ఏయూ ఎలా ఒప్పందం చేసుకుంటోందంటూ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. యూజీసీ గుర్తించిన కోర్సులను వాటిల్లో నిర్వహించాలని, నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి కోర్సులు నిర్వహించడానికి వీల్లేదని విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు. అయితే సదరు అధికారి సెలవులో ఉన్న సమయంలో వాటి గుర్తింపునకు ఉత్తర్వులు జారీ చేసేలా పావులు కదిపారు. ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే సెలవుపై వెళ్లిన సదరు అధికారి తిరిగొచ్చాక విషయం తెలుసుకొని ఆ ఉత్తర్వులను అమలు చేయొద్దని లేఖ రాశారు. దీంతో యాజమాన్యాలు దిగివచ్చాయి. నాలు గేళ్లు కాకుండా మూడేళ్ల కోర్సులుగానే నిర్వహిస్తామని, వాటికి గుర్తింపు ఇవ్వాలని, ప్రభుత్వ నిబంధనల మేరకు కొనసాగిస్తామని హామీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. -
అధికారుల అడ్డగోలు ‘గేమింగ్’!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్వహిస్తున్న యానిమేషన్, గేమింగ్ వంటి గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల గుర్తింపు వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఏళ్ల తరబడి ఎలాంటి అనుమతులు లేకుండా కొనసాగుతున్న కోర్సుల విషయంలో ప్రైవేటు విద్యా సంస్థలతో అధికారులు కుమ్మక్కైన్నట్లు తెలిసింది. 2018–19లో గుర్తింపు విషయంలో ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సెలవులో ఉన్న సమయలలో నేరుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచే ఉత్తర్వులు వచ్చేలా చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాటికి అనుమతులు ఇవ్వబోమని ముందుగానే స్పష్టం చేసినా, సదరు అధికారి సెలవులో ఉన్న సమయంలో సాంకేతిక విద్యా శాఖ నేరుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ప్రతిపాదనలు పంపించడం, ఆయన్ని తప్పుదోవ పట్టించి ఉత్తర్వులు జారీ చేయించడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి తిరిగి విధుల్లో చేరాక, విషయం తెలుసుకొని నిబంధనలకు విరుద్ధంగా ఎలా చేస్తారంటూ సాంకేతిక విద్యా శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఉత్తర్వులను అమలు చేయవద్దని ఇటీవల లేఖ రాయడంతో గందరగోళం నెలకొంది. ఎలాంటి గుర్తింపు లేకుండానే.. హైదరాబాద్‌లో వివిధ రంగాలతోపాటు, సినీ ఇండస్ట్రీకి ఉపయోగపడే పలు స్వల్పకాలిక కోర్సుల్లో శిక్షణ ఇచ్చే 17 ప్రైవేటు ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. అవి కాలేజీలు కాదు. వాటికి యూనివర్సిటీల అనుబంధ గుర్తింపు కూడా లేదు. అవన్నీ ఫ్యాషన్ డిజైనింగ్, ఇంటీరియర్ డిజైనింగ్, యానిమేషన్ అండ్ గేమింగ్, ఆర్ట్ అండ్ డిజైన్, ఈవెంట్ ప్లానింగ్, కాస్మెటాలజీ వంటి కోర్సుల్లో 6 నెలల డిప్లొమా కోర్సులను నిర్వహిస్తున్నాయి. అవే కోర్సుల్లో అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులు నిర్వహించేందుకు జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్ఏఎఫ్ఏయూ)తో అవి అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకున్నాయి. అయితే ఆ ఒప్పందం ద్వారా కోర్సుల నిర్వహణకు అనుమతిచ్చే అధికారం ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి లేదు. పైగా అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులు నిర్వహించాలంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) గుర్తింపు ఉండాలి. సాంకేతిక విద్యా కోర్సులు ఉన్నందున ఏఐసీటీఈ అనుమతి తప్పనిసరి. కానీ ఇవేవీ లేకుండానే ఆయా సంస్థలు కోర్సులను నిర్వహిస్తూ ఒక్కో విద్యార్థి నుంచి రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు వసూళ్లు చేస్తున్నాయి. వర్సిటీ పాత్రపై అనుమానాలు! యూజీసీ నుంచి, ఏఐసీటీఈ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా, కాలేజీలుగా గుర్తింపు లేకున్నా యూజీ, పీజీ కోర్సులను హైదరాబాద్‌లోని 17 సంస్థలు నిర్వహిస్తుండటం, వాటితో జేఎన్ఏఎఫ్ఏయూ ఒప్పందం చేసుకోవడంపై అనేక ఆనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 2016లోనే ఆయా సంస్థలు కోర్సులను నిర్వహించవద్దని చెప్పినా జేఎన్ఏఎఫ్ఏయూ ఒప్పందాన్ని కొనసాగించడంలో మతలబు ఏంటన్నది అధికారులే చెప్పాల్సి ఉంది. తప్పు జరుగుతోందని తెలిసినా, విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నా.. 2017–18లో కోర్సులను కొనసాగించేందుకు యూనివర్సిటీ అధికారులు భారీ మొత్తంలో దండుకొని అనుమతి ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. స్పెషల్ సీఎస్ లేని సమయం చూసి.. 2018–19లో ఆ కాలేజీలకు అనుమతులు ఇచ్చేందుకు విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ససేమిరా అన్నారు. దీంతో సదరు అధికారి అనారోగ్యం కారణంగా గత నెలలో సెలవుపై వెళ్లారు. అదే అదనుగా భావించిన సంస్థలు తమ కోర్సుల నిర్వహణకు అనుమతి ఇవ్వాలని సాంకేతిక విద్యా శాఖను ఆశ్రయించాయి. వాస్తవానికి వాటికి ప్రతిపాదనలు పంపాల్సింది ఉన్నత విద్యా శాఖ అయినా సాంకేతిక విద్యా శాఖ ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి ఫైలు పంపించింది. ఈ వ్యవహారం తెలియని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గత నెల 14వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. సెలవుపై వెళ్లిన అధికారి తిరిగి వచ్చే సరికి జీవో వెలువడటంతో విస్మయానికి గురయ్యారు. వెంటనే ఆ జీవోను అమలు చేయవద్దని లేఖ రాశారు. -
విదేశీ భాషల్లో డిప్లొమో కోర్సులు
ఎస్కేయూ: ఆర్డీటీ (రూరల్ డెవలప్మెంట్ ట్రస్టు) సహకారంతో స్పెయిన్, పోర్చుగల్, ఫ్రెంచ్, జర్మన్ భాషల్లో డిప్లొమో కోర్సులు అందించడానికి ఎస్కేయూతో ఆర్డీటీ ప్రతినిధులు సంప్రదింపులు జరుపుతున్నారు. ఇందులో భాగంగానే ఆర్డీటీ ప్రతినిధులు సోమవారం ఎస్కేయూను సందర్శించారు. ఈ కోర్సులు ఆర్డీటీ నిర్వహిస్తుంది. పరీక్షలు, సర్టిఫికెట్లు ఎస్కేయూ నిర్వహిస్తుంది. ఆర్టీటీ, ఎస్కేయూల మధ్య బుధవారం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు తెలిసింది. -
జావా , డాట్నెట్ కోర్సులకు ఉచిత శిక్షణ
ఎస్కేయూ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎస్కేయూలో మూడు నెలల పాటు ఉచిత శిక్షణా కోర్సులు నిర్వహిస్తున్నట్లు ప్రాజెక్ట్ మేనేజర్ టీ.హెచ్. విన్సెంట్ తెలిపారు. ఈ తరగతులకు హాజరైన అభ్యర్థులకు సర్టిఫికెట్తో పాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ప్రతి రోజూ నాలుగు గంటలు శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు www.joskills.appssdc.inవెబ్‌సైట్‌నందు తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలు కోసం 9490978868, 7801031771 నెంబర్లు ద్వారా సమాచారం తెలుసుకోవచ్చు. -
కెరీర్ ప్యాక్ చేద్దాం!
చర్మ సంరక్షణకు ఉపయోగపడే సబ్బు నుంచి, ఆరోగ్యాన్ని అందించే మందు బిళ్లల వరకు. మంచి నూనె నుంచి మిర్చిపౌడర్ వరకు... దేనికైనా పదిలమైన, ఆకర్షణీయమైన ప్యాకేజింగ్ అవసరం. ప్రస్తుత సూపర్ మార్కెట్ సంస్కృతిలో స్వీయ సేవ (సెల్ఫ్ సర్వీసింగ్) ఎవరికి కావల్సిన వస్తువులను వారే తీసుకునే పద్ధతి వచ్చింది. ఓ పెద్ద సూపర్ మార్కెట్లో షాపింగ్ చేస్తున్న వ్యక్తికి ఒకే వస్తువుకు సంబంధించి పలు బ్రాండ్లు కనిపిస్తుంటాయి. అలాంటపుడు కొనుగోలుదారుల్ని ఓ వస్తువు ఆకర్షించాలంటే అందమైన ప్యాకేజింగ్ అవసరం. ఒక్క మాటలో చెప్పాలంటే పరిశ్రమల నుంచి బయటకొచ్చిన ఏ ఉత్పత్తి అయినా విజయవంతం కావడంలో ప్యాకేజింగ్ కీలకం. అందుకే ప్రస్తుతం ప్యాకేజింగ్ రంగ నిపుణులకు జాబ్ మార్కెట్లో అవకాశాలు పెరుగుతున్నాయి. ‘ప్యాకేజింగ్’ కోర్సులకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ రోజు ‘విద్య – ఉద్యోగం’లో మీకోసం... – సాక్షి, స్కూల్ ఎడిషన్ ♦ కంపెనీ తయారు చేసిన వస్తువు అమ్మకాల్లో ప్యాకేజింగ్ కీలక పాత్ర పోషిస్తుంది. వస్తువు చెడిపోకుండా ఉంచడంలో, కొనుగోలుదారుడిని ఇట్టే ఆకర్షించడంలోనూ ప్యాకేజింగ్‌దే ప్రముఖ పాత్ర. మొత్తంమీద ఓ వస్తువు మార్కెటింగ్‌లో ప్యాకేజింగ్ పాత్ర కీలకమని చెప్పొచ్చు. అందుకే ప్యాకేజింగ్ సాదాసీదా వ్యవహారంలా కాకుండా, సరికొత్త వృత్తిగా మారిపోయింది. యువతకు ఓ ప్రత్యామ్నాయ కెరీర్ చాయిస్‌గా నిలుస్తోంది. కావాల్సిన నైపుణ్యాలు... ఇతర కోర్సులతో పోలిస్తే ఇది భిన్నమైన రంగం. ఇందులో రాణించాలంటే.. సృజనాత్మకత, విభిన్నంగా ఆలోచించడం, ప్రస్తుత మార్కెటింగ్ ట్రెండ్స్‌పై అవగాహన, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. కోర్సులో ఉండే అంశాలు... పరిశ్రమ, మార్కెటింగ్ అవసరాలకు అనుగుణంగా ప్రవేశ పెట్టిన కోర్సుల్లో ప్యాకేజింగ్ కోర్సులు ఒకటి... ఇందులో ఇంజనీరింగ్, ప్రింటింగ్, మార్కెటింగ్, కవర్ డిజైన్, మాన్యుఫాక్చరింగ్, గ్రాఫిక్ డిజైన్ సంబంధిత అంశాలుంటాయి. ఈ క్రమంలో ప్యాకేజింగ్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్ట్, లాజిస్టిక్స్ అండ్ ఫిజి కల్ డిస్ట్రిబ్యూషన్, ప్యాకేజింగ్ ప్రాసెస్, క్వాలిటీ కంట్రోల్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, అప్లయిడ్ మెకానిక్స్, ప్రింటింగ్ టెక్నాలజీ, మెషిన్ డ్రాయింగ్, ప్రొడక్షన్ మేనేజ్మెంట్, ప్యాకేజింగ్ మేనేజ్మెంట్ వంటి అంశాలపై శిక్షణ ఇస్తారు. అవకాశాలు... పారిశ్రామిక రంగం నుంచి బయటకు వచ్చిన, వస్తున్న ఏ ఉత్పత్తినైనా ఆకర్షణీయంగా మార్చేది వాటి ప్యాకింగ్. కాబట్టి ప్యాకేజింగ్ నిపుణులకు అవకాశాలు ఎక్కువని చెప్పవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే పరిశ్రమలు మనుగడ సాగించినంత కాలం... ప్యాకేజింగ్ పరిశ్రమకు ఢోకా ఉండదు. వేతనాలు... అవకాశాలకనుగుణంగానే ఆకర్షణీయ వేతనాలు వీరికి లభిస్తున్నాయి. కెరీన్ ప్రారంభంలో సంవత్సరానికి రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు వేతనం అందుకోవచ్చు. ఆ తర్వాత పనితీరు ఆధారంగా భారీ వేతనాలు సంపాదించే అవకాశం ఉంది. విధులు... ఒక ఉత్పత్తిని అందంగా ఆకట్టుకునేలా మన్నికైన∙ప్యాకింగ్ చేయడం ప్యాకేజింగ్ నిపుణుల విధి. ఆయా పరిశ్రమలు వాటి ఉత్పత్తులు, కాలపరిమితి ఆధారంగా సాంకేతికంగా ఎటువంటి ప్యాకింగ్ అవసరమో (ఉదాహరణకు ఫార్మా కంపెనీల ఉత్పత్తులకు ఎలాంటి ప్యాకేజీ అవసరం, కెమికల్ ఉత్పత్తులకు ఎలాంటి ప్యాకేజీ చేయాలి) నిర్ధారించడం, అందుకోసం అవసరమైన రసాయనాలను సూచించడం, వాటిని ఎంత మోతాదులో వినియోగించాలో సలహాలివ్వడం, పర్యావరణ పరంగా అవసరమైన జాగ్రత్తలను సూచించడం వంటి విధులను వీరు నిర్వర్తిస్తుంటారు. ప్యాకేజింగ్ టెక్నాలజీలో శిక్షణ పొందుతున్న వారిని ‘ప్యాకేజింగ్ టెక్నాలజిస్టులు’ అంటారు. ప్యాకేజింగ్ టెక్నాలజిస్టులు క్యాలిటీ ఇంజినీర్, పర్చేజింగ్, మెటీరియల్ విభాగాలలో తమ కెరీర్‌ను ప్రారంభించవచ్చు. పరిశ్రమ పనితీరు... ప్రస్తుతం శరవేగంగా వృద్ధి చెందుతున్న రంగాల్లో ప్యాకేజింగ్ పరిశ్రమ ఒకటి. ఏటా భారత ప్యాకేజింగ్ పరిశ్రమ 13 నుంచి 15 శాతం వృద్ధిని నమోదు చేసుకుంటుంది. ప్రస్తుతం దేశ ప్యాకేజింగ్ పరిశ్రమ విలువ దాదాపు రూ.లక్ష కోట్లు. దేశంలో మొత్తం పేపర్ ఉత్పత్తిలో అధిక శాతం పేపర్‌ను ప్యాకింగ్ అవసరాల కోసం వినియోగిస్తున్నారు. ఇందుకోసం 7.6 మిలియన్ టన్నుల పేపర్‌ను వాడుతున్నారు. ఆ తర్వాతి స్థానంలో ప్లాస్టిక్ ప్యాకేజింగ్ ఉంది. ఈ రంగంలో ప్రతి ఏటా 20 నుంచి 25 శాతం వృద్ధి నమోదవుతుంది. ప్యాకేజింగ్ రంగంలో గ్లాస్ ప్యాకింగ్ వాటా 4 నుంచి 5 శాతం, మెటల్ ప్యాకింగ్ వాటా 8 శాతం వరకు ఉంటుంది. కొన్ని ప్రముఖ కంపెనీలు... హెచ్‌సీఎల్, హిందుస్థాన్ యూనీలీవర్ లిమిటెడ్, డాబర్ ఇండియా లిమిటెడ్, క్యాడ్బరీ ఇండియా లిమిటెడ్, ఐటీసీ లిమిటెడ్, జాన్సన్ అండ్ జాన్సన్ లిమిటెడ్, క్యాస్ట్రాల్ ఇండియా లిమిటెడ్, కోకా–కోలా ఇండియా, ప్రోక్టర్ అండ్ గ్యాంబిల్ వంటి కంపెనీల్లో ఉద్యోగాలు పొందొచ్చు. కోర్సులు... దేశంలో ప్యాకేజింగ్ రంగానికి సంబంధించిన కోర్సులను ఆఫర్ చేస్తున్న ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్... ఇండియన్‌ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ (ఐఐపీ). కేంద్ర ప్రభుత్వ వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఐఐపీకి ముంబై, కోల్‌కతా, ఢిల్లీ, హైదారాబాద్‌లలో క్యాంపస్‌లున్నాయి. వీటి ద్వారా అందిస్తోన్న కోర్సులు వివరాలు... పీజీ డిప్లొమా ఇన్ ప్యాకేజింగ్... అర్హత: కనీసం ద్వితీయ శ్రేణి మార్కులతో గ్రాడ్యుయేషన్ (12+3 విధానంలో మ్యాథమెటిక్స్/ఫిజిక్స్/కెమిస్ట్రీ/మైక్రోబయాలజీలలో ఒకటి మెయిన్ లేదా సెకండ్ సబ్జెక్ట్‌గా) లేదా అగ్రికల్చర్/ఫుడ్ సైన్స్/పాలిమర్ సైన్స్ లేదా ఇంజనీరింగ్/టెక్నాలజీ. చివరి సంవత్సరం విద్యార్థులు కూడా అర్హులే. రాత పరీక్ష , ఇంటర్వూ ద్వారా ఎన్నుకుంటారు. అభ్యర్థులు ఇంటర్వూ సమయానికి సంబంధిత డిగ్రీ సర్టిఫికెటన్ను సమర్పించాల్సి ఉంటుంది. సీట్ల వివరాలు... ముంబై–80, ఢిల్లీ–80, కోల్‌కతా–60, హైదరాబాద్–60. ఓబీసీ విద్యార్థులకు 27శాతం, ఎస్సీ విద్యార్థులకు 15శాతం, ఎస్టీ విద్యార్థులకు 7.5 శాతం రిజర్వేషన్ ఉంటుంది. డిప్లమా ఇన్ ప్యాకేజింగ్.. ప్యాకేజింగ్ డిప్లమా కోర్సు మూడేళ్లు ఉంటుంది. ఈ కోర్సులో పదోతరగతి ఉత్తీర్ణులై, పాలిటెక్నిక్ ప్రవేశపరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా ఎంచుకుంటారు. ఎంపికైన వారికి హాస్టల్ వసతి ఉంటుంది. తెలుగు రాష్ట్రల్లో ఈ కోర్సును అందిస్తోన్న ఏకైక కళాశాల హైదారాబాద్‌లోని రామంతాపూర్‌లో ఉన్న జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల. -
ఖైదీల కోసం మరిన్ని కోర్సులు
అంబేడ్కర్ వర్సిటీ వీసీ సీతారామారావు వెల్లడి హైదరాబాద్: క్షణికావేశంలో తప్పులు చేసి శిక్ష అనుభవిస్తున్న ఖైదీల్లో మానసిక పరి వర్తన తెచ్చి, బాధ్యతగా వ్యవహరించేలా చేయడమే తమ లక్ష్యమని అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ వైస్‌చాన్స్‌లర్ కె.సీతారామారావు తెలిపారు. డిగ్రీలో ప్రవేశాల కోసం తెలుగు రాష్ట్రాల్లోని 185 కేంద్రాల్లో విశ్వవిద్యాలయం ఆదివారం అర్హత పరీక్ష నిర్వహించింది. చర్లపల్లి కేంద్ర కారాగారంలోని పరీక్షా కేంద్రాన్ని వీసీ తనిఖీ చేశారు. మరిన్ని కోర్సులను ఖైదీలకు ఉపయోగపడేలా ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఈ విద్యా సంవత్సరం ఎమ్మెస్సీ సైకాలజీ ప్రారంభిస్తామన్నారు. ఖైదీల శిక్షాకాలం వృథా కాకుండా, మానసిక పరిస్థితి దెబ్బ తినకుండా అంబేడ్కర్ వర్సిటీ సహకారంతో పలు కోర్సులు నిర్వహిస్తున్నామని చర్లపల్లి జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ తెలిపారు. -
ఆస్పత్రి సిబ్బందికి నైపుణ్య కోర్సులు
సాక్షి, హైదరాబాద్: ఆస్పత్రుల్లోని పలు రకాల సేవలకుగాను సిబ్బందికి నైపుణ్య కోర్సులను నిర్వహించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ భావిస్తోంది. వైద్యులుగా, నర్సులుగా, టెక్నీషియన్లుగా పనిచేయాలంటే తప్పనిసరిగా ఆయా కోర్సులు చదవాలి. వైద్య, ఆరోగ్యశాఖలోని సంబంధిత విభాగాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. కానీ వీరి కంటే రెట్టింపు స్థాయిలో కింది స్థాయి సిబ్బంది పనిచేస్తుంటారు. ఆపరేషన్ థియేటర్ బాయ్‌లుగా, రోగులను వీల్‌చైర్‌పై తరలించే వర్కర్లుగా, వార్డుల్లో రోగులకు సహాయకులుగా, మరుగుదొడ్లు క్లీనర్లుగా రకరకాల పనిచేసే వారెవరికీ కోర్సులు, శిక్షణ, రిజిస్ట్రేషన్ ఉండటం లేదు. వారి ప్రవర్తన ఒక్కోసారి రోగులకు అశనిపాతంగా మారుతోంది. ఈ పరిస్థితిని సరిదిద్దాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఆస్పత్రుల్లోని ఇటువంటి సిబ్బందికి, ఏడో తరగతి పాసైన నిరుద్యోగులక ు6 నెలల ఆస్పత్రి నిర్వహణపై శిక్షణ, సర్టిఫికెట్ ఇవ్వాలని నిర్ణయించింది. కొన్ని కోర్సులకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో, మరికొన్నింటికి పారామెడికల్ అనుమతితో ప్రైవేటు సంస్థల ద్వారా శిక్షణ ఇప్పించాలని నిర్ణయించింది. శిక్షణ తీసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికే ఆస్ప త్రుల్లో ఆయా విభాగాల్లో పనిచేసేందుకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. ప్రస్తుతం పనిచేస్తున్న వారికి కూడా దీనిని తప్పనిసరి చేయాలని భావిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులు వెయ్యి చొప్పున ఉంటాయి. వాటిల్లోని కిందిస్థాయి సిబ్బంది ఎవరూ నిర్ణీత కోర్సుతో శిక్షణ పొంద లేదు. ఆస్పత్రుల్లోని పనులు, అక్కడి వ్యవహారాలపై సిలబస్ తయారు చేసి ఆరు నెలలపాటు శిక్షణ కల్పించాలని వైద్య, ఆరోగ్యశాఖ యోచిస్తోంది. ఈ కోర్సులను ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు నిర్వహిస్తే రాష్ట్రం నుంచి లక్ష మందికి దేశ విదేశాల్లో వివిధ ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని వైద్యాధికారులు చెబుతున్నారు. ఆస్పత్రి రంగంపై శిక్షణ పొందినవారికి దేశ, విదేశాల్లో డిమాండ్ బాగానే ఉంది. కాస్త ఇంగ్గిష్ మాట్లాడగలిగితే దుబాయ్, అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లోనూ ఉపాధి అవకాశాలుంటాయని అధికారులు అంచనా వేశారు. ప్రభుత్వం నిర్ణయం తర్వాత పారామెడికల్ విభాగం ద్వారా శిక్షణ ఇప్పించాలని నిర్ణయించారు. -
అదనపు సీట్లు, కొత్త కాలేజీలు వద్దు
► ఎన్‌సీటీఈకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ విద్యా కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు ఐదు లక్షల మందికిపైగా ఉన్నందున ఇకపై ఉపాధ్యాయ విద్యా కాలేజీలు, అదనపు సీట్లకు అనుమతులు ఇవ్వొద్దని రాష్ట్ర ప్రభుత్వం జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ)ని కోరింది. తాము అడిగే వరకు కొత్త కాలేజీల ప్రారంభాలకు అనుమతించవద్దని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఎన్‌సీటీఈకి సర్కారు లేఖ రాసింది. రాష్ట్రంలో 11 కొత్త డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) కాలేజీలు, 17 బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) కాలేజీలు, 20 ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీల ప్రారంభానికి తాత్కాలిక గుర్తింపు ఇవ్వడాన్ని లేఖలో ప్రస్తావించింది. రాష్ట్రంలో ఉన్న 330 ఉపాధ్యాయ విద్యా కాలేజీల (బీఎడ్-196, డీఎడ్-212, బీపీఈడీ-22) నుంచి ఏటా 30 వేల మంది అభ్యర్థులు బయటకు వస్తున్నారని, ఇవి కాకుండా పండిత శిక్షణ కాలేజీలు, మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉన్నాయని వివరించింది. వీటి నుంచే రా నున్న 15 ఏళ్లలో మరో 5 లక్షల మందికిపైగా అభ్యర్థులు ఉపాధ్యాయ విద్యను పూర్తి చేసుకొని బయటకు రానున్నారని...2030 నాటికి ఉపాధ్యాయ విద్య పూర్తి చేసుకున్న అ భ్యర్థుల సంఖ్య 10 లక్షలు దాటనుందని, వా రందరికీ సరిపడ ఉపాధ్యాయ పోస్టులు ప్రభు త్వ, ప్రైవేటు రంగాల్లో లేవని వివరించింది. కేవలం 44,842 పోస్టులు మాత్రమే వచ్చే అవకాశం ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో కొత్త కాలేజీలకు అనుమతులు ఇవ్వవద్దని కోరింది. -
ఇగ్నో కోర్సులకు ప్రవేశాలు ప్రారంభం
ఎంవీపీకాలనీ: ఇందిరాగాంధి నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(ఇగ్నో)లో పలు కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభించినట్టు ప్రాంతీయ సంచాలకులు డాక్టర్ ఎస్.రాజారావు తెలిపారు. ఈమేరకు మంగళవారం ఉషోదయా కూడలి వద్ద ఉన్న ఇగ్నో ప్రాంతీయ కేంద్రంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజారావు మాట్లాడుతూ ఇగ్నో విజయనగరం, శ్రీకాకుళం,ఉభయగోదావరి జిల్లాల పరిధి విశాఖ కేంద్రంగా 2011లో ప్రారంభించినట్టు తెలిపారు. ఇప్పుడు కొత్తగా పుదుచ్చేరి,యానం ప్రాంతాలలో విస్తరించినట్టు తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 32 అధ్యయన కేంద్రాలు ఉన్నాయన్నారు. తమ అధ్యయన కేంద్రంలో ప్రవేశాలు పొందే విద్యార్థులకు ప్రతి ఆదివారం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ఏడాది కొత్తగా డిప్లామో ఇన్ అక్వాకల్చర్, డిప్లామో ఇన్ డెయిరీ వంటి కోర్సులు ప్రవేశపెట్టినట్టు తెలిపారు. అక్వాకల్చర్ కోర్సులో చేరే విద్యార్థులు ఇంటర్ పాసై ఉండాలన్నారు. కోర్సు ఆంగ్లమాధ్యమంలో మాత్రమే ఉంటుందన్నారు. ప్రవేశ రుసుము రూ. 6500లు నిర్ణయించడమైనదన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఫీజు రాయితీ కలదని తెలిపారు. అదేవిధంగా విశాఖపట్నం,ఆరిలోవ చినగదిలిలో డిప్లామో ఇన్ డెయిరీ కోర్సు పూర్తిగా తెలుగు మాధ్యమంలో ప్రవేశపెడుతున్నట్టు తెలిపారు. దీనికి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఫీజులో 50శాతం రాయితీ ఉంటుందన్నారు. ఇంటర్ పాసై ఉండాలన్నారు. అదేవిధంగా yì గ్రీ,పీజీ, పీజీ డిప్లామో, డిప్లామో కోర్సులలో చేరగోరు అభ్యర్థులకు ఆగష్టు 17 చివరితేదీకాగా, ఆగష్టు 31వ తేదీ వరకు రూ. 300 అపరాధ రుసుముతో ప్రవేశాలు కల్పించనున్నట్టు తెలిపారు. ముఖ్యంగా డిగ్రీ కోర్సులలో చేరు ఎస్నీ,ఎస్టీ, ఎస్టీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌కు చెందిన అభ్యర్ధులకు పూర్తిగా ఫీజు మినహాయింపు కల్పిస్తున్నట్టు తెలిపారు. ఈ ఏడాది నుంచి నూతనంగా రాజాం జి.ఎం.ఆర్. గ్రూప్ కళాశాల, అమలాపురం కళాశాలలో రెండు అధ్యయన కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఇగ్నో సహాయ ప్రాంతీయ సంచాలకులు డాక్టర్ డి.ఆనంద్ మాట్లాడుతూ ఈ ఏడాది నుంచి సీఏ అభ్యర్ధులకు సీపీటీ ప్రవేశపరీక్ష ద్వార బికాం కోర్సు అందిస్తున్నట్టు తెలిపారు. దీని ద్వార సీఏ అభ్యర్ధులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ప్రతి అధ్యయన కేంద్రంలో 500 మంది విద్యార్థులు ఉన్నారన్నారు. దరఖాస్తుల కొరకు ఉషోదయా కూడిలలో ఉన్న ఇగ్నో ప్రాంతీయ కేంద్రం, లేదా, ఇగ్నో అధ్యయన కేంద్రాలు కల్గిన విశాఖ,కాకినాడు, రాజమండ్రి, అమలాపురం, గాజువాక, విజయనగరం, ఎచ్చెర్ల, రాజాంలలో సంప్రదించి రూ 200 చెల్లించి ప్రాస్పెక్టస్ పొందవచ్చునని తెలిపారు. మరిన్ని వివరములకు 0891–2511200– 300– 400 ఫోన్ నెంబర్లను సంప్రదించాల్సిందిగా కోరుతున్నామన్నారు. విలేకరుల సమావేశంలో ఇగ్నో సహాయ రిజిస్ట్రార్ లక్ష్మిపతిరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
డిప్లమో కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
ఏయూక్యాంపస్ : ఆంధ్ర విశ్వవిద్యాలయం జర్నలిజం విభాగంలో నిర్వహిస్తున్న పలు కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విభాగాధిపతి ఆచార్య పి.బాబీవర్థన్ ఒక ప్రకటనలో తెలిపారు. పబ్లిక్ రిలేషన్స్‌లో పీజీ డిప్లమో, ఫొటోగ్రఫీ, జర్నలిజంలో డిప్లమో కోర్సులకు ప్రవేశాల సంచాలకుల కార్యాలయంలో ప్రవేశాలు జరుగుతాయన్నారు. ఈ నెల 14న ఉదయం పీజీ డిప్లమో కోర్సులకు, మధ్యాహ్నం 2 గంటలకు డిప్లమో కోర్సులకు ప్రవేశాలు జరుపుతారు. ఆసక్తి కలిగిన వారు ఫీజు వివరాలు, దరఖాస్తులను ఏయూ వెబ్సైట్ నుంచి పొందవచ్చు -
స్విమ్స్ లో కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
తిరుపతి కార్పొరేషన్: తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) లో వివిధ కోర్సుల్లో అడ్మిషన్లు పొందేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని డెరైక్టర్ డాక్టర్ టి.ఎస్.రవికుమార్ శుక్రవారం తెలిపారు. బిఎస్సీ నర్సింగ్, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, బిఎస్సీ పారామెడికల్, డిప్లొమో ఇన్ రేడియోథెరపీ టెక్నాలజీ కోర్సుల్లో అడ్మిషన్లు ఉన్నట్టు తెలిపారు. ఆసక్తిగల ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు ఏదైనా మీ సేవ, ఆన్లైన్ సెంటర్ల ద్వారా జూన్ 3లోగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. పూర్తి వివరాలకు స్విమ్స్ వెబ్సైట్ http://svimstpt.ap.nic.in లో సంప్రదించవచ్చని డెరైక్టర్ తెలిపారు. -
ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో స్కిల్ డెవలప్మెంట్
-
ఆన్లైన్లో స్కాలర్షిప్ పరీక్ష హాల్ టికెట్లు
సాక్షి, హైదరాబాద్: నవంబర్ 8న జరగనున్న జాతీయ ప్రతిభా అన్వేషణ పరీక్ష (రాష్ట్ర స్ధాయి ఎన్టీఏఎస్ఈ), నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష (ఎన్ఎంఎంఎస్)లకు సంబంధించిన హాల్ టికెట్లను గురువారం నుంచి ఆన్లైన్లో ఉంచుతున్నట్లు బుధవారం ప్రభుత్వ పరీక్షల సంచాలకులు యం.ఆర్. ప్రసన్న కుమార్ తెలిపారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను కార్యాలయం వెబ్ సైట్ www.bseap.org నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా కోరారు. ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్ కోర్సులో ప్రవేశాలు హైదరాబాద్: ఓయూ క్యాంపస్ ఆంధ్ర మహిళా సభ ఉపాధ్యాయ విద్య కళాశాలలో నిర్వహిస్తున్న పీజీ డిప్లొమా ఇన్ ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేషన్ కోర్సులో ప్రవేశానికి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ కష్ణవేణి తెలిపారు. ఏడాది కాల వ్యవధి గల ఈ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు దేశ విదేశాల్లో టీచర్ ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 040-9440365510 నంబర్‌ను సంప్రదించవచ్చు. బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్‌లో... హైదరాబాద్: ఓయూ క్యాంపస్ ఆంధ్రమహిళా సభ ఉపాధ్యాయ విద్య కళాశాలలో నిర్వహిస్తున్న బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్‌లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ కష్ణవేణి తెలిపారు. ఎడ్‌సెట్-2015 రాయకున్నా ఓసీలు 50 శాతం, బీసీలు 45 శాతం, ఎస్సీ, ఎస్టీలు 40 శాతం మార్కులతో డిగ్రీ పాసైన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని తెలిపారు. వివరాలకు 9000596158 నంబర్‌ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. -
‘ఫీజులు’ వెబ్సైట్లో పెట్టండి
సాక్షి, హైదరాబాద్: దేశంలోని అన్ని యూనివర్సిటీలు, వాటి పరిధిలోని కాలేజీలు ఫీజులు, కోర్సులు సహా ఇతర వివరాలన్నిటినీ వెబ్సైట్లలో పెట్టాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తాజాగా ఆదేశాలు జారీ చేసింది. 14 అంశాలకు సంబంధించిన అంశాలను కాలేజీలు, వర్సిటీలు తమ వెబ్సైట్లలో విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని పేర్కొంది. విద్యార్థులకు అందే ఉపకార వేతనాలు, అకడమిక్ కేలండర్, విద్యాసంస్థలోని అధ్యాపకుల ప్రొఫైల్స్, వివిధ విభాగాల సమాచారం, కాలేజీల్లోని ఇతరత్రా వసతులు, విద్యార్థుల సేవల కోసం నియమించిన నోడల్ అధికారి పేరు తదితర వివరాలు కూడా వెబ్సైట్లో పొందుపరచాలి. తమ ఆదేశాలపై తీసుకున్న చర్యలను తెలుపుతూ 15 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని పేర్కొంది. అడ్మిషన్‌కు ముందు అనేక కాలేజీలు ట్యూషన్, ఇతర ఫీజుల వివరాలను గోప్యంగా ఉంచి, విద్యాసంస్థలో చేరాక వాటన్నింటినీ ముక్కుపిండి వసూలు చేస్తుండడంపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో అడ్మిషన్లకు ముందే ఫీజులతోపాటు వర్సిటీ, కాలేజీల సమస్త సమాచారం విద్యార్థులకు అందుబాటులో ఉంచేందుకు యూజీసీ చర్యలు తీసుకుంటోంది. మరోవైపు వివిధ రాష్ట్రాల్లో 21 నకిలీ వర్సిటీలు ఉన్నట్లు గుర్తించామని, విద్యార్థులు వాటిల్లో చేరవద్దని యూజీసీ తెలిపింది. వివిధ రాష్ట్రాల్లోని నకిలీ యూనివర్సిటీల జాబితాను ugc.ac.in వెబ్సైట్లో ఉంచింది. ఇందులో తెలంగాణ, ఏపీల నుంచి నకిలీ వర్సిటీలు లేవు. 19 కాలేజీలకు యూజీసీ వారసత్వ హోదా దేశంలోని వందేళ్లకు పైబడిన కాలేజీల్లో 19 కాలేజీలకు యూజీసీ వారసత్వ హోదా ఇచ్చింది. వాటి అభివృద్ధి, హోదా పెంపునకు ఆర్థిక సాయం అందించడానికి ఆమోదం తెలిపింది. పురాతన విద్యాసంస్థల పరిరక్షణకు ఈ నిర్ణయం తీసుకుంది. హెరిటేజ్ కాలేజ్ స్కీం కింద 60 కాలేజీల నుంచి ప్రతిపాదనలు రాగా 19 కాలేజీలకు వారసత్వ హోదా కల్పించామని యూజీసీ ఓ ప్రకటనలో తెలిపింది. వీటిలో ఏపీ, తెలంగాణ కాలేజీలు లేవు. -
సరైన కెరీర్‌కు సోపానాలు..
వందల సంఖ్యలో కోర్సులు.. వేలల్లో కెరీర్ అవకాశాలు.. స్కిల్ ఉంటే లక్షల్లోనే వార్షిక పే ప్యాకేజీలు.. ఇంజనీరింగ్ నుంచి ఇంటీరియర్ డిజైనింగ్ వరకు.. అన్నీ హాట్ కోర్సులుగా, కెరీర్ డెస్టినేషన్సగా నిలుస్తున్నాయి.. 21వ శతాబ్దంలో ఏ రంగం చూసినా అవకాశాల హారమే.. కావల్సిందల్లా సరైన కెరీర్ ప్లానింగ్.. ఆపైన సబ్జెక్ట్ నాలెడ్‌జతోపాటు స్కిల్స్.. ఇంటర్మీడియెట్, పదో తరగతి పూర్తిచేసుకుంటున్న విద్యార్థుల భవిష్యత్ కెరీర్ ఎంపికకు ఇదే సరైన సమయం.. ఈ దశలో సముచిత నిర్ణయం తీసుకోవాలి. సరితూగే కెరీర్ విషయంలో జాగ్రత్తగా ప్రణాళికలు రూపొందించుకోవాలి. ఇంటర్ , పదోతరగతి తర్వాత కోర్సు ఎంపికలో, కెరీర్ సెలక్షన్లో విద్యార్థులు పరిగణనలోకి తీసుకోవాల్సిన 10 ముఖ్యాంశాలు మీ కోసం.. 1. ఆసక్తి కెరీర్ ప్రణాళికలో తొలి ప్రామాణికం.. వ్యక్తిగత ఆసక్తి. కెరీర్, కోర్సు ఎంపిక పరంగా అత్యంత ప్రధానమైన అంశమిది. ఆసక్తి లేకుండా కోర్సులో అడుగుపెడితే ఆశించిన ఫలితం అందుకోవడం కష్టం. సంపద్రాయ సంగీతం నుంచి సాఫ్ట్వేర్ రంగం వరకూ.. ప్రస్తుతం అన్ని రంగాలు బెస్ట్ డెస్టినేషన్స్‌గా నిలుస్తున్నాయి. కొత్త కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. కాబట్టి ‘క్రేజీ కెరీర్’ అనే కోణానికే పరిమితం కాకుండా.. ఆసక్తి మేరకు కోర్సును ఎంచుకోవచ్చు. అదే ఆసక్తితో ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించొచ్చు. ఆసక్తి, ఇష్టం ఉంటే ఎంతటి క్లిష్టమైన సబ్జెక్టునైనా ఇట్టే ఒక పట్టుపట్టొచ్చు. లోతైన అధ్యయనంతో విషయాన్ని ఆకళింపు చేసుకొంటూ, పాషన్‌తో పనిచేస్తూ ఉన్నత స్థానాలు అందుకోవచ్చు. తమ తమ రంగాల్లో అత్యున్నత శిఖరాలు చేరుకున్న వారిని అడిగితే.. ఆయా పని పట్ల ఇష్టం ఉండ టం వల్లే అలుపుసొలుపూ లేని పనితీరుతో ముందుకుసాగిన ట్లు చెబుతారు. కాబట్టి కోర్సు, కెరీర్ ఎంపికలో ఆసక్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. 2. ఆప్టిట్యూడ్ కెరీర్ ఎంపిక విషయంలో ఆప్టిట్యూడ్‌ను పరిగణనలోకి తీసుకోవడం కూడా ఎంతో ముఖ్యం. కొంతమంది విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే వారి దృక్పథం వారి చర్యల ద్వారా కనిపిస్తుంది. ఉదాహరణకు కొంతమంది పిల్లలు ఇంట్లో సైకిల్స్నో, స్కూటర్‌నో బాగు చేయడంలో ఆసక్తి చూపుతుంటారు. మరికొంత మంది ఇంట్లోని ఎలక్ట్రికల్ బోర్డులను, పాత రేడియోలు కనిపిస్తే విప్పి పరిశీలిస్తుంటారు. ఇంకొందరు తెల్లకాగితం కనిపిస్తే చాలు ఏదో ఒక బొమ్మ గీయడం చేస్తుంటారు. ఇలాంటి చర్యలు వారి దృక్పథాన్ని, సహజ ఆసక్తిని, ఆ పని చేయగలిగే సామర్థ్యాన్ని తెలియజేస్తుంటాయి. అంతేకాకుండా కొంతమంది విద్యార్థుల్లో చిన్నప్పటి నుంచే ఇంజనీరింగ్ చదవాలి లేదా డాక్టర్ కావాలి అనే స్పష్టమైన దృక్పథం ఉంటుంది. అలాంటి వారి విషయంలో ఆందోళన చెందక్కర్లేదు. కానీ ఆప్టిట్యూడ్‌ను బహిర్గతం చేయలేని విద్యార్థుల విషయంలో తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలి. ఇప్పుడు ఎన్నో మార్గాల ద్వారా విద్యార్థుల ఆప్టిట్యూడ్‌ను తెలుసుకునే సాధనాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని వినియోగించుకోవాలి. 3. ఆర్థిక అంశాలు కెరీర్ ఎంపికలో ఆర్థిక అంశాలను అంటే తమ కుటుంబ ఆర్థిక స్థితిని, ఎంచుకునే కోర్సులకు అయ్యే వ్యయ మొత్తాలను బేరీజు వేసుకోవడం కూడా ముఖ్యమే. ఈ విషయంలో తల్లిదండ్రులు కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించి అడుగులు వేయాలి. ఇతరులతో పోల్చుకోవడం సరికాదు. ఇప్పుడు ఇంజనీరింగ్ కోర్సులకు రూ.30 వేల నుంచి రూ.లక్ష వరకు వార్షిక ఫీజు చెల్లించాల్సిన స్థాయిలో ఇన్స్టిట్యూట్లు అందుబాటులో ఉన్నాయి. ఎక్కువ ఫీజులు చెల్లించాల్సిన ఇన్స్టిట్యూట్లు మాత్రమే మంచివనే ఆలోచన కూడా సరికాదు. ఇక్కడ గుర్తించాల్సిన విషయం స్వీయ సామర్థ్యం. అది ఉంటేనే లక్షల మొత్తాల్లో ఫీజు చెల్లించాల్సిన ఇన్స్టిట్యూట్లైనా, సాధారణ ఇన్స్టిట్యూట్లలోనైనా విద్యార్థులు రాణించగలరు. ఇదే సమయంలో విద్యార్థులకు ఆర్థికపరమైన ప్రోత్సాహకాలు అందుబాటులో ఉంటున్నాయి. ప్రతిభావంతులైన విద్యార్థులకు బ్యాంకు రుణాలు, స్కాలర్షిప్స్ వంటి సదుపాయాలు లభిస్తున్నాయి. అయితే తాము ఎంపిక చేసుకునే కోర్సుకు రుణాలు, స్కాలర్షిప్స్ పరంగా ఉన్న అవకాశాల గురించి ముందుగానే తెలుసుకుని ఆ మేరకు ముందుకు సాగాలి. 4. ఉన్నత విద్య అవకాశాలు కోర్సులు, కెరీర్స్ ఎంపికలో అత్యంత ప్రధానమైన అంశం.. ఉన్నత విద్య అవకాశాలు. ప్రతి కోర్సులోనూ ఇప్పుడు ఉన్నత విద్య అవకాశాలున్నాయి. కానీ వాటిని అందించే ఇన్స్టిట్యూట్లు, సీట్ల పరిమితి వంటి వాటిని పరిగణనలోకి తీసుకోవాలి. ఇటీవల కాలంలో మార్కెట్ క్రేజ్ కోణంలో ఎన్నో కొత్త కోర్సులు బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలోనే ఆవిష్కృతమవుతున్నాయి. వీటికి పీజీ స్థాయిలో స్పెషలైజేషన్లు ఉండట్లేదు. దీనివల్ల విద్యార్థులు సంబంధిత రంగంలో పరిపూర్ణత సాధించలేకపోతున్నారు. కాబట్టి ఉన్నత విద్యకు కోర్సుల పరంగా, ఇన్స్టిట్యూట్ల పరంగా ఉన్న అవకాశాలను పరిశీలించాలి. ఇవి పుష్కలంగా ఉన్నవాటికే ఓటు వేయడం మంచిదని నిపుణుల అభిప్రాయం. 5. ఉపాధి వేదికలు కోర్సు, కెరీర్ విషయంలో స్పష్టత వచ్చిన తర్వాత ఉపాధి వేదికల పరంగానూ ముందుగానే ప్రణాళిక రూపొందించుకోవడం మేలు. మార్కెట్ డిమాండ్, పే ప్యాకేజ్ వంటి వాటి కోణంలో ఒక కోర్సును ఎంపిక చేసుకుంటే.. సంబంధిత రంగంలో భవిష్యత్తు అవకాశాలు; ఉపాధి మార్గాలపై దృష్టిసారించాలి. అంతేకాకుండా సదరు రంగం ప్రస్తుత ప్రగతి, సంబంధిత కోర్సు ముగిసే సమయానికి ఉండే అవకాశాలపై ఒక స్పష్టమైన అంచనాకు రావాలి. ఇందుకోసం సంబంధిత రంగ నిపుణుల సలహాలు, సూచనలు ఉపయోగపడతాయి. 6. కోర్సు వ్యవధి విద్యార్థులు ఒక కోర్సును ఎంపిక చేసుకునే ముందు ఆలోచించాల్సిన మరో అంశం.. కోర్సు వ్యవధి. ముఖ్యంగా ఇంటర్మీడియెట్ విద్యార్థులకు ఇది ఎంతో అవసరం. కుటుంబ ఆర్థిక పరిస్థితులు, అకడమిక్ సర్టిఫికేషన్ కోణంలోనూ కోర్సు వ్యవధిని పరిగణనలోకి తీసుకోవడం ముఖ్యం. ఉదాహరణకు ఇటీవల కాలంలో ఇంటిగ్రేటెడ్ డిగ్రీ, పీజీ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. వీటి వల్ల కొంత సమయం ఆదా అవుతుంది. మరోవైపు కొన్ని కోర్సులు పీజీ, పీహెచ్డీ చేస్తే కానీ కెరీర్ ఆరంభానికి అవకాశం లభించదు. ఉదాహరణకు మెడికల్ కోర్సునే తీసుకుంటే ప్రస్తుత పోటీ ప్రపంచంలో పీజీ, సూపర్ స్పెషాలిటీ కోర్సులు చేస్తేనే గుర్తింపు లభిస్తోంది. ఇందుకోసం ఇంటర్మీడియెట్ తర్వాత దాదాపు పదేళ్ల సమయం పడుతోంది. అదే విధంగా సైన్స్ కోర్సులు కూడా పీజీ, పీహెచ్డీ చేస్తేనే మంచి భవిష్యత్తు. ఇలాంటి కోర్సుల వల్ల కెరీర్లో ఉన్నత శిఖరాలు అధిరోహించడం ఖాయం. కానీ మన సామాజిక ఆర్థిక పరిస్థితుల్లో ఎందరో విద్యార్థులు బ్యాచిలర్ డిగ్రీతోనే ఉద్యోగంలో అడుగు పెట్టాల్సిన అవసరాలు ఉంటున్నాయి. కాబట్టి ఈ అంశాన్ని కూడా విద్యార్థులు కోర్సు ఎంపికలో పరిగణనలోకి తీసుకోవాలి. 7. అభ్యసన సామర్థ్యం అభ్యసన సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకోవడం కూడా కెరీర్ ప్రణాళిక రూపకల్పనలో ముఖ్యమైన అంశం. ఇందుకోసం రెండు విషయాలను బేరీజు వేసుకోవాలి. అవి థియరీ ఓరియెంటేషన్, ప్రాక్టికల్ అప్రోచ్. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులు దీన్ని మరింత బాగా అనుసరించాలి. మ్యాథమెటిక్స్, సైన్స్ వంటి కోర్సుల్లో ప్రాక్టికల్ అప్రోచ్దే ప్రాధాన్యం. హిస్టరీ, ఎకనామిక్స్, ఇతర సోషల్ సెన్సైస్ విషయంలో థియరీ నైపుణ్యాలు లాభిస్తాయి. విద్యార్థులు తమకు ఈ రెండింటిలో దేనిలో ఎక్కువ నైపుణ్యం ఉందో గుర్తించి ఆ మేరకు ఇంటర్మీడియెట్‌లో గ్రూప్, ఆపై సంబంధిత కెరీర్ దిశగా ప్రణాళిక రూపొందించుకోవాలి. ఈ అభ్యసన సామర్థ్యాలను తెలుసుకునేందుకు హైస్కూల్ స్థాయిలో ఆయా సబ్జెక్ట్‌ల్లో చూపిన ప్రగతిని ప్రామాణికంగా తీసుకోవాలి. ఈ క్రమంలో ఉపాధ్యాయులతో మాట్లాడి తమ పిల్లల అభ్యసన సామర్థ్యం తెలుసుకోవడం మరింత ఉపకరించే అంశం. 8. దీర్ఘకాలిక లక్ష్యాలు కెరీర్ ఎంపికలో మరో ప్రధాన అంశం.. విద్యార్థులు తమ దీర్ఘకాలిక లక్ష్యాలపై స్పష్టత ఏర్పరచుకోవడం. ఉన్నత విద్య, ఉద్యోగం సాధారణంగా విద్యార్థుల్లో లక్ష్యాలుగా నిలుస్తున్న అంశాలు. ఉన్నత విద్య కోణంలో అందుబాటులో ఉన్న అవకాశాలు; ఉద్యోగపరంగా దీర్ఘకాలిక లక్ష్యాలు, అందుకోసం అభ్యసించాల్సిన ఉన్నత చదువులు; వాటికి సంబంధించి తమ సమర్థత స్థాయి గురించి తెలుసుకోవాలి. ఉదాహరణ కు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నత శిఖరాలు లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థులు.. ఆ మేరకు బ్యాచిలర్, పీజీ స్థాయిలో అందుబాటులో ఉన్న కోర్సుల గురించి అవగాహన పెంచుకోవాలి. తమ లక్ష్యానికి అనుగుణంగా మెరుగుపరచుకోవాల్సిన స్కి ల్స్‌పై అవగాహనతో కెరీర్ ప్లానింగ్ రూపొందించుకోవాలి. 9. హాబీలు..అందించే హోదాలు హాబీలు.. అంటే వ్యక్తులకు తమ ఇష్టం మేరకు ఉండే అలవాట్లు. సరదాకి, లేదా అలవాటుగా ఉండే ఈ హాబీలు కూడా కెరీర్ పరంగా సమున్నత హోదాలు అందించే మార్గాలు ఇప్పుడు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు బొమ్మలు గీయడం హాబీగా ఉన్న విద్యార్థులు దానికి కొంచెం నగిషీలు దిద్దుకుంటే ఫైన్ ఆర్ట్స్, గ్రాఫిక్ డిజైనింగ్ వంటి రంగాల్లో ఉజ్వల భవిష్యత్తును సొంతం చేసుకోవచ్చు. అదే విధంగా క్రీడలంటే మక్కువ ఉన్న విద్యార్థులు క్రీడా రంగంలోనే కెరీర్ సొంతం చేసుకునే విధంగా స్పోర్ట్స్ మేనేజ్మెంట్ వంటి కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. డ్యాన్సింగ్, యాక్టింగ్ వంటి హాబీలున్న విద్యార్థులకు కూడా ఇప్పుడు ఆయా విభాగాల్లో ప్రొఫెషనల్ స్కిల్స్ తద్వారా చక్కటి కెరీర్స్ అందించే కోర్సులు లభిస్తున్నాయి. కాబట్టి కెరీర్ ప్లానింగ్ విషయంలో హాబీలకు సముచిత స్థానం కల్పించాలి. 10. ‘ఆసక్తి’కి ప్రత్యామ్నాయాలు కెరీర్ ప్లానింగ్‌లో తొలి ప్రాధాన్యత అంశం ‘ఆసక్తి’. అయితే.. మలి ప్రాధాన్యత అంశం ఆల్టర్నేటివ్స్ (ప్రత్యామ్నాయాలు) పై స్పష్టత. కారణం.. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆసక్తి, లక్ష్యాలు, ఆర్థిక పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో నిరాశాజనక ఫలితాలు ఎదురుకావచ్చు. ఇలాంటి వాటిని దీటుగా ఎదుర్కొనే సమర్థతను పొందడంతోపాటు, తమ ఆసక్తికి సంబంధించిన కోర్సులు, కెరీర్స్‌కు ప్రత్యామ్నాయాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ఉదాహరణకు ఇంటర్మీడియెట్ బైపీసీ విద్యార్థుల్లో అధిక శాతం మందికి ఎంబీబీఎస్‌లో చే రాలనేది లక్ష్యం. సీట్లు పరిమితం. అంతేకాకుండా ఎంట్రెన్స్‌లు, ర్యాంకుల పరంగా విజయం సాధించకపోవచ్చు. కానీ ఇదే సమయంలో ఎంబీబీఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఉన్న ఇతర వైద్య సంబంధ కోర్సులు (వెటర్నరీ సైన్స్, హోమియోపతి, ఆయుర్వేద, ఫిజియో థెరపీ) గురించి తెలుసుకుంటే మానసిక సంసిద్ధత వస్తుంది. అంతేకాకుండా ఈ ప్రత్యామ్నాయ కోర్సులు కూడా ఇప్పుడు ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నాయనే విషయం తెలుస్తుంది. కెరీర్ ప్లానింగ్‌లో అనుసరించాల్సిన అంశాలు పదో తరగతి నుంచే ప్రణాళిక రూపొందించుకోవాలి. స్వీయ సామర్థ్యం/నైపుణ్యాలు గుర్తించాలి. సబ్జెక్ట్ పరిజ్ఞానం ఆధారంగా ముందుకు సాగాలి. వ్యక్తిగత శైలికి అనుగుణంగా వ్యవహరించాలి. వ్యక్తిగత పరిమితులు గుర్తించి ఆ మేరకు ఉన్న అవకాశాలపై దృష్టి సారించాలి. వాస్తవ పరిస్థితులపై అవగాహన పెంచుకోవాలి అభిరుచి, ఆసక్తులే ప్రధాన సాధనాలు కెరీర్ చాయిస్ విషయంలో అభిరుచి, ఆసక్తులే ప్రధాన సాధనాలని గుర్తించాలి. ఆ మేరకు అందుబాటులో ఉన్న అవకాశాలను పరిగణనలోకి తీసుకుంటూ.. కోర్సు అడ్మిషన్‌తో మొదలుపెట్టి లాంగ్ టర్మ్ లక్ష్యం ఆధారంగా ప్రణాళిక రూపొందించాలి. క్రేజ్ అనే విషయానికే ప్రాధాన్యం ఇవ్వకూడదు. ప్రస్తుతం ఎలాంటి రంగంలోనైనా అవకాశాలు విస్తృతం. అయితే భవిష్యత్తులో ఆయా రంగాల ప్రగతి ఎలా ఉండబోతుంది అనే తులనాత్మక పరిశీలనతో ముందుకు సాగాలి. - ఎస్.గంగాధర్, డెరైక్టర్, లాజిక్ సొల్యూషన్స్ సోషల్ మీడియా సాధనంగా విద్యార్థులు తమ కెరీర్ ప్లానింగ్ విషయంలో సోషల్ మీడియాను సాధనంగా మలచుకుంటే మరింత పకడ్బందీ ప్రణాళికకు ఆస్కారం లభిస్తుంది. సోషల్ మీడియా ద్వారా ఆయా రంగాలకు చెందిన నిపుణులు, సీనియర్లు, ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులను సంప్రదించి తగిన సలహాలు, సూచనలు స్వీకరిస్తే స్పష్టత లభిస్తుంది. ఇంటర్నెట్ ఆధారంగా ఆన్లైన్లో అందుబాటులో ఉన్న ఆప్టిట్యూడ్ అనలైజింగ్ టెస్ట్స్, సైకోమాటిక్ టెస్ట్‌లకు హాజరై విద్యార్థుల తమ వ్యక్తిగత సామర్థ్యాల స్థాయిని తెలుసుకుని ఆ మేరకు తమకు సరితూగే రంగం, తదనుగుణంగా కెరీర్ ప్లాన్ రూపొందించుకోవాలి. - ఎం. రామకృష్ణ, ఎండీ, జెడ్‌సీఎస్ కన్సల్టింగ్ ఇంటర్మీడియెట్ విద్యార్థులు.. మరింత అప్రమత్తంగా కెరీర్ ప్లానింగ్ విషయంలో ఇంటర్మీడియెట్ విద్యార్థులు మరింత అప్రమత్తంగా ఉండాలి.ఎందుకంటే.. అప్పటికే మనసులో ఒక లక్ష్యం ఆధారంగా ఇంటర్మీడియెట్‌లో గ్రూప్‌లు ఎంచుకుంటారు. ఉదాహరణకు.. ఇంజనీరింగ్ ఔత్సాహికులు ఎంపీసీ, మెడికల్ ఔత్సాహికులు బైపీసీ, కామర్స్/మేనేజ్మెంట్ ఔత్సాహికులు సీఈసీ గ్రూప్‌లలో చేరుతున్నారు. ఇలాంటి విద్యార్థులు ఇంటర్మీడియెట్ తర్వాత కెరీర్ ప్లాన్‌పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి. ఇంజనీరింగ్ లక్ష్యంగా పెట్టుకున్న ఎంపీసీ విద్యార్థులు బీటెక్ స్థాయిలో తమకు సరితూగే బ్రాంచ్‌పై ముందుగానే అవగాహన ఏర్పరచుకోవాలి. ఇదే సమయంలో ఇంజనీరింగ్‌కు దీటుగా లభిస్తున్న ఇతర అవకాశాలు (పీజీ,ీపీహెచ్డీ తదితర) వాటికి తమ అనుకూలత స్థాయి తెలుసుకోవాలి. మెడికల్ ఔత్సాహికులు కేవలం ఎంబీబీఎస్ కోణంలోనే ఆలోచించకుండా ఇతర ఆప్షన్స్పైనా దృష్టి సారించాలి. కామర్స్/మేనేజ్మెంట్ ఔత్సాహికులు బీకాం చదవాలా? లేదా సీఏ, సీఎస్ వంటి కోర్సులను ఎంచుకోవాలా? అనే విషయంలో స్పష్టత పొందాలి. హెచ్ఈసీ ఎంచుకున్న విద్యార్థులు తమ భవిష్యత్తు అవకాశాల గురించి ఆందోళన చెందనక్కర్లేదు. ఇప్పుడు ఆర్ట్స్, సోషల్ సెన్సైస్‌లోనూ విస్తృత అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. సోషల్ వర్క్, ఎన్జీఓ మేనేజ్మెంట్, రూరల్ డెవలప్మెంట్ వంటి విభాగాల్లో అనేక కోర్సులు, కెరీర్ అవకాశాలు లభిస్తున్నాయి. హెచ్ఈసీ అభ్యర్థులు తమ అభిరుచి, ఆసక్తికి అనుగుణంగా కోర్సు, కెరీర్ పరంగా ప్రణాళిక రూపొందించుకుంటే సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్‌తో సమాన స్థాయిలో హోదాలు సొంతం చేసుకోవచ్చు. -
నూతనత్వం.. నైపుణ్యాలు
గెస్ట్ కాలమ్ ‘కార్పొరేట్ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. నేటి ప్రపంచీకరణ కాలంలో.. విద్యార్థులు విస్తృతస్థాయి నైపుణ్యాలు సొంతం చేసుకోవడం చాలా అవసరం. అకడెమిక్ కోర్సుల్లో నూతనత్వం ఉండాలి. అలాగే ఇన్స్టిట్యూట్లు మూస ధోరణికి స్వస్తి పలికి.. కొత్త కోర్సులు, సరికొత్త బోధన విధానాలు అనుసరించాలి. భారతీయ విద్యార్థులు విశ్వవ్యాప్త అవకాశాలు అందుకోవాలంటే.. మన విద్యావ్యవస్థలో సమూల మార్పులు అవసరం’ అంటున్నారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- కాన్పూర్, డెరైక్టర్ ప్రొఫెసర్ ఇంద్రనీల్ మన్నా. ఇటీవల హైదరాబాద్‌లో.. ఐఐటీ-హైదరాబాద్, జపాన్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ ఏజెన్సీ సంయుక్తంగా నిర్వహించిన 3డీ డిజిటల్ ఫ్యాబ్రికేషన్ సదస్సుకు హాజరైన ప్రొఫెసర్ ఇంద్రనీల్ మన్నాతో ఈ వారం గెస్ట్ కాలం.. జనాభాపరంగా రెండో పెద్ద దేశంగా ఉన్న భారత్‌లో ప్రస్తుత పరిస్థితులు చూస్తే సామాజికంగా, సాంకేతికంగా అన్ని రంగాల్లో లక్షిత వర్గాల అవసరాలు రోజురోజుకీ మారుతున్నాయి. ప్రజలు నూతన సేవలు, ఉత్పత్తులవైపు మొగ్గు చూపుతున్నారు. అదేవిధంగా పరిశ్రమలు పోటీదారులకంటే ముందంజలో నిలవాలనే ఆలోచనతో కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణల దిశగా కృషిచేస్తున్నాయి. అంటే.. మార్పు అత్యంత అవసరంగా, అదో నిరంతర ప్రక్రియగా మారింది. ఈ మార్పులు ఆశాజనకంగా ఉండాలంటే యువశక్తి, వారి అకడమిక్ నైపుణ్యాలు ఎంతో కీలకం. సరికొత్త నైపుణ్యాలు అందించే కోర్సులు రోజురోజుకీ మారుతున్న సామాజిక, పారిశ్రామిక అవసరాలు వాటికి సంబంధించిన సేవలు, ఉత్పత్తుల ఆవిష్కరణలకు అకడమిక్ స్థాయి నుంచే పునాదులు పడాలి. భవిష్యత్తులో ఒక సంస్థలో చేరే వ్యక్తి అక్కడ విధుల్లో భాగంగా వివిధ ఉత్పత్తి విభాగాల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కొత్త ఉత్పత్తుల రూపకల్పనలోనూ భాగస్వాములు కావలసి ఉంటుంది. ఇలాంటి వారికి అకడమిక్‌గా సంబంధిత నైపుణ్యాలు లేకపోతే రాణించలేరు. అదేవిధంగా ఇన్స్టిట్యూట్లు కూడా మారుతున్న అవసరాలకు అనుగుణంగా కొత్త నైపుణ్యాలు అందించే కోర్సుల రూపకల్పనకు శ్రీకారం చుట్టాలి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ 3-డీ ఫ్యాబ్రికేషన్. డిజైనింగ్, రూపకల్పన విషయంలో ఇప్పటికే అందుబాటులో ఉన్న క్యాడ్, క్యామ్ పద్ధతులకు అడ్వాన్స్డ్ దశ 3-డీ ఫ్యాబ్రికేషన్. దీనివల్ల వస్తువుల రూపకల్పన, నిర్మాణం వంటివి మరింత సులభతరం అవుతాయి. సంబంధిత సేవలు అందించే సంస్థలకు, లక్షిత వర్గాలకు కూడా త్వరగా అవి అందుబాటులోకి వస్తాయి. ఇలాంటి అధునాతన నైపుణ్యాలను అకడమిక్ స్థాయిలోనే అందించే విధంగా కోర్సుల రూపకల్పన చేయడం నేటి పరిస్థితుల్లో ఎంతో అవసరం. కేవలం కోర్ కోర్సుల బోధనకే పరిమితం కాకుండా వాటికి అనుసంధానంగా ఉండే కొత్త కోర్సులు అందించాలి. ఈ క్రమంలో ఇండస్ట్రీ వర్గాలు, అంతర్జాతీయ, జాతీయ స్థాయిలోని ఇతర ఇన్స్టిట్యూట్లతో ఒప్పందాలు చేసుకోవడం ఉపయుక్తం. అకడమిక్ ఎక్స్ఛేంజ్.. ఎంఎన్‌సీలే కానక్కర్లేదు ముఖ్యంగా ఇంజనీరింగ్, సైన్స్ విభాగాల విద్యార్థులకు జాబ్ రెడీ స్కిల్స్, క్షేత్ర నైపుణ్యాలు అందించేందుకు మార్గం ఇండస్ట్రీ వర్గాలతో ఒప్పందాల ద్వారా ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం. ఈ విషయంలో ఐఐటీలు, ఐఐఎంలు, ఇతర జాతీయ ఇన్స్టిట్యూట్లకే ప్రోత్సాహం ఉంటోందని, రాష్ట్ర స్థాయి విద్యాసంస్థలకు ఒడిదుడుకులు ఎదురవుతున్నాయని అంటున్నారు. ఇది కొంతవరకు వాస్తవమే. అయితే రాష్ట్రాల స్థాయిలోనూ అకడమిక్ పనితీరు బాగున్న ఇన్స్టిట్యూట్లు తమ పరిసర ప్రాంతాల్లోని ఎంఎస్‌ఎంఈలతోనూ సంప్రదింపుల ద్వారా ఎక్స్ఛేంజ్ ఒప్పందాలు, స్పాన్సర్డ్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్ నిర్వహించేందుకు ప్రయత్నించాలి. ఇలా ఒక ప్రాజెక్ట్ విజయవంతమైతే ఇతర కంపెనీల దృష్టిని ఆకర్షించడం సులువవుతుంది. సీబీసీఎస్ సాధ్యమే ఛాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్.. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూపకల్పన చేసి, వచ్చే ఏడాది నుంచి అమలు చేయనున్న సరికొత్త బోధన-అధ్యయన విధానం. ఇది ఆహ్వానించదగిన పరిణామం. విద్యార్థులకు భిన్న నైపుణ్యాలు అందించే మార్గం. దీని అమలు సాధ్యాసాధ్యాలు, ఫలితాల విషయంలో ఆందోళన చెందక్కర్లేదు. దేశంలోని యూనివర్సిటీలకు వేర్వేరు సిలబస్ విధానాలు, మూల్యాంకన విధానాల కారణంగా ప్రారంభంలో కొద్దిపాటి ఇబ్బందులు సహజమే. ఐఐటీలు, సెంట్రల్ యూనివర్సిటీలు కూడా మొదట్లో ఈ సమస్యను ఎదుర్కొన్నాయి. కానీ ఇప్పుడు అక్కడ సజావుగా సీబీసీఎస్ విధానం అమలవుతోంది. సీబీసీఎస్ పూర్తిస్థాయిలో విజయవంతం కావాలంటే.. అన్ని యూనివర్సిటీల్లోని కోర్సుల సిలబస్ అంశాల మధ్య వైవిధ్యం తగ్గేలా చూడాలి. ఈ దిశగా సంబంధిత నియంత్రణ సంస్థలు దృష్టిసారించాలి. ఐఐటీల్లో అడుగు పెట్టాలనుకుంటే ఐఐటీల్లో చదవాలనుకునే విద్యార్థులకు నా సలహా ఒకటే.. ఎంట్రెన్స్‌లో ర్యాంకు ఆధారంగా సీటు సాధించగలిగినా.. ఆ తర్వాత కోర్సు పూర్తిచేసే క్రమంలో నిరంతరం అన్వేషణ దృక్పథాన్ని అలవర్చుకోవాలి. అక్కడ నిర్వహించే ప్రాజెక్ట్ యాక్టివిటీస్‌లో చురుగ్గా పాల్పంచుకోవాలి. మొదట్లో కొంత ఒత్తిడికి గురయ్యే ఆస్కారముంది. కాబట్టి వీటిపై ముందుగానే అవగాహన పెంచుకొని మానసికంగా సిద్ధమవడం మంచిది. ‘స్ఫూర్తి’తోనే సక్సెస్ ఇంజనీరింగ్ అనే కాకుండా ఏ కోర్సులో చేరే విద్యార్థులైనా ఉన్నత శిఖరాలను అధిరోహించే అవకాశాలు ఇప్పుడు కోకొల్లలు. చాలా మంది విద్యార్థులు తమకు నచ్చిన కోర్సులో సీటు రాలేదని నిరాశ చెందుతుంటారు. కానీ ఆ రంగంలో విజయ శిఖరాలు అధిరోహించిన వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకుంటే తాము కూడా సక్సెస్ దిశగా సాగొచ్చు. ఆల్ ది బెస్ట్!! ప్రొఫెసర్ ఇంద్రనీల్ మన్నా డెరైక్టర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - కాన్పూర్ -
ఉపాధి గమ్యానికి నైపుణ్యాల నావ!
నడుస్తున్న కాలంలో సింహభాగం ‘నైపుణ్యం’పైనే చర్చ జరుగుతోంది. చేతిలో డిగ్రీ, పీజీ పట్టాలు ఎన్నున్నా.. ‘నైపుణ్యాలు’ గుండుసున్నా కావడంతో అధిక శాతం యువతకు అవకాశాలు ఎండమావిగా మిగులుతున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. నైపుణ్యాభివృద్ధిపైనే దేశ సత్వర అభివృద్ధి, పోటీతత్వం, సామాజిక స్థిరత్వం ఆధారపడి ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలో పోటీని తట్టుకుని నిలవాలంటే.. కంపెనీలు/సంస్థలు ప్రమాణాలకు అనుగుణంగా వస్తు, సేవలను అందించాల్సి ఉంది. ఈ తరుణంలో సుశిక్షితులైన, నిపుణులైన మానవ వనరులకు డిమాండ్ ఏర్పడింది. అందుకే విద్యావంతులైన యువతలో మార్కెట్‌కు సరిపడా స్కిల్స్ పెంపొందించే ప్రయత్నం జరుగుతోంది. ఈ క్రమంలోనే ‘ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, స్కిల్ డెవలప్మెంట్’కు ప్రత్యేక మంత్రిత్వ శాఖ, నైపుణ్యాల అభివృద్ధి సంస్థల ఏర్పాటు, కేటాయింపులు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో వివిధ అంశాల్లో నైపుణ్యాలను అందించే విద్యా సంస్థలు ఎన్నో ఉన్నాయి. వివరాలు.. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్: జాతీయ నైపుణ్యాభివృద్ధి మిషన్‌లో భాగంగా నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్డీసీ)ను ఏర్పాటు చేశారు. ఇది ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో వివిధ కోర్సుల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఎన్ఎస్డీసీ సహకారంతో హైదరాబాద్‌లో నడుస్తున్న కేంద్రాల్లో 21 అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. 30 రోజుల నుంచి 75 రోజుల వరకు శిక్షణ ఇస్తారు. కోర్సును బట్టి ఫీజు రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు ఉంటుంది. రిజర్వేషన్లను బట్టి ఫీజు రాయితీ లభిస్తుంది. కోర్సులు: ఆటోమొబైల్/ఆటో కాంపొనెంట్; ఎలక్ట్రానిక్స్ హార్డ్‌వేర్; టెక్స్టైల్స్ అండ్ గార్మెంట్స్; లెదర్, లెదర్ గూడ్స్; కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్; జెమ్ అండ్ జ్యువెలరీ; బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్; ఫుడ్ ప్రాసెసింగ్; హ్యాండ్లూమ్స్, హ్యాండిక్రాఫ్ట్స్; బిల్డింగ్ హార్డ్‌వేర్ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వెబ్సైట్: www.nsdcindia.org ఎంఎస్ఎంఈ: కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల మంత్రిత్వ శాఖ (ఎంఎస్ఎంఈ) ఆధ్వర్యంలోని అభివృద్ధి సంస్థ హైదరాబాద్‌లో పారిశ్రామిక ప్రాంతమైన బాలానగర్‌లో ఉంది. ఇది పారిశ్రామిక ప్రేరణ ప్రచార కార్యక్రమాలు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్- స్కిల్ డెవలప్మెంట్, మేనేజ్మెంట్ డెవలప్మెంట్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఎంఎస్ఎంఈ యువతకు ఉపాధి కల్పించే వివిధ కోర్సులు అందిస్తోంది. కోర్సులు: కంప్యూటర్ హార్డ్‌వేర్, మెయింటెనెన్స్-నెట్వర్కింగ్; గార్మెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్; హౌస్ వైరింగ్; ఎలక్ట్రిక్ గాడ్జెట్ రిపైరింగ్; ఫుడ్ ప్రాసెసింగ్ తదితర అంశాల్లో శిక్షణ అందిస్తోంది. వీటికి సంబంధించి సంస్థ ఎప్పటికప్పుడు ప్రకటనలు విడుదల చేస్తుంది. వెబ్సైట్: http://msmehyd.ap.nic.in/ ఎన్ఐఓఎస్: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్- ఎన్ఐఓఎస్(గతంలో నేషనల్ ఓపెన్ స్కూల్‌గా పిలిచేవారు).. 1989లో ఏర్పడిన స్వయంప్రతిపత్తిగల సంస్థ. ఇది సెకండరీ, సీనియర్ సెకండరీ స్థాయిలో జనరల్, అకడమిక్ కోర్సులతో పాటు వివిధ వృత్తివిద్యా కోర్సులు అందిస్తోంది. దీనికి సంబంధించి హైదరాబాద్ రీజియన్ కేంద్రం దిల్‌సుఖ్‌నగర్‌లో ఉంది. కోర్సులు: హౌస్ వైరింగ్ అండ్ ఎలక్ట్రికల్ అప్లయిన్స్ రిపైరింగ్; కేటరింగ్ మేనేజ్మెంట్; ఎయిర్ కండీషనింగ్; బ్యూటీ కల్చర్; ఫుడ్ ప్రాసెసింగ్; ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ వంటి అంశాల్లో శిక్షణ కోర్సులున్నాయి. వెబ్సైట్: www.nios.ac.in అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్: నగరంలోని విద్యానగర్‌లో ఉన్న అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (ఏటీఐ).. నైపుణ్యాలున్న మానవ వనరులను అందించేందుకు వివిధ దీర్ఘకాలిక, స్వల్పకాలిక కోర్సులను అందిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో నిపుణుడైన ఇన్‌స్ట్రక్టర్‌గా చేరేందుకు ఏడాది కాల వ్యవధిగల క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్ ట్రైనింగ్ స్కీమ్ (సీఐటీఎస్) కోర్సు అందుబాటులో ఉంది. ఇందులోని విభాగాలు: ఎలక్ట్రీషియన్, వైర్‌మ్యాన్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, టర్నర్, మెషినిస్టు, మెకానిక్ మోటార్ వెహికల్, వెల్డర్. వీటితో పాటు అడ్వాన్స్డ్ వొకేషనల్ ట్రైనింగ్ స్కీమ్, వొకేషనల్ ట్రైనింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టు, టెక్నికల్ అసిస్టెంట్ స్కీమ్, స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ స్కీమ్‌ల కింద స్వల్పకాలిక కోర్సులున్నాయి. వెబ్సైట్: http://atihyderabad.ap.nic.in/ ఎన్ఐ-ఎంఎస్ఎంఈ: యూసఫ్‌గూడలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ (ఎన్ ఐ-ఎంఎస్ఎంఈ) ప్రధానంగా రెండు రకాల కోర్సులను అందిస్తోంది. అవి.. ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌లు. ఉదా.. కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లిష్ అండ్ ప్రొమోషన్ ఆఫ్ మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్; ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ త్రూ మైక్రో ఫైనాన్స్. ఇవి సాధారణంగా 8-12 వారాల వ్యవధిగల కోర్సులు. రెండోది ఎగ్జిక్యూటివ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌లు. వెబ్సైట్: www.nimsme.org విద్యార్హతల కంటే నైపుణ్యాలే కీలకం తరగతి గదిలో నేర్చుకునేది విజ్ఞానం. ప్రాక్టికల్‌గా నేర్చుకునేది నైపుణ్యం. డిగ్రీలు విద్యార్హతలకు మాత్రమే ఉపయోగపడతాయి. కెరీర్లో రాణించాలంటే సంబంధిత అంశానికి అవసరమైన నైపుణ్యాలను సముపార్జించుకోవాలి. ఇంజనీరింగ్ విషయానికొస్తే విద్యార్థులు మొదటి సెమిస్టర్ నుంచే ప్రాజెక్టు వర్క్ మొదలుపెడితే నైపుణ్యాల సాధన దిశగా అడుగుపడినట్లే! ఎప్పటికప్పుడు మారుతున్న సాంకేతిక పరి జ్ఞానంపై అవగాహన పెంపొందించుకోవాలి. ఐటీ, కమ్యూనికేషన్ విభాగాల్లో వేలాదిగా మంచి అవకాశాలున్నాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో నెలకొన్న పోటీని ఎదుర్కొనేందుకు విద్యార్థులు నైపుణ్యాలకు పదునుపెట్టుకోవడమనేది దైనందిన చర్యగా మారాలి. కమ్యూనికేషన్, లీడర్షిప్ స్కిల్స్ వంటి వాటిని క్యాంపస్ నుంచి బయటకు రాకముందే పుణికిపుచ్చుకోవాలి. ఒకవేళ స్కిల్స్ లేకుండా బయటికొస్తే అందుబాటులో ఉన్న శిక్షణ సంస్థల్లో చేరి, శ్రద్ధతో నైపుణ్యాలను ఒంటబట్టించుకోవాలి. - డాక్టర్ యు.చంద్రశేఖర్, డెరైక్టర్, ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా -
అంతా పాస్ పేరుతో..ఫీజుల మాయ
వైద్య, యంత్ర విద్య తర్వాత అంతటి ప్రాధాన్యమున్న కోర్సులు ఎంబీఏ, ఎంసీఏ. అయితే నానాటికీ వృత్తి విద్య ప్రమాణాలు తీసికట్టుగా మారుతున్నాయి. జిల్లాలో కొన్ని కళాశాలల యాజమాన్యాలు ఎంబీఏ కోర్సును కొత్త తరహా వ్యాపారంగా నిర్వహిస్తూ, విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నాయి. తరగతులకు రాకున్నా పర్వాలేదు.. పాస్ గ్యారెంటీ అంటూ హామీలు గుప్పిస్తున్నాయి. ఇదంతా విద్యార్థులపై ప్రేమతో కాదు.. రీయింబర్స్మెంట్ మొత్తం తమ ఖాతాలో వేసుకునేందుకేనన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పైగా ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌లో కొన్ని కాలేజీల్లో సీట్లు భర్తీ కాకపోవడంతో ఎంబీఏపై అలాంటి ప్రభావం లేకుండా కొత్త వ్యూహంతో ముందుకెళుతున్నాయి. సాక్షి, చిత్తూరు: జిల్లాలో సుమారు 27 ఎంబీఏ కాలేజీలు ఉన్నాయి. వీటిలో ఒక్కో కాలేజీలో 60-240 సీట్ల వరకు భర్తీ చేసుకునేందుకు ఏఐసీటీఈ అనుమతిస్తోంది. ఎంబీఏ.. రెండేళ్లు, ఎంసీఏ మూడేళ్ల కాలపరిమితిలో కోర్సు పూర్తవుతుంది. ఈ కళాశాలల్లో 10 వేలమంది వరకూ చదువుతున్నారు. వీరికి ప్రభుత్వం ఏటా ఒక్కో విద్యార్థికి 27 వేల రూపాయలు ఫీజు వాపసు కింద చెల్లిస్తోంది. జిల్లా మొత్తం సుమారు రూ.27 కోట్ల వరకు ఉంటుంది. ఇవి కాక యాజమాన్య కోటా కింద అనుమతిచ్చిన సీట్లలో 25 శాతం నేరుగా చేర్చుకునే అవకాశం ఉంది. అక్కడ వసూళ్లు అదనం. అనుమతి ఒక చోట.. నిర్వహణ మరో చోట ఎంబీఏ, ఎంసీఏ కళాశాలలు ఎక్కువగా అనుమతి లేని చోట నడుస్తున్నాయి. రెండున్నర ఎకరా స్థలంలో భవన సదుపాయాలుంటేనే అనుమతి వస్తుంది. పట్టణ శివార్లలో కొనసాగుతున్న కళాశాలలకు ఆ మేరకు స్థలాలున్నాయి. వీటికి అనుమతులున్నాయి. పట్టణాల్లోని ఉన్నవాటిల్లో చాలా వాటికి అనుమతుల్లేవు. ఇరుకు గదుల్లోనే తరగతులు కొనసాగిస్తున్నారు. కొన్నిచోట్ల ఇంజినీరింగ్ కళాశాలల గదుల్లోనే ఎంబీఏ తరగుతులు నిర్వహిస్తున్నారు. కోర్సులో చేరే విద్యార్థుల నుంచి ముందుగా యాజమాన్యాలు బిల్డింగ్ ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఇదేమని అడిగితే ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు వస్తే వాటిని ఇస్తామంటూ చెబుతున్నాయి. తీరా ఫీజు వచ్చాక ఆ నగదు చెల్లింపులు చేయడం లేదు. నైపుణ్యం లేని అధ్యాపకులు వృత్తి విద్యాకోర్సులు నిర్వహిస్తున్న కళాశాలల్లో అనుభవం, నైపుణ్యం లేని అధ్యాపకులే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. 60 సీట్లున్న కళాశాలలో ఒక ప్రొఫెసర్, 12 మంది వరకూ ఫ్యాకల్టీ అధ్యాపకులు ఉండాలి. ఎంబీఏ పూర్తి చేసిన వారికి అధ్యాపకులుగా ప్రాధాన్యమివ్వాలి. కానీ పీజీ చేసిన వారిని ఎక్కువగా ఫ్యాకల్టీగా తీసుకుంటున్నారు. తక్కువ చదువుకున్న వారితో నిర్వహిస్తే ఎక్కువ జీతం చెల్లించాల్సిన అవసరం లేదన్న వక్రమార్గంలో కొన్ని యాజమాన్యాలు వెళుతున్నాయి. మరికొన్ని కళాశాలలైతే అధ్యాపకుల ఏటీఎంలను తమ వద్దే ఉంచుకుంటున్నాయి. ఎక్కువ జీతాలు ఖాతాలో వేసినట్లు రికార్డుల్లో నమోదు చేస్తున్నారు. వాస్తవానికి అధ్యాపకుడి బ్యాంకు ఖాతాలో 50-70 వేల రూపాయల వరకూ వేస్తూ వెంటనే ఆ మొత్తాన్ని కళాశాలలే డ్రా చేసుకుంటున్నాయి. అధ్యాపకుని చేతిలో తక్కువగా 10-20వేల రూపాయలు పెడుతున్నారు. నిబంధనల మేరకు అధ్యాపకులకు జీతాలు ఇవ్వడం లేదు. ల్యాబ్ అసిస్టెంట్లను నియమించడం లేదు. ఈ విషయాలన్నీ అధ్యాపకులు ఁసాక్షి*తో చెప్పి బోరుమంటున్నారు. శ్రమదోపిడీ చేయించుకుంటున్నారని యాజమాన్యాలపై విరుచుకుపడుతున్నారు. హాజరు లేకున్నా.. విద్యార్థులకు 75 శాతం హాజరు ఉంటే పరీక్షలకు అనుమతి ఉంటుంది. చాలావరకు కళాశాలల్లో ఈ పద్ధతి అమలు కావడం లేదు. విద్యార్థులు వచ్చినా రాకున్నా యాజమాన్యాలు హాజరు వేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కళాశాలల్లో అధ్యాపకుల కొరత, గదుల కొరత కారణంగా యాజమన్యాలు విద్యార్థుల హాజరు మినహాయింపు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఁమీ కెందుకు మేం పాస్ చేయిస్తాం* అని హామీ ఇస్తున్నారు. దీంతో విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టడం లేదు. ఈ రకంగా కళాశాలలే విద్యార్థులను పెడద్రోవ పటిస్తున్నాయనే విమర్శలున్నాయి. మార్కులు మేమేస్తాం ఈ కోర్సులు చదివే విద్యార్థులకు ఆయా కళాశాలలే ప్రయోగాలు నిర్వహిస్తాయి. ప్రాజెక్టు వర్కులుంటాయి. వీటికి 30 శాతం మార్కులుంటాయి. విద్యార్థి సామర్థ్యం, ప్రతిభతో పని లేకుండా ఈ మార్కులు వేస్తున్నారు. విద్యార్థులు ఉత్తీర్ణలయ్యేందుకు ఇవి చాలా వరకు దోహదపడుతున్నాయి. తరగతులకు హాజరైనా, కాకున్నా ఉత్తీర్ణత మాత్రం ఖాయమన్న నమ్మకంతో విద్యార్థులు విజ్ఞానాన్ని గాలికి వదిలేస్తున్నారు. 70 మార్కులకు వార్షిక పరీక్షలుంటాయి. వీటిల్లో కొంతమేర మార్కులు తెచ్చుకున్నా ఉత్తీర్ణత సాధించడం పెద్ద సమస్య కాదు. దాంతో విద్యార్థులు కళాశాలలకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. ఐసెట్ ఉత్తీర్ణులారా జాగ్రత్త!: త్వరలో ఐసెట్ ఫలితాలు వెలువడనున్నాయి. పరీక్షలు రాసిన విద్యార్థుల అడ్రస్‌లతో ఇప్పటి నుంచే యాజమాన్యాలు అడ్మిషన్ల వేట సాగిస్తున్నాయి. కేవలం డిగ్రీ కావాలంటే ఏదో ఒక కళాశాలలో చేరిపోవచ్చని, ప్రమాణాలతో కూడిన విద్యా కావాలంటే జాగ్రత్తగా విచారించుకునిమంచి కాలేజీని ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అర్హతగల అధ్యాపకులున్నారో లేదో అన్ని రకాలుగా విచారించుకుంటే మంచిదని స్పష్టం చేస్తున్నారు. -
ఆదాయం తిప్పలు
ఇన్‌కం సర్టిఫికెట్లు ఇవ్వని రెవెన్యూ అధికారులు - మీ సేవ కేంద్రాల ద్వారా నిలిచిపోయిన జారీ - కళాశాలల్లో చేర్చుకునేందుకు యాజమాన్యాల నిరాకరణ - దిక్కుతోచని స్థితిలో విద్యార్థులు హన్మకొండ అర్బన్ : ప్రస్తుతం ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. విద్యార్థులు తాము చేరదల్చుకున్న కళాశాలల్లో ఆప్షన్లు ఇవ్వగా... సీట్ల కేటాయింపు కూడా పూర్తయింది. కన్వీనర్ కోటా కింద సీటు వచ్చిన కళాశాలల్లో సర్టిఫికెట్లు అందజేసి రిపోర్టు చేయడమే తరువారుు. ఇక్కడే వారికి తిప్పలు వచ్చిపడ్డారుు. ఆదాయ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి అని కళాశాలల యూజమాన్యాలు స్పష్టం చేస్తుండగా.. ఇన్‌కం సర్టిఫికెట్ ఇచ్చేందుకు మీ సేవ కేంద్రాల నిర్వాహకులు నిరాకరిస్తున్నారు. దీంతో విద్యార్థులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. నెల రోజులుగా బంద్.. కలెక్టర్ మౌఖిక ఆదే శాలతో జిల్లాలో నెల రోజులుగా మీసేవ కేంద్రాల ద్వారా ఇన్‌కం సర్టిఫికెట్ల జారీ పూర్తిగా నిలిచిపోయింది. కొన్ని చోట్ల తహసీల్దార్లు ఎవరికి వారు ప్రకటనలు ఇస్తూ మాన్యువల్‌గా ఇన్‌కం సర్టిఫికెట్లు ఇస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో మనకెందుకొచ్చిందని భావించిన తహసీల్దార్లు ఏ ఒక్కరికీ ఆదాయ ధ్రువీకరణ పత్రం ఇవ్వడం లేదు. కలెక్టర్ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చేవరకూ ఇచ్చేది లేదని మండల రెవెన్యూ యంత్రాంగం చేతులెత్తేసింది. పొరుగు జిల్లాల్లో ఇస్తున్నా.. కొందరు ప్రభుత్వ ఉద్యోగులు, ఉన్నత వర్గాల వారు తెల్లరేషన్ కార్డులతో అన్ని రకాల లబ్ధి పొందుతున్నారని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీలో కాస్త జాగ్రత్తగా ఉండాలని ఆయూ జిల్లాల యంత్రాంగాన్ని ఆదేశించింది. దీన్ని సాకుగా చూపి జిల్లాలో అధికారులు ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీని పూర్తిస్థారుులో నిలిపివేశారు. కానీ... పక్కన కరీంనగర్ జిల్లాలో మీ సేవ కేంద్రాల ద్వారా ఇన్‌కం సర్టిఫికెట్ల జారీ యథాతధంగా నడుస్తోంది. జిల్లాలో కొన్ని చోట్ల ఆదాయ ధ్రువీకరణ పత్రం కోసం మీసేవ కేంద్రాల నుంచి దరఖాస్తు చేసినట్లు రసీదు ఉంటే కాలేజీల నిర్వాహకులు ఊరుకుంటున్నారు. మరికొన్ని చోట్లమాత్రం తప్పనిసరిగా ఇన్‌కం సర్టిఫికెట ఉండాలని తెగేసి చెబుతున్నారు. కలెక్టర్‌కు ఫిర్యాదు ప్రవేశాల సమయంలో ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అడగొద్దని, కేబినెట్ నిర్ణయం ప్రకటించిన తర్వాత జారీ చేస్తామని కళాశాలలకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా... విద్యార్థులకు ఇబ్బందులు తప్పేవి. అలాంటిదేం లేకుండా సర్టిఫికెట్ల జారీ నిలిపివేయడంతో విద్యార్థులు దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. హన్మకొండ మండల తహసీల్దార్ కార్యాలయ అధికారులు తమకు ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం లేదని కొందరు సోమవారం నేరుగా కలెక్టర్ కిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో వారికి మాన్యూవల్ సర్టిఫికె ట్లు ఇవ్వమని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం కౌన్సెలింగ్‌లు ఉన్నందున తాత్కాలింగా అయినా... ఇన్‌కం సర్టిఫికెట్లు ఇవ్వాలని జిల్లావ్యాప్తంగా విద్యార్థులు కోరుతున్నారు. లేదంటే తాము కళాశాలల్లో సీటు కోల్పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
నైపుణ్యాల వృద్ధికి.. ఉపకరించే సాధనాలు
స్కిల్ గ్యాప్.. అంటే పరిశ్రమలు అభ్యర్థుల్లో కోరుకుంటున్న నైపుణ్యాలకు.. విద్యార్థుల్లో ఉంటున్న సాధారణ నైపుణ్యాలకు మధ్య అంతరం. నేడు ఏ కోర్సులు చదివిన విద్యార్థులకైనా జాబ్ మార్కెట్లో ఎన్నో ఉద్యోగావకాశాలు అందుబాటులో ఉన్నాయి. అయితే అభ్యర్థులు నైపుణ్యాల లేమితో ఉద్యోగాలను దక్కించుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీస్ ఆశిస్తున్న స్కిల్స్.. టెక్నికల్, మేనేజీరియల్, సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్. వీటన్నింటినీ సొంతం చేసుకుంటేనే ఆకర్షణీయమైన కెరీర్ సొంతం చేసుకోవడం సాధ్యమవుతుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగ సాధనలో అందరికంటే ముందు నిలవడానికి అందుబాటులో ఉన్న మార్గాలపై విశ్లేషణ.. ఇంటర్న్షిప్స్ అకడమిక్స్ స్థాయిలోనే పరిశ్రమ అవసరాలకు తగిన నైపుణ్యాలను ప్రత్యక్షంగా పొందగలిగే మార్గం ఇంటర్న్షిప్స్. అంటే.. ఒక విద్యార్థి తాను చదువుతున్న కోర్సుకు సంబంధించిన పరిశ్రమలో కొద్ది నెలలపాటు పని చేయడం ద్వారా నైపుణ్యాలు సొంతం చేసుకోవడం. దీంతో పాటు వాస్తవ పరిస్థితులపై అవగాహన పొందొచ్చు. ప్రస్తుతం ఈ ఇంటర్న్షిప్స్ అనే ప్రక్రియ కరిక్యులంలో భాగంగా లేనప్పటికీ.. కొన్న ప్రముఖ ఇన్స్టిట్యూట్లు, స్వయం ప్రతిపత్తి కలిగిన విద్యా సంస్థలు సొంతంగా ఇంటర్న్‌షిప్‌ను అమలు చేస్తున్నాయి. బీటెక్‌లో మూడో ఏడాది ముగిసిన తర్వాత సెలవుల సమయంలో, ఎంబీఏలో మొదటి సంవత్సరం తర్వాత సెలవుల్లో ఈ ఇంటర్న్‌షిప్ ప్రక్రియ ఉంటోంది. వీటినే సమ్మర్ ఇంటర్న్‌గా పేర్కొంటున్నారు. ఈ సమయంలో విద్యార్థులు తమ ఇన్స్టిట్యూట్తో ఒప్పందం ఉన్న పరిశ్రమల్లో రెండు లేదా మూడు నెలల నిర్దేశిత వ్యవధిలో ప్రాక్టికల్ ట్రైనింగ్ పొందే వీలుంటుంది. స్కిల్ గ్యాప్ సమస్యను తీవ్రంగా పరిగణిస్తున్న పరిశ్రమ వర్గాలు, సంబంధిత సంస్థలు కూడా ఇంటర్న్‌షిప్ సదుపాయాన్ని అందిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఇంటర్న్‌షిప్స్‌ను ఆఫర్ చేసే సంస్థల సంఖ్య పెరుగుతోంది. ఉత్పత్తి రంగంలో ఈ ధోరణి కొంత తక్కువైనప్పటికీ.. ఐటీ, ఐటీఈఎస్ సంస్థలు ఇంటర్న్‌షిప్ ట్రైనీ అవకాశాలు బాగా కల్పిస్తున్నాయి. ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, టీసీఎస్, కాగ్నిజెంట్ తదితర సాఫ్ట్వేర్ సంస్థలు ఇంటర్న్ ట్రైనీలను నియమించుకోవడంలో ముందుంటున్నాయి. వీటిల్లో శిక్షణ పొందడంతోపాటు ఆయా సంస్థల విధానాల ప్రకారం ఆర్థిక ప్రోత్సాహకాలు కూడా అందుకోవచ్చు. ఇంటర్న్‌షిప్ సమయంలో చొరవ, తమకు కేటాయించిన విభాగంలో ప్రతిభ ద్వారా ఆయా సంస్థల గుర్తింపు పొందితే.. ఇంటర్నషిప్ పూర్తయ్యాక ఉద్యోగాన్ని కూడా దక్కించుకోవచ్చు. ప్రాజెక్ట్ వర్క్స్ విద్యార్థుల్లో క్షేత్ర స్థాయి నైపుణ్యాలను పెంపొందించే క్రమంలో మరో ముఖ్య సాధనం ప్రాజెక్ట్ వర్క్స్. ప్రస్తుత కరిక్యులం ప్రకారం ప్రతి ప్రొఫెషనల్ కోర్సులోనూ ఇది తప్పనిసరి. ఆయా కోర్సుల చివరి సెమిస్టర్లో చేయాల్సిన ఈ ప్రాజెక్ట్ వర్క్స్ ఫలితంగా విద్యార్థులకు సదరు సంస్థ, విభాగాలపై నైపుణ్యాలు సొంతమవుతాయి. ప్రాజెక్ట్ వర్క్‌లో విద్యార్థులు తాము ఎంచుకున్న అంశానికి సంబంధించి.. ఏదైనా ఒక సంస్థలో ఆరు నెలలపాటు పనిచేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో తాము ఎంచుకున్న అంశంలో సమస్య ఎదురైతే.. దాని పరిష్కార మార్గాలు తెలుసుకుని పరిష్కరించాలి. ఈ ప్రాజెక్ట్ వర్క్ విధానం కూడా విద్యార్థులకు భవిష్యత్తు ఉద్యోగాలను ఖాయం చేసే మార్గంగా పేర్కొనొచ్చు. ప్రాజెక్ట్ వర్క్ వ్యవధిలో సదరు సంస్థలో చక్కటి పనితీరు కనబరిచి ఉన్నతాధికారుల గుర్తింపు పొందితే అదే సంస్థలో ఉద్యోగం పొందే అవకాశాలెన్నో. ప్రాజెక్ట్ వర్క్‌కు సంబంధించి మరో ప్రత్యామ్నాయం ఇండివిడ్యువల్/గ్రూప్ ప్రాజెక్ట్స్. సంస్థల్లో ప్రాజెక్ట్ వర్క్ అవకాశం పొందని విద్యార్థులు సొంతంగా ఒక సమస్యకు పరిష్కారం కనుగొనే విధంగా ప్రాజెక్ట్ చేయడం. ఈ ఇండివిడ్యువల్ ప్రాజెక్ట్స్ ద్వారా సమస్య-పరిష్కారాలను సంస్థల దృష్టికి తీసుకెళ్లొచ్చు. మీరు చెప్పిన పరిష్కార మార్గాలు నచ్చితే మీకు ఉద్యోగం దక్కినట్లే. ఇలా తమ ఇండివిడ్యువల్ ప్రాజెక్ట్స్‌ను సంస్థల దృష్టికి తీసుకెళ్లడానికి ఆయా రంగాలకు సంబంధించి నిర్వహించే సెమినార్లు, కాలేజ్ సావనీర్లు, క్యాంపస్ రిక్రూట్మెంట్ సెషన్స్‌ను వేదికలుగా ఉపయోగించుకోవాలి. కానీ.. ఇటీవల చాలా మంది విద్యార్థులు ప్రాజెక్ట్ వర్క్, ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే మార్కుల సాధన, సర్టిఫికెట్లో పర్సంటేజీ సంఖ్య పెంపుదల సాధనంగానే భావిస్తున్నారు. ఇది సరికాదు. ప్రాజెక్ట్ వర్క్ అంటే తాము అప్పటి వరకు పొందిన థియరీ నాలెడ్జ్‌ను క్షేత్ర స్థాయిలో అన్వయించడంతోపాటు.. వాస్తవ పరిస్థితులపై సంపూర్ణ అవగాహన పొందేందుకు చక్కటి సాధనంగా వినియోగించుకోవాలి అంటున్నారు ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ ప్రొఫెసర్ వి. ఉమామహేశ్వరరావు. అప్రెంటీస్షిప్స్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్.. విద్యార్థులు తాము ఉత్తీర్ణత సాధించిన కోర్సుకు సంబంధించిన సంస్థలో నిర్దిష్ట కాలంలో పూర్తి స్థాయిలో పని చేయడం. ముఖ్యంగా వృత్తి విద్య కోర్సుల్లో అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ ఎంతో కీలకమైన అంశం. అంతేకాకుండా స్కిల్ గ్యాప్‌నకు చక్కటి పరిష్కార మార్గం కూడా. నిర్ణీత వ్యవధిలోని అప్రెంటీస్ ట్రైనింగ్షిప్లో పూర్తి స్థాయిలో విధులు నిర్వర్తించడం ద్వారా క్షేత్ర స్థాయి అవసరాలపై అవగాహన పొందొచ్చు. అప్రెంటీస్‌షిప్ ప్రాధాన్యాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 1961లోనే అప్రెంటీస్ యాక్ట్ పేరిట చట్టాన్ని కూడా రూపొందించింది. దీని ప్రకారం సంస్థలు మొత్తం శ్రామిక శక్తిలో పది శాతం మేర అప్రెంటీస్ ట్రైనీలను నియమించుకోవాలి. అంతేకాకుండా శిక్షణలో స్టైఫండ్ చెల్లించాలని కూడా నిర్దేశించింది. ఇప్పటికే బీహెచ్ఈఎల్, ఓఎన్జీసీ, బీఈఎల్, గెయిల్ వంటి మహారత్న, మినీరత్న ప్రభుత్వ రంగ సంస్థలు; ప్రైవేటు రంగంలో వేల సంఖ్యలో.. ట్రేడ్ అప్రెంటీసెస్; గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటీసెస్; టెక్నీషియన్ అప్రెంటీసెస్ వంటి హోదాల్లో ఐటీఐ నుంచి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల నియామకాల వరకు క్రమం తప్పకుండా నోటిఫికేషన్లు జారీ చేస్తున్నాయి. నిర్ణీత వ్యవధి పూర్తయ్యాక నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్, సెంట్రల్ అప్రెంటీస్ కౌన్సిల్లు నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ట్రేడ్ సర్టిఫికెట్లు పొందొచ్చు. కానీ.. ఇప్పటికీ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ అంటే విద్యార్థుల్లో అంతగా అవగాహన ఉండట్లేదు. దేశవ్యాప్తంగా ప్రతి ఏటా అప్రెంటీస్‌షిప్ సదుపాయం సంఖ్య 4.8 లక్షలు ఉంటే కేవలం 2.8 లక్షల మంది మాత్రమే దీన్ని వినియోగించుకుంటున్నారు. దీన్ని గుర్తించిన ప్రభుత్వం అప్రెంటీస్ చట్టానికి మార్పులు తీసుకొచ్చింది. ఈ క్రమంలో స్టైఫండ్ శాతాన్ని కూడా 40 శాతం మేర పెంచింది. టెక్నికల్ కోర్సులకే పరిమితమైన ట్రైనింగ్‌ను బీఏ, బీకాం, బీఎస్సీ ఉత్తీర్ణులకు కూడా అందించాలని నిర్ణయించింది. ఆన్ జాబ్ ట్రైనింగ్ స్కిల్ గ్యాప్‌నకు సంబంధించి ఇటు విద్యార్థులు, అటు పరిశ్రమ వర్గాలకు చక్కటి వారధిగా నిలుస్తున్న అంశం ఆన్ జాబ్ ట్రైనింగ్. క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్స్ ద్వారా తాజా గ్రాడ్యుయేట్లను నియమించుకుంటున్న సంస్థలు.. వారికి తమ అవసరాలకు అనుగుణంగా సంబంధిత అంశాల్లో క్షేత్ర స్థాయి నైపుణ్యాలు అందించేందుకు చేపడుతున్న శిక్షణ కార్యక్రమమే ఆన్ జాబ్ ట్రైనింగ్. ముఖ్యంగా బీటెక్‌లో బ్రాంచ్‌తో సంబంధం లేకుండా అన్ని బ్రాంచ్‌ల విద్యార్థులను నియమిస్తున్న ఐటీ సంస్థలు ఆన్ జాబ్ ట్రైనింగ్‌కు ప్రాధాన్యమిస్తున్నాయి. సాధారణంగా మూడు నుంచి ఆరు నెలల పాటు ఉండే ఆన్ జాబ్ ట్రైనింగ్‌లో అభ్యర్థులకు.. వారు నియమితులైన విభాగాలకు సంబంధించి పూర్తి స్థాయి శిక్షణ ఇవ్వడంతోపాటు సంస్థలో ఇతర విభాగాలు, వాటి విధి విధానాలు, పనితీరు వంటి అంశాలపైనా అవగాహన కల్పిస్తారు. ఈ సదుపాయం కేవలం ఎంట్రీ లెవల్ ఉద్యోగులకే కాకుండా.. సంస్థలో అప్పటికే పనిచేస్తున్న ఉద్యోగుల విషయంలోనూ అమలు చేస్తున్నాయి. మిడ్ లెవల్ కెరీర్ ప్రొఫెషనల్స్‌కు సంబంధించి.. ఆయా ఉద్యోగులు పని చేస్తున్న విభాగాలు, రంగాల్లోని తాజా పరిణామాలు, అప్డేటెడ్ నైపుణ్యాలు అందించే విధంగా ఆన్ జాబ్ ట్రైనింగ్స్ ఉంటున్నాయి. ఫలితంగా ఉత్పాదకత పెరగడంతోపాటు, పోటీదారులకంటే ఒకడుగు ముందుండొచ్చనేది సంస్థల అభిప్రాయం. అభ్యర్థులు కూడా ట్రైనింగ్‌లో నేర్చుకున్న అంశాల ద్వారా మరింత మెరుగైన పనితీరు ప్రదర్శించి ఉన్నత స్థానాలకు చేరుకునేందుకు ఎన్నో అవకాశాలు లభిస్తాయి. సర్టిఫికేషన్లు ఎన్నెన్నో స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించి ఇప్పుడు ఎన్నో సర్టిఫికేషన్ కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. టెక్నికల్ కోర్సుల్లో సెంట్రల్ ఒకేషనల్ కౌన్సిల్, నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్, కేంద్ర కార్మిక శాఖ పరిధిలోని అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లలో.. విద్యార్థుల డొమైన్ అర్హతలకు ఆధారంగా పలు షార్ట్ టర్మ్ సర్టిఫికెట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా ఆయా రంగాలకు సంబంధించి- పరిశ్రమ వర్గాలతో ఒప్పందం ద్వారా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి వాటిని పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు అందిస్తోంది. వీటితోపాటు ఇటీవల కాలంలో కొన్ని ప్రైవేటు రంగ సంస్థలు కూడా ఆయా ఇన్స్టిట్యూట్లతో ఒప్పందాలు చేసుకుని స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్, సర్టిఫికెట్లు అందిస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని ప్రముఖ సంస్థలు అందిస్తున్న సర్టిఫికెట్ ప్రోగ్రామ్స్ వివరాలు.. ఇన్ఫోసిస్: ఈ సంస్థ ఐటీ స్కిల్ డెవలప్మెంట్ కోసం సొంతంగా గ్లోబల్ ట్రైనింగ్ సెంటర్‌ను నిర్వహిస్తోంది. ఐటీసీ: రిటైల్ రంగంలో స్కిల్ డెవలప్మెంట్ కోసం ఐటీసీ సంస్థ- ఎన్ఐఎస్-స్పార్తా సంయుక్తంగా రిటైల్ మేనేజ్మెంట్ కోర్సును అందిస్తున్నాయి. ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో ఐసీఐసీఐ బ్యాంకు, దేనా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా మరికొన్ని బ్యాంకులు పలు ఇన్స్టిట్యూట్లతో కలిసి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ముంబై స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లు స్టాక్ మార్కెట్ నిర్వహణ సంబంధిత పలు షార్ట్ టర్మ్ సర్టిఫికెట్ కోర్సులను అందిస్తున్నాయి. డొమైన్తోపాటు మరెన్నో స్కిల్స్ ఇటీవల కాలంలో సంస్థలు అభ్యర్థుల్లోని డొమైన్ నాలెడ్జ్‌కే పరిమితం కాకుండా ఇతర అంశాలు వాటిలోని నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి. దృక్పథం, నైతికత వంటి వాటికి పెద్దపీట వేస్తున్నాయి. ఈ క్రమంలో.. ఇటీవల తాజాగా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ) విడుదల చేసిన నివేదిక ప్రకారం ఆయా సంస్థలు కోరుకుంటున్న స్కిల్స్ శాతాల గణాంకాలు.. ఇంటెగ్రిటీ అండ్ వ్యాల్యూస్: 30 శాతం రిజల్ట్ ఓరియెంటేషన్:21 శాతం బెటర్ ఆప్టిట్యూడ్: 12 శాతం కోర్ డొమైన్: 14 శాతం పీపుల్ స్కిల్స్ (కల్చరల్ డైవర్సిటీ, టీమ్ వర్క్, ఇంగ్లిష్ కమ్యూనికేషన్): 23 శాతం ఇంటర్న్షిప్స్.. వే టు ఎంప్లాయ్మెంట్ కోర్సు వ్యవధిలో విద్యార్థులు చేసే ఇంటర్న్షిప్స్ వారి భవిష్యత్తు ఉపాధికి మార్గం నిలుస్తాయి. కానీ ఇప్పటికీ ఈ విషయంలో విద్యార్థుల్లో ఆశించిన అవగాహన ఉండట్లేదు. ఇన్స్టిట్యూట్ల స్థాయిలోనే వీటి ప్రాముఖ్యాన్ని తెలియజేసి ప్లేస్మెంట్ సెల్స్, ఇతర మాధ్యమాల ద్వారా అధ్యాపకులు, మేనేజ్మెంట్ వర్గాలు తమ విద్యార్థులు ఇంటర్న్‌షిప్ చేసే అవకాశాలను అందించాలి. ఇక విద్యార్థులు కూడా తమకున్న పరిచయాల ద్వారా ఇంటర్న్షిప్స్ చేసేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడు పూర్తి స్థాయిలో వాస్తవ పరిస్థితులపై అవగాహన కలుగుతుంది. కరిక్యులంలో భాగంగా లేని ఇంటర్న్‌షిప్ అనే పదం విద్యార్థుల రెజ్యుమేలో కనిపిస్తే కచ్చితంగా ఎంప్లాయర్స్ను ఆకర్షిస్తుంది. సదరు విద్యార్థికి ఇతరులకంటే ఎక్కువ వెయిటేజీ లభిస్తుంది. - బి. అశోక్ రెడ్డి, ప్రెసిడెంట్- కార్పొరేట్ అఫైర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సయంట్ అప్రెంటీస్‌షిప్‌తో ప్రయోజనాలెన్నో టెక్నికల్ కోర్సుల విద్యార్థులకు అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ ద్వారా ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయి. పూర్తిస్థాయి ఉద్యోగుల మాదిరిగా విధులు నిర్వర్తించే అవకాశం ఉన్న అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ సమయంలో సదరు విభాగాలపై పూర్తి నైపుణ్యాలు సొంతం చేసుకోవచ్చు. చాలా మందికి అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్, అది పూర్తయ్యాక నిర్వహించే ట్రేడ్ టెస్ట్ ప్రాధాన్యంపై అవగాహన ఉండట్లేదు. దీంతో మంచి అవకాశాలు చేజార్చుకుంటున్నారు. డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్, ఎన్ఎస్డీసీ, ఏటీఐ వెబ్సైట్లను వీక్షిస్తే అందుబాటులో ఉన్న అప్రెంటీస్‌షిప్ సదుపాయాలు, ప్రయోజనాలు, దరఖాస్తు విధానాల వివరాలు తెలుస్తాయి. - కె.ఎస్.ఆర్. ప్రదీప్, డిప్యూటీ డెరైక్టర్, ఆర్డీఏటీ, హైదరాబాద్. స్కిల్స్‌తోపాటు పెరిగే అవకాశాలు విద్యార్థులు ప్రాక్టికల్ స్కిల్స్ పెంచుకోవడానికి ప్రయత్నిస్తే.. అంతే స్థాయిలో ఉద్యోగావకాశాలు కూడా పెరుగుతాయి. ప్రాక్టికల్స్, ప్రాక్టికాలిటీ అనే పదాలు కేవలం ఇంజనీరింగ్, టెక్నికల్ కోర్సులకే పరిమితం కాదు. అన్ని కోర్సులు, రంగాల్లోనూ ఇప్పుడు ఎన్నో స్కిల్స్ అవసరమవుతున్నాయి. వీటిని గుర్తించి అకడమిక్ స్థాయి నుంచే సొంతం చేసుకునేలా వ్యవహరించాలి. మేనేజ్మెంట్కు సంబంధించి పీపుల్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. - వి. పాండురంగారావు, డెరైక్టర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ -హైదరాబాద్ ఎడ్యు న్యూస్ ఇన్స్పైర్ స్కాలర్షిప్ - 2014 ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులై ఉండి నేచురల్/బేసిక్ సెన్సైస్‌లో మూడేళ్ల బీఎస్సీ, బీఎస్సీ (హానర్స్), నాలుగేళ్ల బీఎస్, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ/ఎంఎస్ కోర్సులను అభ్యసిస్తున్న విద్యార్థులకు అందించే ‘స్కాలర్షిప్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఎస్హెచ్ఈ)’కు ప్రకటన వెలువడింది. వీటిని కేంద్ర ప్రభుత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డీఎస్టీ) అందిస్తోంది. ‘ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్స్యూట్ ఫర్ ఇన్స్పైర్డ్ రీసెర్చ్ (ఇన్స్పైర్)’ పేరుతో ఈ స్కాలర్‌షిప్స్‌ను ఇస్తారు. మొత్తం స్కాలర్షిప్స్: 10,000 స్కాలర్షిప్: ఏడాదికి రూ.60,000తోపాటు సమ్మర్ రీసెర్చ్ ప్రాజెక్ట్ కోసం రూ.20,000 అందిస్తారు. ఇలా ఐదేళ్లపాటు స్కాలర్షిప్ ఇస్తారు. అర్హత: వివిధ రాష్ట్ర బోర్డులు, సెంట్రల్ బోర్డ్ 2014లో నిర్వహించిన ఇంటర్మీడియెట్/10+2 పరీక్షల్లో ఆయా రాష్ట్రాల్లో టాప్ వన్ పర్సంట్ జాబితాలో నిలవాలి. లేదా జేఈఈ మెయిన్/అడ్వాన్స్డ్/ఏఐపీఎంటీలో టాప్ 10,000 ర్యాంకుల్లో చోటు దక్కించుకుని ఉండాలి. కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన ఫెలోషిప్, నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ స్కాలర్షిప్, జగదీశ్ చంద్ర బోస్ నేషనల్ సైన్స్ టాలెంట్ సెర్చ్ స్కాలర్షిప్ విజేతలు, ఇంటర్నేషనల్ ఒలంపియాడ్లో పతకాలు గెలుచుకున్నవారు కూడా స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర జాతీయస్థాయి ప్రవేశపరీక్షల్లో విజయం సాధించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్)లు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైసర్), డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ - సెంటర్ ఫర్ బేసిక్ సైన్స్‌లో విద్యనభ్యసిస్తున్నవారు కూడా అర్హులే. ప్రస్తుతం గుర్తింపు పొందిన యూనివర్సిటీ/కళాశాల/ఇన్స్టిట్యూట్లో నేచురల్/బేసిక్ సెన్సైస్‌లో బీఎస్సీ/ బీఎస్సీ (హానర్స్)/నాలుగేళ్ల బీఎస్/ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్/ఎంఎస్సీ కోర్సులు చదువుతుండాలి. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 31, 2014 వెబ్సైట్:www.inspire-dst.gov.in/ ఏంజెలా మెర్కెల్ స్కాలర్షిప్ జర్మనీలో నిర్దేశిత యూనివర్సిటీల్లో ఎల్ఎల్ఎం (యూరోపియన్ లా) చదవాలనుకునే భారతీయ విద్యార్థులకు అందించే జవహర్లాల్ నెహ్రూ అవార్డ్ ఫర్ ఇంటర్నేషనల్ అండర్స్టాండింగ్ - ఏంజెలా మెర్కెల్ స్కాలర్షిప్కు ప్రకటన వెలువడింది. స్కాలర్‌షిప్‌తో లభించేవి: సుమారు ఏడాది వ్యవధి ఉండే కోర్సులో భాగంగా నెలకు 750 యూరోల స్టైఫండ్, రానుపోను విమాన ఖర్చులకు ట్రావెల్ అలవెన్స్, స్టడీ అండ్ రీసెర్చ్ సబ్సిడీ కింద 460 యూరోలు, ఆరోగ్య, ప్రమాద బీమా. వీటితోపాటు రెండు నెలల జర్మన్ లాంగ్వేజ్ కోర్సులో భాగంగా ఉచిత నివాసం, ఫీజు మినహాయింపు, అలవెన్స్‌లు లభిస్తాయి. అర్హత: ప్రథమ శ్రేణి మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. ఎంపిక: జనవరి/ఫిబ్రవరి-2015లో న్యూఢిల్లీలో నిర్వహించే ఇంటర్వ్యూ ద్వారా.. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 1, 2014 వెబ్సైట్: www.daaddelhi.org/en/ మైకాలో పీజీడీఎం - కమ్యూనికేషన్స్ అహ్మదాబాద్‌లోని ముద్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్స్ (మైకా).. పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ ఇన్ కమ్యూనికేషన్స్ (పీజీడీఎం-సి) కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హత: 10+2+3 విధానంలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. ఎంపిక: క్యాట్-2014/ఎక్స్‌ఏటీ-2014, 2015/మ్యాట్-2014 /సీమ్యాట్- 2014/ఏటీఎంఏ-2014 వంటి పరీక్షల స్కోర్ ఆధారంగా అభ్యర్థులకు అడ్మిషన్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణులకు గ్రూప్ ఎక్సర్సైజ్, పర్సనల్ ఇంటర్వ్యూలు ఉంటాయి. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.. దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 15, 2015 వెబ్సైట్: www.mica.ac.in -
విద్యా రుణాలు...భవితకు వరాలు
ఓ వైపు బంగారు భవిష్యత్తును చూపించే కోర్సులు.. మరో వైపు కళ్లు చెదిరే ఫీజులు.. కోర్సులో చేరాలనే బలమైన ఆకాంక్ష.. అనుకూలించని ఆర్థిక పరిస్థితులు.. చివరకు రాజీ ధోరణితో ఏదో ఒక కోర్సులో చేరడం..ప్రతిభ, నైపుణ్యాలు మెండుగా ఉన్నప్పటికీ ప్రస్తుత విద్యా ప్రపంచంలో అధిక శాతం మందికి ఎదురవుతున్న అనుభవం. అయితే.. విద్యార్థులు ఈ పరిస్థితిని అధిగమించొచ్చు. ప్రతిభ ఉంటే రాజీ పడాల్సిన అవసరమే లేదు. కారణం.. బ్యాంకులు విద్యా రుణాల పేరుతో అందిస్తున్న భరోసానే. రాష్ట్రంలోనే కాకుండా.. దేశవ్యాప్తంగా ఉన్న ఇన్స్టిట్యూట్లలో.. విదేశాల్లోనూ చదవాలనుకునే ప్రతిభ ఉన్న విద్యార్థులకు అన్ని జాతీయ బ్యాంకులు విద్యా రుణాలు అందిస్తున్నాయి. ఉన్నత విద్య దిశగా ప్రోత్సహిస్తున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో.. విద్యా రుణాల విధివిధానాలపై విశ్లేషణ.. ఎన్నో కోర్సులు.. వాటిని పూర్తి చేస్తే మరెన్నో అవకాశాలు. ఒకేషనల్ నుంచి ఓవర్సీస్ ఎడ్యుకేషన్ వరకు ఔత్సాహిక విద్యార్థులకు ఉన్నత విద్య దిశగా ఎన్నెన్నో మార్గాలు. వాటికి సరిపడే అర్హతలూ, ప్రతిభాపాటవాలు విద్యార్థులకు ఉంటున్నాయి. కానీ ఈ అవకాశాలను అందుకుంటున్న విద్యార్థులు కొందరే. కారణం.. రూ. లక్షల్లో ఉంటున్న ఫీజులు. కేవలం రుసుముల కారణంగా.. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఆశించిన కోర్సులో చేరలేక ఏదో ఒక కోర్సుకు పరిమితమవుతున్న వారి సంఖ్య లక్షల్లోనే. దీంతో దేశంలో నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరత ఏర్పడుతోంది. దీన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే ప్రతిభావంతులకు ‘విద్యా రుణాలు’ పేరుతో ఆర్థిక చేయూతనిచ్చేందుకు ఎన్నో చర్యలు చేపడుతోంది. ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్‌తో సంప్రదింపులు సాగించి అన్ని జాతీయ బ్యాంకుల్లో విద్యా రుణ పథకాలను అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంది. దీంతో ఇప్పుడు ఇంటర్మీడియెట్ అర్హతగా ప్రవేశం లభించే సాధారణ బ్యాచిలర్ డిగ్రీ కోర్సులు మొదలు మరెన్నో కోర్సులకు రుణ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. గుర్తింపు పొందిన కోర్సులకే విద్యా రుణాలు మంజూరు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం, ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్ సంయుక్తంగా.. ఈ రుణాలకు అర్హమైన కోర్సులను నిర్దేశించాయి. దీని ప్రకారం.. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), కేంద్ర ప్రభుత్వం, అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) తదితర నియంత్రణ సంస్థల పరిధిలోని యూనివర్సిటీల్లో లభించే బ్యాచిలర్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సులన్నిటికీ రుణ సదుపాయం లభిస్తుంది. అంతేకాకుండా ప్రొఫెషనల్ కోర్సులుగా పేరొందిన చార్టర్డ్ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రటరీ, ఐసీడబ్ల్యుఏ వంటి కోర్సుల ఔత్సాహికులు కూడా విద్యా రుణాల దరఖాస్తుకు అర్హులే. వీటితోపాటు ఐఐటీలు, ఐఐఎంలు, ఎన్ఐటీల వంటి ఇన్‌స్టిట్యూట్‌లతోపాటు, ఇతర అన్ని జాతీయ ప్రాధాన్యమున్న ఇన్స్టిట్యూట్స్ (కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్వహించే సంస్థలు)లో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు కూడా విద్యా రుణాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అన్నిటికంటే అత్యంత ఆకర్షణీయ అంశం రూ. లక్షల ఖర్చుతో కూడుకున్న పైలట్ శిక్షణ కోర్సులకు కూడా రుణ సదుపాయం అందుబాటులోకి తేవడం. అయితే దీనికి సంబంధించి సదరు శిక్షణనిచ్చే సంస్థకు డెరైక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ గుర్తింపు తప్పనిసరి. విదేశీ విద్యకు ప్రతిభావంతులైన విద్యార్థుల విషయంలో విదేశీ విద్య ఔత్సాహికులకు కూడా ఈ విద్యా రుణాలు అందుబాటులోకి వచ్చాయి. స్టడీ అబ్రాడ్‌కు సంబంధించి ఆయా దేశాల నియంత్రణ సంస్థల గుర్తింపు పొందిన యూనివర్సిటీల్లో జాబ్ ఓరియెంటెడ్, ప్రొఫెషనల్, టెక్నికల్ కోర్సుల ఔత్సాహికులు, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్ వంటి కోర్సులు చదవాలనుకునేవారు విద్యా రుణాలకు అర్హులు. దేశంలో ఒకేషనల్ కోర్సులకు కూడా దీర్ఘకాలిక వ్యవధిలో ఉండే బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ కోర్సులే కాకుండా మూడు నెలలు మొదలు రెండు, మూడేళ్ల వ్యవధిలో ఉండే వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశించాలనుకునే విద్యార్థులకు కూడా రుణ సదుపాయం కల్పిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా మోడల్ ఎడ్యుకేషన్ లోన్ ఫర్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ పేరుతో ఒక ప్రత్యేక పథకాన్ని రూపొందించారు. దీనికి ప్రధాన కారణం ఆయా వృత్తి నైపుణ్యాలను అందించే రంగాల్లో సుశిక్షితులైన మానవ వనరులను తీర్చిదిద్దడమే. ఈ క్రమంలో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇతర ప్రభుత్వ వృత్తి విద్యా సంస్థల గుర్తింపు పొందిన సంస్థలలో కోర్సులను ఈ విద్యా రుణాలకు అర్హమైన కోర్సులుగా పేర్కొన్నారు. దీంతో ఆయా సంస్థలు అందించే స్వల్పకాలిక కోర్సుల నుంచి ఐటీఐలు, పాలిటెక్నిక్ కోర్సుల వరకు దాదాపు అన్ని ఒకేషనల్ కోర్సులకు విద్యా రుణాలు అందుబాటులోకి వస్తున్నాయి. రుణ మొత్తం కోర్సు కాల వ్యవధి ఆధారంగా ఉంటుంది. మూడు నెలల వ్యవధిలోని కోర్సులకు రూ. 10 వేలు; మూడు నెలల నుంచి ఆరు నెలల వ్యవధిలోని కోర్సులకు రూ. 25 వేలు; ఏడాది వ్యవధి గల కోర్సులకు రూ. 50 వేలు; ఏడాదికంటే ఎక్కువ వ్యవధి గల కోర్సులకు రూ. 1.5 లక్షలుగా నిర్ణయించారు. ప్రభుత్వ నిర్దేశిత ఫీజు మొత్తాలకు మాత్రమే విద్యా రుణాలను అందించే విషయంలో ప్రభుత్వం, బ్యాంకర్స్ అసోసియేషన్లు కలిసి కొన్ని నిబంధనలను నిర్దిష్టంగా పేర్కొన్నాయి. ముఖ్యంగా రుణ మొత్తం మంజూరుకు సంబంధించి స్పష్టమైన విధివిధానాలను పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయా కోర్సులకు సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన ట్యూషన్ ఫీజులకు సమానమైన మొత్తానికి మాత్రమే రుణాలను అందిస్తారు. మేనేజ్మెంట్ కోటాలో చేరినా ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు మేరకే రుణం మంజూరు చేస్తారు. రుణ మొత్తాలు ఇలా దేశంలో, విదేశాల్లో విద్యాభ్యాసానికి సంబంధించి రుణ సదుపాయంపై బ్యాంకులు గరిష్ట పరిమితులు విధించాయి. దీని ప్రకారం దేశంలోని విద్యా సంస్థల్లో కోర్సులకు గరిష్టంగా రూ. పది లక్షలు, విదేశీ విద్యకు గరిష్టంగా రూ. 20 లక్షలు మంజూరు చేస్తారు. అంతేకాకుండా మొత్తం రుణాలకు సంబంధించి మార్జిన్ మనీ (విద్యార్థులు సొంతంగా భరించాల్సిన మొత్తం)ని కూడా నిర్దేశించాయి. రూ. నాలుగు లక్షల వరకు ఎలాంటి మార్జిన్ మనీ ఉండదు. రుణ మొత్తం రూ.నాలుగు లక్షలు దాటితే స్వదేశంలో విద్యకు 5 శాతం, విదేశీ విద్యకు 15 శాతం మార్జిన్ మనీ నిబంధన అమలులో ఉంది. హామీల నిబంధనలివే రుణ మంజూరుకు సంబంధించి విద్యార్థులు కొన్ని హామీలు సమర్పించాల్సి ఉంటుంది. ఈ విషయంలోనూ రూ. నాలుగు లక్షల వరకు ఎలాంటి హామీ అవసరం లేదు. కేవలం తల్లిదండ్రులను సహ దరఖాస్తుదారులుగా పేర్కొంటే సరిపోతుంది. రూ. నాలుగు లక్షల నుంచి రూ. 7.5 లక్షల వరకు తల్లిదండ్రుల హామీతో పాటు థర్డ్‌పార్టీ గ్యారెంటీ సమర్పించాలి. రూ.7.5 లక్షల కంటే ఎక్కువ రుణాలకు తల్లిదండ్రుల హామీతోపాటు స్థిరాస్థులను కొల్లేటర్ సెక్యూరిటీగా చూపించాలి. వడ్డీ రేట్లలోనూ చేయూత ఆయా రుణ మొత్తాలపై వసూలు చేసే వడ్డీ రేట్ల విషయంలోనూ బ్యాంకులు సరళీకృత విధానాలను అమలు చేస్తున్నాయి. ప్రస్తుతం 10.5 శాతం నుంచి 13.00 శాతం వరకు వార్షిక వడ్డీరేటును వసూలు చేస్తున్నాయి. ఈ వడ్డీ రేట్లు ఆయా బ్యాంకుల అంతర్గత నిబంధనల మేరకు నిర్ణయమవుతున్నాయి. అంతేకాకుండా మహిళా విద్యార్థులను ఉన్నత విద్య దిశగా ప్రోత్సహించే క్రమంలో అన్ని బ్యాంకులు దాదాపు ఒక శాతం వడ్డీని తక్కువగా వసూలు చేస్తున్నాయి. సీఎస్ఐఎస్ స్కీం.. ప్రత్యేక సదుపాయం వడ్డీ గణన విషయంలో విద్యార్థులకు వెసులుబాటు కల్పించే క్రమంలో 2009లో కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ సెక్టార్ ఇంట్రెస్ట్ సబ్సిడీ (సీఎస్ఐఎస్) స్కీంను ప్రవేశపెట్టింది. ఈ స్కీం 2009-10 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం కోర్సు వ్యవధిలో వడ్డీ రేటును లెక్కించరు. దీని ఫలితంగా అంతకు ముందు మాదిరిగా రుణం మంజూరు చేసిన రోజు నుంచి వడ్డీ చెల్లించాల్సిన అవసరం విద్యార్థులకు తప్పింది. తిరిగి చెల్లింపు ఇలా విద్యా రుణాలు పొందిన విద్యార్థులు ఆ మొత్తాలను కోర్సు పూర్తి చేసుకున్న ఒక ఏడాది తర్వాత నుంచి లేదా ఉద్యోగం పొందిన ఆరు నెలల తర్వాత నుంచి (రెండిట్లో ముందుగా ఏది సాధ్యమైతే దానినే పరిగణనలోకి తీసుకుంటారు) నెల వాయిదాల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. అప్పటి వరకు రీపేమెంట్ హాలిడే లేదా మారటోరియం పేరుతో తిరిగి చెల్లింపు విషయంలో బ్యాంకులు వెసులుబాటు కల్పిస్తున్నాయి. ఒకవేళ విద్యార్థులు అనివార్య కారణాల వల్ల కోర్సును నిర్దిష్ట గడువు లోపు పూర్తి చేయలేక పోయినా.. మరో రెండేళ్లు రీపేమెంట్ హాలిడే సదుపాయాన్ని అందిస్తు న్నాయి. అకడెమిక్ ట్రాక్ రికార్డ్‌పైనా దృష్టి విద్యా రుణాలు మంజూరు చేసే క్రమంలో బ్యాంకులు విద్యార్థుల అకడెమిక్ రికార్డ్‌పైనా ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు నిర్దిష్ట పర్సంటేజ్‌తో ఉత్తీర్ణత సాధించాలనే నిబంధనను విధిస్తున్నాయి. సాధారణంగా కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రాధాన్యమిస్తున్నాయి. అంతేకాకుండా నిరంతరం ఆయా కళాశాలల యాజమాన్యాల సహకారంతో విద్యార్థుల ట్రాక్ రికార్డ్‌ను తెలుసుకుంటున్నాయి. కాబట్టి రుణం మంజూరు చేయించుకోవడంతో పాటు.. ఆ తర్వాత అకడెమిక్గానూ మంచి ప్రదర్శన కనబర్చాల్సిన అవసరం విద్యార్థులపై ఉంటోంది. రుణ మొత్తాలు.. వీటికే బ్యాంకులు మంజూరు చేసే విద్యా రుణాల్లో ట్యూషన్ ఫీజుతోపాటు మరికొన్ని వ్యయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నాయి. అవి.. ట్యూషన్ ఫీజు లైబ్రరీ/లేబొరేటరీ/ఎగ్జామినేషన్ ఫీజు పుస్తకాలు, యూనిఫామ్స్, కోర్సు అభ్యసనానికి అవసరమయ్యే ఇతర పరికరాలు (కంప్యూటర్లు తదితర) కొనుగోలు వ్యయం. స్టడీ టూర్స్, ప్రాజెక్ట్ వర్క్స్‌కు వెచ్చించే మొత్తం. విదేశీ విద్య ఔత్సాహికులకు సంబంధించి ప్రయాణ ఖర్చులు అన్ని బ్యాంకులు ప్రధానంగా వీటి ఆధారంగానే రుణ మొత్తాలను ఖరారు చేస్తాయి. వాటిని నేరుగా కళాశాలలకు అందిస్తాయి. ఒకవేళ అప్పటికే విద్యార్థులు ఆయా ఫీజులను చెల్లించి ఉంటే తగిన ఆధారాలను పరిశీలించి సదరు మొత్తాన్ని విద్యార్థి చేతికి అందిస్తాయి. కోర్సు మిగతా సమయాల్లో చెల్లించాల్సిన మొత్తాలను కళాశాలలకు చెల్లిస్తాయి. రుణ దరఖాస్తుకు సమర్పించాల్సిన పత్రాలు ప్రవేశం లభించిన ఇన్స్టిట్యూట్ నుంచి ఫీజు, ఇతర అకడెమిక్ సంబంధిత ఖర్చులతో కూడిన అడ్మిషన్ లెటర్ వయసు నిర్ధారణకు సంబంధించి వయో ధ్రువీకరణ పత్రం అప్పటి వరకు పొందిన అకడెమిక్ అర్హతలకు సంబంధించి సర్టిఫికెట్ల నకలు ప్రతులు తల్లిదండ్రులు/కో-అప్లికెంట్స్/హామీదారుల ఆదాయ ధ్రువీకరణ పత్రాలు. కొల్లేటర్ సెక్యూరిటీకి సంబంధించి వాల్యుయేషన్ సర్టిఫికెట్ విదేశీ విద్య ఔత్సాహికులు పాస్‌పోర్ట్, వీసా, అడ్మిషన్ లెటర్, ప్రయాణ ఖర్చులకు సంబంధించిన నకలు ప్రతులు. విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్యారంటార్ల పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోగ్రాఫ్స్ ఇటీవల కాలంలో బ్యాంకులు దరఖాస్తు చేసుకునే బ్రాంచ్ విషయంలోనూ కొన్ని నిబంధనలు పాటిస్తున్నాయి. దీని ప్రకారం విద్యార్థులు తమ నివాస పరిధిలోని లేదా తాము చేరిన కళాశాల/ఇన్స్టిట్యూట్ సమీపంలోని బ్యాంకుల బ్రాంచ్‌లలోనే దరఖాస్తు చేయాల్సిన అవసరం ఉంది. బ్యాంకుల నుంచి ఎంతో చేయూత విద్యా రుణాల విషయంలో బ్యాంకులు ఎంతో చేయూతనిస్తున్నాయి. ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉన్నత విద్య కలలను నిజం చేసేందుకు ఎన్నో సౌకర్యాలు కల్పిస్తున్నాయి. ఈ క్రమంలో రీపేమెంట్ హాలిడే, మహిళలకు వడ్డీ రాయితీ వంటి సదుపాయాలను అందిస్తున్నాయి. నెలవారీ వాయిదాల చెల్లింపు విషయంలోనూ విద్యార్థుల కోణంలో ఆలోచిస్తున్నాయి. నిర్దిష్ట రీపేమెంట్ గడువు కంటే ముందే రుణ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తే మొత్తం వడ్డీ నుంచి ఒక శాతం గుడ్‌విల్ అందిస్తున్నాయి. విద్యార్థులు ఈ సౌకర్యాలను అందిపుచ్చుకుని ఉన్నత విద్యలో రాణించాలని అభిలషిస్తున్నాను. - ఆర్.సి. రాజన్, జీఎం, కెనరా బ్యాంక్ ముందస్తు కసరత్తుతో సులువుగా విద్యా రుణాలకు దరఖాస్తు చేసుకునేవారు ఆ ప్రక్రియను ముందుగానే ప్రారంభించాలి. అన్ని బ్యాంకుల్లో లోన్ ప్రాసెసింగ్‌కు 15 నుంచి 20 రోజుల సమయం పడుతుంది. కాబట్టి తమ కోర్సు ప్రారంభానికి ముందే అడ్మిషన్ లెటర్‌తో దరఖాస్తు చేసుకోవాలి. అంతేకాకుండా దరఖాస్తు పూర్తి చేసేటప్పుడు ఎలాంటి పొరపాట్లు లేకుండా చూసుకోవాలి. దరఖాస్తులో చిన్న చిన్న లోపాలతో చాలా మంది విద్యార్థులు చివరి నిమిషంలో ఒత్తిడికి గురవుతున్నారు. అందుకే దరఖాస్తును, అందులోని నియమ నిబంధనలను ఒకటికి రెండుసార్లు పరిశీలించి దరఖాస్తు చేయడం మంచిది. దరఖాస్తుతోపాటు అవసరమైన ఇతర పత్రాలన్నిటినీ పకడ్బందీగా సమర్పిస్తే 15 రోజుల్లో రుణం మంజూరవుతోంది. - వి.కె. గోపాలన్, చీఫ్ మేనేజర్, ఎస్బీహెచ్ -
అడ్మిషన్స్ అలర్ట్స్, కాంపిటీటివ్ కౌన్సెలింగ్
సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్-న్యూఢిల్లీ, కోర్సు: పీహెచ్డీ ప్రోగ్రామ్; విభాగం: ఎడ్యుకేషన్ వ్యవధి: మూడు నుంచి నాలుగేళ్లు; అర్హతలు: ఎడ్యుకేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ లేదా ఎంఎడ్/ఎంఫిల్ ఉండాలి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జూలై 4; వెబ్సైట్: http//cie.du.ac.in ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మేనేజ్మెంట్ కోర్సు: మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్; వ్యవధి: ఏడాది; అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు సంబంధిత విభాగంలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. జీఆర్ఈ/జీమ్యాట్‌లో అర్హత సాధించాలి; ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: ఆగస్టు 15; వెబ్సైట్: http://mph.iihmr.org/ టాటా మెమోరియల్ సెంటర్-ముంబై కోర్సు: ఎమ్మెస్సీ ఇన్ క్లినికల్ రీసెర్చ్; అర్హతలు: బయోసెన్సైస్/ లైఫ్ సెన్సైస్/ కెమిస్ట్రీ/ క్లినికల్ న్యూట్రిషన్/ఫార్మసీ/ఫార్మాస్యూటికల్ సెన్సైస్/ మెడిసిన్/ డెంటిస్ట్రీ/ అక్యుపేషనల్ థెరపీ/ ఫిజియోథెరపీ/ నర్సింగ్‌లో 50 శాతం మార్కులతో బీఎస్సీ ఉండాలి; వయసు: 30 ఏళ్లకు మించకూడదు. దరఖాస్తులకు చివరి తేది: జూలై 15; వెబ్సైట్: https://tmc.gov.in/ ఎన్డీఏ-ఎన్ఏ ఎగ్జామ్‌ను ఎవరు నిర్వహిస్తారు? దీని ద్వారా ఏయే ఉద్యోగాలు లభిస్తాయి? అర్హతలు, ఎంపిక విధానం తెలపండి? - సమీహ, జూబ్లీహిల్స్ త్రివిధ దళాలు (భారత సైన్యం, భారత వాయుసేన, భారత నౌకాదళం)లో ఆఫీసర్ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ప్రతి ఏటా నేషనల్ డిఫెన్స్ అకాడెమీ అండ్ నేవల్ అకాడెమీ (ఎన్డీఏ అండ్ ఎన్ఏ) పరీక్షను రెండుసార్లు నిర్వహిస్తోంది. ప్రస్తుతం ప్రకటన విడుదలైంది. ఈ ఏడాది పరీక్షను సెప్టెంబర్ 28న నిర్వహించనున్నారు. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ జూలై 21. పోస్టులు : మొత్తం 375 అర్హత : ఆర్మీ (ఎన్డీఏ): సబ్జెక్టులతో 10+2 ఉత్తీర్ణత. ఎయిర్‌ఫోర్స్, నేవీ (ఎన్డీఏ); 10+2 కేడెట్ ఎంట్రీ స్కీమ్ (ఇండియన్ నేవల్ అకాడమీ): ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో 10+2 ఉత్తీర్ణత. అవివాహితులైన పురుషులు మాత్రమే అర్హులు. నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి. వయోపరిమితి : జనవరి 2, 1996 - జనవరి 1, 1999 మధ్య జన్మించి ఉండాలి. ఎంపిక : రాత పరీక్ష, సర్వీస్ సెలెక్షన్ బోర్డ్ ఇంటర్వ్యూ. పరీక్ష విధానం : పరీక్షలో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. అవి.. 1. మ్యాథమెటిక్స్ (300 మార్కులు), జనరల్ ఎబిలిటీ టెస్ట్ (600 మార్కులు). ప్రతి పేపర్ పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. తప్పుగా గుర్తించిన సమాధానాలకు నెగెటివ్ మార్కులు (ప్రతి తప్పు సమాధానానికి 0.33 మార్కుల కోత) ఉంటాయి. మ్యాథమెటిక్స్ : ఇందులో ఆల్జీబ్రా, మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్, ట్రిగ్నామెట్రీ, ఎనలిటికల్ జామెట్రీ , డిఫరెన్షియల్ కాలిక్యులస్, ఇంటిగ్రల్ కాలిక్యులస్ అండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, వెక్టార్ ఆల్జీబ్రా, స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీలపై ప్రశ్నలుంటాయి. జనరల్ ఎబిలిటీ టెస్ట్ : దీనికి 600 మార్కులు కేటాయించారు. జనరల్ ఎబిలిటీ టెస్ట్‌లో భాగంగా జనరల్ ఇంగ్లిష్ (200 మార్కులు), జనరల్ నాలెడ్జ్ (400) ఉంటాయి. ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ : రాతపరీక్ష ఉత్తీర్ణులకు ఇంటర్వ్యూ ఉంటుంది. దీనికి 900 మార్కులు కేటాయించారు. ఇంటర్వ్యూ రెండు దశలుగా ఉంటుంది. ఎయిర్‌ఫోర్స్ అభ్యర్థులకు పైలట్ ఆప్టిట్యూడ్ బ్యాటరీ టెస్ట్ (పీఏబీటీ) నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలో విజేతలుగా నిలిచినవారిని శిక్షణకు ఎంపిక చేస్తారు. మూడేళ్లపాటు నేషనల్ డిఫెన్స్ అకాడెమీ-పుణెలో శిక్షణ ఉంటుంది. నేవల్ అకాడెమీ (10+2 కేటెడ్ ఎంట్రీ స్కీమ్)కి ఎంపికైనవారికి నాలుగేళ్లపాటు ఇండియన్ నేవల్ అకాడమీ- ఎజిమల (కేరళ)లో శిక్షణ ఉంటుంది. తర్వాత బీటెక్ డిగ్రీని అందిస్తారు. శిక్షణలో నెలకు రూ.21,000 స్టైఫండ్‌గా అందిస్తారు. శిక్షణ పూర్తిచేసుకున్నవారిని త్రివిధ దళాల్లో వివిధ హోదాల్లో నియమిస్తారు. రిఫరెన్స బుక్స్: నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ - ఆర్.గుప్తా మ్యాథమెటిక్స్ ఫర్ ఎన్డీఏ అండ్ ఎన్ఏ - ఎస్ఎల్ గులాటి ఎన్డీఏ-ఎన్ఏ సాల్వ్డ్ పేపర్స్ - దిశ పబ్లికేషన్స్ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్: ఎన్సీఈఆర్టీ ఆరు నుంచి 12 వతరగతి సైన్స్, సోషల్ పాఠ్యపుస్తకాలు ఇంగ్లిష్: రెన్ అండ్ మార్టిన్ గ్రామర్ మన రాష్ట్రంలో పరీక్ష కేంద్రం: హైదరాబాద్ వెబ్సైట్:www.upsconline.nic.in -
విద్య- ఉద్యోగం: జాబ్స్, అడ్మిషన్స్ అలర్ట్స్
మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ కార్పొరేషన్ పోస్టులు: 1. మేనేజర్, 2. అసిస్టెంట్ మేనేజర్, 3. అసిస్టెంట్ ఆఫీసర్ 4. ఫోర్‌మెన్, 5. టెక్నికల్ అసిస్టెంట్స్, 6. టెక్నీషియన్ 7. మెకానిక్, 8. డ్రైవర్, 9. స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్లో పేర్కొన్న అర్హతలు, అనుభవం ఉండాలి ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: జూలై 22 వెబ్సైట్: http://mecl.gov.in/ ఓఎన్జీసీ పోస్టులు: అసిస్టెంట్ టెక్నీషియన్ విభాగాలు: ఎలక్ట్రికల్/మెకానికల్/ప్రొడక్షన్/ఎలక్ట్రానిక్స్/బాయిలర్/సివిల్ మెరైన్ రేడియో అసిస్టెంట్ గ్రేడ్-3 అసిస్టెంట్ రిగ్‌మ్యాన్ (డ్రిల్లింగ్) అసిస్టెంట్ గ్రేడ్-3 జూనియర్ అసిస్టెంట్ టెక్నీషియన్ (బాయిలర్/ప్రొడక్షన్ /సిమెంటింగ్) జూనియర్ ఫైర్ సూపర్వైజర్ జూనియర్ మోటార్ వెహికల్ డ్రైవర్ అర్హతలు: నోటిఫికేషన్లో పేర్కొన్న అర్హతలు ఉండాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: జూలై 15 వెబ్సైట్: http://www.ongcindia.com/ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్సు: పీహెచ్డీ విభాగం: ఎడ్యుకేషన్ వ్యవధి: మూడు నుంచి నాలుగేళ్లు అర్హతలు: ఎడ్యుకేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ లేదా ఎంఎడ్/ఎంఫిల్ ఉండాలి దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జూలై 4 వెబ్సైట్: http//cie.du.ac.in ఎడ్యూ న్యూస్ మహీంద్రా +ఈసీపీ+జేఎన్టీయూల.. ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ డ్యూయెల్ డిగ్రీ ప్రోగ్రామ్ మహీంద్రా గ్రూప్ ఉన్నత విద్యా రంగంలోకి ప్రవేశిస్తోంది. ఫ్రాన్స్‌లోని ప్రాచీన ఇంజనీరింగ్ విద్యాసంస్థ ఇకోల్ సెంట్రలీ పారిస్(ఈసీపీ), హైదరాబాద్‌లోని జవహర్లాల్ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూ)ల ఉమ్మడి సహకారంతో మహీంద్రా ఇకోల్ సెంట్రలీ(ఎంఈసీ) పేరిట ఇంజనీరింగ్ విద్యాసంస్థను ఏర్పాటు చేసింది. ఎంఈసీ పైలట్ బ్యాచ్ వచ్చే నెలలో హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. ఈ సంస్థ హైదరాబాద్ క్యాంపస్‌లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ డ్యూయెల్ డిగ్రీ ప్రోగ్రామ్‌ను ఆఫర్ చేయనుంది. ఈ ప్రోగ్రామ్‌లో బీటెక్, ఎంటెక్ డిగ్రీలు కలిసి ఉంటాయి. పైలట్ బ్యాచ్‌లో 180 సీట్లు ఉన్నాయి. అంతర్జాతీయ విద్యార్థులు స్కాలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్టు(శాట్) స్కోర్, జాతీయ విద్యార్థులు జేఈఈ(మెయిన్)-2014 ర్యాంక్ ద్వారా ఈ ఐదేళ్ల ప్రోగ్రామ్‌లో ప్రవేశం పొందొచ్చు. అర్హులైన అభ్యర్థులు కౌన్సిలింగ్‌కు హాజరై, బ్రాంచ్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. భారత విద్యార్థులు ఏడాది ఫీజు రూ.4 లక్షలు, అంతర్జాతీయ విద్యార్థులైతే 8 వేల డాలర్లు చెల్లించాలి. ఎంఈసీ ఇచ్చే డిగ్రీకి ఫ్రెంచ్ బోర్డు ఆఫ్ ఇంజనీర్స్ గుర్తింపు ఉంటుంది. దీనిద్వారా భారత్‌లోని ఫ్రెంచ్ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు పొందొచ్చు. నేచురల్ సెన్సైస్, హ్యుమానిటీస్, బిజినెస్ అండ్ మేనేజ్మెంట్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, ఫిలాసఫీ, లాంగ్వేజ్ అండ్ కల్చర్, సాఫ్ట్‌స్కిల్స్ వంటి వాటిపై విద్యార్థులకు కనీస పరిజ్ఞానం కల్పించేలా కరిక్యులమ్‌ను రూపొందించారు. -
8 నుంచి తెలుగు వర్సిటీ దరఖాస్తులు
హైదరాబాద్,న్యూస్‌లైన్: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో వివిధ కోర్సులకు ఈ నెల 8వ తేదీ నుంచి దరఖాస్తులు లభ్యమవుతాయి. వీటిని వర్సిటీ వెబ్ సైట్ (డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.తెలుగుయూనివర్సిటీ.ఏసి.ఇన్) నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. పూర్తి చేసిన దరఖాస్తు ఫారాలను మే 30లోగా సమర్పించాలి. 2014-15వ విద్యా సంవత్సరానికి వర్సిటీలో తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, చరిత్ర, జ్యోతిషం, జర్నలిజం, సంగీతం, నృత్యం, రంగస్థల కళలు, జానపద కళలు, చిత్రలేఖన, శిల్పకళలతో పాటు కొత్తగా ఇంద్రజాలంలో కోర్సును కూడా ప్రారంభించారు. ఈ మేరకు వీసీ ఆచార్య ఎల్లూరి శివారెడ్డి సోమవారం వివరాలను వెల్లడించారు. -
కొలువుదీర్చే... కోర్సులు
దారులు వేరైనా చేరుకోవాల్సిన గమ్యం ఒకటే! చేరిన కోర్సు ఏదైనా ‘కొలువు’దీరడమే తుది లక్ష్యం. విద్యార్థి చదువుల ప్రయాణంలో 10+2 కీలక మజిలీ. ఇక్కడి నుంచి వేసే ప్రతి అడుగూ భావి కెరీర్‌కు పునాది రాయి! అందుకే ఆ అడుగులో స్పష్టత ఉండాలి.. విశ్వాసం తొణికిసలాడాలి! చాలా మంది ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సులవైపు మొగ్గుచూపుతారు. వీటికి ప్రత్యామ్నాయాలుగా, కోర్సు పూర్తయిందే తడవు ఉద్యోగాన్ని చేజిక్కించే కోర్సులూ ఉన్నాయి. వాటిపై స్పెషల్ ఫోకస్.. డిజైనింగ్ గుండు సూది నుంచి గోడ గడియారం వరకు.. చల్లటి నీటిని అందించే మట్టి కుండ నుంచి మొబైల్ ముచ్చట్ల కు కొత్త సొబగులు అద్దే బ్లూటూత్ వరకు ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో ప్రతిదాంట్లోనూ కొత్తదనం ఉట్టిపడాలి.. అప్పుడే వినియోగదారుడు వాటి వెంటపడతాడు! ఇలా అన్ని రకాల వస్తువులను మార్కెట్ అవసరాలకు అనుగుణంగా, వినూత్నంగా రూపొందించడం ఎలాగో తెలిపేదే డిజైనింగ్. ప్రస్తుత మేధో ఆర్థిక వ్యవస్థలో మార్కెట్లోకి వచ్చే ప్రతి వస్తువు వెనుకా ఓ డిజైనర్ పాత్ర ఉంటుంది. ఈ క్రమంలోనే నిపుణులైన డిజైనర్లకు డిమాండ్ పెరుగుతోంది. కోర్సులు: దేశంలో డిజైన్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్ఐడీ) కీలకంగా ఉంది. దీనికి అహ్మదాబాద్, గాంధీనగర్, బెంగళూరులో క్యాంపస్‌లు ఉన్నాయి. అహ్మదాబాద్ క్యాంపస్‌లో నాలుగేళ్ల కాల వ్యవధి గల గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రాం ఇన్ డిజైన్ (జీడీపీడీ) కోర్సును అందిస్తోంది. ఇందులో ప్రోడక్ట్ డిజైన్; ఫర్నిచర్ అండ్ ఇంటీరియర్ డిజైన్; సిరామిక్ అండ్ గ్లాస్ డిజైన్; గ్రాఫిక్ డిజైన్; యానిమేషన్ ఫిల్మ్ డిజైన్; ఫిల్మ్ అండ్ వీడియో కమ్యూనికేషన్ డిజైన్; ఎగ్జిబిషన్ డిజైన్; టెక్స్టైల్ డిజైన్ స్పెషలైజేషన్లున్నాయి. అర్హత: 10+2 లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత. డిజైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (డీఏటీ) ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. వెబ్సైట్:www.nid.edu గౌహతి ఐఐటీలోని డిపార్ట్మెంట్ ఆఫ్ డిజైన్.. బ్యాచిలర్స్ ఇన్ డిజైన్ (ఆ.ఈ్ఛట) కోర్సును ఆఫర్ చేస్తోంది. ఇంటర్/ తత్సమాన అర్హత ఉండాలి. జేఈఈ అడ్వాన్స్డ్-2014 ద్వారా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. వెబ్సైట్: www.iitg.ac.in నోయిడాలోని ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్కు దేశవ్యాప్తంగా ఎనిమిది క్యాంపస్‌లు ఉన్నాయి. ఇవి డిజైనింగ్‌కు సంబంధించి బ్యాచిలర్ కోర్సులను అందిస్తున్నాయి. కెరీర్: కోర్సులో ఎంపిక చేసుకున్న స్పెషలైజేషన్ ఆధారంగా టెక్స్టైల్ సంస్థలు, ఆటోమొబైల్ సంస్థలు, జీవనశైలి ఉత్పత్తుల తయారీ సంస్థలు తదితరాల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. నిపుణులైన డిజైనర్లకు రూ.లక్షల ప్యాకేజీలతో అవకాశాలిచ్చే జాతీయ, బహుళజాతి సంస్థలున్నాయి. పారా మెడికల్ కోర్సులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైద్య రంగానికి భారీగా నిధులు కేటాయిస్తున్నాయి. కార్పొరేట్ ఆసుపత్రులు చిన్నచిన్న పట్టణాలకు సైతం తమ శాఖలను విస్తరిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వైద్యులకు తలలో నాలుకలా వ్యవహరిస్తూ, రోగికి చికిత్స అందడంలో సహాయసహకారాలు (రక్త పరీక్షలు, మలమూత్ర పరీక్షల నిర్వహణ వంటివి) అందించే పారా మెడికల్ నిపుణులకు డిమాండ్ పెరిగింది. పారా మెడికల్ కోర్సులు చేసిన వారికి మార్కెట్లో ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి. కోర్సులు: పారామెడికల్ కోర్సులకు ఇంటర్మీడియెట్ బైపీసీలో ఉత్తీర్ణత సాధించినవారు అర్హులు. వీరిలో ప్రవేశాలకు తగినంతమంది అభ్యర్థులు లేకపోతే ఎంపీసీ ఉత్తీర్ణులకు, ఆ తర్వాత మిగిలిన గ్రూపుల వారికి అవకాశమిస్తారు. పారామెడికల్ విభాగంలో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఆప్టోమెట్రీ టెక్నీషియన్, హాస్పిటల్ ఫుడ్ సర్వీస్ మేనేజ్మెంట్ టెక్నీషియన్, మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ (పురుషులు), ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్, ఆడియోమెట్రీ టెక్నీషియన్, రేడియోథెరపీ టెక్నీషియన్, పర్ప్యూషన్ టెక్నీషియన్, రెస్పిరేటరీ థెరపీ టెక్నీషియన్ వంటి కోర్సులున్నాయి. రాష్ట్రంలో పారామెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డ్ జూన్‌లో నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. కోర్సు వ్యవధి రెండేళ్లు. ఇంటర్ గ్రూప్ సబ్జెక్టుల్లో సాధించిన మార్కుల ఆధారంగా కోర్సుల్లో ప్రవేశాలు ఉంటాయి. రాష్ర్ట వ్యాప్తంగా 14 ప్రభుత్వ సంస్థలు (సీట్లు-1462), 514 ప్రైవేట్ (సీట్లు-23,080) ఇన్స్టిట్యూట్లలో ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కెరీర్: పారామెడికల్ కోర్సులు చేసిన వారికి వివిధ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో అపార అవకాశాలున్నాయి. డాక్టర్లకు వీరు ప్రతి చికిత్సలో వెన్నంటి సహకరించాల్సిందే. నేడు వివిధ ఆస్పత్రులు ఓ మాదిరి పట్టణాల్లో సైతం తమ శాఖలను ఏర్పాటు చేస్తుండటంతో ఈ కోర్సులు చేసినవారికి ఉపాధి ఖాయం. విదేశాల్లో ముఖ్యంగా గల్ఫ్ దేశాలు (యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్)లోనూ మంచి అవకాశాలున్నాయి. ఆస్పత్రుల్లో పనిచేయడం ఇష్టం లేనివారు సొంతంగా డయాగ్నొస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేసుకోవచ్చు. వేతనాలు: ప్రారంభంలో రూ. 10,000 నుంచి రూ. 15,000 వరకు లభిస్తాయి. ఆ తర్వాత పనిలో అంకితభావం, కష్టించే స్వభావం, అనుభవం ద్వారా మరింత ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు. లేదంటే సొంత డయాగ్నొస్టిక్ కేంద్రం ఉంటే ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించొచ్చు. ఫ్యాషన్ కోర్సులు మనిషి అభిరుచుల్లో ఎప్పటికప్పుడు కొత్త మార్పులు వస్తుంటాయి. కాళ్లకు వేసుకునే చెప్పులు దగ్గర నుంచి తలకు పెట్టుకునే టోపీ వరకూ అన్నిటిలోనూ ‘ఫ్యాషన్’ కొట్టొచ్చినట్లు కనిపించాలని కోరుకుంటాడు. దీంతో డిజైనింగ్ వస్త్రాలకు, యాక్సెసరీస్‌కు డిమాండ్ బాగా పెరిగింది. వీటికి అనుగుణంగానే ఫ్యాషన్ డిజైనింగ్, టెక్నాలజీ కోర్సులు చేసిన వారికి ఉన్నత అవకాశాలు చేతికందుతున్నాయి. కోర్సులు: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్).. ఆఫర్ చేస్తున్న బ్యాచిలర్ కోర్సుల్లో యాక్సెసరీస్ డిజైన్, నిట్వేర్ డిజైన్, ఫ్యాషన్ కమ్యూనికేషన్, లెదర్ డిజైన్, ఫ్యాషన్ డిజైన్, టెక్స్టైల్ డిజైన్ కోర్సులున్నాయి. కోర్సు కాల వ్యవధి నాలుగేళ్లు. నిఫ్ట్‌కు దేశవ్యాప్తంగా 15 క్యాంపస్‌లు ఉన్నాయి. అర్హత: గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి 10+2 ఉత్తీర్ణత. ఎంట్రన్స్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. నిఫ్ట్.. అపరెల్ ప్రొడక్షన్లో బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సును అందిస్తోంది. కోర్సు కాల వ్యవధి నాలుగేళ్లు. గుర్తింపు పొంది న బోర్డ్ నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో 10+2 ఉత్తీర్ణత ఉన్నవారు ప్రవేశాలకు అర్హులు. వెబ్సైట్: www.nift.ac.in ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఫ్యాషన్ టెక్నాలజీలో బీఎస్సీ(ఆనర్స్) కోర్సును ఆఫర్ చేస్తోంది. ఈ కోర్సు కాలవ్యవధి నాలుగేళ్లు. అర్హతలు: ఇంటర్మీడియెట్ (10+2)లో ఉత్తీర్ణత. ఇంటర్మీడియెట్‌లో వొకేషనల్ కోర్సులు చేసిన వారు, పాలిటెక్నిక్‌లో హోంసైన్స్ సంబంధిత కోర్సులు చేసిన వారు కూడా అర్హులే. అర్హత కోర్సుల్లో సాధించిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఫ్యాషన్ డిజైనింగ్, టెక్నాలజీకి సంబంధించి ప్రైవేటు సంస్థలు డిప్లొమా, గ్రాడ్యుయేషన్ స్థాయి కోర్సులను అందిస్తున్నాయి. వేతనాలు: ఫ్యాషన్ రంగంలో అడుగుపెట్టిన వారికి ప్రారంభంలో రూ.15 వేల నుంచి రూ.26 వేల వరకూ ఉంటుంది. సృజనాత్మక ఆలోచనలతో మంచి పనితీరు కనబరిచే వారు ఫ్యాషన్ రంగంలో త్వరగా ఉన్నత స్థానాలకు ఎదగొచ్చు. మెరవడానికి సృజన ప్రధానం ప్రపంచీకరణ నేపథ్యంలో ఫ్యాషన్ డిజైనింగ్, టెక్నాలజీ రంగాలలో అవకాశాలు విస్తృతమవుతున్నాయి. ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే ఆసక్తి, సృజనాత్మకత ప్రధానం. ‘ఫ్యాషన్’లో బ్యాచిలర్ కోర్సులు పూర్తిచేసిన వారికి వస్త్ర, తోలు ఉత్పత్తులు, ఆభరణాల తయారీ పరిశ్రమల్లో ఎగ్జిక్యూటివ్‌లుగా, ఫ్యాషన్ డిజైనర్లుగా, ఇల్లుస్ట్రేటర్లుగా ఉద్యోగాలు పొందొచ్చు. ఎగుమతి సంస్థలు, వస్త్ర మిల్లులు, బోటిక్‌ల్లోనూ అవకాశాలుంటాయి. -డాక్టర్ ఎన్.జె.రాజారామ్, డెరైక్టర్, నిఫ్ట్, హైదరాబాద్. ఇంటర్ అర్హతతో వివిధ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. వీఆర్వో, రైల్వేజాబ్స్, పోలీసు కానిస్టేబుల్స్, ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, గ్రూప్-4.. ఇలా వివిధ ఉద్యోగాలను సరైన ప్రిపరేషన్‌తో సొంతం చేసుకోవచ్చు. ఉద్యోగం చేస్తూనే దూరవిద్య ద్వారా ఉన్నత విద్యను అభ్యసించొచ్చు. ఇవేకాకుండా.. ఇంకా ఎన్నో కోర్సులు, కెరీర్స్, అవకాశాలు ఇంటర్మీడియెట్ పూర్తిచేసుకున్న విద్యార్థుల కోసం ఎదురుచూస్తున్నాయి. అయితే ఆయా కోర్సుల గురించి నిశితంగా తెలుసుకొని, కొంత విశ్లేషణ చేసుకొని, నిపుణుల సలహాలు తీసుకొని విద్యార్థులు తమకు ఏది సరిపోతుందో దాన్ని ఎంచుకొని ముందుకు సాగాలి..! యానిమేషన్ అధునాతన కంప్యూటర్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బొమ్మలను కదిలిస్తూ సినిమాలు, గేమ్‌లు, ప్రకటనలు వంటి వాటిని రూపొందించడాన్ని యానిమేషన్ అంటాం. బ్లాక్ బస్టర్ చిత్రాలైన కుంగ్ ఫు పాండా, ది క్రానికల్స్ ఆఫ్ నార్నియా, వాల్-ఈ, ఐస్ ఏజ్ వంటి చిత్రాలతో పాటు చిన్నారులకు సుపరిచితమైన మిక్కీమౌస్, డొనాల్డ్ డక్, టామ్ అండ్ జెర్రీ వంటివన్నీ యానిమేషన్ నుంచి పుట్టిన కళాఖండాలే! ఔత్సాహికులను యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్(గఊగీ) రంగంలో రాణించేలా తీర్చిదిద్దేందుకు మార్కెట్లో వివిధ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కోర్సులు: ఓ అభ్యర్థిని యానిమేషన్ రంగానికి సరిపడే విధంగా తీర్చిదిద్దేందుకు పలు రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 10+2 అర్హతతో డిగ్రీ, డిప్లొమా కోర్సులో ప్రవేశించొచ్చు. ప్రైవేటు సంస్థలు బీఎస్సీ (మల్టీమీడియా), బీఎఫ్ఏ-యానిమేషన్, గఊగీ వంటి కోర్సులను అందిస్తున్నాయి. బేసిక్ స్కెచింగ్ నైపుణ్యాలు, ఆసక్తి ఉంటే ఎవరైనా ఈ కోర్సులు చేసి, ఉన్నత కెరీర్‌కు బాటలు వేసుకోవచ్చు. హైదరాబాద్‌లోని జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ యానిమేషన్లో అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సును ఆఫర్ చేస్తోంది. కాల వ్యవధి నాలుగేళ్లు. అర్హత: 10+2/ తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత. ఎంట్రన్స్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. కోర్సులు పూర్తిచేసిన వారికి సినీ స్టూడియోలు, అడ్వర్టైజింగ్ కంపెనీలు, టీవీ చానళ్లు, గేమింగ్ ఇండస్ట్రీ తదితరాల్లో యానిమేటర్, గేమ్ డిజైనర్, లేఅవుట్ ఆపరేటర్, స్కానర్ ఆపరేటర్, 2డీ యానిమేటర్, 3డీ యానిమేటర్, రిగ్గింగ్ ఆర్టిస్టు వంటి ఉద్యోగావకాశాలు ఉంటాయి. మార్కులు కాదు.. స్కిల్స్ ప్రధానం ‘‘ప్రస్తుత ఐటీ యుగంలో యానిమేషన్ వినియోగం లేని రంగాన్ని ఊహించుకోలేం. యానిమేషన్ కోర్సులు పూర్తిచేసిన వారికి అపార అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి కోర్సుల్లో చేరిన వారు తొలి రోజు నుంచి నిజాయితీగా కష్టపడాలి. ఎంతగా ప్రాక్టీస్ చేస్తే అంత మంచి ఫలితం ఉంటుందని గుర్తించాలి. ఇలాంటి రంగంలో మార్కులు ప్రధానం కాదు.. నైపుణ్యం ముఖ్యం. అదిచూసి మాత్రమే ఉద్యోగాలు ఇస్తారు. రెండు, మూడు స్పెషలైజేషన్లతో కోర్సులు పూర్తిచేసిన వారికి మిగిలిన వారితో పోల్చితే మంచి అవకాశాలుంటాయి. కోర్సులు పూర్తిచేసిన వారు సొంత ప్రాజెక్టులు, ఫ్రీలాన్స్ సర్వీస్ ద్వారా అధిక మొత్తంలో ఆర్జించవచ్చు. ఎప్పటికప్పుడు పరిశ్రమలో వస్తున్న మార్పులను ఒంటబట్టించుకొని, నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటే దేశీయ సంస్థలతో పాటు విదేశాల్లోనూ ఉన్నత ఉద్యోగాలను సంపాదించొచ్చు.’’ - వి.కృష్ణకుమార్, సీనియర్ ఫ్యాకల్టీ, పికాసో యానిమేషన్ కాలేజ్, హైదరాబాద్. ఆతిథ్య రంగం దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న రంగాల్లో ఆతిథ్య రంగం ఒకటి. దేశీయ, విదేశీ పర్యాటకుల సంఖ్య పెరుగుతుండటంతో అదే స్థాయిలో ఆతిథ్య రంగం కుర్రకారు ఉజ్వల భవితకు ఆసరా ఇస్తోంది. దీంతో హాస్పిటాలిటీ అండ్ హోటల్ మేనేజ్మెంట్ను కెరీర్‌గా ఎంపిక చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. కోర్సు పూర్తికాగానే ఉద్యోగంలో చేరాలనుకునే వారికి, కష్టపడి పనిచేసే తత్వం ఉన్నవారికి ఈ రంగంలో ఉపాధి అవకాశాలకు కొదవ లేదు. పర్యాటక రంగ విస్తరణతో పాటు పెద్ద ఎత్తున ఏర్పాటవుతున్న హోటళ్లు, రిసార్టుల కారణంగా మానవ వనరులకు డిమాండ్ ఏర్పడుతోంది. కేంద్ర పర్యాటక శాఖ నిర్వహించిన ఓ సర్వే ప్రకారం దేశంలో ఏటా 2.03 లక్షల సుశిక్షితులైన హాస్పిటాలిటీ మానవ వనరులకు డిమాండ్ ఉంటోంది. కోర్సులు: జాతీయ స్థాయిలో బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ). దీన్ని ఏటా నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ (ఎన్సీహెచ్ఎంసీటీ) నిర్వహిస్తోంది. ఈ పరీక్ష ద్వారా 21 కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో, 16 రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో, 15 ప్రైవేటు ఇన్స్టిట్యూట్లలో మూడేళ్ల వ్యవధి ఉన్న బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సును అభ్యసించొచ్చు. ఈ సంస్థల్లో మొత్తం 7,454 సీట్లున్నాయి. దీనికి ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన పరీక్షలలో ఉత్తీర్ణులు అర్హులు. అవకాశాలు: హోటల్ మేనేజ్మెంట్లో ప్రధానంగా నాలుగు విభాగాలు ఉంటాయి. అవి.. ఫుడ్ ప్రొడక్షన్, ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీస్(ఎఫ్ అడ్ బీ), ఫ్రంట్ ఆఫీస్, హౌస్ కీపింగ్. వీటిల్లో ఏదైనా ఒకదాన్ని ఎంచుకుని కెరీర్లో స్థిరపడొచ్చు. ఈ క్రమంలో హోటల్/హాస్పిటాలిటీ సంబంధిత పరిశ్రమలో మేనేజ్మెంట్ ట్రైనీ, కిచెన్ మేనేజ్మెంట్/హౌస్ కీపింగ్ మేనేజ్మెంట్, మార్కెటింగ్ సేల్స్, గెస్ట్/కస్టమర్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్ వంటి హోదాల్లో స్థిర పడొచ్చు. ప్రభుత్వరంగంలో కేంద్ర, రాష్ట్ర పర్యాటక శాఖల్లోనూ అవకాశాలుంటాయి. సొంతంగా సంస్థలను ఏర్పాటు చేయడం ద్వారా ఎంటర్‌ప్రెన్యూర్‌గానూ స్థిరపడొచ్చు. హోటల్‌మేనేజ్‌మెంట్ కోర్సులు పూర్తిచేసిన వారికి విదేశాల్లోనూ అవకాశాలు అనేకం. వేతనాలు: కెరీర్ ప్రారంభంలోనే ఐదంకెల జీతాన్ని సొంతం చేసుకోవచ్చు. మేనేజ్మెంట్ ట్రైనీగా అతే రూ. 15 నుంచి రూ. 18 వేలు, ట్రైనీ సూపర్‌వైజర్‌కైతే రూ. 10 నుంచి రూ. 14 వేలు, మిగతా విభాగాల వారికి రూ. 10 వేలు వర కూ వేతనం లభిస్తుంది. తర్వాత అనుభవం, ప్రతిభ ఆధారంగా రూ. 30,000 నుంచి రూ. లక్ష వరకు సంపాదించవచ్చు. ఉపాధికి కొదవలేని కోర్సులు ‘‘దేశంలో ఉపాధి పరంగా వ్యవసాయ రంగానిదే మొదటి స్థానం. ఇప్పుడు ఉపాధి కల్పనలో టూరిజం, హాస్పిటాలిటీ రంగం రెండో స్థానంలో నిలుస్తుండటం విశేషం. దీన్నిబట్టి చూస్తే హాస్పిటాలిటీ రంగంలో సుశిక్షితులైన వారికి ఉపాధికి కొదవ లేదనేది నిస్సందేహం. హోటల్ మేనేజ్మెంట్ బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేస్తే మంచి అవకాశాలుంటాయి. కోర్సు పూర్తయ్యాక ప్రారంభ వేతనం గురించి ఆలోచించకుండా ఆఫర్ ఇచ్చిన సంస్థ ప్రాధాన్యతను గుర్తిస్తే చక్కటి భవిష్యత్తు సొంతమవుతుంది. ఈ రంగంలో రాణించాలనుకునే విద్యార్థులకు 24ఁ7 వాతావరణంలో పనిచేసే సహజ లక్షణం ఉండాలి. అప్పుడే ఆశించిన స్థాయికంటే ఉన్నత హోదాలు అందుకోగలరు.’’ - డాక్టర్ పి.నారాయణరెడ్డి, డెరైక్టర్, డాక్టర్ వైఎస్ఆర్ నిథమ్, హైదరాబాద్. టీచింగ్ ఆహ్లాదకరమైన పని వాతావరణం, భావి భారత పౌరులను తీర్చిదిద్దే సువర్ణావకాశం ఉపాధ్యాయవృత్తితో లభిస్తుంది. ప్రస్తుతం చిన్న పట్టణాల్లో సైతం కార్పొరేట్ స్కూళ్లు, ప్రీ ప్రైమరీ స్కూళ్లు ఏర్పాటవుతున్నాయి. రానున్న రోజుల్లో బహుళజాతి సంస్థలు కూడా పాఠశాలలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీచింగ్ కోర్సులు పూర్తిచేసినవారికి మంచి అవకాశాలు ఎదురుచూస్తున్నాయి. 2012 డీఎస్సీ ద్వారా ఎస్జీటీకి ఎంపికైన వారు ప్రస్తుతం రూ.22 వేలకు పైనే అందుకుంటున్నారు. ఇలా ఆకర్షణీయమైన వేతనాలతో పాటు చక్కని పని వాతావరణం ఉన్న టీచర్ కొలువులపై యువత మొగ్గు చూపుతోంది. కోర్సులు: ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలనుకునే వారికి చక్కని మార్గం డీఈడీ (డిప్ల్లొమా ఇన్ ఎడ్యుకేషన్). ఈ కోర్సు పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలలో టీచర్‌గా స్థిరపడొచ్చు. అంతేకాకుండా సెకండరీ గ్రేడ్ టీచర్ల పోస్టులను కేవలం డీఈడీ అభ్యర్థులతోనే భర్తీ చేస్తుండడంతో ఈ కోర్సు చేసిన వారికి ప్రభుత్వ కొలువు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు. స్పెషల్ ఎడ్యుకేషన్: విజువల్, హియరింగ్ ఇంపెయిర్మెంట్, స్పీచ్ థెరపీ, ఆటిజం అండ్ స్పెక్ట్రమ్, రిహాబిలిటేషన్ సైకాలజీ, క్లినికల్ సైకాలజీ విభాగంలో పలు డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్ పూర్తిచేసిన వారు వీటిలో చేరేందుకు అర్హులు. ఈ కోర్సులు పూర్తిచేసిన వారికి ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, స్వచ్ఛంద సంస్థలు, సర్వశిక్షా అభియాన్ పాఠశాలలు, ఆస్పత్రులు, రిహాబిలిటేషన్ సెంటర్లలో అవకాశాలు లభిస్తాయి. ఫిజికల్ ఎడ్యుకేషన్: అండర్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్(యూజీడీపీఈడీ)కు ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులు అర్హులు. ఈ కోర్సులో ప్రవేశాలకు మన రాష్ర్టంలో పీఈసెట్ రాయాలి. ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సు పూర్తిచేసిన వారు డీఎస్సీ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ఉద్యోగాలను పొందొచ్చు. ప్రైవేటు పాఠశాలల్లోనూ వ్యాయామ ఉపాధ్యాయులుగా ఉద్యోగావకాశాలు ఉంటాయి. డిప్లొమా ఇన్ ఫార్మసీ అర్హత: ఇంటర్మీడియెట్ (ఎంపీసీ/బైపీసీ) ప్రవేశం: ఇంటర్మీడియెట్ మార్కులాధారంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే కౌన్సెలింగ్ ద్వారా ఈ కోర్సులో ప్రవేశం కల్పిస్తారు. సంబంధిత నోటిఫికేషన్ జూలై/ఆగస్టులలో వెలువడుతుంది. మన రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని దాదాపు 62 సంస్థలు ఈ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. అవకాశాలు: ఈ కోర్సు పూర్తి చేసిన తర్వాత ఫార్మాస్యూటికల్, సంబంధిత కంపెనీలు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లోని హాస్పిటల్స్‌లో ఫార్మాసిస్ట్‌గా స్థిరపడొచ్చు. ప్రారంభంలో నెలకు రూ. 8 నుంచి 10 వేల వరకు వేతనం లభిస్తుంది. డి.ఫార్మసీ తర్వాత ఉన్నత విద్య పరంగా బీ. ఫార్మసీ చేయవచ్చు. 10+2 తర్వాత కోర్సులంటే ఎక్కువ మందికి గుర్తొచ్చేవి.. ఇంజనీరింగ్, మెడిసిన్, సంప్రదాయ డిగ్రీ కోర్సులు. ఇవి కాకుండా అనేక జాబ్ ఓరియెంటెడ్ కోర్సులున్నాయి. అయితే ఈ కోర్సులలో చేరింది మొదలు పరిశ్రమ అవసరాలకు తగినట్లు నైపుణ్యాలు సొంతం చేసుకుంటే కోర్సులు పూర్తయిన వెంటనే మంచి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఇవి కాకుండా మల్టీమీడియా, కంప్యూటర్ డీటీపీ ఆపరేటర్ తదితరాల్లో స్వల్పకాలిక సర్టిఫికెట్ కోర్సులు కూడా అందుబాటులో ఉంటాయి. - ప్రొఫెసర్ టి.పార్థసారథి, ఉస్మానియా యూనివర్సిటీ. -
కొత్త తీర్మానాలకు టెక్ సాయం!
ఒక ఏడాది గడిచిపోయింది. కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికేశాం. ఎప్పట్లాగే మళ్లీ తీర్మానాలూ చేసేసుకున్నాం. కానీ క్రితంసారి మాదిరిగా మధ్యలోనే వదిలే స్తామేమోననిచిన్న సందేహం. వీటన్నింటికీ స్మార్ట్‌ఫోన్ సాయం తీసుకుంటే..? కొత్త నిర్ణయాలను మరింత ఉత్సాహంగా అమలు చేసేయొచ్చు. పట్టుదలతో ప్రయత్నించి విజయం సాధించొచ్చు... ఈసారయినా... తప్పకుండా బరువు తగ్గాలి. ఇంగ్లిష్‌పై పట్టు పెంచుకోవాలి. ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి. రోజువారీ పనులను సక్రమంగా నిర్వర్తించాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. బాగా చదివి ఉద్యోగం సంపాదించాలి. ఇలా ఎవరి అవసరాలకు అనుగుణంగా వారు తీర్మానించేసుకుని ఉంటారు. అయితే ఇలాంటి లక్ష్యాల సాధనకు మొబైల్ ఆప్స్‌ను ఉపయోగిస్తే.. పని మరింత సులభం. మరెందుకాలస్యం? వీటిని ప్రయత్నించండి... ఉన్నత విద్యా కోర్సులు చేసేందుకు, విజ్ఞాన సముపార్జనకు జీఖీఠ్ఛట ్ఖ వంటి ఆప్స్తోనూ కొత్త తీర్మానాలను అమలు చేసేందుకు ప్రయత్నించవచ్చు. రోజువారీ పనుల నిర్వహణకు, అత్యవసరమైన నోట్లు, పేపర్‌వర్క్, మీడియా ఫైళ్లు భద్రం చేసుకోవడానికి Evernote బరువు తగ్గేందుకు MyFitnessPal బరువు తగ్గాలంటే.. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించాల్సిందే. కానీ ఒకేసారి పెద్ద ఎత్తున ప్రయత్నించేసి కేలరీలను ఖర్చు చేసేస్తామంటే కుదరదు. కేలరీలను ఖర్చు చేయడం క్రమంగా జరిగితేనే సానుకూల ఫలితం. తేలికపాటి పనులు చేసేవారికి రోజుకు 2,500 కేలరీల శక్తి అవసరం. అందుకే ఎవరి అవసరం మేరకు వారు ఆహారంలో రోజుకు ఎన్ని కేలరీలు తగ్గిస్తే మంచిదో నిపుణుల సూచనల మేరకు నిర్ణయించుకోవాలి. అయితే ఏది తింటే ఎన్ని కేలరీలు అందుతాయో లెక్కలేసుకోవడం మాత్రం పెద్ద తలనొప్పి అయిపోతుంది కదా. ఆ పని సులభం చేసేందుకే ఈ ‘మైఫిట్నెస్పాల్’ ఆప్. ఏ ఆహారం.. ఎంత తీసుకుంటే.. ఎన్ని కేలరీలు అందుతాయి.. అన్నది ఈ ఆప్ వెంటనే లెక్క గట్టేసి చెబుతుంది. లక్షలాది ఆహార పదార్థాల కేలరీల లెక్కలు ఈ ఆప్‌లో ఉండటం విశేషం. ఎప్పుడు ఏ ఆహారం ఎంత తీసుకోవాలో రిమైండర్స్ కూడా పంపుతుంది. ఆపిల్, ఆండ్రాయిడ్, విండోస్‌ఫోన్, బ్లాక్‌బెర్రీ ఫోన్లలో పనిచేస్తుంది. పూర్తిగా ఉచితం. దీనికోసం http://www.myfitnesspal.ఛిౌఝలోకి లాగిన్ అవ్వండి. ఆంగ్లం నేర్చుకునేందుకు Duolingo: ఇంగ్లిష్‌తోపాటు ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, స్పానిష్ వంటి భాషలను నేర్చుకునేందుకు ఉపయోగపడే ఆప్ ఇది. మరో 50 భాషలూ ఈ ఆప్‌లో అందుబాటులోకి రానున్నాయి. ఫ్రీ ఐఫోన్ ఆప్ అయిన దీనిని ఆపిల్ కంపెనీ ‘ఆప్ ఆఫ్ ద ఇయర్’గా ప్రకటించింది. ఆటలు, క్విజ్‌ల ద్వారా భాషలు నేర్పడం, వివిధ స్థాయిల్లో కోర్సులు ఉండటం ఈ ఆప్ ప్రత్యేకత. ఆపిల్, ఆండ్రాయిడ్ ఫోన్లపై పనిచేస్తుంది. గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ ఐట్యూన్స్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. వ్యాయామంలో హుషారుకు Runtastic జీపీఎస్ ట్రాకింగ్‌తో పనిచేసే ఈ ఆప్ మీరు నడుస్తుంటే అడుగులు లెక్కిస్తుంది. పరుగెత్తుతుంటే కి లోమీటర్లు లెక్కిస్తుంది. మిమ్మల్ని మీరు అథ్లెట్ మాదిరిగా ఊహించుకుంటే.. ప్రేక్షకుల అరుపులతో ప్రోత్సహిస్తుంది కూడా. హార్ట్‌రేట్ మానిటరింగ్, వాయిస్ కోచ్, ఇంకా రకరకాల ఫీచర్లు ఉన్న ఈ ఆప్‌తో నడక, పరుగు మాత్రమే కాదు.. సైక్లింగ్ ఇతర వ్యాయామాలూ హుషారుగా చేసేయొచ్చు. క్రీడాకారులకే కాదు, మామూలుగా వ్యాయామం చేసేవారికీ బాగా ఉపయోగపడుతుంది. అన్ని ఆపిల్, ఆండ్రాయిడ్, విండోస్‌ఫోన్, బ్లాక్‌బెర్రీ ఫోన్లలో పనిచేస్తుంది. చాలావరకూ అనేక ఫీచర్లు ఉన్న వెర్షన్లు ఉచితం. కొన్ని ప్రధాన ఫీచర్లున్న వెర్షన్లు కావాలంటే మాత్రం కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కావాలంటే https://www.runtastic.com/లో ప్రయత్నించొచ్చు. ఖర్చులపై అదుపు కోసం Mint: ప్రతినెలా ఆదాయం బాగానే వస్తున్నా.. నెల చివరికొచ్చేసరికి డబ్బంతా ఏమవుతుందో అర్థం కాదు. ఇంటి అద్దె, గ్యాస్, షాపింగ్, పెట్రోల్‌తోపాటు వేటికి ఎంత ఖర్చయిందో పట్టికల రూపంలో చూపించే ఆప్ Mint. బడ్జెట్, ఆర్థిక లక్ష్యాల నిర్వహణకు బెస్ట్ ఉచిత ఆప్ ఇది. ముందుగా లక్ష్యాలను సెట్ చేసుకుంటే ఆ మేరకు రిమైండర్స్, ప్రోత్సాహం, ఉచితసలహాలు కూడా ఇస్తుంది. ఆపిల్, ఆండ్రాయిడ్, అమెజాన్, విండోస్ఫోన్లపై పనిచేస్తుంది. కావాలంటే https://www.mint.com/లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. రోజువారీ ఖర్చులను సులభంగా పర్యవేక్షించేందుకు ఈ్చజీడఇౌట్ట ఐవోఎస్ ఆప్‌ను కూడా ప్రయత్నించొచ్చు. వారం, నెలవారీ ఖర్చుల జాబితాలను చెక్ చేసుకోవచ్చు. కొత్త ప్రపంచాన్ని చూడటానికి trip advisor. హాలిడేలను సద్వినియోగం చేసుకొంటూ కొత్త ప్రపంచాన్ని చూడాలన్న కొత్త సంవత్సరపు తీర్మానాన్ని అమల్లో పెట్టడానికి ఈ అప్లికేషన్ సమాచారకోణంలో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ సంవత్సరం నుంచి నేను హెల్దీఫుడ్ మాత్రమే తీసుకోవాలి... అని బలంగా తీర్మానించేసుకొన్న వారికోసం true food అప్లికేషన్. ఆహారంలోని న్యూట్రీషియన్ వ్యాల్యూలను లెక్కగట్టి ఉత్తమమైన ఆహార ప్రమాణాలను వివరిస్తుంది ఈ అప్లికేషన్. ఐ ఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్ల ద్వారా విజ్ఞాన సంపదను పెంచుకోవాలని తపిస్తున్న వారి కోసం లెక్కలేనన్ని ఎడ్యుకేషనల్ అప్లికేషన్లు అందుబాటులోకి వచ్చాయి. ఐఓఎస్ వారి కోసం owl, how stuff works ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం quizcross, fit brains వంటి అప్లికేషన్ల ద్వారా మెదడుకు మేతను, విజ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. లక్ష్యం ఏదైనా... 'Lift' చేరుస్తుంది! : ఈ సంవత్సరం మీరు ఏం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నా సరే.. ఆ లక్ష్యం చేరేందుకు ఈ ఆప్ ఉపయోగపడుతుంది. మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలను గుర్తుచేస్తూ.. రోజూ ప్రేరణ అందిస్తూ.. పూర్తిచేసిన స్టెప్స్, మైలు రాళ్లను చూపిస్తూ.. లక్ష్యసాధనను పర్యవేక్షిస్తుంది. ధ్యానం, యోగా, వ్యాయామం, చదువుకోవడం, దురలవాటు మానడం.. లక్ష్యం ఏదైనా.. వాటి కోసం మీరు ఎంత మేరకు ప్రయత్నిస్తున్నారో ఈ ఆప్‌తో చెక్ చేసుకోవచ్చు. ఒకే తరహా లక్ష్యాలు పెట్టుకున్నవారు కొందరు కలిసి ఓ గ్రూపుగా కూడా ఏర్పడి పరస్పరం సూచనలు ఇచ్చుకునేందుకు కూడా ఈ ఆప్ తోడ్పడుతుంది. హెల్త్, ఫిట్నెస్, హ్యాపీనెస్, రిలేషన్షిప్స్ వంటివి మెరుగుపర్చుకునేందుకు కూడా ఉపయోగపడే ఈ ఆప్ ఐవోఎస్, ఆండ్రాయిడ్‌లపై పని చేస్తుంది. గూగుల్, ఆపిల్ స్టోర్ల నుంచి పొందొచ్చు. - హన్మిరెడ్డి యెద్దుల -
యువతా అందుకో...
=ఎన్నో అవకాశాలు =ప్రభుత్వ పథకాలు =విస్తృతంగా శిక్షణ కార్యక్రమాలు ఏ దేశ అభివృద్ధి కైనా యువత పాత్రే కీలకం. అటువంటి యువతీ, యువకులు తమ కెరీర్ పట్ల ఎంతో శ్రద్ధ వహించాల్సిన తరుణమిది. ఒకప్పుడు డిగ్రీ వరకు చదివితే సరిపోయేది. ఇప్పుడు ఉన్నత చదువులతోపాటుగా సాఫ్ట్వేర్, తదితర కోర్సులు కూడా చేస్తే ఆకర్షణీయమైన వేతనం, గౌరవప్రదమైన జీవితం అందుబాటులోకి వస్తాయి. భార్యాభర్తలు ఉద్యోగాలు చేస్తేనే కుటుంబం సాఫీగా సాగుతుంది. దీనితో మహిళలు కూడా పలు రంగాలలో విశేషంగా రాణిస్తున్నారు. ఈ నేపథ్యంలోప్రభుత్వం అందిస్తున్న పలు విద్య, శిక్షణ, రుణ పథకాల గురించి తెలుసుకుందాం. నిరుద్యోగులకు ఆసరాగా స్టడీసర్కిల్స్ నిరుపేద కుటుంబాలకు చెందిన బీసీ,ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు పలు పోటీ పరీక్షలలో ఉచిత శిక్షణ ఇచ్చేందుకుగాను నగరంలో రెండు స్టడీ సర్కిళ్లు నిర్వహిస్తున్నారు. గౌతు లచ్చన్న బీసీ స్టడీసర్కిల్, ఏపీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. గ్రూప్-1,గ్రూప్-2, సివిల్స్, బ్యాంక్ పీఓ, క్లర్క్, కానిస్టేబుల్, ఎస్ఐ,వీఆర్ఏ, డీఎస్సీ తదితర పోటీ పరీక్షలకు ఇక్కడ ఉచిత శిక్షణ ఇస్తారు. గ్రంథాలయ సదుపాయం కూడా ఉంది. బీసీ, ఈబీసీలకు రూ.లక్ష, ఎస్సీలకు రూ.2 లక్షల వార్షికాదాయం పరిమితి ఉంది. శిక్షణ కాలంలో స్టైఫెండ్, బుక్ అలవెన్స్ చెల్లిస్తారు. దూర ప్రాంత అభ్యర్థులకు హాస్టల్ సదుపాయం కూడా ఉంది. పూర్తి వివరాల కోసం బీసీ స్టడీసర్కిల్, బరోడా బ్యాంక్ మేడపై, సెక్టార్-6, ఎంవీపీ కాలనీ చిరునామాలో స్వయంగాను లేదా 0891-2564346 నంబర్‌కి ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. రాజీవ్ యువ కిరణాలు రాష్ట్ర ప్రభుత్వం 2011లో ఈ పథకం ప్రారంభించింది. పలురకాల కోర్సులలో యువతకు ఉచిత శిక్షణ ఇచ్చి, ఉపాధి కల్పిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 14,815 మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటివరకు 4785 మందికి ఉపాధి కల్పించారు. ఎన్సీసీ, ఈడబ్ల్యుఆర్సి, యంపవర్, గ్రామ్‌తరంగ్, సాహితి, శ్రీరామ్ ఎడ్యుకేషనల్ సొసైటీ, ఎస్‌ఎస్‌జీఎస్ సంస్థలు శిక్షణ ఇస్తున్నాయి. శిక్షణ తరువాత రూ.5వేల నుంచి రూ.9వేల వంతున వేతనాలు ఇస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో డీఆర్డీఏ, నర్సీపట్నం, యలమంచిలి మున్సిపాలిటీలలో మెప్మా, జీవీఎంసీ పరిధిలోయూసీడీ విభాగం ఆధ్వర్యంలో శిక్షణ కొనసాగుతోంది. విద్యార్థులకు 40 శాతం హాజరు తప్పనిసరి. రాజీవ్ యువశక్తి రాజీవ్ యువశక్తి పథకం కింద నిరుద్యోగ యువతీయువకులకు సెట్విస్ సంస్థ రుణాలు ఇస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 610 యూనిట్ల స్థాపనకుగాను రూ.6.10 కోట్ల మేరకు రుణాలు ఇవ్వాలని సంకల్పించారు. ఇందులో 30 శాతం సబ్సిడీ కింద రూ.2 కోట్లు వ్యయం చేస్తారు. లబ్ధిదారులు తమ వాటా కింద రూ.10 లక్షలు భరించాల్సి ఉంటుంది. ఇక బ్యాంకులు 60 శాతం కింద రూ.4 కోట్ల రుణాలు ఇవ్వనున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 930 దరఖాస్తులు రాగా, 300 దరఖాస్తులను బ్యాంకులు ఆమోదించాయి. 18 నుంచి 35 సంవత్సరాల వయసు గల యువత దరఖాస్తుకి అర్హులు. ఒక్కో యూనిట్‌కి రూ.70వేల నుంచి రూ.1.8 లక్షల వరకు రుణాలు ఇస్తారు. స్వయం ఉపాధి పథకం కింద పాన్‌షాపులు, ఆటో, జెరాక్స్, స్టూడియో, షామియానా సప్లయర్స్ వంటి యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. గత ఏడాది లక్ష్యాన్ని మించి 524 యూనిట్లకు రుణాలు ఇవ్వడం విశేషం. జనశిక్షణ సంస్థాన్ పిఠాపురం కాలనీ ఆంధ్రాబ్యాంక్ రోడ్డులో గల జనశిక్షణ సంస్థాన్‌లో పలు రకాల వృత్తివిద్యా కోర్సులలో అందుబాటు ఫీజులకే శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడ ఫ్రిజ్ , ఏసీ, కుట్టుమిషన్, రేడియో , టీవీ, గ్యాస్ స్టౌ, మోపెడ్ మెకానిజమ్, కంప్యూటర్ అప్లికేషన్- సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్-నెట్వర్క్, ప్రి-స్కూల్ టీచర్ ట్రైనింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, డ్రెస్ మేకింగ్, ఎంబ్రాయిడరీ, ఆర్యావర్క్, యోగ, స్పోకెన్ ఇంగ్లిష్, డీటీపీ, ఫొటోషాప్, వెబ్‌డిజైనింగ్, ఎంఎస్ ఆఫీస్, లైబ్రరీసైన్స్, బ్యుటీషియన్, పైప్ఫిట్టర్-ప్లంబింగ్,ఎలక్ట్రీషియన్, బుక్‌బైండింగ్, తేలికపాటి వాహనాల డ్రైవింగ్, గ్లాస్, నిబ్ పెయింటింగ్, అకౌంటింగ్ ప్యాకేజీ, అగర్బత్తీ, కొవ్వొత్తులు, డ్రెస్ మేకింగ్, ఫస్ట్‌ఎయిడ్, హ్యాండీక్రాఫ్ట్స్ తదితర కోర్సులలో శిక్షణ ఇస్తున్నారు. ప్రతి నెలా 17వ తేదీన కొత్త బ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. రాయితీ బస్‌పాస్ సదుపాయం ఉంది. 18 నుంచి 35 ఏళ్లలోపు వయసు గలవారు అర్హులు. ఆసక్తి గలవారు 0891-2553856 నంబర్ టెలిఫోన్ ద్వారా సంప్రదించవచ్చు.