కొత్త తీర్మానాలకు టెక్ సాయం! | 2014 Year new resolutions! | Sakshi
Sakshi News home page

కొత్త తీర్మానాలకు టెక్ సాయం!

Published Fri, Jan 3 2014 11:50 PM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM

2014 Year new resolutions!

 ఒక ఏడాది గడిచిపోయింది. కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికేశాం. ఎప్పట్లాగే మళ్లీ  తీర్మానాలూ చేసేసుకున్నాం. కానీ క్రితంసారి మాదిరిగా మధ్యలోనే వదిలే స్తామేమోననిచిన్న సందేహం. వీటన్నింటికీ స్మార్ట్‌ఫోన్ సాయం తీసుకుంటే..? కొత్త నిర్ణయాలను మరింత ఉత్సాహంగా అమలు చేసేయొచ్చు. పట్టుదలతో  ప్రయత్నించి విజయం సాధించొచ్చు...
 
ఈసారయినా... తప్పకుండా బరువు తగ్గాలి. ఇంగ్లిష్‌పై పట్టు పెంచుకోవాలి. ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి. రోజువారీ పనులను సక్రమంగా నిర్వర్తించాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. బాగా చదివి ఉద్యోగం సంపాదించాలి. ఇలా ఎవరి అవసరాలకు అనుగుణంగా వారు తీర్మానించేసుకుని ఉంటారు. అయితే ఇలాంటి లక్ష్యాల సాధనకు మొబైల్ ఆప్స్‌ను ఉపయోగిస్తే.. పని మరింత సులభం. మరెందుకాలస్యం? వీటిని ప్రయత్నించండి...
 
 ఉన్నత విద్యా కోర్సులు చేసేందుకు, విజ్ఞాన సముపార్జనకు  జీఖీఠ్ఛట ్ఖ వంటి ఆప్స్‌తోనూ కొత్త తీర్మానాలను అమలు చేసేందుకు ప్రయత్నించవచ్చు.
 
 రోజువారీ పనుల నిర్వహణకు, అత్యవసరమైన నోట్‌లు, పేపర్‌వర్క్, మీడియా ఫైళ్లు భద్రం చేసుకోవడానికి Evernote
 
 బరువు తగ్గేందుకు MyFitnessPal

 బరువు తగ్గాలంటే.. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించాల్సిందే. కానీ ఒకేసారి పెద్ద ఎత్తున ప్రయత్నించేసి కేలరీలను ఖర్చు చేసేస్తామంటే కుదరదు. కేలరీలను ఖర్చు చేయడం క్రమంగా జరిగితేనే సానుకూల ఫలితం. తేలికపాటి పనులు చేసేవారికి రోజుకు 2,500 కేలరీల శక్తి అవసరం. అందుకే ఎవరి అవసరం మేరకు వారు ఆహారంలో రోజుకు ఎన్ని కేలరీలు తగ్గిస్తే మంచిదో నిపుణుల సూచనల మేరకు నిర్ణయించుకోవాలి. అయితే ఏది తింటే ఎన్ని కేలరీలు అందుతాయో లెక్కలేసుకోవడం మాత్రం పెద్ద తలనొప్పి అయిపోతుంది కదా. ఆ పని సులభం చేసేందుకే ఈ ‘మైఫిట్‌నెస్‌పాల్’ ఆప్. ఏ ఆహారం.. ఎంత తీసుకుంటే.. ఎన్ని కేలరీలు అందుతాయి.. అన్నది ఈ ఆప్ వెంటనే లెక్క గట్టేసి చెబుతుంది. లక్షలాది ఆహార పదార్థాల  కేలరీల లెక్కలు ఈ ఆప్‌లో ఉండటం విశేషం. ఎప్పుడు ఏ ఆహారం ఎంత తీసుకోవాలో రిమైండర్స్ కూడా పంపుతుంది. ఆపిల్, ఆండ్రాయిడ్, విండోస్‌ఫోన్, బ్లాక్‌బెర్రీ ఫోన్లలో పనిచేస్తుంది. పూర్తిగా ఉచితం. దీనికోసం http://www.myfitnesspal.ఛిౌఝలోకి లాగిన్ అవ్వండి.
 
 ఆంగ్లం నేర్చుకునేందుకు Duolingo: ఇంగ్లిష్‌తోపాటు ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, స్పానిష్ వంటి భాషలను నేర్చుకునేందుకు ఉపయోగపడే ఆప్ ఇది. మరో 50 భాషలూ ఈ ఆప్‌లో అందుబాటులోకి రానున్నాయి. ఫ్రీ ఐఫోన్ ఆప్ అయిన దీనిని ఆపిల్ కంపెనీ ‘ఆప్ ఆఫ్ ద ఇయర్’గా ప్రకటించింది. ఆటలు, క్విజ్‌ల ద్వారా భాషలు నేర్పడం, వివిధ స్థాయిల్లో కోర్సులు ఉండటం ఈ ఆప్ ప్రత్యేకత. ఆపిల్, ఆండ్రాయిడ్ ఫోన్లపై పనిచేస్తుంది. గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ ఐట్యూన్స్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
 
 వ్యాయామంలో హుషారుకు Runtastic
 జీపీఎస్ ట్రాకింగ్‌తో పనిచేసే ఈ ఆప్ మీరు నడుస్తుంటే అడుగులు లెక్కిస్తుంది. పరుగెత్తుతుంటే కి లోమీటర్లు లెక్కిస్తుంది. మిమ్మల్ని మీరు అథ్లెట్ మాదిరిగా ఊహించుకుంటే.. ప్రేక్షకుల అరుపులతో ప్రోత్సహిస్తుంది కూడా. హార్ట్‌రేట్ మానిటరింగ్, వాయిస్ కోచ్, ఇంకా రకరకాల ఫీచర్లు ఉన్న ఈ ఆప్‌తో నడక, పరుగు మాత్రమే కాదు.. సైక్లింగ్ ఇతర వ్యాయామాలూ హుషారుగా చేసేయొచ్చు. క్రీడాకారులకే కాదు, మామూలుగా వ్యాయామం చేసేవారికీ బాగా ఉపయోగపడుతుంది. అన్ని ఆపిల్, ఆండ్రాయిడ్, విండోస్‌ఫోన్, బ్లాక్‌బెర్రీ ఫోన్లలో పనిచేస్తుంది. చాలావరకూ అనేక ఫీచర్లు ఉన్న వెర్షన్లు ఉచితం. కొన్ని ప్రధాన ఫీచర్లున్న వెర్షన్లు కావాలంటే మాత్రం కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కావాలంటే https://www.runtastic.com/లో ప్రయత్నించొచ్చు.
 
 ఖర్చులపై అదుపు కోసం Mint: ప్రతినెలా ఆదాయం బాగానే వస్తున్నా.. నెల చివరికొచ్చేసరికి డబ్బంతా ఏమవుతుందో అర్థం కాదు. ఇంటి అద్దె, గ్యాస్, షాపింగ్, పెట్రోల్‌తోపాటు వేటికి ఎంత ఖర్చయిందో పట్టికల రూపంలో చూపించే ఆప్ Mint. బడ్జెట్, ఆర్థిక లక్ష్యాల నిర్వహణకు బెస్ట్ ఉచిత ఆప్ ఇది. ముందుగా లక్ష్యాలను సెట్ చేసుకుంటే ఆ మేరకు రిమైండర్స్, ప్రోత్సాహం, ఉచితసలహాలు కూడా ఇస్తుంది. ఆపిల్, ఆండ్రాయిడ్, అమెజాన్, విండోస్‌ఫోన్‌లపై పనిచేస్తుంది. కావాలంటే  https://www.mint.com/లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రోజువారీ ఖర్చులను సులభంగా పర్యవేక్షించేందుకు ఈ్చజీడఇౌట్ట  ఐవోఎస్ ఆప్‌ను కూడా ప్రయత్నించొచ్చు. వారం, నెలవారీ ఖర్చుల జాబితాలను చెక్ చేసుకోవచ్చు.  
 
 కొత్త ప్రపంచాన్ని చూడటానికి trip advisor. హాలిడేలను సద్వినియోగం చేసుకొంటూ కొత్త ప్రపంచాన్ని చూడాలన్న కొత్త సంవత్సరపు తీర్మానాన్ని అమల్లో పెట్టడానికి ఈ అప్లికేషన్ సమాచారకోణంలో ఉపయోగకరంగా ఉంటుంది.
 
 ఈ సంవత్సరం నుంచి నేను హెల్దీఫుడ్ మాత్రమే తీసుకోవాలి... అని బలంగా తీర్మానించేసుకొన్న వారికోసం true food అప్లికేషన్. ఆహారంలోని న్యూట్రీషియన్ వ్యాల్యూలను లెక్కగట్టి ఉత్తమమైన ఆహార ప్రమాణాలను వివరిస్తుంది ఈ అప్లికేషన్.
 
 ఐ ఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్ల ద్వారా విజ్ఞాన సంపదను పెంచుకోవాలని తపిస్తున్న వారి కోసం లెక్కలేనన్ని ఎడ్యుకేషనల్ అప్లికేషన్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఐఓఎస్ వారి కోసం owl, how stuff works ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం quizcross,  fit brains వంటి అప్లికేషన్‌ల ద్వారా మెదడుకు మేతను, విజ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు.
 
 లక్ష్యం ఏదైనా... 'Lift' చేరుస్తుంది! : ఈ సంవత్సరం మీరు ఏం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నా సరే.. ఆ లక్ష్యం చేరేందుకు ఈ ఆప్ ఉపయోగపడుతుంది. మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలను గుర్తుచేస్తూ.. రోజూ ప్రేరణ అందిస్తూ.. పూర్తిచేసిన స్టెప్స్, మైలు రాళ్లను చూపిస్తూ.. లక్ష్యసాధనను పర్యవేక్షిస్తుంది. ధ్యానం, యోగా, వ్యాయామం, చదువుకోవడం, దురలవాటు మానడం.. లక్ష్యం ఏదైనా.. వాటి కోసం మీరు ఎంత మేరకు ప్రయత్నిస్తున్నారో ఈ ఆప్‌తో చెక్ చేసుకోవచ్చు. ఒకే తరహా లక్ష్యాలు పెట్టుకున్నవారు కొందరు కలిసి ఓ గ్రూపుగా కూడా ఏర్పడి పరస్పరం సూచనలు ఇచ్చుకునేందుకు కూడా ఈ ఆప్ తోడ్పడుతుంది. హెల్త్, ఫిట్‌నెస్, హ్యాపీనెస్, రిలేషన్‌షిప్స్ వంటివి మెరుగుపర్చుకునేందుకు కూడా ఉపయోగపడే ఈ ఆప్ ఐవోఎస్, ఆండ్రాయిడ్‌లపై పని చేస్తుంది. గూగుల్, ఆపిల్ స్టోర్ల నుంచి పొందొచ్చు.
 
 - హన్మిరెడ్డి యెద్దుల
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement