
ధర రూ. 23,999 నుంచి ప్రారంభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్‌ఫోన్ల తయారీ దిగ్గజం ఒప్పో తాజాగా ఎఫ్29 సిరీస్ ఫోన్లను ఆవిష్కరించింది. వీటిలో ఎఫ్29 ధర రూ. 23,999 నుంచి, ఎఫ్29 ప్రో మోడల్ రేటు రూ. 27,999 నుంచి ప్రారంభమవుతుంది. ఇవి వరుసగా మార్చి 27, ఏప్రిల్ 1 నుంచి లభిస్తాయని సంస్థ తెలిపింది. 6.7 అంగుళాల స్క్రీన్, 50 ఎంపీ కెమెరా, 6,500 ఎంఏహెచ్ వరకు బ్యాటరీ, కలర్‌ఓఎస్ 15, హంటర్ యాంటెన్నా తదితర ఫీచర్లు వీటిలో ఉంటాయని పేర్కొంది.
భారతీయ పరిస్థితులకు తగ్గట్లుగా దుమ్మూ, నీరు, ఇతరత్రా ద్రవాల నుంచి అత్యధిక రక్షణ ఉండేలా రూపొందిచినట్లు ఒప్పో ఇండియా ప్రోడక్ట్ కమ్యూనికేషన్స్ హెడ్ సేవియో డిసౌజా వివరించారు. దేశీయంగా కార్యకలా పాల విస్తరణపై నిరంతరం పెట్టు బడులు పెడుతున్నట్లు చెప్పారు. భారత్‌లో స్మార్ట్‌ఫోన్ల ఉత్పత్తి కోసం నోయిడాలో 110 ఎకరాల్లో తయారీ ప్లాంటును నెలకొల్పినట్లు వివరించారు.
తమ ఎఫ్27 ప్రోప్లస్ స్మార్ట్‌ఫోన్లకు ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ తదితర మార్కెట్లలో భారీ స్పందన లభిస్తోందన్నారు. ఎఫ్29 స్మార్ట్‌ఫోన్ల మీద ఎస్‌బీఐ కార్డ్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మొదలైన వాటిపై 10% వరకు క్యాష్‌బ్యాక్, 10% వరకు ఎక్సే్చంజ్ బోనస్ వంటి ఆఫర్లు ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment