Oppo Reno 10 Series Launch Soon in India - Sakshi
Sakshi News home page

Oppo: 'రెనో 10 సిరీస్' విడుదలకు సిద్దమవుతున్న ఒప్పో.. వివరాలు

Published Tue, Jun 27 2023 8:16 PM | Last Updated on Tue, Jun 27 2023 9:02 PM

Oppo reno 10 series launch soon in india here is the details - Sakshi

Oppo Reno 10 Series: భారతదేశంలో 5జీ మొబైల్స్ విరివిగా అమ్ముడవుతున్న సమయంలో 'ఒప్పో' (Oppo) సంస్థ తన 'రెనో 10 సిరీస్' (Reno 10 Series) విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఆధునిక ఫీచర్స్‌తో విడుదలకానున్న ఈ మొబైల్ ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ కామర్స్ సైట్లలో కూడా లభించనున్నాయి. ఈ మొబైల్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..

ఒప్పో రెనో 10 సిరీస్ స్మార్ట్‌ఫోన్ త్వరలోనే ఇండియన్ మార్కెట్లో విడుదల చేయనున్నట్లు సంస్థ ఇప్పటికే ప్రకటించింది. అంతే కాకుండా ఈ మొబైల్ ఫోన్‌కు సంబంధించిన ఫోటోలను కూడా ట్విటర్ ఖాతా ద్వారా షేర్ చేసింది. ఈ 5జి మొబైల్ గత మే నెల ప్రారంభంలో చైనా మార్కెట్లో మూడు వేరియంట్లలో విడుదలయ్యాయి. అవి ఒప్పొ రెనొ 10, ఒప్పొ రెనొ 10 ప్రో, ఒప్పొ రెనొ 10 ప్రో ప్లస్.

(ఇదీ చదవండి: చిన్నారి చేష్టలకు ఆనంద్ మహీంద్రా ఫిదా.. నెట్టింట్లో వైరల్ వీడియో!)

కొత్త రెనో 10 సిరీస్ స్మార్ట్‌ఫోన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) కలిగి.. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌తో పాటు క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778 జీ ఆక్టాకోర్ చిప్ సెట్ కలిగి ఉంటుంది. ఇది ఐస్ బ్లూ, సిల్వర్ గ్రే కలర్ ఆప్ష‌న్స్‌లో చైనా మార్కెట్లో లభిస్తోంది. భారతీయ మార్కెట్లో కూడా ఇదే కలర్ ఆప్ష‌న్స్‌ ఉండవచ్చని భావిస్తున్నాము. ఈ మొబైల్ లాంచ్ డేట్, అధికారిక ధరలను కంపెనీ వెల్లడించలేదు. చైనాలో రెనో 10 సిరీస్ ప్రారంభ ధర 2,499 యువాన్స్. భారతీయ కరెన్సీ ప్రకారం ఇది సుమారు రూ. 29,000 అని తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement