Oppo
-
రూ.15,000 లోపు ప్రీమియం ఫీచర్లున్న స్మార్ట్ఫోన్లు
-
డేట్ ఫిక్స్.. ఒప్పో కొత్త ఫోన్ లాంచ్ అప్పుడే
స్మార్ట్‌ఫోన్ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న కొత్త ఒప్పో ఫైండ్ ఎక్స్8 సిరీస్ గ్లోబల్ మార్కెట్లో లాంచ్ కావడానికి సిద్ధమైంది. ఇది నవంబర్ 21న భారతదేశంతో పాటు ఇతర దేశాల్లో కూడా లాంచ్ కానుంది. ఇది ఫైండ్ ఎక్స్8, ఫైండ్ ఎక్స్8 ప్రో అనే రెండు వేరియంట్లలో రానున్నట్లు సమాచారం.ఒప్పో ఫైండ్ ఎక్స్8 సిరీస్ ఫోన్ హాసెల్‌బ్లాడ్ ట్యూన్డ్ కెమెరాలు, మీడియాటెక్ డైమెన్సిటీ 9400 చిప్సెట్ పొందనుంది. ఇది క్వాల్కామ్ లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్‌ను అధిగమించగలదని సమాచారం. గేమింగ్, ఫోటోగ్రఫీ కోసం ఏఐ టెక్నాలజీ ఉంటుందని తెలుస్తోంది.కంపెనీ.. ఫైండ్ ఎక్స్8 సిరీస్ ఫోన్‌ను లాంచ్ చేయడానికి ముందే కొన్ని వివరాలను వెల్లడించింది. ఇందులో కొత్త మొబైల్ హ్యాండ్సెట్లు, పర్ఫామెన్స్ అన్నీ కూడా దాని మునుపటి అన్ని మోడల్స్ కంటే అద్భుతంగా ఉంటుందని పేర్కొంది. ఇది 7.85 మిమీ మందం, 193 గ్రాముల బరువు ఉంటుందని పేర్కొంది.ఒప్పో ఫైండ్ ఎక్స్8 సిరీస్ నాలుగువైపులా 1.45 మిమీ సన్నని బెజెల్స్‌తో 6.59 ఇంచెస్ డిస్ప్లే పొందుతుంది. ఇది స్టార్ గ్రే, స్పేస్ బ్లాక్ అనే రెండు రంగుల్లో మాత్రమే అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. రెండో వేరియంట్.. ఫైండ్ ఎక్స్8 ప్రో విషయానికి వస్తే.. రెండు వైపులా క్వాడ్ కర్వ్డ్ గ్లాస్‌తో పెద్ద 6.78 ఇంచెస్ డిస్ప్లే పొందనుంది. ఇది స్పేస్ బ్లాక్, పెర్ల్ వైట్ అనే రెండు రంగుల్లో లభిస్తుంది.ఇదీ చదవండి: అడిగితే 'జియో హాట్‌స్టార్' ఇచ్చేస్తాం: రిలయన్స్‌కు చిన్నారుల ఆఫర్ఒప్పో ఫైండ్ ఎక్స్8 5630mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీతో రానుంది. ఎక్స్8 ప్రో 5910mAh బ్యాటరీతో వస్తుందని సమాచారం. కాగా కంపెనీ కొత్త మొబైల్ ఫోన్ ధరలను అధికారికంగా వెల్లడించలేదు. అయితే ధరలు నవంబర్ 21న వెల్లడయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాము. -
‘పవర్ఫుల్’ ఫోన్.. రూ.13 వేలకే..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఒప్పో (Oppo) మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. భారతీయ కస్టమర్ల కోసం ఒప్పో కే12ఎక్స్ 5జీ (Oppo K12x 5G) ఫోన్‌ను విడుదల చేసింది. 5100mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన ఈ శక్తివంతమైన ఫోన్‌ను రూ.13 వేలకే అందించనుంది.ఈ ఫోన్‌ను అల్ట్రా స్లిమ్ గ్లీమింగ్ డిజైన్‌తో, 360 డిగ్రీల ఆర్మర్ ప్రూఫ్ బాడీతో తీసుకొచ్చినట్లు కంపెనీ తెలిపింది. ఈ సరికొత్త స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఏంటి.., ధర ఎంత.., ఫస్ట్ సేల్ ఎప్పుడు ప్రారంభమవుతుంది.., ఎక్కడ కొనుగోలు చేయాలి వంటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..స్పెసిఫికేషన్లు» మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్» 1604 × 720 పిక్సెల్స్‌తో 6.67 అంగుళాల HD+ డిస్ప్లే» 6GB ర్యామ్+ 128GB స్టోరేజ్, 8GB ర్యామ్+ 256GB స్టోరేజ్ వేరియంట్లు» 5100mAh బ్యాటరీ, 45W SUPERVOOC ఛార్జింగ్ ఫీచర్» 32MP మెయిన్, 2MP పోర్ట్రెయిట్, 8MP ఫ్రంట్ కెమెరాధరఇక ధర విషయానికి వస్తే ఈ సరికొత్త ఒప్పో ఫోన్ రూ.13 వేల కంటే తక్కువకే వస్తుంది. 6GB + 128GB వేరియంట్ ధర రూ.12,999 కాగా 8GB + 256GB వేరియంట్ ధర రూ.15,999. అయితే ఇక్కడ డిస్కౌంట్‌తో కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది. బ్యాంక్ ఆఫర్లతో రూ. 1000 వరకు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఈ తగ్గింపును హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ క్రెడిట్, డెబిట్ కార్డ్‌తో పొందవచ్చు. ఫోన్ మొదటి విక్రయం ఆగస్టు 2, మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. ఫ్లిప్‌కార్ట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. -
ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కొత్త సిరీస్ ఫోన్లు వచ్చేశాయి..
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ ఒప్పో రెనో 12 సిరీస్‌ను విడుదల చేసింది. ఈ సిరీస్‌లో ఒప్పో రెనో 12 (Oppo Reno 12), ఒప్పో రెనో 12 ప్రో (Oppo Reno 12 Pro) అనే రెండు స్మార్ట్ఫోన్లను భారతీయ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను ఇష్టపడేవారి కోసం ఒప్పో ఈ రెండు ఫోన్లలో చాలా ఏఐ ఫీచర్లను అందించింది.కంపెనీ ఒప్పో రెనో 12ని 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్‌తో పరిచయం చేసింది. దీని ధర రూ.32,999. ఈ స్మార్ట్‌ఫోన్ విక్రయం జూలై 25 నుంచి భారత్‌లో ప్రారంభమవుతుంది. ఇక ఒప్పో రెనో 12 ప్రో రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 36,999. అలాగే 12GB ర్యామ్, 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 40,999. దీని సేల్ జూలై 18 నుంచి ప్రారంభం కానుంది. ఒప్పో రెనో 12, ఒప్పో రెనో 12 ప్రో కొనుగోలుపై కంపెనీ భారీ తగ్గింపును అందిస్తోంది. రూ. 4000 తక్షణ తగ్గింపుతో సిరీస్ బేస్ వేరియంట్‌ను రూ. 28,999 లకే కొనుగోలు చేయవచ్చు.ఒప్పో రెనో 12 ఫీచర్లు⇒ 6.7-అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే⇒ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్సెట్⇒ ఆండ్రాయిడ్ 14 ఆధారిత కలర్ ఓస్ 14.1⇒ 50 + 8 + 2 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా⇒ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీ⇒ AI క్లియర్ ఫేస్, AI రైటర్, AI ఎరేజర్, AI రికార్డింగ్ సమ్మరీ వంటి ఫీచర్లుఒప్పో రెనో 12 ప్రో ఫీచర్లు⇒ 6.7-అంగుళాల ఫుల్ హోచ్‌డీ ప్లస్ డిస్ప్లే⇒ ఆండ్రాయిడ్ 14 ఆధారిత కలర్ఓస్ 14.1⇒ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ ప్రాసెసర్⇒ AI క్లియర్ ఫేస్, AI రైటర్, AI ఎరేజర్, AI రికార్డింగ్ సమ్మరీ వంటి ఫీచర్లు⇒ 50 + 8 + 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా⇒ 50-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ కెమెరా⇒ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీ -
అదిరిపోయే డిజైన్లతో విడుదల కానున్న ఒప్పో రెనో 11 సిరీస్ ఫోన్లు
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఒప్పో ప్రీమియం స్మార్ట్ ఫోన్ సిరీస్ ఒప్పో రెనో 11 సిరీస్‌ను త్వరలో విడుదల చేయనుంది. జనవరి 11 న ఒప్పో రెనో 11 , ఒప్పో రెనో 11 ప్రోలను మార్కెట్‌కు పరిచయం చేయనుంది. ఇప్పటికే ఒప్పో రెనో 11 సిరీస్ ఫోన్ ఫీచర్లను ఒప్పో రెనో 11 ప్రో స్నాప్ డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్ తో, అలాగే ఒప్పో రెనో 11 మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ప్రాసెసర్ తో అందుబాటులోకి రానుంది. 5జీ సపోర్ట్‌తో 4700 ఎంఏహెచ్ బ్యాటరీ,6.74 ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 12 జీబీ ర్యామ్ ప్లస్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్, 12 జీబీ ర్యామ్ ప్లస్ 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ వస్తుంది. ఫోన్ వెనుకవైపు 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 32 మెగా పిక్సెల్ టెలీఫోటో లెన్స్ తో కూడిన ట్రిపుల్ కెమెరా సెట్ అప్, ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, అండర్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. -
ఒప్పో కొత్త ఫోన్, ప్రారంభ ఆఫర్, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?
Oppo A78 4g: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఒప్పో భారత మార్కెట్లో మరో మొబైల్‌ను లాంచ్ చేసింది. మిడ్ రేంజ్లో ఒప్పో ఏ సిరీస్‌లో 4 జీ స్మార్ట్‌ఫోన్‌ను మంగళవారం భారతదేశంలో విడుదల చేసింది. ఒప్పో ఏ78 4జీ స్మార్ట్‌ఫోన్ పేరుతో తీసుకొచ్చిన ఈ మొబైల్లో 50MP ప్రధాన కెమెరా, భారీ బ్యాటరీ,చార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లను జోడించింది. ఒప్పో ఏ78 మోడల్ 5జీ వెర్షన్ ఎనిమిది నెలల క్రితమే లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. (టికెట్ల ధరలకు ‘రెక్కలు’: ప్రయాణీకులకు ఇక చుక్కలే!) కస్టమర్లు మెయిన్‌లైన్ రిటైల్ అవుట్లెట్ల నుండి గరిష్టంగా 10శాతం (రూ. 1,500) క్యాష్‌బ్యాక్ , SBI కార్డ్, కోటక్ మహీంద్రా బ్యాంక్ , బ్యాంక్ ఆఫ్ బరోడా, వన్ కార్డ్ వంటి ప్రముఖ బ్యాంకుల నుండి 3 నెలల వరకు నో-కాస్ట్ EMI. ఆన్లైన్ స్టోర్ల నుండి రూ. 500 వరకు ఎక్స్ఛేంజ్ + లాయల్టీ బోనస్‌ను పొందవచ్చు. (హార్లే-డేవిడ్సన్ లవర్స్‌కు భారీ షాక్, ఏకంగా పదివేలు!) ధర, ఆఫర్స్ ఒప్పో ఏ78 4జీ 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ ధర రూ.22,999. ప్రారంభ ఆఫర్లో భాగంగా రూ.17,499కే లభిస్తోంది. ఆక్వాగ్రీన్, మిస్ట్ బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. Check out the incredible OPPO A78! 🌟, having exquisite Style with its Diamond matrix design to make you look stylish wherever you go!!#OPPOA78 Know More: https://t.co/j0DeX3xW4Q pic.twitter.com/C313pb2co2 — OPPO India (@OPPOIndia) August 2, 2023 ఒప్పో ఏ78 4జీ ఫోన్ స్పెసిఫికేషన్లు 6.43 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ అమోలెడ్ డిస్ ప్లే 90 హెర్జ్ రీఫ్రెష్ రేటు, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఆండ్రాయిడ్ 13 ఆధారంగా ColorOS 13.1 8 జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజీ మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు పెంచుకోవచ్చు 50 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ పొట్రెయిట్ కెమెరా 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ సూపర్ వూక్ చార్జర్ Check out the incredible OPPO A78! 🌟, having exquisite Style with its Diamond matrix design to make you look stylish wherever you go!!#OPPOA78 Know More: https://t.co/j0DeX3xW4Q pic.twitter.com/C313pb2co2 — OPPO India (@OPPOIndia) August 2, 2023 -
చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు భారీ షాక్! కేంద్రం సీరియస్
GST Evasion: చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు భారత ప్రభుత్వం భారీ షాకిచ్చింది. జీఎస్టీ ఎగవేత ఆరోపణలపై షావోమీ, ఒప్పో, వివో,లెనోవో కంపెనీలపై విచారణ జరుగుతోందని కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆయా కంపెనీలకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని, దర్యాప్తు ప్రారంభించామని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ రాజ్యసభలో తెలిపారు. పన్ను మొత్తం/వడ్డీ/పెనాల్టీని వర్తించే విధంగా జమ చేయాలని ఆదేశించినట్టు కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. షావోమి, రియల్‌మి, ఒప్పో, వివో, వన్‌ప్లస్ లాంటి చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారులు 2023-24 వరకు గత ఐదేళ్లలో రూ. 1,108.98 కోట్ల జీఎస్టీ, రూ. 7,966.09 కోట్ల కస్టమ్ డ్యూటీలను ఎగవేసినట్లు కేంద్రం శుక్రవారం పార్లమెంటుకు తెలిపింది. ఇది 2017-18, 2023-24 మధ్య (జూలై 1 వరకు) డేటా రాజీవ్ చంద్రశేఖర్ రాజ్యసభ ఎంపీ నారాయణ్ దాస్ గుప్తా అడిగిన ప్రశ్నలకు సమాధానంగా తెలిపారు. 2019-20లో, షావెమి రూ. 653.02 కోట్ల కస్టమ్స్ సుంకాన్ని ఎగవేసింది, అందులో కేవలం రూ. 46 లక్షలు మాత్రమే చెల్లించింది. కంపెనీ లోటుపై ప్రభుత్వం షోకాజ్ నోటీసు జారీ చేసిందని చంద్రశేఖర్ తెలిపారు. అదే విధంగా, 2020-21లో, ఒప్పో మొబైల్ ఇండియా రూ. 4,389 కోట్ల కస్టమ్స్ సుంకాన్ని ఎగవేసింది, అందులో రూ. 450 కోట్లు మాత్రమే చెల్లించింది. (లండన్‌లో లగ్జరీ భవనాన్ని దక్కించుకున్న భారత బిలియనీర్) వివో ఇండియా అదే సంవత్సరంలో రూ.2,217 కోట్ల కస్టమ్స్ సుంకాన్ని ఎగవేసింది, అందులో కేవలం రూ.72 కోట్లు మాత్రమే చెల్లించింది. మొత్తంగా వివో ఈ రెండేళ్లలో 2,875 కోట్ల కస్టమ్స్ డ్యూటీలను ఎగవేసినట్లు ఆరోపణలు రాగా, కేవలం రూ. 117 కోట్లను రికవరీ చేసిందని మంత్రి తెలిపారు. జీఎస్టీ పరంగా కంపెనీ రూ.48.25 కోట్లు ఎగవేసిందని, ఎగవేతలో కొంత భాగం ఇంకా ప్రాసెస్‌లో ఉందని మంత్రి చెప్పారు. ఇప్పటి వరకు కంపెనీ నుంచి రూ.51.25 కోట్లను ప్రభుత్వం వసూలు చేసింది. ( జస్ట్ పోజింగ్...ఆనంద్ మహీంద్రా హనీమూన్ పిక్ వైరల్) భారతదేశంలో మోటరోలా బ్రాండ్‌ను కూడా నిర్వహిస్తున్న లెనోవా ఇంకా రికవరీలు నమోదు చేయనప్పటికీ, రూ. 42.36 కోట్ల జీఎస్టీ ఎగవేసిందన్నారు. ప్రధాన చైనీస్ మొబైల్ హ్యాండ్సెట్ బ్రాండ్లు భారతదేశంలో 2022 ఆర్థిక సంవత్సరంలో రూ. 1.5 లక్షల కోట్ల టర్నోవర్‌ను కలిగి ఉన్నాయని, అలాగే నేరుగా 75 వేల మందికి పైగా , అమ్మకాలు ,కార్యకలాపాలలో మరో 80,000 మందికి ఉపాధి కల్పించారని మంత్రి చెప్పారు. -
టాప్ డైరెక్టర్ రాజమౌళి కొత్త అవతార్: హీరోలకు షాకే!?
టాలీవుడ్ జక్కన ఎస్ఎస్ రాజమౌళి బ్రాండ్ అంబాసిడర్‌గా కొత్త అవతార్ మెత్తాడు. తాజాగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్స్ తయారీ సంస్థ ఒప్పో యాడ్ మేకింగ్‌లో అగ్ర దర్శకుడు రాజమౌళి తళుక్కుమన్నాడు. ఈ యాడ్‌కు సంబంధించిన టీజర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు సెలబ్రిటీలు, స్టార్ ఆటగాళ్లు, సినిమా సూపర్ స్టార్లు మాత్రమే పలు బ్రాండ్లకు నటీనటులు, క్రీడాకారులు ఎక్కువగా ఫేమస్ బ్రాండ్లకు ప్రచారకర్తలుగా కనిపించారు. కేవలం తమ వృత్తి ద్వారా మాత్రమే కాకుండా, బ్రాండ్ అంబాసిడర్లుగా భారీగానే ఆర్జించారు. కానీ అంబాసిడర్లుగా సినీ డైరెక్టర్లుగా కనిపించి అరుదు. ఈ లోటును పూడ్చేందుకు మన దర్శకధీరుడు రడీ అయిపోయాడు. (తొలి జీతం 5వేలే...ఇపుడు రిచెస్ట్ యూట్యూబర్‌గా కోట్లు, ఎలా?) ఒప్పో బ్రాండ్ రాజమౌళిని తమ ప్రచారకర్తగా ఎంచుకోవడం విశేషంగా నిలిచింది. ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ సాధించి చరిత్ర సృష్టించిన రాజమౌళికి టాలీవుడ్ మాత్రమే కాదు, మొత్తం సినీ ఇండస్ట్రీలో తనకున్న పాపులారిటీ, క్రేజ్ అలాంటిది మరి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ మూవీలతో ప్యాన్ ఇండియా ఖ్యాతి దక్కించుకున్న రాజమౌళితో ఒప్పో తన అప్‌కమింగ్ ఫోన్ రెనో 10 సిరీస్ వస్తున్న ఫోన్ ఈ యాడ్ చేసినట్టు కనిపిస్తోంది. జూలై 10న ఈ ఫోన్ లాంచ్ కానుంది. రాజమౌళి డ్యుయల్ రోల్లో సూపర్బ్‌గా ఉన్న ఈ క్లిప్ వైరల్‌గా మారింది. హీరోలను మించి స్టైలిష్‌గా, హ్యాండ్సమ్గా డ్యుయల్ రోల్లో కనిపించిన తమ అభిమాన దర్శకుడిని చూసి ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు. (థ్యాంక్స్ టూ యాపిల్ స్మార్ట్ వాచ్, లేదంటే నా ప్రాణాలు: వైరల్ స్టోరీ) కాగా కరియర్ పరంగా గురించి ఆలోచిస్తే..రాజమౌళి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో గ్లోబల్ రేంజ్లో మరో మూవీ తీసేందుకు సన్నద్ధమవుతున్నాడు. యాక్షన్ అడ్వెంచర్‌గా, ఇండియానా జోన్స్ రేంజ్లో ఉండబోతోందని హింట్ కూడా ఇచ్చేసి ఈ మూవీపై ముందునుంచే భారీ హైప్ క్రియేట్ చేశాడు. ఈ సూపర్ కాంబో మూవీ 2025లో రిలీజ్‌కానుందని అంచనా. (వాట్సాప్ యూజర్లకు మరో అదిరిపోయే ఫీచర్: ఒకేసారి 32 మందితో) @ssrajamouli brand new add for Oppo Reno 10 Series.#SSRajamouli #Oppo #HittuCinma pic.twitter.com/WWsNL22idm — Hittu Cinma (@HittuCinma) June 28, 2023 -
త్వరలో విడుదలకానున్న ఒప్పో కొత్త స్మార్ట్‌ఫోన్ ఇదే!
Oppo Reno 10 Series: భారతదేశంలో 5జీ మొబైల్స్ విరివిగా అమ్ముడవుతున్న సమయంలో 'ఒప్పో' (Oppo) సంస్థ తన 'రెనో 10 సిరీస్' (Reno 10 Series) విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఆధునిక ఫీచర్స్‌తో విడుదలకానున్న ఈ మొబైల్ ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ కామర్స్ సైట్లలో కూడా లభించనున్నాయి. ఈ మొబైల్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. ఒప్పో రెనో 10 సిరీస్ స్మార్ట్‌ఫోన్ త్వరలోనే ఇండియన్ మార్కెట్లో విడుదల చేయనున్నట్లు సంస్థ ఇప్పటికే ప్రకటించింది. అంతే కాకుండా ఈ మొబైల్ ఫోన్‌కు సంబంధించిన ఫోటోలను కూడా ట్విటర్ ఖాతా ద్వారా షేర్ చేసింది. ఈ 5జి మొబైల్ గత మే నెల ప్రారంభంలో చైనా మార్కెట్లో మూడు వేరియంట్లలో విడుదలయ్యాయి. అవి ఒప్పొ రెనొ 10, ఒప్పొ రెనొ 10 ప్రో, ఒప్పొ రెనొ 10 ప్రో ప్లస్. (ఇదీ చదవండి: చిన్నారి చేష్టలకు ఆనంద్ మహీంద్రా ఫిదా.. నెట్టింట్లో వైరల్ వీడియో!) కొత్త రెనో 10 సిరీస్ స్మార్ట్‌ఫోన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) కలిగి.. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌తో పాటు క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778 జీ ఆక్టాకోర్ చిప్ సెట్ కలిగి ఉంటుంది. ఇది ఐస్ బ్లూ, సిల్వర్ గ్రే కలర్ ఆప్షన్స్‌లో చైనా మార్కెట్లో లభిస్తోంది. భారతీయ మార్కెట్లో కూడా ఇదే కలర్ ఆప్షన్స్ ఉండవచ్చని భావిస్తున్నాము. ఈ మొబైల్ లాంచ్ డేట్, అధికారిక ధరలను కంపెనీ వెల్లడించలేదు. చైనాలో రెనో 10 సిరీస్ ప్రారంభ ధర 2,499 యువాన్స్. భారతీయ కరెన్సీ ప్రకారం ఇది సుమారు రూ. 29,000 అని తెలుస్తోంది. 10 reasons to get excited. The #OPPOReno10Series5G - coming soon.#ThePortraitExpert pic.twitter.com/AUiIhCxAUQ — OPPO (@oppo) June 27, 2023 -
ఆఫర్ అంటే ఇలా ఉండాలి.. అతి తక్కువ ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్!
Oppo Reno 8 5G: సరసమైన ధరలో బెస్ట్ ఫీచర్స్, 5జీ నెట్‌వర్క్‌కు సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని ఎదురు చూస్తున్నవారికి ఫ్లిప్‌కార్ట్ ఒక అద్భుతమైన ఆఫర్ తీసుకు వచ్చింది. ఈ ఆఫర్ కింద రూ. 38,999 విలువైన 'ఒప్పో రెనొ 8 5జీ' సరసమైన ధరలోనే కొనుగోలు చేయవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. భారతీయ మార్కెట్లో ఒప్పో కంపెనీ విక్రయిస్తున్న అత్యుత్తమ మొబైల్ ఫోన్స్‌లో ఒకటి 'రెనొ 8 5జీ'. ఇది దేశీయ విఫణిలో 2022 జులైలో విడుదలైంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ లేదా 8జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ఆప్షన్స్‌లో లభిస్తుంది. 90 హెర్జ్స్ రిఫ్రెష్ రేటుతో 6.4 ఇంచెస్ అమొలెడ్ డిస్ప్లే కలిగిన ఈ మొబైల్ వెనుకవైపు 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగా పిక్సెల్ మాక్రో కెమెరా, 2 మెగా పిక్సెల్ మోనో క్రోమ్ కెమెరా పొందుతుంది. సెల్ఫీలు లేదా వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 32 మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. బ్యాటరీ కెపాసిటీ 4500 mAh. (ఇదీ చదవండి: జీతగాడి స్థాయి నుంచి స్టార్ హీరోలకు మేనేజర్‌గా.. బిజినెస్‌తో కోట్ల సంపాదన - సాధారణ వ్యక్తి సక్సెస్ స్టోరీ!) అడ్వాన్స్డ్ ఫీచర్స్ కలిగి.. 5జీ నెట్‌వర్క్‌తో లభిస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ మీద ఫ్లిప్‌కార్ట్ రూ. 29,000 వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ అందిస్తుంది. ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ కేవలం మీ ఫోన్ కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది. అయితే దీనిని HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ. 1250 వరకు, కోటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే 10శాతం డిస్కౌంట్ లభిస్తుంది. -
Oppo F23 5G కొత్త ఫీచర్స్ ఇవే
-
ఒప్పో ఎఫ్ 23 5జీ స్మార్ట్‌ఫోన్ లాంచ్, ధర, ఫీచర్లు తెలుసుకోండి!
సాక్షి,ముంబై: స్మార్ట్‌ఫోన్ మేకర్ ఒప్పో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్చేసింది. ఒప్పో ఎఫ్23 పేరుతరు 5జీ మొబైల్‌ను తీసుకొచ్చింది. దీని ప్రారంభ ధర రూ. 24,999గా నిర్ణయించింది కంపెనీ. ఇందులో 64 ఎంపీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. బోల్డ్ గోల్డ్ , కూల్ బ్లాక్ రెండు రంగులలో మే 18 నుంచి ఒప్పో Oppo స్టోర్, అమెజాన్ , మెయిన్‌లైన్ రిటైల్ అవుట్లెట్లలో అందుబాటులో ఉంటుంది. ఒప్పో ఎఫ్23 5జీ స్పెసిఫికేషన్స్ 6.72-అంగుళాల 3D కర్వ్డ్ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ 91.4% స్క్రీన్-టు-బాడీ రేషియో క్వాల్కం స్నాప్‌డ్రాగన్ సాక్ 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ 1 టీబీ వరకు విస్తరించుకునే అవకాశం 64 ఎంపీ ఏఐ కెమెరా 2+2 ఎంపీ రియర్ ట్రిపుల్ కెమెరా 5000mAh బ్యాటరీ 67W SUPERVOOCTM ఫ్లాష్ ఛార్జింగ్ ఇది కేవలం 18 నిమిషాల్లో ఫోన్‌ను 50శాతం వరకు ఛార్జ్, 5 నిమిషాల ఛార్జ్ గరిష్టంగా 6 గంటల ఫోన్ కాల్‌లను లేదా 2.5 గంటల YouTube వీడియోలు చూడొచ్చు. పూర్తిగా ఛార్జ్ చేస్తే, 39 గంటల ఫోన్ కాల్స్ , 16 గంటల యూట్యూబ్ వీడియో లు చూడొచ్చని కంపెనీ వెల్లడించింది. -
భారత్‌లో 5జీ ఫోన్లను తెగ కొనేస్తున్నారు!
న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్ షిప్మెంట్లు (కంపెనీల నుంచి విక్రయదారులకు రవాణా) జనవరి–మార్చి త్రైమాసికంలో అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 16 శాతం తగ్గి 3.1 కోట్ల యూనిట్లుగా ఉన్నాయి. ఈ వివరాలను మార్కెట్ పరిశోధనా సంస్థ ఐడీసీ ప్రకటించింది. గడిచిన నాలుగేళ్లలో మొదటి త్రైమాసికంలో అతి తక్కువ షిప్మెంట్ ఇదేనని ఐడీసీ పేర్కొంది. రియల్మీ, షావోమీ ఫోన్ల షిప్మెంట్లో ఎక్కువ క్షీణత నమోదైంది. ఇవి మార్కెట్ వాటాను కూడా నష్టపోయాయి. 2023లో భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో వృద్ధి ఫ్లాట్‌గా ఉంటుందని ఐడీసీ అంచనా వేసింది. ఇక స్మార్ట్ఫోన్ల రవాణాలో క్షీణత ఉన్నప్పటికీ.. శామ్సంగ్ 20.1 శాతం మార్కెట్ వాటాతో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత 17.7 శాతం వాటాతో వివో ఉంది. ఒప్పో 17.6 శాతం వాటాతో మూడో స్థానంలో ఉంది. అంతేకాదు మార్చి త్రైమాసికంలో షిప్మెంట్ పరంగా వృద్ధిని చూపించిన ఏకైక సంస్థగా ఒప్పో నిలిచింది. షావోమీ షిప్మెంట్ 41.1 శాతం తగ్గి 50 లక్షల యూనిట్లుగా ఉంది. మార్కెట్ వాటా 2022 మొదటి త్రైమాసికంలో 23.4 శాతంగా ఉంటే, అది ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 16.4 శాతానికి తగ్గింది. ఆ తర్వాతి స్థానంలో 9.47 శాతం వాటాతో రియల్మీ ఉంది. 29 లక్షల యూనిట్లను రవాణా చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో రియల్మీ మార్కెట్ వాటా 16.4 శాతంగా ఉండడం గమనార్హం. ‘‘అనిశ్చిత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో వినియోగ డిమాండ్ బలహీనంగా ఉంది. 2022 ద్వితీయ ఆరు నెలల్లో పండుగలకు ముందు విక్రేతలు స్టాక్ పెంచుకోవడంతో, వారి వద్ద నిల్వలు అధికంగా ఉన్నాయి’’అని ఐడీసీ నివేదిక తెలిపింది. ఇక మొత్తం షిప్మెంట్లలో 5జీ స్మార్ట్ఫోన్ల వాటా 45 శాతానికి పెరిగింది. తక్కువ ధరల 5జీ స్మార్ట్ఫోన్ల విక్రయాలే ఎక్కువగా ఉన్నాయి. -
స్మార్ట్‌గా ఫోబియా.. నలుగురు భారతీయుల్లో ముగ్గురికి నోమో ఫోబియా
న్యూఢిల్లీ: స్మార్ట్ ఫోనే మీ ప్రపంచమా ? అది లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నారా ? ఫోన్ కనిపించకపోయినా, బ్యాటరీ అయిపోయినా వెంటనే మీలో టెన్షన్ పెరిగిపోతోందా ? అయితే మీరు ఒక రకమైన ఫోబియాతో బాధపడుతున్నట్టు లెక్క. మీరు ఒక్కరే కాదు భారత్‌లో స్మార్ట్ ఫోన్ వాడుతున్నవారిలో 75 శాతం మందికి ఇదే ఫోబియా పట్టుకుందని ఒప్పొ, కౌంటర్‌పాయింట్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ ఫోబియాని నోమో ఫోబియా అని పిలుస్తారు. అంటే నో మొబైల్ ఫోబియా అని అర్థం. స్మార్ట్ ఫోన్ పని చేయకపోయినా, సిగ్నల్స్ లేకపోయినా, కనిపించకపోయినా, బ్యాటరీ అయిపోయినా విపరీతమైన ఆందోళనకి గురికావడం, ఏదో కోల్పోయినట్టుగా ఉండడం, నిస్సహాయంగా మారిపోవడం, అభద్రతా భావానికి లోనవడం వంటివి దీని లక్షణాలు. భారతీయులు ప్రతీ నలుగురిలో ముగ్గురికి ఈ ఫోబియా ఉందని ఆ అధ్యయనం తేల్చింది. దేశంలోని టైర్ 1, టైర్ 2 నగరాల్లో 1,500 మంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులపై ఒప్పొ ఈ అధ్యయనం నిర్వహించింది. బ్యాటరీ లైఫ్ కోసం స్మార్ట్ ఫోన్లని మార్చే వారు చాలా మంది ఉన్నారని, ఒకరకంగా ఈ సర్వే తమ ఉత్పత్తులకి కూడా కీలకంగా మారిందని ఒప్పొ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ దమయంత్ సింగ్ ఖనోరియా చెప్పారు. ► బ్యాటరీ సరిగా పనిచేయడం లేదని 60% మంది ఏకంగా తమ స్మార్ట్ ఫోన్లు మార్చుకున్నారు ► ఫోన్ దగ్గర లేకపోతే మహిళల్లో 74 శాతం మంది ఆందోళనకు లోనవుతారు. పురుషులు మరింత అధికంగా 82% మంది ఒత్తిడికి లోనవుతారు ► బ్యాటరీ ఎక్కడ అయిపోతుందోనని 92% మంది వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. పవర్ సేవింగ్ మోడ్‌ని వినియోగిస్తున్నారు ► చార్జింగ్‌లో ఉండగా కూడా ఫోన్ వాడే వారు 87% మంది ఉన్నారు ► వినోద కార్యక్రమాలు చూడడానికే 42% స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తున్నారు. అందులో సోషల్ మీడియాదే అగ్రస్థానం. ► స్మార్ట్ ఫోన్ మన జీవితాలు మార్చేసిందనడంలో ఎలాంటి సందేహం లేకపోయినప్పటికీ దాని వల్ల ఏర్పడుతున్న దుష్ప్రభావాల నుంచి బయట పడడానికి అందరూ ప్రయత్నించాలని నిపుణులు సూచిస్తున్నారు. -
విడుదల కానున్న ఒప్పో ఎఫ్ 23 ప్రో 5జీ.. ఫోన్ ధర ఎంతంటే?
స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో భారత మార్కెట్లో ఒప్పో ఎఫ్ 23 ప్రో 5జీ ఫోన్‌ను లాంచ్ చేయనున్నది. గత ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేసిన ఒప్పో ఎఫ్ 21 ప్రో 5జీ ఫోన్‌కి కొనసాగింపుగా ఈ ఫోన్‌ను మార్కెట్‌కు పరిచయం చేయనున్నట్లు సమాచారం. ఇక ఈ ఫోన్లో 6.4 అంగుళాల హెచ్డీ ప్లస్ అమోలెడ్ డిస్ప్లే, ఆండ్రాయిడ్ 12-బేస్డ్ కలర్ ఓఎస్ 12 యూఐ వర్షన్‌తో పని చేస్తుంది. క్వాల్క్మ్ స్నాప్ డ్రాగన్ 695 ఎస్ఓఎస్, 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ యూనిట్స్‌తో మిడ్ రేంజ్లో ఉండనుంది. ధర ఎంతంటే పలు నివేదికల ప్రకారం.. ఒప్పో ఎఫ్ 23 ప్రో 5జీ ఫోన్ మే 15న భారత్‌లో లాంచ్ కానుంది. ఈ ఫోన్ ధర రూ.25 వేల నుంచి రూ.26వేల మధ్యలో ఉండనుంది. హ్యాండ్సెట్ స్టోరేజీ, కలర్ వేరియంట్ వంటి వివరాలు తెలియాల్సి ఉంది. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే ఒప్పో ఎఫ్ 23 ప్రో 5జీ, 580 నిట్ల బ్రైట్నెస్, 6.72 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లేను కలిగి ఉంటుందని నివేదిక పేర్కొంది. వన్ ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 ఎస్‌ఓఎస్‌తో వచ్చిన చిప్సెట్తో రానుంది. ట్రిపుల్ రేర్ కెమెరా, 64 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్, రెండు 2 మెగా పిక్సెల్ సెన్సార్లు, 40 ఎక్స్ మైక్రోస్కోప్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో రికార్డింగ్ కోసం ఫ్రంట్‌లో 32 మెగా పిక్సెల్ సెన్సార్‌తో రానున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. చదవండి👉 ‘వావ్’ కొత్త ఫోన్ అదిరింది.. ధర ఎంతంటే? -
ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్ వచ్చేసింది! భారీ డిస్కౌంట్ కూడా
సాక్షి,ముంబై: ఒప్పో తన ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను ఎ ట్టకేలకు భారత మార్కెట్లో లాంచ్ చేసింది. పలు ప్రపంచ మార్కెట్లలో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను సోమవారం ఆవిష్కరించింది. మరీ ముఖ్యంగా రూ. 10వేల తగ్గింపుతో ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్‌ను అందుబాటులోకి తీసుకురావడం విశేషం. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్4 కంటే బిగ్ డిస్ప్లేతో దీన్ని తీసుకొచ్చింది. అంతేకాదు 3.26 అంగుళాల అతిపెద్ద వెర్టికల్ కవర్ స్క్రీన్ డిస్ప్లే ఎపుడూ ఆన్‌లోనే ఉంటుందట. ఇండియాలో దీని ప్రారంభ ధర రూ. 89,999గా ఉంనుంది. అయితే క్యాష్‌బ్యాక్‌లు ,ఇతర ప్రోత్సాహకాల ద్వారా కస్టమర్లు దీన్ని రూ. 79,999 కంటే తక్కువకే సొంతం చేసుకోవచ్చు. (ఇంటింటికి వెళ్లి కత్తులమ్మి..ఇపుడు కోట్లు సంపాదిస్తున్న అందాల భామ) ఒప్పో స్టోర్లు, ఫ్లిప్‌కార్ట్ ,మెయిన్‌లైన్ రిటైల్ అవుట్‌లెట్స్‌లో మార్చి 17, మధ్యాహ్నం 12 గంటల నుంచి కొనుగోళ్లకు అందుబాటులో ఉంటుంది. హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ కార్డ్‌లు, కోటక్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, హెచ్‌డీబి ఫైనాన్షియల్ సర్వీసెస్, వన్ కార్డ్ , అమెక్స్పై కస్టమర్లు రూ. 5000 వరకు క్యాష్‌బ్యాక్, 9 నెలల వరకు నో-కాస్ట్ EMIని ఆస్వాదించవచ్చు. అలాగే ఒప్పో కస్టమర్లు రూ. 5000 వరకు ఎక్స్ఛేంజ్ + లాయల్టీ బోనస్‌ను పొందవచ్చు. ఇంకా ఎక్స్ఛేంజ్ ఆఫర్ మరో రూ. 2000 వరకు తగ్గింపు లభ్యం. ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్ ఫీచర్లు 6.8-అంగుళాల e6 ఫోల్డింగ్ డిస్ప్లే 4nm MediaTek డైమెన్సిటీ 9000+ చిప్సెట్ ColorOS 13 ఆండ్రాయిడ్ 13 16జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ 50+ 8(ఫిక్స్డ్-ఫోకస్ అల్ట్రావైడ్ షూటర్) ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా 32ఎంపీ ఆటో ఫోకస్ సెల్ఫీ కెమెరా 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 4,300mAh బ్యాటరీ -
ఒప్పో రెనో 8టీ 5జీ స్మార్ట్‌ఫోన్ వచ్చేసిందిగా! ధర ఎంత?
సాక్షి, ముంబై: ఒప్పో రెనో 8టీ 5జీ స్మార్ట్‌ఫోన్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయింది. రెనో 8 సిరీస్‌లో శుక్రవారం దీన్ని తీసుకొచ్చింది. 120Hz 3D Curved Screen, 108 ఎంపీ పోర్ట్రయిట్ భారీ కెమెరా, బిలియన్ కలర్స్ డిస్ప్లే ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. 45 నిమిషాలలోపు ఫోన్‌ను పూర్తిగా ఛార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంది. ఫిబ్రవరి 10నుంచి ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. ఒప్పో రెనో 8టీ 5జీ స్పెసిఫికేషన్స్ 6.7 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ స్నాప్‌డ్రాగన్ 695 5G SoC 108+2+2 ఎంపీ రియర్ ట్రిపుల్ కెమెరా 32 ఎంపీ సెల్ఫీ కెమెరా 8 జీబీర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 4,800mAh బ్యాటరీ, 67W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ధర రూ. 29,999 -
ఓప్పో 5జీ స్మార్ట్‌ఫోన్ : ధర రూ. 20వేల లోపు
సాక్షి, ముంబై: ఒప్పో మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. అదీ రూ.20వేల లోపు ధరతో ఒప్పో ఏ78 ని తీసుకొచ్చింది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌తో సింగిల్ వేరియంట్లోనే తీసుకొచ్చిన ఒప్పో ఏ78 జనవరి 18నుంచి కొనుగోలుకు లభ్యం. 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో లాంచ్ చేసిన ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ ఫస్ట్ సేల్ సందర్భంగా కార్డ్ ఆఫర్ కూడా అందిస్తోంది. ధర, లభ్యత ఒప్పో ఏ78 5జీ ధర రూ.18,999గా నిర్ణయించిందికంపెనీ. సింగిల్ వేరియంట్లో (8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్) గ్లోయింగ్ బ్లాక్, గ్లోయింగ్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ-కామర్స్ సైట్ అమెజాన్, ఒప్పో ఈ-స్టోర్‌తో పాటు ఆఫ్‌లైన్ స్టోర్లలోనూ ఈనెల 18వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఒప్పో ఏ78 5జీ సేల్ షురూ అవుతుంది. ప్రీ-బుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయి. ఎస్బీఐ (SBI) క్రెడిట్, డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే 10 శాతం వరకు గరిష్ఠంగా రూ.1,300 అదనపు తగ్గింపును పొందవచ్చు. అలాగే నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది. ఒప్పో ఏ78 5జీ పూర్తి స్పెసిఫికేషన్స్ 6.56 ఇంచుల ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే మీడియాటెక్ డైమన్సిటీ 700 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 13 (Android 13) బేస్డ్ కలర్ఓఎస్ 13 50+ 2 ఎంపీ రియర్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 5000mAh బ్యాటరీ , 33 వాట్స్‌ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ -
5జీ, ఇతర స్మార్ట్ఫోన్లపై అమెజాన్‌లో అదిరిపోయే ఆఫర్లు
సాక్షి,ముంబై: ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ‘స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ డేస్’ పేరుతో డిస్కౌంట్ సేల్కు తెర తీసింది. డిసెంబర్ 10 నుంచి 14 వరకు ఐదు రోజుల పాటు స్మార్ట్‌ఫోన్స్ పై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందించనుంది. ముఖ్యంగా కొన్ని 5జీ మోడల్స్‌తోపాటు, వన్‌ప్లస్ 10 ప్రొ, ఐఫోన్ 14, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 సహా అనేక స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్లను అందిస్తుంది. హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసినవారికి 10శాతం తక్షణ డిస్కౌంట్ లభ్యం. కనిష్టంగా రూ. 5,000 కొనుగోలు చేసిన వినియోగదారులు రూ. 1,000 వరకు (పది శాతం) తగ్గింపు పొందవచ్చు. ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగ దారులు కనీసం రూ. 1,250 వరకు పది శాతం తగ్గింపును పొందవచ్చు. అమెజాన్ ఆఫర్లు శాంసంగ్ గెలాక్సీ ఎం13 స్మార్ట్ ఫోన్ రూ. 9,699కి లభ్యం. ఐక్యూ జీ6 లైట్ 13,999 కి లభిస్తుంది. రెడ్మీ ఏ1 డిస్కౌంట్ అనంతరం రూ. 6,119 కి లభిస్తుంది.రెడ్మీ 11ప్రైమ్ 5జీ రూ. 11,999, రెడ్ మీ నోట్ 11 రూ. 10,999లకు కొనుగోలు చేయ వచ్చు. ఒప్పో ఎఫ్ 21ఎస్ ప్రొ 5జీ: ఒప్పో ఎఫ్21ఎస్ ప్రొ 5జీ రూ. 24,499కి అందుబాటులో ఉంది. ఎక్స్ఛేంజ్ఆఫర్గా అదనంగా రూ. 3,000 తగ్గింపును కూడా పొందవచ్చు. ఇంకా ఒప్పో ఏ సిరీస్‌లో, ఒప్పో ఏ76, ఏ77 వరుసగా రూ. 15,490. రూ. 16,999కి అందుబాటులో ఉన్నాయి. లావా: ఇక స్వదేశీ బ్రాండ్, లవా బ్లేజ్ NXTని రూ.8,369కి సొంతం చేసుకోవచ్చు. అలాగే లావా జెడ్3 రూ.6,299కే లభ్యం. టెక్నో టెక్నో పాప్ 6 ప్రో రూ.5,579కి, టెక్నో స్పార్క్ 9 రూ.7,649కి అందుబాటులో ఉంటాయి. అలాగే ఇటీవల తీసుకొచ్చిన పోవా 5జీ , టెక్నోకేమాన్ 19 మాండ్రియన్ వరుసగా రూ. 14,299 ,రూ. 16,999కి అందుబాటులో ఉంటాయి. -
ఒప్పో ఏ58 5జీస్మార్ట్ఫోన్లాంచ్: సూపర్ ఫీచర్లు, ధర తక్కువ
న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్ తయారీదారు ఒప్పో లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ను తాజాగా విడుదల చేసింది. గత కొన్ని రోజులుగా వస్తున్న లీక్‌ల తరువాత ఎట్టకేటలకు ఒప్పో ఏ58 5జీ స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో అధికారికంగా లాంచ్ చేసింది. ధర, లభ్యత ఏ సిరీస్‌లో తీసుకొచ్చిన ఒప్పో ఏ58 5జీ 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్(ఏకైక) ధరను 234 డాలర్లు (రూ. 19,123)గా నిర్ణయించింది. ట్రాంక్విల్ సీ బ్లూ, స్టార్ బ్లాక్ బ్రీజ్ పర్పుల్ రంగుల్లో దీన్ని లాంచ్ చేసింది. ప్రీ-ఆర్డర్‌కు నేటి (నవంబరు 8) నుంచి అందుబాటులో ఉంచగా, నవంబరు 10నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉండనుంది. ముందుగా కొనుగోలు చేస్తే వినియోగదారులు ఒప్పో వైర్డ్ ఇయర్ఫోన్లను ఉచితంగా అందిస్తోంది. అయితే ఇండియాలో ఎపుడు లాంచ్ చేసేదీ వివరాలు అందుబాటులో లేవు. ఒప్పో ఏ58 5జీ స్పెసిఫికేషన్స్ 6.56 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే 1612 x 720 పిక్సెల్ పిక్సెల్స్ రిజల్యూషన్ MediaTek డైమెన్సిటీ 700 SoC డ్యూయల్-కెమెరా (50ఎంపీ ప్రైమరీ కెమరా + 2 ఎంపీ డెప్త్ సెన్సార్) 8ఎంపీ సెల్ఫీ కెమెరా 5000mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ -
ఒప్పో రెనో 8 5జీ స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు
సాక్షి,ముంబై: ఒప్పో రెనో రెనో 8 5జీ స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు లభిస్తోంది. ఆన్లైన్ రీటైలర్లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లలో డిస్కౌంట్ ధరల్లో అందుబాటులో ఉంది. ఒప్పో రెనో సిరీస్‌లో భాగంగా రెనో 8 5జీ, రెనో 8 ప్రొ 5జీ వేయింట్లను లాంచ్ చేసింది. తాజాగా రెనో 8 5జీ స్టాండర్డ్ వేరియంట్ పై అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లో భారీ డిస్కౌంట్ లభ్యం. అమెజాన్ డిస్కౌంట్: ఒప్పో రెనో 8 5జీ 8 జీబీ ర్యామ్ , 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఇప్పుడు అమెజాన్‌లో రూ. 28,180కి లభిస్తోంది. దీని అసలు ధర రూ. 38,999. దీంతోపాటు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా మరో వెయ్యి రూపాయలు తగ్గింపు. ఫెడరల్ బ్యాంక్ లేదా RBL బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించడంపై 750, ఈఎంఐ లావాదేవీలను ఎంచుకుంటే మరో వెయ్యి రూపాయల తగ్గింపు లభ్యం. గరిష్టంగా రూ 14,050 వరకు తగ్గింపు లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ : రెనో 8 5G రూ 29,999కే కొనుగోలు చేయవచ్చు. దీంతో పాటు అన్ని ప్రముఖ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ కొనుగోళ్లపై అక్టోబర్ 31 వరకు రూ. 2,500 తగ్గింపు లభిస్తుంది. సిటీ బ్యాంక్ వినియోగదారులు ఈఎంఐయేతర లావాదేవీలను ఎంచుకుంటే 1,500 క్రెడిట్ కార్డ్ ఈఎంఐ అయితే 2 వేలు తగ్గుతుంది. ఇంకా యాక్సిస్ బ్యాంక్ కార్డ్ కొనుగోలుపై 5శాతం డిస్కౌంట్. అలాగే ఎక్స్ఛేంజ్ ఆఫర్‌గా రూ. 21వేల వరకు తగ్గింపును కూడా అందుబాటులో ఉంది. -
‘భారత్‌కు గుడ్ బై’, దేశం నుంచి తరలి వెళ్లిపోతున్న చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలు!
భారత్‌లో కార్యకలాపాల నుంచి వైదొలగుతున్న విదేశీ సంస్థల జాబితా పెరిగిపోతుంది. మార్కెట్లో దేశీయ కంపెనీలతో పోటీ పడలేక, ఇక్కడి చట్టాల్ని యేథేచ్ఛగా ఉల్లంఘించినా ఏం కాదులే అనే ధీమా తగ్గడంతో దేశీయ మార్కెట్‌కు గుడ్ బై చెబుతున్నాయి. తమ వ్యాపార నిర్వహణకు అనువైన దేశాల వైపు మొగ్గు చూపుతున్నాయి. చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు భారత్‌లో తన కార్యకలాపాల్ని నిలిపివేయనున్నట్లు తెలుస్తోంది. భారత్‌కు గుడ్‌బై చెప్పి ఇండోనేషియా, బంగ్లాదేశ్, నైజీరియాలలో తయారీ యూనిట్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ కథనాల్ని ప్రచురించింది. మేడిన్ ఇండియా ‘భారత్ దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థల్ని ప్రోత్సహించేందుకు మా పట్ల (చైనా కంపెనీలు) కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఈ తరహా ధోరణి స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలపై ఎక్కువగా ఉంది’ అంటూ భారత్‌లో చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలకు చెందిన ప్రతినిధులు చెప్పారంటూ గ్లోబల్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది.అందుకే ఆ ఒత్తిడి తట్టుకోలేక ఒప్పో ఈజిప్ట్‌లో మ్యానిప్యాక్చరింగ్ యూనిట్‌ను ప్రారంభించనుంది. ఈజిప్ట్‌లో ఒప్పో చైనా సంస్థ ఒప్పో ఈజిప్ట్‌లో మ్యానిప్యాక్చరింగ్ యూనిట్‌ను ప్రారంభించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఫోన్ల తయారీ ప్లాంటు కోసం సుమారు 20 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టింది. తద్వారా రానున్న సంవత్సరాల్లో సుమారు 900 ఉద్యోగాల రూప కల్పన జరనున్నట్లు ఈజిప్ట్ ప్రభుత్వ ప్రతినిధులు తెలిపారు. చదవండి👉 బంపరాఫర్ ..ఏకంగా 80 శాతం డిస్కౌంట్! పన్ను ఎగొట్టి 2021 డిసెంబర్ నెలలో ఆదాయపు పన్ను ఎగవేతకు పాల్పడి చైనాలో తన పేరెంట్ కంపెనీలకు అక్రమంగా నిధుల్ని మళ్లించిందనే ఆరోపణలతో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు చైనా స్మార్ట్‌ఫోన్ సంస్థ షావోమీతో పాటు ఇతర చైనా సంస్థల్ని విచారించారు. ఆ విచారణ కొనసాగుతుండగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈడీ అధికారులు షావోమీ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ మనుకుమార్ జైన్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఆ తర్వాత ఒప్పో, వివో, షావోమీతో పాటు ఇతర కంపెనీలు మనీ ల్యాండరింగ్ (Prevention of Money Laundering Act (PMLA) యాక్ట్‌ను ఉల్లంఘిస్తున్నాయనే ఆరోపణలతో 2022 జులైలో ఈడీ అధికారులు చైనా సంస్థ వివో తో పాటు ఇతర సంస్థలకు చెందిన ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్, మేఘాలయా, మహరాష్ట్ర, మధ్యప్రదేశ్.. ఇలా మొత్తం 44 ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. వేల కోట్లు ఆ సమయంలో వివో మోసాలను ఈడీ బయటపెట్టింది. వివో కంపెనీ భారత్‌లో పన్నులు ఎగొట్టి టర్నోవర్‌లో దాదాపు 50శాతం నిధులను చైనాకు తరలించిందని, ఆ మొత్తం 2017 నుంచి 2021 మధ్య కాలంలో మొత్తం రూ.62,476కోట్లు ఉందని వెల్లడించింది.వివో పన్నుల ఎగవేత ప్రకంపనలు కొనసాగుతుండగానే.. ఒప్పో కూడా పన్నులు ఎగ్గొట్టినట్లు బయటపడింది. ఒప్పో సంస్థ రూ. 4389 కోట్ల వరకు కస్టమ్ డ్యూటీ ఎగవేసింది. వస్తువుల విలువను తక్కవ చేసి చూపించడం ద్వారా పన్ను ఎగవేతకు పాల్పడింది. మరో కంపెనీ షావోమి కూడా రూ. 653 కోట్లు ఎగవేతకు పాల్పడింది. ఈ మూడు సంస్థలకు ఈడీ ఇప్పటికే నోటీసులు జారీ చేయగా.. ఈ తరుణంలో భారత్‌కు చైనా కంపెనీలు గుడ్ బై చెప్పడం ఆసక్తికరంగా మారింది. చదవండి👉 మీ స్మార్ట్ ఫోన్ 5జీ నెట్ వర్క్‌కు సపోర్ట్ చేస్తుందా? లేదో? ఇలా చెక్ చేసుకోండి! -
ఒప్పో 50 ఇంచెస్ స్మార్ట్ టీవీ వచ్చేసింది.. రూ.15వేలకే మైండ్ బ్లోయింగ్ ఫీచర్లు!
దేశంలో పండుగల సీజన్ మొదలైంది. దీంతో వినియోగదారుల సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకునేందుకు దిగ్గజ సంస్థలు పోటీ పడుతుంటాయి. ముఖ్యంగా ఈ సీజన్లో హెవీ మార్కెట్ కాంపిటీషన్‌ను తట్టుకొని నిలబడేందుకు ఎలక్ట్రానిక్ కంపెనీలు ప్రొడక్ట్‌లపై భారీ ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. ఈ నేపథ్యంలో 17శాతం షేర్‌తో ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్‌ను శాసిస్తున్న ఒప్పో అదిరిపోయే టీవీ మార్కెట్లో విడుదల చేసింది. తక్కువ ధరకే బిగ్ స్క్రీన్ టీవీ కొనాలనుకునేవారికి 'ఒప్పో' 50 ఇంచెస్ స్మార్ట్ టీవీ బాగా ఉపయోగపడుతుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక ఆ టీవీలో ఉన్న ఫీచర్స్, వాటి పనితీరు ఎలా ఉందో చూద్దాం. ధర తక్కువ, ఫీచర్లు ఎక్కువ ఒప్పో గతంలో 65 అంగుళాల స్మార్ట్ టీవీని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సారి తాజాగా 50 ఇంచెస్ స్మార్ట్ టీవీని కొనుగోలు దారులకు పరిచయం చేసింది. OPPO K9x పేరుతో ఉన్న ఈ స్మార్ట్ టీవీని చైనాలో విడుదల చేసింది. దీని ధర 1399 యువాన్ (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.16,500)గా ఉంది. లాంచ్ ఆఫర్ కింద 1299 యువాన్లకు (భారత కరెన్సీలో సుమారు రూ. 15,350) అందుబాటులోకి ఉంచింది. త్వరలో భారత్ మార్కెట్లో అందుబాటులోకి రానుంది. దేశీయ మార్కెట్లో దాని ధర ఎంత ఉంటుందనేది ఆ సంస్థ వెల్లడించాల్సి ఉంది. ప్రస్తుతం ఈ టీవిని కొనాలంటే తమ అధికారిక వెబ్ సైట్‌ను విజిట్ చేయాల్సి ఉంటుందని ఒప్పో ప్రతినిధులు వెల్లడించారు. అదిరే ఫీచర్లు ► కొత్త ఒప్పో K9x 50 ఇంచెస్ స్మార్ట్ టీవీ మనల్ని ఆకట్టుకునే ఫీచర్లతో వస్తుంది. ►కంపెనీ సొంతంగా అభివృద్ధి చేసిన AI PQ అల్గారిథమ్ ►ఈ స్మార్ట్ టీవీ గరిష్ట బ్రైట్ నెస్ 280 నిట్లు ►ఇందులో 2GB RAM, 16GB ROM ►క్వాడ్-కోర్ MediaTek చిప్సెట్, 20W పవర్ రేటింగ్‌తో రెండు ఇంటిగ్రేటెడ్ స్పీకర్లు ► మూడు HDMI పోర్ట్‌లు, ఒక ఈథర్నెట్ పోర్ట్ ►వైర్లెస్ కనెక్షన్ కోసం డ్యూయల్-బ్యాండ్ Wi-Fiకి మద్దతు ► ఎల్ఈడీ-బ్యాక్లిట్ ప్యానెల్‌తో 50 అంగుళాల స్క్రీన్, పూర్తి 4K రిజల్యూషన్‌తో అదిరిపోయే లుక్. కళ్ళపై ఒత్తిడిని తగ్గించడానికి 10.7 బిలియన్ రంగులుతో పాటు బ్లూ-లైట్ తగ్గించే టెక్నాలజీ, ఫ్లాగ్షిప్ స్మార్ట్ టీవీ తరహాలో బాల్‌పార్క్‌లో డిస్ప్లే-స్థాయి రంగు ఖచ్చితత్వాన్ని కలిగి ఉంది. ఇది ఇమేజ్ నాణ్యతను ఫ్రేమ్-బై-ఫ్రేమ్ మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. చదవండి: Mahendra Singh Dhoni: కొత్త అవతారమెత్తిన ధోని.. షాక్‌లో నెటిజన్స్! -
చైనాకు ఝలక్.. ఆ మొబైల్ కంపెనీలకు నోటీసులు
న్యూఢిల్లీ: గత రెండు సంవత్సరాలకు చైనాకు కవ్వింపు చర్యలను తిప్పి కొట్టడంతో పాటు డ్రాగన్ కంట్రీకి సంబంధించిన ప్రతీ విషయంలో భారత్ దూకుడుగా వ్యవహరిస్తుంది. అటు సరిహద్దుల్లో మాత్రమే కాదు వ్యాపారం పరంగా కూడా ఆచితూచి వ్యవహరిస్తూ అదును చూసి చెక్ పెడుతోంది. ఈ క్రమంలోనే చైనాకు సంబంధించిన పలు యాప్‌లను నిషేధిస్తూ గతంలో కేంద్రం నిర్ణయం తీసుకుంది. తాజాగా చైనాకు చెందిన మూడు మొబైల్ కంపెనీలు పన్ను ఎగవేతకు పాల్పడిన కేసులను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ విషయాన్ని ప్రస్తుతం పరిశీలిస్తోందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆ కంపెనీలకు నోటీసులు ఇచ్చామని కూడా ఆర్థిక మంత్రి రాజ్యసభకు తెలిపారు. ఒపో, షావోమీ, వివో ఇండియాలు ఇందులో ఉన్నట్లు ఆమె వెల్లడించారు. ఒపో విషయంలో రూ.2,981 కోట్ల పన్ను ఎగవేతలు జరిగినట్లు భావిస్తున్నామన్నారు. షావోమీ విషయంలో చెల్లించాల్సిన మొత్తం రూ.653 కోట్లు ఉంటుదని అంచనా అన్నారు. ఇక వివో ఇండియాకు రూ.2,217 కోట్ల డిమాండ్ నోటీసు ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ వివాదాలకు సంబంధించి షావోమీ రూ.46 లక్షలు డిపాజిట్ చేస్తే, వివో ఇండియా రూ.60 కోట్లు డిపాజిట్ చేసినట్లు తెలిపారు. చదవండి: Indian Railways: రైలులో ప్రయాణం.. ఒక రూపాయి ఖర్చు లేకుండా ఈ సేవలు ఉచితం! -
ఒప్పో, వన్‌ప్లస్‌కు భారీ షాక్.. ఇకపై ఆ కంపెనీ ఫోన్లు బ్యాన్!
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలైన ఒప్పో,వన్‌ప్లస్‌కి జర్మనీ కోర్టు భారీ షాక్ ఇచ్చింది. పేటెంటెడ్ టెక్నాలజీకి సంబంధించి నోకియా ఈ రెండు కంపెనీలపై జర్మనీలోని మాన్హీమ్ కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. విచారణ జరిపిన అనంతరం కోర్టు నోకియా సంస్థకు అనుకూలంగా తీర్పునిస్తూ ఆ దేశంలో ఒప్పో, వన్‌ప్లస్ ఫోన్లను బ్యాన్ చేయాలని తీర్పునిచ్చింది. ఏంటి ఆ వివాదం.. వివరాల్లోకి వెళితే.. నోకియా సంస్థ 5జీ నెట్‌వర్క్‌లోని పలు టెక్నాలజీలపై పేటెంట్ కలిగి ఉంది. అందులోని ఓ టెక్నాలజీని నోకియా అనుమతులు లేకుండానే ఒప్పో, వన్‌ప్లస్‌లు ఉపయోగించాయి. ఓ వార్తా సంస్థ ప్రకారం.. 4G (LTE), 5G టెక్నాలజీలోని పేటెంట్లపై నోకియా, ఒప్పో, వన్‌ప్లస్‌ల మధ్య జరిగిన చర్చల విఫలం కావడంతో వారిపై న్యాయపరమైన చర్యలకు నోకియా సిద్ధమైంది. అనంతరం పలు దేశాలలో ఆ కంపెనీలపై కోర్టులో దావా కూడా వేసింది. అయితే ఈ వివాదానికి సంబంధించి ప్రస్తుతం జర్మనీ కోర్టు ఇచ్చిన తీర్పు మొదటిది. నోకియా మూడు ప్రాంతీయ జర్మన్ కోర్టులలో తొమ్మిది స్టాండర్డ్ ఎసెన్షియల్ పేటెంట్లు (SEP), ఐదు ఇంప్లిమెంటేషన్ పేటెంట్ల విషయంలో ఒప్పోపై దావా వేసింది. సుమారు $130.3 బిలియన్ల భారీ పెట్టుబడులతో 5G స్టాండర్డ్ ఎసెన్షియల్ పేటెంట్లు(SEP) విభాగంలో నోకియా నాయకత్వం వహిస్తోంది. అంతేకాదు, ఈ రంగంలో అనేక పేటెంట్లను నోకియా సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ వివాదానికి కారణం నోకియా యూరోపియన్ పేటెంట్ EP 17 04 731 ఉల్లంఘించినందుకు ఒప్పో, వన్‌ప్లస్ కంపెనీలపై దావా వేసింది. అయితే ఈ తీర్పుపై ఒప్పో, వన్‌ప్లస్‌లు ఎలా ముందుకు వెళ్లనున్నాయో చూడాలి. చదవండి: మీకు నచ్చితే నాదే: ఆనంద్ మహీంద్రకు నెటిజన్లు ఫిదా! -
ఒప్పో సూపర్ 5జీ ఫోన్ లాంచ్, వివరాలు ఇలా ..
సాక్షి, ముంబై: ప్రముఖ మొబైల్ తయారీదారు ఒప్పో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో ‘ఒప్పో కే 10 5జీ’ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. వర్చువల్ ఈవెంట్ ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఒప్పో కే10 5జీ ఫీచర్లు 6.56 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే ఆండ్రాయిడ్12 MediaTek డైమెన్సిటీ 810 సాక్ చిక్ 8జీబీ ర్యామ్ 128 జీబీ ఇంటర్నల్ మెమొరీ 48+2 ఎంపీ రియర్ డ్యూయల్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీకెమెరా 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఇంకాసైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు , 5జీబీ వరకు డైనమిక్ RAM విస్తరణ, సెల్ఫీ కెమెరాతో ఫేస్ అన్‌లాక్ మెకానిజం లాంటి ఇతర ఫీచర్లు ఈ స్మార్ట్‌ఫోన్‌లో పొందుపర్చింది. ఒప్పో కే10 5జీ ధర: ఇండియాలో ప్రస్తుతం ఒక వేరియంట్లో మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఓషన్ బ్లూ , మిడ్నూట్ బ్లాక్ రెండు రంగుల్లో లభ్యం. దీని ధరను రూ. 17,499 గా నిర్ణయించింది. బ్యాంకు ఆఫర్స్: ఎస్బీఐ యాక్సిస్ బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డ్‌లతో బ్యాంక్ ఆఫర్లు కూడా అందిస్తోంది. వినియోగదారులు రూ. 1500 ఫ్లాట్ తగ్గింపును పొందవచ్చు. జూన్ 15, 2022 12 గంటలనుంచి ఫ్లిప్‌కార్ట్, ఒప్పో ఆన్లైన్ స్టోర్‌లో అందుబాటులో ఉంటుంది. Sleek style, fine features, and quick as light! The #OPPOK105G is here to raise the bar and give you the best experience a smartphone can. Sale starts from 15th June, 12PM on @Flipkart.#LiveWithoutLimits #Stylish5GPerformer Get notified: https://t.co/UEVFLOIg7G pic.twitter.com/rb4Y1MQUTT — OPPO India (@OPPOIndia) June 8, 2022 -
జూన్‌లో స్మార్ట్ ఫోన్ల పండుగ, అదిరిపోయే ఫీచర్లతో 9 ఫోన్లు రిలీజ్!
దేశ వ్యాప్తంగా పెళ్లిళ్లు భారీ ఎత్తున జరుగుతున్నాయి. రెండేళ్ల నుంచి నామ మాత్రంగా జరిగినా ఈ ఏడాది వైరస్ ఉపశమనంతో పెళ్లికి అనుబంధంగా ఉన్న అన్నీ వ్యాపారాలు జోరుగా కొనసాగుతున్నాయి.పెళ్లి సీజన్లో బట్టలు, బంగారంతో పాటు కొనుగోలు దారులు ఎక్కువగా కొనే స్మార్ట్ ఫోన్ సేల్స్ సైతం విపరీతంగా జరుగుతుంటాయి. అందుకే జూన్‌లో దిగ్గజ స్మార్ట్ ఫోన్ సంస్థలైన ఒప్పో, వన్ ప్లస్, పోకో, రియల్ మీ, షావోమీ'లు ఫోన్లను విడుదల చేసేందుకు సిద్ధమయ్యాయి. అయితే ఇప్పుడు మనం ఏప్రిల్ నెలలో విడుదలయ్యే స్మార్ట్ ఫోన్ల గురించి తెలుసుకుందాం. 1.రియల్మీ చైనా స్మార్మ్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ జూన్ 7న స్నాప్ డ్రాగన్ 870 చిప్ సెట్‌తో రియల్ మీ జీటీ నియో 3టీ స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేయనుంది. 2.పోకో షావోమీ సబ్సిడరీ పోకో సంస్థ స్నాప్ డ్రాగన్ 8జనరేషన్ 1చిప్సెట్తో పోకో ఎఫ్4 జీటీ స్మార్ట్ ఫోన్‌ను జూన్ 15 తర్వాత విడుదల చేయనుంది 3.వన్ ప్లస్ మరో చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వన్ ప్లస్ 90హెచ్ జెడ్ ఆమోలెడ్ డిస్ప్లే, 80 ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వన్ ప్లస్ నార్డ్ 2టీని జూన్ నెలలో విడుదల చేయనుంది. 4.ఒప్పో ఒప్పో రెనో 8 సిరీస్ ఫోన్లు సైతం ఇదే నెలలో విడుదల కానున్నాయి. 5.షావోమీ స్నాప్ డ్రాగన్ 870 చిప్ సెట్‌తో షావోమీ 12ఎక్స్ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ సైతం జూన్ 15 తేదీ లోపు విడుదల చేయనుంది 6.మోటో జూన్ 2న అమెరికాకు చెందిన మరో స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ మోటరోలా మోటో ఈ32ఎస్ పేరుతో బడ్జెట్ ఫోన్‌ను మార్కెట్‌కు పరిచయం చేయనుంది. 7.శాంసంగ్ సౌత్ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ బడ్జెట్ ధరలో 5జీ స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేయనుంది. శాంసంగ్ గెలాక్సీ ఏ13 పేరుతో జూన్ 15 తర్వాత విడుదల చేయనుంది. 8.వివో స్నాప్ డ్రాగన్ 870 చిప్ సెట్‌తో వివో టీ2 పేరుతో విడుదల కానున్న ఈ స్మార్ట్ ఫోన్ జూన్‌లో స్మార్ట్ ఫోన్ లవర్స్‌ను అలరించేందుకు సిద్ధమైంది. 9.మోటరోలా మోటరోలా సంస్థ మోటో జీ52జే పేరుతో స్మార్ట్ ఫోన్‌ను జూన్ నెలలో విడుదల కానుంది. చదవండి👉ఐఫోన్ లవర్స్‌కు బంఫరాఫర్! -
ఒప్పో సంచలన నిర్ణయం..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో సంచలన నిర్ణయం తీసుకుంది. శాంసంగ్, యాపిల్, గూగుల్ లాంటి దిగ్గజ టెక్ కంపెనీలకు పోటీగా ఒప్పో తన మొదటి మొబైల్ ప్రాసెసర్‌ను లాంచ్ చేసేందుకు ప్రణాళికలను రచిస్తోంది. మొబైల్ ప్రాసెసర్లలో భాగంగా ఇప్పటికే శాంసంగ్, యాపిల్, గూగుల్ సంస్థలు తమ సొంత మొబైల్ ప్రాసెసర్ చిప్‌లను తయారుచేసింది. థర్డ్ పార్టీ కంపెనీలపై ఆధారపడకుండా తన మొదటి మొబైల్ ప్రాసెసర్‌ను తీసుకురావాలని ఒప్పో సన్నద్ధమైంది. ఈ చిప్‌సెట్‌ను ఒప్పో 2024లో విడుదల చేయనున్నట్ల తెలుస్తోంది. ఇది శామ్సంగ్, యాపిల్, గూగుల్ వంటి కంపెనీలకు పోటీగా నిలిచే అవకాశం ఉంది. ఒప్పో గత కొద్ది రోజులుగా స్వీయ అభివృద్ధి చెందిన అప్లికేషన్ ప్రాసెసర్‌పై పనిచేస్తోంది. ఈ ప్రాసెసర్ పనులు 2023లో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. యాపిల్‌కు సరఫరా చేస్తోన్న కంపెనీతో..! యాపిల్‌కు చిప్స్‌ను సరఫరా చేస్తోన్న టీఎస్ఎంసీ చిప్ కంపెనీ ఒప్పో కస్టమ్ చిప్‌ను తయారుచేయనున్నటు సమాచారం. కాగా ప్రస్తుతం ఒప్పో న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్(ఎన్పీయూ) చిప్‌సెట్‌ను కలిగి ఉంది. దీని సహాయంతో అధిక-నాణ్యత కల్గిన చిత్రాలను ప్రాసెస్ చేయడంలో ఉపయోగపడుతోంది. కాగా థర్డ్ పార్టీ చిప్ సెట్స్ ఆధారపడకుండా సొంత చిప్ సెట్‌ను తయారుచేసేందుకు ఒప్పో సిద్దమైంది. ఇప్పటికే శామ్సంగ్ స్మార్ట్ఫోన్లలో Exynos చిప్సెట్, యాపిల్ స్మార్ట్ఫోన్లలో ఏ-సిరీస్‌ను, గూగుల్ టెన్సార్ చిప్ సెట్లను కలిగి ఉంది. చిప్ సెట్ తయారీలో భాగంగా ఓప్పో భారీ పెట్టుబడులను పెట్టనున్నుట్లు తెలుస్తోంది. ఒక నివేదిక ప్రకారం... ఇప్పటికైతే ఒప్పో క్వాలకం, మీడియాటెక్ సంస్థల ప్రాసెసర్లను ఉపయోగిస్తోంది. చదవండి: వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 9 ప్రో స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపు...! -
రూ.190కే అదిరిపోయే 5జీ బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్!! ఈ ఆఫర్ అస్సలు మిస్ చేసుకోవద్దు!
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ స్మార్ట్ ఫోన్ యూజర్లకు బంపరాఫర్ ప్రకటించింది. ప్రత్యేక తగ్గింపులతో రూ.16,990ఫోన్‌ను కేవలం రూ.190కే అందిస్తున్నట్లు తెలిపింది. ఫిబ్రవరి14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా దేశీయ ఈకామర్స్ ఫ్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్ బొనాంజా సేల్స్ పేరుతో ఆఫర్లలో తక్కువ ధరకే 4జీ, 5జీ స్మార్ట్ ఫోన్స్‌ను అందిందిస్తుంది. ఇక ఫిబ్రవరి 14 వరకు జరిగే ఈ సేల్ లో ఒప్పో 5జీ స్మార్ట్ ఫోన్ ఒప్పో ఏ53ఎస్పై భారీ తగ్గింపులతో పాటు తక్షణ క్యాష్ బ్యాక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో కలిపి రూ. 16,990 విలువైన స్మార్ట్ ఫోన్ ఇప్పుడు రూ.190లకే అందుబాటులోకి తెచ్చింది. ఒప్పో ఏ53ఎస్ 5జీ పై ఆఫర్లు ఏప్రిల్ 27,2021లో విడుదలైన ఒప్పో ఏ53ఎస్ 5జీ ఫోన్ ప్రారంభ ధర రూ.16,900 ఉండగా..ప్రస్తుతం ఈ ఫోన్ ధర ఆన్ లైన్ లో రూ.15,990కే కొనుగోలు చేయోచ్చు. యాక్సిస్ బ్యాంకు క్రెడిడ్ కార్డుతో రూ.800 క్యాష్ బ్యాక్, స్మార్ట్ ఫోన్ పై ఎక్స్ఛేంజ్ కింద రూ.15,000 వరకు ఆఫర్ పొందవచ్చు. తద్వారా 5జీ ఫోన్‌ను రూ.190కే సొంతం చేసుకోవచ్చు. ఒప్పో ఏ53ఎస్ ఫీచర్లు ►90హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.52 అంగుళాల హెచ్డీ ప్లస్ డిస్ప్లే ►వెనుక 13ఎంపీ, 2 ఎంపీ కెమెరాలు ►8ఎంపీ సెల్ఫీ కెమెరా ►మీడియా టెక్ డైమన్సిటీ 700 5జీ ప్రాసెసర్ ►5,000 ఏంఎంహెచ్ బ్యాటరీ, 10డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ ►6జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్‌తో పాటు 8 జీబీ 128జీబీ చదవండి: ఐఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్..! ఇకపై మరింత సులువుగా..! -
వచ్చేసింది..! ఒప్పో రెనో 7 సిరీస్ స్మార్ట్‌ఫోన్స్..! ధర ఎంతంటే..?
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో భారత మార్కెట్లలోకి రెనో 7 సిరీస్ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. ఒప్పో రెనో 7 ప్రో, ఒప్పో రెనో 7మోడల్స్‌ను ఒప్పో రిలీజ్ చేసింది. గతేడాది రిలీజ్ అయిన ఒప్పో రెనో 6 సిరీస్ స్మార్ట్ఫోన్లను అప్‌గ్రేడ్ చేస్తూ ఒప్పో రెనో 7 ప్రో, ఒప్పో రెనో 7 మోడల్స్‌ను పరిచయం చేసింది. ఒప్పో రెనో 7 స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.28,999. ఫిబ్రవరి 17న సేల్ ప్రారంభం కానుంది. ఇక ఒప్పో రెనో 7 ప్రో స్మార్ట్‌ఫోన్ 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.39,999. ఫిబ్రవరి 8న సేల్ మొదలుకానుంది. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఒప్పో ఆన్లైన్ స్టోర్, ఆఫ్‌లైన్ స్టోర్లలో ఈ స్మార్ట్ఫోన్లను కొనొచ్చు. ఈ స్మార్ట్ఫోన్లను స్టార్‌ట్రయల్స్ బ్లూ, స్టార్‌లైట్ బ్లాక్ కలర్స్ వేరియంట్స్‌లో లభించనుంది. వీటికి గట్టి పోటీ..! ఒప్పో రెనో 7 స్మార్ట్‌ఫోన్ షావోమీ 11ఐ, షావోమీ 11ఐ హైపర్‌ఛార్జ్, వన్‌ప్లస్ నార్డ్ 2 స్మార్ట్ఫోన్లకు, ఒప్పో రెనో 7 ప్రో షావోమీ 11టీ ప్రో, వివో వీ23 ప్రో, వన్‌ప్లస్ 9ఆర్టీ మోడల్స్‌కు గట్టి పోటీ ఇవ్వనుంది. . ఒప్పో రెనో 7 ప్రో స్పెసిఫికేషన్స్ 6.55 అంగుళాల పుల్ హెచ్డీ+ సూపర్ అమొలెడ్ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 1200 మ్యాక్స్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 12 + కలర్ ఓఎస్ 50 మెగాపిక్సెల్ Sony IMX766 సెన్సార్ కెమెరా 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 4,500ఎంఏహెచ్ బ్యాటరీ 65వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చదవండి: మరోసారి షాకిచ్చిన అమెజాన్..! భారీగా పెరిగిన ప్రైమ్ మెంబర్షిప్ ధరలు..! ఈ సారి వారి వంతు..! -
గంటకు 19 వేలకుపైగా స్మార్ట్‌ఫోన్స్ అమ్మకాలు..! ఇండియన్స్ ఫేవరెట్ బ్రాండ్ అదే..!
ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19 అన్ని రంగాలపై భారీ ప్రభావాన్ని చూపింది. ఆటోమొబైల్, సర్వీస్ సెక్టార్స్ భారీ నష్టాలను చవిచూశాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రేరిత బాధల నుంచి స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రీ సురక్షితంగా తప్పించుకుంది. 2021లో భారత్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ సుమారు రెండు లక్షల కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్ అమ్మకాలను ఆయా స్మార్ట్‌ఫోన్ కంపెనీలు జరిపినట్లు తెలుస్తోంది. చిప్స్ కొరత ఉన్నప్పటీకి..! ప్రపంచవ్యాప్తంగా పలు దిగ్గజ స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు చిప్స్ కొరత తీవ్రంగా వేధించింది. చిప్స్ కొరత ఉన్పప్పటీకి భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఆదాయం 38 బిలియన్ డాలర్లను అధిగమించింది. 2021లో దాదాపు రూ. 2,83,666 కోట్లకు చేరుకుంది. 2020తో పోలిస్తే 27 శాతం అధికంగా స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు జరిగాయి. 2021లో భారతీయులు ప్రతి గంటకు 19,406 స్మార్ట్‌ఫోన్స్‌ను కొనుగోలు చేశారు. మొత్తంగా 16 కోట్లకు పైగా స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు జరిగాయని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ వెల్లడించింది. ఇది భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఇప్పటివరకు చూసిన అత్యధిక షిప్మెంట్. ఇదిలా ఉండగా కాంపోనెంట్ కొరత కారణంగా డిసెంబర్ త్రైమాసికంలో ఎగుమతులు మందగించడం విశేషం. టాప్ బ్రాండ్ అదే..! భారత స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రీలో 2021గాను షావోమీ బ్రాండ్ టాప్ ప్లేస్‌లో నిలిచింది. షావోమీ 24 శాతం వాటాను ఆక్రమించింది. Mi 11 సిరీస్ అమ్మకాలతో కంపెనీ ఆదాయంలో 258 శాతం పెరుగుదల కన్పించింది. అయినప్పటికీ, కాంపోనెంట్స్ సరఫరాలో పరిమితుల కారణంగా కంపెనీ నాల్గవ త్రైమాసికంలో ఎగుమతులలో మందగమనాన్ని ఎదుర్కొంది. ఇక రెండో స్థానంలో శాంసంగ్ నిలిచింది. శాంసంగ్ 2021లో 8 శాతం క్షీణతను నమోదుచేసింది. రూ. 20,000 నుంచి రూ. 45,000 సెగ్మెంట్లోని 5G స్మార్ట్ఫోన్ల ద్వారా మార్కెట్లో 18 శాతం వాటాను పొందింది. శామ్సంగ్కు ఇది శుభవార్త అయినప్పటికీ, ఇది కూడా సరఫరా గొలుసు అంతరాయాలను ఎదుర్కోవలసి వచ్చింది. శాంసంగ్ ఫోల్డబుల్ విభాగంలో అగ్రగామిగా నిలిచింది. ఫోల్డబుల్ ఫోన్ మార్కెట్లలో 2021గాను 388 శాతం వృద్ధిని శాంసంగ్ సాధించింది. రియల్మీ మూడో స్థానంలో నిలవగా, భారత్‌లో అత్యంత చురుకైన, వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రాండ్ రియల్మీ అవతరించింది. Vivo, Oppo నాలుగు, ఐదవ స్థానాలను కార్నర్ చేయగలిగాయి. వివో 2021లో 19 శాతం వాటాతో టాప్ 5G స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా అవతరించిగా...ఒప్పో 6 శాతం వృద్ధిని కనబరిచింది. ఇక యాపిల్ 2021గాను 108 శాతం వృద్దిని నమోదుచేసింది. చదవండి: చిప్ షార్టేజ్ సంక్షోభం.. అయినా 583.5 బిలియన్ డాలర్ల షాకింగ్ బిజినెస్‌తో హిస్టరీ! -
ఆర్ అండ్ డీ అడ్డాగా హైదరాబాద్.. మూడో ల్యాబ్‌కి రెడీ అటున్న ప్రముఖ కంపెనీ
టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో హైదరాబాద్ దూసుకుపోతుంది. ఇప్పుడిప్పుడే స్టార్టప్ కల్చర్ ఇక్కడ బలపడుతుండగా ఇప్పుడు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగం కూడా అదే దారిలో పయణిస్తుంది.భౌగోళిక అనుకూలతలు హుమన్ రిసోర్స్ లభ్యతలలు హైదరాబాద్‌కి అనుకూలంగా మారాయి. మెరుగైన బ్యాటరీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మేజర్ షేర్ కలిగిన కంపెనీల్లో ఒకటైన ఓప్పో హైదరాబాద్‌లో మరో ఆర్ అండ్ డీ సెంటర్ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసింది. స్మార్ట్ఫోన్లలో ఉపయోగించే బ్యాటరీ బ్యాకప్ పెంచేందుకు అనువైన టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పాలని నిర్ణయించింది. రానురాను డిజిటలైజేషన్ పెరిగిపోవడం థర్డ్‌పార్టీ యాప్‌ల వినియోగం పెరగడంతో మెరుగైన బ్యాటరీ అవసరం ఏర్పడుతోందని అందుకే ఈ విషయంలో హైదరాబరాద్‌లో ఆర్ అండ్ ఏర్పాటు చేయబోతున్నట్టు ఒప్పో ఇండియా ఆర్ అండ్ డీ హెడ్ తస్లీమ్ ఆరీఫ్ తెలిపారు. 280 పేటెంట్లు? ఇప్పటికే ఒప్పో సంస్థకు హైదరాబాద్‌లో రెండు ఆర్ అండ్ డీ సెంటర్లు ఉన్నాయి. 2020 డిసెంబరులో 5జీ ల్యాబ్‌ని ఏర్పాటు చేయగా 2021 ఆగస్టులో కెమెరా ల్యాబ్ ప్రారంభమైంది. తాజాగా 2022 మొదటి త్రైమాసికంలో బ్యాటరీ ల్యాబ్ కూడా మొదలుకానుంది. ఒప్పో హైదరాబాద్ ఆర్ అండ్ డీ సెంటర్లో 450 మంది ఇంజనీర్లు పని చేస్తుండగా ఇప్పటి వరకు పేటెంట్ హక్కుల కోసం 280 దరఖాస్తులు చేసింది. ఐఐటీ హైదరాబాద్‌తో కలిసి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ విభాగంలో పని చేస్తుంది. చదవండి:హైదరాబాద్‌లో సూపర్ కంప్యూటర్? రెడీ అయిన అమెరికా కంపెనీ! -
షావోమీ, ఒప్పో కంపెనీలకు ఐటీ శాఖ భారీ జరిమానా..?
న్యూఢిల్లీ: ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారులకు షావోమీ, ఒప్పో కంపెనీలకు ఐటీ శాఖ భారీ షాక్ ఇచ్చింది. ఐటీ చట్టాలను ఉల్లంఘించినందుకు గాను షావోమీ, ఒప్పో కంపెనీలపై ₹1,000 కోట్లకు పైగా జరిమానాను విధించవచ్చని ఆదాయపు పన్ను శాఖ నేడు తెలిపింది. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో కర్ణాటక, తమిళనాడు, అస్సాం, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, బీహార్, రాజస్థాన్, ఢిల్లీలోని షావోమీ, ఒప్పో, వన్ ప్లస్ కార్యాలయాలలో ఆదాయపు పన్ను(IT) శాఖ డిసెంబర్ 21న తనిఖీలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సంస్థల కార్యాలయాల్లో తనిఖీల చేసే సమయంలో ఆ కంపెనీ అధికారులను ఐటీ అధికారులు ప్రశ్నించారు. ఆ కంపెనీ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. షావోమీ, ఒప్పో కంపెనీలు రాయల్టీ రూపంలో విదేశాలలో ఉన్న వాటి గ్రూపు కంపెనీలకు ₹5,500 కోట్లకు పైగా ఎక్కువ మొత్తంలో చెల్లింపులు చేసినట్లు పన్ను శాఖ ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపింది. "తమ అనుబంధ సంస్థలతో లావాదేవీలు చేసేటప్పుడు ఆదాయపు పన్ను చట్టం, 1961 సూచించిన ఆదేశాలను ఈ కంపెనీలు పాటించలేదు. అందుకే, ఈ కంపెనీల మీద ₹1,000 కోట్లకు పైగా జరిమానాను విధించవచ్చని" ఐటీ శాఖ ప్రకటనలో తెలిపింది. (చదవండి: పెన్షన్ తీసుకునే వారికి కేంద్రం శుభవార్త..!) -
చైనా మొబైల్ కంపెనీలకు షాక్! సోదాలు చేస్తోన్న ఐటీ శాఖ
న్యూఢిల్లీ: భారత మొబైల్ ఫోన్స్ పరిశ్రమలో దూకుడుగా ఉన్న చైనా కంపెనీలకు షాక్ తగిలింది. చైనాకు చెందిన ఒప్పో, షావొమీ, వన్‌ప్లస్ మొబైల్ కంపెనీల కార్యాలయాలు, ఉన్నతాధికారుల ఇళ్లపై ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తోంది. భారీ ఎత్తున పన్ను ఎగవేతకు పాల్పడ్డట్టు నిఘా విభాగం ఇచ్చిన సమాచారం ఆధారంగా తనిఖీలు జరుగుతున్నాయి. ఈ కంపెనీలపై చాలా కాలంగా ఐటీ నిఘా ఉన్నట్టు తెలుస్తోంది. కచ్చితమైన సమాచారంతోనే కంపెనీల సీఈవోలు, ఇతర ప్రతినిధులను ఐటీ అధికారులు విచారిస్తున్నారు. మంగళవారం నుంచి ఈ తనిఖీలు జరుగుతున్నాయి. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, గ్రేటర్ నోయిడా, కోల్‌కత, గువాహటి, ఇందోర్‌తోపాటు పలు ప్రాంతాల్లో 24కుపైగా కార్యాలయాల్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఉత్పత్తుల సరఫరా, విక్రయం, ఆర్థిక సేవల్లో ఉన్న కొన్ని కంపెనీలూ ఈ జాబితాలో ఉన్నట్టు తెలుస్తోంది. పన్ను ఎగవేసినట్టు నిరూపించే డిజిటల్ సమాచారాన్ని గుర్తించి, సీజ్ చేసినట్టు సమాచారం. ఐటీ అధికారులకు సహకరిస్తున్నట్టు ఒప్పో వెల్లడించింది. భారతీయ చట్టాలకు అనుగుణంగా ఇక్కడ వ్యాపారం చేస్తున్నట్టు షావొమీ తెలిపింది. ఈ ఏడాది ఆగస్ట్‌లో టెలికం పరికరాల విక్రయంలో ఉన్న చైనాకు చెందిన జడ్‌టీఈపైనా ఐటీ తనిఖీలు జరిగాయి. -
షావోమీ, ఒప్పో కంపెనీలకు ఐటీ శాఖ భారీ షాక్..!
ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారులకు షావోమీ, ఒప్పో కంపెనీలకు ఐటీ శాఖ భారీ షాక్‌ను ఇచ్చింది. ఆయా కంపెనీలపై ఆదాయ పన్ను శాఖ దాడులను నిర్వహిస్తోనట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా షావోమీ, ఒప్పో మొబైల్ కంపెనీలకు సంబంధించిన పలు ప్రాంగణాల్లో ఆదాయపు పన్ను (IT) శాఖ దాడులు నిర్వహిస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఐటీ అధికారులు ఆయా కంపెనీలు అనేక ఉల్లంఘనలకు పాల్పడాయని ఆరోపణలు రావడంతో దాడులు చేసినట్లు తెలుస్తోంది. షావోమీ, ఒప్పో కంపెనీల తయారీ యూనిట్లు, గోడౌన్లు , కార్పొరేట్ కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయని సమాచారం. తమిళనాడు పెరుంగుడిలోని ఒప్పో కార్యాలయంపై, కాంచీపురంలోని సెల్‌ఫోన్ విడిభాగాల తయారీ యూనిట్‌పై దాడులు నిర్వహించారు. గతంలో కూడా..! ఆయా చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీలపై ఐటీ దాడులు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఈ సంస్థలపై ఐటీ దాడుల జరిగాయి. అంతకుముందు ఆగస్టులో, గురుగ్రామ్‌లోని చైనీస్ టెలికాం పరికరాల తయారీ సంస్థ జెడ్‌టీఈ కార్యాలయంపై కూడా దాడి జరిగింది. ఈ దాడిలో పలు ఉల్లంఘనలను ఐటీ అధికారులు గుర్తించారు. చదవండి: "మెర్రీ క్రిస్మస్" మెసేజ్ ఖరీదు ఇన్ని లక్షలా.. స్పెషల్ ఏంటి? -
2022లో లాంచ్ కానున్న పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!
Top Upcoming Smartphones Of 2022: కొత్త ఏడాది రాబోతుంది. 2022 సంవత్సరానికి గాను ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం కంపెనీలు భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లపై తమ కొత్త ఫోన్లతో దండయాత్ర చేయనున్నాయి. 2021లో చిప్స్ సమస్య, సప్లై చైయిన్‌లో ఆటంకాలు కల్గించినప్పటికీ భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లలో దిగ్గజ కంపెనీలు కొంతమేర లాభాలను దక్కించుకున్నాయి. 2022గాను భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లను శాసించేందుకు ఆయా కంపెనీలు సిద్దమైనాయి. శాంసంగ్, యాపిల్, వన్‌ప్లస్, షావోమీ, గూగుల్, ఒప్పో కంపెనీలు 2022లో కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్స్ లాంచే చేసేందుకు రెడీ అయ్యాయి. భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లలో తమ స్థానాలను పదిలంగా ఉంచేందుకు ఆయా కంపెనీలు ఊవిళ్లురుతున్నాయి. 2022లో రానున్న పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే..! 1. శాంసంగ్ గెలాక్సీ ఎస్22 అల్ట్రా శాంసంగ్ గెలాక్సీ ఎస్21 స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లలో భారీ ఆదరణ లభించింది. పవర్ఫుల్ కెమెరా సపోర్ట్‌తో శాంసంగ్ గెలాక్సీ ఎస్21 నిలిచింది. దీనిని కంటిన్యూ చేస్తూ శాంసంగ్ మరిన్ని అద్బుతమైన ఫీచర్స్‌తో శాంసంగ్ గెలాక్సీ ఎస్22 అల్ట్రాను శాంసంగ్ లాంచ్ చేయనుంది. Galaxy S22, Galaxy S22 Plus మరియు Galaxy S22 అల్ట్రాకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. 2. శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ గెలాక్సీ సిరీస్‌లో భాగంగా శాంసంగ్ తక్కువ ధరకే శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ లాంచ్ చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 38,990గా ఉండనుంది. IP68 రేటింగ్ వంటి లక్షణాలను శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ పొందనుంది. 5జీ మోడల్, క్వాలకం స్నాప్‌డ్రాగన్ 865 సపోర్ట్‌తో రానుంది. 3. ఐఫోన్ 14 మ్యాక్స్ కరోనా రాకతో ఐఫోన్13 స్మార్ట్ ఫోన్ల లాంచ్‌కు కాస్త బ్రేకులు పడింది. లేట్‌గా వచ్చిన లేటెస్ట్గా ఐఫోన్ 13 భారత మార్కెట్లలో భారీ ఆదరణను పొందింది. కాగా వచ్చే ఏడాది అనుకున్న సమయానికే ఐఫోన్ 14 స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేసేందుకు యాపిల్ సన్నాహాలను చేస్తోంది. ఐఫోన్ 14 మ్యాక్స్‌కు అనుకూలంగా ఐఫోన్ 14 మినీని తొలగించవచ్చని తెలుస్తోంది. అంటే మినీ సిరీస్ స్మార్ట్‌ఫోన్స్ ఇకపై ఉండకపోవచ్చును. 4. వన్‌ప్లస్ 10 ప్రొ శాంసంగ్, యాపిల్ లాంటి దిగ్గజ స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు వన్‌ప్లస్ దీటైన సమాధానం ఇచ్చింది. వచ్చే ఏడాది వన్‌ప్లస్ 10 స్మార్ట్ఫోన్లను కంపెనీ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. వన్‌ప్లస్ 9 కంటే అదిరిపోయే ఫీచర్స్‌తో వన్‌ప్లస్ 10 స్మార్ట్ ఫోన్స్ రానున్నాయి. Qualcomm స్నాప్డ్రాగెన్ 8 Gen 1 ప్రాసెసర్ దీనిలో రానుంది. 5. షావోమీ 12 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ భారత్‌లో పాతుకుపోయింది. షావోమీ స్మార్ట్‌ఫోన్స్‌కు భారీ ఆదరణ లభించడంతో వివిధ రకాల మోడల్ స్మార్ట్ఫోన్లను షావోమీ లాంచ్ చేస్తోంది. షావోమీ 12 స్మార్ట్‌ఫోన్‌ను వచ్చే ఏడాదిలో తొలినాళ్లలో లేదా ఈ ఏడాది చివరన లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఐతే స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులకు 2022లోనే అందుబాటులో ఉండనుంది. 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో షావోమీ 12 రానుంది. 6. గూగుల్ పిక్సెల్ 6ఏ యాపిల్ స్మార్ట్‌ఫోన్స్ తరువాత గూగుల్ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్స్‌కు ఉండే క్రేజ్ వేరు. పవర్ఫుల్ సెక్యూరిటీతో, కెమెరా ఆప్షన్లతో గూగుల్ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్స్ భారత్‌లో తనదైన స్థానాన్ని కైవసం చేసుకుంది. గూగుల్ పిక్సెల్ 6, 6 ప్రొ ఇప్పటికే లాంచ్ ఐనప్పటికీ వచ్చే ఏడాది బడ్జెట్ ప్రెండ్లీ స్మార్ట్‌ఫోన్స్‌లో భాగంగా గూగుల్ పిక్సెల్ 6ఏ ఫోన్‌ను గూగుల్ లాంచ్ చేయనుంది. 7. ఒప్పో ఫైండ్ ఎన్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్స్ మార్కెట్లలోకి ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో కూడా ప్రవేశించింది. ‘ఒప్పో ఫైండ్ ఎన్’ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను డిసెంబర్ 15న కంపెనీ లాంచ్ చేసింది. కాగా తొలుత చైనా మార్కెట్లలోనే ఈ ఫోన్ అందబాటులో ఉండనుంది. ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లలో ప్రఖ్యాతిగాంచిన శాంసంగ్ కంపెనీ స్మార్ట్ఫోన్లకు తక్కువ ధరలోనే ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను ఒప్పో తీసుకువచ్చింది. కాగా ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 92,000 నుంచి ప్రారంభమవుతుంది. ఒప్పో ఫైండ్ ఎన్ స్మార్ట్‌ఫోన్ 33 వాట్ సూపర్ఫ్లాష్ టెక్నాలజీతో పనిచేయనుంది. అయితే 33W SUPERVOOC ఫ్లాష్ ఛార్జ్ 30 నిమిషాల్లో 55 శాతానికి , 70 నిమిషాల్లో 100 శాతానికి బ్యాటరీ ఛార్జ్ అవ్వనుంది. చదవండి: వరల్డ్ ఫస్ట్ ఇన్నోవేటివ్ ఫీచర్స్ కేవలం ఈ స్మార్ట్‌ఫోన్‌లో...! -
వచ్చేసింది ఒప్పో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్..! శాంసంగ్ కంటే తక్కువ ధరకే..!
ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్స్ మార్కెట్లలోకి ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో కూడా ప్రవేశించింది. ‘ఒప్పో ఫైండ్ ఎన్’ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను డిసెంబర్ 15న కంపెనీ లాంచ్ చేసింది. ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లలో ప్రఖ్యాతిగాంచిన శాంసంగ్ కంపెనీ స్మార్ట్ఫోన్లకు తక్కువ ధరలోనే ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను ఒప్పో తీసుకువచ్చింది. కంపెనీ నిర్వహించిన ఇన్నో 2021 ఈవెంట్ రెండో రోజున ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ తొలుత చైనా మార్కెట్లలో అందుబాటులో ఉండనుంది. ప్రపంచవ్యాప్తంగా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను త్వరలోనే లాంచ్ చేసేందుకు ఒప్పో సన్నాహాలను చేస్తోంది. కాగా ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 92,000 నుంచి ప్రారంభమవుతుంది. ఒప్పో ఫైండ్ ఎన్ స్మార్ట్‌ఫోన్ 33 వాట్ సూపర్ఫ్లాష్ టెక్నాలజీతో పనిచేయనుంది. అయితే 33W SUPERVOOC ఫ్లాష్ ఛార్జ్ 30 నిమిషాల్లో 55 శాతానికి , 70 నిమిషాల్లో 100 శాతానికి బ్యాటరీ ఛార్జ్ అవ్వనుంది. ఒప్పో ఫైండ్ ఎన్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్..! 7.1-అంగుళాల లోపలి డిస్ప్లే, 5.49-అంగుళాల ఔటర్ డిస్ప్లే 50ఎంపీ+16ఎంపీ+13ఎంపీ రియర్ ట్రిపుల్ కెమెరా క్వాలకం స్నాప్‌డ్రాగన్ 888 12జీబీ ర్యామ్+512జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 33W SUPERVOOC ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ డ్యూయల్ స్పీకర్ సిస్టమ్ డాల్బీ అట్మోస్ సపోర్ట్ 10W రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ 4,500 mAh బ్యాటరీ చదవండి: ఇక సులభంగా రిలయన్స్ జియో రీఛార్జ్ సేవలు..! -
సముద్రంలో తప్పిపోవడం.. ఇకపై జరగదంతే.. ఒప్పోతో ఇస్రో ఒప్పందం..
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సాంకేతిక పరిజ్ఞానాన్ని సామాన్యులకు మరింత చేరువ చేసే యత్నంలో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. సముద్రయానానికి వెళ్లే వారు నెట్వర్క్ సిగ్నల్స్ సరిగా లేని చోట కూడా మెసేజ్ పంపడంతో పాటు లోకేషన్ వివరాలు తెలిపే విధంగా అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తేనుంది. ఈ మేరకు చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ ఒప్పందంతో అవగాహన కుదిరింది. ఒప్పో, ఇస్రోల సంయుక్త ఆధ్వర్యంలో ఒప్పో మొబైల్స్‌లో నావిక్ సర్వీసును అందివ్వనున్నారు. భారత భూభాగంతో పాటు భారత సరిహద్దుల నుంచి 1500 కిలోమీటర్ల వరకు సముద్రంలో నావిక్ సేవలు అందుబాటులో ఉంటాయి. నావిక్ ద్వారా పొజిషన్, నావిగేషన్, టైమ్ వివరాలు తెలుసుకోవచ్చు. అదే విధంగా మొబైల్ నెట్వర్క్ పని చేయని చోటు నుంచి కూడా షార్ట్ మెసేజ్ సర్వీస్ (ఎస్సెమ్మెస్) పంపించే వీలుంది. భూమితో పాటు సముద్రంలో కూడా ఈ నావిక్ కచ్చితమైన సేవలు అందివ్వగలదు. ముఖ్యంగా సముద్రయానం చేసే వారికి నావిక్ ఎంతో ఉపయోకరంగా మారనుంది. తాజాగా కుదిరిన ఒప్పందం ప్రకారం.. భవిష్యత్తులో ఒప్పో సంస్థ తయారు చేసే మొబైల్‌హాండ్ సెట్లలో ఇన్‌బిల్ట్‌గా నావిక్ సర్వీసు అందుబాటులో ఉంటుంది. ఇందులో పూర్తి దేశీయంగా అభివృద్ధి చేసిన టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. నావిక్ ద్వారా మొబైల్ నెట్‌వర్క్‌తో సంబంధం లేకుండా ఎస్సెమ్మెస్‌లు పంపుకునే వీలుంది. సాధారణంగా సముద్రంలోకి చేపల వేటలకి వెళ్లిన వారు తిరిగి వచ్చే వరకు.. వారు ఎక్కడున్నారు... ఎలా ఉన్నారు అనే అంశాలపై కచ్చితమైన సమచారం ఉండటం లేదు. మరోవైపు తుపానులు వచ్చినప్పుడు పరిస్థితి మరీ ఇబ్బందికరంగా మారుతోంది. నావిక్ అందుబాటులోకి వస్తే చేపల వేటకు వెళ్లే వారు, ఇతర సముద్ర యానం చేసే వారితో ఎల్లవేళలా కనెక్టివిటీ ఉంటుంది. -
సూపర్ ఫీచర్స్‌తో ఒప్పో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్..!
ఒప్పో తన మొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను వచ్చే నెలలో విడుదల చేయనుంది. రాబోయే ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ వివరాలను ఒప్పో వెల్లడించనప్పటికీ, టిప్‌స్టర్ ఇటీవల ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి Weiboలో కొన్ని ఆసక్తికరమైన పోస్ట్‌లను షేర్ చేసింది. టిప్‌స్టర్ షేర్ చేసిన పోస్ట్‌లో ఒప్పో ఎన్3 స్మార్ట్‌ఫోన్ ఉంది. ‘Oppo Find N 5G’ పేరుతో ఒప్పో స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఒప్పో నుంచి వస్తోన్న మొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్/ఫ్లిప్ సిరీస్ మాదిరిగానే ఇన్వర్డ్ ఫోల్డింగ్ డిస్ప్లేను కలిగి ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒప్పో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ (అంచనా) 7.8 నుంచి 8 అంగుళాల ఓఎల్ఈడీ డిస్ప్లే క్వాలకం స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ ఆడ్రినో 660జీపీయూ 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా 32-మెగాపిక్సెల్ సెల్ఫీ స్నాపర్ పాప్ అప్ కెమెరా 4,500mAh బ్యాటరీ 65W ఫాస్ట్ ఛార్జింగ్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ చదవండి: 200 ఎంపీ కెమెరాతో సూపర్ స్మార్ట్‌ఫోన్..!.. వచ్చేది ఎప్పుడంటే? -
భారత్‌లోకి ఒప్పో స్మార్ట్‌టీవీలు..! లాంచ్ ఎప్పుడంటే..?
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో భారత మార్కెట్లలోకి స్మార్ట్‌టీవీలను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒప్పో చైనా మార్కెట్లలో స్మార్ట్‌టీవీలను రిలీజ్ చేసింది. భారత మార్కెట్లలోకి ఒప్పో కే9 సిరీస్ స్మార్ట్‌టీవీలు వచ్చే ఆర్థిక సంవత్సరం క్యూ1లో రిలీజ్ చేయనుంది. ఈ స్మార్ట్‌టీవీలు మీడియాటెక్ ప్రాసెసర్‌తో రానున్నాయి. 65, 55, 43 అంగుళాల స్మార్ట్‌టీవీలను ఒప్పో రిలీజ్ చేయనుంది. చదవండి: తప్పిన తిప్పలు.. ఆన్లైన్లో అందుబాటులోకి జియోఫోన్ నెక్ట్స్! రేట్ల అంచనా..! ఒప్పో కే9 65 ఇంచ్ స్మార్ట్‌టీవీ ధర రూ. 45,600 ఒప్పో కే9 55 ఇంచ్ స్మార్ట్‌టీవీ ధర రూ. 32,000 ఒప్పో కే9 43 ఇంచ్ స్మార్ట్‌టీవీ ధర రూ. 22,800 చదవండి: విదేశాలకు దేశీయ 6జీ టెక్నాలజీ ఎగుమతి! -
షావోమీకి దిమ్మతిరిగే షాకిచ్చిన ఒప్పో,వివో..!
Xiaomi Revenue Fails To Meet Expectations As Competition From Oppo Vivo Intensifies: ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమికి సమీప ప్రత్యర్థి స్మార్ట్‌ఫోన్ కంపెనీలైన ఒప్పో, వివో భారీ షాక్‌ను ఇచ్చాయి. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లలో ఒప్పో, వివో కంపెనీల నుంచి తీవ్రమైన పోటీ రావడంతో కంపెనీ ఆదాయ అంచనాలను చేరుకోవడంలో షావోమీ విఫలమైంది. కంపెనీ క్యూ3 రెవెన్యూలో కేవలం 0.4 శాతం వృద్దిని మాత్రమే నమోదు చేసింది. క్యూ3 రెవెన్యూలో షావోమీ 8.2 శాతం పెరుగుదలను సాధించింది. రిఫీనిటివ్ డేటా ప్రకారం...మూడు నెలల్లో (జూలై -సెప్టెంబర్) దాదాపు రూ. 90,910 కోట్ల విక్రయాలను షావోమీ జరిపింది. ఈ క్యూ3లో సుమారు రూ. 92,300 కోట్లను షావోమీ అంచనా వేసినట్లు తెలుస్తోంది. వన్-టైమ్ లాభాలు, నష్టాలను మినహాయించి, షావోమీ సుమారు రూ. 6,040 కోట్ల లాభాన్ని ఆర్జించింది. షావోమీ ఆదాయం కేవలం 0.4 శాతం పెరిగి రూ. 55,655 కోట్లకు చేరుకుంది. రీసెర్చ్ సంస్థ కెనాలిస్ ప్రకారం... చైనాలో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు జూలై-సెప్టెంబర్ కాలంలో దాదాపు 5 శాతం మేర పడిపోయాయి. హువావేపై అమెరికా ఆంక్షలను విధించడంతో షావోమీ ఈ మేర లాభాలను పొందినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సమీప ప్రత్యర్థులు ఒప్పో, వివో కంపెనీలు క్యూ3లో గడించిన వృద్ధిని షావోమీ పొందలేకపోయింది. చైనాలో షావోమీ షిప్మెంట్లు మూడో త్రైమాసికంలో కేవలం 4 శాతం మేర పెరిగాయని కెనాలిస్ తెలిపింది. చదవండి: ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే! -
ఎలక్ట్రిక్ వాహన మార్కెట్‌పై స్మార్ట్‌ఫోన్ కంపెనీల దండయాత్ర!
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లోకి ప్రవేశిస్తున్నట్లు సమాచారం. 91మొబైల్స్ నివేదిక ప్రకారం.. 2023 చివరి నాటికి లేదా 2024 ప్రారంభంలో భారతదేశంలో తన మొదటి ఎలక్ట్రిక్ వాహనాన్ని ప్రారంభించాలని ఒప్పో కంపెనీ యోచిస్తోంది. ఒప్పో ఎలక్ట్రిక్ వేహికల్ గురించి వార్తలు ఇదే మొదటిసారి కాదు, గతంలో కూడా వార్తలు వినిపించాయి. ఈ నెల ప్రారంభంలో ఒప్పో తన సహ బ్రాండ్లు అయిన రియల్ మీ, వివోతో కలిసి భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ట్రేడ్ మార్క్ కోసం దరఖాస్తులను దాఖలు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఒప్పో నిజంగా భారతదేశంలో ఈవీలను లాంఛ్ చేస్తుందా అనే విషయం గురుంచి కంపెనీ ఇంకా ధృవీకరించలేదు. అయితే స్మార్ట్ఫోన్లతో పాటు దేశంలో ఎలక్ట్రిక్ వాహనలను తీసుకొనిరావలనే కంపెనీ విస్తరణ ప్రణాళికలను ఇది తెలియజేస్తుంది. తాజా నివేదిక ప్రకారం.. ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఒప్పో ప్రణాళిక పనుల్లో ఇప్పటికే బిజీగా ఉంది. 2023 చివరి నాటికి లేదా 2024 ప్రారంభంలో దేశంలో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఒప్పో ఇప్పటికే తన ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై పని ప్రారంభించిందని, టెస్లాకు బ్యాటరీ అందజేసే తయారీదారులు, విడిభాగాల సరఫరాదారులతో ఒప్పో కంపెనీ సీఈఓ టోనీ చాన్ సమావేశాలు నిర్వహించారని ఈ ఏడాది మేలో వార్తలు వచ్చాయి. (చదవండి: కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పిన స్విగ్గీ..! ఇక అన్లిమిటెడ్..!) ఇక తన ప్రధాన ప్రత్యర్థి కంపెనీ షియోమీ కూడా 2024 మొదటి అర్ధభాగంలో తన ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి తీసుకొని రావాలని యోచించడంతో ఒప్పో కూడా ఆ మార్కెట్లోకి రావాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. ఈ ఏడాది మార్చిలో ఈవీ మార్కెట్లోకి ప్రవేశించి, రాబోయే 10 ఏళ్లలో ఈ వ్యాపారంలో 10 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలని షియోమీ తన ప్రణాళికల గురుంచి ప్రకటించింది. ఇది గత నెలలో తన ఎలక్ట్రిక్ వాహన వ్యాపారం కోసం షియోమీ ఈవీ ఇంక్ పేరునును కూడా నమోదు చేసింది. ఇప్పటికే భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో బలమైన ఉనికి కలిగి ఉన్న ఒప్పో, రియల్ మీ, షియోమీ వంటి కంపెనీలు ఈవి మార్కెట్లోకి అడుగుపెట్టాలని చూస్తున్నాయి. (చదవండి: ఆధార్ కార్డుదారులకు తీపికబురు.. కొత్తగా మరో 166 కేంద్రాలు!) -
దేశంలో దూసుకెళ్తున్న 5జీ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు
దేశంలో 5జీ నెట్వర్క్ సేవలు ఇంకా ప్రారంభమే కాలేదు. అయినప్పటికీ 5జీ స్మార్ట్ఫోన్ల షిప్ మెంట్లు 2021 మూడవ త్రైమాసికంలో ఊపందుకున్నాయి. సీఎమ్ఆర్ ఇండియా మొబైల్ హ్యాండ్ సెట్ మార్కెట్ ప్రకారం మొత్తం స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో 5జీ స్మార్ట్ఫోన్లు 22 శాతం ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం తక్కువ ధరకు 5జీ స్మార్ట్‌ఫోన్ లభించడమే అని సీఎమ్ఆర్ తెలిపింది. వన్ ప్లస్, ఒప్పో, రియల్ మీ, శామ్ సంగ్, వివో వంటి స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ల 5జీ ఎక్కువగా అమ్ముడయ్యాయి అని పేర్కొంది. "ఈ ఐదు బ్రాండ్లు కలిసి క్యూ3 2021 సమయంలో 3 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 22,227 కోట్ల)కు పైగా 5జీ స్మార్ట్ఫోన్లను రవాణా చేశాయి" అని సీఎమ్ఆర్ లోని ఇండస్ట్రీ ఇంటెలిజెన్స్ గ్రూప్ విశ్లేషకుడు షిప్రా సిన్హా చెప్పారు. 5జీ స్మార్ట్ఫోన్లు కాకుండా ఇతర స్మార్ట్ఫోన్లకు కూడా భారీగా డిమాండ్ ఉంది. అందుకే, భారతదేశంలో మొత్తం స్మార్ట్‌ఫోన్ షిప్మెంట్ పరంగా 47 శాతం త్రైమాసీకంలో(క్యూవోక్యూ) వృద్ధి చెందింది. ఉదాహరణకు.. షియోమీ 23 శాతం మార్కెట్ వాటాతో మొదటి స్థానాన్ని నిలుపుకుంది. శామ్ సంగ్ 18 శాతం మార్కెట్ వాటాతో రెండవ స్థానంలో ఉంటే, ఆ తర్వాత వివో, రియల్ మీ ఒక్కొక్కటి 15 శాతం వాటా కలిగి ఉన్నాయి. మొదటి ఐదు స్థానాల్లో లేనప్పటికీ, యాపిల్ షిప్ మెంట్ పరంగా 32 శాతం వృద్ధి నమోదు చేసింది. సూపర్ ప్రీమియం(రూ.50,000- 1,00,000) విభాగంలో యాపిల్ 84 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో నిలిచింది. యాపిల్ ఐఫోన్ 12, ఐఫోన్ 11తో సహా ఇతర ఐఫోన్లు భారీగా అమ్ముడయ్యాయి. (చదవండి: మొబైల్ మార్కెట్లోకి శక్తివంతమైన స్వదేశీ 5జీ స్మార్ట్‌ఫోన్!) -
ఒప్పో నుంచి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్స్..! లాంచ్ ఎప్పుడంటే..?
ప్రపంచ వ్యాప్తంగా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్స్ భారీ ఆదరణను నోచుకుంటున్నాయి. మడతపెట్టే స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసిన శాంసంగ్ భారీ లాభాలనే ఆర్జిస్తోంది. కాగా ఆపిల్, గూగుల్ లాంటి పలు స్మార్ట్‌ఫోన్ కంపెనీలు కూడా ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లపై దృష్టిసారించాయి. ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లను తయారుచేసే కంపెనీ జాబితాలోకి తాజాగా ప్రముఖ చైనీస్ కంపెనీ ఒప్పో కంపెనీ కూడా చేరింది. చదవండి: టెస్లా కార్లలో ‘కలకలం..!’ పాత దానినే వాడండి..! వచ్చే నెలలో లాంచ్..! మడతపెట్టే స్మార్ట్ఫోన్లను ఓప్పో త్వరలోనే లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను వచ్చే నెల నవంబర్‌లో ఒప్పో లాంచ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన లాంచ్ ఈవెంట్‌ను ఒప్పో ఇంకా ప్రకటించలేదు. 8 అంగుళాల ఫోల్డబుల్ ఇంటర్నల్ డిస్ప్లే స్మార్ట్‌ఫోన్‌ను త్వరలోనే ఒప్పో రిలీజ్ చేయనుందని ప్రముఖ టెక్నికల్ ఎక్స్పర్ట్ టిప్‌స్టర్ వీబోతో పంచుకున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ డిస్ప్లే కోసం ఎల్టీపీవో అమ్లోడ్ ప్యానెల్‌ను ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. ఒప్పో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌ని ఉపయోగిస్తుందని టిప్‌స్టర్ ధృవీకరించింది. టిప్‌స్టర్ ప్రకారం....ఒప్పో మొట్టమొదటి ఫోల్డబుల్ ఫోన్ చైనాలో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇతర దేశాల్లో ఒప్పో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ఆలస్యంగా లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు. శాంసంగ్ తన ఫోల్డబుల్ ఫోన్లలో భాగంగా గెలాక్సీ జెడ్ ఫోల్డ్ , గెలాక్సీ జెడ్ ఫ్లిప్ ఫోన్లను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసింది. ఒప్పో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ధర దాదాపు రూ. 1.5 లక్షలు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: Alibaba: చైనాపై విమర్శ..! జాక్ మా కొంపముంచింది..! -
సొంత దుకాణానికి సిద్ధమైన ఒప్పో...! వారికి మాత్రం పెద్ద దెబ్బే..!
స్మార్ట్‌ఫోన్ కంపెనీల్లో చిప్సెట్ మంటలను రాజేసింది. ఎవరికీవారు తమ చిప్సెట్లను తామే తయారుచేసుకోవడానికి పలు స్మార్ట్‌ఫోన్ కంపెనీలు సిద్దమైయ్యాయి. చిప్సెట్ల తయారీ విషయంలో గూగుల్, క్వాల్కమ్ మధ్య విభేదాలు మొదలైన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా మరో స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఒప్పో కూడా తమ సొంత చిప్ సెట్ల తయారీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది. సొంత చిప్సెట్లను తయారుచేసే ఆపిల్, శాంసంగ్, గూగుల్ కంపెనీల సరసన ఒప్పో చేరనుంది. చదవండి: అదృష్టం అంటే వీళ్లదే..! పెట్టుబడి రూ.లక్ష..సంపాదన కోటి రూపాయలు క్వాలకమ్కు పెద్ద దెబ్బే...! ఒప్పో తీసుకున్న నిర్ణయంతో ప్రముఖ మొబైల్ చిప్ తయారీ దిగ్గజం క్వాలకమ్కు భారీ దెబ్బ తగలనుంది. ఒప్పో స్వంత చిప్సెట్లతో క్వాలకమ్ భారీ ఎత్తున నష్టపోనుంది ఒప్పో తన హై-ఎండ్ చిప్‌లను 2023 లేదా 2024 లో ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు జపాన్‌కు చెందిన ప్రముఖ మీడియా సంస్థ నిక్కీ నివేదించింది. ప్రపంచంలో నాల్గో అతి పెద్ద స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా ఒప్పో నిలిచింది. వివో, రియల్మీ , వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు ఒప్పో మాతృ సంస్థగా నిలుస్తోంది. ఈ స్మార్ట్ఫోన్లలో క్వాల్కమ్, మీడియాటెక్ చిప్సెట్లను వాడుతున్నారు. కాగా హై ఎండ్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ల తయారీలో కంపెనీ తన స్వంత చిప్సెట్లను వాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సొంత చిప్ సెట్లతో పలు స్మార్ట్‌ఫోన్ కంపెనీలు...! ప్రపంచంలోని అన్ని ప్రధాన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు ఇప్పుడు వేగవంతమైన కస్టమ్ చిప్‌ను అభివృద్ధి చేసే రేసులో ఉన్నాయి. పలు స్మార్ట్‌ఫోన్ కంపెనీలు చిప్సెట్ తయారీ కంపెనీలకు గడ్డుకాలంగా తయారైంది. గూగుల్ ఇప్పటికే పిక్సెల్ 6 సిరీస్ స్మార్ట్ఫోన్లలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ చిప్‌లకు బదులుగా గూగుల్ తన సొంత టెన్నార్ చిప్ సెట్లను అమర్చింది. ఆపిల్ ఇప్పటికే ఐఫోన్, ఐప్యాడ్ కోసం తన స్వంత A- సిరీస్ చిప్సెట్లను తయారు చేస్తుంది. శాంసంగ్ తన ఎక్సినోస్ చిప్సెట్తో గెలాక్సీ ఫోన్లను, టాబ్లెట్లకు అందిస్తున్నాయి. హువావే కూడా దాని స్వంత హైసిలికాన్ చిప్సెట్లను తయారు చేస్తోంది. చదవండి: సరికొత్త హంగులతో టయోటా ఇన్నోవా..! -
చైనాకు భారత్ భారీ షాక్!
Indian Government Regulation To Prevent Handset Snooping: పొరుగు దేశం చైనాకు భారత్ భారీ షాక్ ఇచ్చింది. భారత మార్కెట్‌ను శాసిస్తున్న.. చైనా బ్రాండ్ ఫోన్ల విషయంలో ఉక్కుపాదం మోపాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు వివో, ఒప్పో, షావోమీ, వన్‌ఫ్లస్ కంపెనీలను పరిశీలన విభాగం కిందకు తీసుకొచ్చి మరీ నోటీసులు పంపించింది. ఇప్పటి నుంచి చైనా నుంచి దిగుమతి అయ్యే స్మార్ట్ఫోన్లకు సంబంధించి పూర్తి వివరాలను భారత్‌కు సమర్పించాల్సి ఉంటుంది. అంటే.. సదరు బ్రాండ్ ఫోన్లలో ఎలాంటి కంపోనెంట్లు ఉపయోగిస్తున్నారో లాంటి పూర్తి వివరాల్ని సైతం వెల్లడించాల్సిందేనని(చైనా ఇంతవరకు చేయని పనే ఇది!.. ఈ విషయంలో పలు దేశాలకూ అనుమానాలున్నాయి) నోటీసుల్లో భారత్ పేర్కొంది. అంతేకాదు సెక్యూరిటీ కారణాల వల్ల ప్రీ ఇన్స్టాల్ యాప్స్ తదితర వివరాల్ని వెల్లడించాల్సి ఉంటుంది. ఇదంతా నిఘా కోణంలో భాగంగానే తీసుకున్నట్లు భారత ప్రభుత్వం వెల్లడించింది. భారత్‌లోని కన్జూమర్లకు ఆ ప్రొడక్టులు సురక్షితమైనవేనా? కాదా? అనేది తేల్చుకోవాల్సిన అవసరం తమకు ఉందని ఈ సందర్భంగా భారత ప్రభుత్వం నోటీసుల్లో పేర్కొన్నట్లు ది మార్నింగ్ కంటెక్స్ట్ ఓ కథనం ప్రచురించింది. కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ డాటా ప్రకారం.. మన దేశపు స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో పైన పేర్కొన్న ఫోన్ల కంపెనీల ఆధిపత్యమే 50 శాతం దాకా కొనసాగుతోంది. భారత్-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్ని తరుణంలో.. కిందటి ఏడాది ఒక్కసారిగా 220 చైనా యాప్‌ల్ని నిషేధించి పెద్ద దెబ్బ కొట్టింది కేంద్ర ప్రభుత్వం. యాప్‌ల ద్వారా రహస్యాలను, వ్యక్తిగత డాటాను సేకరిస్తుందనే ఆరోపణల మీద ఆ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అప్పటి నుంచి ‘లోకల్‌నెస్’ ప్రదర్శించుకోవడం కోసం స్థానిక ఉత్పత్తి దిశగా అడుగులు ప్రారంభించాయి కొన్ని కంపెనీలు. కానీ, కేంద్రం మాత్రం ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోకుండా.. ఇప్పుడు ఫోన్ల ద్వారా రహస్యాల సేకరణకు ఆస్కారం ఉన్నందున స్మార్ట్ఫోన్ల మార్కెట్ నియంత్రణకు సిద్ధపడడం విశేషం. చదవండి: చైనాతో కచ్చి.. బిజినెస్ మాత్రం బిలియన్లలో! -
త్వరలోనే ఒప్పో ఎఫ్19ఎస్ లాంచ్..! ఎప్పుడంటే..?
ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో భారత మార్కెట్లలోకి ఓప్పో ఎఫ్19ఎస్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ సెప్టెంబర్ 27 నుంచి కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. ఫ్లిప్‌కార్ట్ తన అధికారిక సైట్లో ఒప్పో ఎఫ్19ఎస్‌ను టీజ్ చేసింది. గోల్డ్, బ్లాక్ వేరియంట్లలో ఒప్పోఎఫ్19ఎస్ కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. ఒప్పో రెనో 6ప్రో స్మార్ట్‌ఫోన్ దీపావళికి అందుబాటులోకి రానుంది. ఒప్పో ఎఫ్19ఎస్ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 20 వేలలోపు ఉండవచ్చునని తెలుస్తోంది. ఒప్పో ఎఫ్19ఎస్ ఫీచర్లు(అంచనా) 6.43 అంగుళాల ఫుల్ హెచ్డీ హోల్‌పంచ్ డిస్ప్లే ఆక్టాకోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 ఆండ్రాయిడ్ 11 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 48 మెగా పిక్సెల్ రియర్ కెమెరా 6జీబీ ర్యామ్+128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 33వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ 5000ఎమ్ఏహెచ్ బ్యాటరీ చదవండి: Redmi Smart TV: తక్కువ ధరల్లో స్మార్ట్‌టీవీ లాంచ్ చేసిన రెడ్మీ...! -
Apple: పడిపోయిన యాపిల్ మార్కెట్! భారమంతా ఐఫోన్ 13 పైనే?
Apple iPhone 13: టెక్ దిగ్గజం యాపిల్‌కి షాక్ తగిలింది. నూతన ఆవిష్కరణలు, సరికొత్త ఫీచర్లకు కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకునే ఐఫోన్ అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. మార్కెట్ రీసెర్చ్ సంస్థ ట్రెండ్ ఫోర్స్ తాజా లెక్కలు ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాయి. తగ్గిన అమ్మకాలు ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి సంబంధించి గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కు సంబంధించి ట్రెండ్ ఫోర్స్ సంస్థ తాజా గణంకాలు విడుదల చేసింది. ఇందులో రెండో క్వార్టర్‌కి సంబంధించి గ్లోబల్ మార్కెట్లో ఐఫోన్ అమ్మకాలు 13.7 శాతానికే పరిమితమైనట్టుగా తెలిపింది. గతేడాది ఫోన్ అమ్మకాలతో పోల్చితే 22 శాతం మేరకు ఐఫోన్ అమ్మకాలు తగ్గినట్టు ట్రెండ్‌సెట్ పేర్కొంది. నాలుగో స్థానానికి ఒక్కసారిగా ఫోన్ల అమ్మకాలు పడిపోవడంతో గ్లోబల్ మార్కెట్లో యాపిల్ సంస్థ నాలుగో స్థానానికి పరిమితమైంది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసినికి సంబంధించిన అమ్మకాల్లో 19 శాతం మార్కెట్ వాటాతో శామ్సంగ్ మొదటి స్థానంలో ఉండగా ఆ తర్వాత 16.1 శాతం అమ్మకాలతో షావోమీ, ఒప్పోలో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. వాటి తర్వాత 13.7 శాతం మార్కెట్‌తో యాపిల్ నాలుగో స్థానానికి పరిమితమైంది. 11.1 శాతం వాటాతో వివో ఐదో స్థానంలో ఉంది. వివో సంస్థ అమ్మకాల్లో సైతం 18 శాతం తగ్గుదల నమోదైంది. ఐఫోన్ 13పైనే భారం యాపిల్ సంస్థ ఈ నెలాఖరు కల్లా సరికొత్త మోడల్ ఐఫోన్ 13ను రిలీజ్ చేయబోంది. ఇప్పటికే ఐఫోన్ 13 ఫీచర్లకు సంబంధించి మార్కెట్లో అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సిమ్‌తో పని లేకుండా లో ఎర్త్ ఆర్బిట్ టెక్నాలజీపై ఐఫోన 13 పని చేస్తుందంటూ ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు ఐఫోన్ 13కి మరింత క్రేజ్ తెచ్చేందుకు యాపిల్ వాచ్ 7 సిరీస్‌ను సైతం రిలీజ్ వచ్చంటూ కథనాలు వస్తున్నాయి. మొత్తంగా పడిపోయిన మార్కెట్ షేర్‌ను దక్కించుకునేందుకు ఐఫోన్ 13పైనే ఆ సంస్థ భారం వేసింది. చదవండి: గూగుల్ సెర్చ్‌లో తొలి పదం.. ఆసక్తికరమైన విషయం -
కెమెరా ఇన్నోవేషన్ ల్యాబ్‌కు వేదికానున్న హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: కెమెరా ఇన్నోవేషన్ ల్యాబ్ సెంటర్‌కు భాగ్యనగరం వేదిక కానుంది. భారత్‌ను గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌గా మార్చే ప్రక్రియలో భాగంగా ఒప్పో తన బేస్‌ను బలోపేతం చేస్తూ హైదరాబాద్‌లోని కంపెనీ ఆర్ అండ్ డీ సెంటర్లో ప్రత్యేక ల్యాబ్‌ను ఏర్పాటు చేయనున్నుట్లు ఒప్పో ప్రకటించింది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఉపయోగించి కెమెరా సోల్యూషన్స్, యూజర్లకు మెరుగైన అనుభవం కోసం ఇమేజింగ్ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధిపై ఒప్పో దృష్టిసారించనుంది. మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, దక్షిణాసియా, జపాన్, యూరప్‌తో సహా ఇతర దేశాల కోసం భారత ఒప్పో టీం ప్రాతినిధ్యం వహించనుంది. కెమెరా ఇన్నోవేషన్ ల్యాబ్ వీడియో, స్టిల్ ఫోటోగ్రఫీ ఫుల్ డైమెన్షన్ ఫ్యూజన్ (ఎఫ్‌డీఎఫ్) పోర్ట్రెయిట్ వీడియో సిస్టమ్ టెక్నాలజీపై పరిశోధన కోసం పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి కూడా పని చేయనుంది. ఈ ల్యాబ్‌తో వివిధ కృత్రిమంగా సెట్ చేయబడిన దృశ్యాలలో ఫోన్ కెమెరాలను పరీక్షించడానికి. ఆ నమూనాల డేటాను విశ్లేషించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఒప్పో 2021 జూన్ 30 నాటికి 8,800 ఇమేజ్ పేటెంట్ల కోసం దరఖాస్తు చేయగా అందులో సుమారు 3,500 పేటెంట్లకు హక్కులు వరించాయి. -
శాంసంగ్ కు పోటీగా దూసుకెళ్తున్న షియోమీ
గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ షిప్ మెంట్స్ పరంగా దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్, చైనా దిగ్గజం షియోమీ పోటీపడుతున్నాయి. ప్రముఖ రీసెర్చ్ సంస్థ అంతర్జాతీయ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) విడుదల చేసిన గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ గ్రోత్ ఇన్ 2021 క్యూ2 నివేదిక ప్రకారం.. స్మార్ట్‌ఫోన్ షిప్ మెంట్స్ పరంగా శాంసంగ్ అగ్రభాగాన ఉంది. శాంసంగ్ తర్వాత రెండవ స్థానంలో చైనా దిగ్గజం షియోమీ ఉంది. షియోమీ మొదటిసారి రెండవ స్థానానికి చేరుకుంది. క్యూ2 2021లో యాపిల్ ను మూడవ స్థానానికి నెట్టింది. మొత్తం షిప్ మెంట్ వాల్యూమ్ పరంగా సంవత్సరానికి 13.2 శాతం పెరిగాయి. స్మార్ట్‌ఫోన్ విక్రేతలు త్రైమాసికంలో మొత్తంగా 313.2 మిలియన్ పరికరాలను రవాణా చేశారు. 2021 క్యూ2లో శామ్ సంగ్ 59 మిలియన్ యూనిట్లను రవాణా చేసినట్లు ఐడీసీ నివేదించింది. దీంతో మొత్తం మార్కెట్లో దీని వాటా 18.8 శాతం. దక్షిణ కొరియా దిగ్గజం గత ఏడాది ఇదే త్రైమాసికంలో 54 మిలియన్ యూనిట్లను రవాణా చేసింది. మరోవైపు, షియోమీ క్యూ2 2021లో 53.1 మిలియన్ యూనిట్లతో షిప్ మెంట్ లలో గణనీయమైన వృద్ధిని సాధించింది. ఇక మార్కెట్లో దీని వాటా 16.9 శాతం. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రవాణా చేసిన 28.5 మిలియన్ యూనిట్ల నుంచి ఇది భారీ పెరుగుదల. ఐడీసీ నివేదికల ప్రకారం.. 44.2 మిలియన్ షిప్ మెంట్లు, 14.1 శాతం మార్కెట్ వాటాతో యాపిల్ మూడవ స్థానానికి చేరుకుంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో యాపిల్ 37.6 మిలియన్ యూనిట్లను రవాణా చేసి 13.6 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఇక తర్వాత వరుసలో ఒప్పో(32.8 మిలియన్లు), వివో 31.6 మిలియన్ల షిప్ మెంట్లతో ఐడీసీ జాబితాలో మూడవ, నాల్గవ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. -
ఇండియాలోనే ఫాస్టెస్ట్ 5జీ ఫోన్... రిలీజ్ ఎప్పుడంటే?
పవర్ ఫుల్ ప్రాసెసర్, దుమ్మురేగిపోయే ఫీచర్లతో 5జీ స్మార్ట్‌ఫోన్‌ని రిలీజ్ చేసేందుకు ఒప్పో రంగం సిద్ధం చేసింది. జులై 14న సరికొత్త ఒప్పో రెనో 6 పేరుతో కొత్త 5జీ ఫోన్‌ను మార్కెట్లోకి తేనుంది. ఇప్పటి వరకు మిడ్‌రేంజ్ ప్రీమియం ఫోన్ల సెగ్మెంట్లో ఒప్పో నుంచి వచ్చిన రెనో సీరిస్ ఫోన్లు వినియోగదారులను బాగానే ఆకట్టుకున్నాయి.పవర్ఫుల్ ప్రాసెసర్ఇటీవల కాలంలో పవర్ ఫుల్ ప్రాసెసర్‌గా గుర్తింపు పొందిన మీడియాటెక్ డైమెన్సిటీ 900ని ఈ మొబైల్లో ఉపయోగించారు. ఈ ప్రాసెసర్ 5జీని సపోర్ట్ చేయడంతో పాటు 108 మెగాపిక్సెల్ కెమెరా, 120 గిగాహెర్జ్ రిఫ్రెష్‌రేట్, ఫాస్ట్ ఛార్జింగ్, వైఫై 6 కనెక్టివిటీ, ఆల్ట్రా ఫాస్ట్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే, బ్యాటరీ మేనేజ్మెంట్ పనులు అద్భుతంగా నిర్వహిస్తుందనే పేరుంది. హాట్‌స్పాట్‌ని ఆన్ చేసి ఉంచనప్పుడు బ్యాటరీ డ్రైయిన్ కాకుండా ఎక్కువ సేపు ఉంటుందని కంపెనీ పేర్కొంది. మిగిలిన కంపెనీలతో పోల్చితే కనీసం 30 శాతం బ్యాటరీ ఎక్కువగా వస్తుందని చెబుతోంది.ఫాస్టెస్ట్ 5జీమీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్‌ని ఉపయోగించడం ద్వారా ఇండియాలోనే అత్యంత వేగవంతమైన స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తెస్తున్నామని ఒప్పో రీసెర్చ్ , డెవలప్మెంట్ వైస్ ప్రెసిడెంట్ తస్లీమ్ ఆరీఫ్ అన్నారు. అత్యంత వేగవంతమైన ఫోన్లో గేమింగ్, వీడియోగ్రఫి, వీడియో కంటెంట్ చూసేప్పుడు మంచి అనుభూతి కలుగుతుందని ఆయన అన్నారు.మీడియాటెక్ప్రస్తుతం హై ఎండ్ ప్రీమియం ఫోన్లు ఎక్కువగా స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్లను ఉపయోగిస్తున్నాయి. అయితే వాటికి ధీటుగా మీడియాటెక్ ఇటీవల డైమెన్సిటీ 900ని మార్కెట్లోకి తీసుకు వచ్చింది. దీంతో కొత్త ప్రాసెసర్‌తో రెనో సిరీస్‌లో మరో కొత్త ఫోన్‌ని ఒప్పో ఫోన్ తీసుకు వస్తోంది. -
5జీ స్మార్ట్‌ఫోన్స్ అమ్మకాల్లో దూసుకెళ్తున్న వివో
న్యూఢిల్లీ: చైనా మొబైల్ తయారీ కంపెనీ వివో 5జీ స్మార్ట్‌ఫోన్స్ విభాగంలో సత్తా చాటుతోంది. జనవరి-మార్చి త్రైమాసికంలో 5జీ స్మార్ట్‌ఫోన్స్ అమ్మకాల్లో శామ్ సంగ్ తర్వాత ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న రెండవ బ్రాండ్ గా నిలిచినట్టు పరిశోధన సంస్థ స్ట్రాటజీ ఎనలిటిక్స్ వెల్లడించింది. అంత క్రితం త్రైమాసికంతో పోలిస్తే వివో అమ్మకాలు 62 శాతం పెరిగి 1.94 కోట్ల యూనిట్లు నమోదయ్యాయని వివరించింది. 5జీ ప్రమాణాలు, కీలక సాంకేతికత విషయంలో కంపెనీ పురోగతి సాధించిందని వివో తెలిపింది. చైనా యూరప్‌లో వివో సుస్థిర స్థానం సంపాదించింది. ఆపిల్ ఇప్పటికి 5జీ టాప్ బ్రాండ్ గా కొనసాగుతుంది. ప్రపంచ మార్కెట్లో ఈ కంపెనీ 29.8 శాతం వాటాను కలిగి ఉంది. తరువాత స్థానంలో ఒప్పో 15.8 శాతం వాటాతో ఉండగా, వివో 14.3 శాతం వాటాను కలిగి ఉన్న మూడవ అతిపెద్ద 5జి బ్రాండ్ గా నిలిచింది. -
వన్ ప్లస్ ఆక్సిజన్ ఓఎస్ ఒప్పో కలర్ ఓఎస్‌తో విలీనం
వన్ ప్లస్ యూజర్లకు షాకింగ్ న్యూస్. కొద్ది రోజుల క్రితం ఒప్పోలో వన్ ప్లస్ విలీనం అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా వన్ ప్లస్ ఆక్సిజన్ ఓఎస్‌ను ఒప్పో కలర్ ఓఎస్‌తో విలీనం చేస్తున్నట్లు ప్రకటించింది. ‘‘ఆక్సిజన్ ఓఎస్ ఎప్పటిలాగే గ్లోబల్ వన్ ప్లస్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ఇక నుంచి ఈ సరికొత్త ఓఎస్ మరింత స్థిరమైన, బలమైన వేదికగా మీకు అందుబాటులో ఉంటుంది’’ అని వన్‌ప్లస్ ఒక ప్రకటనలో తెలిపింది. గ్వాంగ్ డాంగ్ బిబికె ఎలక్ట్రానిక్స్ యాజమాన్యంలో ఉన్న వన్ ప్లస్, ఒప్పో కొంతకాలంగా కలిసి పనిచేస్తున్నాయి. అయితే, కంపెనీలు తమ పరిశోధన, అభివృద్ధి(ఆర్ అండ్ డీ) వనరులను సమీకృతం చేసిన తర్వాత ఒప్పందాన్ని బహిర్గతం చేశాయి. ఒక ఫోరం పోస్ట్ లో వన్ ప్లస్ ఆక్సిజన్ ఓఎస్ ఒప్పో కలర్ ఓఎస్‌తో విలీనంతో యూజర్స్‌కి అద్భుతమైన సరికొత్త ఓఎస్ సాఫ్ట్వేర్ అనుభూతిని అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ ఓఎస్ భవిష్యత్తులో తన కొత్త పరికరాలకు వర్తిస్తుందని, మెయింటెనెన్స్ షెడ్యూల్ లో ఉన్న ప్రస్తుత పరికరాల కొరకు, ఆక్సిజన్ ఓఎస్ కలర్ ఓఎస్ మధ్య కోడ్ బేస్ స్థాయి ఇంటిగ్రేషన్ ఆండ్రాయిడ్ 12తోపాటు ఓవర్ ది ఎయిర్ (ఓటీఏ) అప్ డేట్ ద్వారా వస్తుందని వన్ ప్లస్ తెలిపింది. ఒరిజినల్ వన్ ప్లస్ నార్డ్, కొత్త నార్డ్ మోడల్స్, వన్ ప్లస్ నార్డ్ సీఈ 5జీ విషయంలో కంపెనీ రెండు ప్రధాన ఆండ్రాయిడ్ అప్డేట్ లు, మూడు సంవత్సరాల సెక్యూరిటీ అప్ డేట్ లను అందించాలని నిర్ణయించింది. ఈ సంవత్సరం ప్రారంభంలో వన్ ప్లస్ తన ఆక్సిజన్ ఓఎస్ స్థానంలో ఒప్పో కలర్ ఓఎస్ ను ఫ్లాగ్ షిప్ మోడల్స్ లో అన్ని చైనీస్ మొబైల్స్ లో తీసుకొచ్చింది. చదవండి: మైనర్ల పేరుతో పీఓఎమ్ఐఎస్ ఖాతా తెరవొచ్చు -
వన్ ప్లస్ సంచలన నిర్ణయం.. ఒప్పోలో విలీనం
వన్ ప్లస్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. వన్ ప్లస్ చివరకు ఒప్పోతో విలీనం కానున్నట్లు ప్రకటించింది. వన్ ప్లస్ సహ వ్యవస్థాపకుడు & సీఈఓ పీట్ లావ్ మాట్లాడుతూ.. మరింత మందికి చేరుకునే ప్రయత్నాల్లో భాగంగా వన్ ప్లస్ ను ఒప్పోలో విలీనం చేయనున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ విలీనం తర్వాత కూడా వన్ ప్లస్, ఒప్పో రెండూ ప్రత్యేక బ్రాండ్లుగా స్వతంత్రంగా పనిచేయనున్నట్లు ఎగ్జిక్యూటివ్ తెలిపారు. వన్ ప్లస్ ఈ మధ్యే సరసమైన స్మార్ట్ ఫోన్ నార్డ్ సీఈని భారతదేశం, ఇతర మార్కెట్లలో లాంఛ్ చేసిన కొద్ది రోజుల తర్వాత ఈ ప్రకటన చేసింది. వన్ ప్లస్ కస్టమర్ ల కొరకు "ఇంకా మెరుగైన ఉత్పత్తులను" అందించడానికి ఒప్పోతో విలీనం అయినట్లు సీఈఓ ఫోరం పోస్ట్ లో పేర్కొన్నారు. వన్ ప్లస్, ఒప్పో రెండూ చైనాకు చెందిన బీబీకే ఎలక్ట్రానిక్స్ యాజమాన్యం కింద ఉన్నాయి. వాటితో పాటు వివో, రియల్ మీ వంటి బ్రాండ్లు కూడా ఉన్నాయి. ఈ కంపెనీలన్నీ, వాటి ప్రారంభం నుంచి అంతర్గతంగా కలిసి పనిచేస్తున్నాయి. వన్ ప్లస్ ను లావ్, అతని కార్ల్ పెయ్ కూడా సహ-స్థాపించారు. డిసెంబర్ 2013లో కంపెనీ స్థాపించడానికి ముందు ఇద్దరూ ముందు ఒప్పోలో పనిచేశారు. తాజాగా తీసుకున్న నిర్ణయం వల్ల మరిన్ని మంచి ఉత్పత్తులను తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు రెండు సంస్థలు తెలిపాయి. చదవండి: ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ తీపికబురు -
ఒప్పో దూకుడు: ఆరేళ్లలో కోటి స్మార్ట్ఫోన్లు
సాక్షి న్యూఢిల్లీ: స్మార్ట్ డివైస్ బ్రాండ్ ఒప్పో ఎఫ్ సిరీస్‌లో ఒక కోటికిపైగా ఫోన్లను విక్రయించింది. ఆరేళ్లలోనే ఈ ఘనతను సాధించినట్టు కంపెనీ తెలిపింది. డ్యూయల్ సెల్ఫీ కెమెరా, 25 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, స్లీక్ డిజైన్ మోడళ్లను తొలిసారిగా స్మార్ట్‌ఫోన్ రంగంలో ఎఫ్ సిరీస్‌లో అందుబాటులోకి తెచ్చినట్టు వెల్లడించింది. ఇటీవల ప్రారంభించిన ఎఫ్ 19 ప్రో సిరీస్ ఎఫ్-సిరీస్ స్మార్ట్ఫోన్ల అమ్మకాలపై బలమైన ప్రభావాన్ని చూపించిందని ఒప్పో ఇండియా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ దమయంత్ సింగ్ ఖానోరియా వెల్లడించారు. ఎఫ్ 19 ప్రో సిరీస్ లాంచ్ అయిన మూడు రోజుల్లోనే 230 కోట్ల రూపాయల విలువైన రికార్డు అమ్మకాలను నమోదు చేసిందన్నారు. ఇటీవలే కంపెనీ 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో స్లీక్ మోడల్ ఎఫ్-19ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. -
10నిమిషాల్లో స్మార్ట్‌ఫోన్ ఫుల్ ఛార్జ్
సాధారణంగా ఒక స్మార్ట్‌ఫోన్ ఫుల్ ఛార్జ్ చేయాలంటే ఫోన్లో ఉండే బ్యాటరీ కెపాసిటీని బట్టి 1 నుంచి 2 గంటలు సమయం పడుతుంది. ఎప్పుడైతే ఫాస్ట్ ఛార్జర్స్ టెక్నాలజీ మార్కెట్ లోకి వచ్చిందో అప్పటి నుంచి ఛార్జింగ్ సమయం ఒక గంట లేదా అంతకన్నా తక్కువకు తగ్గిపోయింది. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న 65వాట్ ఫాస్ట్ ఛార్జర్‌తో స్మార్ట్‌ఫోన్‌ను 40 నిమిషాల్లో ఛార్జ్ చేయొచ్చు. అంతే కాకుండా, 125వాట్ అల్ట్రాడార్ట్ ఛార్జింగ్ సొల్యూషన్‌తో 20 నిమిషాల్లో స్మార్ట్‌ఫోన్‌ను 100 పర్సెంట్ ఛార్జ్ చేయొచ్చు. ఒప్పో కూడా 125వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ఇప్పటి వరకు 125వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సహాయంతో 20 నిమిషాల్లో స్మార్ట్‌ఫోన్‌ను ఫుల్ ఛార్జ్ చేయవచ్చు. కానీ, చైనా మొబైల్ తయారీ కంపెనీ షియోమీ 200 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ తయారీపై దృష్ట్టి సారించినట్లు సమాచారం. 200వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే స్మార్ట్‌ఫోన్‌ను 10 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. వైర్డ్, వైర్లెస్, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీని 200వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో షియోమీ అందించే అవకాశం ఉంది. ఈ ఏడాదిలోనే షియోమీ 200వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అందుబాటులోకి రావొచ్చు. త్వరలో రాబోయే షియోమీ ఎంఐ 11 అల్ట్రాలో ఈ టెక్నాలజీ తీసుకోని రావచ్చు. -
యూట్యూబ్ వాయిస్ కమెండ్స్
స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ తాజాగా వాయిస్ కమెండ్స్ ఇన్పుట్ ఫీచర్‌ను తీసుకువచ్చింది. సెర్చ్, నెవిగెట్, ప్లే కోసం దీన్ని ఉపయోగించవచ్చు. కుడివైపు సెర్చ్బోర్డ్ పైన ఉన్న మైక్రోఫోన్ ఐకాన్‌ను టాప్ చేస్తే ‘లిస్టెనింగ్’ అనే టెక్ట్స్‌తో ఒక బాక్స్ వస్తుంది. ఇక్కడ మనం ఆడియో కమాండ్స్ ఇవ్వవచ్చు. ప్లే అవుతున్న వీడియో ఆటోమెటిగ్గా పాజ్ అవుతుంది. బాటమ్‌లో ఉన్న మరో మైక్రోఫోన్ ఐకాన్‌తో ‘స్పీచ్–టు–టెక్ట్స్’ను తాత్కాలికంగా డిజెబుల్, ఎనేబుల్ చేయవచ్చు. వాయిస్ కమెండ్ కోసం రకరకాల భాషలు అందుబాటులో ఉన్నాయి. oppo reno 5 pro 5g ► డిస్ప్లే: 6.55 అంగుళాలు ► ర్యామ్: 8జీబి ► స్టోరేజ్: 128 జీబి ► రిఫ్రెష్ రేట్: 90 హెచ్జడ్ ► 65 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ ► 64–మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా ట32 ఎంపీ సెల్ఫీ కెమెరా ► 48–మెగా పిక్సెల్ సెన్సర్ ► 4,350 ఎంఎహెచ్ బ్యాటరీ ట1,080 x 2,400 రెజల్యుషన్ టఏఐ హైలెట్ వీడియో మోడ్ ► కలర్ ఆప్షన్స్: అస్ట్రాల్ బ్లూ, స్టారీ బ్లాక్ ట ధర: రూ.35,990 htc desire 21 pro 5g ► డిస్ప్లే: 6.7 అంగుళాలు ► ర్యామ్: 8జీబి ► స్టోరేజ్: 128 జీబి ► బ్యాటరీ సామర్థ్యం: 5,000 ఎంఏహెచ్ ► రిఫ్రెష్ రేట్: 90 హెచ్జడ్ ► 18 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ ► సైడ్–మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ► 48–మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ ► 8–మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ టపంచ్ హోల్ సెల్ఫీ కెమెరా ► కలర్ ఆప్షన్స్: బ్లూ, పర్పుల్ టధర: రూ.34,000 (సుమారుగా) nec lavie mini లెనోవా భాగస్వామ్యంతో nec సూపర్ ఎగ్జాయిటింగ్ lavie మినీ హైబ్రిడ్ డివైజ్‌ను లాంచ్ చేసింది. దీన్ని ల్యాప్‌టాప్‌గా, పోర్టబుల్ గేమింగ్ డివైజ్‌గా ఉపయోగించవచ్చు. ఈ డ్యుయల్ పర్సస్ డివైజ్‌లో 8 అంగుళాల ఫుల్ హెచ్డీ స్క్రీన్ ఉంది. ర్యామ్: 16 జీబి 1920x1200 పిక్సెల్స్ రెజల్యుషన్ టబరువు: 579 గ్రా. టఐఆర్ కెమెరాటజీరో టచ్ లాగిన్ టకలర్: క్రిస్టల్ వైట్. ఫాజిల్ జెన్ 5 ఎల్టీయి స్మార్ట్‌వాచ్ స్టైలీష్ వేర్ వోఎస్–పవర్డ్ స్మార్ట్‌వాచ్‌లను రూపొందించడంలో పేరున్న అమెరికన్ ఫ్యాషన్ డిజైనర్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ ఫాజిల్ తాజాగా జెన్5 ఎల్టీయిని మార్కెట్లోకి తీసుకువచ్చింది. వివరాలు... స్క్రీన్ సైజ్: 1.3 అంగుళాలు స్టోరేజ్: 8జీబి ’బ్యాటరీ: 400 ఎంఏహెచ్, స్లీప్ ట్రాకర్, హార్ట్‌రేట్ మానిటరింగ్, ఫిట్నెస్ ట్రాకర్ ఎన్ఎఫ్యస్ సపోర్ట్ (గూగుల్ పే, గూగుల్ అసిస్టెంట్) ‘జీపియస్’ స్విమ్ఫ్రూఫ్ కలర్ ఆప్షన్స్: బ్లాక్, పింక్ ధర (సుమారుగా): రూ.25,000 -
ఒప్పో రెనో 5ప్రోలో అదిరిపోయే ఫీచర్స్
న్యూఢిల్లీ: ఒప్పో రెనో 5ప్రో భారతదేశంలో మిడ్-రేంజ్ స్పెసిఫికేషన్లతో ప్రారంభించబడింది. మీడియా టెక్ డైమెన్సిటీ 1000 ప్లస్ 5జీ సపోర్ట్ ప్రాసెసర్ ని ఈ మొబైల్ లో తీసుకొచ్చింది. ఒప్పో రెనో 5 ప్రో భారతదేశంలో 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ కాన్ఫిగరేషన్ ధర రూ.35,990. ఈ స్మార్ట్‌ఫోన్ ఆస్ట్రల్ బ్లూ మరియు స్టార్రి బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఒప్పో రెనో 5ప్రో జనవరి 22న ఫ్లిప్‌కార్ట్ ద్వారా మొదటి సేల్ కి రానుంది.(చదవండి: ఒప్పో ఎ12 మోడల్ ధర తగ్గింపు) ఒప్పో రెనో 5ప్రో స్పెసిఫికేషన్స్: డిస్ప్లే: 6.55-అంగుళాల ఫుల్ హెచ్డి ప్లస్ ఓఎల్ఈడి డిస్ప్లే(90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్) ర్యామ్: 8జీబీ ఇంటర్నల్ స్టోరేజ్: 128జీబీ ప్రాసెసర్: మీడియా టెక్ డైమెన్సిటీ 1000 ప్లస్ రియర్ కెమెరా: 64ఎంపీ + 8ఎంపీ + 2ఎంపీ+ 2ఎంపీ సెల్ఫీ కెమెరా: 32 మెగాపిక్సెల్ బ్యాటరీ: 4,350 ఎంఏహెచ్(65వాట్ ఫాస్ట్ ఛార్జింగ్) ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 11 సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్ కనెక్టివిటీ: 5జీ, 4జీ వోఎల్టిఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, యుఎస్బి టైప్-సి పోర్ట్, బ్లూటూత్ 5.1 కలర్స్: ఆస్ట్రల్ బ్లూ, స్టార్రి బ్లాక్ ధర: రూ.35,990 -
ఒప్పో ఎ12 మోడల్ ధర తగ్గింపు
భారతదేశంలో ఒప్పో తన ఎ12 మోడల్ ధరను తగ్గించింది. ఒప్పో ఎఫ్17, ఒప్పో ఎ15, ఒప్పో రెనో 3 ప్రోలతో పాటు ఒప్పో ఎ12ను జూన్‌లో భారత్‌లో విడుదల చేశారు. ఒప్పో ఎ12 మీడియాటెక్ హెలియో పీ35 ప్రాసెసర్ ని కలిగి ఉంది. కొత్త ధరల ప్రకారం భారతదేశంలో ఒప్పో ఎ 12 3జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.8,990 నుంచి రూ.8,490కు తగ్గించింది. అదే విదంగా 4 జీబీ ర్యామ్ + 64 జిబి స్టోరేజ్ ధర కూడా రూ.11490 నుంచి రూ.10,990కు ధర తగ్గించబడింది.(చదవండి: హైక్ మెసెంజర్ సేవలు నిలిపివేత) ఒప్పో ఎ12 ఫీచర్స్: డిస్ప్లే: 6.22-అంగుళాల హెచ్డి ప్లస్ డిస్ప్లే ర్యామ్: 3జీబీ, 4జీబీ ఇంటర్నల్ స్టోరేజ్: 32జీబీ, 64జీబీ ప్రాసెసర్: మీడియాటెక్ హెలియో పీ35 రియర్ కెమెరా: 13ఎంపీ + 2ఎంపీ+ 2ఎంపీ సెల్ఫీ కెమెరా: 05 మెగాపిక్సెల్ బ్యాటరీ: 4,320 ఎంఏహెచ్(33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్) ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 9 సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్ -
ఒప్పో రెనో 5ప్రో విడుదల నేడే
న్యూఢిల్లీ: ఒప్పో తన కొత్త సిరీస్ రెనో 5ప్రో 5జీ మొబైల్ ని నేడు(జనవరి 18) భారతదేశంలో లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. రెనో 5ప్రో 5జీ మొబైల్ మధ్యాహ్నం 12:30 గంటలకు విడుదల కానుంది. ఈ ఫోన్ గురించి కంపెనీ ఒక మైక్రో పేజీని సృష్టించింది. ఇక్కడ ఫోన్ యొక్క కొన్ని ఫీచర్లు హైలైట్ చేసారు. ఒప్పో రెనో 5ప్రో 5జీ 6.5-అంగుళాల 1080p అమోలెడ్ డిస్ప్లేను కలిగి ఉంటుంది. దీని రిఫ్రెష్ రేటు 90 హెర్ట్జ్‌గా ఉంది. ఈ ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 1000+ ప్రాసెసర్‌ను అందించనున్నారు. రెనో 5ప్రో 5జీలో 64 ఎంపీ ప్రైమరీ కెమెరా, 2 ఎంపీ మాక్రో కెమెరా, 2 ఎంపీ పోర్ట్రెయిట్ లెన్స్ కెమెరా ఉంది. ఇందులో సెల్ఫీ కోసం 32 ఎంపీ కెమెరాను అందించారు. దీనిలో 65వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేసే 4,350 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఉంది. ఆండ్రాయిడ్ 11 ఆధారిత కలర్ ఓఎస్ 11.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్/ఏ-జీపీఎస్, గ్లోనాస్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 4300 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. చైనాలో ఈ స్మార్ట్‌ఫోన్ ధర 3,399(సుమారు రూ.39,000) చైనా యువాన్లుగా ఉంది. -
5జీ బడ్జెట్ మొబైల్ వచ్చేసింది!
ఒప్పో ఏ93 5జీ మొబైల్ ను చైనాలో ప్రారంభించింది. ఒప్పో ఏ93 5జీ మొబైల్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 480 ప్రాసెసర్ ను తీసుకొచ్చింది. ఒప్పో మొదటిసారిగా బడ్జెట్ మొబైల్స్ లో 5జీ కనెక్టివిటీ తీసుకురావడం విశేషం. ఈ మొబైల్ ప్రధాన కెమెరా సామర్ధ్యం 48 మెగాపిక్సెల్. అలాగే ఇది 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఇది రెండు స్టోరేజ్ మోడల్స్, మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.(చదవండి: శామ్సంగ్ నుంచి మరో పవర్ ఫుల్ ప్రాసెసర్) ఒప్పో ఏ93 ఫీచర్స్: ఒప్పో ఏ93 5జీ మొబైల్ 6.5-అంగుళాల ఫుల్ హెచ్ డి ప్లస్(1,080x2,400) ఎల్సిడి డిస్ప్లే, సెల్ఫీ కెమెరా కోసం హోల్-పంచ్ స్క్రీన్ తో వస్తుంది. ఇది 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ స్నాప్‌డ్రాగన్ 480 చిప్సెట్తో పాటు 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. ఒప్పో ఏ93 ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌లో ఎఫ్/1.7 ఎపర్చర్‌తో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, ఎఫ్/2.4 ఎపర్చర్‌తో 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా, ఎఫ్/2.4 ఎపర్చర్‌తో 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు + వీడియో కాలింగ్ కోసం ఎఫ్/2.0 ఎపర్చర్‌తో 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఒప్పో ఏ93 5జీ కనెక్టివిటీ విషయానికి వస్తే 3.5ఎంఎం ఆడియో జాక్, బ్లూటూత్ 5.1, వై-ఫై, యుఎస్ బి టైపు సీ పోర్టు ఉన్నాయి. ఇది 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేసే 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. చైనాలో దీని 8జీబీ+256జీబీ స్టోరేజ్ మోడల్ ధర 1,999 (సుమారు రూ.22,500)యువాన్లుగా ఉంది. ఒప్పో ఏ93 5జీ మొబైల్ సిల్వర్, బ్లాక్, అరోరా కలర్ ఆప్షన్లలో లభించనుంది. -
18న రానున్న ఒప్పో కొత్త వైర్లెస్ ఇయర్‌ఫోన్స్
ఒప్పో ఇండియా కొత్త ఎన్కో ఎక్స్ వైర్లెస్ ఇయర్‌ఫోన్స్, ఒప్పో రెనో 5 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను జనవరి 18న విడుదల చేయడానికి సిద్దమైంది. ఈ రెండింటిని చైనాలో ఇప్పటికే విడుదల చేసారు. చైనాలో ఒప్పో ఎన్కో ఎక్స్ ధర సిఎన్‌వై 999(సుమారు రూ .11,000)కు, ఒప్పో రెనో 5 ప్రో 5జీ ధర సీఎన్‌వై 3,399(సుమారు రూ.38,200)కు అందుబాటులో ఉన్నాయి.(చదవండి: మరో కీలక ప్రయోగానికి సిద్ధమైన నాసా) ఒప్పో రెనో 5ప్రో 5జీ ఫీచర్స్: ఒప్పో రెనో 5 ప్రోలో 6.55-అంగుళాల ఫుల్ హెచ్ డి ప్లస్ 90హెర్ట్జ్ డిస్ప్లేను 92.1 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తిలో కలిగి ఉంది. ఈ మొబైల్ మీడియాటెక్ డైమెన్సిటీ 1000+ ప్రాసెసర్ తో పని చేయనుంది. ఇది కొత్తగా వచ్చిన ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ మీద పనిచేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఇందులో ఎఫ్/1.7 లెన్స్‌తో 64 ఎంపీ ప్రైమరీ కెమెరా, అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో 8 ఎంపీ కెమెరా, 2 ఎంపీ మాక్రో షూటర్, 2 ఎంపీ పోర్ట్రెయిట్ కెమెరా ఎఫ్/2.4 లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియోలను తీయడానికి ముందుభాగంలో 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఒప్పో రెనో 5 ప్రో 5జీలో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఈ 5జీ ఫోన్ లో 4,350 ఎంఏహెచ్ బ్యాటరీ 65వాట్ ఫాస్ట్ ఛార్జర్‌తో పని చేయనుంది. కనెక్టివిటీ విషయానికి వస్తే 5జీ, ఎస్ఐ/ఎన్ఎస్ఎ, డ్యూయల్ 4జీ వోల్టిఇ, వై-ఫై 802.11ఎసి, బ్లూటూత్ 5, జీపీఎస్, ఎన్ఎఫ్సి, డ్యూయల్ సిమ్, యుఎస్బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. దీనిని అరోరా బ్లూ, మూన్లైట్ నైట్, స్టార్రి నైట్ రంగులలో అందుబాటులోకి రానుంది. ఒప్పో ఎన్కో ఎక్స్ ఫీచర్స్: ఈ ఇయర్ఫోన్లు డ్యూయల్ డ్రైవర్ సెటప్‌ను అందిస్తున్నాయి. ప్రతి ఇయర్‌పీస్‌లో 11 ఎంఎం మూవింగ్ కాయిల్ డ్రైవర్, 6 ఎంఎం ప్లేన్ డయాఫ్రాగమ్ డ్రైవర్ ఉంటుంది. ఇది ఎస్బీసి,ఏఏసి, ఎల్ హెచ్ డీసి వంటి బ్లూటూత్ కోడెక్‌లకు సపోర్ట్ చేస్తుంది. ఇవి 4 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తాయి. అదే చార్జింగ్ కేస్‌తో అయితే 20 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తాయి. యూఎస్బీ టైప్ సి పోర్టు ద్వారా వీటిని చార్జింగ్ చేసుకోవచ్చు. ఇందులో బ్లూటూత్ 5.2 కనెక్టివిటీ, ఐపీ54 స్వెట్, వాటర్ రెసిస్టెన్స్‌ను అందిస్తున్నారు. -
జనవరి 18న లాంచ్ కానున్న ఒప్పో రెనో 5 ప్రో
న్యూఢిల్లీ: ఒప్పో రెనో 5ప్రో 5జీ మొబైల్ ను ఇండియాలో జనవరి 18న మధ్యాహ్నం 12:30గంటలకు లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఒప్పో రెనో 5 5జీ సిరీస్ గత నెలలో చైనాలో లాంచ్ అయింది. ఒప్పో రెనో 5 4జీ వేరియంట్‌ను కొన్ని రోజుల క్రితం వియత్నాంలో విడుదల చేశారు. ప్రస్తుతానికి ఒప్పో రెనో 5 ప్రో 5జీ మాత్రమే భారతదేశంలో లాంచ్ ప్రకటించింది. అయితే సమీప భవిష్యత్తులో కంపెనీ ఇతర మోడళ్లను దేశంలో లాంచ్ చేసే అవకాశం ఉంది.(చదవండి: కొత్త ఏడాదిలో వాట్సాప్ నుంచి బిగ్ అప్డేట్) ఒప్పో రెనో 5ప్రో 5జీ ఫీచర్స్: ఒప్పో రెనో 5ప్రో 5జీ యొక్క ఇండియన్ వేరియంట్ లక్షణాలు చైనీస్ వేరియంట్ మాదిరిగానే ఉంటాయని భావిస్తున్నారు. ఒప్పో రెనో 5ప్రో 5జీ ఆండ్రాయిడ్ 11లో కలర్ఓఎస్ 11.1 డ్యూయల్ సిమ్(నానో) సపోర్ట్ తో నడుస్తుంది. ఇందులో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 92.1 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో, 6.55-అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్(1,080x2,400 పిక్సెల్స్) ఓఎల్ఈడీ కర్వ్డ్ డిస్ప్లే ఉంది. రెనో 5ప్రో ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 1000+ ప్రాసెసర్ చేత పనిచేయనుంది. ఏఆర్ఎం జీ77 జీపీయూతో పాటు 12జీబీ ర్యామ్ ఉంటుంది. ఒప్పో రెనో 5 ప్రో 5జీలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంది, ఇందులో ఎఫ్/1.7 లెన్స్‌తో 64 ఎంపీ ప్రైమరీ కెమెరా, అల్ట్రా-వైడ్ యాంగిల్ ఎఫ్/2.2 లెన్స్‌తో 8 ఎంపీ కెమెరా, ఎఫ్/2.4 లెన్స్‌తో 2 ఎంపీ మాక్రో షూటర్, ఎఫ్/2.4 లెన్స్‌తో 2 ఎంపీ పోర్ట్రెయిట్ షూటర్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీ కోసం ఇందులో 32 ఎంపీ కెమెరా ఉంది.(చదవండి: గెలాక్సీ ఎస్ 21 లాంచ్ ఎప్పుడంటే!) దింట్లో 256జీబీ వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ఉంటుంది. కనెక్టివిటీ కోసం డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.1, జిపిఎస్/ఎ-జిపిఎస్, గ్లోనాస్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, ఛార్జింగ్ కోసం యుఎస్బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఒప్పో రెనో 5 ప్రో 5జీలో 4,350ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 65వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. సెన్సార్ల విషయానికి వస్తే జియోమాగ్నెటిక్ సెన్సార్, ప్రాక్సిమిటి సెన్సార్, యాక్సిలెరోమీటర్, గ్రావిటీ సెన్సార్, గైరోస్కోప్ సెన్సార్ ఉన్నాయి. ఫోన్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది. ఇది 173 గ్రాముల బరువు ఉంటుంది. ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 3,399 యువాన్లుగా(సుమారు రూ.38,200) ఉంది. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 3,799 యువాన్లుగా(సుమారు రూ.42,700) నిర్ణయించారు. -
ఒప్పో తొలి 5జీ ఇన్నోవేషన్ ల్యాబ్
సాక్షి, ముంబై: స్మార్ట్‌ఫోన్ తయారీదారు ఒప్పో ఇండియాలో తన తొలి 5జీ ఇన్నోవేషన్ ల్యాబ్ ఏర్పాటు చేస్తోంది. చైనా తరువాత , భారతదేశంలోని హైదరాబాద్‌లో తమ తొలి 5జీ ల్యాబ్ అని కంపెనీ ప్రకటించింది. అంతేకాదు నూతన ఆవిష్కరణలతోపాటు, భారతదేశాన్ని ఇన్నోవేషన్ హబ్‌గా మార్చేలక్ష్యంలో భాగంగా మరో మూడు ఫంక్షనల్ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేయాలని కంపెనీ యోచిస్తోంది. స్మార్ట్‌ఫోన్స్ రంగంలో భారత్‌లో 5జీ మోడళ్లకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఒప్పో ఈ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో తమ రీసెర్చ్, డెవలప్మెంట్ కేంద్రంలో 5జీ ఇన్నేవేషన్ ల్యాబ్‌ను ఆవిష్కరించనున్నామనీ, విదేశాల్లో ఇది మొదటిదని ఒప్పో తెలిపింది. అలాగే అత్యాధునిక ఆవిష్కరణ పనుల కోసం కెమెరా, పవర్, బ్యాటరీ పనితీరు మెరుగుపర్చేలా మరో మూడు ఫంక్షనల్ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. తద్వారా 5 జీ యుగానికి కోర్ టెక్నాలజీలను అభివృద్ధి చేయడానికి, మొత్తం పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నామని తెలిపింది. ముఖ్యంగా ఇండియా 5జీ ప్రయాణంలో మద్దతు ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఒప్పో ఇండియా వైస్ ప్రెసిడెంట్, హెడ్ ఫర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ తస్లీమ్ ఆరిఫ్ ఒక ప్రకటనలో తెలిపారు. -
ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ లో బెస్ట్ బడ్జెట్ మొబైల్స్ ఇవే!
న్యూఢిల్లీ: మీరు బడ్జెట్ లో మంచి మొబైల్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకు ఒక శుభవార్త. మొబైల్ లవర్స్ కోసం క్రిస్మస్ పండుగ సందర్బంగా అమెజాన్ సరికొత్త ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్ ని తీసుకొచ్చింది. ఈ సేల్ డిసెంబర్ 22 నుండి డిసెంబర్ 25 వరకు కొనసాగుతుంది. ఈ సేల్ లో భాగంగా శామ్సంగ్, ఒప్పో, నోకియా, ఎల్జీ, వివో వంటి బ్రాండ్ల మొబైల్స్ మీద ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తున్నారు. దీనికి తోడు మీరు ఐసీఐసీఐ, ఎస్బిఐ, హెచ్డీఎఫ్సి బ్యాంకు క్రెడిట్ కార్డుల ద్వారా నో కాస్ట్ ఇఎంఐని కూడా పొందగలరు. హెచ్డీఎఫ్సి క్రెడిట్ కార్డులను ఉపయోగించి మొబైల్స్ కొంటె 10% ఇన్స్టాంట్ డిస్కౌంట్ (రూ.1,500) పొందే అవకాశం ఉంది. ఈ సేల్ లో భాగంగా తీసుకొచ్చిన కొన్ని బెస్ట్ బడ్జెట్ మొబైల్స్ మేము మీకోసం అందిస్తున్నాం.(చదవండి: 5వందల కోసం 5వేలు పెట్టుబడి పెడుతున్నారా జాగ్రత్త!) ఒప్పో ఏ11కే ఒప్పో ఏ11కే ఈ ఆఫర్ లో భాగంగా మీకు రూ.8,490కి లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.10990. ఇది 6.2-అంగుళాల హెచ్డి ప్లస్ డిస్ప్లేను కలిగి ఉంది. ఇది మీడియా టెక్ హీలియో పీ35 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఇందులో 2జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్ధ్యం వచ్చేసి 4,230 ఎంఏహెచ్. ఒప్పో ఏ11కే మొబైల్ లో 13 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సల్ సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీ కోసం 5 మెగాపిక్సల్ కెమెరా కూడా అందుబాటులో ఉంది. నోకియా 5.3 నోకియా 5.3 ఈ ఆఫర్ లో భాగంగా మీకు రూ.11,999కి లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.16,599. ఇది 6.55-అంగుళాల హెచ్డి ప్లస్ డిస్ప్లేను కలిగి ఉంది. ఇది క్వాల్ కమ్ స్నాప్ డ్రాగన్ 665 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఇందులో 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్ధ్యం వచ్చేసి 4,000 ఎంఏహెచ్. నోకియా 5.3 మొబైల్ లో 13 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ అంగిల్ కెమెరా, 2 మెగా పిక్సల్ డెప్త్, మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీ కోసం 8 మెగాపిక్సల్ కెమెరా కూడా అందుబాటులో ఉంది. శామ్సంగ్ గెలాక్సీ ఎమ్11 శామ్సంగ్ గెలాక్సీ ఎమ్11 ఈ ఆఫర్ లో భాగంగా మీకు రూ.10,000కి లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.12,999. ఇది 6.4-అంగుళాల హెచ్డి ప్లస్ డిస్ప్లేను కలిగి ఉంది. ఇది SDM450-F01 ఆక్టో కోర్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఇందులో 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్ధ్యం వచ్చేసి 5,000 ఎంఏహెచ్. శామ్సంగ్ గెలాక్సీ ఎమ్11 మొబైల్ లో 13 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ అంగిల్ కెమెరా, 2 మెగా పిక్సల్ డెప్త్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీ కోసం 8 మెగాపిక్సల్ కెమెరా కూడా అందుబాటులో ఉంది.(చదవండి: రూ.14వేలకే శామ్సంగ్ 5జీ మొబైల్) ఎల్జీ డబ్ల్యూ30 ప్రో ఎల్జీ డబ్ల్యూ30 ప్రో ఈ ఆఫర్ లో భాగంగా మీకు రూ.12,990కి లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.14,999. ఇది 6.21-అంగుళాల హెచ్డి ప్లస్ డిస్ప్లేను కలిగి ఉంది. ఇది క్వాల్ కమ్ స్నాప్ డ్రాగన్ 632 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఇందులో 3జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్ధ్యం వచ్చేసి 4,050 ఎంఏహెచ్. ఎల్జీ డబ్ల్యూ30 ప్రో మొబైల్ లో 13 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగాపిక్సల్ డెప్త్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీ కోసం 16 మెగాపిక్సల్ కెమెరా కూడా అందుబాటులో ఉంది. వివో వై91ఐ వివో వై91ఐ ఈ ఆఫర్ లో భాగంగా మీకు రూ.8,490కి లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.11,990. ఇది 6.22-అంగుళాల హెచ్డి ప్లస్ డిస్ప్లేను కలిగి ఉంది. ఇది మీడియా టెక్ హీలియో పీ22 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఇందులో 3జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్ధ్యం వచ్చేసి 4,030 ఎంఏహెచ్. వివో వై91ఐ మొబైల్ లో 13 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా ఉంది. సెల్ఫీ కోసం 5 మెగాపిక్సల్ కెమెరా కూడా అందుబాటులో ఉంది. రెడ్మీ 9 పవర్ రెడ్మీ 9 పవర్ మొబైల్ నేడే ఫస్ట్ సేల్ కి వచ్చింది. దీని ధర వచ్చేసి రూ.10,999. ఇది 6.53-అంగుళాల హెచ్డి ప్లస్ డిస్ప్లేను కలిగి ఉంది. ఇది క్వాల్ కమ్ స్నాప్ డ్రాగన్ 662 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఇందులో 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. రెడ్మీ 9 పవర్ మొబైల్ లో 48 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సల్ సెకండరీ కెమెరా, 2 ఎంపీ మాక్రో, 2 ఎంపీ డెప్త్ కెమెరా సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీ కోసం ఇందులో 8ఎంపీ కెమెరా ఉంది. ఇది 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 6000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. -
5జీ స్మార్ట్‌ఫోన్ కావాలంటున్నారు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్‌ఫోన్స్ రంగంలో భారత్‌లో 5జీ మోడళ్లకు ఆదరణ క్రమంగా పెరుగుతోంది. సైబర్‌మీడియా రీసెర్చ్ పరిశోధన ప్రకారం.. దేశంలో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు పరిగణించే అంశాలలో 5జీ ఒకటని 83 శాతం మంది తెలిపారు. ప్రస్తుతం ప్రీమియం స్మార్ట్‌ఫోన్ వాడుతున్న అయిదుగురిలో ముగ్గురు తదుపరి తరం సాంకేతికతకు అప్‌గ్రేడ్ అవ్వాలని చూస్తున్నారు. 5జీ స్మార్ట్‌ఫోన్స్‌లో ఒప్పో బ్రాండ్‌ను 81 శాతం మంది ఇష్టపడితే, శామ్సంగ్ వైపు 79 శాతం మంది మొగ్గుచూపారు. భారత్‌తోపాటు చైనా, పశ్చిమ యూరప్‌లో ఈ సర్వే చేపట్టారు. 18–35 ఏళ్ల వయసున్న వారు పాలుపంచుకున్నారు. భారత్ నుంచి 3,000 మంది, చైనా 1,000, పశ్చిమ యూరప్‌కు చెందిన 1,000 మంది ఇందులో పాల్గొన్నారు. (చదవండి: బడ్జెట్లో మోటో 5జీ ఫోన్) 5జీ సేవలు అందుబాటులో ఉన్నచోట నాణ్యమైన వీడియో కాల్స్, వేగంగా డౌన్లోడ్స్, అల్ట్రా హై డెఫినిషన్ వీడియోలను వీక్షిస్తున్నారు. కస్టమర్ల సంతృప్తి 80 శాతముంది. వీడియో కంటెంట్ పెరుగుదలకు, వినియోగానికి ఈ టెక్నాలజీ దోహదం చేస్తోంది. చైనాలో హువావే బ్రాండ్‌కు 91% మంది, యాపిల్‌కు 58% మొగ్గుచూపారు. పశ్చిమ యూరప్‌లో శామ్సంగ్కు 88%, హువావే బ్రాండ్‌కు 65% సై అన్నారు. చిప్సెట్ సంస్థలు 5జీ పైనే పెట్టుబడులు చేస్తున్నాయి. -
అదిరిపోయే టెక్నాలజీ తీసుకొచ్చిన ఒప్పో
చైనా: మొబైల్ తయారీదారులు వినియోగదారులను ఆకట్టుకోవడం కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త టెక్నాలజీనీ తీసుకొస్తున్నారు. ఇప్పటీకే శామ్సంగ్ వంటి సంస్థలు మడతపెట్టే ఫోన్లను తీసుకొస్తుండగా. ఎల్జీ, షియోమీ వంటి సంస్థలు కూడా కొత్త టెక్నాలజీ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇప్పుడు ఇదే బాటలో ఒప్పో కూడా స్లైడ్-ఫోన్ టెక్నాలజీ కాన్సెప్ట్‌తో వస్తున్నట్లు ప్రకటించింది. ఒప్పో జపాన్ కు చెందిన నెండో సంస్థతో కలిసి నాల్గవ చైనా ఇంటర్నేషనల్ ఇండస్ట్రియల్ డిజైన్ ఎక్స్పో (సిఐఐడిఇ)లో ఈ స్లైడ్-ఫోన్ కాన్సెప్ట్‌ను పరిచయం చేసింది. (చదవండి: ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ల పవర్ ఫుల్ గా ఐఫోన్ 12ప్రో) ఈ ‘స్లైడ్-ఫోన్’ చూడటానికి ట్రిపుల్-హింజ్ ఫోల్డబుల్ స్క్రీన్ తో ఉండి, పొడవుగా కనిపిస్తుంది. దీనిని పూర్తిగా మడిచినప్పుడు క్రెడిట్ కార్డు పరిమాణంలో ఉంటుంది. మూడు మడతల్లో భాగంగా ఒక్కో మడతను ఓపెన్ చేసిన ప్రతిసారి స్క్రీన్ పరిమాణం 40 మిమీ పెరుగుతుంది. మొదటి స్క్రీన్ స్లైడ్ చేస్తే మీకు నోటిఫికేషన్లు, కాల్ హిస్టరీ, మ్యూజిక్ ప్లేయర్ వంటి వాటిని మనం గమనించవచ్చు. రెండవ సారి స్క్రీన్ స్లైడ్ చేస్తే సెల్ఫీలు తీసుకోవటానికి 80 మి.మీ డిస్ప్లే పరిమాణంలో తెరుచుకుంటుంది. మొత్తం స్క్రీన్‌ను స్లైడ్ చేస్తే మీకు గేమింగ్, మల్టీ-టాస్కింగ్ లేదా వీడియోలను చూడటానికి స్క్రీన్ కనిపిస్తుంది. అలాగే స్క్రీన్ పరిమాణాన్ని సగం వరకు తగ్గించవచ్చు. అలాగే ఈ మొబైల్ కి ఒకవైపు మ్యూజిక్ ప్లే/స్టాప్ ,మ్యూట్, వాల్యూమ్ షట్టర్ వంటి బటన్లు ఉన్నాయి. ఇందులో ఛార్జింగ్ పెట్టుకోవడానికి సాధారణ ఛార్జింగ్ తో పాటు దీనిలో వైర్లెస్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉన్నట్లు ఒప్పో విడుదల చేసిన వీడియోలో తెలుస్తుంది. -
అమెజాన్ లో మరో కొత్త సేల్
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ భారతదేశంలోని మొబైల్ కొనుగోలుదారుల కోసం ప్రత్యేక సేల్ నిర్వహించబోతున్నట్లు ప్రకటించింది. ఫాబ్ ఫోన్స్ ఫెస్ట్ అని పిలువబడే ఈ సేల్ డిసెంబర్ 22 నుండి డిసెంబర్ 25 వరకు కొనసాగుతుంది. నాలుగు రోజుల సేల్ లో లభించే మొబైల్, మొబైల్ సంబంధిత ఇతర ఉపకరణాలపై డిస్కౌంట్, ఒప్పందాలను హైలైట్ చేయడానికి కంపెనీ ఇప్పటికే మైక్రోసైట్‌ను రూపొందించింది. అమెజాన్ తన మైక్రోసైట్లో సేల్ విక్రయించే స్మార్ట్ఫోన్లను జాబితాను విడుదల చేసింది.(చదవండి: క్రోమ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ యూజర్లు జాగ్రత్త!) అమెజాన్ విడుదల చేసిన జాబితాలో ఐఫోన్ 11, వన్‌ప్లస్ నార్డ్ 5జీ, శామ్సంగ్ గెలాక్సీ ఎం51, రెడ్మీ నోట్ 9 ప్రో మాక్స్, రెడ్మీ 9 ప్రైమ్, వన్‌ప్లస్ 8 టీ 5జీ, శామ్సంగ్ గెలాక్సీ ఎం31, శామ్సంగ్ గెలాక్సీ ఎం21 ఇంకా మరిన్ని ఉన్నాయి. అయితే, స్మార్ట్ఫోన్ల తగ్గింపు ధరలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. రేపు (డిసెంబర్ 19) ధరలను వెల్లడించనున్నట్లు పేర్కొంది. అమెజాన్ ఫాబ్ ఫోన్స్ ఫెస్ట్ లో ఇప్పుడు పవర్ బ్యాంకులు, హెడ్ఫోన్లు, మొబైల్ కేసులు, కవర్లు, కేబుల్లతో సహా ఇతర మొబైల్ ఉపకరణాలపై డిస్కౌంట్లను కూడా అందిస్తుంది. వన్‌ప్లస్, నోకియా, షియోమి, హానర్, శామ్సంగ్, ఎల్జి, రియల్మే, ఆపిల్, ఒప్పో, జాబ్రాతో సహా ప్రముఖ బ్రాండ్లపై డిస్కౌంట్స్ అందిస్తున్నారు. ఫాబ్ ఫోన్స్ ఫెస్ట్ సందర్భంగా అమెజాన్ నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డులపై 1,500 రూపాయల వరకు ఇన్స్టాంట్ డిస్కౌంట్ అందిస్తుంది. -
రూ.15 వేలకే ఒప్పో 5జీ మొబైల్
ఒప్పో ఏ53 4జీ మొబైల్ నీ ఆగష్టులో లాంచ్ చేసిన సంగతి మనకు తెలిసిందే. తాజాగా చైనాలో ఒప్పో ఏ53 5జీ వెర్షన్ మొబైల్ ని లాంచ్ చేసింది. 15వేలకే 5జీ మొబైల్ ఫోన్ తీసుకొచ్చింది. రెండు స్టోరేజ్ వేరియంట్లలో దీనిని తీసుకొచ్చారు. ఇందులో హోల్ పంచ్ డిస్ ప్లే ఉంది. వెనకవైపు మూడు కెమెరాలను అందించారు. దీని రిఫ్రెష్ రేట్ కూడా 90 హెర్ట్జ్‌గా ఉంది. ఒప్పో ఏ53 5జీ 4జీబీ + 128జీబీ వేరియెంట్ ధర జెడి.కామ్‌లో చైనా యువాన్లు1,299(సుమారు రూ.14,600). ఇది 6జీబీ + 128జీబీ వేరియెంట్లో కూడా లభిస్తుంది. భారత్ లో ఎప్పుడు తీసుకొస్తారో అనే విషయంపై ఇంకా ఎటువంటి స్పష్టత లేదు.(చదవండి: ఫ్లిప్‌కార్ట్: మొబైల్స్ పై భారీ డిస్కౌంట్స్) ఒప్పో ఏ53 5జీ ఫీచర్స్ ఒప్పో ఏ53 5జీ ఆండ్రాయిడ్ 10 ఆధారంగా కలర్ఓఎస్ 7.2పై పనిచేస్తుంది. ఇది 90.5 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 120 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.5-అంగుళాల పూర్తి హెచ్డి ప్లస్(1,080x2,400) పిక్సెల్స్ డిస్ప్లేని కలిగి ఉంది. ఒప్పో ఏ53 5జీ మీడియాటెక్ డైమెన్సిటీ 720 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 5జీ వేరియంట్ ఫోన్లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో ఎఫ్/2.2 లెన్స్‌తో 16 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, ఎఫ్/2.4 లెన్స్‌తో 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కెమెరా, ఎఫ్/2.4 లెన్స్‌తో 2 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ కెమెరా ఉంది. సెల్ఫీ కోసం ఎఫ్/2.0 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. రెండు స్టోరేజ్ వేరియంట్లలో దీనిని తీసుకొచ్చారు. ఒప్పో ఏ53 5జీలో 10వాట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 4,040 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. దీని బరువు 175 గ్రాములగా ఉంది. కనెక్టివిటీ విషయానికి వస్తే ఇందులో 5జీ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై 802.11ఎ/బి/జి/ఎన్/ఎసి, బ్లూటూత్ 5.1, జిపిఎస్/ఎ-జిపిఎస్, గ్లోనాస్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, ఛార్జింగ్ కోసం యుఎస్బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఆన్‌బోర్డ్ సెన్సార్లలో యాంబియంట్ లైట్ సెన్సార్, సామీప్య సెన్సార్, యాక్సిలెరోమీటర్, గ్రావిటీ సెన్సార్ మరియు గైరోస్కోప్ ఉన్నాయి. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది. ఇది లేక్ గ్రీన్, సీక్రెట్ నైట్ బ్లాక్, స్ట్రీమర్ పర్పుల్ అనే మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. -
ఒప్పో నుంచి మరో బడ్జెట్ మొబైల్
అక్టోబర్‌లో లాంచ్ చేసిన ఒప్పో ఎ15కి కొనసాగింపుగా ఒప్పో ఎ15ఎస్ స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ఒప్పో ఎ15ఎస్, ఒప్పో ఎ15 సమానమైన డిజైన్‌ను కలిగి ఉన్నాయి. ఇది ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. డిసెంబర్ 21 నుంచి ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా, రిటైల్ ఔట్లెట్ల ద్వారా ఫోన్లను కొనుగోలు చేయొచ్చు. ఒప్పోఎ15ఎస్ 4 జీబీ + 64 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.11,490. ఇది డైనమిక్ బ్లాక్, ఫ్యాన్సీ వైట్ మరియు రెయిన్ బో సిల్వర్ అనే మూడు రంగులలో లభిస్తుంది.(చదవండి: క్యూఎల్ఇడి 4కే టీవీ లాంచ్ చేసిన షియోమీ) ఒప్పో ఎ15ఎస్ ఫీచర్స్: ఒప్పో ఎ15ఎస్ కలర్ఓఎస్ 7.2పై నడుస్తుంది. ఇది 6.52-అంగుళాల హెచ్డి ప్లస్ డిస్ప్లేను 89 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో కలిగి ఉంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో పీ 35 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఒప్పో ఎ15ఎస్ 64 జీబీ స్టోరేజ్, 4 జీబీ ర్యామ్ ఆప్షన్ లలో మాత్రమే లభిస్తుంది. ఒప్పో ఎ15ఎస్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. దీనిలో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ ఉంది. కనెక్టివిటీ విషయానికి వస్తే ఇందులో వై-ఫై, బ్లూటూత్, జిపిఎస్, ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది. ఇది 4,230 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో సపోర్ట్ తో వస్తుంది. హెచ్‌డిఎఫ్‌సి డెబిట్, క్రెడిట్ కార్డులపై 10 శాతం తక్షణ తగ్గింపు ఆఫర్ కూడా ఉంది. ఐసీఐసీ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫెడరల్ బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా 5శాతం క్యాష్‌బ్యాక్ అభించనుంది. ఈ ఆఫర్లు డిసెంబర్ 21 నుండి డిసెంబర్ 25 వరకు మాత్రమే చెల్లుతాయి. -
ఈ వారంలో టాప్ - 10 ట్రెండింగ్ ఫోన్స్ ఇవే!
ప్రస్తుత ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ లేని ఇల్లు లేదంటే నమ్మశక్యం కాదు, అంతలా విస్తరించింది ఈ మొబైల్ ప్రపంచం. అందుకే మార్కెట్ లో ఏ కొత్త ఫోన్ వచ్చిన తెగ వెతికేస్తుంటాం. అలా ఈ వారంలో ప్రజలు బాగా వెతికే వాటిలో టాప్-10 ట్రెండింగ్‌లో ఉన్న ఫోన్ లు మీకోసం అందిస్తున్నాం. ఈ వారంలో కొత్తగా రాబోయే శామ్సంగ్ గెలాక్సీ ఎస్21ప్లస్ 5జీ మొబైల్ ను తెగ వెతికేయడం వల్ల ఇది మొదటి స్థానంలో నిలిచింది. అలాగే కొత్తగా రాబోయే ఒప్పో రెనో5 ప్రో ప్లస్ 5జీని ఎక్కువగా సెర్చ్ చేయడం వల్ల 2వ స్థానంలో నిలిచింది. గత వారంలో 2వ స్థానంలో నిలిచిన షియోమీ రెడ్మి నోట్ 9 ప్రో 5జీ ఈసారి మూడవ స్థానంలో ఉంది. (చదవండి: పబ్జి లవర్స్ జర జాగ్రత్త!) అదేవిదంగా గతవారంలో మొదటి స్థానంలో ఉన్న షియోమీ పోకో ఎమ్3 3 స్థానాలు కోల్పోయి 4వ స్థానంలో నిలిచింది. కొత్తగా రాబోయే శామ్సంగ్ గెలాక్సీ ఎ52 5జీ మొబైల్ ఐదవ స్థానంలోను, కొత్తగా వచ్చే శామ్సంగ్ గెలాక్సీ ఎస్21 5జీ 6వ స్థానంలో నిలిచాయి. గత వారం 3వ స్థానంలో నిలిచినా ఆపిల్ ఐఫోన్ 12 ప్రో మాక్స్ ఈసారి ఏడవ స్థానంలో నిలిచింది. అలాగే గతవారం 5,4,7 స్థానాలలో నిలిచిన షియోమీ రెడ్మి నోట్ 9 ప్రో, శామ్సంగ్ గెలాక్సీ ఎ51, షియోమీ ఎంఐ 10టీ ప్రో 5జీ మొబైల్స్ ఈసారి 8,9,10 స్థానాలలో నిలిచాయి. ర్యాంక్ 1: శామ్సంగ్ గెలాక్సీ ఎస్21ప్లస్ 5జీ ర్యాంక్ 2: ఒప్పో రెనో5 ప్రో ప్లస్ 5జీ ర్యాంక్ 3: షియోమీ రెడ్మి నోట్ 9 ప్రో 5జీ ర్యాంక్ 4: షియోమీ పోకో ఎమ్3 ర్యాంక్ 5: శామ్సంగ్ గెలాక్సీ ఎ52 5జీ ర్యాంక్ 6: శామ్సంగ్ గెలాక్సీ ఎస్21 5జీ ర్యాంక్ 7: ఆపిల్ ఐఫోన్ 12 ప్రో మాక్స్ ర్యాంక్ 8: షియోమీ రెడ్మి నోట్ 9 ప్రో ర్యాంక్ 9: శామ్సంగ్ గెలాక్సీ ఎ51 ర్యాంక్ 10: షియోమీ ఎంఐ 10టీ ప్రో 5జీ -
ఒప్పో నుండి మరో సూపర్ మొబైల్
ఒప్పో రెనో5 5జీ, ఒప్పో రెనో5 5జీ ప్రో స్మార్ట్ ఫోన్ లను చైనాలో విడుదల చేసింది. ఈ లాంచ్ ఈవెంట్ లో ఒప్పో రెనో5 ప్రో ప్లస్ 5జీ మొబైల్ ని తీసుకురాలేదు. డిసెంబర్ 24న రెనో5 ప్రో ప్లస్ 5జీ మొబైల్ ని తీసుకొస్తున్నట్లు సంస్థ పేర్కొంది. ఒప్పో రెనో5 5జీలో స్నాప్‌డ్రాగన్ 765జీ ప్రాసెసర్, ఒప్పో రెనో5 5జీ ప్రోలో మీడియా టెక్ డైమెన్సిటీ 1000 ప్లస్ ప్రాసెసర్ ని తీసుకొస్తున్నారు. ఈ రెండు మొబైల్ లో కూడా 64 మెగా పిక్సల్ ప్రధాన కెమెరా, 64వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ తీసుకొస్తున్నారు. కొత్తగా వచ్చిన ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ ఈ మొబైల్ ఆధారంగా పనిచేయనుంది. ఈ రెండు ఫోన్లు డిసెంబర్ 18న చైనాలో ఫస్ట్ సేల్ కి వస్తాయి. ఒప్పో రెనో5 5జీ ఫీచర్స్ ఒప్పో రెనో 5 6.00-అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ ఓఎల్ఈడీ డిస్ప్లేను 2400 × 1080 పిక్సెల్స్ రిజల్యూషన్, 90హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వస్తుంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 765జీ ప్రాసెసర్ తో పాటు 12జీబీ ర్యామ్ తో వస్తుంది. దీని ఆంతర్గత స్టోరేజ్ 256జీబీ మైక్రో ఎస్ ఢీ కార్డు ద్వారా 1టీబీ వరకు విస్తరించుకోవచ్చు. ఇది ఆండ్రాయిడ్ 11-ఆధారిత కలర్ఓఎస్ 11.1 కస్టమ్ స్కిన్‌పై పనిచేస్తుంది. ఇందులో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 65వాట్ సూపర్‌వూక్ 2.0 ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,300 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఒప్పో రెనో 5 5జి వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్ ఉంది. 64ఎంపీ ప్రైమరీ సెన్సార్, 119-డిగ్రీల అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ కలిగిన 8MP లెన్స్, 2ఎంపీ మాక్రో లెన్స్, 2ఎంపీ మోనో పోర్ట్రెయిట్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీ, వీడియో చాట్ల కోసం 32ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంది. కనెక్టివిటీ విషయానికి వస్తే 5జీ, 4జీ ఎల్‌టిఇ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.1, జిపిఎస్, 3.5 ఎంఎం ఆడియో జాక్, యుఎస్బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఇది 172 గ్రాముల బరువు ఉంటుంది. చైనాలో ఒప్పో రెనో5 5జీ 8జీబీ/128జీబీ ధర. సుమారు 30,400, అలాగే 12జీబీ/256జీబీ ధర సుమారు రూ.33,800. ఒప్పో రెనో 5ప్రో 5జీ ఫీచర్స్ ఒప్పో రెనో 5ప్రో 5జీ 6.55-అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ ఓఎల్ఈడీ డిస్ప్లేను 2400 × 1080 పిక్సెల్స్ రిజల్యూషన్, 90హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వస్తుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 1000ప్లస్ ప్రాసెసర్ తో పాటు 12జీబీ ర్యామ్ తో వస్తుంది. దీని ఆంతర్గత స్టోరేజ్ 256జీబీ మైక్రో ఎస్ ఢీ కార్డు ద్వారా 1టీబీ వరకు విస్తరించుకోవచ్చు. ఇది ఆండ్రాయిడ్ 11-ఆధారిత కలర్ఓఎస్ 11.1 కస్టమ్ స్కిన్‌పై పనిచేస్తుంది. ఇందులో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 65వాట్ సూపర్‌వూక్ 2.0 ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,350 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఒప్పో రెనో 5 5జి వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్ ఉంది. 64ఎంపీ ప్రైమరీ సెన్సార్, 119-డిగ్రీల అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ కలిగిన 8MP లెన్స్, 2ఎంపీ మాక్రో లెన్స్, 2ఎంపీ మోనో పోర్ట్రెయిట్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీ, వీడియో చాట్ల కోసం 32ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంది. కనెక్టివిటీ విషయానికి వస్తే 5జీ, 4జీ ఎల్‌టిఇ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.1, జిపిఎస్, 3.5 ఎంఎం ఆడియో జాక్, యుఎస్బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఇది 173 గ్రాముల బరువు ఉంటుంది. చైనాలో ఒప్పో రెనో5 5జీ 8జీబీ/128జీబీ ధర. సుమారు 38,300, అలాగే 12జీబీ/256జీబీ ధర సుమారు రూ.42,800. భారతదేశంలో ఎప్పుడు తీసుకు వస్తారో తెలియదు. -
ఫోన్ కొనాలనుకుంటున్నారా.. ఇవి చూడండి?
భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ లో ఎప్పుడు చాలా గట్టి పోటీ ఉంటుంది. అందుకే చాలా మొబైల్ సంస్థలు ఈ పోటీని తట్టుకోవడానికి ప్రతి నెల ఎదో ఒక ఫోన్ ని విడుదల చేస్తూ ఉంటాయి. వీటితో మంచి ఆఫర్లను కూడా మొబైల్స్ పై అందిస్తూ ఉంటాయి. ఎక్కువ శాతం చైనా కంపెనీల మద్యే ఎక్కువ పోటీ ఉంది. ఈ ఏడాది చివరి నెల డిసెంబర్ లో లాంచ్ చేయబోయే మొబైల్స్ ని మీకోసం తీసుకొస్తున్నాం. మొబైల్స్ యొక్క ధర, ఫీచర్స్ వంటి వివరాలు ఉన్నాయి. అందుకే ఈ సమాచారాన్ని మీ స్నేహితులకు, బంధుమిత్రులకు షేర్ చేయండి. (చదవండి: వాట్సప్ స్టేటస్ ని సీక్రెట్ గా చూడండి) వివో వీ20 ప్రో 5జీ శాంసంగ్ ఏ32 5జీ ఒప్పో రెనో ప్రో 5జీ శాంసంగ్ ఏ12 ఒప్పో రెనో ప్రో ప్లస్ 5జీ రెడ్ మీ నోట్ 10 5జీ ఒప్పో రెనో 5ప్రో రెడ్ మీ నోట్ 10 5జీ ప్రో రియల్ మీ ఎక్స్ 7 ప్రో పోకో ఎం3 రియల్ మీ ఎక్స్ 7 ఒప్పో ఏ53 5జీ రియల్ మీ వి5 మోటో జీ9 పవర్ -
ఒప్పో బడ్జెట్ ఫోన్‌పై ధర తగ్గింపు
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో మనదేశంలో గత నెల అక్టోబర్‌లో ఒప్పో ఏ15 అనే స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ.1,000 వరకు తగ్గింపును అందించారు. రియల్మీ, షియోమి, మైక్రోమ్యాక్స్ వంటి కంపెనీలకి గట్టి పోటీ ఇవ్వడానికి ఒప్పో ఏ15 ధరను తగ్గించినట్లు తెలుస్తుంది. దీనిలో మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్, వెనకవైపు మూడు కెమెరాల వంటి ఫీచర్లను అందించారు. ఒప్పో ఏ15ను ఇండియాలో విడుదల చేసినప్పుడు 2జీబీ + 32జీబీ స్టోరేజ్ మొబైల్ కి 9,490 రూపాయలు కాగా, 3జీబీ + 32జీబీ మొబైల్ కి 10,990 రూపాయలు. ఇప్పుడు కంపెనీ ధరను రూ .1,000 తగ్గించింది. దీనితోఒప్పో ఏ15 2జీబీ మోడల్ ధర రూ .8,490 కాగా, 3జీబీ మోడల్ ధర 9,990 రూపాయలు. కొత్త ధర ఇప్పుడు అమెజాన్‌లో అందుబాటులో ఉంది. ఫోన్ డైనమిక్ బ్లాక్ మరియు మిస్టరీ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. (చదవండి: పబ్ జీ టోర్నీలో గెలిస్తే రూ.6 కోట్లు) ఒప్పో ఏ15 ఫీచర్స్ ఈ మొబైల్ లో మీడియాటెక్ హెలియో పి35 ప్రాసెసర్ ను ఉపయోగించారు. ఒప్పో ఏ15 6.5-అంగుళాల హెచ్ డి ప్లస్ డిస్ప్లేను 1600 x 720 పిక్సెల్‌ల స్క్రీన్ రిజల్యూషన్‌తో అమర్చారు. దీని స్క్రీన్ టు బాడీ రేషియో 89 శాతంగా ఉండనుంది. ఈ స్మార్ట్ ఫోన్లో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగా పిక్సెల్ కాగా, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగా పిక్సెల్ మాక్రో లెన్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఇక ముందువైపు 5 మెగాపిక్సెల్ సెల్పీ కెమెరాను అందించారు. ఇందులో వెనకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు. ఏఐ ఫేస్ అన్ లాక్ టెక్నాలజీ కూడా ఇందులో ఉంది. మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమరీ 128జీబీ వరకు విస్తరించుకోవచ్చు. దీని బ్యాటరీ సామర్థ్యం 4230 ఎంఏహెచ్‌గా ఉంది. 10W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఆండ్రాయిడ్ 10 ఆధారిత కలర్ఓఎస్ 7.2 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. -
5,000లలో బెస్ట్ వైర్లెస్ ఇయర్ ఫోన్స్
ప్రస్తుత జీవనశైలికి అనుగుణంగా ఎలక్ట్రానిక్ కంపెనీలు సరికొత్త ఆవిష్కరణలు చేపడుతున్నాయి. వీటిలో ముఖ్యంగా స్మార్ట్ ఉత్పత్తులు, మొబైల్ యాక్ససరీలకు డిమాండ్ ఎక్కువ. అందుకే ఈ రంగంలో ప్రధాన పోటీదారులుగా ఉన్న కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను విడుదల చేస్తూ వినియోగాదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటాయి. ఇప్పుడు 'ట్రూ వైర్లెస్ ఇయర్‌బడ్స్'కి భారతదేశంలో చాలా డిమాండ్ ఉంది. కొన్నేళ్ల క్రితం బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఎంత డీమాండ్ ఉండేదో ఇప్పుడు 'ట్రూ వైర్లెస్ ఇయర్‌బడ్స్'కి అంత డిమాండ్ ఉంది. అందుకే శామ్సంగ్, షియోమి, ఒప్పో, రియల్మీ వంటి బడ్జెట్ లోనే మంచి నాణ్యత గల ఇయర్ ఫోన్స్ తీసుకొస్తున్నాయి. బడ్జెట్ ధరలకే వస్తున్నాయంటే వీటిలో ఫీచర్లు బాగాలేవనే అంచనాకు రాకండి. మంచి నాణ్యతతో కూడిన వస్తువులను బడ్జెట్ ధరలో అందుబాటులోకి తేవాలంటే చాలా రీసెర్చ్ అవసరమవుతుంది. అందుకే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో శరవేగంగా దూసుకుపోతున్నా ఇలాంటి సంస్థలు ఇన్నోవేటివ్ ప్రాడక్ట్స్ ను మనకు పరిచయం చేస్తున్నాయి. 5,000లలో బెస్ట్ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ మరి వాటి ఫీచర్స్, ధర వంటి వివరాలు మీ కోసం.. ఒప్పో ఏక్నో W51 'ట్రూ వైర్లెస్ ఇయర్‌బడ్స్' మార్కెట్లో ఒప్పో యొక్క ఆవిష్కరణ అయిన ఒప్పో ఏక్నో W51లో మంచి ఫీచర్లు ఉన్నాయి. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. బ్లూటూత్ 5.0 కనెక్టివిటీతో 7 ఎంఎం డైనమిక్ డ్రైవర్ ఆన్‌బోర్డ్, సుమారు 10 మీటర్ల పరిధి వరకు ధ్వని వినిపిస్తుంది. ప్రతి ఇయర్‌బడ్ లో 25 ఎంఏహెచ్ బ్యాటరీతో నిండి ఉంటుంది, ఛార్జింగ్ కేసులో 480 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఒప్పో ఏక్నో W51 ఆన్ చేస్తే ఈ ఇయర్ ఫోన్ 3.5 గంటలు పనిచేస్తుంది. ఒప్పో ఏక్నో W51 ఆన్ చేయకపోతే 20 గంటలపాటు పనిచేసేలా బ్యాటరీ సామర్థ్యం ఉండడం హైలైట్. అయితే, బ్యాటరీ ఇక్కడ చాలా సగటు. మీరు 15 నిమిషాల ఛార్జ్ చేస్తే ఇయర్ఫోన్లు 3 గంటల వరకు పనిచేస్తాయి. దీనికి 3 మైక్రో పోన్ సిస్టంను ఒప్పో యాడ్ చేసింది. దీంతో సౌండ్ క్వాలిటీ చాలా బాగుండి, నాయిస్ తగ్గుతుంది. దీని ధర రూ. 4,999. (చదవండి: ఆధార్ డౌన్లోడ్ చేసుకోండి ఇలా?) రియల్ మీ బడ్స్ ఎయిర్ ప్రో రియల్మీ బడ్స్ ఎయిర్ ప్రో అత్యంత చవకైన వైర్ లెస్ ఇయర్ ఫోన్స్ గా పేరుంది. దీనిలో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఉండటం వల్ల ఇవి బాగా పనిచేస్తాయి. రియల్ మీ బడ్స్ ఎయిర్ ప్రో ఫీచర్-ప్యాక్డ్, కంపానియన్ యాప్ సపోర్ట్ వల్ల ఉపయోగించడం సులభం అవుతుంది. రియల్మీ బడ్స్ ఎయిర్ ప్రోలో సౌండ్ క్వాలిటీ సరిగ్గా లేనప్పటికీ, మీకు అద్భుతమైన సౌండ్‌స్టేజ్, బేస్ భారతదేశంలో చాలా మంది ప్రజలు ఇష్టపడే విధంగా ఉంటుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే సూపర్ అనుకోండి. ఏకంగా 25 గంటల బ్యాటరీ లైఫ్ తో ఈ ఇయర్ బడ్స్ పనిచేస్తాయని రియల్ మీ చెబుతోంది. దీని ధర రూ. 4,999. వన్‌ప్లస్ బడ్స్ Z వన్‌ప్లస్ బడ్స్‌లో ఒక మంచి విషయం దాని యొక్క డిజైన్. దాని సాఫ్ట్ మాట్టే ప్లాస్టిక్ కేసు సూపర్ ప్రీమియం అనిపిస్తుంది. బడ్స్ Z యొక్క పిల్-ఆకారపు కేసు పూర్తిగా నిగనిగలాడే ప్లాస్టిక్‌తో తయారు చేయబడింది, తెలుపు రంగులో ఉండటం వల్ల ఇది త్వరగా మురికిగా అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే, ఒక చేత్తో మూత తెరవడం అంత సులభం కాదు. దీని వెనుక భాగంలో టైప్ సి పోర్ట్ మరియు పెయిరింగ్ / రీసెట్ బటన్ ఉంటాయి. ముందు భాగంలో LED సూచిక ఉంటుంది. సాధారణ వన్‌ప్లస్ పద్ధతిలో వన్‌ప్లస్ బడ్స్ జెడ్‌ను బిటి 5.0 నెట్‌వర్క్‌లో గూగుల్ ఫాస్ట్ పెయిర్‌తో ఆండ్రాయిడ్ ఫోన్‌కు సులభంగా జత చేయవచ్చు. మీరు మూత తెరిచిన వెంటనే కార్డ్ మీ Android ఫోన్లో కనిపిస్తుంది. బ్యాటరీ లైఫ్ విషయానికొస్తే, వన్‌ప్లస్ బడ్స్ ఐదు గంటలు వరకు వస్తుందని కంపెనీ పేర్కొంది. మీరు 10 నిమిషాల ఛార్జ్ చేస్తే 2-3 గంటల వరకు పాటలు వినవచ్చు. దీని ధర 2,999. (చదవండి: డౌన్లోడ్ లో అగ్రస్థానంలో భారత్) నాయిస్ షాట్స్ ఎక్స్ 5 ప్రో ఒక్క సారి చార్జ్ చేసిన నాయిస్ షాట్స్ ఎక్స్ 5 ప్రో బ్యాటరీ లైఫ్ 8 గంటలు. 2,200mAh బ్యాటరీ కేస్ ను కావాలంటే మీ స్మార్ట్ ఫోన్ కు కూడా ఉపయోగించుకోవచ్చు. నాయిస్ షాట్స్ ఎక్స్ 5 ప్రో టిడబ్ల్యుఎస్ బ్లూటూత్ 5.0పై పని చేస్తుంది. క్వాల్ కామ్ చిప్ సెట్ సపోర్ట్ తో పనిచేసే ఈ ఆడియో ప్రోడక్ట్ నాణ్యతలో చాలా అత్యుత్తమం. ఈ కారణంగా ఇయర్ ఫోన్లో ఏదైనా చాలా స్పష్టంగా వినిపిస్తుంది. AptX+AAC Hi-Fiఆడియో టెక్నాలజీతో IPX7 వాటర్ ప్రూఫ్ రేటింగ్ తో వచ్చింది. దీనిలో ప్రతి ఇయర్ బడ్ టచ్ సెన్సార్లతో వస్తుంది, అందువల్ల వాల్యూమ్‌ను నియంత్రించడానికి, కాల్లకు సమాధానం ఇవ్వడానికి / తిరస్కరించడానికి , మీడియాను నియంత్రించడానికి ఇది ఉపయోగపడుతుంది. దీని ధర రూ. 3,499. షియోమి ఎంఐ ట్రూ వైర్లెస్ ఇయర్‌ఫోన్స్ 2 షియోమి ఎంఐ ట్రూ వైర్లెస్ ఇయర్‌ఫోన్స్ 2 ఏకంగా రూ. 3,999 ధరకే లభిస్తోంది. చూసేందుకు ఇయర్ ప్యాడ్స్ లాంటి ఇయర్ పీస్ లా దీన్ని డిజైన్ అయిన ఈ ఇయర్ పీస్ ఫీచర్స్ బాగున్నాయి. 14.2mmడ్రైవర్స్, బ్లూటూత్ 5.0 కనెక్టివిటీ, SBC, AAC, LHDC బ్లూటూత్ codecs సపోర్ట్ చేసేలా దీన్ని డిజైన్ చేశారు. కానీ ఇందులో ANC లేకపోవడం వల్ల మీ చుట్టూ ఉన్న శబ్దాలు వినిపిస్తాయి. 12 గంటలపాటు పనిచేసే బ్యాటరీ సామర్థ్యం షియోమీ వైర్ లెస్ ఇయర్ ఫోన్స్ కు ఉండగా, టచ్-సెన్సిటివ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. -
ఒప్పో ఏ15... ధర ఎంతంటే..
సాక్షి, ముంబై: ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఒప్పో ఏ15 స్మార్ట్ ఫోన్ ను ఎట్టకేలకు కంపెనీ భారత మార్కెట్లో లాంచ్ చేసింది. బిగ్ డిస్ ప్లే, ట్రిపుల్ కెమెరాలు, మీడియాటెక్ ప్రాసెసర్‌తో బడ్జెట్ ధరలో దీన్ని లాంచ్ చేసింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అమ్మకానికి ముందు ఒప్పో కొత్త ఏ సిరీస్ ఫోన్ విడుదల చేయడం విశేషం. ఒప్పో ఏ15 ధర ఒప్పో ఏ15 సింగిల్ వేరియంట్లో లభ్యం. 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ధర రూ .10,990. డైనమిక్ బ్లాక్ మిస్టరీ బ్లూ రంగులలో వస్తుంది. అ అమెజాన్‌లో ఆన్లైన్ ద్వారా దేశవ్యాప్తంగా ఆఫ్‌లైన్ స్టోర్ల నుండి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. అయితే ఎప్పటినుంచి కొనుగోలుకు అందుబాటులో ఉండేదీ ఒప్పో ఇంకా ప్రకటించలేదు. ఒప్పో ఏ15 ఫీచర్లు 6.52 అంగుళాల డిస్ ప్లే 720x1600 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 10 ఆధారిత కలర్ఓఎస్ 7.2 ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో పీ 35 ప్రాసెసర్ 13+2+2 ఎంపీ రియల్ ట్రిపుల్ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 4230 ఎంఏహెచ్ బ్యాటరీ The all new #OPPOA15 is ready to blow you away, with its sleek curved design, Triple camera and a 16.55cm Waterdrop Eye Protection Screen. All of this at just ₹10,990! Coming soon! https://t.co/hIIoYnmpNW pic.twitter.com/TDOlOprwtJ — OPPO India (@oppomobileindia) October 15, 2020 -
ఒప్పో ఎఫ్ 17 సిరీస్ స్మార్ట్ ఫోన్లు లాంచ్
సాక్షి, ముంబై: మొబైల్ మేకర్ ఒప్పో ఎఫ్ 17 సిరీస్ లో ఒప్పో ఎఫ్ 17, ఒప్పో ఎఫ్ 17 ప్రో అనే స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది ఒప్పో ఎఫ్ 17 ప్రో ధర రూ. 22990 ఈ రోజు నుంచే ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు. సెప్టెంబరు 7నుంచి మొదటి సేల్. దీంతొ పాటు ఒప్పో ఇయర్ బడ్స్ ను కూడా లాంచ్ చేసింది. ఒప్పో ఎఫ్ 17 ప్రో 6.43అంగుళాల సూపర్ అమోలేడ్ ఎఫ్‌హెచ్‌డి + డిస్ప్లే మీడియాటెక్ హెలియో పి 95 ప్రాసెసర్1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్ 8 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ 48+8+2+2 ఎంపీ క్వాడ్-కెమెరా 16 +2 ఎంపీ డ్యుయల్ ఫ్రంట్ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీని ధర : రూ. 22990 మాట్ బ్లాక్, మ్యాజిక్ బ్లూ, మెటాలిక్ వైట్ రంగులలో లభిస్తుంది. ఒప్పో ఎఫ్ 17 ఫీచర్లు 6.44 అంగుళాలఫుల్ హెచ్డి +వాటర్‌డ్రాప్ నాచ్ డిస్ప్లే ఆండ్రాయిడ్ 10 లో కలర్ఓఎస్ 7.2 క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 662 ఒకే 6 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ 16 +8 +2+2 క్వాడ్ రియర్ కెమెరా 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఒప్పో ఎఫ్ 17 4జీబీ ర్యామ్ ,64జీబీ స్టోరేజ్,128 జీబీ స్టోరేజ్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ , 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో లభ్యం. అయితే దీని ధరలు, లభ్యత వివరాలను కంపెనీ ప్రకటించలేదు. You’re not going to believe how unbelievably priced the #SleekestPhoneOf2020 is! 😱 Drumroll please 🥁 #OPPOF17Pro is priced at ₹22,990 so that you can #FlauntItYourWay. Pre-order now: https://t.co/x0jqrik5nV pic.twitter.com/YbccHPVUhW — OPPO India (@oppomobileindia) September 2, 2020 -
వాటికి గుబులే : త్వరలో వన్‌ప్లస్ వాచ్
సాక్షి, ముంబై: ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో నెంబర్ వన్ గా కొనసాగుతున్న వన్‌ప్లస్ త్వరలో మరో కొత్త సెగ్మెంట్ లోకి ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే వన్‌ప్లస్ టీవీలు, వైర్లెస్ ఇయర్‌బడ్‌లతో ఆకట్టుకున్న చైనా దిగ్గజం వన్‌ప్లస్ త్వరలోనే స్మార్ట్‌వాచ్ లను కూడా ఆవిష్కరించనుంది. తద్వారా శాంసంగ్, ఒప్పో లాంటి కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వనుంది. స్మార్ట్‌వాచ్ లాంచింగ్ పై చాలాకాలంగా ఇంటర్నెట్లో పలు ఊహాగానాలు కొనసాగుతున్నాయి. అయితే సింగపూర్ ఇన్ఫోకామ్ మీడియా డెవలప్మెంట్ అథారిటీ ద్వారా దీనికి సంబంధించిన ధృవీకరణ పొందినట్లు సమాచారం. దీంతో రాబోయే నెలల్లో వన్‌ప్లస్ వాచ్ పేరుతో వీటిని తీసుకురానుందని భారీ అంచనాలు నెలకొన్నాయి. వన్‌ప్లస్ వాచ్ ఫీచర్లపై ప్రస్తుతానికి సమాచారం లేనప్పటికీ, మార్కెట్లో ఉన్న ప్రముఖ స్మార్ట్‌వాచ్‌లకు ధీటుగా ఉండేలా మార్కెట్లోకి రానున్నాయి. ఓఎల్ఈడీ డిస్ ప్లే, ఫిట్నెస్, హెల్త్ ఫీచర్స్ ముఖ్యంగా హృదయ స్పందన సెన్సార్, బ్లడ్ ఆక్సిజన్ మానిటర్ , స్లీప్ ప్యాటర్న్ అనాలిసిస్, గోల్స్ ఓరియెంటెడ్ ఎక్స్ ర్ సైజ్ ట్రాకింగ్ సాఫ్ట్వేర్ ఆధారిత ఫీచర్లు ఉండవచ్చని భావిస్తున్నారు. కొనుగోలుదారులను మరింత ఆకర్షించేలా వన్‌ప్లస్ వాచ్ శాంసంగ్ గెలాక్సీ వాచ్ 3 తరహాలో ఈసీజీ మానిటర్ లాంటి ప్రీమియం ఫీచర్లును కూడా జోడించనుంది. శాంసంగ్ తోపాటు ఇటీవల లాంచ్ చేసిన ఒప్పో వాచ్ లకు వన్‌ప్లస్ వాచ్ గట్టి పోటీ ఇవ్వనుందని మార్కెట్ వర్గాల అంచనా. -
శాంసంగ్, షావోమికి పోటీ : ఒప్పో ఏ53
సాక్షి, ముంబై: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ ఒప్పో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. ఒప్పో ఏ53 2020 పేరుతో రీలాంచ్ చేసింది. అద్భుతమైన ఫీచర్లు, బడ్జెట్ ధరలో తన తాజా స్మార్ట్‌ఫోన్‌ను భారతీయ మార్కెట్లో లాంచ్ చేసింది. 4జీబీ ర్యామ్ +64జీబీ, 6జీబీ+128జీబీ వేరియంట్లలో ఆవిష్కరించింది. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హోల్-పంచ్ డిస్ప్లే డిజైన్, గ్రేడియంట్ బ్యాక్ లాంటి ప్రత్యేకతలతో బడ్జెట్ ధరల స్మార్ట్‌ఫోన్ విభాగంలో శాంసంగ్, షావోమిలకు గట్టి పోటి ఇవ్వనుంది. ఎలక్ట్రిక్ బ్లాక్, ఫెయిరీ వైట్, ఫ్యాన్సీ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ ప్రారంభ ధరను 12,990 రూపాయలుగా ఉంచింది. ఈ స్మార్ట్‌ఫోన్‌తో పాటు 10,000ఎంఏహెచ్ ఒప్పో పవర్ బ్యాంక్ 2 కూడా లాంఛ్ చేసింది ఒప్పో. దీని ధర 1299 రూపాయలు. అయితే ఒప్పో ఏ53 స్మార్ట్‌ఫోన్‌తో కలిపి ఈ పవర్ బ్యాంక్ కొంటే 400 డిస్కౌంట్ ఆఫర్ అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ తో పాటు ఆఫ్‌లైన్ స్టోర్లలో ఈ రోజు (మంగళవారం)మధ్యాహ్నం 3 గంటల నుంచే ఈ ఆఫర్ సొంతం చేసుకోవచ్చు. అలాగే ఎంపిక చేసిన బ్యాంకు లావాదేవీలపై ఐదు శాతం క్యాష్‌బ్యాక్, ఆరు నెలల వరకు నో కాస్ట్ ఈఎంఔ, జీరో డౌన్-పేమెంట్ అవకాశం కూడా ఉంది. (చదవండి : షావోమి : కొత్త ఎంఐ టీవీ త్వరలో) ఒప్పో ఏ53 2020 ఫీచర్లు 6.5 అంగుళాలు డిస్ప్లే ఆండ్రాయిడ్ 10+కలర్ ఓఎస్ 7.2 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 460ప్రాసెసర్ 13+2+2 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ధరలు 4 జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ 12,990 రూపాయలు 6 జీబీ ర్యామ్ +128 జీబీ స్టోరేజ్15,490 రూపాయలు The faster and smoother #OPPOA53 is here! Packed with a 90Hz Punch-hole display, 18W Fast Charge, 16MP AI Selfie Camera and much more! Starting at just ₹12,990! Order yours now! Available now: https://t.co/Jxrk1l7LCU pic.twitter.com/vsse36CPmw — OPPO India (@oppomobileindia) August 25, 2020 -
ఒప్పో ధరల కోత
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు ఒప్పో తన రెనో 3 ప్రో మొబైల్ ధరలను తగ్గించింది. ఈ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లపైనా ధరల కోతను ప్రకటించింది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ పై 2,000, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరపై 3వేల రూపాయల తగ్గింపును ప్రకటించింది. ఈ మేరకు కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఒప్పో రెనో 3 ప్రో ను మార్చిలో ఇండియాలో తీసుకొచ్చింది. వీటి ధరలను 29,990 (128 జీబీ వేరియంట్) గాను, 256 జీబీ వేరియంట్‌కు 32,990 రూపాయలుగా నిర్ణయించింది. అయితే జీఎస్టీ కారణంగా బేస్ వేరియంట్ ధరను ఏప్రిల్ లో రెండు వేల రూపాయల మేర పెంచింది. దాదాపు మూడు నెలల తరువాత తాజా తగ్గింపుతో ఒప్పో రెనో 3 ప్రో ఫోన్లు వరుసగా 27,990, 29,990 రూపాయలకు లభించనున్నాయి. ఒప్పో రెనో 3 ప్రో స్పెసిఫికేషన్లు 6.4 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఆండ్రాయిడ్ 10 , 1,080x2,400 రిజల్యూషన్ 64+13+8+2ఎంపీ రియర్ క్వాడ్ కెమెరా 44+2 ఎంపీ సెల్ఫీ కెమెరా 4025 ఎంఏహెచ్ బ్యాటరీ