సాక్షి,ముంబై: స్మార్ట్‌ఫోన్ మేకర్ ఒప్పో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్‌చేసింది. ఒప్పో ఎఫ్23 పేరుతరు 5జీ మొబైల్‌ను తీసుకొచ్చింది. దీని ప్రారంభ ధర రూ. 24,999గా నిర్ణయించింది కంపెనీ. ఇందులో 64 ఎంపీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి.
బోల్డ్ గోల్డ్ , కూల్ బ్లాక్ రెండు రంగులలో మే 18 నుంచి ఒప్పో Oppo స్టోర్, అమెజాన్ , మెయిన్‌లైన్ రిటైల్ అవుట్‌లెట్లలో అందుబాటులో ఉంటుంది.
ఒప్పో ఎఫ్23 5జీ స్పెసిఫికేషన్స్
6.72-అంగుళాల 3D కర్వ్డ్ డిస్‌ప్లే
120Hz రిఫ్రెష్ రేట్ 91.4% స్క్రీన్-టు-బాడీ రేషియో
క్వాల్కం స్నాప్‌డ్రాగన్ సాక్
8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్
1 టీబీ వరకు విస్తరించుకునే అవకాశం
64 ఎంపీ ఏఐ కెమెరా 2+2 ఎంపీ రియర్ ట్రిపుల్ కెమెరా
5000mAh బ్యాటరీ 67W SUPERVOOCTM ఫ్లాష్ ఛార్జింగ్
ఇది కేవలం 18 నిమిషాల్లో ఫోన్‌ను 50శాతం వరకు ఛార్జ్, 5 నిమిషాల ఛార్జ్ గరిష్టంగా 6 గంటల ఫోన్ కాల్‌లను లేదా 2.5 గంటల YouTube వీడియోలు చూడొచ్చు. పూర్తిగా ఛార్జ్ చేస్తే, 39 గంటల ఫోన్ కాల్స్ , 16 గంటల యూట్యూబ్ వీడియో లు చూడొచ్చని కంపెనీ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment