Oppo K10 5G Launched in India: Check Indian Price And Special Features - Sakshi
Sakshi News home page

Oppo K10 5G: ఒప్పో సూపర్‌ 5జీ ఫోన్‌ లాంచ్‌, వివరాలు ఇలా ..

Published Wed, Jun 8 2022 6:07 PM | Last Updated on Wed, Jun 8 2022 6:37 PM

Oppo K10 5G Launched in India: Check here details - Sakshi

సాక్షి, ముంబై: ప్రముఖ మొబైల్‌ తయారీదారు ఒప్పో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5000ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యంతో ‘ఒప్పో కే 10 5జీ’ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్‌ మార్కెట్లో విడుదల చేసింది.   వర్చువల్ ఈవెంట్ ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్‌ను  లాంచ్‌ చేసింది.

  
ఒప్పో కే10 5జీ  ఫీచర్లు 
6.56 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్‌12
MediaTek డైమెన్సిటీ 810 సాక్‌ చిక్‌  
8జీబీ ర్యామ్‌  128 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ 
48+2 ఎంపీ రియర్‌ డ్యూయల్ కెమెరా 
8 ఎంపీ  సెల్ఫీకెమెరా 
5000ఎంఏహెచ్‌ బ్యాటరీ 

ఇం​కాసైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు , 5జీబీ  వరకు డైనమిక్ RAM విస్తరణ, సెల్ఫీ కెమెరాతో  ఫేస్ అన్‌లాక్ మెకానిజం లాంటి ఇతర ఫీచర్లు ఈ స్మార్ట్‌ఫోన్‌లో పొందుపర్చింది. 

ఒప్పో కే10 5జీ ధర: ఇండియాలో ప్రస్తుతం ఒక వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఓషన్ బ్లూ , మిడ్‌నూట్‌ బ్లాక్  రెండు రంగుల్లో  లభ్యం. దీని ధరను రూ. 17,499 గా నిర్ణయించింది. 
బ్యాంకు ఆఫర్స్‌: ఎస్‌బీఐ యాక్సిస్ బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డ్‌లతో బ్యాంక్ ఆఫర్‌లు కూడా అందిస్తోంది. వినియోగదారులు రూ. 1500 ఫ్లాట్ తగ్గింపును పొందవచ్చు. జూన్ 15, 2022 12 గంటలనుంచి ఫ్లిప్‌కార్ట్‌, ఒప్పో ఆన్‌లైన్ స్టోర్‌లో అందుబాటులో ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement