సాక్షి,ముంబై: చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ రియల్‌మీ కొత్త స్మార్ట్‌షోన్‌ను తీసుకొచ్చింది. రియల్‌మీ 10 పేరుతో తన ఫ్లాగ్‌షిప్ మొబైల్‌ను భారత మార్కెట్లో సోమవారం లాంచ్ చేసింది. అయితే దేశీయంగా 5జీ వినియోగానికి ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో ఈ స్మార్ట్‌ఫోన్ 5జీకి సపోర్ట్ ఇవ్వకపోవడం రియల్‌మీ ఫ్యాన్స్‌ను నిరాశ పర్చింది.
రియల్‌మీ 10 స్పెసిఫికేషన్లు
6.5అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లే
90Hz రిఫ్రెష్ రేట్,
ఆండ్రాయిడ్ 13 OS, MediaTek Helio G99 SoC
8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్
50 ఎంపీ ఏఐ, 2 ఎంపీ బ్లాక్&వైట్ పొట్రయిట్ రియర్ డ్యుయల్ కెమెరా
16 ఎంపీ సెల్ఫీ కెమెరా
5,000mAh బ్యాటరీ
ఫస్ట్ సేల్, ఆఫర్, ధర
ఈ స్మార్ట్‌ఫోన్ క్లాష్ వైట్ రష్ బ్లాక్ అనే రెండు రంగులలో లభ్యం. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 13,999, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 16,999గా ఉంటుంది. తొలి సేల్, జనవరి 15నుంచి రియల్ మీ, ఫ్లిప్‌కార్ట్ ఇతర ఆన్‌లైన్ స్టోర్లలో లభ్యం. రియల్‌మీ, ఫ్లిప్‌కార్ట్‌లో ICICI డెబిట్, క్రెడిట్ కార్డ్, EMI లావాదేవీలపై 1000 తక్షణ తగ్గింపును పొందవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment