సాక్షి,ముంబై: నోకియా లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ జీ60 5జీ స్మార్ట్‌ఫోన్ సేల్ ప్రారంభమైంది. గత వారం లాంచ్ చేసిన నోకియా జీ60 5జీ ఇండియాలో నేటి(మంగళవారం)నుంచి ఫస్ట్ సేల్‌కు సిద్ధం. 5జీ నెట్‌వర్క్ సపోర్ట్(నాన్-స్టాండలోన్, స్టాండలోన్) 50 మెగాపిక్సెల్ కెమెరా తోపాటు ట్రిపుల్ రియర్ కెమెరా లాంటి కీలక ఫీచర్లతో ఇది వినియోగదారులకు అందుబాటులో ఉంది. నోకియా ఇండియా సైట్ ద్వారా దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ నలుపు, ఐస్ రంగుల్లో లభ్యం.
ధర: 6 జీబీ ర్యామ్,128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 29,999గా ఉంది.
నోకియా జీ60 5జీ స్పెసిఫికేషన్స్
6.58 అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లే
నోకియా G60 5G స్నాప్‌డ్రాగన్ 695 5G SoC
120Hz రిఫ్రెష్ రేట్,1,080x2,400 పిక్సెల్స్ రిజల్యూషన్
50+5+2 ట్రిపుల్ రియర్ కెమెరా
8ఎంపీ సెల్పీ కెమెరా
4500mAh బ్యాటరీ
Comments
Please login to add a commentAdd a comment