
సాక్షి, ముంబై: ఒప్పో మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. అదీ రూ.20వేల లోపు ధరతో ఒప్పో ఏ78 ని తీసుకొచ్చింది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌తో సింగిల్ వేరియంట్‌లోనే తీసుకొచ్చిన ఒప్పో ఏ78 జనవరి 18నుంచి కొనుగోలుకు లభ్యం. 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో లాంచ్ చేసిన ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ ఫస్ట్ సేల్ సందర్భంగా కార్డ్ ఆఫర్ కూడా అందిస్తోంది.
ధర, లభ్యత
ఒప్పో ఏ78 5జీ ధర రూ.18,999గా నిర్ణయించిందికంపెనీ. సింగిల్ వేరియంట్‍లో (8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్) గ్లోయింగ్ బ్లాక్, గ్లోయింగ్ బ్లూ కలర్ ఆప్షన్‍లలో లభిస్తుంది. ఈ-కామర్స్ సైట్ అమెజాన్, ఒప్పో ఈ-స్టోర్‌తో పాటు ఆఫ్‍లైన్ స్టోర్లలోనూ ఈనెల 18వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఒప్పో ఏ78 5జీ సేల్ షురూ అవుతుంది. ప్రీ-బుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయి.
ఎస్‍బీఐ (SBI) క్రెడిట్, డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే 10 శాతం వరకు గరిష్ఠంగా రూ.1,300 అదనపు తగ్గింపును పొందవచ్చు. అలాగే నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది.
ఒప్పో ఏ78 5జీ పూర్తి స్పెసిఫికేషన్స్
6.56 ఇంచుల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‍ప్లే
మీడియాటెక్ డైమన్సిటీ 700 ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 13 (Android 13) బేస్డ్ కలర్ఓఎస్ 13
50+ 2 ఎంపీ రియర్ కెమెరా
8 ఎంపీ సెల్ఫీ కెమెరా
5000mAh బ్యాటరీ , 33 వాట్స్‌ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్
Comments
Please login to add a commentAdd a comment