Nokia G60 5G with Free Nokia Power Earbuds Lite Launch Offer
Sakshi News home page

నోకియా జీ60 5జీ: ఫ్రీ ఇయర్‌ బడ్స్‌, పరిచయ ఆఫర్‌ కూడా

Published Thu, Nov 3 2022 12:28 PM | Last Updated on Thu, Nov 3 2022 12:52 PM

Nokia G60 debuts in India, sales begins November 8 - Sakshi

సాక్షి,ముంబై: దేశీయ స్మార్ట్‌ఫోన్‌  తయారీదారు నోకియా మళ్లీ దూసుకొస్తోంది. ఎక్కువగా బడ్జెట్, మధ్య-శ్రేణి ఫోన్‌లకు పరిమిత మైన నోకియా  తాజాగా  5జీ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ చేసింది. నోకియా జీ60 పేరుతో దీన్ని తీసుకొచ్చింది. 5జీ కనెక్టివిటీతో పాటు భారీ డిస్‌ప్లే , ట్రిపుల్‌  రియర్‌ కెమెరా ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రత్యేకతలుగా నిలవనున్నాయి. 

6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ నోకియా జీ60 5జీ ధర రూ. 32,999గా నిర్ణయించిన కంపెనీ పరిచయ ఆఫర్‌గా రూ. 29,999కే అందిస్తోంది.   బ్లాక్‌, వైట్‌  కలర్‌ ఆప్షన్స్‌లో నవంబర్ 8 నుండి  లభ్యం కానుంది. అలాగే  ముందుగా  బుక్‌ చేసుకున్న వారికి  రూ.3,599 విలువైన నోకియా పవర్‌ ఇయర్‌ బడ్స్‌ ఉచితంగా అందిస్తుంది. ఈ ఆఫర్‌ ఈ నెల ఒకటో తేదీ నుంచి ఏడో తేదీ వరకు కొనుగోలు చేసిన వారికి మాత్రమే ఈ ఆఫర్‌ వర్తిస్తుందని కంపెనీ ప్రకటించింది.

నోకియా జీ60 5జీ  స్పెసిఫికేషన్స్
6.5-అంగుళాల డిస్‌ప్లే విత్‌ రీఫ్రెష్‌ రేట్‌ 120హెర్ట్జ్‌
1080×2400 పిక్సెల్స్‌ ఫుల్‌ హెచ్డీ రిజల్యూషన్‌
50+5+2 ఎంపీ టట్రిపుల్‌ రియర్‌ కెమెరా
8 ఎంపీ సెల్పీ కెమెరా
4500ఎంఏహెచ్‌ బ్యాటరీ
20వాట్ల ఫాస్ట్‌ చార్జింగ్‌ సపోర్ట్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement