![Realme 9i 5G with Dimensity 810 chipset launched in India budget Price and specs - Sakshi](/styles/webp/s3/article_images/2022/08/18/Realme%205g.jpg.webp?itok=LGCXnLHA)
సాక్షి,ముంబై: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ రియల్ మీ కొత్త 5జీ మొబైల్‌ని విడుదల చేసింది. Realme 9i పేరుతో భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. దేశంలో 5జీ సేవలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో 9ఐకి 5జీ వెర్షన్ ఫోన్‌ను తీసుకొచ్చింది. మూడు రంగుల్లో రెండు వేరియంట్లలో ఇది అందుబాటులో ఉంటుంది.
చదవండి : నా 30 ఏళ్ల అనుభవంలో తొలిసారి: ఎయిర్‌టెల్ చైర్మన్ ఆశ్చర‍్యం, ప్రశంసలు
ధరలు, లభ్యత, ఆఫర్లు
4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీ మోడల్ ధర రూ. 14,999.
6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ ధర రూ. 16,999
ఈ స్మార్ట్‌ఫోన్ ఆగస్టు 24, మధ్యాహ్నం 12 గంటల నుంచి రియల్ మీషోరూంలు, ఫ్లిప్‌కార్ట్‌లో లభ్యం. అలాగే లాంచింగ్ ఆఫర్‌గా రూ. 1000 తగ్గింపు ఆఫర్‌ను కూడా సంస్థ ప్రకటించింది. అంటే ముందుగా కొనుగోలు చేసిన వారికి 13,999, 15999ల రేంజ్‌లో ఈ ఫోన్లను సొంతంచేసుకోవచ్చు.
(చదవండి: ప్రత్యేక డిపాజిట్ స్కీమ్: లక్ష డిపాజిట్ చేస్తే దాదాపు లక్షా 28 వేలు!)
Realme 9i 5జీ ఫీచర్లు
6.6 అంగుళాల డిస్‌ప్లే, Dimensity 810 చిప్‌సెట్
2,400×1,800 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 12
ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ 90 హెర్జ్ రీఫ్రెష్ రేటు
50 ఎంపీ ప్రైమరీ కెమెరాగా ట్రిపుల్ రియర్ కెమెరా
8 ఎంపీ సెల్ఫీ కెమెరాతో
5000 ఎంఏహెచ్ బ్యాటరీతో 18 వాట్ చార్జర్
T100 ఇయర్ బడ్స్
Realme కొత్త 5G ఫోన్‌తో పాటు Realme Buds T100ని కూడా లాంచ్ చేసింది. T100 రూ. 1499 గాకంపెని నిర్ణయించింది. ఇవి మొత్తం 28 గంటల ప్లేబ్యాక్ సమయం, T100 ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తాయని కంపెనీ తెలిపింది. రాకిన్ రెడ్, పాప్ వైట్, జాజ్ బ్లూ , పంక్ బ్లాక్ నాలుగు రంగుల్లో ఇవి లభ్యం.
Comments
Please login to add a commentAdd a comment