Oppo A58 5G Launched with 90Hz Display, 50 MP Main Camera & more
Sakshi News home page

ఒప్పో ఏ58 5జీ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌: సూపర్‌ ఫీచర్లు, ధర తక్కువ

Published Tue, Nov 8 2022 3:13 PM | Last Updated on Tue, Nov 8 2022 4:00 PM

Oppo A58 5G Launched after couple of leaks - Sakshi

న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్‌ తయారీదారు ఒప్పో లేటెస్ట్‌ స్మార్ట్‌ఫోన్‌ను తాజాగా విడుదల చేసింది. గత కొన్ని రోజులుగా వస్తున్న లీక్‌ల తరువాత ఎట్టకేటలకు ఒప్పో ఏ58 5జీ స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో అధికారికంగా  లాంచ్‌ చేసింది. 

ధర, లభ్యత
 ఏ సిరీస్‌లో తీసుకొచ్చిన ఒప్పో ఏ58 5జీ 8జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌(ఏకైక) ధరను 234 డాలర్లు (రూ. 19,123)గా నిర్ణయించింది. ట్రాంక్విల్ సీ బ్లూ, స్టార్ బ్లాక్  బ్రీజ్ పర్పుల్ రంగుల్లో దీన్ని లాంచ్‌ చేసింది. ప్రీ-ఆర్డర్‌కు నేటి (నవంబరు 8) నుంచి అందుబాటులో ఉంచగా, నవంబరు 10నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉండనుంది. ముందుగా కొనుగోలు చేస్తే వినియోగదారులు ఒప్పో వైర్డ్ ఇయర్‌ఫోన్‌లను ఉచితంగా అందిస్తోంది. అయితే ఇండియాలో  ఎపుడు లాంచ్‌ చేసేదీ వివరాలు అందుబాటులో లేవు.

ఒప్పో ఏ58 5జీ స్పెసిఫికేషన్స్
 6.56 అంగుళాల ఎల్‌సీడీ  డిస్‌ప్లే 
1612 x 720 పిక్సెల్‌ పిక్సెల్స్‌ రిజల్యూషన్‌ 
MediaTek డైమెన్సిటీ 700 SoC
డ్యూయల్-కెమెరా (50ఎంపీ ప్రైమరీ కెమరా + 2 ఎంపీ డెప్త్ సెన్సార్‌)   
8ఎంపీ  సెల్ఫీ కెమెరా 
5000mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్‌ సపోర్ట్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement