You Can Get Oppo 8 Reno 5G With Extraordinary Flipkart Offers - Sakshi
Sakshi News home page

Oppo 8 Reno 5G: ఆఫర్ అంటే ఇలా ఉండాలి.. అతి తక్కువ ధరకే ఒప్పో 5జీ స్మార్ట్‌ఫోన్!

Published Sat, Jun 24 2023 6:29 PM | Last Updated on Sat, Jun 24 2023 7:14 PM

You can get oppo 8 reno 5g with extraordinary Flipkart offers - Sakshi

Oppo Reno 8 5G: సరసమైన ధరలో బెస్ట్ ఫీచర్స్, 5జీ నెట్‌వర్క్‌కు సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని ఎదురు చూస్తున్నవారికి ఫ్లిప్‌కార్ట్ ఒక అద్భుతమైన ఆఫర్ తీసుకు వచ్చింది. ఈ ఆఫర్ కింద రూ. 38,999 విలువైన 'ఒప్పో రెనొ 8 5జీ' సరసమైన ధరలోనే కొనుగోలు చేయవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

భారతీయ మార్కెట్లో ఒప్పో కంపెనీ విక్రయిస్తున్న అత్యుత్తమ మొబైల్ ఫోన్స్‌లో ఒకటి 'రెనొ 8 5జీ'. ఇది దేశీయ విఫణిలో 2022 జులైలో విడుదలైంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ లేదా 8జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ఆప్షన్స్‌లో లభిస్తుంది.

90 హెర్జ్స్ రిఫ్రెష్ రేటుతో 6.4 ఇంచెస్ అమొలెడ్ డిస్‌ప్లే కలిగిన ఈ మొబైల్ వెనుకవైపు 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగా పిక్సెల్ మాక్రో కెమెరా, 2 మెగా పిక్సెల్ మోనో క్రోమ్ కెమెరా పొందుతుంది. సెల్ఫీలు లేదా వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 32 మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. బ్యాటరీ కెపాసిటీ 4500 mAh.

(ఇదీ చదవండి: జీతగాడి స్థాయి నుంచి స్టార్‌ హీరోలకు మేనేజర్‌గా.. బిజినెస్‌తో కోట్ల సంపాదన - సాధారణ వ్యక్తి సక్సెస్ స్టోరీ!)

అడ్వాన్స్డ్ ఫీచర్స్ కలిగి.. 5జీ నెట్‌వర్క్‌తో లభిస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ మీద ఫ్లిప్‌కార్ట్ రూ. 29,000 వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ అందిస్తుంది. ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ కేవలం మీ ఫోన్ కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది. అయితే దీనిని HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ. 1250 వరకు, కోటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే 10శాతం డిస్కౌంట్ లభిస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement