china markets
-
ట్రంప్ ఎన్నికతో భారత్‌వైపు చూపు
అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ సీఎల్ఎస్ఏ భారత్‌లో పెట్టుబడులు పెంచేందుకు ఆసక్తి చూపుతోంది. అక్టోబర్‌లో చైనా మార్కెట్లో దాదాపు ఐదు శాతం ఇన్వెస్ట్మెంట్ పెంచినట్లు కంపెనీ తెలిపింది. అదే సమయంలో భారత్‌లో 20 శాతంగా ఉన్న పెట్టుబడులను 10 శాతానికి తగ్గించింది. కానీ రానున్న రోజుల్లో భారత్‌లో తిరిగి పెట్టుబడులను పెంచబోతున్నట్లు సీఎల్ఎస్ఏ పేర్కొంది.అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంతో అమెరికా-చైనా వాణిజ్య సంబంధాలు పరిమితంగానే ఉంటాయని సీఎస్ఎల్ఏ అంచనా వేస్తుంది. దాంతో చైనాకు ఇబ్బందులు తప్పవనే వాదనలున్నాయి. కాబట్టి చైనాలో పెట్టుబడులు పెట్టడానికి అంతగా ఆసక్తి చూపించడంలేదు. చైనా ఆర్థిక వృద్ధిలో ఎగుమతులే ప్రధాన పాత్ర పోషిస్తాయి. అలాంటిది ట్రంప్ రాకతో వీటిపై తీవ్ర ప్రభావం పడుతుందని సీఎల్ఎస్ఏ విశ్లేషిస్తుంది. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రతరం కావొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దాంతో అక్కడి కంటే మెరుగైన ఆర్థిక వాతావరణ పరిస్థితులున్న భారత్‌వైపు సీఎల్ఎస్ఏ మొగ్గు చూపుతుంది.ఇదీ చదవండి: వ్యాక్సిన్ వ్యతిరేకితో భారత్‌కు నష్టం?ఇటీవలి కాలంలో విదేశీ మదుపర్లు భారత స్టాక్ మార్కెట్ల నుంచి రోజు సరాసరి రూ.3000 కోట్లు ఉపసంహరించుకుంటున్నారు. గత నెల నుంచి దాదాపు రూ.1.14 లక్షల కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో భారత మార్కెట్లు కొంత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఇది సీఎల్ఎస్ఏ వంటి పెట్టుబడిదారులు భారత మార్కెట్‌పై ఆసక్తి చూపేందుకు అవకాశం కల్పిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
రియల్మీ10 ప్రొ స్మార్ట్ఫోన్లు వచ్చేశాయ్, ధర తక్కువే!
సాక్షి, ముంబై: ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న రియల్‌మి సిరీస్‌లో కొత్త స్మార్ట్ఫోన్లు లాంచ్ అయ్యాయి. చైనాలో రియల్‌మి 10 ప్రో సిరీస్‌ను కంపెనీ ఆవిష్కరించింది. రియల్‌మి ప్రొ, రియల్‌మి ప్రొ ప్లస్ 5జీ రెండు వేరియంట్లలో కొత్త మిడ్-రేంజ్ స్మార్ట్ఫోన్లను తీసుకొచ్చింది. త్వరలోనే ఈ ఫోన్లను భారత మార్కెట్లో తీసుకొస్తామని స్పష్టం చేసింది. ఇవి స్టార్‌లైట్ గోల్డ్, నైట్ బ్లాక్, సీ బ్లూ రంగుల్లో లభ్యం. రియల్‌మి 10 ప్రో 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే స్నాప్‌డ్రాగన్ 695 SoC, ఆండ్రాయిడ్ 13 108+ 2 ఎంపీ రియర్ డ్యూయల్ కెమెరా 16ఎంపీ సెల్పీ కెమెరా 5000mAh బ్యాటరీని 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ధరలు: 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ సుమారు రూ. దాదాపు రూ. 18,300 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ దాదాపు రూ. 21,700 రియల్‌మి 10 ప్రో ప్లస్ 5జీ 6.72 అంగుళాల ఫుల్హెచ్డీ అమోలెడ్ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 800నిట్స్ పీక్, Snapdragon 695 SoC, ఆండ్రాయిడ్ 13 108+2 ఎంపీ రియర్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 5000mAh బ్యాటరీ 67 వాట్ ఛార్జింగ్ ధరలు 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ సుమారు రూ. 19,444 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ దాదాపు రూ. 22,900 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ దాదాపు రూ. 26,300 -
ఒప్పో ఏ58 5జీస్మార్ట్ఫోన్లాంచ్: సూపర్ ఫీచర్లు, ధర తక్కువ
న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్ తయారీదారు ఒప్పో లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ను తాజాగా విడుదల చేసింది. గత కొన్ని రోజులుగా వస్తున్న లీక్‌ల తరువాత ఎట్టకేటలకు ఒప్పో ఏ58 5జీ స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో అధికారికంగా లాంచ్ చేసింది. ధర, లభ్యత ఏ సిరీస్‌లో తీసుకొచ్చిన ఒప్పో ఏ58 5జీ 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్(ఏకైక) ధరను 234 డాలర్లు (రూ. 19,123)గా నిర్ణయించింది. ట్రాంక్విల్ సీ బ్లూ, స్టార్ బ్లాక్ బ్రీజ్ పర్పుల్ రంగుల్లో దీన్ని లాంచ్ చేసింది. ప్రీ-ఆర్డర్‌కు నేటి (నవంబరు 8) నుంచి అందుబాటులో ఉంచగా, నవంబరు 10నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉండనుంది. ముందుగా కొనుగోలు చేస్తే వినియోగదారులు ఒప్పో వైర్డ్ ఇయర్ఫోన్లను ఉచితంగా అందిస్తోంది. అయితే ఇండియాలో ఎపుడు లాంచ్ చేసేదీ వివరాలు అందుబాటులో లేవు. ఒప్పో ఏ58 5జీ స్పెసిఫికేషన్స్ 6.56 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే 1612 x 720 పిక్సెల్ పిక్సెల్స్ రిజల్యూషన్ MediaTek డైమెన్సిటీ 700 SoC డ్యూయల్-కెమెరా (50ఎంపీ ప్రైమరీ కెమరా + 2 ఎంపీ డెప్త్ సెన్సార్) 8ఎంపీ సెల్ఫీ కెమెరా 5000mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ -
బడ్జెట్ ధరలో రియల్మీ క్యూ2 5జీ స్మార్ట్ఫోన్లు
సాక్షి,ముంబై: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు రియల్మీ బడ్జెట్ ధరలో మరో ఫోన్‌ను లాంచ్ చేసింది. బడ్జెట్ ఫోన్లతో ఆకట్టుకుంటున్న సంస్థ తాజాగా 5 జీ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. రియల్మీ క్యూ2, రియల్మీ క్యూ2 ప్రో, రియల్మీ క్యూ2ఐ అనే మూడు స్మార్ట్ఫోన్లు లాంచ్ చేసింది. రియల్మీ క్యూ, రియల్మీ క్యూ2 ప్రోలు రెండు ర్యామ్, స్టోరేజ్ వేరియంట్లలోనూ, రియల్మీ క్యూ2ఐలో ఒక్క స్టోరేజ్ వేరియంట్లో మాత్రమే లభ్యం కానుంది. ప్రస్తుతం చైనాలో లాంచ్ అయిన ఈ ఫోన్లు త్వరలో ఇండియా మార్కెట్లోకి రానున్నాయి. రియల్మీ క్యూ2 ఫీచర్లు 6.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే, అక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 800యూ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 10 48+8+2 మెగా పిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ రియల్మీ క్యూ2 ప్రో ఫీచర్లు 6.4 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోఎల్ఈడీ డిస్ ప్లే, అక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 800యూ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 10 48+8+2 మెగా పిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 4300 ఎంఏహెచ్ బ్యాటరీ రియల్మీ క్యూ2ఐ ఫీచర్లు 6.5 అంగుళాల డిస్ ప్లే మీడియాటెక్ డైమెన్సిటీ 720 ప్రాసెసర్, 13+2+2 మెగా పిక్సెల్ రేర్ కెమెరా సెటప్ ఆండ్రాయిడ్ 10 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇక ధరల విషయానికి వస్తే రియల్మీ క్యూ 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,200 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.15,200 రియల్మీ క్యూ2 ప్రో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,799 రూ.19,600 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,800గా ఉంది. రియల్మీ క్యూ2ఐ 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధర రూ.13,000 -
హానర్ ఎక్స్ 10 లాంచ్ : ఫీచర్లు, ధర
సాక్షి,న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్ తయారీదారు హానర్ లేటెస్ట్ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌ను బుధవారం చైనా మార్కెట్లో లాంచ్ చేసింది. హానర్ ఎక్స్ 10 పేరుతో దీన్ని తీసుకొచ్చింది. 5జీ , ట్రిపుల్ రియర్ కెమెరా, పాప్ అప్ సెల్పీ కెమెరా, ఆక్టా-కోర్ ప్రాసెసర్ లాంటి ప్రధాన ఫీచర్లను ఇందులో జోడించింది.. హానర్ ఎక్స్ 10 మూడు కలర్ ఆప్షన్లతో పాటు , స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో లభ్యం కానుంది. 256 జీబీ వరకు స్టోరేజ్‌ను ఎక్స్ పాండ్ చేసుకోవచ్చు. చైనా మార్కెట్లో మే 26 నుండి ఫోన్ అమ్మకానికి లభిస్తుండగా, అంతర్జాతీయంగా ఎపుడు అందుబాటులోకి వచ్చేదీ స్పష్టతలేదు. హానర్ ఎక్స్ 10 ఫీచర్లు 6.63 అంగుళాల డిస్ప్లే హై సిలికాన్ కిరిన్ 820 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 10 1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్ 16 ఎంపీ సెల్పీ పాప్ అప్ కెమెరా 40+8+2 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 4300 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం 6 జీబీ, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ. 20,200 6 జీబీ, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ. 23,400 8 జీబీ, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్, ధరసుమారు రూ .25,500 -
బడ్జెట్ ధరలో హువావే స్మార్ట్‌పోన్
బీజింగ్: చైనాకుచెందిన స్మార్ట్‌ఫోన్ తయారీదారు హువావే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఎంజాయ్ 10ఈ పేరుతో బడ్జెట్ సెగ్మెంట్ లోఈ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. భారీ బ్యాటరీ, డ్యుయల్ రియర్ కెమరా లాంటి కీలకఫీచర్లతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను రెండువేరియంట్లలో చైనా మార్కెట్లో లాంచ్ చేసింది. అయితే భారత్ సహా ఇతర మార్కెట్లలో ఎపుడు లాంచ్ చేసిన స్పష్టత లేదు. హువావే ఎంజాయ్ 10ఈ ఫీచర్లు 6.3 ఇంచుల డిస్ప్లే 600 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 10 4జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్ 512 జీబీ దాకా విస్తరించుకునే అవకాశం 13+2 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ధరలు 3జీబీ ర్యామ్ /64 జీబీ ధర సుమారు రూ.10,309 4జీబీర్యామ్/128 జీబీ స్టోరేజ్ ధర సుమారు రూ.12,375 మిడ్నైట్ బ్లాక్, పెర్ల్ వైట్, ఎమరాల్డ్ గ్రీన్ కలర్స్‌లో మార్చి 5వ తేదీ నుంచి వినియోగదారులకు లభ్యం కానుంది. -
హానర్ పవర్ఫుల్ 5జీ స్మార్ట్ఫోన్లు లాంచ్
బీజింగ్ : చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు హానర్ సంస్థ పవర్ఫుల్ స్మార్ట్ఫోన్లను బీజింగ్‌లో లాంచ్ చేసింది. వ్యూ 30 సిరీస్‌లో మొదటి డ్యూయల్ మోడ్ 5 జి స్మార్ట్ఫోన్లను మంగళవారం ఆవిష్కరించింది. వ్యూ 30, వ్యూ 30 ప్రో పేరుతో లాంచ్ చేసిన ఈ ఫోన్లలో 5జీ/4జీ 4 జి డ్యూయల్ మోడ్‌ను అమర్చింది. అయితే అందుబాటులో ఉన్న నెట్వర్క్ ఆధారంగా వినియోగదారులు 4జీ/5జీ నెట్‌వర్క్‌కు మారవచ్చని కంపెనీ తెలిపింది. తమ హానర్ వ్యూ 30 సిరీస్ ఇప్పటి వరకు అత్యంత వినూత్నమైన స్మార్ట్‌ఫోన్లనీ ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రజల రోజువారీ జీవితాలపై అద్భుతమైన ప్రభావాన్ని చూపుతుందనీ హానర్ప్రెసిడెంట్ జార్జ్ జావో వెల్లడించారు. వ్యూ 30 ప్రో ఫీచర్లు 6.57-అంగుళాల ఎఫ్‌హెచ్‌డి + ఫుల్‌వ్యూ డిస్ప్లే 7ఎన్ఎమ్ ప్రాసెస్-బేస్డ్ కిరిన్ 990 చిప్సెట్ ఆండ్రాయిడ్ 10 ఓఎస్ 40+12+8 ఎంపీ ట్రిపుల్ రియల్ కెమెరా 32 +8 ఎంపీ సెల్ఫీకెమెరా 4100 ఎంఏహెచ్ బ్యాటరీ ధరలు : వ్యూ 30 6జీబీ ర్యామ్ / 128 జీబీ స్టోరేజ్ , 8జీబీ ర్యామ్ / 128జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో లభించేనుంది. వీటి ధరలు వరుసగా 3,299 యువాన్లు (సుమారు రూ. 33,600). 3699 యువాన్లు ( సుమారు రూ. 37,700) వ్యూ 30 ప్రో 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర 3,899 యువాన్లు (సుమారు రూ.39,700) 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 4,199 యువాన్లు (సుమారు రూ. 42,800). వ్యూ 30 ప్రో డ్యూయల్ పంచ్ హోల్, 40వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 27వా వైర్లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. మరోవైపు, వ్యూ 30 దాదాపు ఇలాంటి ఫీచర్లతోనే డ్యుయల్ కెమరాల్లో 8ఎంపీ సూపర్ వైడ్ యాంగిల్ సెన్సార్ సెల్ఫీ కెమెరా, 4,200 ఎంఏహెచ్ బ్యాటరీతో లాంచ్ చేసింది. వీటితో పాటు, మ్యాజిక్‌బుక్14 , మ్యాజిక్‌బుక్15 పేరుతో సరికొత్త మ్యాజిక్‌బుక్ సిరీస్‌ను హానర్ ఆవిష్కరించింది. -
శాంసంగ్ 5జీ మడత ఫోన్ లాంచ్
దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ సరికొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో విడుదల చేసింది. శాంసంగ్ డబ్ల్యు 20 5జీ పేరుతొ దీన్ని బుధవారం లాంచ్ చేసింది. గెలాక్సీ ఫోల్డ్ రీబ్రాండెడ్ వెర్షన్ 5జీ అప్ గ్రేడ్ చేసి ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855+ సాక్ మినహా మిగిలిన ఫీచర్లను గెలాక్సీఫోల్డ్ మాదిరిగా ఉంచింది. ఎకెజి-ట్యూన్డ్ స్పీకర్లు, డాల్బీ అట్మాస్ సపోర్ట్, యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్, బేరోమీటర్, జియోమాగ్నెటిక్, గైరోస్కోప్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్‌సెన్సర్ లాంటి ఫీచర్లు ప్రధానంగా ఉన్నాయి. అలాగే వైర్లెస్ ఛార్జింగ్‌తో పాటు వైర్లెస్ పవర్ షేర్‌కు మద్దతు ఇస్తుంది. డిసెంబరునుంచి ఇది చైనాలో అందుబాటులోకి రానుంది.ధర వివరాలు, ఇతర మార్కెట్లలో దీని లభ్యత తదితర వివరాలను శాంసంగ్ ఇంకా వెల్లడించలేదు. అయితే దీని ధర సుమారు రూ. 1,73,000 గా వుంటుందని అంచనా. శాంసంగ్ డబ్ల్యూ 20 5జీ ఫీచర్లు ఫస్ట్ స్ట్రీన్ 4.2: 3 కారక నిష్పత్తి, 1536x2152 పిక్సెల్స్ రిజల్యూషన్ 7.3-అంగుళాల ఇన్ఫినిటీ ఫ్లెక్స్ డైనమిక్ అమోలేడ్ డిస్ప్లే సెకండ్ స్క్రీన్ 840x1960 పిక్సెల్స్ రిజల్యూషన్ , 21: 9 కారక నిష్పత్తి 4.6 అంగుళాల సూపర్ అమోలెడ్ కవర్ డిస్ ప్లే ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855+ ప్రాసెసర్ 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఎస్డి కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను విస్తరించుకునే సదుపాయం 16+12+12 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 10 + 8 ఎంపీ డబుల్ సెల్ఫీ కెమెరా 4235 ఎంఏహెచ్ బ్యాటరీ -
షావోమి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది
షావోమి తన అద్భుతమైన కెమెరాను అధికారికంగా లాంచ్ చేసింది. 108 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో సహా ఐదు వెనుక కెమెరాలుతో ప్రతిష్టాత్మక స్మార్ట్‌ఫోన్‌ను నేడుబీజింగ్లోఆవిష్కరించింది. ఎంఐ సిరీస్‌లో భాగంగా ఎంఐ సీసీ9 ప్రొ పేరుతో దీన్ని లాంచ్ చేసింది. ఎంఐ సీసీ 9 ప్రో ధర బేసిక్ వేరియంట్ 6జీబీ ర్యామ్/ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సిఎన్‌వై 2,799 (సుమారు రూ .28,000) హై-ఎండ్ 8జీబీ ర్యామ్/ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సిఎన్‌వై 3,099 (సుమారు రూ. 31,000) ప్రీమియం ఎడిషన్ ధర 8జీబీ ర్యామ్/ 256 జీబీ స్టోరేజ్ సిఎన్‌వై 3,499 (సుమారు రూ .35,000) ఎంఐ సీసీ 9 ప్రో స్పెసిఫికేషన్లు డ్యూయల్ సిమ్ (నానో) మి సిసి 9 ప్రో MIUI 11 ను నడుపుతుంది. ఈ ఫోన్లో 6.47-అంగుళాల కర్వ్డ్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే 1080x2340 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730జీ ప్రాసెసర్ 108 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఎఫ్ / 1.69 ఎపర్చరు ఫోర్-యాక్సిస్ ఓఐఎస్ (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) 117డిగ్రీల 20 ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరా, 2x ఆప్టికల్ జూమ్‌తో12 ఎంపీ షార్ట్ టెలిఫోటో లెన్స్ 50x డిజిటల్ జూమ్ సపోర్ట్‌తో 8 ఎంపీ లాంగ్ టెలిఫోటో లెన్స్ 32 ఎంపీ సెల్ఫీ కెమెరా ఎఫ్ / 2.0 ఎపర్చర్ 5260 ఎంఏహెచ్ బ్యాటరీ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ నవంబర్ 11 న చైనాలో విక్రయాలు ప్రారంభం. ప్రారంభమవుతుంది. ఇతర మార్కెట్లలో దీని లభ్యతపై ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు. హువావే మేట్ 30 ప్రో, గెలాక్సీ నోట్ 10+, గూగుల్ పిక్సెల్ 4 ఫోన్లకు ఇది గట్టిపోటీ ఇవ్వనుందని భావిస్తున్నారు. -
సూపర్ ఫీచర్లు, బడ్జెట్ధర : మెయ్‌జు 16ఎక్స్ఎస్
బీజింగ్: అధునాతన ఫీచర్లతో చైనాకు చెందిన ప్రముఖ మొబైల్స్ సంస్థ మెయ్‌జు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. 16ఎక్స్ఎస్ పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను చైనా మార్కెట్లో విడుదల చేసింది. ప్రధానంగా ఈ స్మార్ట్‌ఫోన్‌లో 48మెగాపిక్సెల్ కెమెరా సహా ట్రిపుల్ రియర్ కెమెరాలను రియర్ సైడ్‌లో ఏర్పాటు చేసింది. ఇంకా భారీ స్క్రీన్, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫాస్ట్ ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ను అందిస్తోంది. అదీ బడ్జెట్ ధరలో. రెండు వేరియంట్లలో అందుబాటులోకి రానున్న ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధరను రూ.17,150 గా నిర్ణయించింది. మెయ్‌జు 16ఎక్స్ఎస్ ఫీచర్లు 6.2 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే 1080 x 2232 పిక్సల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 9.0 పై 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 675 ప్రాసెసర్ 6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్ 48+8+5 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరా 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ -
భారీ బ్యాటరీతో వివో వై3 లాంచ్
బీజింగ్ : చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. వై సిరీస్‌లో భాగంగా వై 3 పేరుతో మొబైల్‌ను చైనాలో లాంచ్ చేసింది. ట్రిపుల్ రియర్ కెమెరా, భారీ బ్యాటరీ ప్రధాన ఆకర్షణగా ఉంది. భారత్ మార్కెట్లో ఎపుడు విడుదలయ్యేది స్పష్టత ఇవ్వలేదు వివో. వివో వై 3 ఫీచర్లు 6.35 అంగుళాల డిస్ప్లే 720x1544 పిక్సెల్స్ రిజల్యూషన్ మీడియా టెక్ హీలియో పీ 35 ప్రాసెసర్ 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 13+8+2 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ధర సుమారు రూ. 15,200 -
వివో ఎస్1 ప్రొ స్మార్ట్‌ఫోన్ లాంచ్
సాక్షి, న్యూఢిల్లీ : చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న పాప్ అప్ సెల్ఫీ కెమెరాతో దీన్నితీసుకొస్తోంది. వివో ఎస్1 ప్రొ పేరుతో చైనా మార్కెట్లో ఆవిష్కరించింది. ఇటీవల భారత్‌లో తీసుకొచ్చిన వివో వీ 15 ప్రొ ఫీచర్లతోనే దీన్ని అందుబాటులోకి తెచ్చింది. 6జీబీ, 8 జీబీ రెండు వేరియంట్లో అందుబాటులో ఉండనుంది. అలాగే ట్రిపుల్ రియర్‌కెమెరా, 32 ఎంపీ సెల్పీ కెమెరా ప్రధాన ఆకర్షణ. ధర రూ. 27,700గా ఉంది. వివో ఎస్ 1 ప్రొ ఫీచర్లు 6,39 డిస్ప్లే 2340 X 1080 పిక్సెల్స్ రిజల్యూషన్ 28+8+5 ఎంపీ రియర్ కెమెరా 48ఎంపీ సెల్ఫీ కెమెరా 6జీబీ, 256 జీబీ ర్యామ్, 8 జీబీ ర్యామ్/128జీబీ ర్యామ్ 3700 ఎంఏహచ్ బ్యాటరీ -
షావోమికి పోటీ : వివో కొత్త స్మార్ట్‌ఫోన్
బీజింగ్ : చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు వివో మరో కొత్తస్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. యూ సిరీస్‌లో వివో యూ1 పేరుతో చైనా మార్కెట్లో అవిష్కరించింది. వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే, రెండు ఏఐ ఆధారిత రియర్ కెమెరాలతో దీన్ని తీసుకొచ్చింది. షావోమి ఈ నెల 28న భారత మార్కెట్లో ఆవిష్కరించినున్న రెడ్ మినోట్ 7కు ఇది గట్టిపోటీ ఇవ్వనుందట. వివో యూ1 ఫీచర్లు 6.2 అంగుళాల హెచ్డీ ప్లస్ డిస్ప్లే 1520 x 720 పిక్సెల్స్ రిజల్యూషన్ స్నాప్‌డ్రాగన్ 439 12ఎంఎం సాక్ ఆండ్రాయిడ్ 9.1 ఓరియో 3, 4జీబీ ర్యామ్/32జీబీ/64 జీబీస్టోరేజ్ 13+2 డ్యూయల్ రియర్ కెమెరా 8ఎంపీ సెల్ఫీకెమెరా 4030 ఎంఏహెచ్ బ్యాటరీ మూడు రంగుల్లో చైనాలో ఇప్పటికే లభ్యం అవుతున్న వివో యూ 1 స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర సుమారు రూ. 8430గా ఉంది. 4జీబీ/64జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ. 12,645గా ఉంది. ఈ డివైస్‌ను ఎపుడు భారత మార్కెట్లోకి తీసుకొచ్చేదీ కంపెనీ ఇంకా వెల్లడి చేయలేదు. -
షావోమి వేగం : మరో బిగ్ టీవీ లాంచ్
సాక్షి,ముంబై: మొబైల్స్ తయారీదారు షావోమీ టీవీ సెగ్మెంట్లో శరవేగంగా దూసుకుపోతోంది. ఇటీవీల టీవీ మార్కెట్‌పై దృష్టి పెట్టిన షావోమి వరుసగా లాంచ్‌లతో వినియోగదారులకు ఆకట్టుకుంటోంది. తాజాగా 75 ఇంచులఎంఐ టీవీ 4ఎస్‌ను చైనా మార్కెట్లో విడుదల చేసింది, ఈ రోజు నుంచే సేల్స్‌ను ప్రారంభించింది. దీని ధరను రూ.82,100గా నిర్ణయించింది. ఇక ఈ టీవీ ప్రధాన ఫీచర్ల విషయానికి వస్తే క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, డీటీఎస్ హెచ్డీ డాల్బీ ఆడియో, బ్లూటూత్, వైఫై తదితరాలు లభిస్తున్నాయి. -
అంగట్లో పెళ్లి కూతుళ్ల అమ్మకం!
సంతలో పశువులను అమ్మినట్లు అక్కడ చిన్నారి పెళ్లి కూతుళ్లను అమ్ముతారు. 13, 14 ఏళ్లు కూడా నిండని అమ్మాయిలను దాదాపు రెండు లక్షల రూపాయలకే అమ్మేస్తారు. అందులో పెళ్లి కూతురికి నయాపైసా కూడా దక్కదు. చైనా యువకులు వారిని ఎగబడి కొనుక్కున్నా డబ్బులు మాత్రం అమ్మాయిలను విక్రయించిన స్మగ్లర్లకే పోతాయి. అమ్మాయిల తల్లిదండ్రులకు ఈ విషయం ఎప్పటికీ తెలియదు. అలా అంగడి బొమ్మల్లే అమ్ముడుపోయిన అమ్మాయిలు చైనా యువకులతో కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిందే. ఆ తర్వాత జీవితంలో తమ తల్లిదండ్రులను గానీ, పుట్టిన గడ్డను గానీ చూసే అవకాశం ఎప్పటికీ లభించదు. చైనా యువకులు, చైనా అమ్మాయిలను పెళ్లి చేసుకోవాలనుకుంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. పెళ్లి కూతురుకు ఎదురుకట్నం ఇచ్చి, పెళ్లి ఖర్చులు భరించడమే కాకుండా సొంతిల్లు కలిగి ఉండాలి. సొంతిల్లు లేనివారిని పెళ్లి చేసుకునేందుకు చైనా యువతులు ముందుకు రారు. కారణం స్త్రీ, పురుష నిష్పత్తిలో తేడా కారణంగా చైనా అమ్మాయిలకు డిమాండ్ ఎక్కువ. దశాబ్దాల తరబడి ఏక సంతాన విధానాన్ని చైనా ప్రభుత్వం పాటించడం వల్ల ఆ దేశంలో అమ్మాయిల కొరత ఏర్పడిందని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘాలు విశ్లేషించాయి. ఈ కారణం వల్ల చైనాలో పెళ్లి కూతుళ్లకు డిమాండ్ పెరిగింది. దీన్ని అవకాశంగా తీసుకొని చైనాలో అక్రమ మానవ రవాణా ముఠాలు పుట్టుకొచ్చాయి. వారి కన్ను పొరుగునే ఉన్న వియత్నాం సరిహద్దు గ్రామాలపై పడింది. చైనాలో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వియత్నాం బాలికలను బుట్టలో వేస్తారు. ఫ్రెండ్స్ పార్టీల పేరిట పిలిపించి మద్యం తాగిస్తారు. డ్రగ్స్ ఇస్తారు. వారు ఆ మత్తులో ఉండగానే సరిహద్దు దాటించి చైనా సంతకు తీసుకెళతారు. ఈమధ్య సోషల్ మీడియా ద్వారా కూడా చదువుకుంటున్న వియత్నాం బాలికలను ఎర వేస్తున్నారు. మీడియా ముందుకు వచ్చి తమ వ్యథార్థ గాధలను వినిపించిన లాన్, ఎన్‌గుయన్ వియత్నాం నుంచి చైనాకు అలా చేరిన వారే. 'పరీక్షలకు సిద్ధమవుతున్న నన్ను ఓ రోజు ఫ్రెండ్స్ పార్టీకి పిలిచారు. బలవంతంగా మద్యం తాగించారు. ఇంటికెళ్తానంటే వారించి అక్కడే పడుకోబెట్టారు. తెల్లవారి లేచేసరికి కొత్త ప్రాంతంలో ఉన్నాను. నేను ఎక్కడున్నానని వాకబు చేస్తే చైనాలో ఉన్నానని తెలిపారు. నా పక్కన మరికొంత మంది బాలికలు ఉన్నారు. మా చుట్టూ వస్తాదుల లాంటి గార్డులు ఉన్నారు. ఎంత ప్రతిఘటించినా నన్ను ఓ చైనా యువకుడికి అమ్మేశారు' అని 13 ఏళ్ల లాన్ తన గాధను వెల్లడించింది. 'నన్ను రెండు లక్షల రూపాయలకు అమ్మకానికి పెట్టారు. నేను దాన్ని దాన్ని తీవ్రంగా ప్రతిఘటించాను. నన్ను చిత్రహింసలకు గురిచేశారు. అన్నం పెట్టకుండా మాడ్చారు. చివరకు చంపేస్తామని బెదిరించారు. చేసేదేమీలేక అంగీకరించాను. రెండు లక్షల ఐదువేల రూపాయలకు ఓ చైనా యువకుడికి అమ్ముడుపోయాను. ఆ యువకుడిని పెళ్లి చేసుకున్నాను. ఆయన నన్ను బాగానే చూసుకున్నారు. అయినా పుట్టిన దేశాన్ని, తల్లిదండ్రులను చూడకుండా ముక్కూమొహం తెలియని వ్యక్తితో ఎలా కాపురం చేసేది? అడ్జెస్టు కాలేకపోయాను. నా ప్రతిఘటన మళ్లీ మొదలైంది. దాంతో నా అత్త స్మగ్లర్లను పిలిచి నన్ను వారికి అప్పగించింది. తాను వారికి అంతకుముందు చెల్లించిన డబ్బులు వెనక్కి తీసుకుంది. నన్ను తిరిగి వియత్నాం పంపించాల్సిందిగా స్మగ్లర్లను వేడుకున్నాను. వారు వినకుండా మరో చైనా యువకుడికి నన్ను అమ్మేశారు. కథ మళ్లీ మొదటికొచ్చింది' అని 16 ఏళ్ల ఎన్‌గుయన్ వివరించారు. ఇలాంటి కథలు అనేకం ఉన్నాయని వియత్నాంలో ఐక్యరాజ్యసమితి తరఫున మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ఓ నేషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ హా తి వ్యాన్ ఖనాహ్ మీడియాకు తెలిపారు. వియత్నాం ప్రభుత్వంతో కలసి తాము ఎన్ని చర్యలు తీసుకుంటున్నా మానవ అక్రమ రవాణాకు పూర్తిగా తెర పడట్లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ రవాణా ముఠాలను పట్టుకొని అరెస్టు చేయడం, వారి నుంచి బాధితులను విడిపించిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయని ఆమె తెలిపారు. స్మగ్లర్ల చేతిలో మోసపోకుండా వియత్నాం బాలికల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కూడా తాము కృషి చేస్తున్నామని చెప్పారు. -
కొనసాగుతున్న మార్కెట్ల పతనం
చైనా మార్కెట్ల ప్రభావం భారత మార్కెట్ల పై మరోసారి పడింది. చైనాలో షేర్లు ఒక్కరోజే 7 శాతం నష్టపోవడంతో అక్కడ ట్రేడింగ్‌ను గురువారం మొత్తం సస్పెండ్ చేశారు. అనంతరం భారత్‌లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు కూడా నష్టాలతోనే మొదలయ్యాయి. మధ్యహ్నం 12 గంటల ప్రాంతానికి సెన్సెక్స్ 483 పాయింట్లు నష్టపోయి 24,922 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 150 పాయింట్లు నష్టపోయి 7590 వద్ద ట్రేడవుతోంది. చైనా ప్రభావం భారత మార్కెట్ల పైనే కాకుండా ఆసియా మార్కెట్లన్నింటిపై పడింది. జపాన్ మార్కెట్( నిక్కీ) 423 పాయింట్లు, హాంకాంగ్ మార్కెట్ (హాంగ్ సెంగ్) 627, సింగపూర్ మార్కెట్(స్ట్రేయిట్ టైమ్స్)60 పాయింట్ల నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఈ వారంలోనే చైనాలో సెల్ఆఫ్ కారణంగా మార్కెట్లను నిలిపివేయడం ఇది రెండో సారి. మార్కెట్లు ప్రారంభమైన 30 నిమిషాలకే భారీగా పతనం దిశగా కొనసాగడంతో చైనా స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ నిలిపివేశారు. గడచిన 25 ఏళ్లలో అతి తక్కువ సమయం చైనా మార్కెట్లు ట్రేడయింది ఈ రోజే. అయితే చైనా సంక్షోభంతో పాటూ ఆయిల్ మార్కెట్లు 11 ఏళ్ల కనిష్టస్థాయికి పడిపోవడం, యూరోప్ మార్కెట్లు పతనమవడం, గ్లోబల్ సోవర్జిన్ రేటింగ్ ట్రేండ్స్ 2016 ప్రతికూల అంచనాలు కూడా భారత మార్కెట్ల పతనాన్ని ప్రభావితం చేస్తున్నాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.