సాక్షి,న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్ తయారీదారు హానర్ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను బుధవారం చైనా మార్కెట్లో లాంచ్ చేసింది. హానర్ ఎక్స్ 10 పేరుతో దీన్ని తీసుకొచ్చింది. 5జీ , ట్రిపుల్ రియర్ కెమెరా, పాప్ అప్ సెల్పీ కెమెరా, ఆక్టా-కోర్ ప్రాసెసర్ లాంటి ప్రధాన ఫీచర్లను ఇందులో జోడించింది.. హానర్ ఎక్స్ 10 మూడు కలర్ ఆప్షన్లతో పాటు , స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో లభ్యం కానుంది. 256 జీబీ వరకు స్టోరేజ్‌ను ఎక్స్ పాండ్ చేసుకోవచ్చు. చైనా మార్కెట్లో మే 26 నుండి ఫోన్ అమ్మకానికి లభిస్తుండగా, అంతర్జాతీయంగా ఎపుడు అందుబాటులోకి వచ్చేదీ స్పష్టతలేదు.
హానర్ ఎక్స్ 10 ఫీచర్లు
6.63 అంగుళాల డిస్‌ప్లే
హై సిలికాన్ కిరిన్ 820 ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 10
1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్
16 ఎంపీ సెల్పీ పాప్ అప్ కెమెరా
40+8+2 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా
4300 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం
6 జీబీ, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ. 20,200
6 జీబీ, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ. 23,400
8 జీబీ, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్, ధరసుమారు రూ .25,500
Comments
Please login to add a commentAdd a comment