హానర్ 10ఎక్స్ లైట్.. ధర, ఫీచర్లు | Honor 10X Lite is a new mid range smartphone | Sakshi
Sakshi News home page

హానర్ 10ఎక్స్ లైట్.. ధర, ఫీచర్లు

Published Sat, Oct 31 2020 8:18 PM | Last Updated on Sat, Oct 31 2020 8:35 PM

Honor 10X Lite is a new mid range smartphone - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ హానర్   మిడ్ రేంజ్ ల కొత్త స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది.  హానర్ 10ఎక్స్ లైట్‌ పేరుతో దీన్ని ఆవిష్కరించింది. లాంచ్ చేసింది. ఈ ఫోన్ ప్రస్తుతానికి యూరప్, రష్య, సౌదీ అరేబియాలో లాంచ్ అయింది. ఇండియాలో ఎపుడు లాంచ్ చేసేది అధికారిక ప్రకటన లేదు. కానీ త్వరలో భారత మార్కెట్‌లో  కూడా విడుదల కానుందని అంచనా.  భారత కరెన్సీలో  దీని ధర సుమారు రూ.15,900 ఉండనుంది. ఈ ఫోన్ మిడ్ నైట్ బ్లాక్, ఐస్‌ల్యాండిక్ ఫ్రాస్ట్, ఎమరాల్డ్ గ్రీన్ రంగుల్లో లభ్యం. ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించారు.

హానర్ 10ఎక్స్ లైట్‌ ఫీచర్లు
6.67 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్ ప్లే
ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టం
కిరిన్ 710 ప్రాసెసర్, 
48+8+2+2 క్వాడ్  రియర్ కెమెరా సెటప్,
8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా,
4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్
256 జీబీదాకా విస్తరించుకునే అవకాశం
5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement