చైనా స్మార్ట్ ఫోన్ బ్రాండ్, హువావే ఉపసంస్థ హానర్ మరో కొత్త ఫోన్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. హానర్ 20 సిరీస్ లో భాగంగా హానర్ 20 లైట్(యూత్ ఎడిషన్)ను హానర్ సంస్థ బుధవారం చైనా మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ మొబైల్ మరి కొన్ని నెలల్లోనే భారత్ సహా ఇతర అంతర్జాతీయ మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. మొత్తం నాలుగు వేరియంట్లు ఈ స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. బ్లాక్, గ్రీన్, బ్లూ-పింక్ గ్రేడియంట్ రంగుల్లో ఇది లభించనుంది. చైనాలో దీనికి సంబంధించిన ప్రీ-ఆర్డర్లు ఇప్పటికే ప్రారంభం కాగా, అమ్మకాలు అక్టోబర్ 25 నుంచి ప్రారంభం. వాటర్ డ్రాప్ నాచ్ ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్, రియర్ ట్రిపుల్ కెమెరా. సూపర్ నైట్ సీన్ మోడ్, ఏఐ సీన్ రికగ్నిషన్, పొర్ ట్రెయిట్ మోడ్ లాంటి ప్రధాన ఆకర్షణలో ఈ స్మార్ట్‌ఫోన్‌లో పొందుపర్చారు.
హానర్ 20 లైట్ ఫీచర్లు
6.3 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే
2400 × 1080 రిజల్యూషన్
కిరిన్ 710F ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 9 పై ఈఎంయూఐ 9.1.1
16 ఎంపీ సెల్పీకెమెరా
48 +8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ + 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్
4,000 ఎంఏహెచ్ బ్యాటరీ
ధరలు
4 జీబీ ర్యామ్/ 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,399 యువాన్లు (సుమారు రూ.14 వేలు)
6 జీబీ ర్యామ్/64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,499 యువాన్లు (సుమారు రూ.15 వేలు)
6 జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,699 యువాన్లు (సుమారు రూ.17 వేలు)
టాప్ ఎండ్ వేరియంట్ 8 జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్ ధర 1,899 యువాన్లు (సుమారు రూ.19 వేలు)
Comments
Please login to add a commentAdd a comment