అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ భారత్‌లో పెట్టుబడులు పెంచేందుకు ఆసక్తి చూపుతోంది. అక్టోబర్‌లో చైనా మార్కెట్‌లో దాదాపు ఐదు శాతం ఇన్వెస్ట్‌మెంట్ పెంచినట్లు కంపెనీ తెలిపింది. అదే సమయంలో భారత్‌లో 20 శాతంగా ఉన్న పెట్టుబడులను 10 శాతానికి తగ్గించింది. కానీ రానున్న రోజుల్లో భారత్‌లో తిరిగి పెట్టుబడులను పెంచబోతున్నట్లు సీఎల్‌ఎస్‌ఏ పేర్కొంది.
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంతో అమెరికా-చైనా వాణిజ్య సంబంధాలు పరిమితంగానే ఉంటాయని సీఎస్‌ఎల్‌ఏ అంచనా వేస్తుంది. దాంతో చైనాకు ఇబ్బందులు తప్పవనే వాదనలున్నాయి. కాబట్టి చైనాలో పెట్టుబడులు పెట్టడానికి అంతగా ఆసక్తి చూపించడంలేదు. చైనా ఆర్థిక వృద్ధిలో ఎగుమతులే ప్రధాన పాత్ర పోషిస్తాయి. అలాంటిది ట్రంప్ రాకతో వీటిపై తీవ్ర ప్రభావం పడుతుందని సీఎల్‌ఎస్‌ఏ విశ్లేషిస్తుంది. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రతరం కావొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దాంతో అక్కడి కంటే మెరుగైన ఆర్థిక వాతావరణ పరిస్థితులున్న భారత్‌వైపు సీఎల్‌ఎస్‌ఏ మొగ్గు చూపుతుంది.
ఇదీ చదవండి: వ్యాక్సిన్ వ్యతిరేకితో భారత్‌కు నష్టం?
ఇటీవలి కాలంలో విదేశీ మదుపర్లు భారత స్టాక్ మార్కెట్ల నుంచి రోజు సరాసరి రూ.3000 కోట్లు ఉపసంహరించుకుంటున్నారు. గత నెల నుంచి దాదాపు రూ.1.14 లక్షల కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో భారత మార్కెట్లు కొంత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఇది సీఎల్‌ఎస్‌ఏ వంటి పెట్టుబడిదారులు భారత మార్కెట్‌పై ఆసక్తి చూపేందుకు అవకాశం కల్పిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment