china market
-
ట్రంప్ ఎన్నికతో భారత్‌వైపు చూపు
అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ సీఎల్ఎస్ఏ భారత్‌లో పెట్టుబడులు పెంచేందుకు ఆసక్తి చూపుతోంది. అక్టోబర్‌లో చైనా మార్కెట్లో దాదాపు ఐదు శాతం ఇన్వెస్ట్మెంట్ పెంచినట్లు కంపెనీ తెలిపింది. అదే సమయంలో భారత్‌లో 20 శాతంగా ఉన్న పెట్టుబడులను 10 శాతానికి తగ్గించింది. కానీ రానున్న రోజుల్లో భారత్‌లో తిరిగి పెట్టుబడులను పెంచబోతున్నట్లు సీఎల్ఎస్ఏ పేర్కొంది.అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంతో అమెరికా-చైనా వాణిజ్య సంబంధాలు పరిమితంగానే ఉంటాయని సీఎస్ఎల్ఏ అంచనా వేస్తుంది. దాంతో చైనాకు ఇబ్బందులు తప్పవనే వాదనలున్నాయి. కాబట్టి చైనాలో పెట్టుబడులు పెట్టడానికి అంతగా ఆసక్తి చూపించడంలేదు. చైనా ఆర్థిక వృద్ధిలో ఎగుమతులే ప్రధాన పాత్ర పోషిస్తాయి. అలాంటిది ట్రంప్ రాకతో వీటిపై తీవ్ర ప్రభావం పడుతుందని సీఎల్ఎస్ఏ విశ్లేషిస్తుంది. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రతరం కావొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దాంతో అక్కడి కంటే మెరుగైన ఆర్థిక వాతావరణ పరిస్థితులున్న భారత్‌వైపు సీఎల్ఎస్ఏ మొగ్గు చూపుతుంది.ఇదీ చదవండి: వ్యాక్సిన్ వ్యతిరేకితో భారత్‌కు నష్టం?ఇటీవలి కాలంలో విదేశీ మదుపర్లు భారత స్టాక్ మార్కెట్ల నుంచి రోజు సరాసరి రూ.3000 కోట్లు ఉపసంహరించుకుంటున్నారు. గత నెల నుంచి దాదాపు రూ.1.14 లక్షల కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో భారత మార్కెట్లు కొంత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఇది సీఎల్ఎస్ఏ వంటి పెట్టుబడిదారులు భారత మార్కెట్‌పై ఆసక్తి చూపేందుకు అవకాశం కల్పిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
స్మార్ట్‌ఫోన్ కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ కారు - సింగిల్ ఛార్జ్‌తో 800కిమీ రేంజ్
చైనాలోని బీజింగ్‌లో గురువారం జరిగిన 'షావోమి' (Xiaomi) ఈవీ టెక్నాలజీ లాంచ్ ఈవెంట్ వేదికగా.. కంపెనీ తన సరికొత్త ఎలక్ట్రిక్ కారుని ఆవిష్కరించింది. చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఆవిష్కరించిన ఈ లేటెస్ట్ ఎలక్ట్రిక్ కారు గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. షావోమి కంపెనీ మార్కెట్లో విడుదల చేయనున్న ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు 'SU7' (స్పీడ్ అల్ట్రా7). ఇది ప్రపంచ మార్కెట్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న అగ్ర సంస్థల ఎలక్ట్రిక్ కార్లకు ప్రధాన ప్రత్యర్థిగా ఉండనున్నట్లు సమాచారం. రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వాహన విభాగంలో తప్పకుండా గొప్ప గుర్తింపు పొందటానికి కంపెనీ కృషి చేస్తున్నట్లు కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. SU7 అనేది నాలుగు డోర్స్ కలిగిన ఎలక్ట్రిక్ కారు. ఇది అద్భుతమైన డిజైన్ కలిగి, ఆధునిక ఫీచర్స్ పొందనుంది. పరిమాణం పరంగా ఉత్తమంగా ఉండే ఈ కారు 73.6 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి, ఒక సింగిల్ చార్జితో గరిష్టంగా 800కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది. 2025నాటికి లాంచ్ షావోమి ఎలక్ట్రిక్ కారు 2025 నాటికి మార్కెట్లో అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశం ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఈ కార్లు మొత్తం చైనాలోని బీజింగ్ తయారీ కర్మాగారంలోనే తయారవుతాయని కంపెనీ వెల్లడించింది. దీన్ని బట్టి చూస్తే ఈ కార్లు చైనా నుంచి ఇతర దేశాలకు ఎగుమతి అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదీ చదవండి: రతన్ టాటా గురించి ఐదు ఆసక్తికర విషయాలు అంచనా ధర SU7 ధరలు 200000 యువాన్ల నుంచి 300000 యువాన్ల వరకు ఉండే అవకాశం ఉంది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ రూ. 25 లక్షల నుంచి రూ. 35 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. ఈ కారు భారతీయ మార్కెట్లో విడుదలవుతుందా.. లేదా అనేదానిపైన అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. #XiaomiSU7 makes a significant #Stride as Xiaomi expands from the smartphone industry to the automotive sector, completing the Human x Car x Home smart ecosystem. #XiaomiSU7 will forever journey alongside those steering toward their dreams.#XiaomiEVTechnologyLaunch pic.twitter.com/ZLW5m7PTQN — Xiaomi (@Xiaomi) December 28, 2023 -
క్లాసీ, స్టయిలిష్ లుక్‌లో ‘జీటీ150 ఫేజర్ బైక్’: వివరాలు ఇలా..
సాక్షి,ముంబై: జపాన్‌కు చెందిన ద్విచక్ర వాహన తయారీదారు బ్రాండ్ యమహా కొత్త బైక్‌ను విడుదల చేసింది. యమహా ఆర్ ఎక్స్ 149 మోడల్ కు లేటెస్ట్ వెర్షన్‌గా ‘జీటీ 150 ఫేజర్’ పేరుతో చైనా మార్కెట్లోకి విడుదల చేసింది. క్లాసిక్ లుక్‌లో స్టయిలిష్‌గా యూత్‌ను ఆకట్టుకునేలా లాంచ్ చేసింది. చైనాలో ఈ బైక్ ప్రారంభ ధరను 13,390 యువాన్లు అంటే ఇది భారతీయ రూపాయలలో దాదాపు రూ. 1.60 లక్షలు. త్వరలోనే ఇండియా మార్కెట్లోకి లాంచ్ చేయనున్నట్టు సమాచారం. యమహా జీటి 150 ఫేజర్ ఇంజీన్ ఇందులోని 150సీసీ ఇంజన్ 7,500 ఆర్ పీఎం వద్ద 12.3 హార్స్ పవర్, 12.4 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. వైట్, గ్రే, డార్క్ గ్రే, బ్లూ రంగుల్లో లభిస్తుంది . ఇక ఫీచర్ల విషయానికి వస్తే అల్లాయ్ వీల్స్, ఎగ్జాస్ట్ ఇంజన్, సిగ్నేచర్ రెట్రో బిట్స్‌లో రౌండ్ హెడ్‌ల్యాంప్, రియర్ వ్యూ మిర్రర్స్, ఫోర్క్ గైటర్లు, ఫెండర్లతో కూడిన ఫ్రంట్, రియర్ సస్పెన్షన్ తదితర ఫీచర్లు ఉన్నాయి. భారత మార్కెట్లో బజాజ్ పల్సర్ పి150కి గట్టి పోటీ ఇవ్వనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
అద్భుత ఫీచర్లు, ఐఫోన్ లాంటి డిజైన్: షావోమీ స్మార్ట్ఫ్లోన్లు వచ్చేశాయ్!
సాక్షి ముంబై: చైనా స్మార్ట్‌ఫోన దిగ్గజం షావోమి కొత్త స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. షావోమి 12 సిరీస్‌కు కొనసాగింపుగా 13 సిరీస్ మొబైల్స్‌ను చైనా మార్కెట్లో ఆవిష్కరించింది. షావోమి 13, 13 ప్రో రెండు వేరియంట్లను తీసుకొచ్చింది. ఐఫోన్ మాదిరి డిజైన్‌లో ఆండ్రాయిడ్ 13 MIUI 14తో వీటిని తీసుకొచ్చింది. అలాగేవీటిల్లో లైకా బ్రాండెడ్ ట్రిపుల్ రియర్ కెమెరాలను అమర్చింది. ఇండియా సహా ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో ఎపుడు లాంచ్ అవుతుందనేది స్పష్టత లేదు. (ఎలక్ట్రిక్ స్కూటర్ లవర్స్‌కు అదిరే ఆఫర్: పది ఎస్1 ప్రో స్కూటర్లు ఫ్రీ) షావోమీ 13 ప్రో స్పెసిఫికేషన్స్ 6.73అంగుళాల AMOLED డిస్ప్లే 3200x1440 రిజల్యూషన్ 120Hz రిఫ్రెష్ రేట్ 50 ఎంపీ(వైడ్, అల్ట్రా, వైడ్ టెలిఫోటో)) ట్రిపుల్ రియర్ కెమెరా 16 ఎంపీ ఫ్రెంట్ కెమెరా 4820ఎంఏహెచ్ బ్యాటరీ (ఐటీ సర్క్యులర్ వచ్చిందోచ్.. ఈ విషయాలపై క్లారిటీ ఉందా మీకు?) షావోమీ 13 ప్రో ధర: ఈ ప్రీమియం స్మార్ట్ఫోన్లు రెండూ వైట్, బ్లాక్, గ్రీన్, లైట్ బ్లూ రంగుల్లో అందుబాటులో ఉంటాయి. బేస్ వెర్షన్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ రూ. 60 వేల నుండి ప్రారంభం. 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ సుమారు రూ. 74,500 షావోమి 13 ఫీచర్లు 6.36 అంగుళాల OLED డిస్ప్లే 1080 x 2400పిక్సెల్స్ రిజల్యూషన్ 4500ఎంఏహెచ్ షావోమి13 ధరలు 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 574 డాలర్లు ( సుమారు రూ. 47,344) 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ 617 డాలర్లు ( సుమారు రూ. 50891) 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ 660 డాలర్లు (రూ. 54438) 12జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ 718 డాలర్లు (రూ. 59222) -
లెనోవో K12 స్మార్ట్ ఫోన్- త్వరలో విడుదల!
ముంబై: చైనీస్ టెక్ దిగ్గజం లెనోవో.. కే12 బ్రాండుతో దేశీయంగా స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో వచ్చిన మోటో ఈ7 మోడల్ మొబైల్‌ను ఆధునీకరించి కే12గా ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. గత నెలలో కే12ను యూరోపియన్ మార్కెట్లలో లెనోవో విడుదల చేసింది. చైనాలో ఇప్పటికే కే12 స్మార్ట్ ఫోన్‌ను ప్రవేశపెట్టింది. అయితే చైనీస్ మార్కెట్లో విడుదలైన ఫోన్ గతంలో విడుదలైన మోటో ఈ7 ప్లస్‌కు ఆధునిక వెర్షన్‌గా టెక్ నిపుణులు పేర్కొంటున్నారు. కాగా.. గత మోటో ఈ7 మోడల్‌ను ఆధునీకరించి విడుదల చేయనున్న కే12 ఫోన్ దేశీ మార్కెట్లలో 120 యూరోలు(సుమారు రూ. 10,550)గా ఉండవచ్చని అంచనా. ఫోన్‌కు సంబంధించిన ఇతర టెక్నికల్ వివరాల అంచనాలు చూద్దాం.. (గత నెల అమ్మకాలలో టాప్-3 కార్లు) 6.5 అంగుళాల తెర లెనోవో కే12 స్మార్ట్ ఫోన్ 6.5 అంగుళాల హెచ్‌డీప్లస్ టచ్ స్ర్నీన్‌ను కలిగి ఉంటుంది. వెనుక 48 ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు.. 2 ఎంపీ మాక్రో స్నాపర్, 5 ఎంపీ షూటర్‌తో వెలువడనుంది. ముందుభాగంలో సెల్ఫీల కోసం 5 ఎంపీ షూటర్(కెమెరా)ను ఏర్పాటు చేశారు. మీడియాటెక్ హీలియోస్ జీ25 చిప్సెట్తో పనిచేయనుంది. 2జీబీ ర్యామ్, 32 జీబీ అంతర్గత మెమొరీతోపాటు.. 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 10 వెర్షన్లో లభించవచ్చని అంచనా. (ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 బుకింగ్ షురూ) -
మార్కెట్లోంచి చైనాను తొలగించాలంటే...
భారత్–చైనా సరిహద్దులో 20 మంది ఇండియా సైనికుల్ని చైనా క్రూరంగా చంపేసిన ఘటనతో, భారతీయుల్లో జాతీయవాద ఉద్వేగాన్ని రెచ్చగొట్టినట్ట యింది. సరైన కారణంతో పెల్లుబికిన ఈ సహేతుకమైన ఆగ్రహజ్వాలలు చైనా వస్తువుల మీద వ్యతిరేకతకు దారి తీశాయి. అయితే, ఈ ఉద్వేగాగ్నికి ప్రయోజనం చేకూరాలంటే, చైనీయుల ఆయువు పట్టుపై దెబ్బ కొట్టాలి. దీనికి ఆలోచనాపూరితమైన వ్యూహం కావాలి. అప్పుడే ఆర్థికంగా చైనాను దెబ్బ తీయగలం. దీనికిగానూ మన వస్తూత్పత్తి శక్తి సామర్థ్యాలను గణనీయంగా పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇది, గత రెండు దశాబ్దాల్లో మన దేశీయ మార్కెట్లో చైనా వస్తూత్పత్తి ప్రాభవానికి భారతీయ పరిశ్రమ ఎంతగా తలొగ్గిందనే కీలకమైన ప్రశ్నను ముందుకు తెస్తుంది. భారత స్వాతంత్య్ర పోరాటంలో బ్రిటిష్ ఆర్థిక సామర్థ్యాన్ని బలహీనపరిచినట్టుగా, ప్రస్తుతం నొక్కి చెబుతున్న ఆత్మనిర్భ రత ఇప్పుడు మరింత అత్యావశ్యం. లేదంటే టీవీ కెమెరాల ముందు చైనా తయారీ టీవీలు, ఫోన్లను ధ్వంసం చేయడం ప్రజల కోపాగ్నిని చూపే ఒక మనోరంజకమైన దృశ్యం కాగలదంతే. గత రెండు దశాబ్దాల్లో భారతీయ మార్కెట్లో అత్యధిక భాగాన్ని వశం చేసుకున్న చైనా, దాన్ని విçస్తృతమైన వస్తుశ్రేణి వరదలో ముంచెత్తింది. ఏ వినియోగదారుడికైనా ధర అనేది కీలకాంశం. 2000 సంవత్సర ప్రాంతంలో చైనా తన డ్రై పెన్సిల్ బ్యాటరీలను ఒక్కోదాన్ని 50 పైసల చొప్పున అమ్మకానికి దింపినప్పుడే ధరలో ఉన్న బలం ఏమిటో భారతీయ పరి శ్రమకు తెలిసొచ్చింది. అప్పుడు ఇండియన్ బ్రాండ్లు ఒక్కో దాన్ని రూ.8 నుంచి 10 వరకు అమ్ముతున్నాయి. చైనా వస్తువుల నాణ్యత నాసిరకందని భారతీయ పరిశ్రమ ఎంత ప్రచారం చేసినా అది వినియోగదారులకు ఏమాత్రం పట్టలేదు. పైగా భారతీయ పరిశ్రమ ఇన్నాళ్లుగా తమను అధిక ధరతో మోసం చేసిందన్న భావనకు అత్యధికులు లోనవడం భారత దేశీయ మార్కెట్‌ను మరింత దెబ్బతీసింది. దాంతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మార్కెట్‌ను చైనాకు కోల్పోవడంతో అవి నిలదొక్కుకోవడం కష్టమైపోయింది. అయితే కొద్దిపాటి పరిశ్రమలు మాత్రం దేశీయంగానే కాదు, అంతర్జాతీయ విపణి లోనూ చైనాను ఎదుర్కొని నిలబడ్డాయి. అగ్రశ్రేణి మోటార్‌సైకిల్ తయారీదారైన బజాజ్ కంపెనీ దీనికి ఒక ఉదాహరణ. వీళ్లు మేధోకార్మికులకు అత్యధిక వేత నాలు చెల్లించారు; పరిశోధన–అభివృద్ధి(ఆర్ అండ్ డీ), డిజైన్, మార్కెటింగ్ కోసం అధికంగా ఖర్చు చేశారు. చైనా మీద పైచేయి సాధించారు. కానీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఉమ్మడిగా ఘోరంగా విఫలమై, సప్లై చైన్ల, టెక్నాలజీల దిగుమ తుల మీద ఆధారపడిన దేశీయ పరిశ్రమ చైనాను ఎదుర్కో గలదా? కనీసం దేశీయ మార్కెట్లోనైనా? బహువిధమైన వాణిజ్య ఒప్పందాల యుగంలో చైనా ఉత్పత్తులను నిషేధిం చడం ప్రభుత్వానికి సాధ్యం కాకపోవచ్చు. వివిధ రంగాల్లో చైనా మీద మనం ఎలా ఆధారపడివున్నామో చూడండి: స్మార్ట్ ఫోన్ మార్కెట్లో చైనా 72 శాతం వాటా కలిగివుంది, టెలికం పరి కరాల్లో 25 శాతం, స్మార్ట్ టీవీల్లో 45 శాతం, ఇంటర్నెట్ యాప్స్‌లో 66 శాతం, సౌర విద్యుత్‌లో 90 శాతం, స్టీలులో 18–20 శాతం, ఔషధరంగంలో 60 శాతం మార్కెట్ చైనా సొంతం. ఈ విభాగాల్లో ఆదరాబాదరగా చైనా స్థానంలోకి మరోదాన్ని భర్తీచేయడం చాలా కష్టం. ఇలాంటి కీలక సమయంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు వాటి పూర్తిస్థాయి సామర్థ్యంతో పనిచేయలేకపోవడం బాధాకరం. అప్పటికే అంతంతమాత్రంగా ఉన్నవి 2016 నుంచీ వరుసగా తగులుతున్న దెబ్బలతో కోలుకోవడానికి పోరాడుతూవున్నాయి. ఇంతలో తలెత్తిన కోవిడ్–19 ఉపద్ర వమూ, తదనంతరం ప్రభుత్వం విధించిన కఠిన లాక్‌డౌన్‌తో లేవలేని ఆ తుదిదెబ్బ కూడా పడింది. ఈ తరహా పరిశ్రమలు మన దగ్గర 6.34 కోట్ల యూనిట్లు ఉండి, జీడీపీలో 30 శాతం మేరకు తోడ్పడుతున్నాయి. అలాగే ఉత్పత్తిలో 33 శాతం వాటా కలిగి వున్నాయి. కాబట్టి వీటిని బలోపేతం చేయడంలో సాయ పడటం ద్వారా దేశీయ మార్కెట్లో చైనాను ఎదుర్కొనేటట్టు చేయాలి. దేశ ఎగుమతుల్లో 45 శాతం వాటా కలిగివున్న ఈ రంగ ప్రాధాన్యత దేశ ఆర్థికవ్యవస్థ దృష్ట్యా విస్మరించలేనిది. మోదీ ప్రభుత్వం ఈ రంగానికి కూడా ప్యాకేజీ ప్రకటించిన మాట వాస్తవమే గానీ, క్షేత్రస్థాయిలో ఈ కర్మాగారాలు నడిపే వారి అనుభవం పూర్తి నిరాశగా ఉంది. ఎంత సదుద్దేశంతో ఎన్ని ప్రభుత్వ పథకాలు ప్రారంభించినా, వాటి అమలుతీరు అంత కంటే కీలకం అవుతుంది. అధికారంలో ఎవరు ఉన్నారన్న దానితో నిమిత్తం లేకుండా, ప్రభుత్వ సేవలు లబ్ధిదారులకు అందడంలో నిరాశ కొనసాగుతూనేవుంది. ఇంకా ముఖ్యంగా, ఈ లోపభూయిష్టమైన బట్వాడా విధానం ప్రపంచానికే వస్తూ త్పత్తి కేంద్రం కావాలన్న భారత ప్రభుత్వ స్వప్నాలను పట్టాలు తప్పించవచ్చు. కానీ ప్రపంచంలోని అన్ని చోట్లకూ నౌకాయాన వసతి కలిగివున్న ఇండియాకు ద్వీపకల్పం పొడవునా ప్రపంచ వస్తూ త్పత్తి కేంద్రం కావడానికి దోహదపడే సానుకూల అంశాలెన్నో ఉన్నాయి. లక్ష్మణ వెంకట్ కూచి వ్యాసకర్త, సీనియర్ పాత్రికేయుడు -
రెడ్మీ 10 ఎక్స్ వచ్చేసింది..
న్యూఢిల్లీ, బీజింగ్: చైనా మొబైల్ తయారీ దారు షావోమికి చెందిన రెడ్మీ మరో మూడు స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. రెడ్మీ 10ఎక్స్ 5జీ, రెడ్మీ 10ఎక్స్ 5జీ ప్రో, రెడ్మీ 10ఎక్స్ 4జీ స్మార్ట్ఫోన్లను చైనాలో ఆవిష్కరించింది. మూడు స్మార్ట్ఫోన్ల ఫీచర్లు దాదాపు ఒకేలా ఉన్నాయి. ఈ ఫోన్లు గ్లోబల్ మార్కెట్లు, ఇండియాలో ఎపుడు అందుబాటులోకి వచ్చేదీ స్పష్టత లేదు ఈ ఫోన్లలో 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, మీడియాటెక్ డిమెన్సిటీ 820 ప్రాసెసర్, 4520 ఎంఏహెచ్ బ్యాటరీ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. (మరో సంచలనం దిశగా షావోమి) (రెడ్మి ఎక్స్ సిరీస్ స్మార్ట్‌టీవీలు త్వరలో) రెడ్మీ 10ఎక్స్ 5జీ ఫీచర్లు 6.57 అంగుళాల పుల్ హెచ్డీ+డిస్ప్లే ఎంఐయూఐ 11 మీడియాటెక్ డిమెన్సిటీ 820 6జీబీ, 8జీబీ ర్యామ్ 64జీబీ, 128జీబీ, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 48+8+2+2 ఎంపీ క్వాడ్ రియర్ కెమెరా 16 సెల్పీ కెమెరా 4520 ఎంఏహెచ్ బ్యాటరీ బ్లూ, పింక్, గోల్డ్, వైట్ కలర్లలో లభ్యం చదవండి : ఆకర్షణీయ ధరల్లో రియల్మీ స్మార్ట్ టీవీలు ధరలు సుమారుగా 6జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.17000 6జీబీ+128జీబీవేరియంట్ ధర రూ.19,100 8జీబీ+128జీబీవేరియంట్ ధర రూ.22,300 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.25,500 రెడ్మీ 10ఎక్స్ ప్రో 5జీ ఇందులో 48+8+5+5 క్వాడ్ రియర్ కెమెరా 20 ఎంపీ సెల్పీ కెమెరా ధరలు సుమారుగా 8జీబీ+128జీబీ- రూ.24,300 8జీబీ+256జీబీ- రూ.27,500 ఇండియాలో రిలీజ్ అయిన రెడ్మీ నోట్ 9 తరహాలోనే రెడ్మీ 10ఎక్స్ 4జీ తీసుకొచ్చింది. రెడ్మీ 10ఎక్స్ 4జీ ఫీచర్లు 6.53 అంగుళాల పుల్ హెచ్డీ+డిస్ప్లే మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్ 4/6జీబీ ర్యామ్ 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 48+8+2+2 ఎంపీ రియర్ కెమెరా 13 ఎంపీ సెల్ఫీ కెమెరా 5020 ఎంఏహెచ్ బ్యాటరీ ధరలు సుమారుగా 4జీబీ+128జీబీ ధర రూ.10,500 6జీబీ+128జీబీ ధర రూ.12,700 -
చైనా ఆధిపత్యానికి ‘మందు’
న్యూఢిల్లీ: ప్రపంచంలో రెండో అతిపెద్ద ఫార్మా మార్కెట్ అయిన చైనాను మన కంపెనీలు ఇప్పటిదాకా పెద్దగా పట్టించుకోలేదనే చెప్పాలి. కాకపోతే స్వీయ రక్షణలతో అమెరికా మార్కెట్లో అమ్మకాలు తగ్గటం... కొత్త మార్కెట్లు, కొత్త అవకాశాల కోసం అన్వేషించాల్సి రావటంతో వీటి దృష్టి డ్రాగన్ దేశంపై పడింది. ఫలితం... 100 బిలియన్ డాలర్ల విలువైన చైనా మార్కెట్లో వాటా పెంచుకునేందుకు, బలోపేతం అయ్యేందుకు ఇవి ప్రయత్నాల్ని తీవ్రం చేశాయి. ఇప్పటికే సిప్లా, లుపిన్ సంస్థలు చైనా మార్కెట్లో నూతన అవకాశాల అన్వేషణలో ఉండగా, ఈ జాబితాలో డాక్టర్ రెడ్డీస్ కూడా చేరిపోయింది. ప్రపంచంలో అతిపెద్ద ఫార్మా మార్కెట్ అమెరికాలో భారత కంపెనీల హవా కొనసాగుతుండగా... రెండో అతిపెద్ద చైనా మార్కెట్లో మాత్రం స్థానిక కంపెనీలు, బహుళజాతి కంపెనీల ఆధిపత్యమే కొనసాగుతోంది. 100 బిలియన్ డాలర్ల విలువైన చైనా మార్కెట్లో (సుమారు రూ.6.4 లక్షల కోట్లు) భారత ఫార్మా కంపెనీల ఎగుమతుల వాటా 160 మిలియన్ డాలర్లు (రూ.1,024 కోట్లు) మాత్రమే. ఇటీవల నియంత్రణల పరంగా చేసిన మార్పులతో ఉత్పత్తులకు అనుమతులు వేగవంతం కావడం మొదలైంది. దీంతో చైనా మార్కెట్ భారత ఔషధ కంపెనీలను భారీ అవకాశాలతో ఊరిస్తోంది. విదేశీ ట్రయల్ డేటాను (ఔషధ పరీక్షల సమాచారం) గుర్తించడంతోపాటు, ఔషధ అనుమతులను వేగవంతం చేసేందుకు మరింత మందిని నియమించుకోవాలని చైనా ఆహార, ఔషధ నియంత్రణ మండలి ఇటీవలే నిర్ణయించింది. ఇది భారత ఔషధ కంపెనీలకు మేలు చేసేదేనని నిపుణులు చెబుతున్నారు. భారత కంపెనీలు ఇప్పటి వరకు ప్రధానంగా అమెరికా, యూరోప్ మార్కెట్లపైనే ఎక్కువగా ఆధారపడ్డాయి. అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ మండలి ఆమోదించిన ఔషధాలను చైనాలోనూ వేగంగా అనుమతిలిచ్చేందుకు వీలుగా కొత్త నియంత్రణలు రావడం భారత కంపెనీలు డ్రాగన్ మార్కెట్లో పాతుకుపోవడానికి వీలు కల్పిస్తాయని ఎర్నెస్ట్ అండ్ యంగ్‌కు చెందిన శ్రీరామ్ శ్రీనివాసన్ పేర్కొన్నారు. భారత కంపెనీల ప్రయత్నాలు కొత్త అవకాశాల నేపథ్యంలో చైనా మార్కెట్లో యాంటీ కేన్సర్ ఔషధాలను ప్రవేశపెట్టేందుకు డాక్టర్ రెడ్డీస్ ప్రయత్నిస్తోంది. సిప్లా, వోకార్డ్ యాంటీ బయోటిక్స్, రెస్పిరేటరీ ఔషధాలను విడుదల చేయాలనుకుంటున్నాయి. ‘‘అంకాలజీ ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన విభాగం. చైనాలో మా స్థానం మరింత బలోపేతం అయ్యేందుకు వీలుగా భాగస్వామ్య ఒప్పందాల కోసం చూస్తున్నాం’’ అని డాక్టర్ రెడ్డీస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఎంవీ రమణ తెలిపారు. వాస్తవానికి డాక్టర్ రెడ్డీస్ 20 ఏళ్ల నుంచి చైనా మార్కెట్లో ఉంది. 2 కోట్ల డాలర్ల (రూ.130 కోట్లు) విలువైన ఔషధాలను మార్కెట్ చేస్తోంది. ఇందులో యాక్టివ్ ఫార్మాస్యూటిక్ ఇంగ్రేడియెంట్స్ అమ్మకాలు కలిపిలేవు. రోటమ్ గ్రూపుతో కలసి జాయింట్ వెంచర్ కింద ఉత్పత్తులను మార్కెట్ చేస్తోంది. చైనాలోని 5,000 ఆస్పత్రులను కవర్ చేసే మార్కెటింగ్ బృందం కూడా ఉంది. ఇతర భారతీయ కంపెనీల పాత్ర డాక్టర్ రెడ్డీస్‌తో పోలిస్తే నామమాత్రమే. ర్యాన్‌బ్యాక్సీ (2014లో సన్ ఫార్మా సొంతమైంది) చైనా మార్కెట్లోకి ప్రవేశించినప్పటికీ 2009లో జాయింట్ వెంచర్ నుంచి తప్పుకుని, తన వాటాను భాగస్వామ్య కంపెనీకే అమ్మేసింది. కఠిన నియంత్రణల వల్ల చైనా మార్కెట్లో ఔషధాల విడుదల ప్రణాళికలను టోరెంట్ అటకెక్కించేసింది. 2013లో ఓ చైనా కంపెనీతో చర్చలు ప్రారంభించగా, తర్వాత అర్ధంతంగా ఆగిపోయాయి. ఇక సిప్లా సైతం చైనాలో రెండు పెట్టుబడుల నుంచి పక్కకు తప్పుకుంది. అయినప్పటికీ ఈ సంస్థ కోర్ థెరపీ ఔషధాల విడుదలతో మరోసారి పోటీపడే ప్రయత్నాలు చేస్తోంది. కొనుగోలు లేదా భాగస్వామ్యం ద్వారా రెస్పిరేటరీ ఔషధాలను విడుదల చేయాలనుకుంటోంది. వోకార్డ్ యాంటీ బయోటిక్ ఔషధాలను ఎగుమతి చేసే ఆలోచనతో ఉంది. ఇందుకోసం స్థానిక కంపెనీలతో క్లినికల్ ట్రయల్స్ కోసం చర్చలు జరుపుతోంది. ఐదు యాంటీ బయోటిక్ ఔషధాలను అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికీ సవాలే? చైనాలో నిర్వహణ వాతావరణం ఇప్పటికీ సవాళ్లతో కూడినదేనని అంతర్జాతీయ వైద్య సేవల సంస్థ ఐక్యూవీఐఏ పేర్కొంది. అయితే, బలమైన డిమాండ్, ఇన్నోవేటివ్ ఉత్పత్తులకు సత్వర అనుమతులు అన్నవి ఔషధ కంపెనీలను ఆకర్షిస్తున్నాయని తెలిపింది. సంస్కృతికి సంబంధించిన సవాళ్లు, మార్కెట్ ఏకీకృతంగా లేకపోవడం అవరోధమన్న అభిప్రాయాలున్నాయి. యూరోప్, జపాన్ మార్కెట్లో అధిక అవకాశాలు ఉండటం, చైనా మార్కెట్లో ఇబ్బందుల వల్ల ఆదేశ మార్కెట్‌పై భారత కంపెనీలు ఇప్పటి వరకు పెద్దగా దృష్టి పెట్టలేదని భారత ఫార్మాస్యూటికల్ అలియన్స్ జనరల్ సెక్రటరీ డీజీషా చెప్పారు. దీనిపై వోకార్డ్ ఛైర్మన్ హబిల్ ఖొరాకివాలా స్పందిస్తూ... ‘‘చైనాలో అవకాశాలు వెదుకుతున్నాం. ఎందుకంటే యాంటీ బయోటిక్స్‌కు ఇది భారీ మార్కెట్’’ అని చెప్పారు. విలువ పరంగా అమెరికాతో పోలిస్తే చైనా యాంటీ బయోటిక్స్ ఔషధ మార్కెట్ విలువ రెట్టింపు స్థాయిలో ఉంది. -
చైనా వస్తువులను బహిష్కరిద్దాం
భీమవరం టౌన్: భారత్‌పై దాడులకు పాల్పడుతున్న పాకిస్థాన్‌కు మద్ధతు ఇస్తున్న చైనా దేశ వస్తువులను భారతీయులు బహిష్కరించాలని ధర్మరక్షావేదిక జిల్లా అధ్యక్షుడు తోరం సూర్యనారాయణ పిలుపునిచ్చారు. వేదిక ఆధ్వర్యంలో ఆదివారం స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సూర్యనారాయణ మాట్లాడుతూ చైనా ఆహార, వస్తు ఉత్పత్తులను పూర్తిగా బహిష్కరించాలన్నారు. స్వదేశి వస్తువులను వినియోగించి దేశాభిమానాన్ని చాటుకోవాలన్నారు. సమావేశంలో ఏబీవీపీ జిల్లా సంఘటనా కార్యదర్శి వి. చిన్నగోపాల్, ఎస్సీఎస్టీ హక్కుల సంరక్షా వేదిక పట్టణ అధ్యక్షుడు కమతం బాలు, కె. విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు -
సెన్సెక్స్ తొలి నిరోధం 23,940 పాయింట్లు
మార్కెట్ పంచాంగం మార్కెట్ ఓవర్‌సోల్డ్ కండీషన్లో పడినట్లు టెక్నికల్స్ వెల్లడిస్తున్నందున, రిలీఫ్ ర్యాలీ జరగవచ్చంటూ గత మార్కెట్ పంచాంగంలో ప్రస్తావించిన అంచనాలకు అనుగుణంగా మార్కెట్ పెరిగింది. చైనా మార్కెట్ పునఃప్రారంభమైన తర్వాత స్థిరంగా ట్రేడ్‌కావడం, అమెరికా మార్కెట్లు కూడా ర్యాలీ జరపడం ఇక్కడ షార్ట్ కవరింగ్‌కు దోహదపడింది. ఇక కేంద్ర బడ్జెట్ సమర్పణకు వారం రోజులే గడువు వుంది. ఇప్పటివరకూ అంతర్జాతీయ సంకేతాలతో అల్లాడిపోయిన మన మార్కెట్ బడ్జెట్ పట్ల అంచనాల్ని ఏర్పర్చుకుని, అందుకు తగ్గ కొనుగోళ్లు, అమ్మకాలు జరపడానికి కేవలం ఐదు ట్రేడింగ్ రోజులే మిగిలివుంది. సరిగ్గా ఇదేవారంలో ఫిబ్రవరి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్టులు కూడా ముగియనున్నాయి. ఇటు షార్ట్ కవరింగ్, అటు లాంగ్, షార్ట్ రోలోవర్స్ కారణంగా మార్కెట్లో ఆయా షేర్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చు. ఇక సూచీల స్వల్పకాలిక సాంకేతికాంశాలకు వస్తే... సెన్సెక్స్ సాంకేతికాంశాలు ఫిబ్రవరి 19తో ముగిసినవారం ప్రధమార్థంలో బీఎస్ఈ సెన్సెక్స్ 22,921 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయినా, ద్వితీయార్థంలో కోలుకోవడంతో అంతక్రితం వారంతో పోలిస్తే 723 పాయింట్ల లాభంతో 23,709 పాయింట్ల వద్ద ముగిసింది. గతవారం మొదలైన రిలీఫ్ ర్యాలీ ఈ వారం కూడా కొనసాగితే 23,940 పాయింట్ల వద్ద తొలి అవరోధం కలగవచ్చు. అటుపైన స్థిరపడితే క్రమేపీ 24,225 పాయింట్ల స్థాయివరకూ పెరిగే ఛాన్స్ వుంది. ఈ వారం తొలి నిరోధాన్ని అధిగమించలేకపోతే 23,440 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతును కోల్పోతే గతవారపు కనిష్టస్థాయి అయిన 22,921 పాయింట్ల వద్దకు క్షీణించవచ్చు. ఆ స్థాయి దిగువన మరోదఫా 22,600 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. నిఫ్టీ నిరోధం 7,275 ఎన్ఎస్ఈ నిఫ్టీ అంతక్రితం వారంతో పోలిస్తే 230 పాయింట్ల లాభంతో 7,211 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం రిలీఫ్ ర్యాలీ కొనసాగితే 7,275 పాయింట్ల వద్ద తొలి అవరోధం ఎదురుకావొచ్చు. అటుపైన స్థిరపడితే క్రమేపీ 7,365 పాయింట్ల వరకూ పెరగవచ్చు. ఈ వారం తొలి నిరోధాన్ని దాటలేకపోతే 7,120 పాయింట్ల వద్ద తొలి మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతును ముగింపులో కోల్పోతే క్రమేపీ 6,960 పాయింట్ల స్థాయి వరకూ తగ్గవచ్చు. ఆ లోపున మరోమారు 6,870 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. ఈ వారం ఫిబ్రవరి డెరివేటివ్ సిరీస్ ముగింపు సందర్భంగా 7,300, 7,400 స్ట్రయిక్స్ వద్ద అత్యధికంగా 58,44 లక్షలు, 60.51 లక్షల చొప్పున కాల్స్ బిల్డప్ జరిగింది. అలాగే 7,200, 7,000 స్ట్రయిక్స్ వద్ద భారీగా 50,56 లక్షలు, 53.63 లక్షల మేర పుట్స్ బిల్డప్ జరిగింది. 7,300 పాయింట్ల స్థాయిని దాటితే నిఫ్టీ మరింత పెరగవచ్చని, 7,400 పాయింట్ల స్థాయిని అధిగమించడం మాత్రం కష్టసాధ్యమని ఈ డేటా వెల్లడిస్తున్నది. 7,200 స్థాయిని కోల్పోయి, ముగిస్తే 7,000 పాయింట్ల స్థాయివరకూ పెద్దగా మద్దతు లేదని కూడా ఈ డేటా సూచిస్తున్నది. -
19 నెలల కనిష్ట స్థాయికి సెన్సెక్స్
చైనా మార్కెట్ ఎఫెక్ట్ * 109 నష్టంతో 24,825 వద్ద ముగింపు చైనా మార్కెట్ మరో 5 శాతం పతనంకావడంతో భారత్ స్టాక్ మార్కెట్ సోమవారం నష్టాల్లో ముగిసింది. ద్రవ్యోల్బణ, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు, టీసీఎస్ ఫలితాలు నేడు(మంగళవారం) వెల్లడి కానున్న నేపథ్యం కూడా ఇక్కడి మార్కెట్ క్షీణతకు దారితీసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 109 పాయింట్లు నష్టపోయి 24,825 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 38 పాయింట్లు నష్టపోయి 7,564 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌కు ఇది 19 నెలల కనిష్ట స్థాయి. ఈ ఏడాది ఆరు ట్రేడింగ్ సెషన్లలో స్టాక్‌మార్కెట్‌కు ఇది ఐదో పతనం. ఫార్మా, ఐటీ, బ్యాంక్, క్యాపిటల్ గూడ్స్ షేర్లు నష్టపోయాయి. ఆసియా మార్కెట్లు భారీగా నష్టపోవడంతో మన సూచీలు కూడా భారీ నష్టాలతోనే ప్రారంభమయ్యాయి. యూరప్ మార్కెట్లు రికవరీ కావడంతో మన మార్కెట్ కొంత కోలుకుంది. షార్ట్‌కవరింగ్, తక్కువ ధరల కారణంగా కొనుగోళ్లు జరగడం మార్కెట్ భారీ నష్టాల నుంచి రికవరీ కావడానికి తోడ్పడ్డాయి. జాగ్వార్, ల్యాండ్ రోవర్ రిటైల్ అమ్మకాలు బాగుండడంతో టాటా మోటార్స్ షేర్ల 2 శాతం లాభపడ్డాయి. కాగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చెరకు ప్రకటిత ధరను నేడు వెల్లడించనున్న నేపథ్యంలో పంచదార షేర్లు తీపిని పంచాయి. -
కారు బాంబు పేలుళ్లు: 31 మంది మృతి
చైనాలోని జింగ్ జియాంగ్ ప్రాంతం కారు బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఆ ప్రమాదంలో 31 మంది మరణించారు. దాదాపు 90 మందికిపైగా గాయపడ్డారు. గురువారం ఉదయం జింగ్ జియాంగ్‌లో రెన్మిన్ పార్క్ వద్ద పార్క్ నార్త్ మార్కెట్ నిత్యవసర వస్తువులు కోసం వచ్చిన కొనుగోలుదారులతో నిండి ఉంది... ఆ సమయంలో రెండు కారు బాంబులు ఒకదాని వెంట ఒకటి పేలాయని ఉన్నతాధికారులు వెల్లడించారు. దీంతో మృతుల సంఖ్య పెరిగిందన్నారు. క్షతగాత్రులను సమీపంలోని వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. అయితే వారిలోల కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారన్నారు. జింగ్ జియాంగ్ ప్రాంతంలో అత్యధికంగా ముస్లింలు నివసిస్తున్నారు. గతేడాది నుంచి ఆ ప్రాంతంలో దాడులు సంఖ్య పెరిగిందని చెప్పారు. ఉర్మిక్లోని రైల్వే స్టేషన్‌లోని గత నెలలో జరిగిన బాంబు దాడిలో ముగ్గురు మృతి చెందగా, 80 మంది గాయపడిన సంగతి తెలిసిందే.