చైనా వస్తువులను బహిష్కరిద్దాం | let ban the china goods | Sakshi
Sakshi News home page

చైనా వస్తువులను బహిష్కరిద్దాం

Published Sun, Oct 23 2016 6:08 PM | Last Updated on Mon, Sep 4 2017 6:06 PM

let ban the china goods

భీమవరం టౌన్‌:
భారత్‌పై దాడులకు పాల్పడుతున్న పాకిస్థాన్‌కు మద్ధతు ఇస్తున్న చైనా దేశ వస్తువులను భారతీయులు బహిష్కరించాలని ధర్మరక్షావేదిక జిల్లా అధ్యక్షుడు తోరం సూర్యనారాయణ పిలుపునిచ్చారు. వేదిక ఆధ్వర్యంలో ఆదివారం స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సూర్యనారాయణ మాట్లాడుతూ చైనా ఆహార, వస్తు ఉత్పత్తులను పూర్తిగా బహిష్కరించాలన్నారు. స్వదేశి వస్తువులను వినియోగించి దేశాభిమానాన్ని చాటుకోవాలన్నారు. సమావేశంలో ఏబీవీపీ జిల్లా సంఘటనా కార్యదర్శి వి. చిన్నగోపాల్, ఎస్సీఎస్టీ హక్కుల సంరక్షా వేదిక పట్టణ అధ్యక్షుడు కమతం బాలు, కె. విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement