Xiaomi 13 series with Leica triple rear cameras launched - Sakshi
Sakshi News home page

అద్భుత ఫీచర్లు, ఐఫోన్‌ లాంటి డిజైన్‌: షావోమీ స్మార్ట్‌ఫ్లోన్లు వచ్చేశాయ్‌!

Dec 12 2022 1:14 PM | Updated on Dec 12 2022 1:44 PM

Xiaomi13 series with Leica cameras launched check details here - Sakshi

 చైనా స్మార్ట్‌ఫోన​ దిగ్గజం షావోమి కొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేసింది.  షావోమి 12 సిరీస్‌కు కొనసాగింపుగా 13 సిరీస్‌ మొబైల్స్‌ను చైనా మార్కెట్లో ఆవిష్కరించింది. షావోమి 13, 13 ప్రో రెండు వేరియంట్లను తీసుకొచ్చింది.

సాక్షి ముంబై:  చైనా స్మార్ట్‌ఫోన​ దిగ్గజం షావోమి కొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేసింది.  షావోమి 12 సిరీస్‌కు కొనసాగింపుగా 13 సిరీస్‌ మొబైల్స్‌ను చైనా మార్కెట్లో ఆవిష్కరించింది. షావోమి 13, 13 ప్రో రెండు వేరియంట్లను తీసుకొచ్చింది. ఐఫోన్‌ మాదిరి డిజైన్‌లో ఆండ్రాయిడ్‌ 13 MIUI 14తో  వీటిని తీసుకొచ్చింది.  అలాగేవీటిల్లో  లైకా బ్రాండెడ్​ ట్రిపుల్‌ రియర్‌ కెమెరాలను అమర్చింది. ఇండియా సహా ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో ఎపుడు లాంచ్​ అవుతుందనేది స్పష్టత లేదు. 

(ఎలక్ట్రిక్ స్కూటర్‌‌ లవర్స్‌కు అదిరే ఆఫర్‌: పది ఎస్1 ప్రో స్కూటర్లు ఫ్రీ)

షావోమీ  13 ప్రో స్పెసిఫికేషన్స్
6.73అంగుళాల AMOLED డిస్‌ప్లే
3200x1440 రిజల్యూషన్‌ 
120Hz రిఫ్రెష్ రేట్‌
 50 ఎంపీ(వైడ్, అల్ట్రా, వైడ్  టెలిఫోటో)) ట్రిపుల్‌ రియర్‌ కెమెరా
16 ఎంపీ ఫ్రెంట్​ కెమెరా 
 4820ఎంఏహెచ్​ బ్యాటరీ

(ఐటీ సర్క్యులర్‌ వచ్చిందోచ్‌.. ఈ విషయాలపై క్లారిటీ ఉందా మీకు?)

షావోమీ 13 ప్రో  ధర: 
ఈ  ప్రీమియం  స్మార్ట్‌ఫోన్లు  రెండూ వైట్​, బ్లాక్​, గ్రీన్​, లైట్​ బ్లూ రంగుల్లో అందుబాటులో ఉంటాయి.
బేస్ వెర్షన్  8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ రూ. 60 వేల నుండి ప్రారంభం.
12 జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్‌ సుమారు రూ. 74,500

షావోమి  13  ఫీచర్లు
6.36 అంగుళాల OLED డిస్‌ప్లే
1080 x 2400పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
4500ఎంఏహెచ్​ 

షావోమి13 ధరలు
8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ 574 డాలర్లు ( సుమారు రూ. 47,344)
8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌  617 డాలర్లు ( సుమారు రూ. 50891)
12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌  660 డాలర్లు (రూ. 54438)
12జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్‌  718 డాలర్లు (రూ. 59222)


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement