new series
-
ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కొత్త సిరీస్ ఫోన్లు వచ్చేశాయి..
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ ఒప్పో రెనో 12 సిరీస్‌ను విడుదల చేసింది. ఈ సిరీస్‌లో ఒప్పో రెనో 12 (Oppo Reno 12), ఒప్పో రెనో 12 ప్రో (Oppo Reno 12 Pro) అనే రెండు స్మార్ట్ఫోన్లను భారతీయ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను ఇష్టపడేవారి కోసం ఒప్పో ఈ రెండు ఫోన్లలో చాలా ఏఐ ఫీచర్లను అందించింది.కంపెనీ ఒప్పో రెనో 12ని 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్‌తో పరిచయం చేసింది. దీని ధర రూ.32,999. ఈ స్మార్ట్‌ఫోన్ విక్రయం జూలై 25 నుంచి భారత్‌లో ప్రారంభమవుతుంది. ఇక ఒప్పో రెనో 12 ప్రో రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 36,999. అలాగే 12GB ర్యామ్, 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 40,999. దీని సేల్ జూలై 18 నుంచి ప్రారంభం కానుంది. ఒప్పో రెనో 12, ఒప్పో రెనో 12 ప్రో కొనుగోలుపై కంపెనీ భారీ తగ్గింపును అందిస్తోంది. రూ. 4000 తక్షణ తగ్గింపుతో సిరీస్ బేస్ వేరియంట్‌ను రూ. 28,999 లకే కొనుగోలు చేయవచ్చు.ఒప్పో రెనో 12 ఫీచర్లు⇒ 6.7-అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే⇒ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్సెట్⇒ ఆండ్రాయిడ్ 14 ఆధారిత కలర్ ఓస్ 14.1⇒ 50 + 8 + 2 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా⇒ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీ⇒ AI క్లియర్ ఫేస్, AI రైటర్, AI ఎరేజర్, AI రికార్డింగ్ సమ్మరీ వంటి ఫీచర్లుఒప్పో రెనో 12 ప్రో ఫీచర్లు⇒ 6.7-అంగుళాల ఫుల్ హోచ్‌డీ ప్లస్ డిస్ప్లే⇒ ఆండ్రాయిడ్ 14 ఆధారిత కలర్ఓస్ 14.1⇒ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ ప్రాసెసర్⇒ AI క్లియర్ ఫేస్, AI రైటర్, AI ఎరేజర్, AI రికార్డింగ్ సమ్మరీ వంటి ఫీచర్లు⇒ 50 + 8 + 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా⇒ 50-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ కెమెరా⇒ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీ -
రిచ్ సపోర్ట్ సిరీస్.. నిపుణులతో కనెక్ట్ అవ్వడానికి మంచి ఛాన్స్!
రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ (RICH), తెలంగాణ గవర్నమెంట్ చొరవతో.. అక్టోబర్ 2023లో SAMARTHan@RICH పేరుతో 'నెలవారీ సపోర్ట్ సిరీస్' (Monthly Support Series) ప్రారంభించింది. ఇది ప్రత్యేకంగా మెడికల్ టెక్నాలజీ (మెడ్‌టెక్) ఇన్నోవేటర్లు, స్టార్టప్‌లు తమ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురావడంలో ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి పుట్టుకొచ్చింది. SAMARTHan@RICH నెలవారీ సపోర్ట్ సిరీస్ ద్వారా.. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ (IP) అవగాహన & అప్లికేషన్ ప్రాసెస్, వైద్యుల నుంచి ఐడియా వ్యాలిడేషన్, ఉత్పత్తి అభివృద్ధి & వాణిజ్యీకరణ కోసం రెగ్యులేటరీ రోడ్‌మ్యాప్, క్లినికల్ ధ్రువీకరణ అధ్యయనాలను నిర్వహించడం వంటివి తెలుసుకోవచ్చు. అంతే కాకుండా ఆవిష్కర్తలు, వ్యవస్థాపకులు IP ఏజెన్సీల నిపుణులు వంటి అనుభవజ్ఞులైన వైద్యులతో కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దీంతో స్టార్టప్‌ల ప్రశ్నలకు సమాధానాలు పొందవచ్చు. విజ్ఞానం, నైపుణ్యాన్ని పంచుకోవడం ద్వారా.. రెగ్యులేటరీ ల్యాండ్‌స్కేప్‌ను నావిగేట్ చేసుకోవచ్చు. వారి టెక్నాలజీలను మెరుగుపరచుకోవచ్చు. అంతే కాకుండా రోగుల జీవితాన్ని మార్చే పరిష్కారాలను వేగంగా అందించడానికి స్టార్టప్‌లకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని RICH సీఈఓ 'రష్మీ పింపాలే' అన్నారు. ఐడియా వ్యాలిడేషన్, క్లినికల్ వ్యాలిడేషన్, రెగ్యులేటరీ గైడెన్స్‌పై సెషన్లతో ఈ ప్రోగ్రామ్ ఫిబ్రవరి 2024లో ప్రారంభమైంది. దీని ద్వారా ఆవిష్కర్తలకు మద్దతు ఇవ్వడం మాత్రమే కాకుండా.. సంచలనాత్మక పరిష్కారాల అభివృద్ధిని వేగవంతం చేయవచ్చని నిపుణులు పేర్కొన్నారు. SAMARTHan@RICH నెలవారీ ప్రాతిపదికలో పాల్గొనటానికి ఆసక్తి కలిగిన ఆవిష్కర్తలు, స్టార్టప్‌లు ఇక్కడ రిజిస్టర్ చేసుకోవచ్చు. -
రియల్మీ నుంచి కొత్త సిరీస్.. ఫీచర్స్ అదుర్స్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్మీ 11 ప్రో సిరీస్ ప్రవేశపెట్టింది. వీటిలో 11 ప్రో ప్లస్ 5జీ, 11 ప్రో 5జీ ఉన్నాయి. ధర రూ.23,999 నుంచి ప్రారంభం. 8, 12 జీబీ వేరియంట్లలో లభిస్తుంది. 120 హెట్జ్ కర్వ్డ్ విజన్ డిస్ప్లే ఏర్పాటు ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 4గీ లాస్‌లెస్ జూమ్ 200 ఎంపీ కెమెరా, 100 వాట్స్ సూపర్‌వూక్ చార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో 11 ప్రో ప్లస్ 5జీ వేరియంట్ తయారైంది. 100 ఎంపీ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ప్రోలైట్ కెమెరా, 67 వాట్ సూపర్‌వూక్ చార్జ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో 11 ప్రో 5జీ రూపుదిద్దుకుంది. ఇదీ చదవండి: శాంసంగ్ గెలాక్సీ ఎఫ్54 5జీ: లాంచింగ్ ఆఫర్ ముగుస్తోంది! -
రూ. 6 వేలకే సరికొత్త స్మార్ట్ఫోన్లు.. లాంచ్ చేసిన షావోమీ
అతి తక్కువ ధరలో సరికొత్త స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది షావోమీ (Xiaomi). రెడ్మీ ఏ2 (Redmi A2), రెడ్మీ ఏ2 ప్లస్ (Redmi A2 Plus) ఫోన్లు భారత్‌లో అధికారికంగా విడుదలయ్యాయి. ఇదీ చదవండి: Motorola Edge 40: మోటరోలా ఎడ్జ్ 40 లాంచ్‌కు రెడీ.. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు భలే ఉన్నాయే! రెడ్మీ ఏ2 సిరీస్ గత సంవత్సరం వచ్చిన రెడ్మీ ఏ1 సిరీస్‌కు కొనసాగింపు. పైకి చూడటానికి ఒకేలా ఉన్నా ఏ2 సిరీస్‌లో మరికొన్ని హంగులు చేర్చారు. మరింత శక్తివంతమైన చిప్‌ను జోడించారు. తాజా ఆండ్రాయిడ్ ( Android 13 Go) ఎడిషన్ సాఫ్ట్‌వేర్‌ను జత చేశారు. ఇక రెడ్మీ ఏ2, ఏ2 ప్లస్ డిజైన్ పరంగా రెండూ ఒకే రకంగా ఏ2 ప్లస్ ఫోన్లో అదనంగా ఫింగర్‌ప్రింట్ రీడర్ ఫీచర్ ఉంటుంది. రెడ్మీ ఏ2 సిరీస్ ధర రూ. 5,999 నుంచి ప్రారంభమవుతుంది. మే 23 తర్వాత ఈ ఫోన్లు కొనుగోలుదారులకు అందుబాటులోకి వస్తాయి. రేట్లు ఎంత.. ఎక్కడ కొనాలి.. ఆఫర్ల సంగతేంటి? రెడ్మీ ఏ2 2జీబీ/32జీబీ వేరియంట్ ధర రూ.5,999. 2జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీ వెర్షన్ ధర రూ.6,499. ఇది 4జీబీ/64జీబీ కాన్ఫిగరేషన్‌లో కూడా కూడా అందుబాటులో ఉంది. దీని ధర రూ.7,499. ఇక రెడ్మీ ఏ2 ప్లస్ ధర రూ. 8,499. ఇది 4జీబీ/64జీబీ కాన్ఫిగరేషన్‌లో మాత్రమే వస్తుంది. సీ గ్రీన్, కామింగ్ ఆక్వా బ్లూ, క్లాసిక్ బ్లాక్ కలర్స్‌లో ఈ ఫోన్స్ లభిస్తాయి. ఈ ఫోన్లను ఆన్లైన్లో అయితే అమెజాన్, షావోమీ ఆన్లైన్ స్టోర్‌లో, అదే ఆఫ్‌లైన్‌లో అయితే ఎంఐ హోమ్ స్టోర్లతో పాటు కంపెనీ ఇతర రిటైల్ పార్టనర్ స్టోర్లలో మే 23 (మధ్యాహ్నం 12 తర్వాత) నుంచి కొనుగోలు చేయవచ్చు. ఇక ఆఫర్ల విషయానికి వస్తే షావోమీ ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ వినియోగదారులకు ఈ ఫోన్ల కొనుగోలుపై రూ. 500 వరకు అదనపు తక్షణ తగ్గింపు లభిస్తుంది. ఈ మోడళ్లపై 2 సంవత్సరాల వారంటీ ఉంటుందని కంపెనీ పేర్కొంది. సీనియర్ సిటిజన్లకైతే ఈ ఫోన్లను హోం సర్వీస్‌లో అందించనున్నట్లు తెలిపింది. స్పెసిఫికేషన్లు, ఫీచర్లు వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్‌తో 6.52 అంగుళాల 720p డిస్ప్లే MediaTek Helio G36 చిప్సెట్ 4GB ర్యామ్ 64GB ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ Android 13 Go సాఫ్ట్వేర్. వెనుకవైపు 8MP ప్రధాన సెన్సార్‌తో డ్యూయల్ కెమెరా సెటప్, ముందువైపు మరో 5MP కెమెరా 10W మైక్రో USB ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ. ఇదీ చదవండి: అదిరిపోయే రంగులో శాంసంగ్ గెలాక్సీ ఎస్23.. ధర ఎంతంటే.. -
సోనీ బ్రావియా కొత్త టీవీలు
విజయవాడ: సోనీ ఇండియా కంపెనీ ఆంధ్రప్రదేశ్ మార్కెట్లోకి సోనీ బ్రావియా ఎక్స్70ఎల్, బ్రావియా ఎక్స్75ఎల్ సిరీస్ టీవీలను విడుదల చేసింది. ఎక్స్1 4కే ప్రోసెసర్, లైవ్ కలర్, డాల్బీ ఆడియా, క్లియర్ ఫేస్ టెక్నాలజీ, 10వేలకి పైగా యాప్స్, గేమ్స్‌తో పాటు ఏడు లక్షలకు పైగా సినిమాలు, టీవీ సిరీస్‌లను కలిగిన గూగుల్ టీవీ ఫీచర్లు వీటిలో ఉన్నాయి. ఎక్స్–ప్రొటెక్షన్ పీఆర్ఓ, వాయిస్ ఆధారిత రిమోట్–స్మార్ట్ రిమోట్లు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. ఎక్స్ 75ఎల్ సిరీస్‌లో మొత్తం నాలుగు మోడళ్లు ఉన్నాయి. వీటి ధరలు రూ.1.04 లక్షలు – రూ. 51,999 మధ్య ఉన్నాయి. ఇక ఎక్స్70ఎల్ సిరీస్‌లో రెండు మోడళ్లు ఉన్నాయి. ఇందులో కేడి–43 ఎక్స్70ఎల్ ధర రూ.49,990, కేడి–50 ఎక్స్70ఎల్ ధర రూ.61,990 గా ఉంది. పై రెండు సిరీస్‌లోని మోడళ్లు ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని సోనీ సెంటర్లు, ప్రముఖ ఎలక్ట్రానిక్స్ షాపుల్లో, ఈ–కామర్స్ పోర్టళ్లలో లభిస్తాయిని కంపెనీ తెలిపింది. -
అద్భుత ఫీచర్లు, ఐఫోన్ లాంటి డిజైన్: షావోమీ స్మార్ట్ఫ్లోన్లు వచ్చేశాయ్!
సాక్షి ముంబై: చైనా స్మార్ట్‌ఫోన దిగ్గజం షావోమి కొత్త స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. షావోమి 12 సిరీస్‌కు కొనసాగింపుగా 13 సిరీస్ మొబైల్స్‌ను చైనా మార్కెట్లో ఆవిష్కరించింది. షావోమి 13, 13 ప్రో రెండు వేరియంట్లను తీసుకొచ్చింది. ఐఫోన్ మాదిరి డిజైన్‌లో ఆండ్రాయిడ్ 13 MIUI 14తో వీటిని తీసుకొచ్చింది. అలాగేవీటిల్లో లైకా బ్రాండెడ్ ట్రిపుల్ రియర్ కెమెరాలను అమర్చింది. ఇండియా సహా ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో ఎపుడు లాంచ్ అవుతుందనేది స్పష్టత లేదు. (ఎలక్ట్రిక్ స్కూటర్ లవర్స్‌కు అదిరే ఆఫర్: పది ఎస్1 ప్రో స్కూటర్లు ఫ్రీ) షావోమీ 13 ప్రో స్పెసిఫికేషన్స్ 6.73అంగుళాల AMOLED డిస్ప్లే 3200x1440 రిజల్యూషన్ 120Hz రిఫ్రెష్ రేట్ 50 ఎంపీ(వైడ్, అల్ట్రా, వైడ్ టెలిఫోటో)) ట్రిపుల్ రియర్ కెమెరా 16 ఎంపీ ఫ్రెంట్ కెమెరా 4820ఎంఏహెచ్ బ్యాటరీ (ఐటీ సర్క్యులర్ వచ్చిందోచ్.. ఈ విషయాలపై క్లారిటీ ఉందా మీకు?) షావోమీ 13 ప్రో ధర: ఈ ప్రీమియం స్మార్ట్ఫోన్లు రెండూ వైట్, బ్లాక్, గ్రీన్, లైట్ బ్లూ రంగుల్లో అందుబాటులో ఉంటాయి. బేస్ వెర్షన్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ రూ. 60 వేల నుండి ప్రారంభం. 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ సుమారు రూ. 74,500 షావోమి 13 ఫీచర్లు 6.36 అంగుళాల OLED డిస్ప్లే 1080 x 2400పిక్సెల్స్ రిజల్యూషన్ 4500ఎంఏహెచ్ షావోమి13 ధరలు 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 574 డాలర్లు ( సుమారు రూ. 47,344) 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ 617 డాలర్లు ( సుమారు రూ. 50891) 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ 660 డాలర్లు (రూ. 54438) 12జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ 718 డాలర్లు (రూ. 59222) -
India Vs Ireland: కొత్తవారికి అవకాశం దక్కేనా!
డబ్లిన్: ఇంగ్లండ్‌తో ప్రధాన పోరుకు ముందు భారత క్రికెట్ జట్టు మరో సంక్షిప్త సిరీస్‌కు సన్నద్ధమైంది. ఐర్లాండ్‌తో రెండు టి20 మ్యాచ్‌ల పోరులో భాగంగా నేడు తొలి మ్యాచ్ జరగనుంది. అయితే అగ్రశ్రేణి ఆటగాళ్లు టెస్టు మ్యాచ్ కోసం సిద్ధమవుతున్న నేపథ్యంలో టెస్టు టీమ్‌లో లేని ఇతర ఆటగాళ్లతోనే టీమిండియా బరిలోకి దిగనుంది. దక్షిణాఫ్రికాతో స్వదేశంలో ఆడిన జట్టే దాదాపుగా ఇక్కడా ఉండగా... కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా తొలిసారి భారత జట్టును నడిపించబోతున్నాడు. రాహుల్ ద్రవిడ్ ప్రధాన జట్టుతో ఉండటంతో వీవీఎస్ లక్ష్మణ్ ఈ సిరీస్‌కు తాత్కాలిక కోచ్‌గా వ్యవహరిస్తాడు. బలాబలాలు, గత రికార్డును చూస్తే ఐర్లాండ్‌పై భారత్‌దే స్పష్టంగా పైచేయి కాగా, సొంతగడ్డపై సత్తా చాటా లని ఐర్లాండ్ భావిస్తోంది. సామ్సన్ను ఆడిస్తారా... దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో తొలి మ్యాచ్ నుంచి చివరి వరకు మార్పు లేకుండా ఆ 11 మందినే ఆడించారు. అయితే ఈసారి టీమ్ మేనేజ్మెంట్ కొత్తగా ప్రయత్నించవచ్చు. పేసర్లు అర్‡్షదీప్, ఉమ్రాన్ మాలిక్‌లు అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టవచ్చని అంచనా. బ్యాటింగ్‌పరంగా గత మ్యాచ్ ఆడిన తుది జట్టును చూస్తే పంత్, అయ్యర్ లేరు కాబట్టి రెండు స్పష్టమైన ఖాళీలు ఉన్నాయి. ప్రస్తుత జట్టు నుంచి రాహుల్ త్రిపాఠి అరంగేట్రం చేయకపోగా, సామ్సన్ మరో చాన్స్ కోసం చూస్తున్నాడు. పోటీనిస్తారా... గత ఏడాది టి20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత ఐర్లాండ్ పెద్ద జట్టుతో మ్యాచ్‌లు ఆడలేదు. అమెరికా, యూఏ ఈలతో మాత్రమే తలపడిన టీమ్‌కు ఇన్నేళ్లలో కూడా పెద్ద జట్లను ఎదు ర్కొనే అవకాశం ఎక్కువగా రాలేదు. భారత్ తర్వాత ఆ టీమ్ న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాలతో ఆడనుంది. టి20 వరల్డ్‌కప్‌కు సన్నాహకంగా భారత్‌తో సిరీస్ పనికొస్తుంది. భారత్‌తో గతంలో ఆడిన 3 టి20ల్లోనూ ఐర్లాండ్ ఓడింది. ప్రస్తుత జట్టులోని సీనియర్లు స్టిర్లింగ్, డాక్రెల్తో పాటు కెప్టెన్ బల్బరీన్ జట్టు భారం మోస్తున్నారు. కొత్తగా వచ్చిన యువ ఆటగాళ్లతో కలిసి వీరు జట్టును ఎలా గెలుపు దిశగా నడిపిస్తారనేది చూడాలి. -
వివో నుంచి ఎక్స్80, ఎక్స్ 80ప్రో
హైదరాబాద్: వివో తన ఫ్లాగ్షిప్ ఎక్స్ సిరీస్‌లో ఎక్స్80, ఎక్స్80 ప్రో పేరుతో రెండు కొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. జీస్ కంపెనీ సహకారంతో ఈ ఫోన్లలో అత్యాధునిక కెమెరా టెక్నాలజీని వివో అందిస్తోంది. జీస్ జింబెల్ పోట్రయిట్ కెమెరా, 50 మెగా పిక్సల్ అల్ట్రా సెన్సింగ్ ఐఎంఎక్స్ 866 సెన్సార్ వీటిల్లో ఉంటుంది. క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెనరేషన్ 1 చిప్సెట్తో నడిచే ఈ ఫోన్లలో ఎన్నో కొత్త ఫీచర్లను వివో ప్రవేశపెట్టింది. ఎక్స్ 80 ప్రో 12జీబీ, 256జీబీ కాంబినేషన్ ధర ధర రూ.79,999. ఎక్స్ 80 8జీబీ, 128జీబీ ధర రూ.54,999. 12జీబీ, 256జీబీ ధర రూ.59,999. ఈ నెల 25 నుంచి విక్రయాలు మొదలు కానున్నట్టు వివో ప్రకటించింది. -
God Of War Game : కొత్త రకం రాక్షసులు.. వాటిని ఎదుర్కొనే పవర్స్
ఈ వారం గేమింగ్ ప్రియులను ఆకట్టుకునే వీడియో గేమ్స్‌లో ‘గాడ్ ఆఫ్ వార్ అండ్ మాన్స్టర్ హంటర్స్ రైజ్’ ఒకటి. ‘గాడ్ ఆఫ్ వార్’ సిరీస్ ఎంత పాపులరో మనకు తెలిసిందే. ఈ పరంపర లో వచ్చిన తాజాగేమ్ ఇది. దీనిలో విజువల్స్ ఇంప్రూవ్ చేశారు. 4కె రిజల్యూషన్‌కు సపోర్ట్ చేస్తుంది. యుద్ధానికి సంబంధించిన నక్కజిత్తులు, సాంకేతికజ్ఞానానికి ఆలవాలమైన కముర గ్రామంలో జరిగే ఈ గేమ్ మొదటిసారి పీసీకి వస్తుంది. ‘కొత్త రకం రాక్షసులు, కొత్తరకం యుద్ధవిద్యలు, న్యూ బ్రాండ్ స్టోరీతో వస్తుంది’ అనే వూరింపులు ఎంతవరకు నిజమవుతాయో చూడాలి. ఈ గేమ్‌కు సంబంధించి ‘హౌ టూ చేంజ్ వెపన్స్’ ‘హౌ టు షార్పెన్ వెపన్’ ‘హౌ టు గెట్ టు వెపన్ ట్రైనింగ్ ఏరియా’....మొదలైన దారి సూచికలు కూడా నెట్లో కనిపిస్తున్నాయి. నిన్టెండో స్విచ్ ప్లేస్టేషన్ ప్లాట్‌ఫామ్స్‌పై ఇది అలరించనుంది. -
వేరే రాష్ట్రాల్లో మళ్లీ రిజిస్ట్రేషన్ అక్కర్లేదు !
సాక్షి, న్యూఢిల్లీ: తమ కొత్త వ్యక్తిగత వాహనాలను ప్రభుత్వ/ప్రైవేటు ఉద్యోగులు వేరే రాష్ట్రాలకు తీసుకెళ్లినపుడు ఆ రాష్ట్రాల్లోనూ మళ్లీ రిజిస్ట్రేషన్ చేయాల్సిన పనిలేకుండా ‘భారత్ సిరీస్ (బీహెచ్–సిరీస్)’ పేరిట కొత్త రిజిస్ట్రేషన్ సిరీస్‌ను అందుబాటులోకి తేనుంది. ఈ కొత్త సిరీస్ సెప్టెంబర్ 15 నుంచి అమల్లోకి తేనుంది. ఈ వివరాలతో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయరహదారుల శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజా నోటిఫికేషన్ ప్రకారం కొత్త వాహనాలకు భారత్ సిరీస్ (బీహెచ్ –సిరీస్) వినియోగించనున్నారు. వాహన యజమాని మరొక రాష్ట్రానికి బదిలీ అయినప్పటికీ ఈ రిజిస్ట్రేషన్ ముద్ర ఉన్న వాహనాన్ని రీ–రిజిస్ట్రేషన్ చేయించుకోనవసరం ఉండదని రవాణా శాఖ తెలిపింది. కేంద్ర భద్రతా బలగాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, నాలుగుకంటే ఎక్కువ రాష్రాల్లో కార్యాలయాలున్న ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు వేరే రాష్ట్రాలకు బదిలీ అయినపుడు ఈ రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని వాడుకోవచ్చని పేర్కొంది. బీహెచ్–సిరీస్ రిజిస్ట్రేషన్ మార్క్ ఉన్న వాటి వాహనాల పన్ను ఎలక్ట్రానిక్ పద్ధతిలో చెల్లించాలి. మోటారు వాహనం పన్నును రెండేళ్లు, అంత కుపైన విధించనున్నారు. 14 ఏళ్లు పూర్తవగానే ఆ వాహనంపై ఏటా విధించే పన్ను అంతకు ముందు విధించిన మొత్తంలో సగానికి తగ్గించనున్నారు. అదేవిధంగా, కొత్త సిరీస్ ఉన్న నాన్–ట్రాన్స్పోర్ట్ వాహనాల ధర రూ. 10 లక్షల లోపు ఉంటే 8% వాహన పన్ను, రూ. 10–20 లక్షల మధ్య ఉంటే 10% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ముద్ర ఫార్మాట్ YY BH #### XX. ఇందులో వైవై అంటే తొలి రిజిస్ట్రేషన్ సంవత్సరం, బీహెచ్ అంటే భారత్ సిరీస్ కోడ్, #### అంటే 0000 నుంచి 9999 నంబర్లు.. ఎక్స్ఎక్స్ అంటే ఆంగ్ల అక్షర క్రమం. -
Huyndai N Line: హ్యుందాయ్ నుంచి ఎన్ లైన్... కీలక అప్డేట్స్ ఇవే
ఆటోమోబైల్ మార్కెట్లో పట్టు పెంచుకునేందుకు హ్యుందాయ్ ఇండియా దూకుడు పెంచింది. యూత్‌తో మరింతగా కనెక్ట్ అయ్యేందుకు వీలుగా సరికొత్త లైన్లో వెహికల్స్‌ని లాంఛ్ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన కీలక అప్డేట్ని హ్యుందాయ్ వెల్లడించింది. ఎన్ సిరీస్ డైనమిజం, స్పోర్టీనెస్ థీమ్‌తో రెండేళ్ల కిందట అంతర్జాతీయ మార్కెట్లో ఎన్ లైన్ సిరీస్‌ను హ్యుందాయ్ ప్రవేశపెట్టింది, తాజాగా ఇప్పుడు ఇండియాకు ఎన్ లైన్ సిరీస్‌లో వెహికల్స్ తెస్తామంటూ ప్రకటించింది. ఐ20 ఎన్ ప్రస్తుతం హ్యుందాయ్‌లో పాపులర్ మోడల్‌గా ఉన ఐ20లో సెగ్మెంట్లో తొలి ఎన్ లైన్‌ను తేనన్నట్టు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి, ప్రస్తుతం ఉన్న ఐ 20 కారుకి డిజైన్, ఇంజన్లో స్పోర్టీనెస్, డైనమిజానికి తగ్గట్టుగా మార్పులు చేసి మార్కెట్లోకి తేనున్నారు. ఈ ఏడాదిలోనే ఇట్స్ టైమ్ టూ ప్లే అంటూ ఎన్ లైన్ సిరీస్‌కి సంబంధించిన ప్రోమోను హ్యుందాయ్ విడుదల చేసింది. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం దసరా, దీపావళి పండగల సమయానికి ఎన్సిరీస్ కారు ఇండియా మార్కెట్లో అందుబాటులో ఉండవచ్చని అంచనా మార్కెట్‌ను ఆకట్టుకునేలా ఇండియన్ కార్ల మార్కెట్లో హ్యుందాయ్‌కి గణనీయమైన వాటా ఉన్నప్పటికీ మార్కెట్ లీడర్ కాలేకపోయింది. అయితే ఎన్ లైన్ సిరీస్‌తో మార్కెట్లో తన పట్టు పెంచుకునే ఉద్దేశంలో హ్యుందాయ్ ఉంది. దీంతో డైనమిజం, స్టోర్టీనెస్ వంటి ఫీచర్లు జోడించినా మార్కెట్‌ను ఆకట్టుకునే విధంగా రూ. 11 నుంచి 13 లక్షల మధ్య ధర ఉండవచ్చని అంచనా. The globally popular #HyundaiNLine, is now coming to India. N Line range comes with motorsports inspired styling elements to compliment your aspirations. N Line is a statement of dynamism and sportiness. #ItsTimeToPlay!#NLineInIndia #ComingSoon — Hyundai India (@HyundaiIndia) August 9, 2021 -
ఐఫోన్ 12 ప్రో మోడల్స్ : అంచనాలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆపిల్ కంపెనీకి 2020సంవత్సరం మంచి సంవత్సరం అని చెప్పవచ్చు. ఐఫోన్ ఎస్ఈ2ని అందుబాటులో తీసుకొచ్చి విజయం సాధించింది. దీంతో త్వరలోనే తీసుకురానున్న ఐఫోన్ 12 సిరీస్ స్మార్ట్ఫోన్లపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 5జీ టెక్నాలజీతో పాటు, ఇంట్రస్టింగ్ డిజైన్ తో ఐఫోన్12, ఐఫోన్12 ప్రో, ఐఫోన్ 12 మాక్స్, ఐఫోన్ 12 ప్రో మాక్స్ ను తీసుకురానుంది. తాజా నివేదికల ప్రకారం ఐపాడ్ 2020 మోడల్స్ లోని కెమెరాను తన రాబోయే హైఎండ్ ఐఫోన్లలో జోడించనుందని తెలుస్తోంది. ఎప్పటినుంచో ప్రయతిస్తున్న సోనీ లిడార్ డెప్త్ కెమెరాను ఐఫోన్ 12 ప్రో, ఐఫోన్ 12 ప్రో మాక్స్ స్మార్ట్ఫోన్లలో ఎట్టకేలకు ఆపిల్ పొందుపరుస్తోంది. అక్టోబర్‌లో జరగనున్న ఐఫోన్ 12 మోడళ్ల విడుదలకు ముందే దీనికి సంబంధించిన అనేక లీక్‌లు, పుకార్లు ఐఫోన్ ప్రియులను ఊరిస్తున్నాయి. ఆపిల్ అక్టోబర్‌లో ఐఫోన్ 12 సిరీస్‌ను ఆవిష్కరిస్తుందని, ఇందులో నాలుగు మోడళ్లు ఉంటాయని అంచనా. ప్రముఖ లీకర్ జోన్ ప్రాసెసర్ ప్రకారం, ఐఫోన్ 12 ఇటీవలి సంవత్సరాలలో ఇతర బేస్ మోడళ్ల మాదిరిగానే ఆకర్షణీయమైన ధరలనే నిర్ణయించనుంది. 5జీతో పాటు, తక్కువ బ్యాటరీ టెక్నాలజీతో ద్వారా పెరిగిన ఖర్చులను తగ్గించుకోవాలని చూస్తోంది. I’ll just leave this here in case... https://t.co/9umqJqSzwq — Jon Prosser (@jon_prosser) September 1, 2020 -
జాన్ పోస్ట్‌పోన్
హాలీవుడ్ యాక్షన్ క్యారెక్టర్స్‌లో జాన్ విక్‌ని ఇష్టపడే ప్రేక్షకుల సంఖ్య ఎక్కువే. నటుడు కియాను రీవ్స్ టైటిల్ రోల్లో అలరించిన సూపర్ హిట్ యాక్షన్ చిత్రాల ఫ్రాంచైజీ ‘జాన్ విక్’. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు మూడు సినిమాలు విడుదలయ్యాయి. తాజాగా 4వ భాగం తెరకెక్కుతోంది. ఇందులోనూ కియాను రీవ్సే హీరో. ముందుగా ఈ సినిమాను 21 మే 2021లో విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా వైరస్ కారణంగా షూటింగ్ షెడ్యూల్ మొత్తం తారుమారైంది. దాంతో ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేశారు. తాజాగా ఈ సినిమాను 27 మే 2022లో విడుదల చేస్తున్నట్లు చిత్రబందం పేర్కొంది. -
శాంసంగ్ ప్రభంజనం, అద్భుత ఫీచర్లు, ఫోటోలు
శాన్ఫ్రాన్సిస్కో: దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్ తన నూతన ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లు గెలాక్సీ ఎస్20, ఎస్20 ప్లస్, ఎస్20 అల్ట్రాలను విడుదల చేసింది. అందరూ ఊహించినట్టుగానే గెలాక్సీ ఎస్ సిరీస్‌లో ఎస్11కు బదులుగా శాంసంగ్ ఎస్20 సిరీస్ ఫోన్లను విడుదల చేసింది. శాన్ ఫ్రాన్సిస్కోలో శాంసంగ్ నిర్వహించిన గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్లో ఈ ఫోన్లను లాంచ్ చేసింది. ఏఐ ఆధారిత కెమెరాలు, 5 జీ టెక్నాలజీ, భారీ స్టోరేజ్ లాంటి అద్భుతమైన ఫీచర్లను జోడించి తన ఫ్లాగ్షిప్ ఫోన్లను ఆవిష్కరించింది. దీంతోపాటు గెలాక్సీ జెడ్ ఫ్లిప్ ఫోల్డింగ్ ఫోన్‌ను కూడా లాంచ్ చేసింది. మొత్తం సిరీస్‌లో స్టోరేజ్ పరంగా, డిస్ప్లే క్వాలిటీ అద్భుతంగా తీసుకొచ్చింది. 120హెడ్జ్ రిఫ్రెష్ రేట్, అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 5జి ఫీచర్‌ను ప్రధాన ఆకర్షణ. గెలాక్సీ ఎస్20 ఫీచర్లు 6.2 అంగుళాల డిస్ప్లే 64+12 +12 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 10 ఎంపీ సెల్ఫీ కెమెరా 4000 ఎంఏహెచ్‌బ్యాటరీ బ్లూ, పింక్, గ్రే కలర్స్‌లో లభ్యం గెలాక్సీ ఎస్ 20 ప్లస్ ఫీచర్లు 6.7 ఇంచుల క్వాడ్ హెచ్డీ ప్లస్ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ ఇన్ఫినిటీ-ఓ డిస్ప్లే 64+12 +12,3ఎక్స్ ఆప్టికల్ జూమ్ క్వాడ్ రియర్ కెమెరా 10ఎంపీ సెల్ఫీ కెమెరా 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ రెండు ఫోన్లను రెండువేరియంట్లలో లాంచ్ చేసింది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ 1 టీబీ దాకా స్టోరేజ్‌ను విస్తరించుకునే అవకాశం అలాగే ఈ ఫోన్లలో ఆయా దేశాల మార్కెట్లకు అనుగుణంగా స్నాప్‌డ్రాగన్ 865 లేదా ఎగ్జినోస్ 990 ప్రాసెసర్లు వినియోగదారులకు లభిస్తాయి. ఈ ఫోన్లలోఅందిస్తున్నారు. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్, శాంసంగ్ బిక్స్బీ, హెల్త్, శాంసంగ్ పే యాప్‌లు.. తదితర ఇతర ఫీచర్లను కూడా ఈ ఫోన్లలో యూజర్లు పొందవచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఎస్20 అల్ట్రా ఫీచర్లు 6.97 అంగుళాల క్వాడ్ హెచ్డీ ప్లస్ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ ఇన్ఫినిటీ-ఓ డిస్ప్లే స్నాప్‌డ్రాగన్ 865 లేదా ఎగ్జినోస్ 990 ప్రాసెసర్ 3200 × 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 10 12/16 జీబీ ర్యామ్, 128/512 జీబీ స్టోరేజ్ 108+12 + 48 ట్రిపుల్ రియర్ కెమెరా 40 ఎంపీ సెల్పీ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ధరలు గెలాక్సీ ఎస్20 4జి -981 డాలర్లు రూ.69,980 గెలాక్సీ ఎస్20 5జి - 999 డాలర్లు సుమారు.రూ.71,325 గెలాక్సీ ఎస్20 ప్లస్ 5జి 128జీబీ వేరియంట్ 1199 డాలర్లుసుమారు రూ.85,590 గెలాక్సీ ఎస్20 ప్లస్ 5జి 512జీబీ - 1299 డాలర్లు సుమారు. రూ.92,720 గెలాక్సీ ఎస్20 అల్ట్రా 5జి 12జీబీ + 128జీబీ - 1399 డాలర్లు సుమారు రూ.99,840 గెలాక్సీ ఎస్20 అల్ట్రా 5జి 16జీబీ + 512జీబీ - 1499 డాలర్లు సుమారు రూ.1,06,975 ఈ స్మార్ట్పోన్లు అన్నింటిలోనూ కెమెరాల ద్వారా యూజర్లు ఏకంగా 8కె రిజల్యూషన్‌తో అద్భుతమైన క్వాలిటీ వీడియోలను చాలా సులభంగా షూట్ చేసుకోవచ్చు. ఈ నెల 21వ తేదీ నుంచి ప్రీ ఆర్డర్లు ప్రారంభం కానుండగా, మార్చి 6వ తేదీ నుంచి వీటిని మార్కెట్లో విక్రయిస్తారు. అయితే ఈ ఫోన్లను భారత్‌లో ఎప్పుడు విడుదల చేసేదీ, వాటి ధర వివరాలను శాంసంగ్ ఇంకా వెల్లడించలేదు. చదవండి: శాంసంగ్ జెడ్ ప్లిప్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ దిగొస్తున్న పుత్తడి ధర -
స్టాక్మార్కెట్లో ‘కొత్త ఏడాది’ కళ
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ముగిసాయి. ఆరంభం నుంచి పాజిటివ్‌గా ఉన్న సూచీలు చివరివరకూ అదే జోరును కంటిన్యూ చేశాయి. ఆఖరి గంటలో పుంజుకున్న కొనుగోళ్లతో జనవరి డెరివేటివ్ సీరిస్ తొలిరోజును ఉత్సాహవంతంగా ముగించాయి. సెన్సెక్స్ 411 పాయింట్లు జంప్ చేసి 41575 వద్ద, నిఫ్టీ 119 పాయింట్లు లాభపడి 12245 వద్ద స్థిరపడ్డాయి. బ్యాంకింగ్ రంగ లాభాలో బ్యాంకు నిఫ్టీ కూడా 424 పాయింట్లు లాభపడింది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాలో ముగిసాయి. కోల్ ఇండియా, యాక్సిస్ బ్యాంకు, బీపీసీఎల్, ఎస్బీఐ, పవర్ గ్రిడ్ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. యస్ బ్యాంకు, విప్రో, బ్రిటానియీ, కోటక్ కమహీంద్ర, టీసీఎస్ తదితర షేర్లు స్వల్పంగా నష్టపోయాయి. -
హానర్ పవర్ఫుల్ 5జీ స్మార్ట్ఫోన్లు లాంచ్
బీజింగ్ : చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు హానర్ సంస్థ పవర్ఫుల్ స్మార్ట్ఫోన్లను బీజింగ్‌లో లాంచ్ చేసింది. వ్యూ 30 సిరీస్‌లో మొదటి డ్యూయల్ మోడ్ 5 జి స్మార్ట్ఫోన్లను మంగళవారం ఆవిష్కరించింది. వ్యూ 30, వ్యూ 30 ప్రో పేరుతో లాంచ్ చేసిన ఈ ఫోన్లలో 5జీ/4జీ 4 జి డ్యూయల్ మోడ్‌ను అమర్చింది. అయితే అందుబాటులో ఉన్న నెట్వర్క్ ఆధారంగా వినియోగదారులు 4జీ/5జీ నెట్‌వర్క్‌కు మారవచ్చని కంపెనీ తెలిపింది. తమ హానర్ వ్యూ 30 సిరీస్ ఇప్పటి వరకు అత్యంత వినూత్నమైన స్మార్ట్‌ఫోన్లనీ ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రజల రోజువారీ జీవితాలపై అద్భుతమైన ప్రభావాన్ని చూపుతుందనీ హానర్ప్రెసిడెంట్ జార్జ్ జావో వెల్లడించారు. వ్యూ 30 ప్రో ఫీచర్లు 6.57-అంగుళాల ఎఫ్‌హెచ్‌డి + ఫుల్‌వ్యూ డిస్ప్లే 7ఎన్ఎమ్ ప్రాసెస్-బేస్డ్ కిరిన్ 990 చిప్సెట్ ఆండ్రాయిడ్ 10 ఓఎస్ 40+12+8 ఎంపీ ట్రిపుల్ రియల్ కెమెరా 32 +8 ఎంపీ సెల్ఫీకెమెరా 4100 ఎంఏహెచ్ బ్యాటరీ ధరలు : వ్యూ 30 6జీబీ ర్యామ్ / 128 జీబీ స్టోరేజ్ , 8జీబీ ర్యామ్ / 128జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో లభించేనుంది. వీటి ధరలు వరుసగా 3,299 యువాన్లు (సుమారు రూ. 33,600). 3699 యువాన్లు ( సుమారు రూ. 37,700) వ్యూ 30 ప్రో 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర 3,899 యువాన్లు (సుమారు రూ.39,700) 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 4,199 యువాన్లు (సుమారు రూ. 42,800). వ్యూ 30 ప్రో డ్యూయల్ పంచ్ హోల్, 40వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 27వా వైర్లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. మరోవైపు, వ్యూ 30 దాదాపు ఇలాంటి ఫీచర్లతోనే డ్యుయల్ కెమరాల్లో 8ఎంపీ సూపర్ వైడ్ యాంగిల్ సెన్సార్ సెల్ఫీ కెమెరా, 4,200 ఎంఏహెచ్ బ్యాటరీతో లాంచ్ చేసింది. వీటితో పాటు, మ్యాజిక్‌బుక్14 , మ్యాజిక్‌బుక్15 పేరుతో సరికొత్త మ్యాజిక్‌బుక్ సిరీస్‌ను హానర్ ఆవిష్కరించింది. -
అద్భుత ఫీచర్లతో రెడ్మి నోట్ 8 సిరీస్ ఫోన్లు
బీజింగ్ : ఇటీవల టీజర్‌తో సందడి చేసిన షావోమీ సబ్ బ్రాండ్ రెడ్మి నోట్ స్మార్ట్ఫోన్లు బీజింగ్‌లో లాంచ్ అయ్యాయి. రెడ్మి నోట్ 8 సిరీస్‌లో రెడ్మి నోట్ 8, రెడ్ మి నోట్ 8 ప్రొ పేరుతో, అద్భుత ఫీచర్లతో గురువారం వీటిని తీసుకొచ్చింది. బడ్జెట్ ధరల్లో వీటిని ఆవిష్కరించింది. వీటితోపాటు రెడ్మి టీవీని, నోట్‌బుక్‌ను కూడా కంపెనీ లాంచ్ చేసింది. రెడ్మి నోట్లో క్వాల్కం స్నాప్‌డ్రాగన్ 665 సాక్, నోట్ 8 ప్రోలో మీడియా టెక్ హీలియో ప్రాసెసర్‌ను అందించింది. నోట్ 8 ప్రోలో మీడియా టెక్ గేమింగ్ ప్రత్యేకమైన చిప్ సెట్ ప్రాసెసర్, 64 ఎంపీ 25ఎక్స్ జూమ్, క్వాడ్‌కెమెరా ప్రధాన ఆకర్షణ. అలాగే 20ఎక్స్ జూమ్, క్వాడ్ కెమెరా సెటప్‌తో . రెడ్మి నోట్ 8 ప్రో కెమెరా, ఫోటోగ్రఫీ అంటే ఇష్టపడే వినియోగదారులకు ప్రత్యేకంగా ఆకట్టుకోనుంది. అంతేకాదు 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సెన్సార్‌తో వచ్చిన మొదటి ఫోన్ రెడ్మి నోట్ 8ప్రొ. రెడ్మి నోట్ 8 ఫీచర్లు 6.39 అంగుళాల డిస్ప్లే 1080x2340 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 9 పై క్వాల్కం స్నాప్‌డ్రాగన్ 665 సాక్ 4 జీబీ ర్యామ్ , 64 జీబీ స్టోరేజ్ 13 ఎంపీ సెల్ఫీ కెమెరా 48+ 8 + 2 +2 ఎంపీ రియర్ క్వాడ్ కెమెరా 4000ఎంఏహెచ్ బ్యాటరీ రెడ్‌మినో ట్ 8 ప్రో ఫీచర్లు 6.53 అంగుళాల డిస్ప్లే 1080x2340 పిక్సెల్స్ రిజల్యూషన్ మీడియా టెక్ హీలియో ప్రాసెసర్ జీ90టీ ఆండ్రాయిడ్ 9 పై 6జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ 20 ఎంపీ సెల్ఫీ కెమెరా 64+8+2+2 ఎంపీ క్వాడ్ రియర్ కెమెరా 4500ఎంఏహెచ్ బ్యాటరీ ధరలు మూడు వేరియంట్లలో తీసుకొచ్చిన రెడ్మి నోట్ 8 ధరలు సుమారుగా 4జీబీ/64జీబీ ధర రూ.10,000 6జీబీ/64జీబీ ధర రూ.12,000 6జీబీ/128జీబీ ధర రూ.14,000 ఫస్ట్ సేల్ సెప్టెంబరు 7 నుంచి ప్రారంభం మూడు వేరియంట్లలో తీసుకొచ్చిన రెడ్మినోట్ 8 ప్రొ ధరలు సుమారుగా 6జీబీ/64జీబీ ధర రూ.14,000 6జీబీ/128జీబీ ధర రూ.16,000 8జీబీ/128జీబీ ధర రూ.18,000 ఫస్ట్ సేల్ సెప్టెంబరు 3 నుంచి ప్రారంభం. -
మార్కెట్లోకి రెడ్మి నోట్ 6 ప్రో
న్యూఢిల్లీ: చైనాకి చెందిన ఎలక్ట్రానిక్స్ సంస్థ షావోమీ తాజాగా భారత మార్కెట్లో రెడ్మి నోట్ 6 ప్రో ఫోన్‌ను ఆవిష్కరించింది. ఇందులో 4జీబీ ర్యామ్, 64జీబీ మెమరీ ఉండే ఫోన్ ధర రూ.13,999 కాగా, 6జీబీ + 64జీబీ వేరియంట్ ధర రూ. 15,999గా ఉంటుంది. నవంబర్ 23న (శుక్రవారం) మి.డాట్‌కామ్, ఫ్లిప్‌కార్ట్, మి హోమ్ స్టోర్స్‌లో బ్లాక్ ఫ్రైడే సేల్ సందర్భంగా రూ.1,000 డిస్కౌంట్‌పై ఇవి లభిస్తాయి. ముందు రెండు (12 ఎంపీ+5ఎంపీ), వెనుక రెండు (20ఎంపీ+2ఎంపీ) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలతో మొత్తం నాలుగు కెమెరాల సెటప్ ఇందులో ఉంటుంది. 6.26 అంగుళాల డిస్ప్లే, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 636 ఆక్టా కోర్ ప్రాసెసర్, 64 జీబీ ఇంటర్నల్ మెమరీ, 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్స్ ఈ ఫోన్ ప్రత్యేకతలు. 4జీబీ, 6జీబీ ర్యామ్‌లలో రెడ్మి నోట్ 6 ప్రో లభిస్తుందని షావోమీ వైస్ ప్రెసిడెంట్ మను జైన్ తెలిపారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ క్షీణించడంతో తమ ఉత్పత్తులపై ధరలపరంగా ఒత్తిడి ఉంటోందని ఆయన చెప్పారు. తమ ఫోన్లు, పవర్ బ్యాంకులను భారత్‌లోనే తయారు చేస్తున్నప్పటికీ, అవసరమైన ముడి సరుకు, కీలకమైన ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ అసెంబ్లీ (పీసీబీఏ)ని డాలర్లలోనే కొనుగోలు చేయాల్సి వస్తుండటమే ఇందుకు కారణమన్నారు. -
ఈ బ్రాండ్ న్యూ సిరీస్ ప్రమోటర్‌గా కత్రీనా
సాక్షి, ముంబై: చైనా మొబైల్ మేకర్ షావోమి భారత మార్కెట్లో తన దూకుడును మరింత పెంచేంది. తాజాగా వై1 సిరీస్‌లో సరికొత్త బిగ్ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. ఇ-తరాన్ని లక్ష్యంగా చేసుకుని, బ్రాండ్ కొత్త సిరీస్‌ను ప్రత్యేకంగా భారత మార్కెట్లో ఆవిష్కరించింది వై 1 సిరీస్‌లో మూడు వైవిధ్యమైన డివైస్‌లను ఆకర్షణీయమైన ఫీచర్లు, ఆకట్టుకునే ధరలో, వినూత్న రంగుల్లో విడుదల చేసింది. అలాగే నవంబర్ మధ్యనాటికి ఎంఐయుఐ అప్‌గ్రేడ్ కూడా లభించనుందని ప్రకటించింది. అంతేకాదు వీటికి బాలీవుడ్ భామ కత్రీనా కైఫ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనుంది. కత్రీనా సైన్ చేసిన రెడ్ మి వై1 మొబైల్స్‌ను ప్రత్యేకంగా అందించనుంది. రెడ్ మి వై 1, 3జీబీ/ 32 జీబీ వేరియంట్ రూ .8,999, 4జీబీ /64జీబీ వేరియంట్ కోసం రూ. 10,999లుగా నిర్ణయించింది. అలాగే రెడ్మి వై 1 లైట్ పేరుతో బడ్జెట్‌ధరలో రూ .6,999 కే అందిస్తోంది. నవంబరు 8 మధ్నాహ్నం 12గంటలనుంచి ఎంఐ, అమెజాన్‌లలో విక్రయానికి లభిస్తుందని తెలిపింది. ఈ డివైస్‌తో ఇన్ఫ్రారెడ్ రిమోట్‌ను కూడా ఉచితంగా అందిస్తోంది. రెడ్ మి వై 1 ఫీచర్స్ 5.5 అంగుళాల హెచ్డీ స్క్రీన్ కార్నింగ్ గొర్రిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఫ్లాష్ సెల్ఫీ కెమెరా 3080ఎంఏహెచ్ బ్యాటరీ రెడ్ మి వై1 లైట్ ఫీచర్స్ 5.5 అంగుళాల హెచ్డీ స్క్రీన్, కార్నింగ్ గొర్రిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 425 ప్రాసెసర్ 2జీబీ ర్యామ్ 16 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్ 13 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా 3080 ఎంఏహెచ్ బ్యాటరీ Presenting Katrina Kaif as the face of our brand new series – Redmi Y1. RT to win a personally signed #Redmi Y1 by Katrina Kaif. pic.twitter.com/L05X0bcnhc — Redmi India (@RedmiIndia) November 2, 2017 -
కొత్త రాష్ట్రం.. కొత్త వాహనం.. కొత్త నంబర్..
ఖమ్మం క్రైం: తెలంగాణ రాష్ట్రంలో కొత్త సిరీస్‌తో వాహనాల రిజిస్ట్రేషన్లు బుధవారం ప్రారంభమయ్యాయి. రాష్ట్రం ఏర్పాటుకు ముందు కొనుగోలు చేసిన వాహనాలకు కూడా వాహనదారులు ఇప్పటివరకూ రిజిస్ట్రేషన్ చేయించకుండా... ‘కొత్త రాష్ట్రం.. కొత్త నంబర్..’ కోసం ఇన్నాళ్లూ వేచి ఉన్నారు. జిల్లాకు కేటాయించిన టీఎస్ 04 సిరీస్‌తో మొదటి రోజున జిల్లాలో మొత్తం 467 కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్ జరిగింది. ఖమ్మం ప్రాంతీయ రవాణా కార్యాలయంలో 201 నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలకు, 134 ట్రాన్స్పోర్ట్ వాహనాలకు, సత్తుపల్లిలో 104 నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలకు, కొత్తగూడెంలో 28 నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలకు రిజిస్ట్రేషన్ జరిగింది. ఖమ్మంలో టీఎస్ 04 ఈఏ 0001 నుంచి రిజిస్ట్రేషన్ మొదలైంది. ఈ నంబరును పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి రూ.50వేలు చెల్లించి స్వంతం చేసుకున్నారు. 0005, 0007 నంబర్లపై ఎవరూ ఆసక్తి చూపలేదు. సత్తుపల్లిలో టీఎస్ 04 ఈసీ 0001 నుంచి రిజిస్ట్రేషన్ మొదలైంది. టీఎస్ 04 ఈసీ 0001 నంబర్‌ను డాక్టర్ రాంవరప్రసాద్ తీసుకున్నారు. ఇక్కడ కూడా 0005, 0007 నంబర్ ఎవరూ తీసుకోలేదు. 45వ నంబర్‌కు ఇద్దరు పోటీపడ్డారు. 666 నబర్‌ను ఆర్.రంగరాజు అనే వ్యాపారి రూ.11,100 చెల్లించి తీసుకున్నారు. కొత్తగూడెంలో టీఎస్ 04 ఈబీ 0001 నంబర్‌తో రిజిస్ట్రేషన్ మొదలైంది. ఈ నంబర్‌ను ఇంకా ఎవరూ తీసుకోలేదు. నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలకు టీఎస్ 04 ఈఏ 0001, ట్రాన్స్పోర్ట్ వాహనాలకు టీఎస్ 04 యూఏ 0001 నంబర్లను కేటాయించారు. ఫ్యాన్సీ నంబర్లపై తగ్గిన మోజు గతంలో ఫ్యాన్సీ నంబర్లపై వాహనదారులు ఎక్కువ మోజు చూపేవారు. రిజిస్ట్రేషన్ ప్రారంభమైన మొదటి రోజు మాత్రం ఫ్యాన్సీ నంబర్లు తీసుకోవడంలో వాహనదారులు అంతగా ఆసక్తి చూపలేదు. ఫ్యాన్సీ నంబర్లు తీసుకునేందుకు కొంత నగదు చెల్లించాల్సుంటుంది. కొత్త రాష్ట్రంలో.. కొత్త వాహనాలకు ఫ్యాన్సీ నంబర్లు ఎక్కువగా తీసుకుంటారని, ఎక్కువ ఆదాయం వస్తుందని రవాణ శాఖాధికారులు భావించారు. కానీ ఎక్కువమంది ఆసక్తి చూపకపోవడంతో కొంత ఆదాయం తగ్గేలా ఉందని అధికారులు చెబుతున్నారు. సత్తుపల్లి రవాణా శాఖ కార్యాలయానికి రికార్డుస్థాయి ఆదాయం సత్తుపల్లి టౌన్: సత్తుపల్లి రవాణా శాఖ కార్యాల యం బుధవారం రికార్డు స్థాయిలో ఆదాయా న్ని ఆర్జించింది. టీఎస్ సిరీస్ గెజిట్ నోటిఫికేషన్ జారీతో వాహనాల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. టీఎస్ సిరీస్ నంబర్లకు గిరాకీ ఏర్పడింది. సాధారణ రోజుల్లో రోజువారీగా కొత్త వాహనాల రిజి స్ట్రేషన్లు 10 నుంచి 15 వరకు మాత్రమే జరుగుతుం టాయి. వీటి ద్వారా రోజుకు 30 నుంచి 40వేల మేర ఆదాయం లభిస్తుంది. కానీ, బుధవారం ఒక్క రోజు లోనే గతంలో ఎన్నడూ లేనంతగా రూ.2,13,665 ఆదాయం వచ్చింది. టీఎస్ 04 ఈసీ0001 నంబర్‌తో వాహనాల రిజిస్ట్రేషన్ బుధవారమే ప్రారంభమైంది. తొలి నంబర్‌ను వేలం పాటలో రూ.50వేలకు ఓ వ్యక్తి పాడుకున్నారు. స్పెషల్ నంబర్లకు ఆన్లైన్లో జరిగిన వేలం పాటలో అనేకమంది ఉత్సాహంగా పాల్గొన్నారు. 0666 నంబర్‌ను ఓ వ్యక్తి రూ.30వేలకు స్వంతం చేసుకున్నారు. తొలి రోజే 90 వాహనాలకు నంబర్లను ఎంవీఐ శంకర్ కేటాయించారు. ఇందులో 21 నంబర్లను వేలం పాట ద్వారా, మిగతా వాటిని సాధారణ పద్ధతిలో కేటాయించారు. -
ప్రారంభమైన టీఎస్ సిరీస్
సాక్షి, సిటీబ్యూరో: కొత్త రాష్ట్రంలో కొత్త సీరిస్తో వాహనాల రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. పక్షం రోజుల తరువాత రిజిస్ట్రేషన్లు మొదలు కావడంతో వాహనదారుల్లో ఆనందం వ్యక్తమైంది. మొన్నటి వరకు వాహనాల సిరీస్, కోడ్ విషయంలో స్పష్టత లేకపోవడంతో కొత్తగా వాహనాలు కొనుగోలు చేసిన వారికి నిరీక్షణ తప్పలేదు. కొత్త సిరీస్ రిజిస్ట్రేషన్లకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వాహనదారులు ఉత్సాహంగా ఆర్టీఏ కార్యాలయాలకు చేరుకున్నారు. మొదటి రోజైన బుధవారం గ్రేటర్ పరిధిలో 967 కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్లు పూర్తి చేశారు. విరామం తరువాత రిజిస్ట్రేషన్లు ప్రారంభం కావడంతో నగరంలోని ఖైరతాబాద్‌తోపాటు ఉప్పల్, అత్తాపూర్, మేడ్చెల్, సికింద్రాబాద్, మెహదీపట్నం తదితర ఆర్టీఏ కార్యాలయాల్లో వాహనదారుల రద్దీ కనిపించింది. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో మొట్టమొదటి నెంబర్ ‘టీఎస్ 09 ఈఏ 0002’ను నగరంలోని రహమత్‌నగర్‌కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మేడపాటి శివారెడ్డి తన స్విఫ్ట్‌డిజైర్ కోసం సొంతం చేసుకున్నారు. మరో నెంబర్ ‘టీఎస్ 09 ఈఏ 0003’ వేదాంత లైఫ్‌సెన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ దక్కించుకుంది. ‘టీఎస్ 09 ఈఏ 0004’ నెంబర్‌ను ఎన్.సుధాకర్ అనే వ్యక్తి తన హోండా యాక్టీవాకు తీసుకున్నారు. కొత్త సిరీస్ ప్రారంభమైనప్పటికీ వాహనదారుల్లో సరైన అవగాహన లేక ఫ్యాన్సీ నెంబర్లకు డిమాండ్ కనిపించలేదు. సాధారణ ఫీజులు, తత్కాల్ ఫీజులపైనే వాహనదారులు తమకు కావలసిన నెంబర్లను దక్కించుకున్నారు. ‘టీఎస్09 ఈఏ 369’ కోసం ఓ వాహనదారుడు రూ.70 వేలు వేలం ద్వారా చెల్లించగా ‘టీఎస్ 09 ఈఏ 18’ కోసం మరో వాహనదారుడు రూ.10 వేలు చెల్లించారు. ఫ్యాన్సీ నెంబర్లు సర్కార్కే.. తెలంగాణ రాష్ర్టంలోని తొలి సిరీస్‌లో ఫ్యాన్సీ నెంబర్లను ప్రభుత్వం తన వద్దే ఉంచుకుంది. ప్రభుత్వ వాహనాల కోసం వీటిని వినియోగించనున్నట్టు రవాణా అధికారులు తెలిపారు. వాహనదారులు అత్యధిక ప్రాధాన్యతనిచ్చే ‘1, 11, 111, 6, 66, 666, 9, 99, 999’ వంటి నెంబర్లు సర్కార్ వాహనాలకే సొంతం కానున్నాయి. మొట్టమొదటి సిరీస్ కావడంతో ప్రభుత్వం ఈ నెంబర్లకు అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. పాత వాహనాలపై ప్రతిష్టంభన.. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైనా పాత వాహనాలపై నెలకొన్న ప్రతిష్టంభన మాత్రం తొలగిపోలేదు. ‘ఏపీ’ నుంచి ‘టీఎస్’కు మారిన దృష్ట్యా అన్ని వాహనాలు తప్పనిసరిగా ఇందుకు అనుగుణంగా నెంబర్ ప్లేట్లను సవ రించుకోవాల్సి ఉంటుంది. రంగారెడ్డి జిల్లా పరిధిలో జిల్లా కోడ్ నెంబర్లు కూడా మారిపోతాయి. ఈ అంశంపై స్పష్టతకు మరో వారం, పది రోజులు పట్టవచ్చని హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ ర ఘునాథ్ ‘సాక్షి’తో చెప్పారు. రంగారెడ్డి పరిధిలో 482 రిజిస్ట్రేషన్లు అత్తాపూర్: రంగారెడ్డి జిల్లా పరిధిలోని వివిధ ఆర్టీఏ కార్యాలయాల్లో బుధవారం 482 వాహనాలు రిజిస్ట్రేషన్ అయినట్లు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సి.రమేశ్ తెలిపారు. అత్తాపూర్ ఆర్టీఏ కార్యాలయంలో 116, ఇబ్రహీంపట్నంలో 174, ఉప్పల్‌లో 93, మేడ్చల్‌లో 99 వాహనాలు రిజిస్ట్రేషన్ అయినట్టు చెప్పారు. ఉప్పల్‌లో టీఎస్ 08 సిరీస్.. ఉప్పల్: రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వాహనదారులతో ఉప్పల్ ఆర్టీఏ కార్యాలయం కిక్కిరిసిపోయింది. టీఎస్ 08 ఈఏ 0001, ట్రాన్స్‌పోర్టు వాహనాల సిరీస్ టీఎస్ 08 యూఏ 0001తో ప్రారంభమయ్యాయి. ఉప్పల్ పారిశ్రామికవాడకు చెందిన దోషి జమ్స్ అండ్ జ్యువెలర్స్ పేరిట ‘టీఎస్ 08 ఈఏ 0001’ నెంబర్‌ను రూ. 50 వేలు చెల్లించి రిజిస్ట్రేషన్ నంబర్‌ను పొందాడు. సికింద్రాబాద్‌లో.. కంటోన్మెంట్: సికింద్రాబాద్ ఆర్టీఏ పరిధిలో తొలి నెంబర్‌ను హబ్సిగూడకు చెందిన వ్యాపారి శ్రీధర్‌రెడ్డి దక్కించుకున్నారు. విఖ్యాత్ ఇన్ఫ్రా పేరిట తీసుకున్న బెంజి కారుకు టీఎస్10ఈఏ 0009 నెంబర్‌కు పోటీ లేకపోవడంతో కేవలం రూ.50 వేలకే దక్కించుకున్నారు. -
వాహన రిజిస్ట్రేషన్లు షురూ
టీఎస్ 02 ఈఏ, ఈబీ, ఈసీ, ఈడీ సిరీస్‌లు - ఫ్యాన్సీ నెంబర్లకు పాత పద్ధతే - రిజర్వయిన 02 నంబర్లు - ఆర్టీవో దుర్గప్రమీల తిమ్మాపూర్ : జిల్లాలో కొత్త సిరీస్‌తో వాహన రిజిష్ట్రేషన్ల ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమైంది. జిల్లాకు 02 కోడ్‌ను కేటాయించడంతో టీఎస్02 పేర రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని ఆర్టీఏ కార్యాలయంలో టీఎస్ 02 ఈఏ సిరీస్‌తో మొదలు కాగా, జగిత్యాల ఆఫీసులో టీఎస్ 02 ఈబీ...తో, పెద్దపల్లి ఆఫీసులో టీఎస్ 02 ఈసీ...తో, కోరుట్ల ఆఫీసులో టీఎస్ 02 ఈడీ...తో నాన్ ట్రాన్స్‌పోర్టు వాహనాల రిజిష్ట్రేషన్లు ప్రారంభించారు. జిల్లాలో ట్రాన్స్‌పోర్టు వాహనాలకు, మాక్సీ క్యాబ్‌లకు టీఎస్ 02 యూఏతో రిజిస్ట్రేషన్ మొదలుపెట్టారు. పోలీసు శాఖ వాహనాలకు టీఎస్ 02 పీ.., ఆర్టీసీ వాహనాలకు టీఎస్ 02 జెడ్...,ను కేటాయిస్తూ పాత నంబర్ల తర్వాతే నంబర్లను కేటాయించాలని ఉత్తర్వులో పేర్కొన్నట్లు ఆర్టీవో దుర్గప్రమీల తెలిపారు. 01 ఫ్యాన్సీ నంబర్‌కు రూ.50వేలు చెల్లించాల్సి ఉండగా ఎవరూ తీసుకోలేదు. దీని తర్వాత 02 నంబర్ కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల కేంద్రాల్లో రిజర్వేషన్ అయింది. కరీంనగర్లో టీఎస్ 02 ఈఏ 0002 నంబర్‌ను వరద శేషయ్య, జగిత్యాలలో టీఎస్ 02 ఈబీ 0002 నంబర్‌ను అర్చన, పెద్దపల్లిలో టీఎస్ 02 ఈసీ 0002 నంబర్‌ను బి.స్రవంతి రిజర్వు చేసుకున్నారు. అలాగే కరీంనగర్లో 06, 07 నంబర్లు రూ.పది వేలకు, 11 నంబర్ రూ.5వేలకు రిజర్వ్ అయ్యాయి. ట్రాన్స్‌పోర్టుకు సంబంధించి టీఎస్ 02 యూఏ 0002 నంబర్ అబ్దుల్ షకీల్‌కు కేటాయించినట్లు ఆర్టీవో తెలిపారు. టీఎస్ 02 ఈఏ 0333 నంబర్ గంగాధరకు చెందిన కొత్త జైపాల్‌రెడ్డి రూ.30వేలకు అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు ఆమె తెలిపారు. నంబర్ రిజర్వేషన్ ప్రక్రియలో పాత పద్ధతినే పాటిస్తున్నామని పేర్కొన్నారు. -
ప్రారంభమైన టీఎస్ సిరీస్
సాక్షి, హైదరాబాద్: కొత్త రాష్ట్రంలో కొత్త సీరిస్తో వాహనాల రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. పక్షం రోజుల తరువాత రిజిస్ట్రేషన్లు మొదలు కావడంతో వాహనదారుల్లో ఆనందం వ్యక్తమైంది. మొన్నటి వరకు వాహనాల సిరీస్, కోడ్ విషయంలో స్పష్టత లేకపోవడంతో కొత్తగా వాహనాలు కొనుగోలు చేసిన వారికి నిరీక్షణ తప్పలేదు. కొత్త సిరీస్ రిజిస్ట్రేషన్లకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వాహనదారులు ఉత్సాహంగా ఆర్టీఏ కార్యాలయాలకు చేరుకున్నారు. మొదటి రోజైన బుధవారం గ్రేటర్ పరిధిలో 967 కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్లు పూర్తి చేశారు. విరామం తరువాత రిజిస్ట్రేషన్లు ప్రారంభం కావడంతో నగరంలోని ఖైరతాబాద్‌తోపాటు ఉప్పల్, అత్తాపూర్, మేడ్చెల్, సికింద్రాబాద్, మెహదీపట్నం తదితర ఆర్టీఏ కార్యాలయాల్లో వాహనదారుల రద్దీ కనిపించింది. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో మొట్టమొదటి నెంబర్ ‘టీఎస్ 09 ఈఏ 0002’ను నగరంలోని రహమత్‌నగర్‌కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మేడపాటి శివారెడ్డి తన స్విఫ్ట్‌డిజైర్ కోసం సొంతం చేసుకున్నారు. మరో నెంబర్ ‘టీఎస్ 09 ఈఏ 0003’ వేదాంత లైఫ్‌సెన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ దక్కించుకుంది. ‘టీఎస్ 09 ఈఏ 0004’ నెంబర్‌ను ఎన్.సుధాకర్ అనే వ్యక్తి తన హోండా యాక్టీవాకు తీసుకున్నారు. కొత్త సిరీస్ ప్రారంభమైనప్పటికీ వాహనదారుల్లో సరైన అవగాహన లేక ఫ్యాన్సీ నెంబర్లకు డిమాండ్ కనిపించలేదు. సాధారణ ఫీజులు, తత్కాల్ ఫీజులపైనే వాహనదారులు తమకు కావలసిన నెంబర్లను దక్కించుకున్నారు. ‘టీఎస్09 ఈఏ 369’ కోసం ఓ వాహనదారుడు రూ.70 వేలు వేలం ద్వారా చెల్లించగా ‘టీఎస్ 09 ఈఏ 18’ కోసం మరో వాహనదారుడు రూ.10 వేలు చెల్లించారు. ఫ్యాన్సీ నెంబర్లు సర్కార్కే.. తెలంగాణ రాష్ర్టంలోని తొలి సిరీస్‌లో ఫ్యాన్సీ నెంబర్లను ప్రభుత్వం తన వద్దే ఉంచుకుంది. ప్రభుత్వ వాహనాల కోసం వీటిని వినియోగించనున్నట్టు రవాణా అధికారులు తెలిపారు. వాహనదారులు అత్యధిక ప్రాధాన్యతనిచ్చే ‘1, 11, 111, 6, 66, 666, 9, 99, 999’ వంటి నెంబర్లు సర్కార్ వాహనాలకే సొంతం కానున్నాయి. మొట్టమొదటి సిరీస్ కావడంతో ప్రభుత్వం ఈ నెంబర్లకు అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. పాత వాహనాలపై ప్రతిష్టంభన.. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైనా పాత వాహనాలపై నెలకొన్న ప్రతిష్టంభన మాత్రం తొలగిపోలేదు. ‘ఏపీ’ నుంచి ‘టీఎస్’కు మారిన దృష్ట్యా అన్ని వాహనాలు తప్పనిసరిగా ఇందుకు అనుగుణంగా నెంబర్ ప్లేట్లను సవ రించుకోవాల్సి ఉంటుంది. రంగారెడ్డి జిల్లా పరిధిలో జిల్లా కోడ్ నెంబర్లు కూడా మారిపోతాయి. ఈ అంశంపై స్పష్టతకు మరో వారం, పది రోజులు పట్టవచ్చని హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ ర ఘునాథ్ ‘సాక్షి’తో చెప్పారు. ‘టీఎస్‌తో రిజిస్ట్రేషన్ అయ్యే కొత్త వాహనాలకు మాత్రం ఎప్పటికప్పుడు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తీసుకునే విధంగా చర్యలు చేపట్టినట్టు తెలిపారు. రంగారెడ్డి పరిధిలో 482 రిజిస్ట్రేషన్లు అత్తాపూర్: రంగారెడ్డి జిల్లా పరిధిలోని వివిధ ఆర్టీఏ కార్యాలయాల్లో బుధవారం 482 వాహనాలు రిజిస్ట్రేషన్ అయినట్లు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సి.రమేశ్ తెలిపారు. అత్తాపూర్ ఆర్టీఏ కార్యాలయంలో 116, ఇబ్రహీంపట్నంలో 174, ఉప్పల్‌లో 93, మేడ్చల్‌లో 99 వాహనాలు రిజిస్ట్రేషన్ అయినట్టు చెప్పారు. ఉప్పల్‌లో టీఎస్ 08 సిరీస్.. ఉప్పల్: రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వాహనదారులతో ఉప్పల్ ఆర్టీఏ కార్యాలయం కిక్కిరిసిపోయింది. టీఎస్ 08 ఈఏ 0001, ట్రాన్స్‌పోర్టు వాహనాల సిరీస్ టీఎస్ 08 యూఏ 0001తో ప్రారంభమయ్యాయి. ఉప్పల్ పారిశ్రామికవాడకు చెందిన దోషి జమ్స్ అండ్ జ్యువెలర్స్ పేరిట ‘టీఎస్ 08 ఈఏ 0001’ నెంబర్‌ను రూ. 50 వేలు చెల్లించి రిజిస్ట్రేషన్ నంబర్‌ను పొందాడు. -
జిల్లాకు టీఎస్ 15 సిరీస్ కేటాయింపు
సంగారెడ్డి డివిజన్: మెదక్ జిల్లాకు వాహనాల రిజిస్ట్రేషన్ కోసం తెలంగాణ ప్రభుత్వం కొత్త సిరీస్‌ను కేటాయించింది. మెదక్ జిల్లాకు ఏపీ 23 స్థానంలో టీఎస్ 15 సిరీస్‌ను రవాణాశాఖ ఖరారు చేసింది. ఈమేరకు గురువారం ఉ త్తర్వులు జారీ అయ్యాయి. గత కొన్ని రోజులుగా మెద క్ జిల్లా వాస్తులు, వాహనదారులు జిల్లాకు ఏ కోడ్ వ స్తుందోనని ఎదరుచూస్తున్నారు. వారి ఎదురుచూపుల కు సమాధానం దొరికింది. ఇకపై నూతన వాహనాల రిజిస్ట్రేషన్ జిల్లాలో టీఎస్ 15 సిరీస్‌తో ప్రారంభం కా నున్నాయి. సోమవారం నుంచి కొత్త సిరీస్‌తో వాహనా ల రిజిష్ట్రేషన్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నా యి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన 2వతేదీ నుంచి జిల్లాలో తాత్కాలికంగా వాహనాల రిజిస్ట్రేషన్ నిలిపివేశారు. తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లాకు కొత్త సిరీస్ కేటాయించాల్సి ఉన్నందున రిజిస్ట్రేషన్ నిలిపివేశారు. జిల్లాలో ప్రతిరోజు సుమారు 70 నుంచి 80 కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ జరుగుతాయి. రవాణాశాఖ సంగారె డ్డి, సిద్దిపేట, పటాన్‌చెరులలో వాహనాల రిజిస్ట్రేషన్ చేస్తుంది. గత రెండు వారాలుగా జిల్లాలో సుమారు వెయ్యికిపైగా వాహనదారులు వాహనాల రిజిస్ట్రేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా ప్రభుత్వం జిల్లాకు టీఎస్ 15 సిరీస్ కేటాయించటంతో వాహనదారుల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. రెండు రోజుల్లో జిల్లాలో టీఎస్ 15 సిరీస్‌తో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే కొత్త వాహనాలు కొనుగోలు చేసిన వాహనదారులతోపాటు పాత వాహనదారులు సైతం రిజిస్ట్రేషన్ సిరీస్‌ను మార్చుకోవాల్సి ఉంటుంది. ఏపీ 23 స్థానే పాత వాహనదారులు తమ వాహనాల నెంబర్ ప్లేట్లపై టీఎస్ 15 రిజిస్ట్రేషన్ సిరీస్ చేర్చుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఉదాహారణకు జిల్లాకు చెందిన వాహనం ఏపీ 23 ఎఫ్ 5544 ఉంటే కొత్తగా వాహనం నెంబరు టీఎస్ 15 ఎఫ్ 5544 గా ఉంటుంది. సిరీస్ మారనున్న నేపథ్యంలో రవాణాశాఖ అధికారులు నామమాత్ర ఫీజు వసూలు చేసే అవకాశం ఉంటుంది. పాత వామనదారులు రిజిస్ట్రేషన్ సిరీస్ మార్చుకోవటంపై అధికారులు రెండు రోజుల్లో స్పష్టత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాగా ఉమ్మడి రాష్ట్రంలో ఫ్యాన్సీ నెంబర్ల కోసం డబ్బులు జమచేసిన వారికి టీఎస్ 15 సిరీస్‌తోనే ఫ్యాన్సీ నెంబరు కేటాయించవచ్చని తెలుస్తోంది. దీంతో ఫ్యాన్సీ నెంబరు కోసం డబ్బులు జమచేసిన వారు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని అధికారులు చెబుతున్నారు. వాహనాల రిజిస్ట్రేషన్ కొత్త సీరీస్ పై స్పష్టత రావటంతో అధికారులు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లపై అంశంపై దృష్టి సారించనున్నారు. -
వాహన రిజిస్ట్రేషన్లకు బ్రేక్
కొత్త సిరీస్‌పై తొలగని ప్రతిష్టంభన మార్గదర్శకాల కోసం ఎదురుచూపులు సాక్షి, సిటీబ్యూరో: కొత్త సిరీస్‌పై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేకపోవడంతో నగరంలో సోమవారం కూడా వాహనాల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లోనూ వాహనాల నమోదు ప్రక్రియకు బ్రేక్ పడింది. తెలంగాణ రాష్ట్రానికి ‘టీజీ’ సిరీస్ ఉంటుందని మొదట భావించినా.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ‘టీజీ’కి బదులు ‘టీఎస్’ ఉండాలని సూచించడంతో రవాణా అధికారులు మరోసారి ప్రతిపాదనలు రూపొందించి కేంద్రానికి పంపారు. టీఎస్ సిరీస్‌ను కేటాయిస్తూ కేంద్రం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి మార్గదర్శకాలు వెలువడలేదు. దీంతో సోమవారం కొత్త వాహనాల నమోదుకు సంబంధించి ఎలాంటి కార్యకలాపాలు జరగలేదు. రాష్ట్రానికి సంబంధించిన సిరీస్‌తో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కోడ్లపైనా స్పష్టత రావలసి ఉంది. ఒకవేళ కేంద్రం నుంచి కొత్త సిరీస్‌పై ఒకటి రెండు రోజుల్లో మార్గదర్శకాలు వెలువడినా జిల్లా కోడ్లు, ప్రాంతీయ రవాణా కేంద్రాల నెంబర్ల రూపకల్పనకు కొంత సమయం పట్టొచ్చని రవాణా అధికారులు అభిప్రాయపడుతున్నారు. కేంద్రం నుంచి మార్గదర్శకాలు రానిదే తాము అడుగు ముందుకు వేయలేమని రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. రోజు వెయ్యికిపైగా కొత్త వాహనాలు గ్రేటర్ పరిధిలోని పది ఆర్టీఏ కార్యాలయాల్లో రోజూ వెయ్యికి పైగా కొత్త వాహనాలకు శాశ్వత రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. వీటిలో 75 శాతం ద్విచక్ర వాహనాలే. కానీ రవాణాశాఖ సెంట్రల్ సర్వర్ నిలిపివేతతో గత నెల 31 నుంచే వాహనాల రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. సోమవారం రెండు రాష్ట్రాల్లోనూ సెంట్రల్ సర్వర్ పునరుద్ధరణ జరిగింది. లర్నింగ్ లెసైన్స్‌లు, శాశ్వత డ్రైవింగ్ లెసైన్స్‌లు, వాహనాల బదిలీ వంటి కార్యకలాపాలకు అనుగుణంగా రెండు రాష్ట్రాలకు సాంకేతిక పరిజ్ఞాన విస్తరణ జరిగినా తెలంగాణ రాష్ట్రానికి చెందిన సిరీస్‌పై స్పష్టత లేకపోవడం వల్ల నగరంలో వాహనాల నమోదు శాశ్వత నమోదు ఆగిపోయింది. మరోవైపు రాష్ర్ట అవతరణ ఉత్సవాల దృష్ట్యా పౌరసేవల కోసం వచ్చే వినియోగదారుల సంఖ్యా పలుచబడింది.