
హైదరాబాద్: వివో తన ఫ్లాగ్‌షిప్ ఎక్స్ సిరీస్‌లో ఎక్స్80, ఎక్స్80 ప్రో పేరుతో రెండు కొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. జీస్ కంపెనీ సహకారంతో ఈ ఫోన్లలో అత్యాధునిక కెమెరా టెక్నాలజీని వివో అందిస్తోంది. జీస్ జింబెల్ పోట్రయిట్ కెమెరా, 50 మెగా పిక్సల్ అల్ట్రా సెన్సింగ్ ఐఎంఎక్స్ 866 సెన్సార్ వీటిల్లో ఉంటుంది. క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెనరేషన్ 1 చిప్‌సెట్‌తో నడిచే ఈ ఫోన్లలో ఎన్నో కొత్త ఫీచర్లను వివో ప్రవేశపెట్టింది. ఎక్స్ 80 ప్రో 12జీబీ, 256జీబీ కాంబినేషన్ ధర ధర రూ.79,999. ఎక్స్ 80 8జీబీ, 128జీబీ ధర రూ.54,999. 12జీబీ, 256జీబీ ధర రూ.59,999. ఈ నెల 25 నుంచి విక్రయాలు మొదలు కానున్నట్టు వివో ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment