Flagship
-
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల కోసం ఉమ్మడి పోర్టల్
న్యూఢిల్లీ: వ్యవసాయం, ఆహార శుద్ధి శాఖలు అమలు చేస్తున్న మూడు ప్రతిష్టాత్మక పథకాలకు సంబంధించి ఉమ్మడి పోర్టల్.. ఆహార శుద్ధి పరిశ్రమలో సూక్ష్మ యూనిట్లకు మేలు చేస్తుందని కేంద్ర ఆహార శుద్ధి శాఖ ప్రకటించింది. అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఏఐఎఫ్), ప్రధాన మంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ (పీఎంఎఫ్ఎంఈ) పథకం, ప్రధాన్ మంత్రి కిసాన్ సంపద యోజన (పీఎంకేఎస్‌వై) పథకాలను ఈ నెల 21న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకాలు ఆహార శుద్ధి రంగంలో సూక్ష్మ యూనిట్లకు సాయంగా నిలుస్తాయన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశ్యంగా ఉంది. పీఎంఎఫ్ఎంఈ, పీఎంకేఎస్‌వై పథకాల కింద అర్హత కలిగిన లబ్ధిదారులు క్రెడిట్ లింక్డ్ సబ్సిడీకితోడు.. 3 శాతం వడ్డీ రాయితీ పొందొచ్చని ఆహార శుద్ధి శాఖ తెలిపింది. పీఎంఎఫ్ఎంఈ పథకం కింద అందిస్తున్న 35 శాతం సబ్సిడీకి ఇది అదనమని పేర్కొంది. ఈ రెండు పథకాల కింద ప్రాజెక్టుల ఆమోదానికి దరఖాస్తులను ఏఐఎఫ్ ఎంఐఎస్ పోర్టల్ నుంచి స్వీకరిస్తున్నట్టు ప్రకటించింది. చదవండి: సగం సంపద ఆవిరైంది.. సంతోషంగా ఉందంటూ పోస్ట్ పెట్టిన మార్క్ జుకర్‌బర్గ్! -
నెక్ట్స్ ఎడ్యుకేషన్ నుంచి ‘నెక్ట్స్ 360’
హైదరాబాద్: విద్యా సంబంధిత సాస్ కంపెనీ నెక్ట్స్ ఎడ్యుకేషన్.. ‘నెక్ట్స్ 360’ను ఆవిష్కరించింది. ఇది సమగ్ర విద్యా కార్యక్రమమని, విద్యార్థుల్లో 21వ శతాబ్దపు నైపుణ్యాలను అభివృద్ధి చేసే లక్ష్యంతో తీసుకొచ్చినట్టు సంస్థ తెలిపింది. ఆడియో విజువల్స్, యాక్టివిటీలు, పాఠ్య ప్రణాళికలు, కరిక్యులమ్ ఉంటుందని పేర్కొంది. అలాగే, నెక్ట్స్ 360 విద్యా సంస్థలకు అడ్మినిస్ట్రేటివ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను కూడా ఆఫర్ చేస్తోంది. దీని ద్వారా విద్యార్థులతో సంప్రదింపులు, వారి అభిప్రాయాలు తెలుసుకోవడం, హాజరు నమోదు, రిపోర్ట్ కార్డ్ జారీ, అడ్మిషన్లు, ఫీజుల నిర్వహణ తదితర సేవలను దీని ద్వారా నిర్వహించుకోవచ్చు. రెండు వేలకు పైగా పాఠశాలలు, పది లక్షల మంది విద్యార్థులు, 50వేల మంది టీచర్లను చేరుకోవాలని అనుకుంటున్నట్టు నెక్ట్స్ ఎడ్యుకేషన్ తెలిపింది. -
భరతమాత కొలువైన గుడి
గౌరిబిదనూరు: దేశంలో ముక్కోటి దేవీ దేవతలకు ఆలయాలు, ప్రఖ్యాత దేవస్థానాలు ఉన్నాయి, కానీ భరతమాత పేరుతో ఉన్న మందిరాలు ఎక్కడా కనిపించవు. దేశమాత విగ్రహ రూపంలో కొలువై పూజలందుకుంటున్న మందిరాన్ని చూడాలంటే గౌరిబిదనూరుకు వెళ్లాల్సిందే. దక్షిణ భారతదేశపు జలియన్ వాలాబాగ్‌గా ప్రసిద్ధి చెందిన విదురాశ్వత్థానికి సమీపంలో ఉన్న నాగసంద్ర గ్రామంలో 2008లో భారతమాత దేవాలయం వెలిసింది. కృష్ణశిలలో హిందూపురానికి చెందిన శిల్పి నాగరాజు 6 అడుగుల భరతమాత విగ్రహాన్ని చెక్కారు. జాతీయ జెండాను పట్టుకుని జెండా దర్శనమిస్తుంది. జనవరి 26, ఆగస్టు 15కు ప్రత్యేక పూజలు దేవాలయం పై కప్పున దేశ నాయకుల చిత్రాలు, బొమ్మలు స్ఫూర్తిని నింపుతాయి. కిత్తూరు రాణి చన్నమ్మ, ఝాన్సీ లక్ష్మీబాయి, సుభాస్ చంద్రబోస్ తదితరుల బొమ్మలను చెక్కారు. ఏటా ఆగస్టు 14 అర్ధరాత్రి దేశభక్తియుత ప్రదర్శనలు నిర్వహించడం ఆనవాయితీ. స్థానిక నాయకుడు రవి నారాయణరెడ్డి భరతమాత ట్రస్ట్ ఏర్పరచి ఆలయాన్ని నిర్వహిస్తున్నారు. ఆలయంలో భరతమాతకు నిత్య పూజలు నిర్వహిస్తూ, గణతంత్ర దినోత్సవం, ఆగస్టు 15న విశేష పూజలు జరుపుతారు. (చదవండి: చిన్నవాణ్ణని వదిలేశారు) -
సరదాగా.. సండేఫన్డే
కవాడిగూడ: నగర వాసుల ఆహ్లాదం కోసం హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన ‘సండే..ఫండే’ సందర్శకులతో హుషారుగా సాగింది. సండే ఫండేను గతంలో ప్రారంభించినప్పటికీ కరోనా నేపథ్యంలో నిలిపి వేశారు. 75 వసంతాల స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై సండేఫండేను తిరిగి ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్యాంక్‌బండ్‌ను విద్యుత్ కాంతులు, జాతీయ జెండాలతో అలంకరించారు. నగర వాసులు కుటుంబ సమేతంగా హాజరై సందడి చేశారు. చిన్నారులకు ఇష్టమైన తినుబండారాలను కొనుగోలు చేసి ఆనందంగా గడిపారు. యువత జాతీయ జెండాలతో దేశభక్తి చాటుతూ సెలీ్ఫలు దిగారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో సందర్శకులకు ఉచితంగా మొక్కలను పంపిణి చేశారు. సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు మైక్ అనౌన్స్మెంట్ చేస్తూ ఎప్పటికప్పుడు పలు సూచనలు, జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మొదటి సండే వర్షం ప్రభావం వల్ల సండేఫండేకు అధిక సందర్శకులు హజరు కాలేకపోయారు. సండేఫండే సందర్శంగా సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్యాంక్‌బండ్‌పై పోలీసులు పూర్తిగా రాకపోకలు నిలిపి వేశారు. (చదవండి: జనాభాను మించి ఆధార్! ) -
కళ్లు చెదిరే సూపర్ బైక్‌లు , అదిరిపోయే ధర
ముంబై: బ్రిటీష్ మోటార్‌సైకిల్ తయారీ సంస్థ ట్రయంఫ్, తన ఫ్లాగ్షిప్ అడ్వెంచర్ (ADV) బైక్ 'టైగర్ 1200' 2022 వెర్షన్‌ను భారతదేశంలో విడుదల చేసింది, 2021 చివరిలో గ్లోబల్‌గా లాంచ్ చేసిన ‘ట్రయంఫ్ టైగర్ 1200 ’ సూపర్ బైక్‌లను ఇండియన్ మార్కెట్లో మంగళవారం లాంచ్ చేసింది. జీటీ ప్రో, ర్యాలీ ప్రో, జీటీ ఎక్స్‌ప్లోరర్, ర్యాలీ ఎక్స్‌ప్లోరర్ అనే నాలుగు వేరియంట్లలో ఈ బైక్స్ అందుబాటులో ఉంటాయి. బేస్ వేరియంట్ ధర రూ. 19.19 లక్షల (ఎక్స్-షోరూమ్) టాప్ వేరియంట్ ధర రూ. 21.69 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటాయని కంపెనీ ప్రకటించింది. ఇవి హార్లీ డేవిడ్సన్ పాన్ అమెరికా, డుకాటీ మల్టీ స్ట్రాడాతో పోటీగా నిలవనున్నాయి. కొత్త ట్రయంఫ్ టైగర్ 1200 ADVని స్పోక్డ్ వీల్స్ , లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ ఫీచర్లతో రెండు కేటగిరీలుగా తీసుకొచ్చింది. బ్రెంబో కాలిపర్లతో పాటు ముందు వైపున ట్విన్ 320ఎమ్ఎమ్ ఫ్లోటింగ్ డిస్క్‌లు , వెనుక వైపున ఒక సింగిల్ 280ఎమ్ఎమ్ డిస్క్‌లు, డ్యూయల్-ఛానల్ ABS కూడా అమర్చింది. ఇక ప్రో, ఎక్స్‌ప్లోరర్ వేరియంట్ల మధ్య ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే, ప్రో ట్రిమ్‌లలో అందించే 20-లీటర్‌తో పోలిస్తే ఎక్స్‌ప్లోరర్ వేరియంట్లు 30-లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో లభిస్తాయి. ట్రయంఫ్ టైగర్ 1200 స్పెక్స్ T-ప్లేన్ క్రాంక్ షాఫ్ట్‌తో 1,160cc ఇన్లైన్-ట్రిపుల్ సిలిండర్ ఇంజన్. 148 బీహెచ్పీ , 130 ఎన్ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. బైక్ స్లిప్ ,అసిస్ట్ క్లచ్‌తో కూడిన 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను కూడా అమర్చింది. పాత బైక్‌లతో పోలిస్తే 25 కిలోల బరువు కూడా తక్కువ. కొత్త ఫ్రేమ్, డబుల్ సైడెడ్ స్వింగ్ఆర్మ్ అల్యూమినియం ఫ్యూయల్ ట్యాంక్‌ని ఉపయోగించడం ద్వారా బైక్ బరువును తగ్గించింది. సేఫ్టీ ఫీచర్లు బ్లైండ్ స్పాట్ , లేన్ చేంజ్ వార్నింగ్ సిస్టమ్, లీన్-సెన్సిటివ్ కార్నరింగ్ లైట్లు, బ్లూటూత్ సపోర్ట్‌తో కూడిన 7-అంగుళాల టీఎఫ్టీ డిస్ప్లే, ఎలక్ట్రానిక్ సస్పెన్షన్, ఆరు రైడింగ్ మోడ్ల వరకు, ఒక రాడార్ సిస్టమ్ వంటి ఫీచర్లతో వస్తుంది. డౌన్ క్విక్‌షిఫ్టర్, హిల్ హోల్డ్, క్రూయిజ్ కంట్రోల్, హీటెడ్ గ్రిప్స్ , కీలెస్ ఆపరేషన్. ఎక్స్‌ప్లోరర్ వేరియంట్లలో టైర్-ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, హీటెడ్ రైడర్, పిలియన్ సీట్లు అదనం. -
వివో నుంచి ఎక్స్80, ఎక్స్ 80ప్రో
హైదరాబాద్: వివో తన ఫ్లాగ్షిప్ ఎక్స్ సిరీస్‌లో ఎక్స్80, ఎక్స్80 ప్రో పేరుతో రెండు కొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. జీస్ కంపెనీ సహకారంతో ఈ ఫోన్లలో అత్యాధునిక కెమెరా టెక్నాలజీని వివో అందిస్తోంది. జీస్ జింబెల్ పోట్రయిట్ కెమెరా, 50 మెగా పిక్సల్ అల్ట్రా సెన్సింగ్ ఐఎంఎక్స్ 866 సెన్సార్ వీటిల్లో ఉంటుంది. క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెనరేషన్ 1 చిప్సెట్తో నడిచే ఈ ఫోన్లలో ఎన్నో కొత్త ఫీచర్లను వివో ప్రవేశపెట్టింది. ఎక్స్ 80 ప్రో 12జీబీ, 256జీబీ కాంబినేషన్ ధర ధర రూ.79,999. ఎక్స్ 80 8జీబీ, 128జీబీ ధర రూ.54,999. 12జీబీ, 256జీబీ ధర రూ.59,999. ఈ నెల 25 నుంచి విక్రయాలు మొదలు కానున్నట్టు వివో ప్రకటించింది. -
అమెరికా అవాంఛనీయ చర్య
ముందస్తు అనుమతి లేకుండా హిందూ మహాసముద్ర జలాల్లోని మన ప్రత్యేక ఆర్థిక మండలి (ఈఈజడ్) సమీపంలోకి అమెరికా నావికా దళం ఈ నెల 7న సంచరించింది. పైగా అదొక ఘన కార్యమన్నట్టు చాటింపు వేసుకుంది. పర్యాటక ఆసక్తితో దేశాలు సందర్శించేవారికి సైతం వర్తమాన ప్రపంచంలో నిబంధనలున్నాయి. అక్కడి ప్రభుత్వాలు రూపొందించుకున్న నిబంధనలు అనుమ తించినమేరకు మాత్రమే ఆ దేశాలు పర్యటించటానికైనా, అక్కడ శాశ్వత నివాసం ఏర్పరుచు కోవటానికైనా అవకాశం వుంటుంది. ఇప్పుడు అమెరికా నుంచి వచ్చిన నౌక సాధారణమైనది కాదు. అది అమెరికా నావికా దళంలోని సప్తమ విభాగానికి చెందిన యుద్ధ నౌక. దానికి క్షిపణులను ధ్వంసం చేసే సామర్థ్యముంది. యుద్ధకాలంలో మినహా ఇతరత్రా సమయాల్లో మిత్ర దేశమైనా, శత్రు దేశ మైనా వేరొకరి గగనతలంలోకి లేదా వారి సముద్ర జలాల పరిధి సమీపంలోకి ప్రవేశించదల్చుకున్న ప్పుడు ముందస్తు సమాచారం ఇవ్వటం ఆనవాయితీ. ఇందువల్ల అనవసర ఘర్షణలు నివారిం చటం లేదా దౌత్యపరంగా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా చూడటం వీలవుతుంది. హిందూ మహా సముద్రంలోని లక్షద్వీప్ సమీప జలాల గుండా అమెరికా యుద్ధ నౌక వెళ్లటం ఈ కోణంలో అవాంఛనీయమైనది. ఈ నెల 7న తాము ఇటువైపుగా వచ్చామని అమెరికా నావికా దళం మరో మూడురోజుల తర్వాత ప్రకటించేవరకూ ఆ విషయం మన దేశ పౌరులెవరికీ తెలియదు. మన విదే శాంగ శాఖ ఆ యుద్ధ నౌక కదలికల గురించి ముందే కన్నేసివుంచామని ప్రకటించింది. అది పర్షి యన్ జలసంధి నుంచి మలకా జలసంధిలోకి వెళ్లేవరకూ నిరంతరాయంగా దాని కదలికలను పర్య వేక్షించామని, దౌత్య మార్గాల్లో నిరసన ప్రకటించామని తెలిపింది. ఆ సంగతిని మన ప్రభుత్వం అమెరికా ప్రకటనకన్నా ముందే వెల్లడించివుంటే బాగుండేది. మనం ఐక్యరాజ్యసమితి సముద్ర ఒడంబడికకు అనుగుణంగా వ్యవహరిస్తున్నామని, దాని ప్రకారమే సముద్ర జలాల్లో 12 మైళ్ల ప్రాంతాన్ని ప్రాదేశిక జలాలుగా, మరో 24 మైళ్ల ప్రాంతాన్ని ప్రాదేశిక జలాలకు ఆనుకొని వుండే ప్రాంతంగా, దాన్నుంచి 200 మైళ్ల వరకూ ఈఈజడ్‌గా పరిగణిస్తున్నామని, ఒక సార్వభౌమాధికార దేశంగా అది మన హక్కని విశ్వసిస్తున్నప్పుడు అమెరికా వైఖరి తప్పని ఆ క్షణమే బహిరంగంగా ప్రక టించాల్సింది. కానీ ఒడంబడికను ఉల్లంఘించిన దేశం ఆ పని చేసి మన నిస్సహాయతను చాటింది. అంతర్జాతీయ ఒడంబడికపై మన అవగాహనకూ, అమెరికా అవగాహనకూ తేడావుంది. ఈ విషయంలో మనకే కాదు... ప్రపంచంలోని వేరే దేశాలకు కూడా అమెరికాతో విభేదాలున్నాయి. ఈ జాబితాలో అమెరికా మిత్ర, అమిత్ర దేశాలు రెండూ వున్నాయి. గత డిసెంబర్ 24న దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలోని కాన్ దావో దీవుల సమీప జలాల గుండా అమెరికా యుద్ధ నౌక వెళ్లింది. మొన్న ఫిబ్రవరిలో మరో యుద్ధ నౌక అక్కడే స్పార్టీ. దీవుల సమీపం నుంచి వెళ్లింది. మార్చి 31న దక్షిణ కొరియాకు చెందిన కుక్–టో దీవుల సమీపంనుంచి, ఈ నెల 3న శ్రీలంక సముద్ర జలాల పరిధి మీదుగా అమెరికా యుద్ధ నౌకలు ప్రయాణించాయి. ఈనెల 7న మనతోపాటు మాల్దీవుల హక్కును కూడా అది ధిక్కరించింది. 1995లో కుదిరిన అంతర్జాతీయ ఒడంబడికను వాస్తవానికి అమెరికా ఇంతవరకూ ధ్రువీకరించలేదు. దాన్ని ధ్రువీకరించిన మన దేశం అందుకొక షరతు విధిం చింది. ఈఈజడ్ పరిధిలోకి విదేశీ యుద్ధ నౌకలు ప్రవేశించాలంటే ముందస్తుగా భారత్‌కు తెలియ జేయాలన్నది దాని సారాంశం. వాణిజ్య నౌకలకు ఈ నిబంధన వర్తించదు. చైనా మాత్రం తమ ఈఈజడ్ పరిధిలోకి అనుమతిలేకుండా అన్యులెవరూ రాకూడదని నిర్దేశించింది. అన్నిరకాల నౌక లకూ ఇది వర్తిస్తుంది. అంతేకాదు... విశాల సముద్ర ప్రాంతం తన ఈఈజడ్‌గా చెప్పుకోవటం కోసం అది కృత్రిమంగా పగడాల దిబ్బలు నెలకొల్పింది. దాంతో ఆ ప్రాంతంలో వేరే దేశాల వాణిజ్య నౌకల గమనానికి అవకాశం వుండటంలేదు. ప్రస్తుతం దక్షిణ చైనా సముద్రంలో చైనాకూ, అమెరి కాకూ నడుస్తున్న లడాయి అదే. ఇందుకు మన దేశం కూడా మద్దతునిస్తోంది. అసలంటూ అంత ర్జాతీయ ఒడంబడిక వున్నప్పుడు ఏ దేశానికా దేశం దానికి తూట్లు పొడిచేలా సొంత నిబం ధనలు ఏర్పాటు చేసుకోవటం ఏమిటన్నది అమెరికా ప్రశ్న. కానీ ఇలా ప్రశ్నించడానికి నైతికంగా తన కేమి హక్కుందో ఆ దేశం తనను తాను ప్రశ్నించుకోవాలి. ఆ ఒడంబడికను పాతికేళ్లుగా ధ్రువీకరించ కుండా కాలక్షేపం చేస్తున్న అమెరికా... దాన్ని ధ్రువీకరిస్తూనే తమ తమ అవసరాలకు అనుగుణంగా ఒకటి రెండు షరతులు విధిస్తున్న దేశాలను తప్పు పట్టడం పరమ విడ్డూరం. అమెరికా తూర్పు ప్రాంతాన అట్లాంటిక్ మహా సముద్రం వుంది. దాని పడమరన పసిఫిక్ మహాసముద్రముంది. ఆ ప్రాంతాల్లోకి వేరే దేశానికి చెందిన యుద్ధ నౌక సంగతలావుంచి, వాణిజ్య నౌకనైనా అమెరికా అను మతించకపోవచ్చు. అదేమంటే...అంతర్జాతీయ ఒడంబడికను ధ్రువీకరించలేదని చెప్పవచ్చు. కానీ వేరే దేశాల విషయానికొచ్చినప్పుడు ‘ధ్రువీకరించాక సొంతంగా నిబంధనలెందుకు విధిస్తార’ని ప్రశ్నించవచ్చు. ఈ తర్కంతో ఒకపక్క స్వప్రయోజనాలను పరిరక్షించుకుంటూనే మరోపక్క దబా యించటం అమెరికాకే చెల్లింది. అనుమతిలేకుండా మన ఈఈజడ్ పరిధి సమీపంలోకి రావటం ఎంత తప్పో, దాన్ని సమర్థించుకుంటూ అది చేసిన ప్రకటన కూడా అంతే తప్పు. అందులో మిత్ర స్వరం లేదు. స్వేచ్ఛాయత నౌకా హక్కును చాటడం కోసంభారత్తోసహా ఎక్కడైనా మున్ముందు కూడా ఇలాగే చేస్తామని ఆ ప్రకటన చెబుతోంది. దేశాల మధ్య మిత్ర సంబంధాలు పరస్పర గౌరవ మర్యాదల ప్రాతిపదికగా వుండాలి. ఇచ్చిపుచ్చుకునే వైఖరితో మెలగాలి. పెద్దన్న పాత్ర పోషిస్తా మని, పెత్తనం చలాయిస్తామని... దానికి అందరూ తలొగ్గి వుండాలని భావిస్తే అది చెల్లదని అమె రికా గుర్తెరిగేలా చేయటం మన తక్షణ కర్తవ్యం. -
డిజిటల్ ప్రకటనల్లోకి ‘డిజిటల్ కైట్స్’
సాక్షి, హైదరాబాద్ : డిజిటల్ ప్రకటన రంగంలోకి కొత్త సంస్థ ఎంట్రీ ఇచ్చింది. ‘డిజిటల్ కైట్స్’ పేరుతో డిజిటల్ అడ్వర్టైజింగ్ ఎకోసిస్టమ్‌లోకి అడుగు పెట్టింది. తద్వారా వెబ్సైట్లకు, బ్రాండ్లు లేదా ఏజెన్సీలకు తన సేవలను ఉచితంగా అందించనుంది. వివిధ బ్రాండ్లు, ప్రచురుణకర్తలు ఒకరితో ఒకరు కలిసి పనిచేసే ఒక కొత్త ఎకో సిస్టంను సృష్టిస్తున్నామని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. తమ ప్లాట్‌పాంలో ముఖ్యంగా గోప్యతకు బలమైన ప్రాధాన్యత ఇచ్చినట్టు ప్రకటించింది. ఈ సందర్భంగా ఆడియన్స్ ప్రైమ్ , ఆడియన్స్ ప్లే అనే రెండు ప్రధాన ఉత్పత్తులను డిజిటల్ కైట్స్ లాంచ్ చేసింది. 'ఆఫ్‌లైన్ కస్టమర్లు,' లేదా 'మల్టీ-ఛానల్ మార్కెటింగ్' తమ లక్ష్యమని పేర్కొంది. ఆటోమొబైల్, రియల్ ఎస్టేట్, రీటైల్ అండ్ కన్సూయర్ గూడ్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్, ట్రావెల్ అండ్ టూరిజం తదితర రంగాలకు తన సేవలను అందించనుంది. డిజిటల్‌కైట్స్‌పై పనిచేయడం ప్రారంభించినప్పుడు, డిజిటల్ అడ్వర్టైజింగ్ ఎకోసిస్టంలో చాలామంది వాటాదారులను గమనించామనీ, ఆయా కంపెనీలు, వాటి రోడ్‌బ్లాక్ సమస్యలను పరిష్కరించడం ద్వారా వారి వ్యాపారాలకు గణనీమైన విలువను ఎలా అందించాలో పరిశీలించామని డిజిటల్ కైట్స్ సీఈవో దినేష్ గంటి తెలిపారు. గూగుల్ , ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా వాల్స్ వెలుపల బ్రాండ్లు తమ మొదటి పార్టీ సీఆర్ఎం డేటాను ప్రభావితం చేయలేవు. ఇందుకు చాలా సాంకేతిక పరిష్కారాలు ఉన్నప్పటికీ, బహిరంగ గుర్తింపు తీర్మానం లేకపోవడం వల్ల అవి భారతదేశంలో పనిచేయవని తెలిపిన ఆయన తాము అతిపెద్ద యూజర్ రిజల్యూషన్ పరిష్కారాన్ని అందిస్తున్నామన్నారు. ఈ టెక్నాలజీని డిజిటల్ కైట్స్ ఉత్పత్తులతో మిళితం చేసి, తద్వారా బ్రాండ్లు, ప్రచురణకర్తలు అన్ని మార్కెటింగ్ ఛానెళ్లలో మొదటిసారిగా కలిసి పనిచేయడానికి వీలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. చాలా పెద్ద ప్రచురణకర్త సంస్థలతో మాట్లాడుతున్నామనీ అతి త్వరలో కొన్ని పెద్ద భాగస్వామ్య ప్రకటనలు చేయబోతున్నామని డిజిటల్ కైట్స్ సీవోవో రఘు తెలిపారు. తమకు హైదరాబాద్, ముంబై , న్యూఢిల్లీలో కార్యాలయాలు ఉన్నాయన్నారు. యాభై మంది ఉద్యోగులు వివిధ ఉత్పత్తులు, కార్యక్రమాలపై పనిచేస్తున్నారని తెలిపారు. అలాగే తమకు వే 2 ఆన్లైన్ ఇంటరాక్టివ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మద్దతు ఉన్నట్టు ప్రకటించారు. ఆడియన్స్ ప్లే : యాప్స్, వెబ్సైట్లకు ఉద్దేశించింది. ఇది ఆయా ఆఫ్‌లైన్. ఆన్లైన్ యూజర్ టచ్ పాయింట్స్, సెగ్మెంట్ నుండి డేటాను ఏకీకృతం చేయడానికి, వారి ప్రేక్షకులను బ్రాండ్లతో మెరుగుపరచడానికి, ప్రైవేట్‌గా భాగస్వామ్యానికి అనుమతిస్తుంది. ఆడియన్స్ ప్రైమ్ : బ్రాండ్లు, ఏజెన్సీలకుద్దేశించింది. మొదటి సీఆర్ఎం డేటాను ఆన్‌బోర్డ్ చేయడానికి, ప్రఖ్యాత ప్రచురణకర్తల నుండి సముచిత ప్రేక్షకుల విభాగాలతో పాటు ప్రోగ్రామాటిక్, సోషల్, ఇమెయిల్ మొదలైన బహుళ ఛానెల్‌లలో అనుమతికి వీలు కల్పిస్తుంది. ఇవి రెండూ డిజిటల్ కైట్స్ యూజర్ రిజల్యూషన్ టెక్నాలజీ ఆధారితంగా పనిచేస్తాయి. ఇవి ఆఫ్‌లైన్, ఆన్లైన్ ఐడెంటిఫైయర్‌లైన ఇమెయిల్, కుకీలు, అడ్వర్టైజింగ్ ఐడిలు, మొబైల్ నంబర్లు మొదలైన వాటి ద్వారా వినియోగదారులను గుర్తిస్తుంది. అందువల్ల బ్రాండ్లు, ప్రచురణకర్తలు తమ వినియోగదారులతో వివిధ డివైస్‌లు, ఛానెళ్లలో కమ్యూనికేట్ చేయడానికి అనుమతి లభిస్తుంది. -
అదిరిపోయే ఫీచర్లతో రియల్‌మి స్మార్ట్‌ఫోన్
సాక్షి, ముంబై: భారతీయ స్మార్ట్‌ఫోన్‌లో దాదాపు బడ్జెట్ ఫోన్లకే పరిమితమైన రియల్ మీ ఖరీదైన ఫోన్ల జాబితాలో అదిరిపోయే అడ్వాన్స్డ్ ఫీచర్లతో ఒక ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ నుబుధవారం లాంచ్ చేసింది. ఇంప్పటికే చైనాలో అందుబాటులోకి తీసుకొచ్చిన రియల్ ఎక్స్ 2 ప్రొ స్మార్ట్‌ఫోన్ ఇపుడు భారత మార్కెట్లలో కూడా తీసుకొచ్చింది. రియల్ మీ ఎక్స్2 ప్రోలో రెండు వేరియంట్లు అందుబాటులో ఉండనున్నాయి. అంతేకాదు దీంతోపాటు రియల్ ఎక్స్ 2 ప్రొ మాస్టర్ ఎడిషన్‌ను కూడా లాంచ్ చేసింది. ధరలు ప్రారంభ వేరియంట్ 8 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర : రూ.29,999 హై ఎండ్ వేరియంట్ 12 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర : రూ.33,999 మాస్టర్ ఎడిషన 12 జీబీ ర్యామ్, 256 జీబీ వేరియంట్ ధర : రూ.34,999 ఫ్లిప్‌కార్ట్, రియల్‌మి ఆన్లైన్ స్టోర్ల ద్వారా ఈ నెల 26నుంచి అందుబాటులోకి రానున్నాయి. రియల్ మీ ఎక్స్2 ప్రో మాస్టర్ ఎడిషన్ 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ గల ఒక్క వేరియంట్ లో మాత్రమే లభిస్తుంది. ఇది క్రిస్మస్‌నాటికి అందుబాటులోకి వస్తుంది. రియల్ మి ఎక్స్ 2 ప్రో ఫీచర్లు 6.50 అంగుళాల ఫుల్హెచ్డీ డిస్ప్లే క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855+ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 9పై 1080x2400 పిక్సె ల్స్ రిజల్యూషన్ 8జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీ 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 64+13 +8+ 2 ఎంపీ క్వాడ్ రియర్‌కెమెరా 4000ఎంఏహెచ్ బ్యాటరీ దీంతో పాటు రియల్‌మి ఎస్ పేరుతో మరో స్మార్ట్‌ఫోన్‌ను కూడా కంపెనీ లాంచ్ చేసింది. 48 ఎంపీ ప్రైమరీ క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌తో రెండు వేరియంట్లలో లాంచ్ చేసింది. రూ. 9999, రూ 10,999 ధరలతో ఈ నెల 29 నుంచి విక్రయానికి లభ్యం. -
మార్కెట్లోకి ‘ఆడి క్యూ7’
న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘ఆడి’ తాజాగా తన ఫ్లాగ్షిప్ ఎస్యూవీ ‘క్యూ7’ కారులో లిమిటెడ్ ఎడిషన్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. బ్లాక్ స్టైలింగ్ ప్యాకేజీతో బుధవారం విడుదలైన ఈ కారు ప్రారంభ ధర రూ. 82.15 లక్షలు కాగా, తాజా ఎడిషన్‌లో కేవలం 100 యూనిట్లను మాత్రమే విక్రయించనున్నట్లు ప్రకటించింది. పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లిమిటెడ్ ఎడిషన్ అందుబాటులో ఉండగా.. పెట్రోల్ వేరియంట్లో 2 –లీటర్ ఇంజిన్ (245 హార్స్పవర్) అమర్చినట్లు కంపెనీ తెలిపింది. డీజిల్ వేరియంట్లో 3 –లీటర్ ఇంజిన్ (249 హార్స్పవర్)తో అందుబాటులోకి వచి్చంది. ఈ సందర్భంగా కంపెనీ ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ మాట్లాడుతూ.. ‘టాప్ ఎండ్ లగ్జరీ కార్లను కోరుకునే వీరి కోసమే ఈ నూతన వేరియంట్‌ను విడుదలచేశాం’అన్నారు. -
చైనా వన్‌ప్లస్ నుంచి వన్‌ప్లస్ 3టీ స్మార్ట్‌ఫోన్
ధర రూ.29,999; రూ.34,999 న్యూఢిల్లీ: చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ వన్‌ప్లస్ తన ఫ్లాగ్షిప్ మొబైల్ వన్‌ప్లస్ 3లో తాజా వెర్షన్‌ను శుక్రవారం నాడు మార్కెట్లోకి తెచ్చింది. వన్‌ప్లస్ 3టీ పేరుతో 64జీబీ(ధర రూ.29,999), 128 జీబీ(ధర రూ.34,999) వేరియంట్లలో ఈ ఫోన్లను అంది స్తోంది. ఈ ఫోన్లను 8 జీబీ ర్యామ్‌తో కూడిన అత్యంత శక్తివంతమైన క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 821 ప్రాసెసర్(2.35 గిగా హెట్జ్)తో రూపొందించామని వన్‌ప్లస్ సీఈఓ పీటే లీయూ చెప్పారు. ఈ నెల 14 నుంచి అమెజాన్ ద్వారా వీటిని కొనుగోలు చేయవచ్చని పేర్కొన్నారు. త్వరలో కొన్ని ఆఫర్లను అందించనున్నామని వన్‌ప్లస్ జనరల్ మేనేజర్(ఇండియా) వికాస్ అగర్వాల్ చెప్పారు. ఆండ్రారుుడ్ 6.0 1 ఆధారిత ఆక్సిజన్ఓఎస్ కస్టమ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ ఫోన్లో 5.5 అంగుళాల ఆప్టిక్ అమెలెడ్ డిస్ప్లే, 3,400 ఎంఏహెచ్ బ్యాటరీ, అరగంటలోనే చార్జింగ్ చేయగల ద డాష్ చార్జ్ టెక్నాలజీ, ముందు, వెనకా 16 మెగాపిక్సెల్ కెమెరాలు, వెనక భాగంలో ఉండే కెమెరాకు, స్మార్ట్ క్యాప్చర్, ఆప్టికల్ ఇమేజ్ స్టాబిలైజేషన్ తదితర ఫీచర్లున్నాయని వివరించారు. -
‘ఫ్లాగ్ షిప్’.. వేగం
గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా కేటాయింపుల జోరు... గ్రామీణ భారత్‌కు మరింత జవసత్వాలు కల్పించడం... మౌలిక సదుపాయాల పెంపు, ఉపాధి కల్పనే లక్ష్యంగా కీలకమైన ‘ఫ్లాగ్షిప్’ పథకాలపై ప్రధాని మోదీ పూర్తిస్థాయిలో దృష్టిసారించారు. గత బడ్జెట్‌తో పోలిస్తే ఈసారి ఆర్థిక మంత్రి జైట్లీ ఇందులోని అన్ని పథకాలకూ భారీగా నిధుల కేటాయింపులను పెంచడమే దీనికి నిదర్శనం. అంతేకాకుండా.. ఇప్పటికే స్వచ్ఛ భారత్ సెస్సును విధించిన కేంద్రం.. ‘క్లీన్’ సెస్సును మరింతగా పెంచడం ద్వారా అదనంగా నిధులను సమకూర్చుకోనుంది. మోదీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్వచ్ఛభారత్ కార్యక్రమానికి దాదాపు ఒకటిన్నర రెట్లు కేటాయింపులు పెరగడం గమనార్హం. ఇక వరుసగా రెండేళ్ల కరువు పరిస్థితులతో దుర్భల పరిస్థితులను ఎదుర్కొంటున్న గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు చేయూత కల్పించేందుకు ఉపాధి హామీ పథకం నిధులను కూడా భారీగానే పెంచారు. రెండేళ్లలో దేశంలోని అన్ని గ్రామాలకూ పూర్తిస్థాయిలో విద్యుత్ సౌకర్యాన్ని కల్పించడం... చౌక గృహ నిర్మాణానికి పెద్దపీట వేయడం... పల్లెల్లో రోడ్లపై మరింతగా దృష్టిపెట్టడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడానికి మోదీ సర్కారు ఈ బడ్జెట్లో గట్టి ప్రయత్నమే చేసింది. ఉపాధికి ‘హామీ’... 201617 కేటాయింపు: రూ. 38,500 కోట్లు (11% పెంపు) 201516 కేటాయింపు: రూ. 34,699 కోట్లు(12% పెంపు) గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం 100 రోజుల పాటు కచ్చితంగా ఉపాధి భద్రతను కల్పించడం ఈ పథకం ఉద్దేశం. 2005లో దీనికోసం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం(ఎంజీఎన్ఆర్ఈజీఏ) కార్యరూపం దాల్చింది. 2008 నుంచి దేశంలోని అన్ని జిల్లాల్లో ఇది అమలవుతోంది. గ్రామాల్లో మౌలిక వసతుల పెంపునకు ఈ పథకాన్ని మరింత సమర్థంగా వినియోగించుకునే దిశగా క్రీడా ప్రాంగణాలు, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం వంటివాటిని కూడా మోదీ ప్రభుత్వం దీనిలోకి చేర్చింది. ఈ స్కీమ్ ద్వారా వర్షాలపైనే ఆధారపడిన ప్రాంతాల్లో 5 లక్షల వ్యవసాయ చెరువులు, బావుల తవ్వకంతో పాటు సేంద్రియ ఎరువుల తయారీ కోసం 10 లక్షల కంపోస్టు గుంతలను ఏర్పాటు చేసేవిధంగా ఉపాధి పనులను వాడుకోనున్నట్లు తాజా బడ్జెట్లో జైట్లీ ప్రకటించారు. స్వచ్ఛ భారత్‌కు దన్ను... భారత్‌ను పరిశుభ్రమైన దేశంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో మోదీ ఈ వినూత్న కార్యక్రమాన్ని 2014 అక్టోబర్ 2న ప్రారంభించారు. దీనికి సంబంధించిన నిధుల కల్పన కోసం అవసరమైతే సర్వీస్ పన్నుకు అదనంగా జైట్లీ గతేడాది సర్వీసు పన్నుకు (ప్రస్తుతం 14 శాతం) అదనంగా 0.5 శాతం స్వచ్ఛభారత్ సెస్సును అమల్లోకి తీసుకొచ్చారు. జాతిపిత గాంధీజీ స్ఫూర్తితో పరిశుభ్రత, పారిశుధ్యాన్ని తమ ప్రభుత్వం ఒక ఉద్యమంలా చేపడుతోందని జైట్లీ బడ్టెట్ ప్రసంగంలో చెప్పారు. మరోపక్క, పరిసరాల పరిశుభ్రతకు సంబంధించి నిధుల కల్పన కోసం క్లీన్ ఎనర్జీ సెస్ (క్లీన్ ఎన్విరాన్మెంట్ సెస్‌గా ఇప్పుడు పేరు మార్చారు)ను ఈ బడ్జెట్లో కూడా పెంచారు. బొగ్గు తదితర ఖనిజాలపై ఒక్కో టన్నుపై ఇప్పుడు విధిస్తున్న రూ.200 సెస్‌ను రూ.400కు చేరుస్తున్నట్లు జైట్లీ బడ్జెట్లో పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్ పరిధిలోకి స్వచ్ఛ భారత్ అభియాన్(పారిశుద్ధ్యం), జాతీయ గ్రామీణ తాగునీటి పథకాలను ప్రభుత్వం తీసుకొచ్చింది. స్వచ్ఛ భారత్ అభియాన్ రూ.9,000కోట్లు (గ్రామీణ)+ రూ.2,300 (పట్టణ) 201617 కేటాయింపు: రూ.9,000 కోట్లు (148 % పెంపు) 201516 కేటాయింపు: రూ.3,625 కోట్లు ♦ 2019 అక్టోబర్ 2 నాటికి దేశవ్యాప్తంగా అన్ని కుటుంబాలకు.. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో 100 శాతం పారిశుధ్యాన్ని(సెప్టిక్ మరుగుదొడ్ల నిర్మాణం) కల్పించడం లక్ష్యం. ♦ దేశంలోని 627 జిల్లాల్లోని అన్ని గ్రామాలనూ ఈ ప్రాజెక్టు పరిధిలోకి తీసుకొచ్చారు. ఎస్బీఏ ప్రాజెక్టులో మొత్తం 9 కోట్ల టాయిలెట్ల నిర్మాణం ప్రభుత్వ లక్ష్యం. ♦ కాగా, పట్టణ ప్రాంతాల్లో పరిశుభ్రతకు సంబంధించి ఇటీవలే ప్రభుత్వం ర్యాంకింగ్‌లను ప్రవేశపెట్టింది. దీనివల్ల నగరాలు, పట్టణాల మధ్య నిర్మాణాత్మక పోటీకి తోడ్పడుతుందని జైట్లీ అన్నారు. ♦ అదేవిధంగా ఎస్‌బీఏలో భాగంగా నగరాల్లోని చెత్తను కంపోస్టుగా మార్చే ఒక ప్రత్యేక పాలసీని ప్రభుత్వం ఆమోదించినట్లు కూడా ఆర్థిక మంత్రి బడ్జెట్లో వెల్లడించారు. జాతీయ గ్రామీణ తాగునీటి పథకం 201617 కేటాయింపు: రూ. 5,000 కోట్లు (92% పెంపు) 201516 కేటాయింపు: రూ.2,611 కోట్లు(76% తగ్గింపు) దేశంలో తాగునీటి సౌకర్యం లేని అన్ని గ్రామీణప్రాంతాలకూ సురక్షితమైన, తగినంత తాగునీటిని అందించాలనేది ఈ పథకం లక్ష్యం. కేంద్రం నుంచి రాష్ట్రాలకు కొన్ని నిధులు మంజూరవుతాయి. మిగతా మొత్తాన్ని రాష్ట్రాలు వెచ్చించాలి. గ్రామీణ టెలిఫోనీ... 201617లో: రూ. 2,755 కోట్లు (15% పెంపు) 201516లో: 2,400 కోట్లు (32% తగ్గింపు) 2016 డిసెంబర్ కల్లా మొత్తం 2.5 లక్షల గ్రామ పంచాయతీలకు హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్(ఎన్ఓఎఫ్ఎన్) ఇంటర్నెట్ కనెక్టివిటీతో పాటు పంచాయతీ స్థాయిలో భారత్ నిర్మాణ్ కామన్ సర్వీస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అదేవిధంగా గ్రామాల్లో మొబైల్స్ వినియోగాన్ని పెంచడం. 2017 నాటికి టెలీ డెన్సిటీని 70 శాతానికి చేర్చాలన్నది లక్ష్యం. ఈ మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.30,000 కోట్లు. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన... 201617 కేటాయింపు: రూ. 8,500 కోట్లు (25% పెంపు) 201516 కేటాయింపు: రూ. 6,800 కోట్లు (32% పెంపు) ♦ విద్యుత్ సౌకర్యం లేని లక్ష గ్రామాలకు కరెంటు... దారిద్య్ర రేఖకు దిగువన(బీపీఎల్) ఉన్న కుటుంబాలకు ఉచిత విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలనే లక్ష్యంతో 2005లో ఈ పథకం ప్రారంభమైంది. ♦ 2015 ఏప్రిల్ 1 నాటికి దేశంలో ఇంకా 18,542 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం లేదని.. వచ్చే 1000 రోజుల్లో వీటికి విద్యుత్ సదుపాయాన్ని కల్పించనున్నట్లు గతేడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మోదీ హామీనిచ్చారు. ♦ దీనిలో భాగంగానే 2018 మే 1 నాటికల్లా దేశంలో అన్ని గ్రామాలకూ విద్యుత్ సౌకర్యం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తాజా బడ్జెట్లో జైట్లీ ప్రకటించారు. ♦ తాజా బడ్జెట్ కేటాయింపుల్లో గ్రామీణ విద్యుదీకరణ పథకానికి రూ.3,000 కోట్లు, ఫీడర్లను వేరుచేసే కార్యక్రమం వంటి వాటికి (ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్మెంట్ స్కీమ్స్) రూ.5,000 కోట్లు చొప్పున కేటాయించారు. ♦ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2015-16 ఫిబ్రవరి 23 నాటికి)లో కొత్తగా 5,542 గ్రామాలను విద్యుదీకరించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. గత మూడేళ్లలో మొత్తం విద్యుదీకరించిన గ్రామాలకంటే ఇది అధికమని కూడా జైట్లీ పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 201617 కేటాయింపు: రూ.20,075 (41% పెంపు) 201516 కేటాయింపు: రూ.14,200 కోట్లు(11% కోత) ♦ అందరికీ సొంతింటి కలను సాకారం చేస్తామంటున్న మోదీ సర్కారు.. ఈ బడ్టెజ్‌లో చౌక గృహ నిర్మాణ రంగానికి ప్రోత్సాహకాలను ప్రకటించింది. పీఎంఎస్‌వైతో పాటు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని హౌసింగ్ ప్రాజెక్టులకు(60 చదరపు మీటర్ల నిర్మాణ విస్తీర్ణానికి మించని గృహాలపై) సేవా పన్నును(ప్రస్తుతం ఇది 5.6 శాతంగా ఉంది) పూర్తిగా తొలగిస్తున్నట్లు జైట్లీ ప్రకటించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే చౌక గృహాలకు(60 చదరపు మీటర్ల వరకూ) సంబంధించిన ప్రాజెక్టులకు సైతం ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు. ♦ దారిద్య్ర రేఖకు దిగువన(బీపీఎల్) ఉన్న కుటుంబాలు, ఎస్సీ/ఎస్టీలు, వికలాంగులు, బీపీఎల్ మైనారిటీలు ఈ పథకంలో లబ్దిదారులు. వీరికిచ్చే నిధుల్లో 75 శాతం కేంద్రం, 25 శాతం రాష్ట్రాలు భరిస్తాయి. ♦ మైదాన ప్రాంతాల్లో ఒక్కో ఇంటికి సాయాన్ని రూ.70,000కు, కొండ ప్రాంతాలు, మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో రూ.75,000 చొప్పున ఇస్తున్నారు. ఇక ఇప్పటికే ఉన్న ఇళ్ల అప్‌గ్రేడేషన్‌కు రూ.15,000 చొప్పున సాయం అందిస్తారు. ♦ మోదీ ప్రభుత్వం ఈ పథకాన్ని యథాతథంగా కొనసాగిస్తోంది. అయితే, స్వచ్ఛ భారత్ అభియాన్‌లో భాగంగా ప్రతి ఇంటికీ సెప్టిక్ మరుగుదొడ్డి నిర్మాణాన్ని తప్పనిసరి చేశారు. ♦ పట్టణ ప్రాంతాల్లోని పేదల గృహ కల్పనకు సర్దార్ పటేల్ అర్బన్ హౌసింగ్ స్కీమ్‌గా పేరు పెట్టారు. ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన 201617 కేటాయింపు: రూ. 19,000 కోట్లు (33% పెంపు) 201516 కేటాయింపు: రూ.14,291 కోట్లు (0.7% తగ్గింపు) ♦ మారుమూల గ్రామీణ ప్రాంతాలన్నింటికీ రోడ్డు సదుపాయాన్ని కల్పించే ఉద్దేశంతో 2000లో అప్పటి వాజ్‌పేయి ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ఈ పథకం ఇది. ♦ గ్రామీణ మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తామని చెబుతున్న మోదీ సర్కారు దీనికి ఈ బడ్జెట్లో దండిగానే నిధులను విదిల్చింది. ♦ ఈ పథకం కింద రాష్ట్రాల వాటాతో కలిపితే వచ్చే ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.27 వేల కోట్ల నిధులు ఖర్చు చేసే అవకాశం ఉందని జైట్లీ బడ్జెట్లో పేర్కొన్నారు. ♦ 2021 నాటికి మిగిలిన 65,000 అర్హత గల గ్రామీణ ప్రాంతాలను ప్రధాన రోడ్లతో అనుసంధానించేందుకు దాదాపు 2.3 లక్షల కిలోమీటర్ల రోడ్లను నిర్మించాలనేది లక్ష్యం కాగా, దీన్ని 2019 నాటికే పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ♦ 2011-14 మధ్య రోజుకు సగటు రోడ్డు నిర్మాణం 73.5 కిలోమీటర్లు కాగా, ప్రస్తుతం 100 కిలోమీటర్లకు జోరందుకుందని.. దీన్ని మరింతగా పెంచనున్నట్లు కూడా జైట్లీ పేర్కొన్నారు. -
''చిత్తూరును కరువురహిత జిల్లాగా మారుస్తా'''