చైనా వన్ప్లస్ నుంచి వన్ప్లస్ 3టీ స్మార్ట్ఫోన్ | OnePlus 3T Smartphone Launched in India | Sakshi
Sakshi News home page

చైనా వన్ప్లస్ నుంచి వన్ప్లస్ 3టీ స్మార్ట్ఫోన్

Published Sat, Dec 3 2016 1:06 AM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM

చైనా వన్ప్లస్ నుంచి వన్ప్లస్ 3టీ స్మార్ట్ఫోన్ - Sakshi

చైనా వన్ప్లస్ నుంచి వన్ప్లస్ 3టీ స్మార్ట్ఫోన్

చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ వన్‌ప్లస్ తన ఫ్లాగ్‌షిప్ మొబైల్ వన్‌ప్లస్ 3లో తాజా వెర్షన్‌ను శుక్రవారం నాడు మార్కెట్లోకి తెచ్చింది.

ధర రూ.29,999; రూ.34,999

 న్యూఢిల్లీ: చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ వన్‌ప్లస్ తన ఫ్లాగ్‌షిప్ మొబైల్ వన్‌ప్లస్ 3లో తాజా వెర్షన్‌ను  శుక్రవారం నాడు మార్కెట్లోకి తెచ్చింది. వన్‌ప్లస్ 3టీ పేరుతో 64జీబీ(ధర రూ.29,999), 128 జీబీ(ధర రూ.34,999) వేరియంట్లలో ఈ ఫోన్లను అంది స్తోంది. ఈ ఫోన్లను 8 జీబీ ర్యామ్‌తో కూడిన అత్యంత శక్తివంతమైన క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 821 ప్రాసెసర్(2.35 గిగా హెట్జ్)తో రూపొందించామని  వన్‌ప్లస్ సీఈఓ పీటే లీయూ చెప్పారు. ఈ నెల 14 నుంచి అమెజాన్ ద్వారా వీటిని కొనుగోలు చేయవచ్చని  పేర్కొన్నారు.

త్వరలో కొన్ని ఆఫర్లను అందించనున్నామని వన్‌ప్లస్ జనరల్ మేనేజర్(ఇండియా) వికాస్ అగర్వాల్ చెప్పారు. ఆండ్రారుుడ్  6.0 1 ఆధారిత ఆక్సిజన్‌ఓఎస్ కస్టమ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ ఫోన్‌లో 5.5 అంగుళాల ఆప్టిక్ అమెలెడ్ డిస్‌ప్లే, 3,400 ఎంఏహెచ్ బ్యాటరీ, అరగంటలోనే చార్జింగ్ చేయగల ద డాష్ చార్జ్  టెక్నాలజీ, ముందు, వెనకా 16 మెగాపిక్సెల్ కెమెరాలు, వెనక భాగంలో ఉండే కెమెరాకు, స్మార్ట్ క్యాప్చర్,  ఆప్టికల్ ఇమేజ్ స్టాబిలైజేషన్ తదితర ఫీచర్లున్నాయని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement