మార్కెట్లోకి ‘ఆడి క్యూ7’ | Audi Q7 Flagship Launch | Sakshi
Sakshi News home page

మార్కెట్లోకి ‘ఆడి క్యూ7’

Published Fri, Sep 13 2019 11:25 AM | Last Updated on Fri, Sep 13 2019 11:25 AM

Audi Q7 Flagship Launch - Sakshi

న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘ఆడి’ తాజాగా తన ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ ‘క్యూ7’ కారులో లిమిటెడ్‌ ఎడిషన్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. బ్లాక్‌ స్టైలింగ్‌ ప్యాకేజీతో బుధవారం విడుదలైన ఈ కారు ప్రారంభ ధర రూ. 82.15 లక్షలు కాగా, తాజా ఎడిషన్‌లో కేవలం 100 యూనిట్లను మాత్రమే విక్రయించనున్నట్లు ప్రకటించింది. పెట్రోల్, డీజిల్‌ ఇంజిన్‌ ఆప్షన్లలో లిమిటెడ్‌ ఎడిషన్‌ అందుబాటులో ఉండగా.. పెట్రోల్‌ వేరియంట్‌లో 2 –లీటర్‌ ఇంజిన్‌ (245 హార్స్‌పవర్‌) అమర్చినట్లు కంపెనీ తెలిపింది. డీజిల్‌ వేరియంట్‌లో 3 –లీటర్‌ ఇంజిన్‌ (249 హార్స్‌పవర్‌)తో అందుబాటులోకి వచి్చంది. ఈ సందర్భంగా కంపెనీ ఇండియా హెడ్‌ బల్బీర్‌ సింగ్‌ ధిల్లాన్‌ మాట్లాడుతూ.. ‘టాప్‌ ఎండ్‌ లగ్జరీ కార్లను కోరుకునే  వీరి కోసమే ఈ నూతన వేరియంట్‌ను విడుదలచేశాం’అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement