Audi Q7
-
ఆడి కొత్త కారు.. బుకింగ్‌లు ప్రారంభం
ముంబై: లగ్జరీ కార్ల సంస్థ ఆడి.. నూతన ఆడి క్యూ7 మోడల్ కార్ల బుకింగ్‌లను ప్రారంభించినట్టు ప్రకటించింది. ఆడి ఇండియా వెబ్సైట్ లేదా ‘మైఆడికనెక్ట్’ మొబైల్ యాప్ నుంచి రూ.2,00,000 చెల్లించడం ద్వారా బుక్ చేసుకోవచ్చని సూచించింది.ఈ నెల 28న విడుదల చేసే న్యూ ఆడి క్యూ7 మోడల్ కార్లను ఔరంగాబాద్‌లోని ప్లాంట్‌లో అసెంబుల్ చేయనుంది. 3.0లీటర్ల వీ6 టీఎఫ్ఎస్ఐ ఇంజన్ కలిగిన ఆడి క్యూ7.. 340 హెచ్‌పీ పవర్, 500 ఎన్ఎం టార్క్‌తో ఉంటుంది. సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 5.6 సెకండ్లలో అందుకుంటుందని, 250 కిలోమీటర్ల గరిష్ట వేగంతో వస్తుంది. -
కోటి రూపాయల కారు కొన్న నటుడి కుమార్తె !
బాలీవుడ్ సీనియర్ హీరో, నటుడు సంజయ్ కపూర్ కూతురు షనయా కపూర్ కొత్త కారును కొనుగోలు చేసింది. ప్రముఖ నివేదికల ప్రకారం షనయా విలాసవంతమైన 'ఆడి క్యూ 7 ఫేస్ లిఫ్ట్' కారును కొనుగోలు చేసింది. ఈ కారు విలువ రూ. 80 లక్షలు. ఈ ఆడి క్యూ7 2022 వెర్షన్ కారు రెడు వేరియంట్లలో వస్తుంది. ఒకటి ప్రీమియం ప్లస్ (రూ. 80 లక్షలు). మరొకటి టెక్నాలజీ (రూ. 88 లక్షలు). ఈ విషయాన్ని 'ఆడి ముంబై వెస్ట్' కంపెనీ తన ఇన్‌స్టా గ్రామ్ పేజి హ్యాండిల్లో షేర్ చేసింది. ఈ పోస్ట్‌లో తన కొత్త కారుతో షనయా ఫోజులిచ్చిన ఫొటోలను షేర్ చేసింది ఆడి కంపెనీ. ఈ ఫొటోలలో షనయా తల్లిదండ్రులు సంజయ్ కపూర్, మహీప్ కపూర్ ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ నెల ప్రారంభంలో ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ సినిమా బేధడక్తో షనయా బాలీవుడ్లో తెరంగ్రేటం అవుతుందని ప్రకటించారు. బేధడక్ సినిమాను శశాంక్ ఖైతాన్ దర్శకత్వంలో కరణ్ జోహార్ నిర్మాతగా ధర్మ ప్రొడక్షన్ బ్యానర్లో తెరకెక్కనుంది. ఇందులో లక్ష్య, గుర్ఫతే పిర్జాదా నటిస్తున్నారు. 2020లో విడుదలైన గుంజన్ సక్సేనా ది కార్గిల్ గర్ల్ చిత్రంతో సహాయ దర్శకురాలిగా షనయా బీటౌన్‌లో తన కెరీర్‌ను ప్రారంభించింది. అలాగే నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ది ఫ్యాబులెస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్లో అతిథి పాత్రలో మెరిసింది షనయా కపూర్. ఇందులో ఆమె తల్లి మహీప్ కపూర్ నటించింది. View this post on Instagram A post shared by Audi Mumbai West (@audi_mumbaiwest) -
మార్కెట్లోకి ‘ఆడి క్యూ7’
న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘ఆడి’ తాజాగా తన ఫ్లాగ్షిప్ ఎస్యూవీ ‘క్యూ7’ కారులో లిమిటెడ్ ఎడిషన్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. బ్లాక్ స్టైలింగ్ ప్యాకేజీతో బుధవారం విడుదలైన ఈ కారు ప్రారంభ ధర రూ. 82.15 లక్షలు కాగా, తాజా ఎడిషన్‌లో కేవలం 100 యూనిట్లను మాత్రమే విక్రయించనున్నట్లు ప్రకటించింది. పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లిమిటెడ్ ఎడిషన్ అందుబాటులో ఉండగా.. పెట్రోల్ వేరియంట్లో 2 –లీటర్ ఇంజిన్ (245 హార్స్పవర్) అమర్చినట్లు కంపెనీ తెలిపింది. డీజిల్ వేరియంట్లో 3 –లీటర్ ఇంజిన్ (249 హార్స్పవర్)తో అందుబాటులోకి వచి్చంది. ఈ సందర్భంగా కంపెనీ ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ మాట్లాడుతూ.. ‘టాప్ ఎండ్ లగ్జరీ కార్లను కోరుకునే వీరి కోసమే ఈ నూతన వేరియంట్‌ను విడుదలచేశాం’అన్నారు. -
ఆడి క్యూ7 పెట్రోల్ వెర్షన్..ధర ఎంత?
సాక్షి, ముంబై: జర్మనీ లగ్జరీ కార్ మేకర్ ఆడి క్యూ7 లో పెట్రోల్ వెర్షన్ కారును లాంచ్ చేసింది. 2.0లీటర్ పెట్రోల్ ఇంజీన్ సామర్ధ్యంతో ‘క్యూ7 40 టీఎఫ్ఎస్’ పేరుతో ఈ లగ్జరీ ఎస్యూవీ కారును మార్కెట్లో ప్రవేశపెట్టినట్టు కంపెనీ సోమవారం వెల్లడించింది. దీని ప్రారంభ ధర రూ. 67.76 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా కంపెనీ నిర్ణయించింది. ఈ మేరకు ఆటోమోటివ్ రిసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ARAI) ఆమోదం లభించినట్టు తెలిపింది. 253 బిహెచ్పి పవర్, 370ఎన్ఎం గరిష్ట్ టార్క్, 6.9 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగం, క్వాట్రో పెర్మనెంట్ ఆల్-వీల్ డ్రైవ్, ఆడి డిస్క్ సెలెక్షన్ ఫీచర్లతోపాటు వర్చువల్ కాక్‌పిట్, స్మార్ట్ ఆడి స్మార్ట్‌ఫోన్ ఇంటర్ష్స్ తో వస్తున్న ఎస్యూవీ సెగ్మెంట్లో తొలి ఆడిగా నిలవనుంది. ఈ కారు ఇప్పటికే 3.0 టిడిఐ ఇంజిన్‌తో భారతదేశంలో అందుబాటులో ఉంది. తాజాగా కొత్త పెట్రోల్ వెర్షన్లో పెద్దగా మార్పులు లేవు. ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్, షిఫ్ట్ పాడెల్స్ సహా హైఎండ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, ఫోర్ జోన్ ఆటోమేటిక్ క్లైమాట్ కంట్రోల్, క్రూయిజ్కంట్రోల, ఆటో పార్క అసిస్ట్, 8 ఎయిర్ బాగ్స్ తదితర ఫీచర్లు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.అంతేకాదు ఫుల్లీ లోడెడ్ టెక్నాలజీ ఎడిషన్‌తో క్యూ 7 ప్రీమియం ప్లస్ వెర్షన్ కూడా అందుబాటులో ఉందని ఆడి వెల్లడించింది. -
మార్కెట్లోకి ఆడీ క్యూ 7 కొత్త కార్
-
ఆడి క్యూ7 ఎస్‌యూవీలో కొత్త వేరియంట్లు
న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ ఆడి ప్రీమియం స్పోర్ట్స్ యుటిలిటి మోడల్(ఎస్యూవీ) క్యూ7లో రెండు కొత్త వేరియంట్లను శుక్రవారం మార్కెట్లోకి తెచ్చింది. ప్రీమియం ప్లస్ వేరియంట్ ధర రూ.72 లక్షలని, క్యూ7 టెక్నాలజీ వేరియంట్ ధర రూ.77.5 లక్షలని(రెండు ధరలూ ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) ఆడి ఇండియా హెడ్ జో కింగ్ తెలిపారు. ఇంతకు ముందటి మోడల్లో పోల్చితే ఈ కొత్త వేరియంట్ 325 కేజీలు తక్కువ బరువుంటుందని, 14.75 లీటర్ల మైలేజీని ఇస్తుందని పేర్కొన్నారు. ఈ కారు మెర్సిడెస్-బెంజ్ జీఎల్, బీఎండబ్ల్యూ ఎక్స్5, వొల్వొ ఎక్స్‌సీ90లకు గట్టిపోటీనిస్తుందని పరిశ్రమ వర్గాలంటున్నాయి. ఈ కారు సున్నా నుంచి వంద కిలోమీటర్ల వేగాన్ని 6.3 సెకన్లలో పుంజుకుంటుందని, గరిష్ట వేగం గంటకు 250 కిమీ. అని కంపెనీ పేర్కొంది. ఈ కారులో 8.3 అంగుళాల టచ్‌ప్యాడ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వెనక కూర్చున్న ప్రయాణికుల కోసం ఆడి ట్యాబ్, 3డీ ఆడియో ఫీచర్ ఉన్న రెండు సౌండ్ సిస్టమ్స్, 8-స్పీడ్ టిప్-ట్రానిక్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వంటి ప్రత్యేకతలున్నాయని కంపెనీ వివరించింది. లగేజ్ స్పేస్ 295 లీటర్లని. మూడో వరుస సీట్లను ఫోల్డ్ చేస్తే లగేజ్ స్పేస్ 890 లీటర్లకు పెరుగుతుందని పేర్కొంది. -
కారు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న సోను సూద్
నటుడు సోను సూద్ కారు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. బంద్రాలోని వెస్టర్న్ ఎక్స్ ప్రెస్ హైవేలో సోను సూద్ ప్రయాణిస్తున్న ఆడి క్యూ7 కారు మంటల్లో చిక్కుకుంది. అయితే సోను సూద్ కు ఎలాంటి ప్రమాదం జరగలేదని సమాచారం. ఆతర్వాత తాను క్షేమంగా ఉన్నానని.. తన స్నేహితుడు అజయ్ ధర్మా కారులో ప్రయాణిస్తున్న ఫోటోను ట్యాగ్ చేశారు. బానెట్ నుంచి పొగలు రావడం గమనించిన తాను వెంటనే కారు నుంచి బయటకు వచ్చాను అని తెలిపారు. ఆతర్వాత కారు ముందు భాగం మంటల్లో కాలి చిక్కుకు పోయింది. దాదాపు 20 లీటర్ల నీళ్లతో మంటల్ని ఆర్పడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదన్నారు. ఆ తర్వాత ఫైర్ సిబ్బంది వచ్చి మంటల్ని అదుపులోకి తెచ్చారని ఆయన తెలిపారు. అప్పటికే ప్రమాదస్థలిలో పెద్ద ఎత్తున్న జనం చేరడంతో పోలీసులు తగు చర్యలు తీసుకున్నారని ఆయన తెలిపారు. ఆడి క్యూ7 కారు మంటల్లో చిక్కుకోవడం చాలా అరుదని.. ఈ ప్రమాదం కారణాలపై వివరణ ఇవ్వాలని ఆడి అధికారులను అడిగాను అని అన్నారు.