
ముంబై: లగ్జరీ కార్ల సంస్థ ఆడి.. నూతన ఆడి క్యూ7 మోడల్ కార్ల బుకింగ్‌లను ప్రారంభించినట్టు ప్రకటించింది. ఆడి ఇండియా వెబ్‌సైట్ లేదా ‘మైఆడికనెక్ట్’ మొబైల్ యాప్ నుంచి రూ.2,00,000 చెల్లించడం ద్వారా బుక్ చేసుకోవచ్చని సూచించింది.
ఈ నెల 28న విడుదల చేసే న్యూ ఆడి క్యూ7 మోడల్ కార్లను ఔరంగాబాద్‌లోని ప్లాంట్‌లో అసెంబుల్ చేయనుంది. 3.0లీటర్ల వీ6 టీఎఫ్‌ఎస్‌ఐ ఇంజన్ కలిగిన ఆడి క్యూ7.. 340 హెచ్‌పీ పవర్, 500 ఎన్‌ఎం టార్క్‌తో ఉంటుంది. సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 5.6 సెకండ్లలో అందుకుంటుందని, 250 కిలోమీటర్ల గరిష్ట వేగంతో వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment