కారు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న సోను సూద్
కారు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న సోను సూద్
Published Wed, Jan 1 2014 3:28 PM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM
నటుడు సోను సూద్ కారు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. బంద్రాలోని వెస్టర్న్ ఎక్స్ ప్రెస్ హైవేలో సోను సూద్ ప్రయాణిస్తున్న ఆడి క్యూ7 కారు మంటల్లో చిక్కుకుంది. అయితే సోను సూద్ కు ఎలాంటి ప్రమాదం జరగలేదని సమాచారం. ఆతర్వాత తాను క్షేమంగా ఉన్నానని.. తన స్నేహితుడు అజయ్ ధర్మా కారులో ప్రయాణిస్తున్న ఫోటోను ట్యాగ్ చేశారు. బానెట్ నుంచి పొగలు రావడం గమనించిన తాను వెంటనే కారు నుంచి బయటకు వచ్చాను అని తెలిపారు.
ఆతర్వాత కారు ముందు భాగం మంటల్లో కాలి చిక్కుకు పోయింది. దాదాపు 20 లీటర్ల నీళ్లతో మంటల్ని ఆర్పడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదన్నారు. ఆ తర్వాత ఫైర్ సిబ్బంది వచ్చి మంటల్ని అదుపులోకి తెచ్చారని ఆయన తెలిపారు. అప్పటికే ప్రమాదస్థలిలో పెద్ద ఎత్తున్న జనం చేరడంతో పోలీసులు తగు చర్యలు తీసుకున్నారని ఆయన తెలిపారు. ఆడి క్యూ7 కారు మంటల్లో చిక్కుకోవడం చాలా అరుదని.. ఈ ప్రమాదం కారణాలపై వివరణ ఇవ్వాలని ఆడి అధికారులను అడిగాను అని అన్నారు.
Advertisement
Advertisement