హైదరాబాద్: విద్యా సంబంధిత సాస్ కంపెనీ నెక్ట్స్ ఎడ్యుకేషన్.. ‘నెక్ట్స్ 360’ను ఆవిష్కరించింది. ఇది సమగ్ర విద్యా కార్యక్రమమని, విద్యార్థుల్లో 21వ శతాబ్దపు నైపుణ్యాలను అభివృద్ధి చేసే లక్ష్యంతో తీసుకొచ్చినట్టు సంస్థ తెలిపింది. ఆడియో విజువల్స్, యాక్టివిటీలు, పాఠ్య ప్రణాళికలు, కరిక్యులమ్ ఉంటుందని పేర్కొంది.
అలాగే, నెక్ట్స్ 360 విద్యా సంస్థలకు అడ్మినిస్ట్రేటివ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను కూడా ఆఫర్ చేస్తోంది. దీని ద్వారా విద్యార్థులతో సంప్రదింపులు, వారి అభిప్రాయాలు తెలుసుకోవడం, హాజరు నమోదు, రిపోర్ట్ కార్డ్ జారీ, అడ్మిషన్లు, ఫీజుల నిర్వహణ తదితర సేవలను దీని ద్వారా నిర్వహించుకోవచ్చు. రెండు వేలకు పైగా పాఠశాలలు, పది లక్షల మంది విద్యార్థులు, 50వేల మంది టీచర్లను చేరుకోవాలని అనుకుంటున్నట్టు నెక్ట్స్ ఎడ్యుకేషన్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment