2022 Triumph Tiger 1200 Bike Launched in India at Rs19 Lakh - Sakshi
Sakshi News home page

2022 Triumph Tiger 1200: అదిరే సూపర్‌ బైక్‌లు, కళ్లు చెదిరే ధర

Published Tue, May 24 2022 4:47 PM | Last Updated on Tue, May 24 2022 8:02 PM

2022 Triumph Tiger 1200 launched in India at Rs19 lakh - Sakshi

ముంబై: బ్రిటీష్ మోటార్‌సైకిల్ తయారీ సంస్థ ట్రయంఫ్, తన ఫ్లాగ్‌షిప్ అడ్వెంచర్ (ADV) బైక్ 'టైగర్ 1200'  2022 వెర్షన్‌ను భారతదేశంలో విడుదల చేసింది,  2021 చివరిలో గ్లోబల్‌గా లాంచ్‌ చేసిన ‘ట్రయంఫ్ టైగర్ 1200 ’ సూపర్‌ బైక్‌లను ఇండియన్‌ మార్కెట్లో మంగళవారం లాంచ్‌ చేసింది. జీటీ ప్రో, ర్యాలీ ప్రో, జీటీ ఎక్స్‌ప్లోరర్, ర్యాలీ ఎక్స్‌ప్లోరర్ అనే నాలుగు వేరియంట్‌లలో ఈ బైక్స్‌ అందుబాటులో ఉంటాయి. 

బేస్ వేరియంట్ ధర రూ. 19.19 లక్షల (ఎక్స్-షోరూమ్)  టాప్ వేరియంట్ ధర రూ. 21.69 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్)   ఉంటాయని కంపెనీ ప్రకటించింది.  ఇవి హార్లీ డేవిడ్‌సన్‌ పాన్‌ అమెరికా,  డుకాటీ మల్టీ స్ట్రాడాతో పోటీగా నిలవనున్నాయి. 

కొత్త ట్రయంఫ్ టైగర్ 1200 ADVని స్పోక్డ్ వీల్స్ , లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ ఫీచర్లతో రెండు కేటగిరీలుగా తీసుకొచ్చింది.  బ్రెంబో కాలిపర్‌లతో పాటు ముందు వైపున ట్విన్ 320ఎమ్ఎమ్ ఫ్లోటింగ్ డిస్క్‌లు , వెనుక వైపున ఒక సింగిల్ 280ఎమ్ఎమ్ డిస్క్‌లు, డ్యూయల్-ఛానల్ ABS కూడా అమర్చింది.

ఇక ప్రో, ఎక్స్‌ప్లోరర్ వేరియంట్‌ల మధ్య ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే, ప్రో ట్రిమ్‌లలో అందించే 20-లీటర్‌తో పోలిస్తే ఎక్స్‌ప్లోరర్ వేరియంట్‌లు 30-లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో లభిస్తాయి.

ట్రయంఫ్ టైగర్ 1200 స్పెక్స్

T-ప్లేన్ క్రాంక్ షాఫ్ట్‌తో 1,160cc ఇన్‌లైన్-ట్రిపుల్ సిలిండర్ ఇంజన్. 148 బీహెచ్‌పీ , 130 ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. బైక్ స్లిప్ ,అసిస్ట్ క్లచ్‌తో కూడిన 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను కూడా  అమర్చింది.

పాత బైక్‌లతో పోలిస్తే 25 కిలోల బరువు కూడా తక్కువ. కొత్త ఫ్రేమ్, డబుల్ సైడెడ్ స్వింగ్‌ఆర్మ్ అల్యూమినియం ఫ్యూయల్ ట్యాంక్‌ని ఉపయోగించడం ద్వారా బైక్ బరువును తగ్గించింది. 

సేఫ్టీ ఫీచర్లు
బ్లైండ్ స్పాట్ , లేన్ చేంజ్ వార్నింగ్ సిస్టమ్, లీన్-సెన్సిటివ్ కార్నరింగ్ లైట్లు, బ్లూటూత్ సపోర్ట్‌తో కూడిన 7-అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ఎలక్ట్రానిక్ సస్పెన్షన్, ఆరు రైడింగ్ మోడ్‌ల వరకు, ఒక రాడార్ సిస్టమ్ వంటి ఫీచర్లతో వస్తుంది. డౌన్ క్విక్‌షిఫ్టర్, హిల్ హోల్డ్, క్రూయిజ్ కంట్రోల్, హీటెడ్ గ్రిప్స్ , కీలెస్ ఆపరేషన్. ఎక్స్‌ప్లోరర్ వేరియంట్‌లలో టైర్-ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్,  హీటెడ్ రైడర్, పిలియన్ సీట్లు అదనం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement