సాక్షి, ముంబై: ప్రముఖ వాహన తయారీదారు మహీంద్ర అండ్ మహీంద్ర అనుబంధ సంస్థ క్లాసిక్ లెజెండ్స్ ప్రయివేటు లిమిటెడ్ ఖరీదైన బైక్‌లను లాంచ్ చేసింది. జావా బ్రాండ్‌లో మూడు మోటార్ బైక్‌లను గురువారం భారత మార్కెట్లో విడుదల చేసింది అయితే ఇవి వచ్చే ఏడాది ఆరంభంలో వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి.
ఐకానిక్ మోటార్ సైకిల్ బ్రాండ్ జావా న్యూ జనరేషన్ అవతార్‌లో భారతీయ విఫణిలోప్రజాదరణ పొందిన తన జావా మోటార్ సైకిళ్లను తిరిగి ప్రారంభించింది. జావా, జావా 42, పెరాక్ పేర్లతో ఈ బైక్స్‌ను తీసుకొచ్చింది. 293సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో, బీఎస్6 నిబంధనలకు అనుగుణంగా వీటిని రూపొందించింది. వీటి (ఎక్స్ షోరూం ఢిల్లీ) ధరలు ఇలా ఉన్నాయి.
జావా ధర :1.55 లక్షల రూపాయలు
జావా 42 : 1.64లక్షల రూపాయలు
జావా పెరాక్ : 1.89లక్షల రూపాయలు
జావా బైక్ బ్లాక్, మరూన్, గ్రే కలర్స్‌లో లభ్యంకానుండగా, జావా 42 హాలీస్ టీల్, గెలాక్సీ గ్రీన్, స్టార్‌లైట్ బ్లూ, లుమస్ లైమ్, నెబ్యులా బ్లూ, కామెట్ రెడ్ అందుబాటులోకి రానుంది.
ఇంజీన్, ఇతర స్పెసిఫికేషన్స్
293 సిసీ సింగిల్ సిలిండర్, ఫ్యూయల్ ఇంజెక్షన్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్, 27హెచ్‌పీ, 28 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. 6స్పీడ్ ట్రాన్స్మిషన్, రౌండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, రౌండ్ హెడ్‌లాంప్స్, డ్యూయల్ టోన్ క్రోమ్ ఫినిష్ ఫ్యూయల్ ట్యాంక్, ట్విన్ ఎగ్జాస్ట్స్, ఫ్లాట్ జీడిల్. చైన్ కవర్, ఇతర ప్రధాన ఫీచర్లు. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్‌లను ఇవి గట్టి పోటీ ఇవ్వనున్నాయని మార్కెట్ వర్గాల అంచనా.
అయితే ఇవి వినిగాదారులకు ఇంకా అందుబాటులోకి రాలేదు. పిత్తంపూర్లో మహీంద్రా ప్లాంట్లో రూపుదిద్దుకున్న ఈ బైకుల విక్రయాల కోసం సుమారు 105 డీలర్లు రూ.2 కోట్లు డిపాజిట్ చేశారు. మొదటి దశలో, వచ్చే నెల ప్రారంభంలో ప్రధాన నగరాల్లో 64 డీలర్షిప్‌లను ప్రారంభించనున్నారు. టెస్ట్ డ్రైవ్, డెలివరీ ఫిబ్రవరి 2019 నాటికి ప్రారంభం.
Comments
Please login to add a commentAdd a comment