M & M
-
మహీంద్ర కొత్త ఎక్స్‌యూవీ300 లాంచ్
సాక్షి, ముంబై: మహీంద్ర అండ్ మహీంద్ర మరో సరికొత్త వాహనాన్ని లాంచ్ చేసింది. కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో ఎక్స్‌యూవీ 300 పేరుతో ఈ వెహికల్‌ను లాంచ్ చేసింది. పెట్రోల్, డీజిల్ రెండు ఇంజీన్ల ఆప్షన్లలో ఆవిష్కరించింది. రూ. 7.90 లక్షలు ప్రారంభధరగా నిర్ణయించగా, టాప్ వేరియంట్ ధరను రూ.11.99లక్షలుగా ఉంచింది. 1.5 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజీన్ వెహికల్ 115 బీహెచ్పీ వద్ద 3750ఆర్పీఎం తో 300 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. 1.2 లీటర్ త్రి సిలిండర్ టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజీన్ 110 బీహెచ్పీ వద్ద 200 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. 7 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, కార్ ప్లే, లాంటి ఫీచర్లను జోడించింది. అలాగే టాప్ ఎండ్ వేరియంట్లో7 ఎయిర్బాగ్స్, డ్యుయల్‌ఎల్‌ఈడీ డే టైం ల్యాంప్స్, ఆటోమేటిక్ రెయిన్ సెన్సింగ్ వైపర్స్, రియర్ పార్కింగ్ అస్టిస్ట్ కెమెరా, 17 అంగుళాల డైమండ్ అల్లాయ్ వీల్స్ లాంటి టాప్ ఎండ్ ఫీచర్లను అందిస్తోంది. కాగా మారుతి సుజుకి బ్రెజ్జా, ఫోర్డ్ ఇకో స్పోర్ట్, టాటా నెక్సాన్‌కు గట్టిపోటీ ఇవ్వనుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. -
జావా బైక్స్ బ్యాక్ : మూడు వేరియంట్లలో
సాక్షి, ముంబై: ప్రముఖ వాహన తయారీదారు మహీంద్ర అండ్ మహీంద్ర అనుబంధ సంస్థ క్లాసిక్ లెజెండ్స్ ప్రయివేటు లిమిటెడ్ ఖరీదైన బైక్‌లను లాంచ్ చేసింది. జావా బ్రాండ్‌లో మూడు మోటార్ బైక్‌లను గురువారం భారత మార్కెట్లో విడుదల చేసింది అయితే ఇవి వచ్చే ఏడాది ఆరంభంలో వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. ఐకానిక్ మోటార్ సైకిల్ బ్రాండ్ జావా న్యూ జనరేషన్ అవతార్‌లో భారతీయ విఫణిలోప్రజాదరణ పొందిన తన జావా మోటార్ సైకిళ్లను తిరిగి ప్రారంభించింది. జావా, జావా 42, పెరాక్ పేర్లతో ఈ బైక్స్‌ను తీసుకొచ్చింది. 293సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో, బీఎస్6 నిబంధనలకు అనుగుణంగా వీటిని రూపొందించింది. వీటి (ఎక్స్ షోరూం ఢిల్లీ) ధరలు ఇలా ఉన్నాయి. జావా ధర :1.55 లక్షల రూపాయలు జావా 42 : 1.64లక్షల రూపాయలు జావా పెరాక్ : 1.89లక్షల రూపాయలు జావా బైక్ బ్లాక్, మరూన్, గ్రే కలర్స్‌లో లభ్యంకానుండగా, జావా 42 హాలీస్ టీల్, గెలాక్సీ గ్రీన్, స్టార్‌లైట్ బ్లూ, లుమస్ లైమ్, నెబ్యులా బ్లూ, కామెట్ రెడ్ అందుబాటులోకి రానుంది. ఇంజీన్, ఇతర స్పెసిఫికేషన్స్ 293 సిసీ సింగిల్ సిలిండర్, ఫ్యూయల్ ఇంజెక్షన్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్, 27హెచ్‌పీ, 28 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. 6స్పీడ్ ట్రాన్స్మిషన్, రౌండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, రౌండ్ హెడ్‌లాంప్స్, డ్యూయల్ టోన్ క్రోమ్ ఫినిష్ ఫ్యూయల్ ట్యాంక్, ట్విన్ ఎగ్జాస్ట్స్, ఫ్లాట్ జీడిల్. చైన్ కవర్, ఇతర ప్రధాన ఫీచర్లు. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్‌లను ఇవి గట్టి పోటీ ఇవ్వనున్నాయని మార్కెట్ వర్గాల అంచనా. అయితే ఇవి వినిగాదారులకు ఇంకా అందుబాటులోకి రాలేదు. పిత్తంపూర్లో మహీంద్రా ప్లాంట్‌లో రూపుదిద్దుకున్న ఈ బైకుల విక్రయాల కోసం సుమారు 105 డీలర్లు రూ.2 కోట్లు డిపాజిట్ చేశారు. మొదటి దశలో, వచ్చే నెల ప్రారంభంలో ప్రధాన నగరాల్లో 64 డీలర్‌షిప్‌లను ప్రారంభించనున్నారు. టెస్ట్ డ్రైవ్, డెలివరీ ఫిబ్రవరి 2019 నాటికి ప్రారంభం. -
మహీంద్ర స్కార్పియో కొత్త వేరియంట్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీదారు మహీంద్ర అండ్ మహీంద్ర తన పాపులర్ మోడల్లో కొత్త వేరియట్‌ను తీసుకొచ్చింది. స్కార్పియో ఎస్‌యూవీలో ఎస్9 పేరుతో ఈ సరికొత్త వేరియంట్‌ను సోమవారం విడుదల చేసింది. అంతేకాదు కీలక ఫీచర్లతో స్కార్పియో ఎస్ 11 కంటే తక్కువ ధరకే దీన్ని వినియోగదారులకు అందిస్తోంది. మహీంద్ర స్కార్పియో ఎస్ 9 ఎస్యూవీ ధరను రూ. 13.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించింది. దేశవ్యాప్తంగా తమ డీలర్ల దగ్గర ఈ వాహనం తక్షణమే అందుబాటులో ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 2.2-లీటర్ టర్బోడీజిల్ ఇంజీన్ కెపాసిటీ, 140 హెచ్‌పీ వద్ద 320 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, డ్యుయల్ ఎయిర్ బ్యాగ్స్, 5.9 ఇంచెస్ టచ్‌స్ర్కీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. అలాగే స్టీరింగ్ వీల్‌పై ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్స్తోపాటు, ఆడియో, క్రూయిస్ కంట్రోల్ బటన్లను అమర్చింది. ఇక మార్కెట్లో పోటీ విషయానికి వస్తే.. టాటా హెక్సాతో గట్టి పోటీ ఇవ్వనుందని అంచనా. -
ధరలను పెంచేసిన ఎం అండ్ ఎం
సాక్షి, ముంబై: యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) వాహనదారులకు చేదువార్త అందించింది. ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచే యోచనలో ఉన్నట్లు సోమవారం ప్రకటించింది. కమొడిటీ ధరలు పెరగిన నేపథ్యంలో కొన్ని మోడళ్ల వాహనాల ధరలను పెంచాలని భావిస్తున్నామని ఎం అండ్ ఎం ప్రెసిడెంట్ రాజన్ వధేరా ప్రకటించారు. ప్యాసింజర్ వాహనాల ధరలను 30వేల రూపాయలు లేదా 2 శాతం పెంచాలని కంపెనీ భావిస్తున్నామన్నారు. ఆగస్టు నుంచి ఈ సవరించిన ధరలు అమల్లోకి వస్తాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. దేశీయ మార్కెట్లో ఎక్స్‌యూవీ 500, స్కార్పియో, టీయూవీ 300, కేయూవీ100 తదితర మోడళ్ల ప్యాసింజర్ వాహనాల శ్రేణిని ఎం అండ్ ఎం విక్రయిస్తుంది. కాగా టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచుతున్నట్టు ఇటీవల ప్రకటించింది. 2.2 శాతం పెరిగిన ధరలు ఆగస్టు నుంచి అమల్లోకి రానున్నాయి. -
ఎం అండ్ ఎం సరికొత్త రికార్డు
సాక్షి,ముంబై: దేశీయ ఆటో రంగ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా సరికొత్త రికార్డును సాధించింది. మంగళవారం నాటి లాభాలతో రూ.1 లక్ష కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ క్లబ్లో చేరింది. వాతావరణ శాఖ అందించిన సాధారణ వర్షపాత అంచనాలు ( 97 శాతం వర్షపాతం) ఎం అండ్ ఎండ్ షేర్‌కు పాజిటివ్ సంకేతాలను అందించాయి. దీంతో ఈ ఏడాది సాధారణ వర్షపాత అంచాలు వెలువడిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు సెంటిమెంట్ బలపడింది. ట్రాక్టర్ల దిగ్గజం ఎం అండ్ ఎం కౌంటర్లో కొనుగోళ్లు చేపట్టారు. ఫలితంగా కంపెనీ మార్కెట్ విలువ(కేపిటలైజేషన్) రూ. 1.01 లక్షల కోట్లకు చేరింది. వెరసి రూ. లక్ష కోట్ల మార్కెట్ విలువను చేరుకోవడం విశేషం. మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎం క్యాప్) నిన్నటి రూ .99,605 కోట్ల నుంచి ,225.32 కోట్ల రూపాయల మేర పెరిగి రూ .1,01,829.91 కోట్లకు చేరింది. తద్వారా ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రీత్యా కంపెనీ తాజాగా 30వ ర్యాంకును అందుకుంది. ప్రస్తుతం బీఎస్ఈలో ఈ షేరు 1.5 శాతం పెరిగి రూ. 812 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 819 వద్ద సరికొత్త గరిష్టాన్ని తాకింది. తద్వారా దేశీ ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్‌కు సైతం చేరువైంది. ప్రస్తుతం టాటా మోటార్స్ మార్కెట్ క్యాప్ డీవీఆర్లతో కలిపి రూ. 1.08 లక్షల కోట్ల వద్ద ఉంది. మార్చిలో వాహన విక్రయాలు 10 శాతం పుంజుకున్న నేపథ్యంలో ఎంఅండ్ఎం షేరు ఈ నెలలో 9 శాతం లాభపడింది. -
జనవరి నుంచి ఎంఅండ్ఎం వాహనాలు ప్రియం
న్యూఢిల్లీ: జవవరి నుంచి తమ వాహనాల ధరలను పెంచుతున్నట్టు ఎంఅండ్ఎం ప్రకటించింది. పెరి గిన ముడి సరుకుల వ్యయంలో కొంత మేర ధరల పెంపు రూపంలో సర్దుబాటు చేసుకోనున్నట్టు తెలిపింది. ప్యాసింజర్, వాణిజ్య వాహనాలను 0.5 శాతం నుంచి 1.1 శాతం శ్రేణిలో వచ్చే నెల నుంచి పెంచాలనే ఆలోచనతో ఉన్నాం. ప్యాసింజర్ వాహనాల ధరలు మోడల్‌ను బట్టి రూ.3,000 నుంచి రూ.26,000 వరకు పెరగనున్నాయి. చిన్న పాటి వాణిజ్య వాహనాల ధరలు సైతం రూ.1,500 నుంచి రూ.6,000 వరకు పెరుగుతాయి’’ అని ఎంఅండ్ఎం ఆటో విభాగం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రవీణ్షా తెలిపారు. -
ఆర్బీఐ పాలసీపైనే దృష్టి
రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) చేపట్టనున్న పరపతి విధాన సమీక్ష, ఏప్రిల్-జూన్(క్యూ1) కాలానికి వెల్లడికానున్న బ్లూచిప్ కంపెనీల ఫలితాలు సమీప కాలానికి మార్కెట్ల ట్రెండ్‌ను నిర్దేశించనున్నాయని స్టాక్ విశ్లేషకులు పేర్కొన్నారు. ఆర్బీఐ మంగళవారం(5న) పాలసీ సమీక్షను నిర్వహించనుంది. మరోవైపు ఈ వారం బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐతోపాటు, ఆటో దిగ్గజాలు ఎంఅండ్ఎం, హీరోమోటో ఫలితాలను ప్రకటించనున్నాయి. ఇవికాకుండా అంతర్జాతీయ సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) పెట్టుబడులు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు వంటి అంశాలు సైతం సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తాయని నిపుణులు వివరించారు. ఇక రుతుపవనాల పురోగతి, చమురు ధరలు కూడా కీలకంగా నిలుస్తాయని తెలిపారు. మార్పులుండవు... మార్కెట్ వర్గాలలో అత్యధిక శాతం మంది ఆర్బీఐ విధాన సమీక్షలో పెద్దగా మార్పులుండకపోవచ్చునని అంచనా వేస్తున్నారు. రెపో వంటి కీలక రేట్లను యథాతథంగా కొనసాగించేందుకే అవకాశముందని అభిప్రాయపడ్డారు. అలాకాకుండా అనూహ్య నిర్ణయాలుంటే వీటికి అనుగుణంగా మార్కెట్లు స్పందిస్తాయని తెలిపారు. గడిచిన వారం మార్కెట్ల ప్రామాణిక సూచీ సెన్సెక్స్ 646 పాయింట్లు పతనమై 25,481 పాయింట్ల వద్ద నిలవగా, 188 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 7,603 వద్ద స్థిరపడింది. ర ష్యా, పశ్చిమ దేశాలమధ్య కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితి, శిఖరాల నుంచి వెనక్కి జారుతున్న అమెరికా మార్కెట్లు, బలహీనపడుతున్న రూపాయి వంటి అంశాల నేపథ్యంలో దేశీ మార్కెట్లో కరెక్షన్ కొనసాగే అవకాశముందని సియాన్స్అనలిటిక్స్ సీఈవో అమన్ చౌదురి చెప్పారు. ఫలితాల జాబితాలో... ఈ వారం క్యూ1 ఫలితాలు ప్రకటించనున్న ప్రధాన కంపెనీలలో జిందాల్ స్టీల్, పవర్‌గ్రిడ్, ఎన్‌హెచ్‌పీసీ తదితరాలున్నాయి.వీటితోపాటు, ఆర్బీఐ పాలసీ ప్రకటన, హెచ్ఎస్బీసీ తయారీ రంగ గణాంకాలు వంటివి కీలకంగా నిలవనున్నాయని రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ పంపిణీ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ పేర్కొన్నారు. రెండు వారాలుగా ఆందోళనలు రేపుతున్న గాజా సంక్షోభం, రష్యా-ఉక్రెయిన్ల మధ్య అనిశ్చితి ఇతరత్రా విదేశీ అంశాలనూ ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలిస్తారని బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ రాకేష్ గోయల్ చెప్పారు. జూలైలో రూ. 32,000 కోట్ల విదేశీ నిధులు కేంద్రంలో పెట్టుబడులకు అనుకూలమైన ప్రభుత్వం ఏర్పాటవడంతో దేశీ మార్కెట్లపై విదేశీ న్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) ఆసక్తి మరింత పెరిగింది. జూలైలో స్టాక్స్, డెట్ సెక్యూరిటీల్లో 6 బిలియన్ డాలర్లు(రూ.32,000 కోట్లు) ఇన్వెస్ట్ చేశారు. దీంతో 2014 జనవరి నుంచి జూలై వరకూ ఎఫ్ఐఐల మొత్తం పెట్టుబడులు 26.4 బిలియన్ డాలర్లను(రూ.1.59 లక్షల కోట్లు) తాకాయి.