![జనవరి నుంచి ఎంఅండ్‌ఎం వాహనాలు ప్రియం](/styles/webp/s3/article_images/2017/09/4/71482696279_625x300.jpg.webp?itok=PpAlQ4yw)
జనవరి నుంచి ఎంఅండ్‌ఎం వాహనాలు ప్రియం
న్యూఢిల్లీ: జవవరి నుంచి తమ వాహనాల ధరలను పెంచుతున్నట్టు ఎంఅండ్‌ఎం ప్రకటించింది. పెరి గిన ముడి సరుకుల వ్యయంలో కొంత మేర ధరల పెంపు రూపంలో సర్దుబాటు చేసుకోనున్నట్టు తెలిపింది. ప్యాసింజర్, వాణిజ్య వాహనాలను 0.5 శాతం నుంచి 1.1 శాతం శ్రేణిలో వచ్చే నెల నుంచి పెంచాలనే ఆలోచనతో ఉన్నాం.
ప్యాసింజర్ వాహనాల ధరలు మోడల్‌ను బట్టి రూ.3,000 నుంచి రూ.26,000 వరకు పెరగనున్నాయి. చిన్న పాటి వాణిజ్య వాహనాల ధరలు సైతం రూ.1,500 నుంచి రూ.6,000 వరకు పెరుగుతాయి’’ అని ఎంఅండ్‌ఎం ఆటో విభాగం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రవీణ్‌షా తెలిపారు.