Pravin Shah
-
జనవరి నుంచి ఎంఅండ్ఎం వాహనాలు ప్రియం
న్యూఢిల్లీ: జవవరి నుంచి తమ వాహనాల ధరలను పెంచుతున్నట్టు ఎంఅండ్ఎం ప్రకటించింది. పెరి గిన ముడి సరుకుల వ్యయంలో కొంత మేర ధరల పెంపు రూపంలో సర్దుబాటు చేసుకోనున్నట్టు తెలిపింది. ప్యాసింజర్, వాణిజ్య వాహనాలను 0.5 శాతం నుంచి 1.1 శాతం శ్రేణిలో వచ్చే నెల నుంచి పెంచాలనే ఆలోచనతో ఉన్నాం. ప్యాసింజర్ వాహనాల ధరలు మోడల్‌ను బట్టి రూ.3,000 నుంచి రూ.26,000 వరకు పెరగనున్నాయి. చిన్న పాటి వాణిజ్య వాహనాల ధరలు సైతం రూ.1,500 నుంచి రూ.6,000 వరకు పెరుగుతాయి’’ అని ఎంఅండ్ఎం ఆటో విభాగం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రవీణ్షా తెలిపారు. -
మహీంద్రా, టాటా మోటార్స్ వాహనాల ధరలు పెరిగాయ్
న్యూఢిల్లీ: టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలు వాహనాల ధరలను 1-2% వరకూ పెంచాయి. ఉత్పత్తి వ్యయాలు పెరుగుతున్నందున ధరలు పెంచక తప్పడం లేదని ఆ కంపెనీలు వెల్లడించాయి. వాణిజ్య వాహనాల ధరలను గత నెల నుంచే పెంచామని టాటా మోటార్స్ పేర్కొంది. ప్రయాణికుల వాహనాల ధరలను పెంచే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదని వివరించింది. ఇక మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ప్రయాణికుల, వాణిజ్య వాహనాల ధరలను 1% వరకూ పెంచింది. ఈ పెరుగుదల ఈ నెల నుంచే వర్తిస్తుందని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్(ఆటోమోటివ్ డివిజన్, ఇంటర్నేషనల్ ఆపరేషన్స్) ప్రవీణ్ షా పేర్కొన్నారు. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలను పాక్షికంగా తట్టుకోవడానికి ధరలను రూ.2,300 నుంచి రూ.11,500 వరకూ పెంచామని వివరించారు. ట్రాక్టర్ల ధరలను రూ.6,000 నుంచి రూ.10,000 వరకూ పెంచామని తెలిపారు. మహీంద్రా కంపెనీ స్కార్పియో, బొలెరో, ఎక్స్‌యూవీ500, ఆల్ఫా, వంటి మోడళ్లను, అర్జున్, యువరాజ్ వంటి ట్రాక్టర్లను విక్రయిస్తోంది. -
ధరల పెంపుబాటలో కార్ల కంపెనీలు..!
న్యూఢిల్లీ: టాటా మోటార్స్, హోండా కార్స్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలు కార్ల ధరలను వచ్చే నెల నుంచి పెంచాలని యోచిస్తున్నాయి. ఉత్పత్తి, నిర్వహణ వ్యయాలు పెరుగుపోతున్న కారణంగా ఈ కంపెనీలు ధరలను పెంచాలనుకుంటున్నాయని సమాచారం. వచ్చే నెల నుంచి ధరలు పెంచే విషయమై తీవ్రంగానే కసరత్తు చేస్తున్నామని మహీంద్రా అండ్ మహీంద్రా చీఫ్ ఎగ్జిక్యూటివ్(ఆటోమోటివ్ డివిజన్) ప్రవీణ్ షా పేర్కొన్నారు. అయితే ఎంత వరకూ పెంచాలనేది ఇంకా నిర్ణయించలేదని వివరించారు. ధరల పెంపు విషయమై చర్చలు జరుగుతున్నాయని, పెంచే అవకాశాలున్నాయని హోండా కార్స్ ఇండియా ప్రతినిధి పేర్కొన్నారు. ఇక టాటా మోటార్స్ ప్రయాణికుల వాహనాల ధరలను 1-2 శాతం పెంచనున్నది. హోండా కార్స్ కంపెనీ కార్ల ధరలు రూ. 3.99 లక్షల నుంచి రూ.24.36 లక్షలు, మహీంద్రా ప్రయాణికుల వాహనాల ధరలు రూ.5.43 లక్షల నుంచి రూ.14.48 లక్షల రేంజ్లో ఉన్నాయి. కాగా గత నెలలో మహీంద్రా కంపెనీ ప్రయాణికుల వాహనాల ధరలను రూ.13,000 నుంచి రూ.49,000 రేంజ్లో హోండా కార్స్ కంపెనీ రూ.44,741 వరకూ తగ్గించాయి. ఎక్సైజ్ సుంకాన్ని ప్రభుత్వం తగ్గించడంతో ఈ కంపెనీలే కాకుండా పలు కంపెనీలు వాహనాల ధరలను తగ్గించాయి. -
మహీంద్రా వాహన ధరల పెంపు
న్యూఢిల్లీ: మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ కూడా వాహనాల ధరలను పెంచుతోంది. ప్రయాణికుల, వాణిజ్య వాహనాల ధరలను వచ్చే నెల 1 నుంచి 2% వరకూ పెంచుతోంది. అధిక ఉత్పత్తి వ్యయాలు తట్టుకోవడానికి ధరలను పెంచక తప్పడం లేదని మహీంద్రా ఆటోమోటివ్ డివిజన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రవీణ్ షా గురువారం చెప్పారు. ఇప్పటికే మారుతీ సుజుకి, హ్యుందాయ్, టాటా మోటార్స్, హోండా కార్స్ ఇండియా, రేనాల్ట్ వంటి కంపెనీలే కాకుండా మెర్సిడెస్ బెంజ్, ఆడి, బీఎండబ్ల్యూ వంటి లగ్జరీ కంపెనీలు కూడా ధరలను పెంచుతున్నట్లు ప్రకటించడం తెలిసిందే. ఫోక్స్‌వ్యాగన్ పెంపు 2.5 శాతం: జర్మనీ కార్ల కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ కూడా ధరలను పెంచుతోంది. వచ్చే నెల 1 నుంచి ధరలను 2.5% వరకూ పెంచుతున్నామని ఫోక్స్‌వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఎండీ అర్వింద్ సక్సేనా గురువారం తెలిపారు. గత కొన్నేళ్లుగా ఉత్పత్తి వ్యయాలు పెరుగుతూనే ఉన్నాయని, అత్యున్నత ప్రమాణాలున్న వాహనాలను అందించాలంటే ధరలను స్వల్పంగా పెంచక తప్పడం లేదని పేర్కొన్నారు. ఈ కంపెనీ భారత్‌లో పోలో, వెంటో, జెటా, పసంట్, టౌరేగ్, ఫేటాన్ మోడళ్ల కార్లను విక్రయిస్తోంది.