
న్యూఢిల్లీ: వాహన స్క్రాపేజీ (తుక్కు) పాలసీతో ఆటో విడిభాగాల ధరలు 30 శాతం మేర తగ్గే అవకాశం ఉందని కేంద్ర రహదారి రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. దీనితో వాహనాల రేట్లు సైతం తగ్గి, అంతిమంగా వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు.
నగరాల్లో, హైవేలపై చార్జింగ్ మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ మరింత పెరుగుతుందని గడ్కరీ వివరించారు.
దేశీయంగా లిథియం అయాన్ బ్యాటరీల రేట్లు కూడా తగ్గుతున్నాయని ఆయన చెప్పారు. అదానీ గ్రూప్, టాటా గ్రూప్ వంటి దిగ్గజాలు భారీ స్థాయిలో ఈ బ్యాటరీలను తయారు చేయబోతున్నాయన్నారు. జమ్మూ కశీ్మర్‌లో కనుగొన్న లిథియం నిల్వలతో కోట్ల కొద్దీ బ్యాటరీలను తయారు చేయొచ్చని మంత్రి చెప్పారు.
ఇదీ చదవండి: వారానికి 70 గంటల పని: మొదటిసారి స్పందించిన సుధామూర్తి